
నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: కోవిడ్–19 పరిణామాల నేపథ్యంలో కార్మికులతో సంబంధాలను పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉందని పరిశ్రమకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ విజ్ఞప్తి చేశారు. అలాగే నైపుణ్యతలేని కార్మికుల పట్ల ఎలా అనుసరించాలన్న అంశానికి సంబంధించి ఒక నిర్దిష్ట మార్గాన్ని పరిశీలించాలనీ ఆమె సూచించారు. ఆయా అంశాలకు సంబంధించి అనుసరించే విధానాలు అందరికీ ఆమోదనీయం కావాల్సిన అవసరం ఉందనీ పేర్కొన్నారు.
భారత పారిశ్రామిక సమాఖ్య (సీఐఐ) 125 వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆమె ఆ సంస్థ సభ్యులతో మాట్లాడారు. ఈ మేరకు సీఐఐ ఒక ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం... పరిశ్రమలపట్ల ప్రభుత్వానికి పూర్తిస్థాయి విశ్వాసం ఉందని సీతారామన్ పేర్కొన్నారు. కోవిడ్–19కు ముందుసైతం గ్రామీణ ప్రాంతాల్లోని సంస్థలకు చేయూతను అందించడానికి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుందని అన్నారు. రుణ లభ్యతకు ఎటువంటి అవరోధాలు లేకుండా నిర్ణయాలు తీసుకుందన్నారు. వ్యవసాయం, మౌలిక రంగం వృద్ధికి కేంద్రం తగిన అన్ని చర్యలూ తీసుకుంటుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment