
న్యూఢిల్లీ: కోవిడ్-19 సంక్షోభంతో పీకల్లోతు కష్టాల్లో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు ప్రధాని నరేంద్రమోదీ రూ.20లక్షల కోట్ల భారీ ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్యాకేజీపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ట్విటర్ వేదికగా తనదైన శైలిలో స్పందించారు.
మేక్ ఇన్ ఇండియా లోగోకు మరమ్మత్తులు చేస్తున్నట్లు ఉండే ఓ ఫోటోని షేర్ చేస్తూ.. 'అదే పాత సింహాలను మరీ ఇప్పుడు కొత్త పేరుతో విక్రయిస్తున్నారు. వారు కలల్ని, కోరికల్ని మళ్లీ అమ్మారు. నాటి మేక్ ఇన్ ఇండియానే నేడు ఆత్మనిర్భర్ భారత్‌గా మారింది. అందులో ఏదైనా కొత్తగా ఉందా..?' అంటూ శశిథరూర్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. చదవండి: 20 ఏళ్లలో 5 వైరస్‌లు అక్కడినుంచే..!
Comments
Please login to add a commentAdd a comment