Rural economy
-
‘సహకారం’ మరింత బలోపేతం
సాక్షి, అమరావతి: ‘మనది వ్యవసాయ ఆధారిత రాష్ట్రం.. మన రాష్ట్రంలో గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ బలంగా ఉండాలంటే రైతులు, మహిళల ఆర్థికంగా బలంగా ఉండాలి. వ్యవసాయ కార్యకలాపాలకు, స్వయం ఉపాధి కార్యక్రమాలకు తక్కువ వడ్డీకే రుణాలు అందించడం ద్వారా వారిని చేయిపట్టుకుని నడిపించగలుగుతాం. ఈ లక్ష్యసాధనలో ఆప్కాబ్, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు (డీసీసీబీలు), ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు (పీఏసీఎస్–ప్యాక్స్), రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు) భాగస్వామ్యం కావాలి. వీటి నెట్‌వర్క్‌ను విస్తృతం చేయాల్సిన అవసరం ఉంది’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో సహకార రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎం ఏమన్నారంటే.. ఆర్బీకేల రూపంలో ప్రతీ గ్రామంలో ఓ బ్రాంచ్ ప్రతి పీఏసీఎస్ పరిధిలో 3 నుంచి 4 ఆర్బీకేలను తీసుకువచ్చాం. ప్రతీ ఆర్బీకేలోనూ ఓ బ్యాంకింగ్ కరస్పాండెంట్‌ను నియమించాం. వీరు గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో భాగం కావాలి. పీఏసీఎస్‌లు, ఆర్బీకేలు ఒకదానితో ఒకటి అనుసంధానం చేశాం. పీఏసీఎస్‌లు ఇప్పటికే ఆర్బీకేల ద్వారా రుణాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నాయి. క్రెడిట్, నాన్ క్రెడిట్ సేవలను గ్రామ స్థాయిలో పీఏసీఎస్‌లు ఆర్బీకేల ద్వారా అందిస్తున్నాయి. ఇలా పీఏసీఎస్‌ల మాదిరిగానే ఆర్బీకేల రూపంలో ప్రతి గ్రామంలో ఆప్కాబ్‌కు, డీసీసీబీలకు ప్రత్యేకంగా శాఖలు ఉన్నట్టుగానే పరిగణించాలి. దేశంలో మరే ఇతర బ్యాంకుకు లేని అవకాశం రాష్ట్రంలోని సహకార బ్యాంకులకు ఉంది. రైతులకు రుణాల విషయంలో ఆర్బీకేలకు ఒక ప్రాంతీయ కార్యాలయాల మాదిరిగా పీఏసీఎస్‌లు వ్యవహరించాలి. ఆర్బీకేల ద్వారా ఆర్ధిక కార్యకలాపాలను పూర్తి స్థాయిలో విస్తరించాలంటే గ్రామ స్థాయి వరకు ఉన్న ఈ నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. సహకారరంగంపై సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డీసీఎంఎస్‌లపై అధ్యయనం చేయాలి జిల్లా కేంద్ర మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్)ల పనితీరుపై పూర్తిస్థాయి అధ్యయనం చేయాలి. గ్రామ స్థాయిలో ఆర్బీకేలు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం స్థానికంగా ఉన్న అవసరాలకు అనుగుణంగా డీసీఎంఎస్ కార్యకలాపాలను మరింత విస్తరించాల్సిన అవసరం ఉంది. వాటి సేవలను మరింత విస్తృతం చేసే దిశగా, రైతులతో పాటు సంబంధిత వర్గాల వారికి మరింత ప్రయోజనం చేకూర్చేలా తీసుకోవాల్సిన చర్యలపై ఈ అధ్యయనం జరగాలి. వ్యవసాయ ఉత్పత్తులు వాటి ధరలపై ఎప్పటికప్పుడు సీఎం యాప్ ద్వారా వివరాలు వస్తున్నాయి. ఎక్కడైనా కనీస మద్దతు ధర లభించకపోయినా, ధరలు నిరాశాజనకంగా ఉన్నా సీఎం యాప్ ద్వారా వివరాలు తెలియగానే ప్రభుత్వం మార్కెట్లో జోక్యం చేసుకొని చర్యలు తీసుకుంటోంది. ఈ ప్రక్రియలో డీసీఎంఎస్‌లకు సముచిత పాత్ర కల్పించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా తగిన చర్యలు తీసుకోవాలి. దీంతో పాటు ప్రైమరీ, సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ వ్యవస్థలను కూడా డీసీఎంఎస్‌ల ద్వారా ఇంటిగ్రేట్ చేయాలి. ఇందుకోసం çసమగ్ర అధ్యయనం చేసి తగిన సిఫార్సులతో కూడిన నివేదిక సిద్ధం చేయాలి. స్వయం ఉపాధి కల్పించాలి గ్రామస్థాయిలో తక్కువ వడ్డీకే రుణాలివ్వడం వల్ల గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ మరింత బలోపేతమవుతుంది. వైఎస్సార్ చేయూత ద్వారా మహిళల స్వయం ఉపాధికి ఆప్కాబ్ చర్యలు తీసుకోవాలి. గుర్తించిన లబ్దిదారు చేతిలో వరుసగా నాలుగేళ్ల పాటు ఏటా రూ.18,750 చొప్పున ప్రభుత్వం డబ్బులు పెడుతుంది. వీటితో వారిని స్వయం ఉపాధి దిశగా నడిపించేలా చర్యలు తీసుకోవాలి. కమర్షియల్ బ్యాంకుల కన్నా తక్కువ వడ్డీలకే రుణాలివ్వాలి. బంగారంపై ఇచ్చే రుణాలపై కూడా తక్కువ వడ్డీ ఉండాలి. పీఏసీఎస్‌ల ద్వారా రుణాల మంజూరు ప్రక్రియ సరళతరంగా, సమర్థంగా ఉండేలా చూడాలి. వీటి కోసం ప్రత్యేకంగా ఎస్ఓపీలు తయారుచేయాలి. లాభాల బాట పట్టించేలా చూడాలి.. గతంలో చూడని పురోగతి ఈ నాలుగేళ్లలో ఆప్కాబ్‌లో కనిపిస్తోంది. ఆప్కాబ్ మన బ్యాంకు, మనందరి బ్యాంక్ అన్న భావనతో తీర్చిదిద్దాలి. మరింత ముందుకు తీసుకువెళ్లాలి. ఆప్కాబ్ మాదిరిగానే డీసీసీబీలు, పీఏసీఎస్‌లను కూడా నూటికి నూరు శాతం లాభాల బాట పట్టించేలా చర్యలు తీసుకోవాలి. నష్టాలు ఎందుకు వస్తున్నాయన్న దానిపై పూర్తి స్థాయిలో పరిశీలన చేయాలి. లాభాల బాట పట్టించడానికి తగిన చర్యలు తీసుకోవాలి. వెబ్ ల్యాండ్, రెవెన్యూ రికార్డులను పూర్తిగా అప్డేట్ చేయాలి. ఆ వివరాలు పీఏసీఎస్‌ల వద్ద అందుబాటులో ఉంచాలి. దీనివల్ల రికార్డుల స్వచ్చ్చికరణ జరుగుతుంది. తద్వారా పారదర్శకత పెరుగుతుంది. 84.32 శాతం పెరిగిన కార్యకలాపాలు: అధికారులు ప్రభుత్వ ప్రోత్సాహం, సంస్కరణల ఫలితంగా సహకార రంగంలో ఆర్థిక కార్యకలాపాలు ఈ నాలుగేళ్లలో అనూహ్యంగా పెరిగాయని అధికారులు సీఎం వైఎస్ జగన్‌కు వివరించారు. 2019తో పోలిస్తే 2023 నాటికి 84.32 శాతం పెరిగాయన్నారు. 2019 వరకూ పీఏసీఎస్‌లో ఆర్థిక కార్యకలాపాలు రూ. 11,884.97 కోట్లు కాగా, 2023 నాటికి ఈ మొత్తం రూ. 21,906 కోట్లకు చేరిందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 400 పీఏసీఎస్‌లు నష్టాల నుంచి లాభాల బాట పట్టాయని సీఎంకు చెప్పారు. ఆప్కాబ్‌లో 2019 మార్చి నాటికి రూ. 13,322.55 కోట్ల టర్నోవర్ ఉండగా, అది 2023 మార్చి నాటికి రూ. 36,732.43 కోట్లకు చేరిందన్నారు. నాలుగేళ్లలో 175 శాతం గ్రోత్ రేటు నమోదైందన్నారు. సమీక్షలో రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి, సహకార శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, ఆర్ధిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, పౌరసరఫరాల సంస్థ ఎండీ జీ.వీరపాండియన్, సహకార శాఖ కమిషనర్ అహ్మద్‌బాబు, వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్, ఆప్కాబ్ ఎండీ ఆర్ఎస్ రెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వృత్తి నైపుణ్యం పెంచాలి మనది వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కావడం వలన సహకార రంగంలోని ప్రతి వ్యవస్థను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రంగంలో పూర్తి స్థాయిలో వృత్తి నైపుణ్యం తీసుకురాగలిగితే ఆ మేరకు నాణ్యమైన, పారదర్శకమైన సేవలు అందుతాయి. డీసీసీబీల్లో ఇప్పటికే ప్రొఫెషనలిజం తీసుకొచ్చాం. అదే రీతిలో పీఏసీఎస్‌లు, డీసీఎంఎస్‌లలో కూడా ప్రొఫెషనలిజాన్ని పెంచాలి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థల్లో పీఏసీఎస్‌లు కీలక పాత్ర పోషించాలి. పీఏసీఎస్‌లు, ఆర్బీకేల నెట్వర్క్ ద్వారా గ్రామ స్థాయిలో నాణ్యమైన సేవలు అందుతాయి. పీఏసీఎస్‌ల ద్వారా రైతులకు అందించే ఎరువులు, మిగిలిన వాటిలో నాణ్యత చాలాముఖ్యం. ఎట్టిపరిస్థితుల్లోనూ కల్తీలకు ఆస్కారం లేకుండా చూడాలి. పీఏసీఎస్‌ల కింద నడిచే పెట్రోలు బంకుల్లో ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్ యూనిట్లు కూడా ఏర్పాటు చేయాలి. నవంబర్ నాటికి పీఏసీఎస్‌లలో పూర్తి స్థాయి కంప్యూటరీకరణ అందుబాటులోకి తీసుకురావాలి. ఆప్కాబ్, సహకార బ్యాంకులు, పీఏసీఎస్‌లలో క్రమం తప్పకుండా ఆడిట్ జరిగేలా చూడాలి. -
ఆకాంక్షలు నెరవేరేనా
వచ్చే సార్వత్రిక ఎన్నికల ముందు వస్తున్న చివరి పూర్తి స్థాయి కేంద్ర బడ్జెట్ ఇదే. ఎంత కాదన్నా బడ్జెట్ నిర్ణయాలు, కేటాయింపుల ప్రభావం కొన్ని వర్గాలపై కచ్చితంగా ఉంటుంది. ఇప్పటికే కేంద్రంలో మోదీ ఆధ్వర్యంలోని ఎన్డీయే సర్కారు 9 ఏళ్లుగా పాలిస్తోంది. మరోసారి ప్రజామోదం కోసం బడ్జెట్‌ను ఒక అవకాశంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భావిస్తారా..? లేక మొదటి నుంచి సంస్కరణల హితమేనన్న తమ విధానానికి కట్టుబడి ఉంటారా? అన్నది ఫిబ్రవరి 1న తేటతెల్లం అవుతుంది. కానీ, సామాన్య, మధ్యతరగతి ప్రజలు పెరిగిపోయిన ధరల భారాన్ని ఎదుర్కొంటున్నారు. మరోవైపు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంలో ఉపాధి కల్పనపైనా ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. పన్నుల భారాన్ని తగ్గించాలన్న మధ్యతరగతి వాసుల వినతులు, వివిధ రంగాల ఆకాంక్షలకు ఈ బడ్జెట్ ఏ మేరకు న్యాయం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. కరోనా తర్వాత గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పూర్తి స్థాయిలో ఇంకా కోలుకోలేదు. డిమాండ్ పరిస్థితులు దీన్నే తెలియజేస్తున్నాయి. మరి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఉత్ప్రేరణకు ఆర్థిక మంత్రి ఏం చేస్తారో చూడాలి. నిర్మలమ్మకు ఇది ఐదో బడ్జెట్ కానుంది. మధ్యతరగతికి ‘ఐటీ’ తాయిలం..? రూ.2.5 లక్షల వరకు ఆదాయం కలిగిన వారికి ఎలాంటి ఆదాయపన్ను లేదు. 2014–2015 సంవత్సరానికి ఆదాయపన్ను బడ్జెట్ ప్రవేశపెట్టిన నాటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రూ.2 లక్షలుగా ఉన్న పరిమితిని రూ.2.5 లక్షలు చేశారు. 60 ఏళ్లు నిండిన వృద్ధులకు ఇది రూ.3 లక్షలుగా, రూ.80 ఏళ్లు నిండిన వారికి రూ.5 లక్షలకు పెంచారు. తొమ్మిదేళ్లుగా ఇదే బేసిక్ పరిమితి కొనసాగుతోంది. రూ.2.51–5 లక్షల వరకు ఆదాయం ఉన్నా పన్ను చెల్లించే అవసరం లేకుండా తర్వాతి కాలంలో రాయితీ కల్పించారు. కానీ, బేసిక్ పరిమితిలో మార్పులు చేయలేదు. ఔషధాల భారాన్ని దింపరూ.. పరిశోధన, అభివృద్ధికి, ఫార్ములేషన్, ఏపీఐల తయారీకి సంబంధించి ప్రత్యేక నిధుల కేటాయింపు అవసరం ఉందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఔషధాలపై జీఎస్టీని సులభతరం చేయాలని కోరుతున్నాయి. దేశ ఫార్మా పరిశ్రమ 2023 ముగిసే నాటికి 130 బిలియన్ డాలర్లకు చేరుతుందన్న అంచనా ఉంది. ఫార్మా పరిశ్రమ ఔషధ పరీక్షలు, సర్టిఫికేషన్ వంటి సేవలను అందిస్తున్నా.. సేవల ఎగుమతి ప్రోత్సాహక పథకం (ఎస్ఈఐఎస్) కింద ఎలాంటి ప్రోత్సాహకాలు అందించడం లేదని, తమకూ వాటిని అందించాలన్న డిమాండ్ ఉంది. ఆరోగ్యం కోసం ప్రజలు జేబు నుంచి చేసే ఖర్చు 65 శాతంగా ఉందని, కనుక ఔషధాలపై జీఎస్టీని తగ్గించడం వల్ల ఈ భారాన్ని దింపొచ్చని పరిశ్రమ కోరుతోంది. పాలసీదారులు/బీమా కంపెనీలు మనదేశంలో బీమా వ్యాప్తి ఇప్పటికీ అంతర్జాతీయ సగటుతో పోలిస్తే చాలా తక్కువగా ఉంది. ‘2047 నాటికి అందరికీ బీమా’ అనే లక్ష్యాన్ని బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) పెట్టుకుంది. టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై వినియోగదారులు 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సి వస్తోంది. ఇది ఎంతో మందికి భారంగా పరిణమించిదని, దీన్ని 5 శాతానికి తగ్గించాలని పరిశ్రమ ఎప్పటి నుంచో కోరుతోంది. ఉదాహరణకు రూ.10,000 ప్రీమియంపై రూ.1800 పన్ను రూపంలో చెల్లించాల్సి వస్తోంది. పన్ను తగ్గింపుతో ప్రీమియం తగ్గడం వల్ల మరింత మంది బీమా పాలసీలు తీసుకునేందుకు ముందుకు వస్తారని పరిశ్రమ చెబుతోంది. ఈ డిమాండ్‌ను ఆర్థిక మంత్రి నెరవేర్చితే అది కచ్చితంగా బీమా వ్యాప్తికి దోహదపడుతుంది. ముఖ్యంగా అధిక కవరేజీనిచ్చే టర్మ్ ఇన్సూరెన్స్‌కు ఆదరణ పెరుగుతుంని పరిశ్రమ అంటోంది. హెల్త్ ఇన్సూరెన్స్‌కు చెల్లించే ప్రీమియం ఒక కుటుంబానికి రూ.25,000 వరకు ఉంటే సెక్షన్ 80డీ కింద పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. లైఫ్ ఇన్సూరెన్స్ కోసం ప్రత్యేక పన్ను మినహాయింపు కావాలని, యాన్యుటీ (పెన్షన్ ప్లాన్) ఆదాయంపై పన్ను ఎత్తేయాలని, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై మరింత పన్ను మినహాయింపు ఇవ్వాలని బీమా రంగం కోరుతోంది. ఉపాధి కల్పన అమెరికా, యూరప్‌లో ఆర్థిక మాంద్యం ఆందోళనల నేపథ్యంలో టెక్ కంపెనీలు ఉద్యోగులను తగ్గించుకుంటున్నాయి. దీనిపై ఆందోళన వ్యక్తమవుతోంది. కనుక ఉపాధి కల్పన, పెట్టుబడులకు ఊతమిచ్చే ప్రతిపాదనలకు చోటు ఇవ్వాలన్న సూచనలు నిపుణుల నుంచి వినిపిస్తున్నాయి. నిజానికి ఉపాధి కల్పన లక్ష్యంతోనే మోదీ సర్కారు భారత్‌లో తయారీ విధానాన్ని ఎంచుకుంది. దీనికింద ఆత్మనిర్భర్ (స్వావలంబన) భారత్ పేరుతో దేశీ తయారిని ప్రోత్సహించే పలు విధానాలను ఇప్పటికే చేపట్టింది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) కింద ఇప్పటికే 14 రంగాలకు ప్రోత్సాహకాలను ప్రకటించారు. బడ్జెట్లో ఇందుకు సంబంధించి కేటాయింపులు పెంచొచ్చని భావిస్తున్నారు. ముఖ్యంగా మరిన్ని రంగాలు తమకు సైతం పీఎల్ఐ ప్రోత్సాహకాలు కావాలని కోరుతున్నాయి. వీటికి ఏ మాత్రం ప్రాధాన్యం ఇస్తారన్నది బడ్జెట్‌తో తెలుస్తుంది. స్టార్టప్‌లకు సైతం కేంద్రం ప్రోత్సాహకాలు ఇస్తోంది. దీనికి కూడా కేటాయింపులు పెంచొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీ) కింద కేటాయింపులు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్రామీణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కేటాయింపులు పెంచడం ద్వారా ఉపాధి కల్పించొచ్చనే సూచనలు వస్తున్నాయి. ఫిన్‌టెక్/ఎంఎస్ఎంఈ దేశీ ఫిన్‌టెక్ పరిశ్రమ తమకు మరిన్ని మద్దతు చర్యలు కావాలని కోరుతోంది. అందరికీ ఆర్థిక సేవల చేరువలో తమ పాత్ర కీలకమని, ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థకు, ఉపాధి కల్పనకు కీలకంగా వ్యవహరిస్తున్న ఎంఎస్ఎంఈ రంగం అవసరాలు తీర్చడంలోనూ ఫిన్‌టెక్ పరిశ్రమ చేస్తున్న సేవలను గుర్తు చేసింది. 45 శాతం మందికి ఉపాధినిస్తూ, జీడీపీలో 30 శాతం వాటాను ఎంఎస్ఎంఈ పరిశ్రమ కలిగి ఉంది. కనుక బడ్జెట్ ప్రతిపాదనల పట్ల ఫిన్‌టెక్ పరిశ్రమ ఆసక్తిగా చూస్తోంది. కార్పొరేట్ రంగం డిమాండ్.. కొత్తగా తయారీ ప్లాంట్లు ఏర్పాటు చేసే దేశీ కంపెనీలకు అతి తక్కువగా 15 శాతం కార్పొరేట్ పన్నును కేంద్రం లోగడ ప్రకటించింది. 2024 మార్చి 31లోపు తయారీ కార్యకలాపాలు ఆరంభించేవి ఈ ప్రయోజనం పొందొచ్చు. ఈ గడువును పొడిగించాలనే డిమాండ్ ఉంది. దీనివల్ల మరిన్ని కంపెనీలు ముందుకు వస్తాయని, తద్వారా ఉపాధి కల్పన పెరుగుతుందన్న అభిప్రాయాలు ఉన్నాయి. కరోనా మహమ్మారి ప్రభావం నుంచి బయట పడేందుకు కంపెనీలకు సమయం పట్టిందని.. ఇప్పుడు నూతన పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నందున గడువు పొడిగించాలనే డిమాండ్ ఉంది. కొత్త ప్లాంట్ తయారీ కార్యకలాపాలు ప్రారంభించేందుకు కనీసం 2–3 ఏళ్లు పడుతుందని, కనుక ప్రస్తుత గడువు చాలదన్న అభిప్రాయం ఉంది. ఆదాయపన్ను విషయంలో ఊరట కల్పిస్తే అది హౌసింగ్ పరిశ్రమ వృద్ధికి మేలు చేస్తుందని రియల్టీ భావిస్తోంది. భారీ ఉపాధి కల్పిస్తున్న ఎంఎస్ఎంఈ రంగం తమకు క్షేత్రస్థాయిలో రుణ లభ్యత సమస్యగా ఉందని చెబుతోంది. ఎంఎస్ఎంఈ తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పించే కీలకమైన ఆటోమొబైల్ రంగం పన్నుల భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తోంది. కనిష్టంగా 28%, గరిష్టంగా 40 శాతానికి పైనే వాహనాలపై పన్నుల భారం వేస్తున్నారని.. మార్కెట్ విస్తరణకు ఇది అవరోధంగా నిలుస్తున్నట్టు చెబుతున్నాయి. స్టాక్ మార్కెట్ కోర్కెలు మూలధన లాభాల పన్ను పరంగా ఉపశమనం కల్పిస్తే అది మార్కెట్లకు మంచి జోష్‌నిస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం డెట్, ఈక్విటీ, ప్రాపర్టీలకు వేర్వేరు మూలధన లాభాల పన్ను, హోల్డింగ్ పీరియడ్ అమలవుతున్నాయి. వీటి మధ్య ఏకరూపతకు అవకాశం ఉందని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి ఇప్పటికే సంకేతం ఇచ్చింది. ఈ క్రమంలోనే మూలధన లాభాల పన్ను విషయమై అంచనాలు ఏర్పడ్డాయి. దీర్ఘకాల మూలధన లాభాలపై నష్టాన్ని, స్వల్పకాల మూలధన లాభాలతో సర్దుబాటుకు అవకాశం లేదు. విద్యారంగం దేశంలో నాణ్యమైన విద్యకు డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలోనే విదేశీ విద్యా సంస్థలకు మోదీ సర్కారు ఆహ్వానం పలికింది. విద్యా సేవలపై జీఎస్టీ భారాన్ని తొలగించడం లేదంటే తగ్గించాలని విద్యా సంస్థలు కోరుతున్నాయి. దేశంలో ప్రాథమిక విద్యలో ఎక్కువ మంది చేరుతున్నారు. ఉన్నత విద్యకు వెళ్లేసరికి పిరమిడ్ మాదిరి చేరే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. అందుకుని ఉన్నత విద్యలోనూ మరింత మంది చేరేందుకు వీలుగా ఆకర్షణీయమైన రుణ పథకాలు, స్కాలర్షిప్లు ప్రకటించాలనే డిమాండ్ ఉంది. గృహ కల్పన అందరికీ ఇల్లు అనేది మోదీ సర్కారు నినాదం. దీని సాకారానికి వీలుగా రుణ సబ్సిడీ పథకాన్ని కొనసాగించాలని హౌసింగ్ పరిశ్రమ కోరుతోంది. అందుబాటు ధరల ఇంటికి నిర్వచనాన్ని విస్తరించాలన్న డిమాండ్ కూడా ఉంది. నిర్మాణ రంగ మెటీరియల్ అయిన స్టీల్, సిమెంట్‌పై జీఎస్టీ తగ్గించాలని పరిశ్రమ కోరుతోంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం గడువును మరింత కాలం పెంచాలని కోరుతోంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రుణంపై కొంత రాయితీ లభిస్తుంది. రైతులను చూస్తారా..? సాగు రంగం నుంచి డిమాండ్ల చిట్టా పెద్దదిగానే ఉంది. పీఎం కిసాన్ పథకం కింద ఒక్కో రైతుకు ఏటా సాగుకు కావాల్సిన ముడి సరుకుల కోసం ఇస్తున్న రూ.6,000ను పెంచాలనే డిమాండ్ ప్రధానంగా వినిపిస్తోంది. దీనివల్ల రైతులు రుణాలతో పనిలేకుండా సాగుకు కావాల్సిన ముడి పదార్థాలను కొనుగోలు చేసుకోగలరన్న సూచన ఉంది. పంటల బీమా పథకాన్ని మరింత మెరుగ్గా రూపొందించాలనే డిమాండ్ సైతం ఉంది. అగ్రి టెక్ స్టార్టప్‌లకు రాయితీలు కల్పించాలని, ఆగ్రోకెమికల్స్ దిగుమతులపై సుంకాలు తగ్గించాలని పరిశ్రమ కోరుతోంది. సాగులో టెక్నాలజీ విస్తరణకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ల వినియోగం పెంచేందుకు చర్యలు ప్రకటిస్తారనే అంచనాలు ఉన్నాయి. ముడి చమురు మాదిరే వంట నూనెల విషయంలోనూ 65 శాతం దిగుమతులపైనే ఆధారపడుతున్నాం. దీంతో ‘నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్స్ ఆయిల్స్’ పేరుతో నూనె గింజల సాగుకు ఆర్థిక సహకారం అందించాలని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా డిమాండ్ చేసింది. ఏటా రూ.25,000 కోట్ల చొప్పున ఐదేళ్లపాటు అందించాలని కేంద్రానికి సూచించింది. దీనివల్ల దిగుమతులను 30 శాతానికి తగ్గించొచ్చని పే ర్కొంది. సాగు రంగంలో పరిశోధన, అభివృద్దికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని ధనూకా గ్రూప్ చైర్మన్ ఆర్జీ అగర్వాల్ కోరారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయాలనే లక్ష్యంతో ఉన్న బడ్జెట్లో వ్యవసాయానికి మెరుగైన కేటాయింపులు చేస్తారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. హెల్త్‌కేర్‌కు పెద్ద పీట వేస్తారా? ఆరోగ్య సంరక్షణ (హెల్త్‌కేర్) రంగానికి బడ్జెట్లో కేటాయింపులను 20–30 శాతం పెంచాలన్న డిమాండ్లు నెలకొన్నాయి. కరోనా మహమ్మారి ఆరోగ్య మౌలిక సదుపాయాల అవసరాన్ని గర్తు చేసింది. హెల్త్‌కేర్ రంగానికి 2022–23 బడ్జెట్లో 16.5 శాతం అధికంగా రూ.86,200 కోట్ల కేటాయింపులు చేశారు. ఈ విడత కేటాయింపులు ఏ మేరకు ఉంటాయన్నది చూడాల్సి ఉంది. బడ్జెట్లో కేటాయింపుల పట్ల భారీ అంచనాలతో ఉన్నామని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ప్రెసిడెంట్ డాక్టర్ శరద్ కుమార్ అగర్వాల్ తెలిపారు. ముఖ్యంగా హెల్త్‌కేర్ పరిశ్రమ డిజిటైజేషన్‌కు అదనపు నిధులు అవసరమని అపోలో టెలీహెల్త్ సీఈవో విక్రమ్ తాప్లూ అభిప్రాయపడ్డారు. నేషనల్ డిజిటల్ హెల్త్ ఎకోసిస్టమ్, నేషనల్ టెలీ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ ప్రకటించినప్పటికీ, వీటి విస్తరణకు మరిన్ని నిధుల కేటాయింపు అవసరాన్ని ప్రస్తావించారు. ముఖ్యంగా టెలీ మెడిసిన్ సేవల విస్తరణకు అధిక నిధుల కేటాయింపు అవసరమని డాక్టర్ అగర్వాల్ సైతం పేర్కొన్నారు. స్వచ్చందంగా మెడికల్ ఇన్సూరెన్స్‌కు ప్రతిపౌరుడికీ అవకాశం కల్పించాలని కోరారు. అది కూడా ఉచితంగా అందించాలని సూచించారు. కేన్సర్ కేర్ వసతుల పెంపునకు మరిన్ని నిధులు అవసరమని నిపుణుల సూచనగా ఉంది. హెల్త్‌కేర్ మౌలిక సదుపాయాల కోసం ప్రత్యేక నిధి కేటాయించాలనే డిమాండ్ సైతం ఉంది. – బిజినెస్ డెస్క్ -
కోటి నాగళ్ల నోము
ఈ దేశం మీద ఎన్నో దండయాత్రలు జరిగాయి. ఎంతోమంది రాజులు మారిపోయారు. రాజ్యాధికారాలు ఎన్నోసార్లు చేతులు మారాయి. కానీ, స్వయంపోషక గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మటుకు శతాబ్దాల పర్యంతం చెక్కుచెదరకుండా అలాగే నిలబడి పోయింది. బ్రిటిష్ వలసపాలన మొదలైన తర్వాత మాత్రమే మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ జీవనాడులు ఒక్కొక్కటే తెగి పోవడం ప్రారంభమైంది. భారతదేశ చారిత్రక పరిణామాలపై కమ్యూనిస్టు ప్రవక్త కారల్‌మార్క్స్ అవగాహన కూడా ఇదే. మార్క్స్ భారతదేశం గురించి రాసింది తక్కువే. కానీ చేసిన అధ్యయనం చాలా విస్తృతమైనది. ‘భారత్‌లో బ్రిటిష్ పాలన భవిష్యత్ పరిణామాలు’ అనే వ్యాసంలో ఆయన అధ్యయనం, అవగాహన మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. కాకపోతే ఈ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కులచట్రంలో బిగు సుకుపోయిందనీ, ఈ కులం అనేది దేశ అభివృద్ధికి గుదిబండగా మారిందని మార్క్స్ అభిప్రాయపడ్డారు. మేధోశ్రమ, శారీరక శ్రమల ఆధారంగా కులవిభజన జరిగింది. శారీరక శ్రమకు మేధోశ్రమ తోడ్పాటు లభించలేదు. ఫలితంగా ఉత్పాదకతలో సాంకేతిక అభివృద్ధి జరగలేదు. కులవ్యవస్థతో కుంటుతున్నప్ప టికీ, సాంకేతిక పరిజ్ఞానం కొరవడినప్పటికీ భారతదేశ స్వయం పోషక గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అద్భుతాలనే సృష్టించింది. బ్రిటిష్ ఆర్థికవేత్త ఆంగస్ మాడిసన్ లెక్కల ప్రకారం పదిహేడో శతాబ్ది నాటికే ప్రపంచ జీడీపీలో భారతదేశం వాటా 23 శాతం. ఈ దేశంలో బ్రిటిష్ వారి పాలన ప్రారంభం కాకముందటి లెక్క ఇది. తాజా లెక్కల ప్రకారం ప్రపంచ జీడీపీలో మన వాటా 7 శాతం మాత్రమే. బ్రిటీష్ వాళ్లు మనదేశం నుంచి ఎంత సంపదను లూటీ చేశారనే అంశంపై ఆర్థికవేత్తలు కొందరు లెక్కలు కట్టి ప్రస్తుత కరెన్సీ విలువల ప్రకారం 45 ట్రిలియన్ల అమెరికన్ డాలర్లుగా తేల్చారు. అంటే 45 లక్షల కోట్ల డాలర్లు. మన రూపాయి లెక్కల్లోకి మారిస్తే సుమారు 3,300 లక్షల కోట్ల రూపాయలు! ఈ సంపదంతా మన స్వయంపోషక గ్రామీణ ఆర్థిక వ్యవస్థ సృష్టి. శ్రామిక ప్రజలు తమ కరాల బిగువు, నరాల సత్తువతో కురిపించిన వరాల వర్షమే ఇదంతా! ఈ అవగాహన ఉన్నందువల్లనే మహాత్మాగాంధీ ‘గ్రామ స్వరాజ్’ను స్వతంత్ర భారత్‌కు అభివృద్ధి మోడల్‌గా సూచిం చారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ కులనిర్మూలన అంశాన్ని ఎజెండా పైకి తెచ్చారు. దురదృష్టవశాత్తు మన రాజకీయ నాయ కత్వం ఈ రెండు కీలక విషయాలనూ పక్కన పెట్టింది. భారత దేశ పరిణామాల విశ్లేషణలో కారల్‌మార్క్స్ ఈ రెండంశాలనూ ప్రధానంగా ప్రస్తావించారు. కానీ, ఈ దేశంలోని కమ్యూనిస్టులు వాటిని పెడచెవిన పెట్టి మూల్యం చెల్లించుకున్నారు. స్వయం పోషక గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ప్రధానమైనది వ్యవసాయం. ఇప్పటికీ అత్యధిక ప్రజానీకాన్ని అక్కున చేర్చుకొని ఆశ్రయ మిస్తున్న రంగం ఇదే. స్వరాజ్యం వచ్చిన తర్వాత మన పాల కులు ఈ రంగానికి ప్రాధాన్యతను ఇవ్వలేదు. ఫలితంగా ఒక దశలో దేశానికి సరిపోయే తిండి గింజల్ని పండించలేని స్థితిలోకి మన వ్యవసాయరంగం దిగజారింది. అప్పుడు కళ్లు తెరిచి ‘గ్రీన్ రివల్యూషన్’ అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. హైబ్రిడ్ విత్తనాలను ప్రవేశపెట్టడం, రసాయనిక ఎరువుల్ని పెద్ద ఎత్తున రంగంలోకి దించడం – ఈ ‘గ్రీన్ రివల్యూషన్’ సాధిం చిన ఘనతలు. ఫలితంగా ఉత్పత్తి పెరిగిన మాట వాస్తవమే. ఉత్పత్తి వ్యయం ఆ నిష్పత్తిని మించి పెరిగిందన్నది ఒక చేదు నిజం. ప్రజారోగ్యం అటకెక్కిందన్నది మరింత నిష్ఠుర సత్యం. ఆర్థిక సంస్కరణల శకం ప్రారంభమైన తర్వాత వ్యవసాయ రంగం దారుణమైన అవమానాలను ఎదుర్కొనవలసిన పరిస్థితి ఏర్పడింది. పెట్టుబడి వ్యయం భారీగా పెరిగింది. మార్కెట్ ధరలు దైవాధీనం. కొనబోతే కొరివి, అమ్మబోతే అడవి రైతును వెక్కిరించాయి. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. అందుకు కారణం అప్పుడు ముఖ్య మంత్రిగా పనిచేసిన చంద్రబాబునాయుడు. ఆర్థిక సంస్కరణ ల్లోని అమానుష పార్శా్వనికి ఒక లోగో మాదిరిగా ఆయన ఫొటో స్థిరపడిపోయింది. ప్రపంచబ్యాంకు జీతగాడు అనే బిరుదు కూడా దొరికింది. బోరు మోటార్లకు కరెంట్ బిల్లు చెల్లించకపోతే ఇంటి తలుపుల్ని పెకిలించి తీసుకొనిపోయేవారు. పరువు పోయిందని రైతులు ఆత్మహత్యలు చేసుకొనేవారు. పరువు పోకూడదని రైతు మహిళలు పుస్తెలమ్మి మరీ కరెంట్ బిల్లులు కట్టేవారు. పాలుతాగే వయసు బిడ్డలున్న తల్లుల పరిస్థితి హృద యవిదారకంగా మారింది. కడుపునిండా తిండిలేక బిడ్డకు స్తన్యమివ్వలేని దైన్యం వారిది. కల్లుసీసాకు పాలపీకను పెట్టి బిడ్డ చేతికిచ్చేవారు. కల్లు మత్తులో బిడ్డ నిద్రపోతుందని, ఆ నిద్రలో ఆకలి మరిచిపోతుందని ఒక ఆశ. ఈ పరిస్థితులను వివ రిస్తూ ప్రజాకవి గోరటి వెంకన్న రాసిన ‘పల్లె కన్నీరు పెడుతుందో..’ అనే పాట జాతీయ ఆర్తనాద గీతమైంది. ‘కుమ్మరి వామిలో తుమ్మలు మొలిసెను / కమ్మరి కొలిమిలో దుమ్ము పేరెను / పెద్దబాడిసె మొద్దుబారినది / సాలెల మగ్గం సడుగులిరిగినవి / చేతివృత్తులా చేతులిరిగి పాయే నా పల్లెల్లోనా / అయ్యో గ్రామ స్వరాజ్యం గంగలోనా బాయే ఈ దేశంలోనా..’ అంటూ సాగే ఆ పాట నాటి పరిస్థితులకు అద్దం పట్టింది. ‘వ్యవసాయం దండగ’ అన్నది ఆనాడు చంద్రబాబు నినాదం. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన వెంటనే ‘వ్యవసాయాన్ని పండుగ’ చేద్దాం అని పిలుపునిచ్చారు. ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేశారు. అప్పటివరకున్న అప్పులు మాఫీ అయ్యాయి. కోటి ఎకరాలకు సాగునీరు ఇవ్వ డానికి జలయజ్ఞం ప్రారంభమైంది. రైతు లోకంలో మళ్లీ ఆశలు మొలకెత్తాయి. దురదృష్టవశాత్తు ఆయన అకాల మరణం పాలైన తర్వాత ఉద్యమ స్ఫూర్తి, వేగం కొరవడినప్పటికీ ఆ పథకాలైతే అరకొరగానైనా కొనసాగాయి. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రా ల్లోని పల్లెలు కొత్త చిగురులు తొడుక్కుంటున్న దృశ్యాలు కన్పి స్తున్నాయి. తెలంగాణలో రైతుబంధు, మిషన్ కాకతీయ, కాళే శ్వరం ప్రాజెక్టులు, ధాన్యం కొనుగోలు రైతు గుండెల్లో విశ్వా సాన్ని నింపాయి. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే పల్లె ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ఫలితంగా మహాత్ముని ఆశయమైన ‘గ్రామ స్వరాజ్’ను అమలు చేసినట్లయింది. రైతు భరోసా, ఇన్పుట్ సబ్సిడీ, బీమా నిధులు ఠంచనుగా చెప్పిన సమయానికి అందుతున్నాయి. పల్లెలు జన సందడితో కళకళలాడుతున్నాయి. పరిపాలనంతా పల్లెలోంచే సాగుతున్నది. సచివాలయంతోపాటు మరో కొత్త ల్యాండ్ మార్క్ అడ్రస్ – ‘రైతు భరోసా కేంద్రం’ (ఆర్బీకే). ఆంధ్రప్రదేశ్ యువ ముఖ్యమంత్రి దార్శనికతకు మరో మచ్చుతునక ఆర్బీకే సెంటర్. ఇదొక విప్లవాత్మక ఆలోచన. మరో ఒకటి, రెండేళ్లలోనే ఆ రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని ఈ కేంద్రాలు తేజోమయం చేయబోతున్నాయి. వ్యవసాయం సంక్షో భంలో కూరుకొనిపోవడానికి ప్రధాన కారణమేమిటి? పెట్టుబడి వ్యయం పెరగడం, పెరిగిన ధరలకు కూడా నాణ్యమైన ఇన్ పుట్స్‌కు బదులు నకిలీవి దొరకడం ఒక ప్రధాన కారణం. పండించిన పంటకు లాభసాటి ధర దొరకకపోవడం, ఎక్కువ సార్లు గిట్టుబాటు ధర కూడా లభించకపోవడం మరో ప్రధాన కారణం. ఈ రెండు ప్రధాన కారణాలను ఆర్బీకే సెంటర్ల ద్వారా పరిహరించే కార్యక్రమం మొదలైంది. ఈ సంవత్సరం కోటి టన్నుల ధాన్యాన్ని ఈ సెంటర్ల ద్వారా కొనుగోలుచేసి రైతులకు డబ్బులు కూడా చెల్లించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే ఏడున్నర లక్షల మెట్రిక్ టన్నుల సబ్సిడీ విత్తనాలను రైతులకు అందుబాటులోకి తెచ్చారు. నాన్–సబ్సిడీ వాణిజ్య పంటల విత్తనాలు ఇందుకు అదనం. ఆర్బీకే సెంటర్లో ఏర్పాటుచేసిన కియోస్క్‌లో ఆర్డర్ చేసిన ఇరవై నాలుగ్గంటల్లోనే సీడ్ టెస్టింగ్ కిట్లతో నాణ్యతను పరిశీలించి మరీ రైతుకు అందజేస్తున్నారు. విత్తనాల్లో నాణ్యతే కాకుండా మార్కెట్ ధరకంటే తక్కువకు లభిస్తున్నాయనీ, రోజూ మండల కేంద్రానికి వెళ్లి ఎదురుచూసే వ్యయప్రయాసలు ఇప్పుడు లేవని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎరువులకోసం దుకాణాల ముందు చెప్పుల్ని క్యూలో విడిచిపెట్టే రోజులు ఇక గత చరిత్ర. నాణ్యమైన విత్తనాల లభ్యత నుంచి పంట దిగుబడుల మార్కెటింగ్ వరకు అండగా నిలబడుతున్న ఆర్బీకేలకు ఈ మధ్యనే ప్రతిష్ఠాత్మకమైన ‘స్కోచ్’ ఆవార్డు కూడా లభించింది. గ్రామస్థాయిలోనే ఎరువులు, విత్తనాలను రైతులకు అంద జేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ను అన్నిరాష్ట్రాలూ ఆదర్శంగా తీసుకోవా లని ఇటీవల కేంద్ర ప్రభుత్వం సూచించింది. ధాన్యం కొను గోళ్లకు, ఎరువులు–విత్తనాల సరఫరాకు మాత్రమే ఆర్బీకేలు పరిమితం కావు. ముఖ్యమంత్రి ఆలోచన ప్రకారం ఈ కేంద్రాలు బహుళార్థ సాధక కేంద్రాలు కానున్నాయి. సాగుకు అవసరమైన యంత్ర పరికరాలను అద్దెపై అందుబాటులో ఉంచేందుకు కస్టమ్ హైరింగ్ సెంటర్లను ఆర్బీకేలకు అనుబంధంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ సెంటర్లలో సేవలందించడానికి ఒక అగ్రి కల్చరల్ అసిస్టెంట్ ఉంటారు. ఆ వూళ్లో సాగయ్యే భూవిస్తీ ర్ణాన్ని బట్టి పంటల వైవిధ్యాన్ని బట్టి కొన్ని గ్రామాల్లో ఒకరికంటే ఎక్కువ గానే ఈ అసిస్టెంట్లు ఉంటున్నారు. గత కొద్దిరోజులుగా ‘ఈ–క్రాపింగ్’లో తలమునకలై ఉంటూ కూడా, ఎరువులు, విత్త నాల సరఫరాలో ఇబ్బంది లేకుండా వీరు వ్యవహరిస్తున్నారు. ‘ఈ–క్రాపింగ్’ అనేది రైతుకు సౌకర్యవంతమైన కార్యక్రమం. ఇందులో నమోదైన వారికి సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు లభిస్తున్నాయి. ఏ కారణం వల్లనైనా పంట నష్టం జరిగినా ఇన్ పుట్ సబ్సిడీ, బీమా పరిహారం లభిస్తాయి. పంటను అమ్ము కోవడం కూడా సులభం. కౌలు రైతులకైతే ‘ఈ–క్రాపింగ్’ ఓ వరం. భూయజమాని సంతకం పెట్టకపోయినా ఈ సౌకర్యా లన్నీ కౌలు రైతుకు దక్కుతాయి. భూయజమాని సంతకం పెట్టినట్టయితే రైతు భరోసా కూడా లభిస్తుంది. రైతు భరోసా కేంద్రం ప్రతి పల్లెలోనూ ఏర్పాటవడం రైతులకు గొప్ప సదుపాయం. నేరుగా కేంద్రానికే వెళ్లి రైతులు పంటల గురించి, ప్రభుత్వ పథకాల గురించి వాకబు చేసే అవకాశం దొరికింది. వ్యవసాయ శాఖ యంత్రాంగం కూడా గ్రామంలో ఉన్న అసిస్టెంట్ల ద్వారా రైతులకు సలహాలు, సూచ నలూ పక్కాగా అందజేయడానికి మార్గం ఏర్పడింది. రాష్ట్రంలో భూకమతాలు సుమారు 80 లక్షల మేరకు ఉంటాయి. పూర్తిగా వ్యవసాయంపైనే కేంద్రీకరించే రైతుల సంఖ్య కోటీ ఇరవై లక్షల దాకా ఉండొచ్చు. పది లక్షల కమతాలను స్వయంగా మహిళలే నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో సగటు కమతం విస్తీర్ణం ఒకటిన్నర ఎకరం మాత్రమే! ఈ చిన్న కమతంలోనే రైతు కుటుంబం తిండి, బట్ట, ఇతర ఖర్చులను వెళ్లదీయాలి. అందుకు అనుకూలమైన సేద్యపు నమూనాలను వ్యవసాయ శాఖ రూపొందించవలసి ఉన్నది. సమీకృత వ్యవసాయానికి (integrated farming) రైతులను సిద్ధం చేయాలనే ఆలోచన వున్నట్టు చెబుతున్నారు. కుటుంబానికి సరిపడా తిండిగింజలతోపాటు కొంతభాగం వాణిజ్య పంటను వేస్తూ, అనుబంధంగా కోళ్ల పెంపకం లేదా పాడి, లేదా చేపల పెంపకం చేపట్టి రోజువారీ ఆదాయం పొందేవిధంగా చేసే వ్యవసాయాన్ని ‘సమీకృత వ్యవసాయం’ అంటారు. చాలామంది ఆదర్శ రైతులు ఇప్పటికే ఇందులో ప్రయోగాలు చేసి రాణిస్తున్నారు. హైడెన్సిటీతో చేసే సాగు పద్ధతులూ, ఏడాది పొడుగునా ఏదో ఒక పంట తీసే పద్ధతులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. పంటలు పండించడమే కాదు పంట దిగుబడిని ప్రయాస లేకుండా అమ్ముకోవాలి. మన దేశ వ్యవసాయరంగంలోకి అవసరమైన మేరకు పనిముట్లు, యంత్రాలు ప్రవేశించలేదు. చిన్న కమతాలున్న రైతులు కూలీల సహాయం లేకుండానే పనులు పూర్తిచేసుకునే సామగ్రి తయా రీపై దృష్టిపెట్టాలి. బ్రష్ కట్టర్, పవర్ టిల్లర్, చాప్‌కట్టర్ వంటి వాటి వినియోగంలో శారీరక బలం కూడా అవస రమవు తున్నది. వీటిని మహిళా రైతులను కూడా దృష్టిలో పెట్టుకొని రీడిజైన్ చేయాలి. ఈ అన్ని వ్యవహారాల్లోనూ ఆర్బీకేలు క్రియా శీలక పాత్రను పోషించవలసి ఉన్నది. చిన్న కమతం రైతు కూడా సేద్యంలో లాభాన్ని కళ్లచూడాలన్నదే ముఖ్యమంత్రి అంతరం గమని వ్యవసాయాధికారులు చెబు తున్నారు. అది సాఫల్యమైన నాడు వ్యవసాయ లాభాలపైన ఇతర వృత్తులూ, వ్యాపారాలు ప్రవర్ధమానమై పల్లెవెలుగులీనుతుంది. ఒక తరం గడిచేసరికి రైతు కుటుంబాల్లోని అనేకమంది వారసులు ఉన్నత విద్యను అభ్యసించగలుగుతారు. వారి అభీష్టం మేరకు నచ్చిన వృత్తుల్లో స్థిరపడతారు. వ్యవసాయంపై ఒత్తిడి తగ్గుతుంది. కమతాల పరిమాణం పెరుగుతుంది. వచ్చే తరం రైతు విద్యాధికుడు. అతడు సాధారణ రైతు కాదు. ఒక రైతు శాస్త్రవేత్త. అననుకూల పరిస్థితుల్లో సైతం అధిక దిగుబడులు సాధించగల ఇజ్రాయెల్ రైతులకు దీటైనవాడు. ఒక డాక్టర్లా, ఒక లాయర్లా, ఒక ఇంజనీర్లా, ఒక ప్రభుత్వ అధికారిలాగా అతనికి సమాజంలో గౌరవ మర్యాదలుంటాయి. పలుకుబడి ఉంటుంది. రాబోయే తరం రైతు సంపన్నుడు. ఎంపవర్డ్ ఫార్మర్. రైతును రాజును చేసే యుగ ప్రయాణానికి రాకెట్ ఇంధనం – ‘రైతు భరోసా కేంద్రం’! వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ఇది ఆంధ్రప్రదేశ్ పాడి రైతుల అదృష్టం
సాక్షి, అమరావతి: గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా పాడి పరిశ్రమ సామర్థ్యాన్ని సరిగ్గా గుర్తించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏపీలో సీఎంగా ఉండటం అక్కడి పాడి రైతుల అదృష్టమని అమూల్ ఎండి ఆర్ఎస్ సోధి అన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో జగనన్న పాలవెల్లువలో భాగంగా ఏపీ– అమూల్ పాలసేకరణను శుక్రవారం ప్రారంభించిన సందర్భంగా వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ఆయన మాట్లాడారు. వైఎస్ జగన్ పాడి రైతుల కష్టాలను స్వయంగా గుర్తించి, వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. ఇందులో భాగంగా అమూల్‌ను ఆహ్వానించడం సంతోషకరమని అన్నారు. భారతదేశంలో పాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్, తర్వాత రాజస్థాన్, మధ్యప్రదేశ్, నాలుగో స్థానంలో ఆంధ్రప్రదేశ్, ఐదో స్థానంలో గుజరాత్ ఉందని వివరించారు. ఏపిలో రోజుకు 4.12 కోట్ల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయని, వీటి విలువ ఏడాదికి రూ.7 వేల కోట్లు అని చెప్పారు. గుజరాత్లో ఏ విధంగా అమూల్ వల్ల పాడి రైతులకు మేలు జరిగిందో, ఏపీలో అలాగే మేలు జరుగుతోందని అన్నారు. అమూల్‌కు లాభాలు ముఖ్యం కాదు అమూల్ సంస్థకు రైతులే నిజమైన యజమానులని, ఇతర కార్పొరేట్, మల్టీనేషన్ కంపెనీల మాదిరిగా లాభాలను మాత్రమే ఆర్జించడం అమూల్ లక్ష్యం కాదని సోధి అన్నారు. ఏపీ ప్రభుత్వ సహకారంతో అన్ని జిల్లాల్లోనూ మహిళా రైతుల భాగస్వామ్యంతో సహకార వ్యవస్థ ద్వారా పాల సేకరణ జరుగుతుందని వివరించారు. నాణ్యమైన పాలు, ఇతర ఉత్పత్తులను మార్కెట్లో ప్రజలకు చేరువ చేస్తామని చెప్పారు. ఇందుకోసం అమూల్ ఈ రంగంలో ఉన్న నైపుణ్యాలను రైతులకు పంచుతుందని తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లాలో నాణ్యమైన పాలు ఉత్పత్తి అవుతాయని, మార్కెట్లో ఈ పాలకు మంచి ఆదరణ ఉంటుందని చెప్పారు. రానున్న రోజుల్లో పాడి రైతుల సహకార సంస్థ చేతుల్లోనే యాబై శాతం మార్కెట్ ఉంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. పాడి రైతుల కళ్లలో ఆనందం మహిళా రైతులు మాట్లాడిన భాష నాకు తెలియకపోయినా, వారి ముఖాల్లో ఆనందం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లాలో పాల సేకరణ ప్రారంభించాం. దేశంలోనే అమూల్‌కు ప్రజల్లో మంచి గుర్తింపు రావడానికి కారణం అమూల్ కొనసాగిస్తున్న నాణ్యతా ప్రమాణాలు. అలాగే పాడి రైతులకు మరింత మేలు చేయాలన్న లక్ష్యం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పాడిరైతులతో కలిసి అమూల్ నాణ్యమైన ఉత్పత్తులను ప్రజలకు అందిస్తుంది. అమూల్ తో కలిసి పని చేసే రైతులకు ఎక్కువ లబ్ధి చేకూర్చడం ఎంతో సంతోషం కలిగిస్తోంది. – పటేల్, సబర్ డెయిరీ ఎండీ -
Andhra Pradesh: ఏపీలో జీవనోపాధి భేష్
సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న తరుణంలో కూడా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక వ్యవస్థ జోరు ఏమాత్రం తగ్గలేదు. పలు రాష్ట్రాల్లో ఆర్థిక వ్యవస్థ కుదేలై, కోలుకోవడానికి సతమతమవుతుండగా.. రాష్ట్రంలో మాత్రం పేద ప్రజల జీవన ప్రమాణాలను పెంచే రీతిలో దూసుకుపోతుండటం విశేషం. గ్రామాల్లో ఎక్కడా కూడా ప్రజలు జీవనోపాధి కోసం ఇబ్బంది పడుతున్న దాఖలాలు కనిపించడం లేదు. ఎకానమీ సైకిల్ పటిష్టంగా ఉండటం వల్లే కూలి పనులకు ఎక్కువ డిమాండ్ ఏర్పడి రేట్ల పెరుగుదల కనిపిస్తోందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో వ్యవసాయ కూలీలు మొదలు అసంఘటిత కార్మికులు, చేతి వృత్తి పనులు చేసుకునే వారి వరకు రోజు వారీ సంపాదన ఏడాదిలో 9 నుంచి 13 శాతం వరకు పెరిగినట్టు ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ డైరెక్టరేట్ అధ్యయనంలో తేలింది. అసంఘటిత కార్మిక వర్గంలో అత్యంత బలహీన కేటగిరీగా భావించే గ్రామీణ ప్రాంతంలోని చేతివృత్తిదారులు, వ్యవసాయ కూలీల రోజు వారీ కూలీ రేట్లపై ఈ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా 42 రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 44 ప్రాంతాల్లో 16 రకాల వృత్తులలో కూలి రేట్లపై అధ్యయనం చేసింది. వ్యవసాయ కూలి రేటు రూ.48 పెరుగుదల సాధారణ వ్యవసాయ కూలీకి 2019–20 ఆర్థిక సంవత్సరంలో రోజుకు రూ.368 కూలి దక్కితే.. కరోనా విపత్తు సంభవించిన 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ.416 చొప్పన అందింది. అంటే విపత్తు వేళ కూడా కూలి రూ.48 పెరగడం అంటే చిన్న విషయం కాదని ఆర్థిక రంగ నిపుణులు అంటున్నారు. వ్యవసాయ కూలీల కూలి రేట్లలో కూడా 13 శాతం పెరుగుదల నమోదైంది. అదే సమయంలో వడ్రంగి (చెక్క పని చేసే వారు) పని చేసే వారి రోజు వారీ కూలి రేటు 9 శాతం, చెప్పులు కుట్టుకునే వారి రోజు వారీ కూలీ రేటు 8 శాతం పెరిగినట్టు అధ్యయనంలో తేలింది. అయితే ఇదే సమయంలో వ్యవసాయ కూలీ పనులు చేసుకునే వారిలో స్త్రీ, పురుషుల కూలి రేట్ల మధ్య భారీ వ్యత్యాసం ఉంది. పురుషులకు రోజు వారీ కూలి సరాసరి రూ.416 చొప్పున దక్కితే, మహిళలకు మాత్రం సరాసరి రూ.298 చొప్పునే అందుకోగలిగారు. కాగా, మహిళల కూలి రేట్లలో ఏడాదిలో 12 శాతం పెరుగుదల నమోదవ్వడం గమనార్హం. ప్రభావం చూపని కరోనా! 2019–20 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2020–21 ఆర్థిక సంవత్సరం హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ (ధరల సూచి)లో పెరుగుదల 8.5 శాతంగా ఉంది. అంటే వినియోగ వస్తువుల ధరల సూచీలో పెరుగుదల కంటే గ్రామాల్లో చేతి వృత్తిదారులు, వ్యవసాయ కూలీల రోజు వారీ వేతనాల పెరుగుదల ఎక్కువగా ఉన్నట్టు అధ్యయనం తేల్చింది. గత ఏడాది కాలంగా ప్రపంచ వ్యాప్తంగా, మన దేశంలోనూ అన్ని వ్యవస్థలను అతలాకుతలం చేస్తోన్న కరోనా, మన రాష్ట్రంలోని గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ఏమాత్రం ప్రభావం చూపలేదని స్పష్టమవుతోందని ఆర్థిక నిఫుణులు పేర్కొంటున్నారు. వివిధ రంగాల్లోని కూలీలకు అధిక కూలి రేట్లు దక్కడానికి నిపుణులు చెబుతున్న కారణాలు ఇలా ఉన్నాయి. ఎకానమీ జోష్‌కు ఇవీ కారణాలు ► రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా గత 23 నెలల కాలంలో దాదాపు రూ.1.25 లక్షల కోట్ల మొత్తాన్ని రైతులకు, మహిళలకు, పేదలకు నేరుగా నగదు రూపంలోనే అందజేసింది. ఇందులో అధిక మొత్తం గ్రామీణ లబ్ధిదారులకే చేరింది. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో పేదల కొనుగోలు శక్తిలో కరోనా సమయంలో పెద్దగా మార్పు చోటు చేసుకోలేదు. అందువల్ల గ్రామీణ ప్రాంతాల్లో పనులకు డిమాండ్ పెరిగిందే తప్ప తగ్గలేదు. ► వ్యవసాయ పనులు ముగిసిన తర్వాత కూడా గ్రామీణ ప్రాంతాల్లో పేదల జీవనోపాధికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు సీఎం జగన్ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ వారి సొంత గ్రామాల్లోనే పెద్ద ఎత్తున పనులు కల్పించారు. ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా గత ఏడాది 26.03 కోట్ల పనిదినాలు కల్పించింది. ► రాష్ట్రంలో వ్యవసాయ రంగం పరిస్థితి సైతం గతంతో పోల్చుకుంటే గత రెండేళ్లగా బాగా మెరుగు పడింది. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక వ్యవహారాలన్నీ వ్యవసాయ రంగంతోనే ముడిపడి ఉంటాయి. వ్యవసాయ పనులు తక్కువగా ఉండే మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై నెలల్లోనే కరోనా తీవ్రత అధికంగా కనిపించింది. దీంతో వ్యవసాయ రంగంపై ప్రభావం తక్కువగానే కనిపించింది. గ్రామాల్లో ఆర్థిక పరిస్థితి బాగుంది గ్రామీణ ప్రాంతంలో పనులకు డిమాండ్ అధికంగా ఉండడం వల్లే చేతి వృత్తుదారులకు, వ్యవసాయ కార్మికులకు కూలీ రేట్లు బాగా పెరిగాయి. కరోనా సమయంలోనూ గ్రామీణ ఎకనామీ సైకిల్ యాక్టివ్గానే ఉందన్నది వాస్తవం. పనులకు డిమాండ్ పెరగడానికి ఇదే కారణం. గడిచిన ఏడాదిలో హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ (ధరల సూచీ)లో 8.5 శాతం, ఉత్పత్తి రంగంలో 7.5 శాతం మాత్రమే పెరుగుదల ఉంది. అదే సమయంలో గ్రామాల్లో వ్యవసాయ కూలీల రోజు వారీ కూలీ రేట్లలో మాత్రం æ13 శాతం పెరుగుదల కనిపించింది. మహిళా వ్యవసాయ కూలీల రోజు వారీ వేతనం 12 శాతం పెరిగింది. చేతివృత్తి పని వారి వేతనాలు 9 శాతం దాకా పెరుగుదల కనిపించింది. – ప్రొఫెసర్ ఎం. ప్రసాదరావు, ఆర్థిక శాస్త్ర విభాగాధిపతి, ఆంధ్ర విశ్వవిద్యాలయం చదవండి: ‘యాస్’ తుపాను కారణంగా పలు రైళ్లు రద్దు -
గ్రామీణ ఆర్థిక వ్యవస్థే ఆశాకిరణం
ముంబై: గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దన్నుతో కరోనా సంక్షోభం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంటుందన్న అంచనాను హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ వ్యక్తం చేశారు. అంచనాల కంటే ముందే దేశ ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యాన్ని సంతరించుకుంటుందన్నారు. లాక్డౌన్ చర్యలను జూలై ఆఖరుకు పూర్తిగా ఎత్తివేస్తే భారత జీడీపీ 2020–21లో హీనపక్షం మైనస్ 5 శాతానికి పడిపోవచ్చని చాలా సంస్థలు అంచనాలను ఇప్పటికే విడుదల చేశాయి. గరిష్టంగా మైనస్ 7.5 శాతం వరకు క్షీణించొచ్చని పేర్కొన్నాయి. ‘‘దేశ ఆర్థిక వ్యవస్థ చక్రాలు కదలడం మొదలైనట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి. మే నెలలో నిరుద్యోగం గరిష్ట స్థాయికి వెళ్లి క్రమంగా తగ్గడం మొదలైంది. డిజిటల్ లావాదేవీలు జోరందుకున్నాయి. జీఎస్టీ వసూళ్లు తిరిగి 90,000 కోట్ల స్థాయిని చేరాయి. సకాలంలో వర్షాల ఆగమనంతో ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్లకు డిమాండ్ పెరిగింది’’ అని చెప్పారు. -
గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు నాబార్డ్ చేయూత
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, గ్రామీణ రుణ వ్యవస్థకు చేయూతనిచ్చేందుకు జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు నాబార్డ్ సుముఖత వ్యక్తం చేసినట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు వెల్లడించారు. నాబార్డ్ సీజీఎం వైకే రావుతో మంత్రి కేటీఆర్ శుక్రవారం ప్రగతిభవన్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో నాబార్డ్ భాగస్వామ్యానికి ఉన్న అవకాశాలపై మంత్రి చర్చించారు. రాష్ట్రంలో సాగు నీటి ప్రాజెక్టులు పూర్తి అవుతుండటంతో వ్యవసాయ ఉత్పత్తి గణనీయంగా పెరిగే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని మంత్రి వివరించారు. ఐటీ శాఖ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మెరుగు పరిచడం ద్వారా ఇంటింటికీ ఇంటర్నెట్ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అది అందుబాటులోకి వస్తే వ్యవసాయ రంగంలో మార్పులు వస్తాయని, ఈ నేపథ్యంలో తెలంగాణ ఫైబర్ గ్రిడ్‌కు రుణసాయం అందించాల్సిందిగా కోరారు. పాడి పరిశ్రమను ప్రోత్సహించండి పాడి పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు నాబార్డ్ ఇస్తున్న రుణాలను మరింత విస్తృతం చేయాలని కేటీఆర్ కోరారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల జిల్లాల్లో అర్హులైన వారికి పాడి పశువులు అం దించేందుకు నాబార్డు ముందుకు వస్తే తాము సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రెండు వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం తో నిర్మించే 500 గోదాములకు ఆర్థిక సాయం అందించాలని నాబార్డ్ సీజీఎంకు మంత్రి విజ్ఞప్తి చేశారు. రైతుబంధు కమిటీలను బలోపేతం చేస్తున్నందున వీటి ద్వారా వ్యవసాయ రంగానికి రుణాలను అందించే విషయాన్ని పరిశీలించాలన్నారు. నాబార్డు స్ఫూర్తికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వ్యవసాయ రంగ అభివృద్ధి కార్యక్ర మాలు ఉన్నాయని బ్యాంకు సీజీఎం వైకే రావు వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన సీజీఎం వివి ధ కార్యక్రమాల్లో భాగస్వామ్యం వహించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, రైతు బంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, టెస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు పాల్గొన్నారు. -
గ్రామాల్లో తగ్గి పట్టణాల్లో పెరిగిన నిరుద్యోగం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య ఆరు లక్షలకు చేరువైందనే విచారకర వార్తలతోపాటు లాక్డౌన్ కారణంగా దేశంలో అనూహ్యంగా పెరిగి పోయిన నిరుద్యోగుల సంఖ్య లాక్‌డౌన్‌కు ముందున్న పూర్వ స్థితికి చేరుకుందన్న మంచి వార్త కూడా వెలువడింది. లాక్డౌన్ కాలం నాటికి దేశంలో నిరుద్యోగుల సంఖ్య 8.5 శాతానికి చేరుకుంది. అది కూడా గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనంతకన్నా ఎక్కువ. లాక్డౌన్ కారణంగా 8.5 శాతం ఉన్న నిరుద్యోగుల సంఖ్య మూడు నెలల కాలంలోనే మే నెల మూడవ తేదీ నాటికి 27.1 శాతానికి చేరుకుంది. లాక్డౌన్ సందర్భంగా పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగుల సంఖ్య దారుణంగా పెరిగిపోగా గ్రామీణ ప్రాంతాల్లో తగ్గుతూ వచ్చింది. లాక్డౌన్ సందర్భంగా పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగుల సంఖ్య 9 శాతం నుంచి దాదాపు 28 శాతానికి పెరిగి, జూన్ 21వ తేదీ నాటికి 11 శాతానికి పడి పోయింది. అదే గ్రామీణ ప్రాంతాల్లో జూన్ 21వ తేదీ నాటినికి నిరుద్యోగుల సంఖ్య 7.26 శాతానికి పడిపోయింది. లాక్డౌన్ విధించడానికి పూర్వం అక్కడ నిరుద్యోగుల సంఖ్య 8.3 శాతంగా ఉంది. లాక్‌డౌన్‌కు ముందు దేశంలో ఉన్న నిరుద్యోగుల సంఖ్య ఎంతుందో, లాక్డౌన్ తదనంతరం మళ్లీ ఆ స్థాయికి చేరుకోవడం సంతోషకరమైన మాటే అయినప్పటికీ పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగుల సంఖ్య పెరగడం, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వేతనాలు, కూలీ రేట్లు పడిపోవడం విచారకరం. ఏడాది క్రితం ఉన్న వేతనాలకన్నా తక్కువ ఇస్తున్నారని, భవిష్యత్తులో పెంచుతారనే ఆశ కూడా లేకుండా పోయిందని పలు ప్రైవేటు కంపెనీల ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే ప్రజా పంపిణీ వ్యవస్థ కింద ఉచిత బియ్యం సరఫరాను మరో మూడు నెలలపాటు పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ నిన్ననే ప్రకటించారు. ఇంకా దేశంలో ఆహార నిల్వలు పది కోట్ల టన్నులకుపైగా ఉండడంతో ఈ స్కీమ్ పెద్దగా భారం కాదని బీజేపీ నాయకులు చెబుతున్నారు. -
గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజం
న్యూఢిల్లీ: ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం ప్రకటించిన ఐదో ప్యాకేజీతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజం ఖాయమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ధీమా వ్యక్తం చేశారు. కరోనా వ్యాప్తి వల్ల దెబ్బతిన్న వ్యాపార, వాణిజ్య రంగాలు కచ్చితంగా పుంజుకుంటాయని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ట్వీట్ చేశారు. పబ్లిక్ సెక్టార్ యూనిట్లకు ఈ ప్యాకేజీ ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. ఉద్దీపనతో దేశంలో ఆరోగ్య, విద్యా రంగాల్లో సానుకూల మార్పు వస్తుందని తెలిపారు. ఆ పాట స్ఫూర్తిదాయకం: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ‘ఆత్మ–నిర్భర్ భారత్’ పిలుపును అందిపుచ్చుకుని 211 గాయకులు కలిసి ఆలపించిన కొత్త పాట దేశ ప్రజలను ఆకట్టుకుంటోంది. ఈ పాట విషయంలో ప్రముఖ గాయని లతా మంగేష్కర్ చేసిన ట్వీట్‌పై మోదీ ఆదివారం ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఆ పాటను తాను విన్నానని, అందరిలోనూ స్ఫూర్తిని రగిలించేలా ఉందని ప్రశంసించారు. -
కులవృత్తులకు ప్రభుత్వ ప్రోత్సాహం: తలసాని
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కులవృత్తులను ప్రోత్సహిస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. బుధవారం పీపుల్స్ ప్లాజాలో సమీకృత మత్స్య అభివృద్ది పథకం, ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మత్స్యకారులకు మోపెడ్, 4 చక్రల వాహనాలను అందజేసి వారి ఆర్థికాభివృద్దికి కృషి చేస్తున్నామన్నారు మత్స్యకారుల కుటుంబంలో ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే రూ.6 లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తున్నామన్నారు. మిషన్ కాకతీయ కింద పునరుద్ధరించిన చెరువుల ద్వారా మత్స్యకారులు సర్వతోముఖాభివృద్ధికి బాట లు వేసుకోవాలని మహమూద్ అలీ ఆకాంక్షించారు. -
కేసీఆర్ కిట్‌తో మారిన పరిస్థితి
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ కిట్ పథకంతో ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రసవాల సంఖ్యను పెంచి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, బాలింతల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కిట్ పథకాన్ని ప్రారంభించింది. 2017 జూన్ 3న సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించారు. పేద కుటుంబాల్లోని మహిళలకు ప్రసవాల కారణంగా కలిగే ఆర్థిక భారాన్ని తగ్గించడం, క్లిష్ట సమయంలో ఆర్థిక సహాయం చేయడం ప్రధాన ఉద్దేశంగా ఈ పథకం అమలవుతోంది. నాలుగు దశలుగా ఈ డబ్బులను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. శిశువుకు వ్యాక్సిన్ వేసే రోజులకు అనుగుణంగా నగదు జమ చేసేలా పథకం రూపొందించారు. కాన్పు జరిగిన వెంటనే శిశువు సంరక్షణ కోసం ప్రత్యేకంగా 15 వస్తువులతో కూడిన కిట్‌ను అందిస్తున్నారు. మొత్తంగా మాతాశిశు ఆరోగ్య రక్షణ లక్ష్యంగా ఈ పథకం అమలవుతోంది. కేసీఆర్ కిట్ పథకం మొదలై ఏడాది పూర్తయిన నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ ఈ వివరాలను వెల్లడించింది. - కేసీఆర్ కిట్ పథకం అమలులోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 10,14,168 మంది గర్భిణులు వైద్య పరీక్షలకోసం నమోదు చేసుకున్నారు. ఇప్పటికి 2,44,387 కాన్పులు జరిగాయి. ప్రభుత్వం ఇప్పటికి రూ.259.59 కోట్లను విడుదల చేసింది. - రాష్ట్రంలో సగటున ప్రతి నెల 50 వేల కాన్పులు జరుగుతున్నాయి. కేసీఆర్ కిట్ పథకం అమలుకు ముందు గత ఏడాది ఏప్రిల్‌లో ప్రభుత్వ ఆస్పత్రులలో 20 వేల కాన్పులు జరిగేవి. అనంతరం పరిస్థితి మారింది. 2017 అక్టోబర్‌లో ప్రైవేటు ఆస్పత్రులలో కాన్పుల సంఖ్య ఏకంగా 27 వేలకు పెరిగింది. కాస్త అటుఇటుగా ఇదే తీరు కొనసాగుతోంది. - ప్రైవేట్ ఆస్పత్రులలో ఒక్కో కాన్పుకోసం సగటున రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కేసీఆర్ కిట్ పథకంతో పేద కుటుంబాలకు ఈ భారం లేకుండాపోయింది. రాష్ట్రంలోని 8.28 లక్షల కుటుంబాలకు రూ.20 వేల చొప్పున ఆదా అయ్యాయి. -
గ్రామీణ ఆర్థిక వ్యవస్థే లక్ష్యం
జహీరాబాద్/సంగారెడ్డి జోన్/సంగారెడ్డి క్రైం: గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకెళ్తున్నారని, కుల వృత్తుల సంక్షేమానికి ఆయన కంకణబద్ధులయ్యారని భారీ నీటిపారుదల శాఖమంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సంగారెడ్డి జిల్లాలో మంత్రి సుడిగాలి పర్యటన చేశారు. శనివారం అర్ధరాత్రి వరకు జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాత్రికి అక్కడే బస చేసిన ఆయన ఆదివారం ఉదయం సైకిల్‌పై జహీరాబాద్ మున్సిపాలిటీని చుట్టేశారు. ఉదయం 7 నుంచి 9.30 గంటల వరకు పలు వార్డుల్లో ఏదీ వదిలిపెట్టకుండా కలియతిరిగారు. ప్లాస్టిక్ కవర్లను మున్సిపాలిటీలో పూర్తిగా నిషేధించాలని, ఇంటింటికీ వెళ్లి తడి, పొడి చెత్తను విడివిడిగా సేకరించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బస్టాండ్ పక్కన ఓ టిఫిన్ సెంటర్ వద్ద ఆగి కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్‌తో కలిసి టీ తాగారు. అనంతరం మోటార్ సైకిల్‌పై తిరుగుతూ హిందూ శ్మశానవాటిక, రైల్వేట్రాక్‌ను సందర్శించారు. సంగారెడ్డిలో నిర్వహించిన మత్స్యకారుల అవగాహన సదస్సు, బేడ బుడగ జంగం జిల్లా సభలో హరీశ్ మాట్లాడారు. ఈ ఏడాది మత్స్యకారుల అభివృద్ధి కోసం రూ.1,050 కోట్లను కేటాయించిందన్నారు. నాణ్యమైన చేప పిల్లలను ఉత్పత్తి చేసుకుంటే జిల్లాస్థాయి సంఘానికి రూ.5 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. వ్యక్తిగతంగా 80 శాతం, సొసైటీకి 90 శాతం, జిల్లా సంఘానికి వందశాతం సబ్సిడీపై రుణాలు అందజేస్తున్నామని చెప్పారు. బుడగ జంగాలకు రాజకీయాల్లో ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. -
కబ్జా చేస్తే కటకటాలే!
♦ ‘చెరువుల రక్షణ, నిర్వహణ చట్టం’ ముసాయిదా రూపకల్పన ♦ ఎలాంటి వారంట్ లేకుండా అరెస్ట్, ఏడాది పాటు జైలు శిక్ష ♦ అక్రమ నిర్మాణాలు చేపడితే స్వాధీనం.. కలుషితం చేసినా, వ్యర్థాలు వేసినా చర్యలు ♦ నిర్లక్ష్యం చేసే అధికారులకూ శిక్ష విధింపు ♦ రాష్ట్ర, జిల్లా స్థాయిలో చెరువుల పరిరక్షణకు అథారిటీలు సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పట్టుగొమ్మలుగా ఉన్న చెరువులను కబ్జా కోరల్లోంచి కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. చెరువు పరిధి, శిఖం భూమిని కబ్జా చేస్తే నేరుగా జైలుకు పంపేలా కఠిన చట్టాన్ని తీసుకువస్తోంది. కబ్జాలతో పాటు చెరువులను కలుషితం చేసే, దెబ్బతీసే ఎలాంటి చర్యలకు పాల్పడినా శిక్ష పడనుంది. ఎలాంటి వారంట్ లేకుండా అరెస్ట్ చేసేలా, కనీసం ఏడాది జైలుశిక్ష పడేలా ముసాయిదాను రూపొందించింది. ‘చెరువుల రక్షణ, నిర్వహణ చట్టం-2015’ పేరుతో తయారు చేసిన ఈ ముసాయిదాలో... చిన్న నీటి వనరులను సాగు, తాగు, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం, చేపల పెంపకాన్ని ప్రోత్సహించడం, సాధారణ ప్రజల అవసరాలకు సమర్థవంతంగా చెరువు నీటిని వినియోగించుకునే అవకాశాన్ని కల్పించింది. నీటి కాలుష్యాన్ని, కబ్జాలను నివారించేలా కఠిన చర్యలను అమల్లోకి తెస్తోంది. ఈ ముసాయిదాపై ఇప్పటికే ఉన్నత స్థాయిలో చర్చించిన ప్రభుత్వం... అభిప్రాయం చెప్పాలంటూ జిల్లాల అధికారులకు ముసాయిదాను అందజేసింది. వారి సూచనలు స్వీకరించాక అవసరమైన మార్పులు, చేర్పులు చేసి.. చట్టాన్ని అమల్లోకి తేనున్నారు. గతేడాది అక్టోబర్‌లో చెరువుల సమగ్ర సర్వే ద్వారా రాష్ట్రంలో 46,531 చెరువులను గుర్తించిన సమయంలోనే... వేల సంఖ్యలో చెరువుల కింది శిఖం భూములు కబ్జా అయినట్లు నీటి పారుదల శాఖ తేల్చింది. చెరువుల పూడిక పనుల అంచనాల నిమిత్తం జరిపిన సర్వేలోనూ భారీగా కబ్జాలను గుర్తించింది. చెరువు పూర్తినిల్వ సామర్థ్యం(ఎఫ్టీఎల్) పరిధిలోకి కబ్జాలు చొచ్చుకురావడంతో చెరువుల పరిధి కుచించుకు పోయిందని నిర్ధారించింది. ఈ నేపథ్యంలో చెరువుల రక్షణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉక్కుపాదమే.. తాజాగా ప్రభుత్వం సిద్ధం చేసిన 30 పేజీల ముసాయిదా ప్రకారం... చెరువులను నీటి నిల్వ కోసం మినహాయించి ఏ ఇతర అవసరాల కోసం వాడినా కఠిన చర్యలుంటాయి. చెరువు సరిహద్దు నుంచి 30 మీటర్ల దూరం లోపల ఉన్న భూముల్లో ఎలాంటి వాణిజ్య, గృహ, పారిశ్రామిక సముదాయాలు నిర్మించరాదు. అక్రమ నిర్మాణాలు చేపడితే వాటిని స్వాధీనం చేసుకోవచ్చు. చెరువుల్లోకి నీరు వచ్చే ప్రవాహ మార్గాలకు ఎలాంటి ఆటంకం కలిగించరాదు. మున్సిపల్ వ్యర్థాలు కానీ, బురదనుకానీ, రసాయన వ్యర్థాలనుకానీ చెరువులో వేయరాదు. ప్రభుత్వ అనుమతి లేకుండా చెరువు పరిధిలో ఎలాంటి రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణం చేపట్టరాదు. శుద్ధి చేయని జలాలను పంపకూడదు. వీటిని ఎక్కడైనా ఉల్లంఘిస్తే.. ఆ ఆక్రమణకు ఉపయోగించే పరికరాలు, వస్తువులు, వాహనాలను సీజ్ చేసే అధికారాన్ని అధికారులకు కట్టబెట్టారు. అంతేగాకుండా ఆక్రమణ దారులను ఎలాంటి వారెంట్ లేకుండానే అరెస్టు చేసే అధికారం కూడా ఉంటుంది. ఈ చట్టం కింద నేరం రుజువైతే కనీసం ఏడాది జైలు శిక్ష పడేలా నిబంధనలు విధించారు. ఇదే సమయంలో చట్టవిరుద్ధంగా చెరువులు ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమైతే వారిని కూడా శిక్షించనున్నారు. -
సాగు భారమంతా స్త్రీలపైనే!
వ్యవసాయ రంగాన్ని చుట్టుముట్టిన సంక్షోభమే రైతన్నల ఆత్మహత్యలకు, వలసలకు మూలకారణం. బాధిత రైతు కుటుంబాలలో మహిళలే వ్యవసాయాన్ని భుజాన వేసుకోవాల్సిరావడం వల్ల.. సంక్షోభ భారమంతా వారిపైనే పడుతున్నది. మహిళా రైతుల సహకార సంఘాలు ఏర్పాటు చేసి వనరులను అందుబాటులోకి తేవడం తక్షణావసరం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మహిళలే వెన్నెముక. పంటల సాగు, విత్తనాల సంరక్షణ, పశుపోషణ, పెరటి కోళ్ల పెంపకం, అటవీ ఫలసాయ సేకరణ, చేపల పెంపకం- శుద్ధి, అమ్మకంతోపాటు చేనేత రంగాలతో కూడిన గ్రామీణ ఉత్పత్తి వ్యవస్థలో దళిత, బహుజన, ఆదివాసీ మహిళలే ప్రధాన భూమిక పోషిస్తున్నారు. అయితే, వీరికి ఆయా జీవనోపాధుల్లో నిర్ణయాధికారం, ఆస్తిహక్కులు, ఆదాయంపై నియంత్రణ అనేవి లేవు. పురుషులతో సమానంగా పనిచేసినప్పటికీ సమాన వేతనాలు దక్కటం లేదు. వ్యవసాయంలో, పశుపోషణలో 60-80 శాతానికి పైగా పనులు చేస్తూ మహిళలు కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. మహిళా వ్యవసాయ కూలీల కన్నా మహిళా సాగుదారుల సంఖ్య, వారికన్నా మహిళా భూ యజమానుల సంఖ్య తక్కువగా ఉంది. తాజా గణాంకాల ప్రకారం.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 26% భూ కమతాలు మహిళల పేరిట ఉన్నాయి. మొత్తం సాగుదార్లలో మహిళలు తెలంగాణలో 36% ఉంటే.. ఆంధ్రప్రదేశ్‌లో 30% ఉన్నట్లు 2011 జనాభా గణాంకాలు చెబుతున్నాయి. వ్యవసాయకూలీల్లో తెలంగాణలో 57% మంది, ఆంధ్రప్రదేశ్‌లో 51% మంది మహిళలున్నారు. ఇటు ఆత్మహత్యలు.. అటు వలసలు.. 1991 తర్వాత అమల్లోకొచ్చిన నూతన ఆర్థిక సంస్కరణలు, వాటి కనుసన్నల్లో రూపొందిన వ్యవసాయ విధానాలు కంపెనీలకు పెద్ద పీట వేసి వ్యవసాయ రంగంలో పెనుమార్పులు తెచ్చాయి. ఫలితంగా ఈ రంగంలో ప్రభుత్వరంగ పెట్టుబడులు తగ్గిపోయి రైతులకు అంద వలసిన సబ్సిడీలు తగ్గాయి. విత్తనాలు, రసాయనిక ఎరువులు, క్రిమి సంహారక మందుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీనితో వ్యవసాయంలో ఖర్చులు పెరిగి తగినంత దిగుబడులు రాక, వచ్చినా గిట్టుబాటు ధరలు లేక రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. చాలా మంది రైతులు వ్యవసాయం వదిలిపోతున్నారు. వ్యవసాయం నుంచి సరిపడినంత ఆదాయం రాకపోవటంతో చాలా గ్రామాల్లో పురుషులు ఇతర జీవనోపాధులను వెతుక్కుంటూ వలస పోతున్నారు. ఆ కుటుంబాలలో మహిళలే వ్యవసాయాన్ని భుజాన వేసుకుంటున్నారు. దానితో సంక్షోభ భారమంతా వారిపైనే పడుతున్నది. స్త్రీల పేరు మీద భూమి పట్టాలు లేకపోవటం, వారు కౌలు చేస్తూ ఉండటం, వారికి రైతులుగా గుర్తింపు లేకపోవటంతో వారికి ప్రభుత్వం నుంచి అందవలసిన రుణ సదుపాయం కానీ, కరువుభత్యం కానీ అందటం లేదు. అందుకే సంక్షోభ భారం మహిళలపై మరింత అధికంగా ఉంటున్నది. పైగా వారు ఇంటి పని, కుటుంబ పోషణ, పిల్లల పెంపకం వంటి పనులను పురుషులకంటే అదనంగా చేస్తున్నారని గుర్తించాలి. నిర్ణాయక పాత్రను కోల్పోయిన మహిళలు వ్యవసాయ రంగంలో మార్కెట్ శక్తుల నియంత్రణ పెరిగింది. మార్కెట్ కోసం(పత్తి లాంటి) వాణిజ్యపంటలు పండించటం ఎప్పుడయితే విపరీతమైందో ఆ తర్వాత.. మహిళలు సంప్రదా యకంగా ఆహార పంటల సాగులో కలిగి ఉన్న జ్ఞానాన్ని, నిర్ణాయక పాత్రను కోల్పోయారు. చాలా వరకు శ్రామికులుగానే మిగిలిపో తున్నారు. వ్యవసాయంలో మహిళలు చేసే పనులన్నీ అత్యధిక శ్రమతో కూడుకున్నవి. నాట్లు వేయటం, కలుపు తీయటం, కోత కోయటం, నూర్చటం, ధాన్యాన్ని శుద్ధి చేయటం వంటి పనులన్నీ రోజంతా వంగబడి చేసే పనులు. ఇట్లా గంటల తరబడి వంగి పనులు చేయటం వల్ల కాళ్ల నొప్పులు, నడుము నొప్పి, వెన్ను నొప్పి వంటి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. దీనితోపాటు వంగినప్పుడు (నిలబడినప్పటికంటే) తక్కువ ప్రాణవాయువు లభిస్తుంది. కాబట్టి శరీరానికి కావలసిన ప్రాణవాయువు దొరక్క రక్త ప్రసరణ సరిగ్గా జరగదనీ, ముఖ్యంగా ప్రసవ సమయంలో తీవ్రమైన సమస్యలు తలెత్తుతున్నాయని సమాచారం. ప్రభుత్వ విధానాలు, చట్టాలు, పథకాలు మహిళా రైతులకు కొంత వరకు మేలు చేసేవిగా ఉన్నప్పటికీ, వాటి అమల్లో ప్రభుత్వ శాఖల్లో ఉన్న అలసత్వం, సమాజంలో పాతుకుపోయిన పితృస్వామిక విలువల కారణంగా మహిళలకు ప్రయోజనం కలగటం లేదు. కొడుకులతో సమానంగా కూతుళ్లకు వ్యవసాయ భూమిని పంచి ఇవ్వాలనే హిందూ వారసత్వ సవరణ చట్టం అమలు నిరాశాజనకంగా ఉంది. మహిళా రైతు సహకార సంఘాలతో సత్ఫలితాలు వ్యవసాయంలో ఆహారోత్పత్తిలో కీలకమైన పాత్ర పోషిస్తున్న మహిళా రైతుల సాధికారత పెంచాలంటే ముందుగా వారికి భూమి హక్కులు కల్పించాలి. ప్రభుత్వ భూ పంపిణీ పథకంలో భాగంగా కొంత వరకు భూమి లేని పేద మహిళలకు భూమి పట్టాలు లభించాయి. రాళ్లూ రప్పలతో నిండి గ్రామాలకు దూరంగా గుట్టల్లో ఉన్న ఆ భూమిని సాగులోకి తెచ్చుకోవలసి రావడం మహిళలకు అధిక భారమే అయింది. వారికి సాగు యోగ్యమైన సారవంతమైన భూములను ఇవ్వాలి. సాగు నీటి వసతికి గ్రామ చెరువుల పునరుద్ధరణ వంటి పరిష్కారాలను వారి భాగస్వామ్యంతో నిర్వహించాలి. గ్రామస్థాయిలో మహిళా రైతుల సహకార సంఘాలు ఏర్పాటు చేసి.. వారికి అవసరమైన విత్తనాలు, ఉత్పాదకాలు, పశుసంపద, రుణ సదుపాయాలు, సమాచారం, వ్యవసాయ పనిముట్లు, పరికరాలు, మార్కెటింగ్ సదుపాయాలు వంటివి అన్నీ ఒకే చోట అందజేయాలి. వ్యవసాయ పనుల్లో మహిళల శారీరక శ్రమను తగ్గించే సాంకేతికతలపై పరిశోధనలు నిర్వహించి, ఆ పరిశోధనా ఫలాలను వారికి అందించాలి. మహిళా రైతులు సమిష్టిగా సాగు చేసుకుంటూ రసాయనిక పురుగు మందులు లేకుండా వైవిధ్యమైన ఆహార పంటలను పర్యావరణానికి, మనుషులకు, పశువులకు ఆరోగ్యకరమైన విధంగా పండిస్తున్న మంచి ఉదాహరణలు మన రాష్ట్రంలోనే మన కళ్ల ముందు అమల్లో ఉన్నాయి. అటువంటి పంటల సాగును, సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహించి వ్యవసాయాన్ని సంక్షోభం నుంచి బయట పడవేసే విధానాలకు నాంది పలకాలి. ఇప్పటి వినాశకర వ్యవసాయాన్ని కొనసాగించటం ఇక ఎంతోకాలం సాధ్యంకాదు. మహిళా రైతులతోనే మార్పు సాధ్యమవుతుందని గుర్తించాలి. - ఎస్. ఆశాలత కన్వీనర్, రైతు స్వరాజ్య వేదిక -
మళ్లీ ‘మైక్రో’ కోరలు
కొత్తగూడెం: మైక్రోఫైనాన్స్ సంస్థలు మళ్లీ కోరలు చాస్తున్నాయి. రెండేళ్లుగా స్తబ్దుగా ఉన్న సంస్థలు పల్లెలను పట్టిపీడించేందుకు సిద్ధమవుతున్నాయి. మైక్రోఫైనాన్స్ ముసుగులో అధిక వడ్డీలు, అనేక రకాల స్కీములతో పల్లె ప్రజలను వంచించిన ఇవి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసేందుకు అడుగులు వేస్తున్నాయి. ‘మైక్రో’ ప్రతినిధులు గతంలో ఆ సంస్థల వద్ద రుణాలు తీసుకున్న వారి ఇళ్లకు వెళ్లి మళ్లీ అప్పు ఇస్తామంటూ మభ్యపెడుతున్నారు. గత అనుభవాల దృష్ట్యా చాలామంది రుణాలు తీసుకునేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నా ఆ సంస్థల ప్రతినిధులు అలుపెరగకుండా ఇళ్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. గత రుణాలు రద్దు చేశాం...కొత్త రుణాలు తీసుకోడంటూ మభ్యపెడుతున్నారు. ఐదేళ్ల క్రితం... ఐదేళ్ల క్రితం సుమారు పది వరకు మైక్రో ఫైనాన్స్ సంస్థలు ఉండేవి. ఇవి గ్రామీణ మహిళల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుస్తామని..రుణాలు ఇస్తామని గ్రామాల్లో సంచరిస్తుండేవి. మహిళలను గ్రూప్‌లుగా తయారు చేసి రుణాల పేరుతో అక్రమంగా రూ.కోట్లు వసూలు చేసేవి. తొలుత ఒక్కొక్కరికి రూ.5,000 రుణం ఇచ్చేవి. డాక్యుమెంటేషన్ చార్జీ పేరుతో దీనిలో రూ.500 కోత విధించేవి. ప్రతివారం పొదుపు పేరుతో సభ్యుల నుంచి అదనంగా కొంతమొత్తం వసూలు చేసేవి. గ్రూప్ సభ్యురాళ్లలో ఎవరైనా ఓ వారం వాయిదా చెల్లించకపోతే మిగిలిన వారిని కూడా అక్కడే కూర్చోబెట్టి ఫైనాన్స్ సంస్థల ప్రతి నిధులు వేధింపులకు పాల్పడేవారు. ఇలా పొదుపులు, ఇన్సూరెన్స్ పేరుతో కోట్లు దండుకున్నారు. ఈ దోపిడీని భరించలేక మహిళలు మైక్రోఫైనాన్స్ సంస్థల ప్రతినిధులపై తిరగబడ్డారు. మైక్రో సంస్థల ఆగడాలపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించడంతో అవి తోక ముడిచాయి. పాత బకాయిల వసూళ్ల కోసమేనా..? గతంలో మైక్రోఫైనాన్స్ నిర్వహించిన పలు సంస్థల ప్రతినిధులపై పోలీసుల దాడులు చేశారు. ఆయా సంస్థలను మూసివేయించారు. ఆ క్రమంలో లక్షలాది రూపాయలు ఫైనాన్స్ రూపంలో తీసుకున్న ప్రజలవద్ద ఉండిపోయాయి. ఆ పాత బకాయిలను మాఫీ చేసేశాం...కొత్త రుణాలు తీసుకోడంటూ ఆ సంస్థల ప్రతినిధులు కొత్త పల్లవి ఎత్తుకున్నారు. గ్రామాల్లో తిరుగుతూ ప్రజలను మభ్యపెడుతున్నారు. ఏదో ఒక రకంగా పాత రుణాలను వసూలు చేయాలనే లక్ష్యంతో ఓ పథకం ప్రకారం పల్లెల్లో సంచరిస్తున్నట్లు సమాచారం. కొత్త రుణాలు తీసుకునేందుకు ప్రజలు అయిష్టత వ్యక్తం చేస్తున్నా సంస్థ ప్రతినిధులు మాత్రం వారిపై ఒత్తిడి తీసుకొస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం వ్యవసాయ సీజన్ కావడం, పెట్టుబడులకు డబ్బు అవసరం ఉండటంతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ ఫైనాన్స్ సంస్థలు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నట్లు సమాచారం. ఈ మైక్రో ఏజెంట్ల ఉచ్చులో పడి కొందరు గ్రామీణులు ఇప్పటికీ మోసపోతున్నట్లు తెలుస్తోంది. -
హరితమే నగరానికి హితం
నేడు ధరిత్రి దినోత్సవం ఈ యేటి ధరిత్రీ దినాన్ని ‘హరిత నగరాల’ కోసం ప్రత్యేకమైందిగా ప్రకటించింది ఐక్యరాజ్యసమితి. ఇప్పటికే మన మహానగరాలన్నీ కిక్కిరిసిన జనాభాతో కిటకిటలాడుతున్నాయి. ఉండకూడనంత జనసాంద్రత నగరాల్లో పెరిగిపోయింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమై, వలసలు మితిమీరి నగరాలు ఇబ్బడిముబ్బడిగా జనమయమవుతున్నాయి. గోదావరి ఒడ్డు నుంచి లారీల్లో ఇసుక వస్తుంది.... కృష్ణా నుంచి పైపుల్లో నీళ్లొస్తాయి... రామగుండంలో ఉత్పత్తయ్యే విద్యుత్తు తీగల గుండా చేరుకుంటుంది.... రూర్కీలో రూపుదిద్దుకునే ఇనుము పెద్ద పెద్ద వాహనా ల్లో ఇక్కడికి రవాణా అవుతుంది... పల్నాడులో తయా రయ్యే సిమెంట్ వ్యాగన్లలో వచ్చి చేరుతుంది... పల్లెసీ మల్లో పండే పంట దినుసులు పలు దఫాలుగా దిగిపో తాయి... ఇలా ఎక్కడెక్కడో ఉత్పత్తి అయ్యే రకరకాల సరుకు హైదరాబాద్ మహానగరానికి చేరు కొని ఇక్కడ వినియోగమవుతుంది. మరిక్క డేం ఉత్పత్తి అవదా! అంటారా? అవు తుంది, ఇలా వచ్చి చేరిన సమస్త వస్తు విని యోగం పూర్తయ్యాక ఇక్కడ చెత్త ఉత్పత్తి అవుతుంది. లక్షలు, కోట్ల టన్నుల చెత్త ఉత్పత్తి అయి, ఎక్కడ వేయాలో తెలియని పరిస్థితుల్లో నగరం నడుమో, చుట్టుపక్కల్నో గుట్టలు గుట్టలుగా పోగుపడి పోతుంది. ముక్కు పుటాలదిరే దుర్గంధమై వెదజల్లు తుంది. మోరీలు, పైపులైన్లు, కాలువలుగా వచ్చి చేరే మురికినీరు మూసీ అయి పరవళ్లు తొక్కుతుంది. పోయింది పోను మిగిలింది మట్టిలోకి ఇంకి భూగర్భజ లాల్నీ కలుషితం చేస్తుంది. ఫ్యాక్టరీ పొగగొట్టాలు, వాహ నాల నుంచి వచ్చే ఉద్గారాలు వాయువునీ కలుషితం చేసి వాతావరణాన్ని కాలుష్యంతో నింపేస్తాయి... ఇవన్నీ కలిసి మనిషిని మెలమెల్లగా చంపేస్తాయి. చచ్చేలోపు ప్రాణాంతక జబ్బులై శరీరాన్ని పీల్చి పిప్పిచేస్తాయి. కాదంటే, జీవన ప్రమాణాల్ని అట్టడుక్కు దిగజారు స్తాయి. ఇదీ మన మహానగరం స్థితి! దాదాపు మన అన్ని మహానగరాల దుస్థితీ ఇదే! ఎందుకంటే, మన మింకా మేలుకో లేదు. మొద్దు నిద్రలోనే ఉన్నాం. ప్రమా దాన్ని ముందే పసిగట్టి ప్రపంచమే కోడై కూస్తున్నా... మనం, విన(డం) లేదు, మన పెను నిద్దుర వదల(డం) లేదు. అందుకేనే మో! ఈ యేటి ధరిత్రీ దినాన్ని ‘హరిత నగరాల’ కోసం ప్రత్యేకమైందిగా ప్రకటించింది ఐక్యరా జ్యసమితి. ఇప్పటికే మన మహానగరాలన్నీ కిక్కిరిసిన జనాభాతో కిటకిటలాడుతున్నాయి. ఏ ప్రమాణాలతో చూసినా, ఉండకూడనంత జనసాంద్రత నగరాల్లో పెరి గిపోయింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమై, వల సలు మితిమీరి నగరాలు ఇబ్బడిముబ్బడిగా జనమయ మవుతున్నాయి. ఉన్న చెట్లు మిగలక, కొత్త చెట్లు పెంచక హరితం హరించుకు పోతోంది. మనకు స్పృహ లేక మన నగరాలన్నీ చూస్తుండగానే కాంక్రీట్ వనాలవుతు న్నాయి. రాను రాను ఇవన్నీ పెద్ద పెద్ద ఉష్ణద్వీపాలు (హీట్ ఐలాండ్స్)గా మారి గ్లోబల్ వార్మింగ్‌కు ఇవే ప్రధాన దోహదకాలవుతాయి. ఇదే ఒరవడి కొనసాగితే.. 21వ శతాబ్దాంతానికి 80 నుంచి 90 శాతం ప్రపంచ జనాభా నగరాల్లోనే కేంద్రీకృతమైతే.... భవిష్యత్తరాల వారి జీవన ప్రమాణాల సంగతేంటి? జీవనం గతేంటి? అందుకే, ఈ ధరిత్రీ దినం సందర్భంగానైనా మనం కొంత వాస్తవిక దృక్పథంతో ఆలోచించాల్సిన అవసరం ఉంది. సరికొత్త సంకల్పం తీసుకోవడానికిది తగిన సమయం. నాటి స్ఫూర్తి ప్రేరణ కావాలి సరిగ్గా 44 సంవత్సరాల కింద గెలార్డ్ నెల్సన్ అనే అమె రికన్ సెనెటర్‌కు ఒక సద్యోచన కలిగింది. వియత్నాం యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న అమెరికా జనావళిని, ముఖ్యం గా యువతను చూసిన తర్వాత ‘వామ్మో! ఒక అంశంపై జనాభిప్రాయం ఇంత సంఘటితమా!’ అన్న ఆశ్చర్యం కలిగింది. అలా అనుకొని ఆయన ఊరుకోలేదు. ఇటు వంటి శక్తిని ఇంకో ఉపయోగకరమైన అంశం వైపు మళ్లిస్తే? అన్న ఆలోచన మెరిసింది. తడవుగా మొదలైన యత్నం ఫలితంగానే, పర్యావరణ పరిరక్షణ ఉద్యమా నికి బీజం పడింది. 1962లో వచ్చి, 24 దేశాల్లో దాదాపు అయిదు లక్షల కాపీలు అమ్ముడు పోయిన ‘‘సెలైంట్ స్ప్రింగ్’’ అనే పుస్తకం చూపిన ప్రభావం కూడా తక్కువ దేమీ కాదు. ఏదైతేనేం, మొత్తం మీద మానవ భవిష్యత్ కోసం కాలుష్యం నుంచి గాలిని, నీటిని కాపాడుకోవా లనే స్పృహ రగిలింది. 1970 ఏప్రిల్ 22న దాదాపు రెండు కోట్ల మంది అమెరికన్లు వీధుల్లోకొచ్చారు. మాకు కావాల్సింది ‘ఆరోగ్యం-మనుగడ కల్గిన పర్యావరణం’ అని నినదించారు. తరాలకు సరిపడా ప్రేరణనిచ్చిన ఆ రోజే ధరిత్రీ దినమైంది. అదే క్రమంలో... ‘మానవ పర్యావరణం’ లక్ష్యంగా ఐక్యరాజ్యసమితి తొలి సదస్సు 1972 స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో జరిగింది. ఈ ఉద్యమాల పట్ల అవగాహన పెంచడమే కాకుండా, వాటి కొక అధికారిక భావన కలిగించి, ప్రభుత్వాల బాధ్యతను ఎత్తిచూపడానికి ఇదొక చక్కని వేదికయింది. ఈ సద స్సులో నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ కీలకోప న్యాసం చేశారు. ఐక్యరాజ్యసమితి నియమించిన ‘పర్యా వరణ అభివృద్ధి ప్రపంచ సంఘం’ (డబ్ల్యు.సి.ఇ.డి) 1987 ఇచ్చిన నివేదిక, విశ్వవ్యాప్తంగా ముంచుకు వస్తున్న ప్రమాదాలపై లోతైన పరిశీలనతో చేసిన హెచ్చ రిక అయింది. ధరిత్రీ దినం మొదలైన నుంచి సరిగ్గా ఇరవై యేళ్లకు 1990లో జరిగిన ధరిత్రీ సదస్సు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద కదలికే తెచ్చింది. 141 దేశాల్లోని సుమా రు 20 కోట్ల మంది ధరిత్రీ దినోత్సవంలో పాలుపంచుకు న్నారు. కార్యక్రమ నిర్వాహకులు మరో సత్సంకల్పం చేసుకున్నారు. 1992లో రియోడిజెనెరో (బ్రెజిల్)లో ఒక పెద్ద సదస్సును నిర్వహించాలని నిర్ణయించారు. పృథ్వి వేడెక్కిపోతున్న ప్రమాదకర పరిస్థితిని తీవ్రమైన అంశంగా పరిగణించిన ఈ సదస్సు గ్లోబల్ వార్మింగ్, క్లీన్ ఎనర్జీ అన్న అంశాలపై ప్రత్యేకంగా దృష్టి నిలిపింది. జీవ వైవిధ్య పరిరక్షణ, వాతావరణ మార్పులపై ప్రత్యే కంగా కమిటీలనే ఏర్పాటు చేసింది. అదే క్రమంలో... 2000 సంవత్సరంలో ఏర్పాటు చేసుకున్న ‘మిలీనియం గోల్స్’, 2010 ధరిత్రీ సదస్సు, తదనంతరం 2012 జోహన్నెస్‌బర్గ్ (దక్షిణాఫ్రికా) సదస్సు గానీ పర్యావరణ పరమైన స్పృహను, అప్రమత్తతను కీలకస్థాయికి తెచ్చా యనే చెప్పుకోవాలి. గ్లోబల్‌వార్మింగ్, ఫలితంగా వాతా వరణంలో వస్తున్న మార్పులు (క్లైమేట్ చేంజ్) పృథ్వీని ఏయే ప్రమాదపుటంచులకు నెడుతున్నాయో విస్పష్ట మైన చిత్రం ఆవిష్కృతమైంది. పరిష్కారాల కోసం తీవ్ర మైన వేట, ఆచరణ పర్వాలు మొదలయ్యాయి. కాలక్ర మంలో జనాభా కేంద్రీకృతమౌతున్న నగరాలూ, పట్టణా లపై దృష్టి కేంద్రీకరించడం అందులో భాగంగానే కనిపి స్తోంది. అందుకే ఐక్యరాజ్యసమితి ఈ సంవత్సరాన్ని హరితనగరాల కోసం ప్రత్యేకమని ప్రకటించింది. ఎన్ని పెద్ద పెద్ద సదస్సులు జరిగినా, ఉన్నత స్థాయి సమావే శాలు నిర్ణయాలు తీసుకున్నా... ప్రభావశీలురైన అగ్ర రాజ్యాలు కనబరిచే చిత్తశుద్ధి, చిన్న దేశాలు పాటించే నిబద్ధతను బట్టే పర్యావరణ పరిరక్షణలో ఫలితాలుంటా యనేది సర్వత్రా నిర్ధారణ అయిన సత్యం. అభివృద్ధి పేరుతో మనం కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నా మని, భవిష్యత్తరాల మనుగడను పణంగా పెట్టి మనం సాధిస్తున్నది అసలు అభివృద్ధే కాదని ఫ్రెంచ్ తత్వవేత్త రూసో అన్నది అక్షర సత్యం. మరేంటి పరిష్కారం అన్న విమర్శకులకు ఆయనే చెప్పిన సమాధానం ‘తిరిగి ప్రకృతిలోకే వెళ్లడం‘ అన్నది మరింత కాదనలేని సత్యం. మన నేపథ్యమేం తక్కువది కాదు మన వేదాలు, పురాణ-ఇతిహాసాలు, సంస్కృతీ వార సత్వ సంపదను పరిశీలించినా...పర్యావరణానికి ఇచ్చిన ప్రాధాన్యత అసాధారణమైందే! భూమి, ఆకాశం, అగ్ని, గాలి, నీరు-అన్న పంచభూతాలనే దేవతలుగా పరిగ ణించి పరోక్షంగా పర్యావరణానికి అత్యంత ప్రాధాన్యత నిచ్చారు మన పూర్వీకులు. ప్రపంచ జీవనగతికే గొప్ప విలువల వారసత్వాన్నిచ్చింది భారత దేశమని అమెరికా అధ్యక్షుడు బారాక్ ఒబామా ప్రస్తుతించడం వెనుక ఉన్న సహేతుకత కూడా అదే. మొదట్నుంచీ ప్రకృతికి పెద్దపీట వేసిన మనం, రానురాను పాశ్చ్యాత్య జీవన ప్రభావంలో పడి కొట్టుకుపోతూ విలువలు మరిచాం. విలువల వ్వవస్థకు బీజాలు వేసిన భారత, రామాయ ణాది కావ్యాలయినా, పంచతంత్రం వంటి కథలకైనా ప్రధాన నెలవు అరణ్యాలే! అడవికి అంత సామీప్యంతో కథలు చెప్పడం వెనుక ఉద్దేశం కూడా మనిషి మనుగ డతో అడవి ఎంతగా మమేకమైన ప్రకృతి సహజ సంపదో తెలియజెప్పడం కోసమే అనిపిస్తుంది. మెజారి టీ పుణ్య క్షేత్రాలను కూడా అడవితోనో, వనాలతోనో, తోటలతోనో అనుసంధానం చేసి నెలకొల్పడంలోని ఉద్దేశాన్ని గ్రహించాలి. పర్యావరణ పరిరక్షణలో ప్రభు త్వాల వైఖరి-చట్టాల అమలు కన్నా, ఇజాల ప్రభావం కన్నా... ప్రజల్ని భాగస్వాముల్ని చేయడం, వారిలో ప్రకృతి స్పృహ, జీవనశైలి ప్రధానాంశాలుగా ఉంటాయి. అత్యంత పురాతనమైన మన సింధులోయ నాగరికతలో కూడా పట్టణాల ఏర్పాటు క్రమం ఉంది. భూగర్భ మురుగునీటి వ్యవస్థలున్నాయి. పశువుల్ని పాలించడం, చెట్లను పెంచడం, అడవుల్ని రక్షించుకోవడం వంటి జీవనశైలి ప్రస్ఫుటంగా కనిపించిందని మన చరిత్రకా రులే చెబుతున్నారు. ‘వృక్షో రక్షతి రక్షితః’ అన్నారు. ప్రకృతి గురించి సర్వకాల సర్వావస్థలను యందూ వర్తించే ఒక గొప్ప సత్యాన్ని పూజ్య బాపూజీ చెప్పారు. ‘‘సమస్త మానవుల అవసరాలు తీర్చే శక్తి మన ప్రకృతికి ఉంది, కొంత మంది అత్యాశను తీర్చడం తప్ప’’ అన్న వాక్కులు సదా గుర్తుంచుకోదగినవే! మరి ఏమిటి మన కర్తవ్యం? నగర జీవులుగా నగరాల్ని కాపాడుకోవడంలో మన బాధ్యతే ప్రధానమైంది. ఉపన్యసించే పది నోళ్ల కన్నా, పని చేసే రెండు చేతులు మిన్న అంటారు. నిజమైన కార్యాచరణకు అందరం పూనుకోవాలి. ప్రభుత్వాల విధాన నిర్ణయాలు, కార్యక్రమాల పకడ్బందీ అమలు, పౌర సంఘాల అప్రమత్తత... వంటివి కొనసాగుతున్నా పౌరుల వైపు నుంచి కుటుంబాలు, వ్యక్తుల సహాయ సహకారాలు ఎంతగానో అవసరం. నగరాలపై కురిసే ప్రతి వర్షపు చుక్కను ఒడిసి పట్టేలా ఇంకుడు గుంతల్ని ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి ఇంటిపైన సౌరశక్తి ప్యాన ల్స్‌ను ఉంచి సహజవిద్యుత్తును తయారు చేసుకోవాలి. వీలయినంత మేర కిచెన్గార్డెన్స్ను పెంచాలి. ఇళ్ల నిర్మాణ సమయంలోనూ శ్రద్ధ తీసుకొని గాలి, వెలు తురు ధారాళంగా వచ్చే తీరున నిర్మించుకోవాలి. గ్రీన్ బిల్డింగ్ వస్తు వినియోగమే జరపాలి. చెత్త నిర్వహణ, నిర్మూలనలో కూడా శాస్త్రీయమైన పద్ధతుల్ని పాటిం చాలి. గది నుంచి గదికి మారినా... వినియోగంలో లేనపుడు లైట్లు, ఫ్యాన్లు, ఇతర విద్యుత్ ఉపకరణాల్ని విధిగా కట్టివేయాలనే స్పృహ సదా కలిగి ఉండాలి. అవసరమైతే కొన్ని సౌఖ్యాలను వదులుకొనైనా పర్యావరణ పరిరక్షణకు చిత్తశుద్ధితో కట్టుబడి ఉండాలి. హెచ్చు-తగ్గుల అంతరాలు లేకుండా మనమంతా పాటిస్తే తప్ప భవిష్యత్ తరాలకు మోక్షం లేదు. ప్రతి పౌరుడు హరిత ప్రియుడు కావాలి. ప్రతి ఇల్లూ హరిత స్పృహ కలిగిందయితే తప్ప హరిత నగరాలు సాధ్యం కాదు. నీ కాళ్ల కింద అపారమైన శక్తి దాగి ఉంది. నీ వేలి కొసల్లో ఆధునిక శాస్త్ర సాంకేతికత పరవళ్లు తొక్కు తోంది. నీలోని సంకల్పానికి ఈ రెండిటినీ ముడివేయ్. శ్రీశ్రీ స్ఫూర్తికి కృతజ్ఞులమై ఇలా చెప్పుకోవచ్చునేమో! నేను సైతం... నేను సైతం... నేను సైతం హరిత నగరికి సౌఖ్యమొక్కటి పరిత్యజించాను దిలీప్‌రెడ్డి (వ్యాసకర్త ‘సాక్షి’ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్)