న్యూఢిల్లీ: కరోనాతో కుదేలైన భారత ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.20 లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్యాకేజీలో ఏ రంగానికి ఎలాంటి కేటాయింపులు దక్కాయో తెలుసుకునేందుకు దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ప్యాకేజీ పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.
ప్యాకేజీలో ఇప్పటికే ఉన్న కొన్ని భూమి, కార్మిక చట్టాలలో సంస్కరణలు ఉంటాయని భావిస్తున్నారు. అంతేకాకుండా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను జంప్‌స్టార్ట్ చేయడానికి అవసరమైన అదనపు లిక్విడిటీ మద్దతు ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు.
(చదవండి: రెండు నెలల తర్వాత బయటకు)
Comments
Please login to add a commentAdd a comment