చెన్నై: కరోనా కల్లోల సమయంలో కుదేలైన భారతదేశ ఆర్థికవ్యవస్థకు ఊతమివ్వడానికి ప్రధాని నరేంద్ర మోదీ ‘ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’ పేరిట రూ.20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీని ప్రకటించారు. మంగళవారం జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని లాక్‌డౌన్ పొడగింపు, ఆర్థిక వ్యవస్థ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా కరోనా కట్టడికి లాక్‌డౌన్ పొడగింపు తద్యమని, అయితే మునపటిలా కాకుండా పలు కొత్త నిబంధనలతో లాక్‌డౌన్ ఉంటుందని తెలిపారు. ఇక ప్రధాని ప్రకటించిన భారీ ఉద్దీపన ప్యాకేజీపై అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ ప్రధాని భారీ ప్యాకేజీపై స్పందించారు.
‘ప్రధాని పేర్కొన్న అంశాలతో ఏకీభవిస్తున్నాను. ప్రస్తుత కరోనా సంక్షభంలో పేదవాడే అత్యధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, స్వాలంబనే శరణ్యమని, స్వయం సమృద్ద భారత్ ఆవశ్యకమని పేర్కోన్న ప్రధాని వ్యాఖ్యలతో మేము అంగీకరిస్తున్నాం. ప్రధాని ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీని స్వాగతిస్తున్నాం. అయితే ఈ ప్యాకేజీపై కేంద్ర ఆర్థిక మంత్రి మరిన్న వివరాలు తెలుపుతారని పేర్కొనాన్నరు. అన్నీ బాగానే ఉన్నా అంతిమంగా దేశంలోని నిరుపేదలు ఏ మేరకు లబ్ధిపొందుతారో వేచి చూడాలి’ అంటూ కమల్ ట్వీట్ చేశారు.
చదవండి:
లాక్‌డౌన్ 4.0: భారీ ఆర్థిక ప్యాకేజీ
దశల వారీగా లాక్‌డౌన్ ముగింపుపై బ్లూప్రింట్
We all agree on 2 things with you Mr. Prime Minister. @PMOIndia .The poor are suffering the most in this crisis and being self reliant is the future.While we welcome the economic package, I will watch out for the details to see how the poorest of my country get their due atlast.
— Kamal Haasan (@ikamalhaasan) May 12, 2020
Comments
Please login to add a commentAdd a comment