లబ్ధిదారులకు వాహనాల కీని అందజేస్తున్న మంత్రులు తలసాని, మహమూద్ అలీ
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కులవృత్తులను ప్రోత్సహిస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. బుధవారం పీపుల్స్ ప్లాజాలో సమీకృత మత్స్య అభివృద్ది పథకం, ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
మత్స్యకారులకు మోపెడ్, 4 చక్రల వాహనాలను అందజేసి వారి ఆర్థికాభివృద్దికి కృషి చేస్తున్నామన్నారు మత్స్యకారుల కుటుంబంలో ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే రూ.6 లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తున్నామన్నారు. మిషన్ కాకతీయ కింద పునరుద్ధరించిన చెరువుల ద్వారా మత్స్యకారులు సర్వతోముఖాభివృద్ధికి బాట లు వేసుకోవాలని మహమూద్ అలీ ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment