Fisherman
-
నడి సముద్రంలో 95 రోజులు
పది రోజుల చేపల వేటకని ఆయన బయలుదేరాడు. తుఫాను దారిని మళ్లించింది. ప్రపంచంలోనే అతి పెద్దదైన పసిఫిక్ మహాసముద్రంలో కొట్టుకుపోయాడు. ఎటు చూసినా నీళ్లు. నెల.. రెండు నెలలు.. మూడు నెలలు.. సముద్రంలోనే జీవితం. సరైన ఆహారం లేదు. మంచి నీరు కూడా లేదు. అయినా బతకాలన్న ఆశ అతడిని ఒడ్డున చేర్చింది. 95 రోజుల తరువాత గస్తీ బృందానికి దొరికాడు. సినిమా స్టోరీని తలపిస్తున్న ఈ కథ.. పెరూవియన్ మాక్సిమో నాపా కాస్ట్రో నిజ జీవితం. పెరూవియన్ తీరంలోని మార్కోనా పట్టణానికి చెందిన మాక్సిమో డిసెంబర్ 7న ఫిషింగ్ కోసం బయలుదేరాడు. రెండు వారాల ట్రిప్. అందుకు తగ్గట్టుగానే ఆహారాన్ని కూడా పఆయక్ చేసుకున్నాడు. పది రోజుల తరువాత వచి్చన తుఫాను అతని పడవను దారి మళ్లించింది. పసిఫిక్ మహాసముద్రంలో కొట్టుకుపోయాడు. అతని కుటుంబం, పెరూ సముద్ర గస్తీ దళాలు వెదకడం మొదలెట్టాయి. మరోవైపు నట్ట నడి సముద్రంలో తప్పిపోయిన మాక్సిమోకు ఎటు చూసినా నీళ్లు. కుటుంబంపైనే ధ్యాస. తన తల్లి గురించి, నెలల వయసున్న మనవరాలి గురించిన ఆలోచనలే.అవే ఆయన జీవితంపై ఆశ.. ఎలాగైనా బతికి ఒడ్డుకు చేరాలన్న స్ఫూర్తిని ఇచ్చాయి. వర్షపు నీటిని ఒడిసి పట్టుకుని తాగాడు. బతకడం కోసం కీటకాలు, పక్షులు, తాబేలును తిన్నాడు. ఎవరో ఒకరు కనిపెట్టేవరకూ తాను బతికుండాలన్న ఆశ అతని ప్రాణాలను నిటబెట్టింది. నాపా కాస్ట్రో కుటుంబం, మత్స్యకారుల బృందాలు మూడు నెలలుగా గాలిస్తూనే ఉన్నాయి. మూడు నెలలైనా ఆచూకీ దొరకలేదు. అయినా అటు కుటుంబం ఆశలు వదులు కోలేదు. ‘‘నాన్న నీవు రాకపోవడం మాకు అంతులేని బాధ. ఈ పరిస్థితిని ఎదుర్కొంటామని మేము ఎప్పుడూ అనుకోలేదు. మిమ్మల్ని కనుగొంటామనే ఆశ ఉంది’అని అతని కుమార్తె మార్చి 3న ఫేస్బుక్లో రాసింది. సరిగ్గా ఇది జరిగిన 8 రోజులకు మార్చి 11న ఈక్వడార్ గస్తీ బృందం ఫిషింగ్ బోటులో ఆయనను కనుగొన్నది తీరానికి 1,094 కి.మీ దూరంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న మాక్సిమోను రక్షించింది. వెంటనే ఈక్వెడార్, పెరూ సరిహద్దుకు సమీపంలోని పైటాలోని న్యూస్ట్రా సెనోరా డి లాస్ మెర్సిడెస్ ఆసుపత్రికి తరలించింది. గత 15 రోజులుగా ఏమీ తినకుండా ఉండటంతో తీవ్ర డీహడ్రేషన్కు గురయ్యారని వైద్యులు తెలిపారు. చికిత్స అనంతరం మాక్సిమో సోదరుడికి అప్పగించారు. తన తండ్రి ప్రాణాలను కాపాడిన కుమార్తె ఇనెస్ నాపా టొర్రెస్ కృతజ్ఞతలు తెలిపింది. ‘ఈక్వెడార్ సోదరులారా>, నా తండ్రి గాటన్ను రక్షించినందుకు ధన్యవాదాలు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు’అని ఆమె ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సముద్రంలో సాహసవీరులు
-
మత్స్యకారుల్లో ‘తండేల్’ చిచ్చు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘ఎలక్షన్ ముందు మాయ మాటలు చెబుతారు. కానీ జగన్ గారు గెలవక ముందే మా కుటుంబాల వారికి మాటిచ్చి నిలబెట్టుకున్నారు. వైఎస్ జగన్ గెలిస్తే మా బతుకుల్లో వెలుగులు వస్తాయని అనుకున్నాం. అలాగే ఆయన గెలిచాక మమ్మల్ని పాకిస్తాన్ జైలు నుంచి విడుదల చేయించారు. ఒక్కొక్కరికీ రూ.5లక్షల సాయం అందజేశారు. 14 నెలల కష్టాలు సీఎం జగన్‌ను చూడగానే మటుమాయమయ్యాయి. మాకు ఊపిరి పోసి, పునర్జన్మ ఇచ్చారు. మా కుటుంబాల్లో ఎవరెన్ని చెప్పినా, ఏమన్నా జగన్ పార్టీకి జీవితాంతం సేవ చేస్తా. ఆయన రుణం ఈ జన్మలోనే తీర్చుకుంటా.’ పాకిస్తాన్ జైలు నుంచి విడుదలయ్యాక మీడియాతో గనగళ్ల రామారావు అన్న మాటలివి..కానీ తండేల్ సినిమా విడుదలయ్యాక ఎందుకో రామారావు స్వరం మారిపోయింది. వైఎస్ జగన్ హయాంలో జరిగిన మేలును చెప్పుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డారు. ఇతర దేశాల్లో ఉన్న వారిని విడిపించే బాధ్యతను కేంద్ర ప్రభుత్వమే చూసుకుంటుంది కదా.. ఇప్పుడు కొన్ని బుర్రలకు ఆ విషయం అర్థం కావడం లేదు.. ఏదో పట్టినట్టు కొంతమంది అదే పనిగా వైఎస్ జగన్ ప్రభుత్వం గొప్పతనమని చెబుతున్నారంటూ.. తోటి మత్స్యకారులనుద్దేశించి కొన్ని మీడియాల్లో మాట్లాడటం వివాదాస్పదంగా మారింది. అలాగే తండేల్ సినిమా యూనిట్‌తో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నా.. నాడు జరిగిన మేలు గురించి చెప్పకపోవడం కూడా మిగతా 21 మత్స్యకార కుటుంబాలకు ఆగ్రహం తెప్పించింది. అసలు నిజమిది.. వాస్తవానికి రామారావు ఒక్కడే తండేల్ కాదని, సినిమాలో అలా కథ రాసుకున్నారు గానీ.. పాకిస్తాన్‌కు దొరికిన మూడు బోట్లలో ముగ్గురు తండేళ్లు ఉన్నారని 21 మత్స్యకార కుటుంబాల వారు తెలిపారు. తండేల్ సినిమాతో రామారావు ఒక్కరికే లబ్ధి చేకూరిందని అన్నారు. అప్పుడేం జరిగిందో తమకు తెలుసని, ఎవరి వల్ల విడుదలయ్యామో తమకు ఇంకా గుర్తుందని అన్నారు. వైఎస్ జగనే పునర్జన్మ ఇచ్చారని ఆనాడు చెప్పిన వ్యక్తి ఇప్పుడు రకరకాలుగా మాట్లాడుతున్నాడని అన్నారు. తాము స్టేజీ ఎక్కితే ఎక్కడ వాస్తవాలు చెబుతామో అని ఆ ఆవకాశం ఇవ్వకుండా చేశారని, రామారావు, కథా రచయిత తమను మోసం చేశారని మండిపడ్డారు. ఇదేనా కృతజ్ఞత.. రామారావు వ్యవహార శైలి వల్ల డి.మత్స్యలేశంలో చిచ్చు రేగింది. రామారావుకు అవకాశవాదం తప్ప కృతజ్ఞత లేదని మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘పాకిస్తాన్ జైలు నుంచి విడుదలయ్యాక రామారావు ఏమన్నాడు.. ఇప్పుడేం మాట్లాడుతున్నారు...అంతా మీడియాలో రికార్డయి ఉంది.. మరిచిపోయి మాట్లాడితే పాత వీడియాలు గుర్తు చేస్తాయి...’ అని అంటున్నారు. సినిమా యూనిట్‌ను తప్పుదారి పట్టించి, తమకు కనీసం గుర్తింపు లేకుండా చేశారని కూడా వాపోతున్నారు. ఆ గ్రామంలో ప్రస్తుతం రామారావు ఒక వైపైతే.. మిగతా వారంతా మరో వైపు ఉన్నారు. ఢీ అంటే ఢీ అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. ప్రెస్‌మీట్ పెట్టి ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో నాడు జరిగిన వాస్తవాలు బయటకు వస్తున్నాయి. ఎవరి గొప్పతనమేంటో, ఎవరి చేసిన మేలు ఏంటో చర్చకు వస్తోంది. -
మత్స్యకారులను జైలు నుంచి విడిపించిన రియల్ హీరో వైఎస్ జగన్: మత్స్యకారులు
-
మొట్టమొదటిసారి చేపల పులుసు వండిన నాగచైతన్య (ఫోటోలు)
-
మత్స్యకారుల ఆశలపై నీళ్లు చల్లిన కూటమి ప్రభుత్వం
సముద్రపు ఆటుపోటుల సమయంలో ఉండే అల జడి ఇప్పుడు మత్స్య కారుల కుటుంబాల్లో కని పిస్తోంది. నిత్యం ఉద్రేకంగా ఉరకలు వేసే సము ద్రంతో సావాసం చేసే గంగపుత్రులకు పొంచి ఉన్న మరో పెనుముప్పు ఇందుకు కారణం. గంగమ్మ కరుణిస్తేనే కడుపు నిండే తీరప్రాంత మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఉప్పెనలాంటి ముప్పు తీసుకొని వచ్చింది. కష్టాలు తీర్చవలసిన ప్రభుత్వమే ముప్పులాగ మారితే మత్స్యకారుల పరిస్థితి చుక్కాని లేని నావలా మారడం తప్ప మరొకటి కాదు. రాష్ట్రంలో సువిశాలమైన 974 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉంది. ఈ ప్రాంతములో వేట కోసం కనీస సౌకర్యాలు లేక ఇక్కడ మత్స్య కారులు ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్ళి సమస్యలు కొనితెచ్చుకొంటున్నారు.ఇది గమనించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ప్రభుత్వ హయాంలో 10 ఫిషింగ్ హార్బర్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. వీటిలో జవ్వలిదిన్నె ఫిషింగ్ హార్చర్ ప్రారంభమయ్యింది. మరికొన్ని సగానికి పైగా పనులు పూర్తిచేసుకుంటున్నాయి. దీనితో తమ జీవితాలలో వెలుగులు రానున్నాయని ఆనందంగా ఉన్న మత్స్యకారుల ఆశలుపై కొత్తగా వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం నీళ్ళు చల్లుతూ ఫిషింగ్ హార్బర్లను ప్రైవేట్ పరం చేసేందుకు సన్నహాలు ప్రారంభించింది. ఈ ఫిషింగ్ హార్బర్లను అభివృద్ధి చేసి నిర్వహించేందుకు ఆసక్తిగల సంస్థల నుంచి బిడ్లను ఆహ్వనిస్తూ కూటమి ప్రభుత్వం టెండర్లను పిలిచి మత్స్యకారుల కుటుంబాల్లో అమవాస్య చీకటిని నింపింది.గతంలో వైస్ జగన్ ప్రభుత్వం రూ. 3,520 కోట్లతో జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీ పట్నం, ఉప్పాడ, మంచినీళ్ళుపేట, బూడగడ్ల పాలెం, పుడిమెడక, కొత్తపట్నం, ఓడరేవు, బియ్యపుతిప్ప లాంటి 10 ప్రాంతాల్లో ఫిషింగ్ హార్బర్ల ఏర్పాటు కోసం పనులు ప్రారంభించింది. ఈ హార్బర్లు అందుబాటులోకి వస్తే సుమారు 10,521 మెకనైజ్డ్ బోట్లు నిలిపే సామర్థ్యంతో పాటు సుమారు 5 లక్షల టన్నుల అదనపు మత్స్య సంపదను పెంచుకొనే వెసులు బాటు ఉంటుంది. దీనితోపాటు ప్రత్యక్షంగా, పరో క్షంగా వేలాది మంది మత్స్య కారులకు జీవనోపాధి పెరుగుతుంది. ఇటువంటి హార్బర్లను ప్రభుత్వం నిర్వహించకుండా ప్రైవేటుకు అప్పగిస్తే, కార్పొరేట్ల చేతుల్లోకి మత్స్యకారుల బతు కులు వెళతాయి.వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు గత ప్రభుత్వం ‘మత్స్యకార భరోసా’ పేరుతో భృతి అందించేది. దీన్ని కూడా రీ సర్వే పేరుతో కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటుకు ముందు ఉన్న చంద్రబాబు ప్రభుత్వం వేట నిషేధ సమయంలో నాలుగు వేల రూపాయల భృతి ఇచ్చేది. దాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం రూ. 10,000కు పెంచింది. అన్నిరకాల బోట్లతో పాటు, తెప్పలు, నాటు పడవలకు మత్యకార భరోసా అందించింది. గత 5 ఏళ్లలో ప్రతీ సంవత్సరం మే నెలలో మత్స్యకార భరోసా అందిస్తూ 5 ఏళ్ళల్లో రూ. 538 కోట్లు ఖర్చు చేసింది. ఈ పథకం అమలు చేయడంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం తాత్సారం చేస్తోంది.చదవండి: శ్రీబాగ్ ఒడంబడిక అమలే కీలకం!జగన్ ప్రభుత్వం మత్స్యకారులకు ఇతర పథకాల ద్వారానూ చేదోడుగా వాదోడుగా నిలిచింది. చేపల వేట సమయంలో ప్రమాదవశాత్తు మృతి చెందిన మత్స్యకారుల కుటుంబాలకు గతంలో చంద్రబాబు ప్రభుత్వం రూ. 5 లక్షలు పరిహారం అందించగా... జగన్ ప్రభుత్వం దాన్ని రూ. 10 లక్షలకు పెంచి వెనువెంటనే అందించింది. గత ఐదేళ్లలో 175 మంది గంగపుత్రులు మృతి చెందగా వారి కుటుంబాలకు ఒక్కక్కరికి రూ. 10 లక్షలు చొప్పున జగన్ ప్రభుత్వం రూ. 17.50 కోట్ల పరిహారాన్ని అందజేసింది. అదేవిధంగా గతంలో ఆరు రూపాయలుగా ఉన్న డీజిల్ సబ్సిడీని తొమ్మిది రూపాయలకు పెంచింది. ఈ లెక్కన ఐదేళ్లలో బోట్ల యజమానులకు రూ. 148 కోట్లు చెల్లించింది. వీటితో పాటు అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జీఎస్పీసీ తవ్వకాల వల్ల జీవనోపాధి కోల్పోయిన 16,554 మంది మత్స్యకార కుటుంబాలకు రూ. 78.22 కోట్లు, ఓఎన్జీసీ పైపు లైను తవ్వకాల వల్ల జీవనోపాధి కోల్పోయిన 23,458 మంది కుటుంబాలకు 5 విడతల్లో రూ. 647.44 కోట్లు సహాయాన్ని జగన్ ప్రభుత్వం అందించింది.చదవండి: వాగ్దానాలు గాలికి వదిలినట్లేనా? మొట్టమొదటిసారిగా మత్స్యకార వర్గానికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి సమున్నత గౌరవం కల్పించింది వైఎస్సార్సీపీనే అనేది మరువరాదు. ప్రస్తుత ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలను కొనసాగించాలి. అలాగే ఫిషింగ్ హార్బర్ల ప్రైవేటీకరణను నిలిపి వేయాలి.- బందన పూర్ణచంద్రరావు జాతీయ మత్స్యకార సంఘం వైస్ చైర్మన్(నేడు ప్రపంచ మత్స్యకార దినోత్సవం) -
ఐదేళ్ళ లో అంచెలంచెలుగా ఎదిగిన మత్స్యకారులు
-
సముద్రంలో బోటు బోల్తా...అందరూ సురక్షితం..
-
విశాఖ: గల్లంతైన మత్స్యకారులు సేఫ్..
సాక్షి, విశాఖపట్నం: విశాఖ హార్బర్ నుంచి వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ తెలిసింది. అప్పికొండ ప్రాంతంలో మత్స్యకారులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. కాగా, అలల ధాటికి బోటు మునిగిపోవడంతో వారంతా అక్కడ ఉన్నట్టు తెలిసింది. వివరాల ప్రకారం.. సోమవారం వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ తెలియడంతో వారి కుటుంబాలు ఊపిరి పీల్చుకున్నాయి. విశాఖ హార్బర్ నుంచి వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు క్షేమంగా అప్పికొండ ప్రాంతంలో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. కాగా, సముద్రపు అలల ధాటికి వారు ప్రయాణిస్తున్న బోటు బోల్తా పడింది. ఈ క్రమంలో బోటు దెబ్బతినడంతో బోటుపై భాగంలోనే వారు ఆరుగురు ఉండిపోయారు. నిన్న రాత్రంతా వారు సముద్రంలోనే ఉండిపోయారు. అనంతరం, అప్పికొండ తీరానికి చేరుకోగానే గంగపుత్రులు అధికారులకు సమాచారం అందించారు. వారంతా క్షేమంగానే ఉన్నట్టు చెప్పారు. వీరిలో కారి చిన్నారావు (45), కారి నరేంద్ర(18), మైలపల్లి మహేష్ (18), వాసుపల్లి అప్పన్న (35), కారి చినసత్తెయ్య (55), వాసుపల్లి పొడుగు అప్పన్న(32) ఉన్నారు. ఇక, వీరు గల్లంతైన నేపథ్యంలో కోస్టుగార్డుకు చెందిన రెండు నౌకలు, నౌకాదళానికి చెందిన హెలికాప్టర్ గాలింపు చర్యలు చేపట్టాయి. -
విశాఖ సముద్రంలో గల్లంతైన ఆరుగురు మత్స్యకారులు
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం సముద్రంలో ఆరుగురు మత్య్సకారులు గల్లంతయ్యారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కం గ్రామానికి చెందిన ఆరుగురు మత్స్యకారులు సోమవారం సాయంత్రం విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి దక్షిణ దిశగా గంగవరం వైపు చేపల వేటకు వెళ్లారు. వైజాగ్ హార్బర్ నుంచి V 1-MO -2736 నెంబర్ బోట్లో వేటకు వెళ్లారు. రాత్రి గడిచినా వారు ఇంటికి చేరకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు మంగళవారం కోస్ట్‌గార్డు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఫిషింగ్ బోట్లు, కోస్ట్‌గార్డు సాయంతో మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. గల్లంతైన మత్సకారుల స్వస్థలం విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కం గ్రామానికి చెందినవారిగా సమాచారం. చదవండి: చంద్రబాబుకు దెబ్బేసిన ఎల్లో మీడియా! -
Fact Check: ఇంత వక్రీకరణా?
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారమే అజెండాగా పెట్టుకున్న ఈనాడు రామోజీరావు తన మార్కు దిగజారుడు పాత్రికేయాన్ని మరోసారి చూపించారు. పల్నాడు జిల్లాలో ఓ మత్స్యకారుని అనుమానాస్పద మృతికి కూడా వక్రభాష్యం చెబుతూ పోలీసు శాఖపై విష ప్రచారం చేశారు. పోలీసుల వేధింపులతోనే మత్స్యకారుడు ఆత్మహత్య చేసుకున్నారని నిరాధార కథనాన్ని ప్రచురించి పాఠకులను తప్పుదారి పట్టించేందుకు యత్నించారు. అసలు ఆదివారంనాడు పోలీసు స్టేషన్‌కే వెళ్లని వ్యక్తిని ఎస్సై ఎలా వేధింపులకు గురిచేస్తాడని, వేధింపులకు గురైన వ్యక్తి చేపల వేటకు వెళ్తాడా అన్న కనీస జ్ఞానం కూడా ఈనాడుకు లేదు. అందుకే ఓ తప్పుడు కథనాన్ని అచ్చేసింది. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తికి చెందిన మత్స్యకారుడు చౌడిపల్లి దుర్గారావు గతంలో అక్రమ మద్యం కేసులో నిందితుడు. ఆయన తన నాటు పడవలో మరికొందరితో కలిసి తెలంగాణ నుంచి పడవలో మద్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్) అధికారులు దాడి చేశారు. ఆ సమయంలో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుర్గారావు, మరో నిందితుడు పరారయ్యారు. అక్రమ మద్యం కేసులో దుర్గారావును ఐదో నిందితుడు (ఏ5)గా పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం దుర్గారావు హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందారు. ఆదివారంతో సహా ప్రతి రోజూ పోలీస్ స్టేషన్‌కు వచ్చి సంతకం చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. కానీ, గత 3 ఆదివారాలు ఆయన పోలీస్ స్టేషన్‌కు వచ్చి సంతకం పెట్టలేదు. గత ఆదివారంనాడు (జనవరి 28న) కూడా పోలీస్ స్టేషన్‌కు రాకుండా చేపల వేట కోసం కృష్ణా నదిలోకి వెళ్లాడు. అనుమానాస్పదంగా మృతి చెందాడు. దుర్గారావు మృతదేహాన్ని ఆయన బావమరిది బ్రహ్మాజీ తీసుకువచ్చారు. మృతిపై భిన్న వాదనలు దుర్గారావు మృతి పట్ల ప్రత్యక్ష సాక్షులు భిన్నమైన వాదనలు వినిపించడం గమనార్హం. మొదట కృష్ణా నది ఒడ్డున దుర్గారావు మృతదేహాన్ని చూశామని కొందరు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాసేపటికే దుర్గారావు మృతదేహాన్ని కృష్ణా నది నుంచి తీసుకువచ్చినట్టు చెప్పారు. ఆయన మెడకు ఉరివేసుకుని నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. కాగా నది నుంచి మృతదేహాన్ని బయటకు తీసుకు వస్తున్నప్పుడు సెల్ ఫోన్ కెమెరాలతో తీసిన వీడియోలో ఆయన మెడకు ఎలాంటి తాడూ లేదు. కానీ కాసేపటికి దుర్గారావు మెడ చుట్టూ తాడు బిగించి ఉన్నట్టు ఫొటోలు బయటకు వచ్చాయి. దీనిపైనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దుర్గారావు మెడకు మొదట పసుపు రంగు తాడు లేదని, తరువాతే చూశామని కొందరు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. నేర చరిత్ర ఉన్న టీడీపీ నేతలు రెడ్యా నాయక్, వజ్ర నాయక్ మృతుడి కుటుంబ సభ్యులను ప్రభావితం చేసి వెల్దుర్తి ఎస్సై శ్రీహరి వేధింపుల వల్లే దుర్గారావు ఆత్మహత్య చేసుకున్నారని ఫిర్యాదు చేయించారు. సోదరులైన వారిద్దరిపై పలు క్రిమినల్ కేసులు ఉండటం గమనార్హం. వారిద్దరే దుర్గారావు కుటుంబ సభ్యులతో జాతీయ రహదారిపై ధర్నా చేయించారు. వాస్తవాలు ఇలా ఉంటే దీన్ని వక్రీకరిస్తూ ఈనాడు పోలీసులపై దుష్ప్రచారం చేసేందుకు యత్నించడం గమనార్హం. ఇవి వాస్తవాలు కాగా, ఎస్సై వేధింపుల వల్లే దుర్గారావు మృతి చెందాడని వక్రీకరిస్తూ ఈనాడు కథనాన్ని ప్రచురించడం రామోజీ దిగజారుడుతనానికి నిదర్శనమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. దుర్గారావు అసలు ఆదివారంనాడు పోలీసు స్టేషన్‌కే వెళ్లలేదు. అతన్ని పోలీసులు వేధింపులకు గురిచేస్తే మానసిక వ్యధతో ఉన్న వ్యక్తి పడవలో చేపల వేటకు వెళ్లగలడా? ఈ కనీస జ్ఞానం తప్పుడు కథనం రాసే వారికి ఉండదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. కేసు నమోదు... దర్యాప్తు దుర్గారావు మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆయన ఎలా మృతి చెందారనే విషయంపై ప్రత్యక్ష సాక్షులే పరస్పర భిన్నమైన కారణాలు చెప్పడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు వేగవంతం చేశారు. మృతదేహానికి పంచనామా చేసిన అనంతరం పోస్ట్‌మార్టంకు తరలించారు. పోస్టుమార్టం నివేదిక రావల్సి ఉంది. మృతుని కుటుంబ సభ్యుల ఆరోపణల నేపథ్యంలో పోలీసులు శాఖాపరమైన దర్యాప్తు కూడా చేపట్టారు. వెల్దుర్తి ఎస్సై శ్రీహరికి మెమో జారీ చేశారు. ఈ ఉదంతంపై సమగ్రంగా విచారించి నివేదిక సమర్పించాలని మాచర్ల సీఐ షమీముల్లాను ఆదేశించారు. -
సూళ్లూరుపేటకు సీఎం జగన్
-
రాయదరువు వద్ద రూ.23.93 కోట్లతో ఫిష్ ల్యాండింగ్ సెంటర్
-
మత్స్యకారులకు మంచి రోజులు
-
వరించిన అదృష్టం..రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన మత్స్యకారుడు!
చేపల వేటతో జీవనం సాగించే మత్స్యకారులకు ఒక్కోసారి అదృష్టం వరించి అరుదైన చేపలు వలలో చిక్కుతాయి. దీంతో లక్షాధికారులుగా మారిన పలు సందర్భాలు ఉన్నాయి. అలాంటి అదృష్టమే పాక్‌లోని ఓ మత్స్యకారుడిని వరించింది. దెబ్బతో ఒక్కరాత్రిలో ఊహించని రీతిలో అతని తలరాత మారిపోయింది. అతడికి లక్ అలా ఇలా లేదు. వివరాల్లోకెళ్తే...పాక్‌లోని కరాచీ నౌకాశ్రయం సమీపంలో ఉన్న అరేబియా సముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఇబ్రహి హైదరీ వలలో అరుదైన చేపలు పడ్డాయి. ఆ చేపలను మాండలికంలో గోల్డెన్ ఫిష్, లేదా సోవా అని పిలుస్తారు. ఇవి చాలా అమూల్యమైనవి, అరుదుగా దొరుకుతాయి. వీటిలో మంచి ఔషధగుణాలు ఉండటంతో వైద్యంలో ప్రముఖంగా వాడతారు. అలాగే వీటిలో దారం లాంటి పదార్థాన్ని శస్త్ర చికిత్స విధానాల్లో వినయోగిస్తారు. ఈ చేప ఒక్కొకటి ఏకంగా 7 మిలియన్లు(దాదాపు 70 లక్షలు) పలికాయి. దీంతో మొత్తం చెప్పలు సుమారు రూ. 7 కోట్లకు అమ్ముడుపోయాయి. దీంతో అతను ఓవర్ నైట్‌లో కోటీశ్వరుడు మారిపోయాడు. ఈ చేప సుమారు 20 నుంచి 40 కిలోల బరువు ఉండి దాదాపు 1.5 మీటర్ల వరకు పెరుగుతుంది. వీటిని స్థానిక వంటకాల్లోనే కాక ఔషధాల్లోనూ ఎక్కువుగా ఉపయోగిస్తారు.కాగా, ఇంత పెద్ద మొత్తంలో అమ్ముడుపోవడంతో మత్స్యకారుడు హైదరీ ఆనందానికి అవధులు లేవు. ఇవి సంతానోత్పత్తి కాలంలోనే తీరాని వస్తాయని, అప్పుడే వలకు చిక్కుతాయని చెబుతున్నాడు హైదర్. తాను ఈ సొమ్ముని తన సిబ్బందితో కలిసి పంచుకుంటానని ఆనందంగా చెబుతున్నాడు. ఏదైన టైం రావలిగానీ ఒక్క క్షణంలో మీ జీవితం అందనంత ఎత్తులోకి వెళ్లిపోతుందంటే ఇదే కదా!. (చదవండి: పేషెంట్‌కి చికిత్స అందిస్తూ..అంతలో వైద్యుడు..) -
4 కళ్ల నల్లని చారల చేప... చూసేందుకు జనం పరుగులు!
బీహార్‌లోని బెతియా జిల్లాలో మత్స్యకారుల వలకు విచిత్రమైన చేప చిక్కింది. ఆ చేపను చూసేందుకు జనం తండోపతండాలుగా తరలి వస్తున్నారు. బెతియా జిల్లాలలోని లాకఢ్ గ్రామంలోని మత్స్యకారుల చేతికి ఈ చేప చిక్కింది. గ్రామానికి సమీపంలో ప్రవహిస్తున్న నదిలో వల వేసినప్పుడు వారికి ఈ చేప చిక్కింది. తొలిసారి చూసినప్పుడు ఈ చేప విమానం మాదిరిగా కనిపిస్తుంది. ఈ చేప నల్లని చారలను కలిగివుంది. దానికి నాలుగు కళ్లు ఉన్నాయి. ఈ చేపను సకెర్మౌత్ క్యాట్‌ఫిష్ అని అంటారు. ఈ తరహా చేపలు సాధారణంగా అమెరికాలో ప్రవహించే నదులలో కనిపిస్తాయి. వింతగా కనిపిస్తున్న ఈ చేపను చూసేందుకు సమీపగ్రామ ప్రజలు తరలివస్తున్నారు. కాగా ఈ తరహా చేపలు ఇతర చేపల గుడ్లను తినేస్తుంటాయి. ఫలితంగా ఈ చేపలు ఇతర చేపల మనుగడకు ముప్పుగా భావిస్తున్నారు. గ్రామానికి చెందిన వీరేంద్ర చౌదరి ఇక్కడికి సమీపంలోని నదిలో ఇటువంటి రెండు చేపలను పట్టుకున్నారు. ఈ చేపలను వీరేంద్ర చౌదరి తన ఇంటిలో సురక్షితంగా ఉంచారు. ఈ విషయాన్ని స్థానికులు సంబంధిత అధికారులకు తెలియజేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం ఈ చేపను అందం కోసం జనం ఇంటిలోని ఫిఫ్ అక్వేరియంలలో ఉంచుతారు. అయితే ఎవరో ఇటువంటి చేపలను నదిలో విడిచిపెట్టి ఉంటారు. ఫలితంగా ఈ చేపలు మరింత వృద్ధి చెంది, గండక్, కోసీ గంగా నదులలో కనిపిస్తున్నాయి. అయితే నదిలో ఈ చేపలు ఉండటం పలు జలచరాలకు ముప్పు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: ఆ రాష్ట్రపతి సుప్రీంకోర్టు మెట్లు ఎందుకు ఎక్కారు? కేసు పూర్వపరాలేమిటి? -
నడి సముద్రంలో చిక్కుకున్న తమిళనాడు మత్స్యకారులు
-
కచ్చిడి చేపలతో ఒక్కరోజులోనే మిలియనీర్.. ఎందుకింత విపరీతమైన క్రేజ్?
ఏపీ సెంట్రల్ డెస్క్: మహారాష్ట్రకు చెందిన ఓ జాలరికి దొరికిన కచ్చిడి చేపలతో ఒక్క రోజులోనే మిలియనీర్ అయిపోయాడు. యాభై కేజీల కచ్చిడి చేప కలకత్తాలో రూ.13 లక్షలకు అమ్ముడుబోయింది. కాకినాడ కుంభాభిషేకం రేవులో కచ్చిడి చేప 4 లక్షల రూపాయలు పలికింది. కోనసీమలోని అంతర్వేది తీరంలో కచ్చిడి దొరికిన మత్స్యకారుడిపై కాసుల వర్షం కురిసింది. ఇలాంటి వార్తలు తరచూ చూస్తున్నాం. అసలేంటీ కచ్చిడి చేప. పులసకే తాతలా ఉంది. కళ్లు బైర్లు కమ్మే రేటు ఎందుకు పలుకుతోంది. కేజీ రూ. 20 వేలకు పైగా ధర పలికేంత విషయం కచ్చిడిలో ఏముంది. సింగపూర్, మలేసియా, హాంగ్‌కాంగ్, థాయ్‌లాండ్, జపాన్, ఇదర ఆగ్నేయాసియా దేశాల్లో దీనికి అంత డిమాండ్ ఎందుకు.. అంటే ఇది ఔషధాల గని కాబట్టి. బురద ప్రాంతాల్లో నివాసం హిందూ మహా సముద్రం, దక్షిణ పసిఫిక్ మహా సముద్రంలో ఇవి నివసిస్తాయి. పర్షియన్ గల్ఫ్, భారత్ తీరం, జపాన్, పవువా న్యూగినియా, ఉత్తర ఆ్రస్టేలియా సముద్ర ప్రాంతంలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. నదీ ముఖద్వారాలు సమీపంలో, అడుగున బురదగా, బండరాళ్లు ఉండే ప్రాంతాల్లో జీవిస్తాయి. సాధారణంగా ఇవి 60 మీటర్ల లోతులో సంచరిస్తూ ఉంటాయి. ఆహారం కోసం వలస వెళ్తూ ఉంటాయి. ఎన్నో పేర్లు.. ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతంలో కచ్చిడిగా పిలుస్తున్న ఈ చేప శాస్త్రీయ నాయం ప్రొటోనిబియా డయాకాంథస్. దీనిని ఘోల్ ఫిష్ అని, సీ గోల్డ్ అని కూడా పిలుస్తారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో టెలియా భోలా, కచ్చర్ భోలా అని అంటారు. ప్రపంచ వ్యాప్తంగా దీనిని బ్లాక్స్పాటెడ్ క్రోకర్ అని, ఆ్రస్టేలియాలో బ్లాక్ జ్యూఫిష్ అని అంటారు. జీవితకాలం 15 ఏళ్లు.. వీటి నోరు పెద్దగా ఉంటుంది. పక్కన నాలుగు రెక్కలు (ఫిన్స్), వెన్నుముక పొడవునా మరో ఫిన్ ఉంటుంది. రెండు వెన్నుముకలతో పొట్ట తర్వాత నుంచి కిందకు వంగి.. తోకవరకు సన్నగా ఉంటుంది. ఇవి అవకాశాన్ని బట్టి అన్ని రకాల ఆహారాలను తింటాయి. ముఖ్యంగా పీతలు, రొయ్యలు, లాబ్స్టర్లను ఇష్టంగా లాగిస్తాయి. చిన్న చేపలను వేటాడతాయి. సముద్రంలో ఎక్కడెక్కడ తిరిగినా ఏటా గుడ్లు పెట్టే సమయానికి మాత్రం తమ ఆవాసాలకు గుంపులుగా చేరతాయి. మే నుంచి అక్టోబర్ మధ్య కాలంలో నదులు సముద్రంలో కలిసే చోట్లకు వచ్చి గుడ్లుపెడతాయి. వీటి జీవితకాలం 15 ఏళ్లు. అయితే పుట్టినప్పటి నుంచి చాలా వేగంగా ఎదుగుతాయి. నాలుగేళ్లలోనే మూడు అడుగుల సైజుకు పెరిగి సంతానోత్పత్తికి సిద్ధమవుతాయి. ఐదు అడుగుల వరకూ కూడా పెరిగే ఇవి.. 60 కేజీలకు పైగా బరువుతూగుతాయి. ఎన్నో ఉపయోగాలు కచ్చిడి చేపలోని ఔషధ గుణాల వల్లే దానికంత క్రేజ్ వచ్చింది. ఐయోడిన్, ఒమెగా–3, డీహెచ్ఏ, ఈపీఏ, ఐరన్, మెగ్నీషియం, సెలీనియం లాంటి మినరల్స్ గని ఈ చేప. దీని కడుపు క్రింది భాగంలో చిన్న సంచిలాంటి శరీర భాగం ఉంటుంది. ఆ సంచిలో లభించే ఔషధాల వల్ల మార్కెట్లో దీనికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఈ సంచి కారణంగానే దీనిని సీ గోల్డ్ అని పిలుస్తారు. ఈదడానికి ఉపయోగపడే వీటి రెక్కలతో సింగపూర్‌లో వైన్ తయారు చేస్తారు. కంటి చూపును మెరుగుపరిచే చాలా విటమిన్స్, మినరల్స్, ప్రొటీన్స్ ఈ చేపలో పుష్కలంగా లభిస్తాయి. ఈ చేపలో చర్మానికి అవసరమైన ప్రొటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. దీనితో చర్మంపై ముడతలు పడవు. ముదిమి ఛాయలు దరిదాపులకు రాకుండా నవయవ్వనంగా చర్మం మెరుస్తుంది. చిన్న పిల్లల్లో మొదడు సక్రమంగా ఎదుగుదలకు ఈ చేపలో పెద్దఎత్తున లభించే ఒమెగా–3 ఎంతో ఉపయోగపడుతుంది. క్రమం తప్పక తింటూ ఉంటే ఐక్యూ (ఇంటెలిజెన్స్ కొషెంట్) కూడా బాగా అభివృద్ధి చెందుతుంది. కచ్చిడిలోని విటమిన్స్, మినరల్స్ మన శరీరంలోని కండరాలు బలంగా మారడానికి ఎంతో దోహదపడతాయి. ప్రమాదంలో కచ్చిడి.. ప్రపంచ దేశాల్లో అతిగా వేటాడటం, తీర ప్రాంతం కాలుష్యంగా మారడం వల్ల దీని ఉనికికే ప్రమాదం ఏర్పడుతోంది. గుడ్లు పెట్టేందుకు తీర ప్రాంతాలకు వచ్చే సమయంలో వీటిని ఎక్కువగా వేటాటం వల్ల వాటి సంఖ్య విపరీతంగా తగ్గిపోతోంది. ఇటీవల కాలంలో దీనిని రక్షించడానికి ఆ్రస్టేలియా కొన్ని కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. అలాగే భారత్ తీర ప్రాంతంలో మెకనైజ్డ్ బోట్లతో వేట నిషేధం, ఇవి గుడ్లు పెట్టే సీజన్లో వేటకు విశ్రాంతి ప్రకటించడం వల్ల వీటికి రక్షణ లభిస్తోంది. -
మత్స్యకారుల చేతికి డాల్ఫిన్.. ఇంటికెళ్లి కూర వండేసుకున్నాక..
మనదేశంలోని యమునా నది ప్రస్తుతం ఉప్పొంగి ప్రవహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపధ్యంలో యుమునలో రకరకాల చేపలు తేలియాడుతూ కనిపిస్తున్నాయి. గతంలో ఇన్ని చేపలు కనిపించేవి కాదని యమున పరీవాహక ప్రాంతాల ప్రజలు చెబుతున్నారు. కాగా యమునా నదిలో ఇటీవలి కాలంలో డాల్ఫిన్లు కూడా కనిపిస్తున్నాయి. యూపీలోని కౌశంబి జిల్లాలో పిపరీ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉంటున్న నలుగురు మత్స్యకారులు యమునలోని డాల్ఫిన్లను పట్టుకుని, కూర చేసుకుని తినేశారనే ఆరోపణలు వినిపించాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపధ్యంలో పోలీసులు నలుగురు మత్స్యకారులపై కేసు నమోదు చేశారు. పిపరీ పోలీసు అధికారి శ్రవణ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ జిల్లా అటవీశాఖ అధికారి రవీంద్ర కుమార్ నసీర్పూర్ గ్రామానికి చెందిన నలుగురు మత్స్యకారులపై ఫిర్యాదు చేశారన్నారు. ఆ మత్స్యకారుల తమ వలలో పడిన డాల్ఫిన్‌ను ఇంటికి తీసుకుపోయి, కూర వండుకున్నారని రవీంద్రకుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారన్నారు. ఈ ఉదంతం గురించి పోలీసులు మాట్లాడుతూ ఆ మత్స్యకారులు డాల్ఫిన్‌ను తీసుకెళ్లడాన్ని ఎవరో వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారన్నారు. దీనిపై విచారణ జరిపి, నలుగురు మత్స్యకారులపై కేసు నమోదు చేశామన్నారు. వీరిలో రాజేష్ కుమార్ అనే నిందితుడిని అరెస్టు చేశామని, మిగిలినవారు పరారయ్యారని తెలిపారు. వారి కోసం గాలిస్తున్నామని తెలిపారు. ఇది కూడా చదవండి: అణుబాంబు ఆవిష్కర్తకు భారత పౌరసత్వం.. నెహ్రూ ఆఫర్‌ను తిరస్కరించిన ఓపెన్‌హైమర్! -
ప్రాణాల మీద ఆశ.. నడి సంద్రంలో 12 గంటల పాటు మృత్యు పోరాటం
పిఠాపురం: ప్రాణాల మీద ఆశ అతడిలో మనోధైర్యాన్ని తట్టి లేపింది. ఎలాగైనా బతకాలనే పట్టుదల నడి సంద్రాన్ని ఎదురీదేలా చేసింది. 12 గంటల పాటు సముద్రంలో ఆ మత్స్యకారుడు చేసిన సాహసమే అతడి ప్రాణాలను రక్షించింది. ఈ సంఘటన కాకినాడ సమీపంలో నడి సంద్రంలో జరిగింది. దీనికి సంబంధించి తోటి మత్స్యకారులు తెలిపిన వివరాలివీ.. కొత్తపల్లి మండలం ఉప్పాడకు చెందిన పలువురు కాకినాడ శివారు రేపూరుకు చెందిన గేదెల అప్పారావుతో కలిసి బోటుపై మంగళవారం రాత్రి సముద్రంలో వేటకు వెళ్లారు. కాకినాడ తీరానికి సుదూర సముద్రంలో రాత్రి 8 గంటలకు చేపల కోసం సముద్రంలో వల వేసి బోటులో అందరూ పడుకున్నారు. తెల్లవారుజామున 4 గంటలకు అందరూ లేచి చూసేసరికి అప్పారావు కనిపించలేదు. దీంతో ఈ విషయాన్ని ఉప్పాడ, అంతర్వేదిలో తోటి మత్స్యకారులకు చెప్పగా వారు మరో బోటుపై వెళ్లి అప్పారావు కోసం గాలించారు. అయినా ఆచూకీ లభించలేదు. ఇంతలో అంతర్వేది తీరం నుంచి చిన్న తెప్పపై చేపల వేటకు వెళ్లిన కొందరు మత్స్యకారులకు నడి సంద్రంలో ఓ వ్యక్తి తేలియాడుతూ కనిపించాడు. వెంటనే అక్కడికి వెళ్లి అతడిని తమ తెప్పలోకి ఎక్కించుకోగా కొన్ని క్షణాల్లోన్నే అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. మత్స్యకారుల సపర్యలు.. దీంతో తోటి మత్స్యకారులు అతడి గుండెలపై బలంగా గుద్ది తాగిన నీటిని కక్కించి సపర్యలు చేయడంతో అతడిలో కదలికలు వచ్చాయి. వెంటనే అతడిని అంతర్వేది వద్ద ఒడ్డుకు చేర్చి 108లో రాజోలు ఆస్పత్రికి తరలించారు. అనంతరం అతడిని అప్పారావుగా గుర్తించారు. కాగా, చేపల కోసం వల వేసి అందరూ పడుకున్నాక తాను బహిర్భూమికి వెళ్లానని, ఇంతలో బోటు కదలడంతో ప్రమాదావశాత్తు సముద్రంలో పడిపోయానని అప్పారావు చెప్పాడు. 12 గంటల పోరాటం.. ఎంతసేపు ఈత కొట్టినా బోటు కనిపించకపోవడం..సముద్ర ఒడి ఎక్కువగా ఉండటంతో అలా ఈదుకుంటూ వచ్చానని తెలిపాడు. ఓపిక ఉన్నంత వరకు ఈదుకుంటూ తీరం వైపు వెళుతున్న తనకు ఎండ ఎక్కడంతో ఓపిక తగ్గిపోయిందని.. దీంతో మునిగిపోకుండా తానున్న స్థలంలోనే పైకి తేలి ఉండే విధంగా ప్రయత్నం చేశానని చెప్పాడు. 12 గంటల శ్రమ అనంతరం చివరకు తనకు దూరంగా ఒక తెప్ప కనిపించడంతో చేతులు పైకి ఊపుతూ రక్షించమని అడిగానని..ఆ తెప్పలో ఉన్నవారు తనని కాపాడారని అప్పారావు చెప్పాడు. ఇది కూడా చదవండి: 'ఫ్యామిలీ డాక్టర్' పథకంతో మంచి ఫలితాలు.. ఆరేళ్లు దాటాక కూడా ప్రత్యేక శ్రద్ద -
వేట సమయంలో చనిపోయిన మత్స్యకారులకు రూ.10 లక్షలు ఇస్తున్నాం
-
తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి కాంగ్రెస్ ఫిషర్ మెన్ విభాగం యత్నం
-
నడిసంద్రంలో బిగ్ ఫైట్.. చెన్నై బోట్లను తరిమేశారు!
చెన్నై మత్స్యకారులు బరితెగించారు. ఎప్పటిలాగే మన సముద్ర తీర ప్రాంతం వైపు చొరబడ్డారు. అక్రమంగా మత్స్య సంపదను దోచుకుపోతున్నారు. పెద్ద పెద్ద బోట్లలో వచ్చి వేటాడటాన్ని మనవాళ్లు గుర్తించారు. సినిమాను తలపించే విధంగా నడిసంద్రంలో చెన్నై సోనాబోట్లను వెంటాడారు. తీరం నుంచి మెరైన్ పోలీసులు, మత్స్యకారులు, మత్స్యశాఖ సిబ్బంది 10 కిలో మీటర్లు సముద్రంలో ప్రయాణించి పెద్ద పెద్ద బోట్లతో నిబంధనలు అతిక్రమించి వేటాడుతున్న 16 బోట్లను వెంబడించి తరిమికొట్టారు. దీంతో వారు తోక ముడిచి వలలను వదిలి ఉడాయించారు. ఈ ఘటన బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కొత్తపట్నం తీరంలో చోటుచేసుకుంది. కొత్తపట్నం: గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలోని సముద్ర తీరం వెంబడి చెన్నై సోనా బోట్లు నిబంధలకు విరుద్ధంగా వేట సాగిస్తున్నాయి. తీరానికి అతి దగ్గరలో 100 మీటర్ల దూరంలో తమిళనాడు మత్స్యకారులు వేట చేయడం పరిపాటిగా మారింది. వారి బోట్లు 40 అడుగుల ఎత్తులో, మన బోట్లు ఐదు అడుగుల ఎత్తులో ఉండటంతో వారిని స్థానిక మత్స్యకారులు కట్టడి చేయడం కష్టతరంగా మారింది. ఈ విషయాన్ని మత్స్యశాఖ అధికారులు, మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. అయినా పరిష్కారం కాలేదు. బాలినేని శ్రీనివాసరెడ్డి చొరవతో.. వైఎస్సార్ సీపీ రీజినల్ కోఆర్డినేటర్, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి చొరవతో చెన్నై సోనా బోట్లు అదుపు చేశారు. తమిళనాడుకు చెందిన మత్స్యకారులు పెద్ద బోట్లలో తీరానికి దగ్గరగా వచ్చి మా సంపద కొల్లగొడుతున్నారని స్థానిక మత్స్యకారులు గత ఏడాది డిసెంబర్ 30న బాలినేని దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన కె.పల్లెపాలెం తీరానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. నిజాంపట్నంలో సోనా బోటును బాడుగకు తీసుకొచ్చి చెన్నై మత్స్యకారులు వేటాడుతున్న ప్రాంతానికి వెళ్లి భయపెట్టాలని, వారిని అక్కడ వేటాడకుండా చేయాలని, ఆ బోటుకు ఎంత ఖర్చయినా తాను పెట్టుకుంటానని జేడీ ఆవుల చంద్రశేఖరరెడ్డిని ఆదేశించారు. తాజా వివాదం ఇలా.. బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు మత్స్యశాఖ అధికారులు స్పందించారు. నిజాంపట్నం నుంచి సోనా బోటును కొత్తపట్నం తీసుకొచ్చే సమయంలో గుండాయపాలెం వచ్చే సరికి ఇంజన్ చెడిపోయి అక్కడే ఉండిపోయింది. దీంతో మత్స్యకార జేడీ చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో మూడు ఫైబర్ బోట్లను సిద్ధం చేసుకున్నారు. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సముద్రంలో గస్తీ తిరిగారు. మత్స్యకారులు, మెరైన్ సిబ్బంది, మత్స్యశాఖ అధికారులు సముద్రంలో 10 కిలో మీటర్ల దూరంలో వేటాడుతున్న చెన్నై సోనా బోట్ల సమీపానికి చేరుకున్నారు. అప్పుడు 16 బోట్లు వేటాడుతున్నాయి. వారి దగ్గరకు వెళ్లే కొద్దీ వారు వలలను వదిలేసి వేగంగా తమ ప్రాంతానికి తిరిగి వెళ్లడం ప్రారంభించారు. వారి వెంటబడి మరో 10 కిలో మీటర్ల దూరం తరిమి కొట్టారు. వారు వదిలి పెట్టి వెళ్లిన వలలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సముద్రంలో బోటు ద్వారా వెళ్లిన వారిలో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు సముద్ర తీర మత్స్యకార్మిక యూనియన్ అధ్యక్షుడు గొల్లపోతు నాగార్జున, జిల్లా మత్స్య శాఖ సహకార సంఘం అధ్యక్షుడు వాయల శ్రీనివాసరావు, కాపులు తంబు వెంకటేశ్వర్లు, సింగోతు వెంకటేశ్వర్లు, సైకం పోతురాజు, సొసైటీ అధ్యక్షుడు గొల్లపోతు పేరయ్య, పెదసింగు వెంకటేశ్వర్లు, కొక్కిలగడ్డ చిన్న లక్ష్మణ, మెరైన్ సీఐ కట్టా శ్రీనివాసరావు, మత్స్యశాఖ ఏడీ ఉషాకిరణ్, ఎఫ్‌డీవో ఆషా, విలేజి ఫిషరీస్ అసిస్టెంట్లు, సాగర్ మిత్రలు, మెరైన్ పోలీసులు, మత్స్యకార సిబ్బంది ఉన్నారు. వారానికి ఒక రోజు సముద్రంలో గస్తీ వారానికి ఒక రోజు సముద్రంలో బోట్ల ద్వారా గస్తీ తిరిగితే చెన్నై బోట్లు మన ప్రాంతానికి రావటానికి భయపడతాయి. మన మత్స్య సంపద కోల్పోము. బాలినేని శ్రీనివాసరెడ్డి చొరవతో మత్స్యకారులకు మంచి జరిగింది. ఆయనకు కృతజ్ఞతలు. – గొల్లపోతు నాగార్జున, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు మత్స్యకార్మిక యూనియన్ అధ్యక్షుడు బోట్ల ద్వారా ఎప్పుడూ తరిమికొట్టలేదు సోనా బోట్లను తరిమి కొట్టండి అని బాలినేని శ్రీనివాసరెడ్డి అధికారులకు మంచి సూచనలు ఇచ్చారు. ఇటువంటి ప్రయత్నం గతంలో ఎప్పుడూ చేయలేదు. ఆయన సొంత నగదు ఇస్తానని భరోసా ఇవ్వటం మత్స్యకారులకు ఎంతో సంతోషంగా ఉంది. ఇదే విధంగా తరచూ బోట్ల ద్వారా సోనా బోట్లను వెంటాడితే స్థానిక మత్స్యకారులకు మేలు జరుగుతుంది. – వాయల శ్రీనివాసరావు, మత్స్యకార సహకార సంఘం అధ్యక్షుడు -
ఎనిమిదేళ్ల నాటి విమానం మిస్సింగ్ మిస్టరీ.. కూలిందా? కూల్చారా!
మలేషియా ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ ఎంహెచ్ 370 విమానం 2014 మార్చి 8న మిస్సయ్యింది. ఆ విమానం ఆచూకీ కోసం గాలించినా... కనిపించకపోయేసరికి కూలిపోయిందనే నిర్ధారణకు వచ్చారు అధికారులు. ఐతే ఇప్పుడూ ఆ విమానం కూలిందా? ఉద్దేశ్వపూర్వకంగా కూల్చేశారా అను పలు అనుమానాలు తలెత్తేలా ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మేరకు ఆ విమానంలో సుమారు 239 మంది ప్రయాణికులతో మలేషియాలోని కౌలాలంపూర్ నుంచి బీజింగ్ వెళ్తుండగా..ఆ విమానం ఆచూకీ కానరాకుండా పోయింది. దీంతో అప్పటి నుంచి ఆ విమానం మిస్సింగ్ మిస్టరీని చేధించే పనిలో పడ్డారు నిపుణులు. ఆ విమానానికి సంబంధించిన శకలాలను వెతికే పలు ప్రయత్నాలు చేశారు. ఆ బోయింగ్ 777 విమానం శకలాలు మడగాస్కన్ మత్స్యకారులకు లభించాయి. 2017లో వచ్చిన ఉష్ణమండల తుపాను ఫెర్నాండో నేపథ్యంలో మడగాస్కన్ సముద్ర తీరానికి విమాన శకలాలు కొట్టుకు రావడంతో టాటాలీ అనే మత్స్యకారుడు ఆ శిధిలాల భాగాన్ని గుర్తించినట్లు బ్రిటిష్ ఇంజనీర్ రిచర్డ్ గ్రాండ్ ఫ్రే చెబుతున్నారు. అతను నుంచి సేకరించిన శకలాల ఆధారంగా... ఉద్దేశపూర్వకంగానే విమానాన్ని సముద్రంలోకి కూల్చివేసినట్లు విమాన శకలాలను గాలించే నిపుణుడు అమెరికన్ బ్లెయిన్ గిబ్సన్, బ్రిటిష్ ఇంజనీర్ రిచర్డ్ గాడ్ ఫ్రే చెబుతున్నారు. అందుకు సాక్ష్యం ఆ మత్స్యాకారుడి వద్ద ఉన్న ల్యాండింగ్ బోర్డు గేర్ని చూస్తే తెలుస్తుందంటున్నారు ఆ నిపుణులు. ఎందుకంటే క్రాష్ అయినప్పుడు.. విమానాన్ని వీలైనంతగా మునిగిపోయేలా చేసేలా.. ల్యాండింగ్ బోర్డు గేర్ని పొడిగించిన విధానమే అసలైన ఎవిడెన్స్ అని చెప్పారు. ఎందుకంటే ల్యాండింగ్ సమయంలో ఏ పైలెట్ సాధారణంగా ల్యాండింగ్ గేర్‌ను తగ్గించరు. విమానం ముక్కలుగా విరిగిపోయే ప్రమాదం ఉండటమే గాక నీటిలో సులభంగా మునిగిపోతుంది. ప్రయాణికులు ఎవరు ప్రాణాలతో బయటపడే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయని నిపుణులు గిబ్సన్, ఇంజనీర్ రిచర్డ్ గాడ్ ఫ్రే చెబుతున్నారు. (చదవండి: చైనాకు ఎదరు తిరిగితే అంతే...ఆ యువతి ఇంకా నిర్బంధంలోనే..) -
వేలంలో రూ. 3 లక్షలు పలికిన స్పెషల్ చేప.. ఎందుకో తెలుసా.?
భువనేశ్వర్: ఎన్నో ఔషధ, పోషకాలతో కూడిన క్రోకర్ చేప ఒడిషాలోని భద్రక్ జిల్లాలో మత్స్యకారుల వలకు చిక్కింది. ధామ్రా నదీ సంగమ తీరంలో శుక్రవారం మత్స్యకారుడు హఫీజ్ ఉల్లా వేసిన వలలో 32కిలోలు ఉన్న ఈ భారీ జలపుష్పం లభ్యమైంది. దీనిని చాంద్‌బాలి చాందినిపాల్ చేపల వేలం కేంద్రంలో వేలం వేయగా, ముంబైకి చెందిన ఔషధాల కంపెనీ రూ.3 లక్షల 10 వేలకు దక్కించుకుంది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో లభించే ఈ చేప భద్రక్ ధామ్రా తీరంలో చిక్కడం విశేషం. దీనిని ఘోల్ చేప కూడా అంటారు. స్థానిక భాషలో తెలియా అని వ్యవహరిస్తారు. ఈ చేపలను ఎక్కువగా సింగపూర్, మలేషియా, ఇండోనేషియా, హాంగ్‌కాంగ్, జపాన్ దేశాల వారు దిగమతి చేసుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు. క్రోకర్ చేప గుండెను సీ గోల్డ్‌గా కొనియాడతారు. దీనిని ఎయిర్ బ్లాడర్‌తో తయారు చేసిన ప్రత్యేక దారం మనిషి గుండె శస్త్రచికిత్సలో కుట్లు వేసేందుకు వినియోగించడంతో గిరాకీ విపరీతంగా ఉంటుంది. క్రోకర్ మొప్పలతో తయారు చేసిన దారం సాధారణ పరిస్థితుల్లో శరీరంపై కుట్లు వేసేందుకు వినియోగిస్తారు. సుమారు మూడేళ్ల క్రితం జగత్సింఘ్పూర్ జిల్లా పారాదీప్ తీరంలో క్రోకర్ చేప వలకు చిక్కగా.. దీని ధర రూ.లక్షా 10 వేలకు పరిమితమైంది. ఇది కూడా చదవండి: వరదలో కొట్టుకువచ్చిన పులి.. బ్యారేజ్ గేట్ల వద్ద బతుకు పోరాటం -
జాలరికి చిక్కిన బాహుబలి చేప.. చూసేందుకు ఎగబడుతున్న జనం!
సాధారణంగా జీవనోపాధికోసం వేటకు వెళ్లే జాలర్లు ఎంతో కష్ట పడితే తప్ప.. వారి శ్రమకు తగ్గ ఫలితం దొరకదు. ఒక్కోసారి రోజులు గడిచిన ఒడ్డుకు రాలేని పరిస్థితి. ఎక్కువగా చేపలు వలకు చిక్కితేనే వారు తమ కుటుంబాలను పోషించగలరు, లేదంటే పిండి కొద్ది రొట్టేలా వారి జీవనం సాగిపోతుంటుంది. అందుకే జాలర్ల జీవితం నిత్య పోరాటమని అంటుంటారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో చేపల వేటకు వెళ్లిన ఓ మత్స్యకారునికి ఊహించని అనుభవం ఎదురయ్యింది. ఏకంగా భారీ బరువు గల చేపనే ఓ జాలరికి చిక్కింది. ఈ చేప బరువు అక్షరాలా 20 కిలోలు. ఇది చేపల్లో బాహుబలి. వంశధార రిజర్వాయర్‌లో మంగళవారం జాలరులకు చిక్కింది. ఈ చేపను చూడడంతో పాటు కొనుగోలు చేసేందుకు జనం ఆసక్తి చూపారు. చివరికి ఎల్‌ఎన్‌పేట మండలం చింతలబడవంజకు చెందిన చేపల వ్యాపారి రామారావు రూ.3 వేలు చెల్లించి సొంతం చేసుకున్నారు. చదవండి: చికెన్ ఖీమా దోసె.. తిన్నారంటే.. మామూలుగా ఉండదు మరి.. -
సెల్‌ఫోన్ స్విచ్చాఫ్.. చేపల వేటకు వెళ్లిన వాళ్లు ఏమయ్యారు?
సాక్షి, కృష్ణా: పొట్టకూటి కోసం చేపల వేటకు వెళ్లిన నలుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. ఈ విషాద ఘటన మచిలీపట్నం మండలంలో చోటు చేసుకోంది. వివరాల ప్రకారం.. నాలుగు రోజుల క్రితం చేపల వేట కోసం నలుగురు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లారు. అనుకోకుండా వాళ్లు ప్రయాణిస్తున్న బోటు ఇంజన్ పాడైనట్లు తమ కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. అయితే గత రెండు రోజుల నుంచి వారి సెల్ ఫోన్లు పనిచేయకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. దీంతో తమ వారు ప్రాణాలతో ఉన్నారో...లేరో తెలియక గల్లంతైన మత్స్యకారుల కుటుంబసభ్యులు తల్లడిల్లిపోతున్నారు. ఆ నలుగురు క్యాంబెల్పేటకి చెందిన వారుగా అధికారులు తెలిపారు. గల్లంతైన మత్యకారుల వివరాలు..విశ్వనాథపల్లి చినమస్తాన్(55), రామాని, నాంచార్లు(55), చెక్క నరసింహారావు (50), మోకా వెంకటేశ్వరరావు (35). మరో బోటులో క్యాంబెల్ పేట మత్స్యకారులు గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ వారి ఆచూకీ లభించలేదు. చదవండి: రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం.. చరిత్రలో ఇది రెండోసారి -
సాగర మథనం.. సాహస జీవనం
సాక్షి, నెల్లూరు: మత్స్యకారులు.. జన జీవన సవ్రంతి బతుకుతున్నా వారి బతుకు లోతుల్లోకి తొంగిచూస్తే విలక్షణత కనిపిస్తోంది. కడలి ఒడిలో చేపల వేటనే జీవనంగా మార్చుకున్న గంగ పుత్రులకు వేట విరామ సమయమే విశ్రాంతి. ఏడాదిలో పది నెలల పాటు సాగరాన్ని మథించే సాహజ జీవనాన్ని సాగిస్తుంటారు. ఎగిసిపడే కెరటాలను అవలీలగా దాటి కడలిని సునాయాసంగా ఈదే వీరు.. బతుకు పోరాటంలో దశాబ్దాలుగా ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నారు. వేటే వీరి జీవనాధారం.. ఆ వేట ఆగితే.. ఆ పూట గడిచేది కడుభారం. ప్రకృతి విపత్తులు, ప్రభుత్వ విధించే వేట నిషేధం కాలంలో బతుకు జీవనం పెను సవాల్‌గా ఉంటుంది. జీవితం.. విభిన్నం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 12 మండలాల పరిధిలో 169 కి.మీ. మేర సముద్ర తీరం ఉంది. ఆ తీరం వెంబడి ఉన్న 98 గ్రామాల్లో సుమారు 1.50 లక్షల మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. ఇందులో దాదాపు 41 వేల మంది చేపల వేటనే జీవనం మార్చుకుని జీవిస్తున్నారు. ఏటా దాదాపు 65 వేల టన్నుల మత్స్య సంపదను సముద్రం నుంచి సేకరిస్తున్నారు. కడలినే నమ్ముకున్న గంగపుత్రుల జీవన శైలి విభిన్నంగా ఉంటుంది. వేకువ జామున 2 గంటలకే సిద్ధం చేసుకున్న వలలను భుజాలపై వేసుకుని సంప్రదాయ బోట్లు ద్వారా సముద్రంలోకి వెళ్తారు. దాదాపు 5 కి.మీ. సముద్రంలోకి వెళ్లి వలలు వేసి మత్స్య సంపదను సేకరించి ఉదయం 8 గంటలకు తీరానికి చేరుకుంటారు. మెకనైజ్డ్ బోట్లు ఉన్న మత్స్యకారులు మాత్రం సముద్రంలో వెళ్లి వారం.. పది రోజుల పాటు అక్కడే ఉండి మత్స్య సంçపదను సేకరించి తీరానికి చేరుస్తారు. ఇలా పది నెలల పాటు ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కొంటూ కుటుంబాలను పోషించుకుంటారు. పగలంతా తమ వలలను సరి చేసుకుని మళ్లీ మరుసటి రోజుకు సన్నద్ధమవుతారు. ఇదే వీరి నిత్య జీవితం. కుటుంబ సభ్యులతో గడిపేది చాలా తక్కువ సమయం. ఇలా ఏడాదిలో పది నెలలు సముద్రంలోనే వీరి జీవితం గడిచిపోతుంది. వేటకు ఇలా వెళ్తారు.. గ్రామంలో మత్స్యకారులు బోటు సామర్థ్యాన్ని బట్టి యూనిట్‌గా ఏర్పాటవుతారు. పెద్దబోటులో (మూడు ఇంజిన్లు) ఉన్న దానిలో 30 మంది వేటకు వెళ్తారు. సింగిల్ ఇంజిన్ ఉన్న బోటులో నలుగురు వెళ్తారు. డబుల్ ఇంజన్ ఉన్న బోటులో 20 మందికి పైగా వేటకు వెళ్తారు. వారు సేకరించే మత్స్య సంపదను అందరూ కలిసి పంచుకుంటారు. ఒకసారి వేటకు వెళ్తితే బోటు డీజిల్ ఇతరత్రా ఖర్చులకు రూ.15 వేలు వరకు ఖర్చవుతుంది. వేటకు వెళ్లినప్పడు ఒక వేళ ఆయా బోటులు, వలలు మరమ్మతులకు గురైతే ఆ యూనిట్లో ఉన్న వారందరూ కలిసి దళారుల వద్ద వడ్డీతో అప్పు తెచ్చుకుని మరమ్మతులు చేయించుకుంటారు. వేట సాగించి వచ్చిన డబ్బులను ఆ దళారులకే వడ్డీతో కలిసి తిరిగి చెల్లిస్తుంటారు. జీవనం.. విశిష్టం చుట్టూ ప్రపంచం పాశ్చాత్య పోకడలతో విలాస జీవనం సాగిస్తుంటే.. వీరు మాత్రం కులాల కుంపట్లకు.. రాజకీయాలకు దూరంగా ఉంటారు. అందరిదీ ఒక్కటే మాట.. బాట. ఒక్క మాటలో చెప్పాలంటే.. తమకు తాముగా విధించుకున్న కట్టుబాట్లకు కట్టుబానిసలు. తప్పొప్పులు జరిగితే.. పరిష్కరించేందుకు వీరు పోలీస్స్టేషన్ల మెట్లు ఎక్కేది ఉండదు. వీరికి వీరు సృష్టించుకున్న చట్టం పేరు ‘దురాయి’. ఈ చట్టం కట్టుబాటును ఎవరూ ధిక్కరించరు. పెద్ద కాపు, నడింకాపు, చిన్నకాపు.. ఇలా ఈ ఊరిలో ముగ్గురిని గ్రామ పెద్దలుగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు. వీరు చెప్పిందే ఆ ఊరందరికి వేదం. చేసిన తప్పులకు వీరు వేసే శిక్ష వారిలో మార్పు తీసుకువచ్చే విధంగా ఉంటుంది. గ్రామ పెద్దలు ఒక నిర్ణయాన్ని తీసుకుంటే.. ఆ ఊరంతా అనుసరించాల్సిందే. ఎవరైనా ఈ నిర్ణయాన్ని ధిక్కరిస్తే.. అందరికీ ఆమోదయోగ్యంగా ‘దురాయి’ విధిస్తారు. విరామ సమయంలో.. వేట విరామ సమయంలో కూడా మత్స్యకారులు జీవనం కాస్త దుర్భరమైనప్పటికి కాయకష్టాన్నే నమ్ముకుంటారు. కొంత మంది అందుబాటులో ఉన్న ఆక్వా కల్చర్‌లో కూలీలుగా వెళ్తారు. రొయ్యల చెరువుల్లో పట్టడం, ప్యాకింగ్ చేయడం, ఇతరత్రా పనులకు వెళ్తారు. ఆయా పనులు దొరకని పక్షంలో కాలక్షేపం కోసం చింతబెత్తలతో ఆట, పులిమేక, కబడ్డీ ఇలా ఆడుకుంటున్నారు. మారుతున్న జీవన విధానం మత్స్యకారులు పల్లెల్లో ఇప్పుడిప్పుడే చేపల వేటతో పాటు ప్రత్యామ్నాయంగా వ్యవసాయం, ఉపాధి మార్గాలు అన్వేషించుకోవడం మొదలైంది. ఇందుకూరుపేట మండలంలో మైపాడులో మత్స్యకారులు వ్యవసాయం చేస్తున్నారు. వేరుశనగ, చేమ వంటి పంటలు సాగు చేస్తున్నారు. యువత చదువులపై దుష్టి సారించి విద్యావంతులుగా మారి ఉద్యోగావకాశాలు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. కానీ చేపల వేటను నమ్ముకున్న వారు మాత్రం వేటనే జీవనంగా మార్చుకుని ఇతరత్రా వ్యాపకాలపై దృష్టి సారించడం లేదు. మత్స్యకారుల జీవనశైలి విభిన్నం సముద్ర తీరం వారికి తల్లి ఒడి. కడలి ఘోష వారికి అమ్మ లాలిపాట. భీతిల్లే అలల్లో ఊయలలు ఊగినంతగా అలవోకగా జలరాసిపై అనునిత్యం సాగర మథనం. అగాధ జలనిధిలో సాహస సమరంతో జీవనం సాగించే మత్స్యకారుల దిన చర్య అర్ధరాత్రి నుంచి ఆరంభమవుతుంది. అందరూ జనం మధ్య తిరుగుతూ బతుకు జీవనం సాగిస్తుంటే.. వీరు మాత్రం నిర్మానుష్య కల్లోల కడలిలో మత్స్య వేట సాగిస్తుంటారు. ఇల్లు విడిచి కడలిలోకి వెళ్లి.. తిరిగొచ్చే వరకు అనుక్షణం ప్రకృతి విసిరే సవాళ్లను ఎదుర్కొంటారు. మత్స్యకారుల జీవన విధానం.. శైలి విభిన్నంగా ఉంటుంది. కట్టుబాటుకు కట్టుబానిసలు వీరు. మూడేళ్లలో ఎంతో మార్పు రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. మత్స్యకారుల జీవితాల్లో చాలా మార్పు ప్రారంభమైంది. ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు సముద్రంలో చేపల పునరుత్పత్తి జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వేటకు విరామం కల్పిస్తోంది. గత ప్రభుత్వాల కాలంలో అరకొర మందికి.. అదీ ఏడాదికి రూ.4 వేలు ఆర్థిక సాయం.. 20 కేజీల బియ్యం ఇచ్చి చేతులు దులుపుకునేవి. అయితే ఈ ప్రభుత్వం వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం ద్వారా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఏటా రూ.10 వేల ఆర్థిక సాయం అందిస్తున్నారు. వేట బోట్లకు డీజిల్ సబ్సిడీని గణనీయంగా పెంచారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతే రూ.10 లక్షలు పరిహారం అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా రూ.3.30 లక్షల విలువైన బోటు, మోటార్లు, వలలు రాయితీపై అందిస్తోంది. మెకనైజ్డ్ బోట్లు పంపిణీకి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. విరామ సమయంలో ఇబ్బందులే చేపల వేట విరామం సమయంలో పనులు లేక ఇబ్బందులు పడుతున్నాం. మాకు వ్యవసాయ భూములు లేవు. పంటలు పండించే విధానం తెలియదు. మాకు తెలిసిందల్లా చేపలు వేట చేయడం తెలుసు. రెండు నెలల పాటు పనులు లేక ఇళ్లవద్దనే ఉంటున్నాం. ప్రభుత్వం మాకిచ్చేఆర్థిక సాయంతో పాటు వలలు బోటులకు రాయితీతో రుణాలు ఇవ్వాలి. – ఎస్.ఆర్ముగం, కృష్ణాపురం ప్రభుత్వ సాయంతోనే.. వేట విరామ సమయంలో రెండు నెలల పాటు ఖాళీగా ఉంటున్నాం. స్థానికంగా మాకు పనులు లేవు. ఆక్వా సాగు చేసే వారు ఏదైనా పనులకు పిలిస్తే పోతాం. అర్హత ఉన్నవారికి మాత్రం ప్రభుత్వం రూ.10 వేలు వంతున సాయం చేస్తోంది. వీటితో పాటు సంక్షేమ పథకాల ద్వారా వచ్చే నగదుతోనే కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాం. – పి.చిన్న పిచ్చయ్య, కృష్ణాపురం అర్హులకు సంక్షేమ ఫలాలు మత్స్యకారులకు వేట విరామంలో ప్రభుత్వ సాయం అందిస్తోంది. జిల్లాలో ఉన్న 11 వేల మందికి రూ.10 వేలు వంతున ఆర్థిక సాయం అందించాం. ప్రధానమంత్రి మత్స్య సంపదయోజన పథకం ద్వారా కూడా బోట్లు, వలలు, అందిస్తున్నాం. మెకనైజ్డ్ బోట్లు పంపిణీకి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం.. ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రత్యేక పథకాలు రూపొందిస్తోంది. – నాగేశ్వరరావు, మత్స్యశాఖ జేడీ -
ప్రధానికి సీఎం స్టాలిన్ లేఖ
సాక్షి ప్రతినిధి,చెన్నై: శ్రీలంక ప్రభుత్వ చెరలో ఉన్న తమిళనాడు జాలర్ల విడుదలపై జోక్యం చేసుకోవాలని ప్రధాని నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ లేఖ ద్వారా బుధవారం విజ్ఞప్తి చేశారు. శ్రీలంక సముద్రతీర రక్షణ దళాలు 29 మంది జాలర్లను, వారికి చెందిన 79 మరపడవలను అక్రమంగా స్వాధీనం చేసుకున్నాయని అందులో పేర్కొన్నారు. ఈనెల 7వ తేదీన మూడు మరపడవల్లో చేపలవేటకు వెళ్లిన 11 మంది తమిళ జాలర్లను అరెస్ట్ చేసి శ్రీలంకలోని మయిలాట్టి కోస్ట్‌గార్డ్ ప్రదేశానికి తరలించారని, గత కొన్ని వారాలుగా శ్రీలంక కోస్ట్‌గార్డు అధికారాలు భారత్‌కు చెందిన అమాయక మత్స్యకారులపై దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు. ఇటీవలకాలంలో మూడుసార్లు జాలర్లను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. శ్రీలంక అధికారులు అసంబద్ధ వైఖరి వల్ల జాలర్ల జీవనాధారం దెబ్బతినడమే కాదు, వారి ప్రాణాలకు, హక్కులకు రక్షణ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీలంకలోని భారత రాయబార కార్యాలయం ద్వారా చర్చలు జరిపి మత్స్యకారుల విముక్తికి వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. ఇదిలా ఉండగా, జాలర్ల అరెస్ట్‌కు నిరసనగా రామేశ్వరంలో మాత్రమే కొసాగుతున్న మత్స్యకారుల సమ్మె మరింత విస్తృతం కానుంది. రామనాథపురం జిల్లావ్యాప్తంగా గురువారం నుంచి ఆందోళనకు దిగనున్నట్లు మత్యకార సంఘాలు స్పష్టం చేశాయి. ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే తమ కు ఈపరిస్థితి ఏర్పడిందని ఆరోపించాయి. -
అందరికీ ఆమోదయోగ్యంగా వేట సాగించాలి
మహారాణిపేట (విశాఖ దక్షిణ)/ఎంవీపీ కాలనీ (విశాఖ తూర్పు): విశాఖలో సమన్వయంతో చేపల వేట సాగించుకోవాలని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మత్స్యకారులకు విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నం కలెక్టర్ కార్యాలయంలో బుధవారం పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కలెక్టర్ ఎ.మల్లికార్జున, పోలీసు కమిషనర్ మనీష్ కుమార్ సిన్హాలతో కలిసి మత్స్యకారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చట్టపరిధిలో నిబంధనలను అనుసరిస్తూ అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా మత్స్యకారులు వేట సాగించాలన్నారు. మత్స్యకారుల మధ్య ఇంతకాలం లేని పొరపొచ్చాలు ఇప్పుడు ఎందుకు వచ్చాయో ఆలోచించాలన్నారు. మత్స్యకారుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నో కార్యక్రమాలను చేపట్టారని గుర్తు చేశారు. మరిన్ని సంక్షేమ పథకాలు తెచ్చేందుకు ఆలోచన చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ అధికారులతో టెక్నికల్ కమిటీని వేశామని.. మెరైన్ ఫిషరీస్ రెగ్యులర్ యాక్ట్ ప్రకారం బోట్లు ఉన్నవారందరూ వేట సాగించడానికి, వలలకు సంబంధించి లైసెన్స్‌లు పొందాలని సూచించారు. సమావేశంలో రాష్ట్ర మత్స్య శాఖ కమిషనర్ కె.కన్నబాబు, వీఎంఆర్డీఏ చైర్పర్సన్ అక్కరమాని విజయనిర్మల, రాష్ట్ర మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ కోలా గురువులు, అధికారులు, మత్స్యకార నేతలు పాల్గొన్నారు. అరెస్టులను నిరసిస్తూ మత్స్యకారుల ఆందోళన కాగా, విశాఖలో మత్స్యకారుల మధ్య రాజుకున్న వివాదం బుధవారం మరోసారి ఆందోళనకు దారితీసింది. రింగు వలల వేట నేపథ్యంలో తీరంలోని మత్స్యకార గ్రామాల మధ్య మంగళవారం ఘర్షణ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. బోట్లు దగ్ధం చేసిన ఘటనలకు సంబంధించి పిల్లా నూకన్న, వాడమధుల సత్యారావు అనే ఇద్దరిని విశాఖ మెరైన్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో వీరి అరెస్టులను నిరసిస్తూ పెదజాలరిపేట మత్స్యకారులు వాల్తేర్ ఆర్టీసీ డిపో కూడలిలో ఆందోళన నిర్వహించారు. దీంతో పరిస్థితి అదుపు తప్పకుండా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అరెస్ట్ అయిన ఇద్దరు మత్స్యకారులను పూచీకత్తుపై పోలీసులు విడుదల చేశారు. ఈ ఆందోళనల నేపథ్యంలో విశాఖలోని తీరప్రాంత గ్రామాల్లో 144 సెక్షన్ కొనసాగుతుందని ఉన్నతాధికారులు వెల్లడించారు. -
విశాఖ తీరంలో మత్స్యకారుల వేట వివాద పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు
-
ఫోన్ కొట్టేశాడని ఏకంగా తలకిందులుగా వేలాడదీశారు...ఐతే చివరికి!!
కొంతమంది చేసే పనులు అత్యంత హేయమైనవిగా ఉంటాయి. అసలు స్వతహాగా వాళ్లు మంచి వాళ్లైనప్పటికీ వారి జోలికి వచ్చిన లేక వారి సంబంధించిన వస్తువులు పోయినప్పుడు అపరిచితుడిలా మారిపోయి అత్యంత ధారుణానికి వడిగడుతుంటారు. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి ఎంత ధారుణమైన పని చేశాడో చూడండి. (చదవండి: పారా సెయిలింగ్ మళ్లీ ఫెయిల్ !... ఇద్దరు మహిళలకు చేదు అనుభవం!!) అసలు విషయంలోకెళ్లితే....మొబైల్ ఫోన్ దొంగిలించాడనే ఆరోపణతో ఒక మత్స్యకారుడిని తోటి మత్స్యకారుల బృందం చేపల వేట బోటుకు తలకిందులుగా వేలాడదీసి దాడి చేసింది. అయితే ఈ ఘటన బందూర్లోని మంగళూరు ఫిషింగ్ హార్బర్లో లంగరు వేసిన ఫిషింగ్ బోట్లో చోటు చేసుకుంది. అంతేకాదు దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తిపై మత్స్యకారుల బృందం దాడి చేసిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పైగా మత్స్యకారులంతా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారని పోలీసులు తెలిపారు. ఈ మేరకు సెల్‌ఫోన్‌ను దొంగిలించాడనే ఆరోపణతో దాడి చేసిన మత్స్యకారుడిని వైలా శీనుగా గుర్తించి అరెస్టు చేశాం అని చెప్పారు. అతేకాదు ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. (చదవండి: పంజాబ్ కోర్టు కాంప్లెక్స్‌లో పేలుడు) -
అదృష్టానికి అడ్డంగా దొరికాడు.. చేపల కోసం వల వేస్తే ఏకంగా..
అదృష్టం ఏ రూపాన వస్తుందో ఎవరికీ తెలియదు. అలా ఓ సారి వచ్చిన చాలు దెబ్బకు కోటీశ్వరులుగా మారిన వాళ్లు ఉన్నారు. తాజాగా ఓ జాలరీకి కూడా ఇలాంటి అదృష్టమే వరించింది. వివరాల్లోకి వెళితే.. ఓ మత్స్యకారుడు ఎప్పటిలానే సముద్రంలో వేటకి వెళ్లాడు. కొంత దూరం వెళ్లాక చేపల కోసం వల వేసి ఎదురుచూస్తున్నాడు. కాసేపు తరువాత తాను విసిరిన వలలో ఏదో చిక్కుకున్నట్లు అనిపించింది. అదేమిటో చూడాలని వలను లాగడానికి ప్రయత్నించాడు. అయితే అది కాస్త బరువుగా ఉండడంతో అంత సులువుగా రాలేదు. చివరికి ఎలాగో ఒకలా వలను పైకి లాగగా అందులో చాలా పెట్టెలు ఉన్న విషయాన్ని గ్రహించాడు. అలాగే ఆ పెట్టెలపై ఆపిల్ లోగో ఉంది. మొదట్లో ఆ పెట్టె ఖాళీ అయ్యుంటుందని భావించినప్పటికీ, దాన్ని తెరిచే చూసి షాక్ అయ్యాడు. ఎందుకంటే ఆ బాక్సులన్నీ యాపిల్ ఉత్పత్తులతో నిండిపోయాయి. అందులో చాలా ఐఫోన్, మ్యాక్బుక్లు ఉన్నాయి. వాటి విలువ లక్షల్లో ఉంటుంది. మరో రకంగా చెప్పాలంటే అతనికో చిన్న నిధి దొరికినట్లుగా భావించాడు. అయితే నీటిలో ఉన్న కారణంగా ఫోన్, మ్యాక్‌బుక్ పాడై ఉండొచ్చని అనుకున్నప్పటికీ అలా ఏం జరగలేదు. అందులో కొన్ని ఫోన్లను తెరిచి చూడగా అవి బాగానే పనిచేస్తున్నాయి. ఎందుకుంటే ఐఫోన్ వాటర్‌ప్రూఫ్ కనుక అవి నీటిలో ఉన్న అవి పాడైపోలేదు. మత్స్యకారుడు ఈ ఘటనను వీడియో తీసి టిక్‌టాక్‌లో అప్లోడ్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్లు పబ్లిసిటీ కోసమే ఈ బాక్సులను తానే మొదట విసిరాడని, తర్వాత అవి దొరికనట్లుగా సృష్టించాడని పలువురు వాపోతున్నారు. కొందరు లక్కీ బాయ్ అంటూ కామెంట్ పెట్టారు. చదవండి: బాప్రే! 14 అంతస్థుల భవనంలో అగ్ని ప్రమాదం... ఐతే ఆ ఇద్దరు...!! షాకింగ్ వీడియో -
జాలరి వలలో పంచలోహ మీనాక్షి అమ్మన్ విగ్రహం
సాక్షి, చెన్నై(తిరువొత్తియూరు): తిరుచెందూరు సమీపంలో జాలరి విసిరిన వలలో మీనాక్షి అమ్మన్ విగ్రహం చిక్కింది. తిరుచెందూరు అమలినగర్ మాతా ఆలయానికి చెందిన జోషఫ్ కుమారుడు జయన్ (37). గత 15వ తేదీ రాత్రి సముద్రంలో చేపలు పడుతుండగా వలలో సుమారు అడుగు ఎత్తు కలిగిన మీనాక్షి అమ్మవారి పంచలోహ విగ్రహం చిక్కుకుంది. దీన్ని గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులకు అప్పగించాడు. తిరుచెందూర్ తహసీల్దార్ స్వామినాథన్, శనివారం అమలినగర్‌కు వెళ్లి విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే తిరుకుళకుండ్రంలో ప్రసిద్ధి పొందిన వేద గిరీశ్వరర్ ఆలయంలో శనివారం ఉదయం దేవాదాయశాఖ మంత్రి బి.కె.శేఖర్‌బాబు తనిఖీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. త్వరలో వేదగిరీశ్వరర్ స్వామి ఆలయానికి రోప్‌కార్ సౌకర్యం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. చదవండి: (సీఎం స్టాలిన్ మరో కీలక నిర్ణయం.. సరికొత్త పథకానికి శ్రీకారం) -
భారీ వర్షాలు: మునిగిన 12 పడవలు..
Gujarat 12 Boats Sink in Sea Near Gir Somnath: గుజరాత్లో పెను విషాదం చోటు చేసుకుంది. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన 12 పడవలు మునిగిపోయాయి. వీటిల్లో 23 మంది మత్స్యకారులు ఉన్నట్లు సమాచారం. వీరిలో ఇప్పటి వరకు 11 మందిని కాపాడగ.. మిగతా వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. దక్షిణ గుజరాత్లో బుధవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చిన మార్పు కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం నుంచి గుజరాత్ వ్యాప్తంగా పలు నగరాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. అదే సమయంలో అరేబియా సముద్రం సమీపంలోని గిర్-సోమ్‌నాథ్ ప్రాంతంలో, బలమైన గాలులు వీచాయి. ఆ సమయంలో సముద్రంలోకి వేటకు వెళ్లిన 12 మత్స్యకారుల పడవలు మునిగిపోయాయి. (చదవండి: విషాదం నింపిన విహారయాత్ర) వాతావరణ మార్పుల గురించి అధికారులు మంగళవారం సాయంత్రం నుంచే హెచ్చరికలు జారీ చేశారు. వేటకు వెళ్లవద్దని పదే పదే హెచ్చరించారు. కానీ మత్స్యకారులు వాటిని పట్టించుకోకుండా వేటకు వెళ్లి.. ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. బుధవారం ప్రమాదం జరగడానికి కొంత సమయం ముందు కూడా అధికారుల హెచ్చరికలు జారీ చేశారు. సముద్రం లోపలికి వెళ్లవెద్దని అధికారులు హెచ్చరించారు. దాంతో చాలా మంది మత్స్యకారలు వెనక్కి వచ్చేశారు. గల్లంతయిన వారు కూడా తిరిగి వస్తుండగా.. బలమైన గాలులు వీచడం.. సముద్రం అల్లకల్లోలంగా మారడంతో వీరంతా గల్లంతయ్యారు. ప్రస్తుతం నేవీ అధికారులు, రెండు హెలికాప్టర్లను రంగంలోకి దించి గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. (చదవండి: చేపల ఆశీస్సులు కూడా ఉండాలి: కేంద్రమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు) దక్షిణ గుజరాత్ ప్రాంతంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. ఉన్నట్లుండి మూడు డిగ్రీలకు దిగజారింది. ఈ క్రమంలో డయ్యూ ప్రాంతంలో కూడా పడవ మునిగిపోవడం కారణంగా ఓ మత్స్యకారుడు మృతి చెందాడు. చదవండి: దొంగతనం: 3 నెలలుగా ఒంటిపూట భోజనం.. 10 కేజీలు బరువు తగ్గి మరీ -
సముద్రంలో పడవ బోల్తా.. జాలరి గల్లంతు
అచ్యుతాపురం (అనకాపల్లి): సముద్రంలో వేటకు వెళ్లిన పడవ బోల్తాపడటంతో ఓ జాలరి గల్లంతయ్యాడు. విశాఖ జిల్లా పూడిమడక తీరంలో శనివారం తెల్లవారు జామున ఈ ఘటన జరిగింది. ఇంజన్ లేని బోటులో పూడిమడకకు చెందిన తిక్కల వెంకన్న, మరో ముగ్గురు జాలర్లు సముద్రంలోకి వేటకు వెళ్లారు. కొంత దూరం వెళ్లాక బోటు బోల్తా పడింది. వీరిలో తిక్కల వెంకన్న (50) గల్లంతయ్యాడు. మిగిలిన ముగ్గురూ బోటును తిరగేసి వెంకన్న కోసం గాలించారు. అయినా జాడ కానరాకపోవడంతో ఒడ్డుకు వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వేటకు వెళ్లిన వారిలో వెంకన్నతో పాటు అతని కుమారుడు రాజు కూడా బోటులో ఉన్నాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ ఉపేంద్ర చెప్పారు. -
అమ్మో ఈ చేప ఖరీదు రూ.36 లక్షల!
పశ్చిమబెంగాల్: ఈ మధ్యకాలంలో అత్యంత భారీ చేపను పట్టుకుని ఒక్కరోజులోనే ధనవంతులుగా మారిన కథనాలు విన్నాం. అచ్చం అలానే పశ్చిమ బెంగాల్‌కి చెందిన మత్స్యకారుడు బార్మన్ భారీ తెలియా భోలా చేపను పట్టుకుని ధనవంతుడిగా మారిపోయాడు. (చదవండి: ఒక గంట వ్యవధిలో ఐదువేల కిలోగ్రాములు బరువుని ఎత్తి రికార్డు సృష్టించాడు) వివరాల్లోకెళ్లితే ఐదుగురు మత్స్యకారుల బృందం పశ్చిమ బెంగాల్‌లోని సుందర్బన్స్ నదులలో చేపలను వేటాడుతుండగా భారీ తెలియా భోలా చేపను పట్టుకున్నారు. అయితే ఆ చేప సుమారు 7 అడుగుల పొడవు, 75 కిలోగ్రాముల బరువు ఉంటుంది. ఈ మేరకు మత్స్యకారులందరూ సమిష్టిగా కష్టపడితేనే ఆ భారీ చేపను ఒడ్డుకు తీసుకురాగలరు. అంతేకాదు ఆ చేపను హోల్‌సేల్ మార్కెట్‌కి తీసుకువెళ్లితే అక్కడ అనుహ్యంగా అత్యధిక ధర పలికింది. దీంతో ఆ తేలియా భోలా చేప కిలో రూ.49,300 చొప్పున మొత్తం సుమారుగా రూ.36 లక్షలకు విక్రయించారు. పైగా ఈ చేప పొట్టలో అత్యంత విలువైన వనరులు ఉంటాయని వాటిని మందులు, ఇతర వస్తువుల తయారీలో వినియోగిస్తారని మత్స్యకారులు చెబుతున్నారు. ఈ సందర్భంగా మత్య్సకారుడు బార్మన్ మాట్లాడుతూ......"ప్రతి ఏడాది నేను తెలియా భోలా చేపలు పట్టడానికి వెళ్తాను. కానీ ఇంత పెద్ద చేపను పట్టుకుంటానని ఊహించ లేదు" అని చెప్పాడు. గతేడాది పశ్చిమ బెంగాల్‌లోని ఈ నదిలోనే 52 కిలోల భోలా చేపను పట్టుకున్న ఒక వృద్ధ మహిళ రాత్రికి రాత్రే ధనవంతురాలైన సంగతి తెలిసిందే. (చదవండి: చనిపోయిన సోదరుడి అస్థిపంజరంతోనే కలిసి ఉంటున్న సోదరులు) -
చేప కోసం వలేస్తే షార్కే పడింది
ఓ వ్యక్తి చేపల కోసం వలేస్తే షార్కే పడింది. అయినా షార్క్ అంత ఈజీగా పడుతుందా అంటారా.. కచ్చితంగా కాదు. ఆ వ్యక్తిని ముప్పుతిప్పలు పెట్టింది. గంట సేపు ప్రాణాలకు తెగించి పోరాడాడు. చివరకు బోట్లోకి చేర్చాడు. దాని కొలతలు తీసుకున్నాక తిరిగి సముద్రంలోకి వదిలేశాడు. ఇంగ్లండ్‌లోని నార్తాంప్టన్‌షైర్‌కు చెందిన సైమన్ డేవిసన్ ఎప్పటిలాగే సముద్రంలో వేటకు వెళ్లాడు. వలేశాడు. లాగి చూశాడు. చాలా బరువుగా ఉంది. ఉత్సాహం పెరిగింది. మరింత గట్టిగా ప్రయత్నం చేయగా భారీ షార్క్ బయటకు వచ్చింది. దాన్ని చూసిన డేవిసన్ గుండె గుభేలంది. మరో ఆరుగురి సహాయంతో దాన్ని బోట్లోకి చేర్చే ప్రయత్నం చేశాడు. భారీ పోర్బీగుల్ షార్క్.. ఒక్కసారిగా సముద్రంలోకి లాగింది. ఆ ధాటికి బోట్ 600 మీటర్లు ముందుకుపోయింది. ఇలా గంటసేపు పోరాటం తర్వాత అతి కష్టం మీద ఆ చేపను బోట్‌పైకి తెచ్చారు. దాని కొలతలు తీశారు. 7 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పు, దాదాపు 249 కిలోలు బరువు ఉన్న ఈ షార్క్‌ను చూసి కాసేపు సంబరాలు చేసుకున్నారు. ఆ తర్వాత దానికి ఉన్న బంధనాలు తొలగించి, జాగ్రత్తగా మళ్లీ సముద్రంలోకి వదిలేశారు. చదవండి: (కరోనా పూర్తి నిర్మూలన అసాధ్యం!) ఎందుకంటే.. చాలా మంది జాలర్లు షార్క్‌లను పట్టుకోరు. ఇప్పటివరకు ఇంగ్లండ్‌లో పట్టుబడ్డ ఈ తరహా షార్క్‌లలో ఇదే అతి పెద్దది కావడం విశేషం. ఇంత భారీ చేపలు వలకు చిక్కడం చాలా అరుదని జాలర్లు చెబుతున్నారు. గతంలో క్రిస్ బెన్నెట్ అనే జాలరికి ఇటువంటి 230 కిలోల షార్క్ దొరికింది. ఆ తర్వాత ఇదే భారీ షార్క్. ఇంత పెద్ద షార్క్ వలలో పడటం తన జీవితంలోనే మొదటి సారి అని డేవిసన్ చెప్పాడు. ఈ భారీ షార్క్‌తో పెద్ద పోరాటమే చేశామని, అటువంటి దానిని పట్టుకోవడం ఆనందం కలిగించిందని అన్నాడు. చదవండి: (ఇమ్రాన్‌తో బైడెన్ ఎప్పుడు మాట్లాడేదీ చెప్పలేం) -
వైరల్: వలలో పడ్డ భారీ షార్క్.. పడవ దగ్గరకు వచ్చి ఏం చేసిందంటే!
లండన్: యూకేకు చెందిన ఓ మత్స్యకారుడు అరుదైన రికార్డు బ్రేక్ చేశాడు. ఎలా అంటారా.. సముద్రంలో వేటకు వెళ్లిన అతను అనుకోకుండా ఓ భారీ షార్క్‌ను పట్టుకోగా ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. అయితే 1993లో ఓ మత్స్యకారుడికి 229 కిలోల షార్క్ దొరకగా ఇప్పటి వరకు ఆ రికార్డు అలానే ఉండిపోయింది. తాజాగా ఆ రికార్డు దీంతో బ్రేక్ అయింది. వివరాల్లోకి వెళితే.. నార్తాంప్టన్‌షైర్‌కు చెందిన సైమన్ డేవిడ్సన్ డెవోన్ తీరంలో ఎప్పటి లానే వేటకు వెళ్లాడు. కాకపోతే ఆ రోజు అతనికి అనూహ్యంగా 7 అడుగుల, 250 కిలోలు బరువున్న ఓ భారీ షార్క్ అతని వలలో పడింది. దీనిపై సైమన్ మాట్లాడుతూ.. తన ఎరకు ఏదో సాధారణ చేప చిక్కుకున్నట్లు అనుకున్నానని తెలిపాడు. ఒక గంటకు పైగా ఆ భారీ చేపతో కుస్తీ పడి, ఎలాగో చివరకు దాన్ని పడవలోకి లాగేశానన్నాడు. పడవలోకి లాగిన తర్వాత దాన్ని చూసి కంగారుపడినట్లు తెలిపాడు. అయితే కొంతసేపు అయ్యాక ఆ జీవిని మరో ఐదుగురితో కలిసి తిరిగి సముద్రంలో వదిలేశారు. సముద్రంలోకి వదిలే ముందు ఆ షార్క్ కొలతలు తీసుకున్నట్లు సైమన్ తెలిపాడు. చదవండి: మట్టి ముంతలో స్పెషల్ పిజ్జా.. నెటిజన్లకు నోరూరిస్తోంది -
అబ్బా.. 30 కిలోల చేప దొరికింది.. ధర ఎంత ఎంతంటే.??
సాక్షి, నల్గొండ: నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలంలో ఓ మత్స్యకారుడి వలకు 30 కిలోల బొచ్చ చేప చిక్కింది. మండలంలోని అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో శుక్రవారం మత్స్యకారుడు సూరిబాబు వేసిన వలలో ఈ భారీ చేప పడి.. అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. గతంలో ఇక్కడ పలుమార్లు 25 కిలోల చేపలు లభించినప్పటికీ ఈసారి 30 కిలోల చేప చిక్కడంతో సూరిబాబు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. అతను దాన్ని రూ.6,500కు విక్రయించాడు. చదవండి: (హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం) -
బంగారు చేప: రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన మత్య్సకారుడు
Ghol Fish Price In Mumbai: నీలి విప్లవంతో మత్య్సకారుల బతుకులు కొంత బాగుపడ్డాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వర్షాలు భారీగా పడుతుండడంతో మత్స్యకారులు బిజీగా మారారు. ఇలా చేపలు పడుతూ ఒక్కరోజే ఏకంగా కోటీశ్వరుడిగా ఓ వ్యక్తి మారాడు. ఆయన పట్టిన చేపలు అరుదైనవి.. పైగా ఆరోగ్యానికి దోహదం చేయడంతో విపరీతమైన డిమాండ్ వచ్చింది. వేరే రాష్ట్రానికి చెందిన వ్యాపారస్తులు భారీ ధరకు ఆ చేపలను కొనుగోలు చేశారు. ఈ సంఘటన మహారాష్ట్రలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. (చదవండి: శ్మశానంలో వర్షానికి నీటిలో తేలియాడిన మృతదేహం) మహారాష్ట్రలోని పాల్ఘర్కు చెందిన చంద్రకాంత్ థారె మత్స్యకారుడు. వర్షాకాలం నేపథ్యంలో కొన్ని రోజులుగా నిలిపివేసిన చేపల వేటను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పునఃప్రారంభించింది. దీంతో చంద్రకాంత్ ఆగస్టు 28వ తేదీన సముద్ర తీర ప్రాంతం వద్వాన్‌కు హర్బా దేవీ బోటులో తన బృందంతో కలిసి వెళ్లాడు. చేపల వేట సాగించగా పెద్ద ఎత్తున చేపలు పడ్డాయి. వాటిలో సముద్రపు బంగారంగా పిలిచే అత్యంత అరుదుగా లభించే చేపలు ‘గోల్ ఫిష్’ భారీగా పడ్డాయి. 157 చేపలు పడడంతో వాటిని తీసుకుని వచ్చాడు. మార్కెట్‌కు తీసుకెళ్లగా ఆ చేపలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. చదవండి: రాఖీ కట్టేందుకు వచ్చిన చెల్లెలు బంగారం అన్న చోరీ ఉత్తరప్రదేశ్, బిహార్‌కు చెందిన వ్యాపారస్తులు ఆ చేపలను ఏకంగా 1.33 కోట్లకు కొనుగోలు చేయడం విశేషం. ఇలా రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు. ఒక్కో చేప విలువ రూ.85 వేల దాక పలికింది. అంతగా ఆ చేపను కొనుగోలు చేయడానికి కారణం ఉంది. ఆ చేపల ప్రత్యేకత ఏమిటో తెలుసుకోండి.గోల్ ఫిష్ చేప శాస్త్రీయ నామం ‘ప్రొటనిబి డయాకాంతస్’. ఈ చేపకు హంకాంగ్, మలేసియా, థాయిలాండ్, ఇండోనేసియా, సింగపూర్, జపాన్‌లో విపరీతమైన డిమాండ్ ఉంటుంది. చాలా అరుదుగా లభించే ఈ చేపను వైద్య పరిశోధనలకు వినియోగిస్తారు. పైగా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఈ చేప. ప్రస్తుతం కాలుష్యం కారణంగా ఆ చేపలు అంతగా లభించడం లేదు. -
జగిత్యాలలో దెయ్యం చేప.. ఇది వేరే చేపల్నిబతకనివ్వదు!
సాక్షి, జగిత్యాల: తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలోని అన్ని చెరువులు దాదాపు నిండుకుండను తలపించాయి. చెరువుల్లో చేపలు పట్టేందుకు మత్య్సకారులు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం ఆత్మకూరు గ్రామంలో ఓ అరుదైన చేప వలకు చిక్కింది. చేపలు పట్టడానికి వెళ్లిన జాలరు గొల్లపెళ్లి రాజనర్సకు అరుదైన వింత చేప తన వలలో పడింది. ఈ విషయాన్ని జిల్లా మత్య్సశాఖ అధికారులకు తెలుపగా.. దీనిని డెవిల్(దెయ్యం) చేప అంటారని, ఇది ఎక్కువుగా సముద్ర జల్లాల్లో మాత్రమే కనిపిస్తుంటుందని అధికారులు తెలిపారు. మన తెలంగాణలోని వాగులో దొరకడం చాలా అరుదు అని పేర్కొన్నారు. కాగా ఈ రకపు డెవిల్ ఫిష్ పై నల్లటి మచ్చలు, ముళ్లు ఉంటాయి. ఈ చేప సుమారు అరకేజీకి పైగానే బరువు ఉంది. తాను ఎన్నో ఏళ్ల నుంచి చేపలు పడుతున్నా ఇలాంటి చేప ఎప్పుడూ చూడలేదని జాలరు రాజనర్సు తెలిపాడు. ఒంటినిండా జీబ్రా రకం గీతలతో కనిపించే ఈ చేపలో తినేందుకు మాంసం ఉండదు. పైగా చేప నిండా ముళ్లు, చర్మం కప్పబడినట్లు ఉంటుంది. సముద్రజాతికి చెందిన ఈ చేప నోరు అడుగు భాగంలో ఉంటుంది. చర్మం అంతా దుప్పటి కప్పబడినట్టు కన్పిస్తుంది. ఈ చేప ఉన్నచోట వేరే చేపలు బతకడం కష్టమని.. తన చుట్టూ ఉన్న మత్స్యాలను ఇది ఆహారంగా తీసుకుంటుందన్నారు. డెవిల్ ఫిష్‌కు పదునైన దంతాలు ఉండటం వల్ల వలలను సైతం కొరికి వేస్తుందని మత్య్సశాఖ అధికారులు చెబుతున్నారు. -
గల్లంతైన 12 మంది మత్స్యకారులు సురక్షితం..
-
రెండు టన్నుల బరువు.. వలకు చిక్కిన అరుదైన చేప
మహారాణిపేట (విశాఖ దక్షిణ): భీమిలి తీరంలో ఓ మత్స్యకారుడికి పులిబొగ్గాల సొర్ర అనే అరుదైన చేప చిక్కింది. సుమారు టన్నున్నర నుంచి రెండు టన్నుల బరువు ఉండే ఈ చేపను తినరు. పులిచారలు పోలి ఉంది. భీమిలి తీరంలో లభ్యమైన ఈ చేపను ఎన్నో వ్యయప్రయాసలకోర్చి విశాఖ ఫిషింగ్ హార్బర్‌కు తీసుకొచ్చారు. అయితే అప్పటికే ఆ చేప మృతి చెందింది. దీంతో మరో బోటులో తరలించి సముద్రంలో పడేసినట్టు రాష్ట్ర మరపడవల సంఘం కార్యవర్గ సభ్యుడు గణగళ్ల రాజేష్ తెలిపారు. -
వైరల్: బూట్లు తడుస్తాయని పడవ దిగనన్న మంత్రి.. ‘సిగ్గుచేటు’
చెన్నై: అధికారంలోకి వచ్చాక రాజకీయ నాయకులపై బరువు, బాధ్యతలు పెరుగుతాయి. ప్రజలతో మమేకమై వారి అభివృద్ధి కోసం నిత్యం పోరాడాల్సి ఉంటుంది. కానీ కొంత మంది నేతలకు మాత్రం గద్దె మీద కూర్చోవడంతో తమ పని అయిపోయింది అన్నట్లు ప్రవర్తిస్తుంటారు. జనాలతో ఓట్లు వేయించుకొని వారికి సేవ చేయాల్సింది పోయి.. ప్రజలతో పనులు చేయించుకుంటారు. ఇలాంటి ఘటనే తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. రాష్ట్ర మత్య్సకార శాఖామంత్రి అనితా రాధాకృష్ణన్ ఇటీవల సముద్రపు కోతను పరిశీలించేందుకు పాలవర్కడులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక మత్స్యకారులతో మాట్లాడారు. పరిస్థితి గురించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మంత్రివర్యులు మత్స్యకారులో బోటు ఎక్కి కొంతదూరం సముద్రతీరంలో ప్రయాణించారు. జాలర్ల సమస్యలు తెలుసుకోడానికి వెళ్లిన రాధాకృష్ణ అక్కడ కొంత దూరం పడవ ప్రయాణం చేశారు. అనంతరం నీళ్లలో అడుగుపెట్టి బోటు దిగడానికి ఇష్టపడలేదు. ఒకవేళ నీటిలో దిగితే తన ఖరీదైన బూట్లు, పంచె పాడవుతాయని భావించి అలాగే కూర్చున్నారు. దీంతో అక్కడున్న మత్స్యకారులు ఆయనను ఎత్తుకుని మోసుకెళ్లి నేలమీద దింపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ‘మంత్రిని ఇలా ఎత్తుకు రావడం ఆయన అహంకారానికి నిదర్శనం. మంత్రి అయితే మాత్రం మరీ ఇంత అధికార గర్వమా, సిగ్గుచేటు. అతను మంత్రిగా ఉండటానికి తగినవాడు కాదు.ఈ ప్రవర్తన డీఎంకే పార్టీకి అవమానకరం.’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. TN's Fisheries Minister Anitha Radhakrishnan, who doesn't want to get his shoes wet, carried by a fisherman, reports @PramodMadhav6. Was at Palaverkadu to inspect effects of sea erosion. (via @polimernews) pic.twitter.com/uJ88rAdg5i — Shiv Aroor (@ShivAroor) July 8, 2021 -
వైరల్: జాలరికి జాక్‌పాట్.. చేప కడుపలో కిక్కెంచే బహుమతి
అనకోకుండా దొరికే వస్తువులు మనకీ భలే అనందాన్నిస్తాయి. ఇటీవల సముద్రంలో చేపల వేట కోసం వెళ్లే జాలర్లకు ఇలానే అరుదైన వస్తువులు దొరికిన ఘటనలు మనం చూస్తూనే ఉంటాం. వారి దినచర్యలో ప్రతిరోజూ ఒకేలా ఉండవు ఒక్కోసారి రోజంతా వేట కొనసాగించిన చేపలతో కాకుండా నిరాశతో వెనక్కి వెళ్లాల్సి వస్తుంది. అలానే ఇంకో రోజు అనూహ్యంగా అనుకోని రూపంలో చేపలతో పాటు బహుమతులు లభిస్తుంటాయ్. ఈ తరహాలోనే ఓ మత్స్యకారుడు జాక్ పాట్ కొట్టేశాడు. వేట కోసమని వెళ్లిన అతనికి చేప మాత్రమే కాకుండా మరో అనుకోని బహుమతి లభించింది. ఇంకేముంది ఈ ఘటన కాస్త వీడియోగా మారి అది కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా రచ్చ చేస్తోంది. వివరాల్లోకి వెళితే.. చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లిన ఓ జాలరికి అనుకున్నట్లే భారీ ఆకారంలో చేపలు వలలో పడ్డాయి. ఇంక మన వాడు ఆనందంతో ఎప్పటిలానే చేపలను కటే చేస్తూ, శుభ్రపరుస్తుండగా ఓ చేప కడుపు లోపలి భాగాల్లో ఏదో వస్తువు గట్టిగా తగులుతుండడం గుర్తించాడు. ఇక ఆలస్యం చేయక కత్తితో కోసి చూడగా అందులో మద్యం సీసా ఫుల్ బాటిల్ ఉంది. ఇంకేముంది అతని ఆనందానికి అవదులు లేకుండా పోయాయి. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారి సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. కాగా ఈ వీడియోపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. మనుషుల బాధ్యతా రహితమైన ప్రవర్తనకు ఈ సంఘటన నిదర్శమని కొందరు కామెంట్ చేయగా.. మనం చేసే పనులు జంతుజలాలకు ఏ విధంగా ముప్పును కలిగిస్తుందో ఇది స్పష్టంగా చూపిస్తోందని మరి కొందరు జంతు ప్రేమికులు అసహనం వ్యక్తం చేస్తూ కామెంట్ చేశారు. మరికొందరు ‘జాక్‌పాట్ కొట్టావ్.. క్యాచ్ ఆఫ్ ది డే’ అంటూ ఫన్నీగా కామెంట్ చేశారు. చదవండి: లవ్‌బర్డ్ .... నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తోంది ..! -
కరోనా బాధితులకే కరువైందంటే.. చేపలకు ఆక్సిజన్!
సాక్షి, శంకరపట్నం(మానకొండూర్): కరోనా బాధితులకు ఆక్సిజన్ దొరక్క ఆస్పత్రుల్లో మృత్యువాత పడుతున్న ప్రస్తుత తరుణంలో కరీంనగర్ జిల్లా శంకరపట్నంలో ఓ మత్స్యకారుడు ఆదివారం చేపలకు ఆక్సిజన్ ఏర్పాటు చేసి విక్రయించాడు. శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామానికి చెందిన మత్స్యకారుడు పప్పు ప్రభాకర్ చేపలు విక్రయించేందుకు ట్రాక్టర్లో వాటర్‌ట్యాంక్ ఏర్పాటు చేసి దానికి ఆక్సిజన్ బిగించాడు. బతికిఉన్న చేపలు కొనడానికి ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపుతారని, అందుకే చేపలకు ఇలా ఆక్సిజన్ అందిస్తూ విక్రయిస్తున్నట్లు తెలిపాడు. -
అరుదైన ఎండ్రకాయ.. 20 లక్షల్లో ఒకటి ఈ విధంగా..
కార్న్‌వాల్: సాధారణంగా జాలర్లు సముద్రంలో వేటకు వెళ్తుంటారు. ఒక్కోసారి వారి వలకు అరుదైన జీవులు చిక్కుకుంటాయి. అలాంటి సంఘటన జరిగినప్పుడు జాలరులు చాలా అదృష్టంగా భావిస్తారు. ఒకవేళ అలాంటి జీవులు వారి వలలో చిక్కుకుంటే ఆ వేటగాడి ఆనందానికి అవధులే ఉండవు. అయితే, ఇలాంటి ఘటనే కార్న్‌వాల్ సముద్ర తీరం వెంబడి ఉన్న సముద్రంలో చోటుచేసుకుంది. డైలీ మెయిల్ రిపోర్ట్ ప్రకారం, 25 ఏళ్ల వయసున్న టామ్ ఒక రోజు లాంబోర్న్ తీరం వెంబడి సముద్రంలో వేటకోసం వెళ్లాడు. రోజులాగే ఏదో చేపలో, రోయ్యలో.. ఏవో జీవులు పడతాయనుకున్నాడు టామ్. కానీ, ఆ రోజు టామ్ తనవలలో పడిన జీవిని చూసి ఆశ్చర్యపోయాడు. ఆ జీవిని అంతకు ముందేప్పుడు చూడలేదు. అదోపెద్ద ఎండ్రకాయ. నీలి రంగులో ఉంది. చాలా పెద్దదిగా కూడా ఉంది. కాసేపు దాన్ని పరీక్షగా చూశాడు. అయితే, ఇంటికి తీసుకెళ్లటానికి కుదరక పోవడంతో దాన్ని తిరిగి సముద్రంలో వదిలేయాలని టామ్ అనుకున్నాడు. నీటిలోకి ఎండ్రకాయను వదలే ముందు దాన్ని పట్టుకున్నట్లు గుర్తుగా కొన్ని ఫోటోలు తీసుకున్నాడు. ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ఆ తర్వాత దాన్ని తిరిగి సముద్రంలోకి విడిచిపెట్టాశాడు. అయితే, కొన్నిరోజులకు టామ్ ఈ ఫోటోలను కార్న్‌వాల్‌లోని నేషనల్ లోబ్ట్సర్ విభాగానికి పంపించాడు. ఈ చిత్రాలను చూసిన వారు ఇది చాలా అరుదైనదని, కొన్నిరకాల జన్యువైవిధ్యాల వలన భిన్న రంగులను కల్గిఉంటుందని తెలిపారు. సాధారణంగా 20 లక్షల జీవుల్లో ఒకటి మాత్రమే ఇలాంటి అరుదైన వైవిధ్యాన్ని కల్గి ఉంటుందని పేర్కొన్నారు. ఇది, దాని జీవితకాలమంతా పెరుగుతునే ఉంటుందని అన్నారు. -
9 కిలోల ‘బంగారం’!
కురవి: మహబూబాబాద్ జిల్లా కురవి మండలం తిర్మలాపురం గ్రామంలోని చెరువులో మంగళవారం మత్య్సకారులు చేపలు పట్టారు. ఈ సందర్భంగా ఓ మత్స్యకారుడి వలలో తొమ్మిది కేజీల బరువున్న బంగారు వర్ణంలోని చేప పడింది. బంగారు తీగ రకానికి చెందిన ఈ చేప పూర్తిగా బంగారం రంగులో మెరిసిపోతుండగా, అదే గ్రామానికి చెందిన కల్లెపు కృష్ణ దీన్ని కొనుగోలు చేశారు. ఈ రకానికి చెందిన చేపలు అక్కడక్కడా బంగారు రంగుతో ఉండడం సహజమే అయినా, ఈ చెరువులో ఇంత పెద్ద చేప లభించడం ఇదే మొదటిసారని జాలరులు తెలిపారు. -
నాలుగో రోజుకు మత్స్యకారుల దీక్షలు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేయాలంటూ దీక్షలు కొనసాగుతున్నాయి. జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట మత్స్యకార యువజన సమాఖ్య ఆధ్వర్యంలో నాలుగో రోజు కూడా దీక్షలు కొనసాగాయి. విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేసినట్లయితే ఉత్తరాంధ్ర నుంచి వలసలు తగ్గుతాయని దీక్షాలో పాల్గొన్నవారు పేర్కొన్నారు. మత్స్యకార నాయకుడు జానకిరామ్ చేపట్టిన ఈ దీక్షకు వైఎస్సార్సీపీ కన్వీనర్ కే. రాజు మద్దతు పలికారు. చంద్రబాబు నాయుడు, టీడీపీ నాయకులు ఎన్ని అడ్డంకులు పెట్టినప్పటికీ విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రావడం ఖాయమని కే. రాజు ధీమా వ్యక్తం చేశారు. -
800 కిలోల భారీ చేప..వీడియో వైరల్
-
800 కిలోల భారీ చేప..వీడియో వైరల్
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లోని డిఘా తీర ప్రాంతంలో మత్స్యకారులకు భారీ చేప చిక్కింది. 800 కిలోల బరువున్న ఈ అరుదైన చేపను శంకర్ చేప అని పిలుస్తారని స్థానికులు తెలిపారు. ఏనుగు చెవిని పోలిన ఈ చేప 8 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పుతో ఉంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ భారీ చేపను చూడటానికి స్థానికులు సైతం పెద్దసంఖ్యలో తరలివచ్చారు. తీరప్రాంతంలో చేపలవేటకు వెళ్లిన మత్సకారులకు ఇది చిక్కింది. అయితే ఇంత భారీ చేపను తామెప్పుడూ చూడలేదని తెలిపారు. ఈ అరుదైన చేప 50వేలకు అమ్ముడైంది. రే కుటుంబానికి చెందిన ఈ చేపను శంకర్ చేప అని పిలుస్తారు. ముఖ్యంగా ఈ తరహా చేపలను బెంగాల్ వాసులు ఇష్టపడుతారట. గతేడాది మార్చిలోనూ ఇదే రకానికి చెందిన 300కిలోల చేప మత్సకారులకు చిక్కింది. (నోరూరించే పీతల కూర.. సరోజ్ దీదీకి సాయం!) -
మత్స్యకారులను ఏపీకి రప్పించేందుకు రూ. 3 కోట్లు
సాక్షి, తాడేపల్లి : లాక్డౌన్ కారణంగా గుజరాత్లో చిక్కుకున్న తెలుగు మత్స్యకారులను ఆంధ్రప్రదేశ్ తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చర్యలు చేపట్టారు. అక్కడ చిక్కుకుపోయిన దాదాపు 5 వేల మంది మత్స్యకారులను ఏపీకి రప్పించేందుకు సీఎం వైఎస్ జగన్ రూ. 3 కోట్లు మంజూరు చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ మొత్తాన్ని విడుదల చేశారు. ప్రత్యేక రవాణా సదుపాయం ద్వారా.. గుజరాత్‌లోని తెలుగు మత్య్సకారులను ఏపీకి రప్పించాలని సీఎం జగన్ ఆదేశించారు. చదవండి : రైతులకు క్రెడిట్, డెబిట్ కార్డులు -
‘వారి కుటుంబాలు ఆందోళన చెందొద్దు’
సాక్షి, తాడేపల్లి: లాక్డౌన్ కారణంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొంతమంది మత్సకారులు గుజరాత్లో చిక్కుకుపోయారని, వారిని తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని కోవిడ్-19 టాస్క్‌ఫోర్స్ చైర్మన్ కృష్ణబాబు తెలిపారు. వారి కుటుంబసభ్యలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. గురువారం తాడేపల్లిలోని మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గుజరాత్ సీఎం విజయ్‌రూపానీతో ఈ విషయంపై మాట్లాడారని, మన వాళ్లకి అక్కడ ఆహారాన్ని అందిస్తున్నారని చెప్పారు. దానికి కోసం ఏపీ ప్రభుత్వమే వారి ఖర్చు భరిస్తోందని చెప్పారు. (విజయ్ రూపానీకి సీఎం జగన్ ఫోన్) ఆహారం విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకపోయిన వసతి విషయంలో కొంత ఇబ్బంది ఉందని తెలిపారు. స్పెషల్ కేసు కింద వారిని ఇక్కడికి తీసుకురావాలని సీఎం అధికారులను ఆదేశించారన్నారు. ప్రత్యేక వెస్సెల్ ద్వారా వారిని ఏపీకి తీసుకువస్తామని తెలిపారు. వైఎస్జగన్ వారిని తీసుకువచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. ఇక్కడికి చేరుకున్న తరువాత వారికి అన్ని రకాల వైద్యపరీక్షలు చేస్తామన్నారు. అక్కడ ఉన్న మత్యకారులలో ఇద్దరు చనిపోయారని, అయితే వారికి కరోనా లక్షణాలు లేవని కృష్ణబాబు తెలిపారు. (కరోనా: రహస్యంగా వస్తున్న వలస మత్స్యకారులు ) -
కొండెక్కిన చేపల ధరలు
సాక్షి, హైదరాబాద్: చేపల ధరలు కొండెక్కికూర్చున్నాయి. కరోనా కారణంగా గత కొద్ది రోజులనుంచి ఎక్కడా కనిపించని చేపలు బుధవారం అక్కడక్కడా విక్రయానికి వచ్చాయి. అయితే ధరలు మాత్రం అమాంతం పెరిగిపోయాయి. రవ్వ, బొచ్చ, బంగారుతీగ చేపల ధరలు కిలో రూ. 200 దాటిపోయాయి. కొర్రమీను ఏకంగా 700 నుంచి 800 వరకు పలికింది. ఏపీ నుంచి చేపలు వస్తుండటం, తెలంగాణ మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకపోవడంతో ధరలు ఇలా పెరిగిపోయాయని వ్యాపారులు అంటున్నారు. ధరలను అందుబాటులో ఉంచుతామని చెబుతున్న అధికారులు కట్టడి చేయడంలో విఫలమయ్యారు. అధిక ధరలను కట్టడిచేసి చేపలు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చూడాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు. త్వరలో ధరలు అందుబాటులోకి.. ‘కరోనా నేపథ్యంలో తెలంగాణ మత్స్యకారులు చేపలు పట్టడంలేదు. దీంతో డిమాండ్ కారణంగా కొంత మేర ధరలు పెరిగాయి. ఆదివారంలోగా ధరలు తగ్గుముఖం పడతాయి. మంత్రి, కమిషనర్ ఆదేశాల మేరకు కరోనా నేపథ్యంలో పాటించాల్సిన నిబంధనలు, ధరలపై హైదరాబాద్‌లో మత్స్యకారులతో సమావేశం ఏర్పాటు చేశాం. ధరలపై సుదీర్ఘంగా చర్చించాం’అని అధికారులు తెలిపారు. కాగా, ఏపీ నుంచి సరుకులు తీసుకొచ్చే వాహనాలు దొరకడం లేదని, రవాణా భారం ఖర్చు చేపల ధరలతో కలిపి అమ్మాల్సి వస్తోందని విక్రయదారులు అంటున్నారు. -
క్వారంటైన్‌కు 1,700 మంది
సాక్షి, నెల్లూరు: కర్ణాటకలో జీవనోపాధి కోసం వెళ్లి అక్కడ చిక్కుకుపోయిన దాదాపుగా 1,700 మంది జాలర్లను ఎట్టకేలకు జిల్లాకు తీసుకుని వస్తున్నారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన వీరందరూ కర్ణాటక సముద్ర తీరంలో చేపల వేటకు వెళ్లారని, కరోనా వైరస్ ప్రబలుతుండడంతో లాక్డౌన్ నేపథ్యంలో స్వగ్రామాలకు వచ్చేందుకు వీలు లేకుండా పోయింది. వీరు సొంత జిల్లాలకు రావాలని చూసినా ఆంక్షల కారణంగా అక్కడి అధికారులు కర్ణాటక సరిహద్దులోని క్వారంటైన్లో ఉంచారు. అక్కడ వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఆఫ్కాబ్ చైర్మన్ కొండూరు అనిల్‌బాబు రాష్ట్ర మంత్రి పి అనిల్‌కుమార్ దృష్టికి తీసుకు వచ్చారు. (లాక్డౌన్: బాయ్‌ఫ్రెండ్‌ను మిస్ అవుతున్న క్రీడాకారిణి) దీంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, సీఎంఓ అధికారులు మంత్రి అనిల్ మాట్లాడారు. కాగా అక్కడి కర్ణాటక అధికారులతో కూడా చర్చించి ఎట్టకేలకు సరిహద్దులో ఉన్న జాలర్లను జిల్లాకు తీసుకు వచ్చేందుకు ఏర్పాటు చేస్తున్నారు. వీరందరిని గూడూరులోని ఆదిశంకర కళాశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్లో ఉంచేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో వారిని ప్రత్యేక వాహనంలో తీసుకువస్తున్నారు. ఎమ్మెల్యేలు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, మంత్రి పి అనిల్‌కుమార్, ఆఫ్కాబ్ చైర్మన్ కొండూరు అనిల్‌బాబు చొరవతో జాలరర్లు జిల్లాకు వస్తుండడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. క్వారంటైన్‌కు పెరిగిన బాధితులు – ఒక్కసారిగా 73 మంది తరలింపు నెల్లూరు(అర్బన్): తాజాగా ప్రకాశం జిల్లాలో మరో ఇద్దరు వ్యక్తులకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆ జిల్లా అధికారులతో పాటు నెల్లూరు జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ఇటీవల మత పరమైన కార్యక్రమానికి కొంత మంది ఢిల్లీకి వెళ్లి వచ్చారు. ఈ క్రమంలో నెల్లూరు, చీరాల ప్రాంతానికి చెందిన వారు ఒకే బోగీలో ఈ నెల 17న ప్రయాణించారు. ప్రస్తుతం పాజిటివ్ వచ్చిన వారు కూడా అదే బోగీలో ప్రయాణించడంతో అధికారులు లెక్కలు తీశారు. ఆ బోగీలో 300 మంది వరకు ప్రయాణించినట్టు గుర్తించారు. వారందరినీ గుర్తించి క్వారంటైన్‌కు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. (లాక్‌డౌన్‌కు నై..) ఇలా ఇప్పటికే నెల్లూరు డైకస్‌రోడ్డు ప్రాంతానికి చెందిన 23 మందిని గుర్తించి ఆదివారం రాత్రి పెద్దాస్పత్రిలోని క్వారంటైన్ వార్డుకు తరలించారు. చీరాల ప్రాంతంలో మరో 40 మందిని గుర్తించిన అధికారులు వారిని కూడా కోవిడ్ రీజినల్ ఆస్పత్రిగా మార్చిన నెల్లూరుకే తరలించారు. ఇంత పెద్ద మొత్తంలో అనుమానితులను క్వారంటైన్‌కు తరలించడంతో జిల్లాలో సంచలనంగా మారింది. కలెక్టర్ శేషగిరిబాబు, ట్రెయినీ కలెక్టర్ కల్పనాకుమారి, సీఐ నాగేశ్వరమ్మ, వైద్యాధికారులు వారిని పర్యవేక్షిస్తున్నారు. ఇదిలా ఉండగా కరోనా వార్డుకు అల్లూరు ప్రాంతం నుంచి మరో అనుమానిత కేసు కూడా అర్ధరాత్రికి పెద్దాస్పత్రికి వచ్చింది. అల్లూరులో... అల్లూరు: ఈ నెలలో మతపరమైన కార్యక్రమం కోసం ఢిల్లీకి వెళ్లి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు ఉండటంతో గుంటూరులోని ప్రభుత్వాస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అప్రమత్తమైన అధికారులు అతను ప్రయాణించిన రైలుబోగీలోని ప్రయాణికుల వివరాలు సేకరించే పనిలో పడ్డారు. అల్లూరు మండలం నుంచి ముగ్గురు వ్యక్తులు ఆ బోగీలోనే ప్రయాణించినట్టు వారికి తెలిసింది. ముగ్గురిలో ఒకరు మండలంలోని ఇస్కపల్లి కుర్రు ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. మరో ఇద్దరు అల్లూరు, నార్త్‌మోపూర్ ప్రాంతాలకు చెందినవారుగా గుర్తించారు. వీరిని నెల్లూరు పెద్దాస్ప త్రిలోని కరోనా వార్డుకు తరలించేందుకు చర్యలు చేపట్టారు. -
చిక్కుల్లో సిక్కోలువాసులు
ఎచ్చెర్ల క్యాంపస్/ఎచ్చెర్ల: కరోనా వైరస్ సిక్కోలువాసులను చిక్కుల్లో పడేసింది. బతుకు తెరువు కోసం వలస వెళ్లిన వారితో పాటు యాత్రికులను ఎక్కడికక్కడ నిర్బంధంలో చిక్కుకునేలా చేసింది. తమ సొంత గ్రామాలకు ఎలా చేరుకోవాలో తెలియక వారంతా బిక్కుబిక్కుమంటూ ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా మత్స్యకారులు ఎక్కువ మంది ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్నారు. జిల్లాలోని ఎచ్చెర్ల, రణస్థలం, గార, శ్రీకాకుళం రూరల్, ఇచ్ఛాపురం, కవిటి, పలాస, సోంపేట, వజ్రపుకొత్తూరు తదితర ప్రాంతాలకు చెందిన ఎక్కువ మంది మత్స్యకారులు వలస కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. వీరంతా గుజరాత్ రాష్ట్రంలోని వీరావల్, సూరత్, మహరాష్ట్రలోని పూనే, ముంబై, కర్ణాటకలోని మంగుళూరు, పశ్చిమ బెంగాల్, కేరళ వంటి రాష్ట్రాలకు వలస వెళ్లారు. నెలల పాటు సముద్రంలో ఉండి చేపల వేటసాగిస్తారు. కరోనా వైరస్ నేపథ్యంలో దేశంలో 21 రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో అక్కడ పనిలేక, సొంత గ్రామాలకు చేరుకునే వీలు లేక వీరంతా సతమతమవుతున్నారు. ఎక్కడికక్కడ పోలీసులు ఆంక్షలు విధించడంతో చాలామంది కర్ణాటక వెళ్లిన చాలామంది చిత్తూరు జిల్లాలో ఇరుక్కుపోయారు. స్థానిక పోలీసులు ఇటువంటి వారిని సహాయ కేంద్రాలకు తరలిస్తున్నారు. మరోవైపు గుజరాత్ వెళ్లిన మత్స్యకారులదీ ఇదే పరిస్థితి. తమవారి పరిస్థితి తెలియక ఇక్కడి కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. జిల్లా నుంచి 11 నుంచి 12 వేల మంది మత్స్యకారులు ఇతర ప్రాంతాల్లో వలసకార్మికులుగా జీవనం సాగిస్తున్నట్లు సమాచారం. చిత్తూరు సరిహద్దులో వసతి సౌకర్యం ఎచ్చెర్ల మండలంలోని బుడగట్లపాలెం, బడివానిపేట, డి.మత్స్యలేశం పంచాయతీలకు చెందిన మత్స్యకారులకు చిత్తూరు సరిహద్దు ప్రాంతంలో భోజన, వసతి సౌకర్యాలను అక్కడి మత్స్యశాఖ అధికారులు కల్పించారు. కర్ణాటక రాష్ట్రానికి చేపలవేటకు వెళ్లి ఇంటికి వస్తుండగా లాక్డౌన్ ప్రకటించడంతో వీరంతా చిత్తూరు సరిహద్దుల్లో ఉండిపోయారు. మొత్తం 51 మంది మత్స్యకారులు చిక్కుకున్న విషయాన్ని స్థానిక మత్స్యకార నాయకులు జిల్లా మత్స్యశాఖ అధికారులకు తెలియజేశారు. కలెక్టర్ స్పందించి చిత్తూరు జిల్లా అధికారులతో మాట్లాడి అక్కడి బీసీ వసతిగృహంలో వసతి సౌకర్యం కల్పించేలా చర్యలు చేపట్టారు. విజయవాడలో వలస కూలీల పాట్లు నరసన్నపేట రూరల్ : మండలంలోని చోడవరం గ్రామానికి చెందిన కూలీలు బతుకు తెరువు కోసం విజయవాడ వెళ్లారు. కరోనా వైరస్ కారణంగా రాకపోకలు నిలిచిపోవడం, అక్కడ పనులు లేక తినటానికి తిండిలేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. మూడు రోజులుగా లాక్డౌన్ ప్రకటించడంతో పనులు లేక పస్తులుంటున్నారు. గ్రామానికి చెందిన బూర్లె రాంబాబు, సవలాపురం శారద, సవలాపురం వాసు, కంకనాల లక్ష్మి, కంకనాల కృష్ణ, గొంటి ఇల్లయ్య, బుక్క రాము, బోనెల రమణమ్మ తదితరులు విజయవాడలో చిక్కుకున్నారు. తమను గ్రామానికి రప్పించే ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. కాశీలో చిక్కుకున్న 38 మంది భక్తులు అరసవల్లి: తీర్థయాత్రల్లో భాగంగా ఈ నెల మొదటి వారం ఉత్తర భారతదేశ పుణ్యక్షేత్రాలకు వెళ్లిన అరసవల్లి, సింగుపురం, ధర్మవరం తదితర ప్రాంతాలకు చెందిన 38 మంది భక్తులు కరోనా ప్రభావంతో అక్కడే చిక్కుకున్నారు. కాశీలోని ఓ గదిలో ఉన్నట్లు స్థానికులకు సమాచారం అందించారు. ఇక్కడికి వచ్చేందుకు ఏమాత్రం రవాణా సౌకర్యాలు లేవని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరసవల్లి తదితర ప్రాంతాల్లోని వారి కుటుంబసభ్యులు కూడా ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. -
చంపేసి.. మూటకట్టి..
సాక్షి, సిటీబ్యూరో/బంజారాహిల్స్: నగరంలో ఓ చేపల వ్యాపారి దారుణ హత్యకు గురయ్యారు. శనివారం జవహర్‌నగర్‌లోని గదికి పిలిపించి చంపేసిన దుండగులు ఆపై కుటుంబీకులను వాట్సాప్ ద్వారా డబ్బు డిమాండ్ చేశారు. అంతం చేయడానికి ముందు చిత్రహింసలకు గురి చేశారని, ఓ చెయ్యి కూడా నరికేశారని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో శ్రీనివాస్ అనే వ్యక్తిని ప్రధాన అనుమానితుడిగా చేర్చిన పోలీసులు పరారీలో ఉన్న అతడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. మంగళవారం రాత్రి వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతం తీవ్ర కలకలం సృష్టించింది. ఏజీ కాలనీ సమీపంలోని వికాస్పురి కాలనీలో నివసించే పి.రమేష్ (50) కళ్యాణ్‌నగర్ జీటీఎస్ కాలని దేవాలయం సమీపంలో చేపల వ్యాపారం చేస్తుంటాడు. హోల్‌సేల్‌గా చేపల్ని ఖరీదు చేసుకువచ్చి రిటైల్‌గా విక్రయిస్తుంటాడు. ఇందులో ఇతడి ముగ్గురు కుమారులు సైతం సహకరిస్తుంటారు. శనివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో రమేష్‌కు రెండు ఫోన్‌కాల్స్ వచ్చాయి. కుటుంబీకుల నుంచి దూరంగా వెళ్లి వీటిని మాట్లాడిన ఆయన బోరబండలో ఉండే తన స్నేహితుడు యూసుఫ్‌ని కలిసి వస్తానంటూ చెప్పి 6.30 గంటలకు తన స్కూటీ వాహనంపై బయటకు వెళ్ళారు. ఆ రోజు రాత్రి 8.30 గంటల ప్రాంతంలో రమేష్ కుమారుడైన ప్రదీప్ స్నేహితుడు సాయి తన ఫోన్ నుంచి రమేష్‌కు కాల్ చేశాడు. ఈ సందర్భంలో తాను తన స్నేహితుడి ఇంట్లో ఉన్నానని, నిన్ను తర్వాత కలుస్తానంటూ చెప్పిన రమేష్ ఫోన్ పెట్టేశాడు. ఆదివారం ఉదయం 10.30 గంటలకు రమేష్ సెల్‌ఫోన్ నుంచి వాట్సాప్ ద్వారా ఆయన కోడలు ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన కుటుంబీకులు కాల్ చేయగా... ఫోన్ స్విచ్ఛాప్ చెప్పింది. దీంతో ఆందోళనకు గురైన రమేష్ కుటుంబీకులు ఆయన ఆచూకీ కోసం అనేక ప్రాంతాల్లో గాలించారు. ఫలితం లేకపోవడంతో ఎస్సార్‌నగర్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు వివిధ కోణాల్లో ఆరా తీయడం ప్రారంభించారు. ఇదిలా ఉండగా... సోమవారం నుంచి హతుడి ఫోన్ నుంచే వాట్సాప్ ద్వారా కుటుంబీకులకు సందేశాలు రావడం మొదలైంది. వీటిలో తాము రమేష్‌ను కిడ్నాప్ చేశామని, రూ.90 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ వచ్చారు. ఓ సందేశం పంపిన వెంటనే ఫోన్ స్విచ్ఛాఫ్ చేస్తున్నారు. దీంతో ఆచూకీ కనిపెట్టడం కష్టసాధ్యంగా మారింది. మంగళవారం ఉదయం 10 గంటలకూ డబ్బు సిద్ధమైందా? అంటూ సందేశం వచ్చింది. సాయంత్రం 4 గంటలకు మరోసారి సందేశం రాగా... ఇప్పటికి రూ.10 లక్షలు సిద్ధమయ్యాయని, మిగిలిని మొత్తం కోసం ప్రయత్నిస్తున్నామని కుటుంబీకులతో పోలీసులు రిప్లై ఇప్పించారు. ఓపక్క ఈ సంప్రదింపులు కొనసాగుతుండగా... రమేష్ కిడ్నాప్ అయి ఉంటాడని భావించిన పోలీసులు అతడి ఆచూకీ కనిపెట్టడానికి అనేక ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా... జీటీఎస్ కాలనీ దేవాలయం వెనుక వైపు ఉన్న ఓ ఇంటి నుంచి దుర్వాసన వస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించగా... కాళ్ళు, చేయి కట్టేసి గన్నీ బ్యాగ్‌లో మూటకట్టిన శవం బయటపడింది. పక్కనే మరో సంచిలో మృతదేహానికి సంబంధించి చెయ్యి ఉంది. చిత్రహింలకు గురి చేసి, చెయ్యి నరికి, చంపేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ మృతదేహం ఎవరిదని ఆరా తీయగా... ఎస్సార్‌నగర్‌లో మిస్సింగ్ కేసు నమోదైన రమేష్‌కు చెందినదిగా తేలింది. మృతదేహం స్థితిని బట్టి శనివారమే హత్య చేసినట్లు నిర్థారిస్తున్నారు. రమేష్‌ను చంపేసిన తర్వాత అతడి కుటుంబీకుల్ని డబ్బు డిమాండ్ చేసినట్లు అధికారులు తేల్చారు. హంతకుల కోసం గాలింపు చేపట్టిన పోలీసులు మృతదేహం లభించిన గదిని 15 రోజుల క్రితం అద్దెకు తీసుకున్న శ్రీనివాస్ అనే వ్యక్తిని ప్రధాన అనుమానితుడిగా చేర్చారు. అతడు భార్య, ఇద్దరు పిల్లలతో వచ్చినట్లు స్థానికులు చెప్తున్నారు. సోమవారం ఇంటి యజమానికి అద్దె చెల్లించిన అతడు ఆపై కుటుంబంతో సహా ఆచూకీ లేకుండా పోయాడు. ఇతడి ఫోన్ నెంబర్ సహా ఇతర వివరాలు ఇంటి యజమాని వద్ద లేకపోవడంతో దర్యాప్తు కష్టసాధ్యంగా మారింది. ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు రమేష్ మాట్లాడిన ఫోన్ నెంబర్ యూసుఫ్‌గూడకు చెందిన రమణమ్మ పేరుతో ఉన్నట్లు తేలింది. ఆమెను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. రమేష్ మిస్సింగ్‌కు సంబంధించి అతడి కుమారుడు ప్రదీప్ ఇచ్చిన ఫిర్యాదును ఎస్సార్‌నగర్ పోలీసులు సరిగ్గా పట్టించుకోలేదని, పక్కాగా విచారణ చేయలేదని తెలుస్తోంది. పరిచయస్తుడే హంతకుడు..? చేపల వ్యాపారి రమేష్‌ను హత్య చేసింది అతడి పరిచయస్తుడే అని పోలీసులు నిర్థారించారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాకు చెందిన ఇతగాడు కొన్నేళ్ల క్రితం కుటుంబంతో సహా నగరానికి వలసవచ్చాడు. ముషీరాబాద్ చేపల మార్కెట్ సమీపంలో ఉంటున్న నేపథ్యంలో అతనికి చేపల వ్యాపారి రమేష్‌తో పరిచయం ఏర్పడింది. దీంతో కొన్నాళ్ల పాటు రమేష్ ఇంట్లోనే అద్దెకు ఉన్నాడు. ఇటీవల తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇతగాడు రమేష్ ఆర్థిక స్థితి తెలిసిన నేపథ్యంలో అతడ్ని కిడ్నాప్ చేసి డబ్బు గుంజాలని పథకం వేశాడని తెలిసింది. దీంతో ప్లాన్ ప్రకారమే జవహర్‌నగర్‌లో శ్రీనివాస్ పేరుతో ఇంటిని అద్దెకు తీసుకుని ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు సమాచారం. మంగళవారం ఉదయం 10.30 గంటల వరకు కుటుంబంతోనే ఉండి, ఆపై అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన సదరు పరిచయస్తుడి కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు. అతడి కుటుంబీకుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. -
కృష్ణానదిలో.. ‘అలవి’ వేట!
సాక్షి, నాగర్‌కర్నూల్ : కృష్ణానదిలో నిషేధిత అలవి వలల వేట కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం నిషేధించినప్పటికీ దళారులు దందాను దర్జాగా కానిస్తున్నారు. కృష్ణా పరివాహక ప్రాంతాలైన వనపర్తి, జోగుళాంబ గద్వాల, నాగర్‌కర్నూల్ జిల్లాల పరిధిలో ఈ అక్రమ దందా నిర్వహిస్తున్నారు. పోలీసు, మత్స్యశాఖ అధికారులు దాడులు చేసి కేసులు నమోదు చేసినా, పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినా పట్టించుకోడం లేదు. మంగళవారం వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం చెల్లెపాడు వద్ద టాస్క్‌ఫోర్స్ అధికారుల దాడుల్లో ఏడు అలవి వలలు పట్టుబడ్డాయి. ఉపాధి కోల్పోతున్న మత్స్యకారులు గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల పరిధిలోని కృష్ణానది తీర గ్రామాల మత్స్యకారులు, ప్రజలు దళారుల చర్యలతో ఉపాధి కోల్పోతున్నారు. ప్రతి ఏటా కృష్ణానదికి వరదలు వచ్చినప్పుడు సుమారు ఎనిమిది నెలల పాటు ఈ ప్రాంత మత్స్యకారులు చేపలు పట్టుకొని జీవనం సాగిస్తుంటారు. కొంత మంది దళారులు అత్యాశతో ఆంధ్రాలోని వైజాగ్, రాజమండ్రి, కాకినాడ, కొవ్వూరు తదితర ప్రాంతాల నుంచి జాలర్లను తీసుకొచ్చి అలివి వలలతో చేపలను పట్టిస్తుండడంతో చిన్నచిన్న చేపపిల్లలు కూడా ఈ వలలో చిక్కుకుని బయటికి వస్తున్న పరిస్థితి ఉంది. దీంతో స్థానిక మత్స్యకారులు నష్టపోతున్నారు. గుడారాల ముందు ఎండబెట్టిన చేపలు నిషేధం ఉన్నప్పటికీ.. ప్రభుత్వం అలవి వలలను నిషేధించింది. అయినా కొందరు అక్రమ సంపాదనే ధ్యేయంగా వాటిని వినియోగిస్తూ చిన్న చేపలను సైతం వేటాడుతూ మత్స్ససంపదను కొల్లగొడుతున్నారు. వైజాగ్, రాజమండ్రి, కాకినాడ, కొవ్వూరు ప్రాంతాలకు చెందిన మత్స్యకారులతో అలవివేటను చేయిస్తున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలోని మంచాలకట్ట, మల్లేశ్వరం, జటప్రోలు, సోమశిల, అదేవిధంగా వనపర్తి జిల్లా పరిధిలోని చిన్నంబావి, బెక్కెం, చెల్లపాడు, పెద్దమరూరు, చిన్నమరూర్, గ ద్వాల జిల్లా పరిధిలోని అలంపూ ర్, గొందిమళ్ల తదితర గ్రామాల పరిధిలోని కృష్ణాతీరంలో కొంత మంది దళారులు ఆంధ్రా మత్స్య కారులతో ఒప్పందాలు చేసుకొని అలవి వలలు ఉపయోగిస్తున్నారు. దీంతో ఈ వలల్లో చిక్కుకుని 5 గ్రాముల చిన్నచిన్న చేపలు కూడా బయటికి వస్తాయి. వాటన్నింటినీ ఆరబోసి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. చేపలు పెరిగి పెద్దయితే స్థానిక మత్స్యకారులకు ఉపాధి దొరుకుతుంది. రష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది మత్స్యకారుల కోసం లక్షల చేపపిల్లలు నదిలో వదులుతుండగా అవి పెరిగి పెద్దవి కాకముందే దళారులు అలవి వలల ద్వారా వేటాడుతున్నారు. మత్స్యకారులు ఎన్నో సార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. నెరవేరని ప్రభుత్వ లక్ష్యం కృష్ణానదిలో చేపలు పట్టేవారిలో ఎక్కువశాతం ఆంధ్రాకు చెందిన మత్స్యకారులే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతానికి చెందిన వారు దళారుల అవతారం ఎత్తి అక్కడి మత్స్యకారులకు అడ్వాన్స్‌లు ఇచ్చి వారితో చేపల వేట చేస్తున్నారు. కృష్ణానది మధ్య దీవుల్లో నివాసం ఉంటూ చేపల వేటకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ లక్షలాది చేపపిల్లలను నదుల్లో, చెరువుల్లో వదిలి ఉపాధి కల్పించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడంలేదు. -
ప్రాణాలతో తిరిగి వస్తామనుకోలేదు
సాక్షి, అమరావతి: ‘‘పాక్ జైలుకెళ్లాక మా ఊరికి ప్రాణాలతో వెళతామన్న ఆశ లేకపోయింది. మా బతుకులు ఇక్కడే తెల్లారుతాయనుకున్నాం. మాచేత ఇష్టానుసారం పనులు చేయించేవాళ్లు. అన్నం సరిగ్గా ఉండేది కాదు. పాదయాత్రలో ఉన్న వైఎస్ జగన్‌ను కలసి గోడు చెప్పుకున్నామని, తప్పక విడిపిస్తానని ఆయన హామీ ఇచ్చారని మావాళ్లు వర్తమానం పంపారు. జగన్ అధికారంలోకి వచ్చారన్న విషయం తెలిసి సంతోషించాం. విడిపించడమే కాదు, ప్రతి జాలరికి రూ.2 లక్షలిస్తామని కూడా ఆయన చెప్పారని విన్నాం. అన్నట్లుగా జగన్ మమ్మల్ని విడిపించడమేగాక ఊహించిన దానికంటే ఎక్కువగా రూ.5 లక్షలు సాయం చేశారు. ఈ డబ్బుతో ఏదైనా పని చేసుకుని బతుకుతాం. ఈ జీవితం ఆయనదే..’’ అంటూ పాక్ చెర నుంచి విడుదలైన నక్కా అప్పన్న కన్నీటి పర్యంతమయ్యాడు. హుద్‌హుద్ పెను తుపానుతో సర్వం కోల్పోవడంతో బతుకుతెరువుకోసం ముక్కుపచ్చలారని కొడుకు ధన్‌రాజ్(14)తో కలసి గుజరాత్లో చేపల వేటకు వెళ్లిన విజయనగరం జిల్లా పూసపాటి రేగకు చెందిన అప్పన్న పొరపాటున పాకిస్తాన్ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించడంతో పాక్ నావికాదళ భద్రతా సిబ్బందికి పట్టుబడ్డారు. ఫలితంగా ఇతర మత్స్యకారులతోపాటు పాకిస్థాన్ జైలులో 14 నెలలపాటు దుర్భర జీవితాన్ని గడపాల్సి వచ్చింది. ఎట్టకేలకు జగన్ సర్కారు చొరవతో ఇతర మత్స్యకారులతోపాటు పాక్ చెర నుంచి బయటపడిన వారిద్దరూ బుధవారం సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు. అనంతరం వారు ‘సాక్షి’తో మాట్లాడుతూ తాము పడిన ఇక్కట్లను వివరించారు. హుద్‌హుద్ తుపాను వల్ల రూ.8 లక్షల విలువచేసే ఆస్తి మొత్తం కొట్టుకుపోగా రూ.1.5 లక్షల అప్పు మిగిలిందని, సాయం కోసం అప్పటి ప్రభుత్వం వైపు ఆశగా చూస్తే విదిల్చింది రూ.20 వేలేనని, దీంతో బతుకుతెరువు కోసం గుజరాత్ బోట్లల్లో చేపలు పట్టేందుకు తండ్రీకొడుకులు వెళ్లాల్సి వచ్చిందని తెలిపాడు. ఇంట్లో పరిస్థితి బాగోలేక.. డబ్బుల్లేక.. అమ్మానాన్న పడుతున్న బాధ చూడలేక అయ్యకు తోడుగా తాను కూడా వెళ్లాల్సి వచ్చిందని ధన్‌రాజ్ చెప్పాడు. ఎట్టకేలకు జగన్ సర్కారు చొరవతో తాము విడుదలయ్యామని వారు ఆనందం వెలిబుచ్చారు. ఈ జీవితం జగన్ భిక్షే: ‘‘జగనన్న ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. ఈరోజు మళ్లీ బతికి వచ్చామంటే ఆయన పెట్టిన భిక్షే. కొత్త జీవితం ప్రసాదించడమే కాదు, బతకడానికి ఆర్థిక సాయమూ చేశారు. జీవితాంతం రుణపడి ఉంటాం’’ అని పాక్ చెర నుంచి విముక్తుడైన శ్రీకాకుళంకు చెందిన మరో జాలరి దూడంగి సూర్యనారాయణ అన్నారు. మా కుటుంబాల్లో వెలుగులు నింపారు.. పులి నోట్లోకి వెళ్లి తిరిగొచ్చిన మా 20 మంది జాలర్లది పునర్జన్మే. సీఎం వైఎస్ జగన్ రుణం జన్మజన్మలకు తీర్చుకోలేం. పాక్‌లో ఎన్నో బాధలు పడ్డాం. పాదయాత్ర సందర్భంగా నా భార్య సురాడ ముగతమ్మ వైఎస్ జగన్‌ను కలసి గోడు వెళ్లబోసుకుంది. జగనన్న ఆరోజు మాట ఇచ్చారు. నిలబెట్టుకుని మా కుటుంబాల్లో వెలుగులు నింపారు. – సురాడ అప్పారావు, జాలరి, ఎచ్చెర్ల దేవుడు జగన్ రూపంలో కాపాడాడు.. పాక్ జైల్లో ఆహారం తినలేక పోయేవాళ్లం. ఉదయం టీ, రెండు రొట్టెలిచ్చి పనిలోకి పంపేవారు. మధ్యాహ్నం రెండు రొట్టెలు నీళ్ల సాంబారు.. తినలేక పస్తులుండేవారం. ఎప్పుడు ఇంటికి చేరుస్తావ్ దేవుడా అని రోజూ ప్రార్థన చేసేవారం. దేవుడు సీఎం వైఎస్ జగన్ రూపంలో కాపాడాడు. ఆయన లేకుంటే మేమే లేం. మేం లేకుంటే మా కుటుంబాలు ఉండేవి కావు. – బాడి అప్పన్న, బడివానిపేట జైల్లోనే చనిపోతామనుకున్నా.. పాక్ ప్రభుత్వం వదలదు. మా జీవితాలు ఇక్కడే ముగుస్తాయి. ఇక ఇండియాను, సొంత ఊరిని, కన్నవారిని చూడలేం అనుకున్నాం. 14 నెలలు నరకం చూశాం. పనులకు వెళ్లకపోతే కొట్టేవారు. జబ్బు చేస్తే సరైన మందులిచ్చేవారు కాదు. మా ఇంట్లో దేవుని స్థానంలో సీఎం వైఎస్ జగన్ ఫొటో పెట్టుకొంటా. – కేశం ఎర్రయ్య, డిమత్స్యలేశం గ్రామం, శ్రీకాకుళం జిల్లా చావు దగ్గరకు వెళ్లి వెనక్కు వచ్చా.. చావు దగ్గరకు వెళ్లి వెనక్కు వచ్చాను. 2018 నవంబర్ 27న ఉదయం 7.30 గంటలకు పాకిస్తాన్ వారికి చిక్కాం. ఒక రోజంతా నీటిలోనే ఉంచారు. రాత్రి ప్రయాణం చేశాం. 28న పోలీసు కస్టడీకి అప్పగించారు. 29న ఉదయం 10.30కి జైలుకు తరలించారు. మేమంతా ఏడుపులు, పెడబొబ్బలు పెట్టుకున్నాం. మాకు ప్రాణం పోసింది జగనన్నే. – కొండా వెంకటేశ్, బడివానిపేట, శ్రీకాకుళం జిల్లా జగన్ గెలవాలని ప్రార్థించా.. వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన చూశాం. ఆయన కుమారుడు వైఎస్ జగన్ పార్టీ గెలిస్తే మాకు పునర్జన్మతోపాటు జీవితాల్లో వెలుగులు వస్తాయనుకున్నాం. అనుకున్నట్లే జరిగింది. 14 నెలల కష్టాలు సీఎం జగన్‌ను చూడగానే మటుమాయమయ్యాయి. ఎవ్వరెన్ని చెప్పినా, ఏమన్నా జగన్ పార్టీకి జీవితాంతం సేవ చేస్తా. ఆయన రుణం ఈ జన్మలోనే తీర్చుకుంటా. – గంగాళ్ల రామారావు, ఎచ్చెర్ల జగన్ గెలిచారనగానే నమ్మకం కల్గింది సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి గెలిచారనగానే నమ్మకం కల్గింది. అది నిజమైంది. మమ్మల్ని జగనన్న ఎప్పుడు విడిపిస్తారా అని చూశా. ప్రార్థన ఫలించి వచ్చి జగనన్న ఎదురుగా నిలబడ్డా. రూ.5 లక్షలు పారితోషికం ఇవ్వటం ఎంతో సంతోషాన్నిచ్చింది. మా విడుదలకు కృషి చేసిన అందరికీ పేరుపేరున కృతజ్ఞతలు. – వాసుపల్లి శామ్యూల్, ఎచ్చెర్ల -
మాకు ఊపిరి పోశారు
సాక్షి, అమరావతి: ‘‘మీరు మాకు నిజంగా ఊపిరి పోశారు. బతికినంతకాలం మీ పేరు చెప్పుకుంటాం’’ అంటూ పాక్ చెర నుంచి విడుదలైన మత్స్యకారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వద్ద ఉద్వేగానికి గురయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో పాకిస్తాన్ చెర నుంచి విముక్తులైన 20 మంది రాష్ట్ర మత్స్యకారులు బుధవారం ఉదయం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలుసుకున్నారు. తమ విడుదలకు కృషి చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు వారు తమ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు తీవ్ర భావోద్వేగంతో మాట్లాడుతూ ‘‘మీలో ఏదో కనిపించని శక్తి ఉంది సార్.. అందుకే మేం బయటకు రాగలిగాం’’ అని పేర్కొన్నారు. తనను కలిసిన మత్స్యకారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేరుపేరునా పలకరించారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. చేపల వేటకోసం గుజరాత్, పాకిస్తాన్ సరిహద్దుల్లోకి వెళ్లాల్సిన పరిస్థితులపై ఆరా తీశారు. రామారావు అనే మత్స్యకారుడు ముఖ్యమంత్రికి తమ సమస్యలు వివరిస్తూ.. తమ ప్రాంతంలో సముద్రమున్నా జెట్టీలు, పోర్టు లేనందువల్ల పదివేల నుంచి పదిహేను వేల మంది ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సి వస్తోందని, తమకు ఫిషింగ్ హార్బర్‌ను నిర్మించి ఇస్తే ఇక్కడే కుటుంబాలతో కలసి ఉంటామని విన్నవించారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ.. శ్రీకాకుళం జిల్లాలోని సముద్రతీరంలో మత్స్యకారుల చేపల వేట కోసం రాబోయే మూడేళ్లలో మంచి జెట్టీలను నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే భావనపాడు పోర్టు నిర్మాణం కోసం కూడా గట్టిగా ప్రయత్నాలు చేస్తామని తెలిపారు. ప్రభుత్వం తరఫున మత్స్యకారులకు ఆర్థిక సాయం అందజేస్తున్నామని, ఉపాధికోసం వలస వెళ్లకుండా ఈ సాయం ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు జోక్యం చేసుకుని బంగ్లాదేశ్‌లోని జైలులోనూ రాష్ట్రానికి చెందిన ఎనిమిది మంది మత్స్యకారులు ఉన్నారని, కొన్ని కారణాలతో వారి విడుదలలో జాప్యం జరుగుతోందని వివరించగా.. వారిని కూడా విడిపించేందుకు ప్రయత్నాలు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. పాక్ జైల్లో ఇంకా మిగిలి ఉన్న ఇద్దర్ని కూడా విడిపించాలని చెప్పారు. అనంతరం సీఎం వైఎస్ జగన్ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు చేతుల మీదుగా.. విముక్తులైన మత్స్యకారులు నిలదొక్కుకోవడానికి వీలుగా ఆర్థిక సాయం కింద ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున చెక్కుల్ని అందజేశారు. చెక్కుతోపాటు శాలువా, స్వీట్‌బాక్స్‌ను కూడా ఇచ్చారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, మత్స్యశాఖ కమిషనర్ జి.సోమశేఖరంతోపాటు పలువురు పాల్గొన్నారు. సమావేశానంతరం మంత్రి మోపిదేవి వెంకటరమణారావు జాలర్లతో కలసి మీడియాతో మాట్లాడుతూ ప్రజా సంకల్పయాత్రలో ఆనాడు ప్రతిపక్ష నేతగా పాక్ జైలులో ఉన్న జాలర్లను విడిపించుకు వస్తానని ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలబెట్టుకున్నారని చెప్పారు. ఇందుకోసం ప్రత్యేకంగా సీఎం తీసుకున్న చొరవ మాటల్లో వర్ణించలేమన్నారు. -
మంచి చేయడం తప్పా?
ముమ్మిడివరం నుంచి సాక్షి ప్రతినిధి: ఐదారు నెలలుగా ఎన్నో మంచి పనులు చేస్తుంటే ప్రతిపక్ష నేతలు ఓర్వలేక తనపై నిందలు వేస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా, నిందలు వేసినా ప్రజల కోసం తట్టుకుని నిలబడతానని ధీమా వ్యక్తం చేశారు. మంచి పనులను తప్పులుగా చూపుతున్న వారిని నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా గురువారం ఆయన తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని కొమానపల్లిలో వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచ మత్స్యకార దినోత్సవం రోజున రాష్ట్రంలో వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకాన్ని అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ముల మధ్య ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. పాదయాత్ర సమయంలో మత్స్యకారులకు ఇచ్చిన మాటలు తనకు ఇంకా గుర్తున్నాయని చెప్పారు. అందుకే ప్రభుత్వం ఏర్పడి ఐదారు నెలలు తిరక్కముందే నాడు ఇచ్చిన హామీని ఇదే వేదికపై నుంచి నెరవేరుస్తున్నానని స్పష్టం చేశారు. ఈ సభలో సీఎం ఇంకా ఏం మాట్లాడారంటే.. నేనున్నానని ఆరోజే చెప్పాను.. ‘కాలినడకన 2018లో ఇదే ముమ్మిడివరం రోడ్డు మీదుగా వెళ్లేటప్పుడు మీరంతా ఎంతో అవేదనతో చెప్పిన మాటలు విన్నాను. మీ బాధలను కళ్లారా చూశాను. తమకు రావాల్సిన పరిహారం కోసం దాదాపు 16 వేల మంది మత్స్యకారులు ఐదారేళ్లుగా యుద్ధం చేస్తుంటే పట్టించుకోనిది ఒక ప్రభుత్వమా అనిపించింది. రాష్ట్రంలో 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్నా కూడా బతుకుదెరువు కోసం ఎక్కడో గుజరాత్‌కో, మరో రాష్ట్రానికో వలస పోతున్న పరిస్థితులు నా కళ్లారా చూశాను. మీ అన్నగా, తమ్ముడిగా ఆదుకుంటానని మాట ఇచ్చాను. మీ అందరి చల్లని దీవెనలతో మన ప్రభుత్వం ఏర్పడి ఐదారు నెలలు కాక ముందే గంగపుత్రుల జీవితాలను మార్చటానికి తీసుకున్న నిర్ణయాలు ప్రకటించడానికి ఇక్కడికి వచ్చాను. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం కొమానపల్లిలో జరిగిన బహిరంగ సభకు హాజరైన ప్రజలు. ప్రసంగిస్తున్న సీఎం వైఎస్ జగన్ సీఎం స్థానంలో ఉన్నది మీ కష్టాలు తీర్చడానికే.. ఏప్రిల్ 15వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు వేట నిషేధ సమయంలో గత ప్రభుత్వం మత్స్యకారులకు రూ.4 వేలు ముష్టి వేసినట్లు ఇచ్చేది. అది కూడా కొందరికే. మనం అధికారంలోకి వచ్చే సరికి జూన్ వచ్చింది కాబట్టి అది కూడా ఎగరగొట్టేసినా ఎవరూ అడగరని కొందరు సలహా ఇచ్చారు. ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నది ప్రజల బాధల్లో భాగస్వాములై మంచి చేయడానికే తప్ప, ఎలా ఎగ్గొట్టాలని ఆలోచించడానికి కాదని చెప్పాను. ఆ రోజు ఇచ్చిన మాట మేరకు నేడు ప్రపంచ మత్స్యకార దినోత్సవం రోజున.. వేట విరామ పరిహారాన్ని రూ.4 వేల నుంచి అక్షరాలా రూ.10 వేలకు పెంచుతున్నా. కాసేపట్లో కంప్యూటర్లో బటన్ నొక్కిన వెంటనే అక్షరాలా లక్ష పైచిలుకు ఉన్న మత్స్యకార కుటుంబాలకు రూ.10 వేల చొప్పున నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో పడుతుంది. మీ ఫోన్ నంబర్లకు మెసేజ్ కూడా వస్తుంది. కచ్చులూరులో మునిగిన బోటును తీసిన ధర్మాడి సత్యంను సన్మానిస్తున్న ముఖ్యమంత్రి బడుల్లో సమూల మార్పులు బడులన్నింటినీ ‘నాడు–నేడు’ అని చూపిస్తూ సమూలంగా మార్చి అన్ని మౌలిక వసతులు కల్పించే కార్యక్రమం చేస్తున్నాం. ప్రతి బడిలోను ఇంగ్లిషు మీడియం ప్రవేశపెడుతున్నాం. మన పిల్లలు గొప్పగా చదవాలి. ప్రపంచంతో పోటీపడే పరిస్థితి రావాలి. కేవలం డ్రైవర్ల వంటి ఉద్యోగాలకు పరిమితం కాకూడదు. టై కట్టుకుని ఫారిన్ వెళ్లే పరిస్థితి రావాలి. డాక్టర్లుగానో, ఇంజినీర్లుగానో, కలెక్టర్లుగానో స్థిరపడే పరిస్థితి రావాలి. ఇదే ‘నాడు–నేడు’ కార్యక్రమం ద్వారా రాబోయే రోజుల్లో ఆసుపత్రుల పరిస్థితులు కూడా మార్చబోతున్నాం. గొప్ప మార్పు తీసుకురాబోతున్నాం’’ అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్ర బోస్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, మోపిదేవి వెంకటరమణారావు, కురసాల కన్నబాబు, పినిపే విశ్వరూప్, ముత్తంశెట్టి శ్రీనివాస్, సీఎం కార్యక్రమాల కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్, ఎంపీలు వంగా గీత, చింతా అనురాధ, మార్గాని భరత్‌రామ్, జిల్లా ఎమ్మెల్యేలు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మత్స్యకారుల కోసం.. ►లీటరు డీజిల్‌కు ఇస్తున్న సబ్సిడీని ఈ రోజు నుంచి రూ.6 నుంచి రూ.9కి పెంచుతున్నాం. ఇదివరకటి పరిస్థితులను మారుస్తూ 81 బంకులను గుర్తించి వేటకు వెళ్లే ప్రతి మత్స్యకారునికి గుర్తింపు కార్డులు ఇస్తాం. బంకులో డీజిల్ పట్టేటప్పుడే సబ్సిడీ మినహాయించి కట్టే పరిస్థితిని తీసుకువస్తున్నాం. ►వేటకు వెళ్లే మత్స్యకారులు క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటున్నా. ఒకవేళ ఏదైనా జరగరానిది జరిగి అతను కుటుంబానికి దూరమైతే ఆ కుటుంబానికి భరోసాగా రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తున్నా. ►గుజరాత్ స్టేట్ ప్రెట్రోలియం కార్పొరేషన్ డ్రిల్లింగ్ వల్ల ముమ్మిడివరంలో 2012లో 8 మండలాల్లోని 68 గ్రామాల్లో 5,060 పడవలపై చేపల వేటకు వెళ్లలేకపోయిన 16,594 మత్స్యకార కుటుంబాలు జీవనభృతి కోల్పోయాయి. అందుకుగాను ఆ కార్పొరేషన్ వారు ఇవ్వాల్సిన సొమ్ము 13 నెలలకు గాను 6 నెలలు మాత్రమే ఇచ్చి రూ.74 కోట్లు ఎగ్గొట్టిన పరిస్థితి. ఈ డబ్బు కోసం ఇవాళ ఓఎన్జీసీతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి. అ డబ్బులు ఎప్పుడు వస్తాయో.. అసలు వస్తాయో రావో తెలియదు. అందుకే మత్స్యకార కుటుంబాలు అవస్థలు పడకూదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రూ.78.24 కోట్లు 16,594 కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. తర్వాత ఆ డబ్బు కేంద్రం నుంచి ఎలా తెచ్చుకోవాలో రాష్ట్ర ప్రభుత్వం చూసుకుటుంది. ►ఉప్పాడ, మచిలీపట్నం, శ్రీకాకుళం జిల్లాలోని మంచినీళ్లపేట, రాళ్లపేట, పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం చేరువలోని బియ్యపుతిప్ప, విజయనగరం జిల్లా చింతపల్లి, నిజాంపట్నం, ఇలా అవసరమైన చోటల్లా రాబోయే కాలంలో జెట్టీలు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. మత్స్యకారులకు మంచి చేయడానికి 794 గ్రామ సెక్రటేరియట్లలో మత్స్యకార సహాయకులను నియమిస్తున్నాం. పైపులైనుల వల్ల ఉపాధి కోల్పోయిన మత్స్యకారులకు పరిహారం చెక్కు ఇస్తున్న సీఎం అందరి కోసం ఇలా.. ►ఐదారు నెలలుగా మన ప్రభుత్వం పని చేస్తున్న తీరు మీరు గమనిస్తున్నారు. దేశ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా, రాష్ట్ర చరిత్రలో ఎపుడూ చేయని విధంగా ఈ ఆరు నెలల్లోనే నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. ఈ ఉద్యోగులందరూ గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్నది కూడా మీకు కనిపిస్తుంది. ►46 లక్షల పైచిలుకు రైతులకు పెట్టుబడి భరోసా కింద రూ.13,500 ఇవ్వగలిగే పరిస్థితిని దేవుడు కల్పించాడు. ►ఆటోలు, టాక్సీలు తోలుకుంటున్న సోదరులకు సహాయం చేయగలిగాం. ►అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటున్నాం. ►దేశ, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల జీవితాలు మార్చేందుకు నామినేటెడ్ పోస్టులు, నామినేటెడ్ పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం తీసుకొచ్చాం. ►సామాజికంగా ఇబ్బందులు పడుతున్న అక్క చెల్లెమ్మలకు అండగా ఉండేందుకు నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పనుల్లో 50æ శాతం ఇచ్చిన ప్రభుత్వం మనదేనని సగర్వంగా చెబుతున్నా. ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. లక్ష చెక్కును అందిస్తున్న గోదావరి మహిళా సమాఖ్య వైఎస్సార్ వారధి ప్రారంభం తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం తొలుత వృద్ధ గౌతమి గోదావరిపై ఐ.పోలవరం మండలం పశువుల్లంక – సలాదివారిపాలెం మధ్య రూ.35 కోట్లతో నిర్మించిన వైఎస్సార్ వారధిని ప్రారంభించారు. వారధి వద్ద ఏర్పాటు చేసిన వైఎస్సార్ నిలువెత్తు విగ్రహాన్ని ఆవిష్కరించారు. రూ.1.62 కోట్లతో నిర్మించే టూరిజం బోటు కంట్రోల్ రూమ్‌ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మత్స్యశాఖ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను తిలకించి, పలు సూచనలు చేశారు. అనంతరం కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని యానాం వెళ్లారు. మంత్రి మల్లాడి కృష్ణారావు ఇంటికి వెళ్లి.. ఇటీవల మృతి చెందిన అతని తండ్రి సూర్యనారాయణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కృష్ణారావుతో మాట్లాడారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం మండలం పశువుల్లంకలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించి వారధిని ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ►తప్పుగా మాట్లాడుతున్న నాయకులు, పత్రికాధిపతులు ఎప్పుడైనా మీ దగ్గరకు వచ్చినప్పుడు ‘అయ్యా.. మీ పిల్లలు, మీ మనవళ్లు ఏ స్కూల్లో చదువుతున్నారు?’ అని గట్టిగా అడగండి. మీ పిల్లలకేమో ఇంగ్లిష్ మీడియం.. మా పిల్లలకు తెలుగు మీడియమా? అని నిలదీయండి. ►మీ కోసం చేయగలిగిందంతా చేస్తున్నా. ఎంత మంది శత్రువులు ఏకమై నాపై కుట్ర పన్నినా, అపనిందలు వేసినా తట్టుకుని నిలబడతా. దేవుడి చల్లటి చూపు, మీ దీవెనలతో రాబోయే రోజుల్లో ఇంకా గొప్పగా పని చేస్తా. ►బ్యాక్ వర్డ్ క్లాస్ అంటే వెనుకబడినది కాదని, బ్యాక్ బోన్ క్లాస్‌గా మార్చాలని నేను తపించాను. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలను ముందుకు తీసుకుపోవాలని ఆరాట పడటమే నేను చేసిన తప్పా? ►ఈ ఐదారు నెలల కాలంలో ఎన్నెన్నో గొప్ప పనులు చేస్తుండటాన్ని చూస్తూ కూడా కొందరు ఎలా అపనిందలు వేస్తున్నారో మీరూ చూస్తున్నారు. ఏ చెడ్డ పని చేయకపోయినా ప్రజలను మభ్య పెట్టేందుకు దుష్ప్రచారం చేస్తున్నారు. – సీఎం వైఎస్ జగన్ -
'వశిష్ట 'వీరులు.. ప్రమాదమైనా.. సై
ఉప్పొంగిన గోదావరి ఉన్మత్త రూపంతో విరుచుకుపడి నిండు ప్రాణాలను కబళిస్తే... గుండెలోతుల్లోంచి ఉప్పొంగిన మానవత్వం ఆ ఉగ్ర గోదారితోనే పోరాడింది. ఉరకలేసే ఉత్సాహంతో తన ఒడిలోకి వచ్చిన బిడ్డలను నదీమాత పొట్టన పెట్టుకుంటే.. గుండెల్లో ధైర్యం నిండిన మత్స్యకారుల సాహసం.. ఆ అభాగ్యుల పార్థివ దేహాలను ప్రాణాలకు తెగించి మరీ వెలికి తీసింది. నిండుగా ప్రవహించే నది ఎన్నో కుటుంబాల జీవితాల్లో కన్నీటి సుడులు సృష్టిస్తే.. సాటివారికి చేతనైనంతగా సాయపడాలన్న విద్యుక్త ధర్మం.. ఆ కుటుంబాలకు తమ ఆప్తులను కడసారి దర్శించే భాగ్యాన్ని కలిగించింది. పాపికొండల దారిలో.. గోదారి లోతుల్లో మునిగిన ‘వశిష్ట’ బోట్‌ను మన విశాఖకు చెందిన విశిష్ట సాహసికుల బృందం వెలికితీసి వేనోళ్ల ప్రశంసలు అందుకుంది. అందరూ అసాధ్యమనుకున్న ఈ అసాధారణ ఘట్టాన్ని సాధ్యం చేసిన మనోళ్ల సాహసం అందరి మన్ననలను అందుకుంది. ప్రాణాలను పణంగా పెట్టి.. ఇదంతా కొన్ని కుటుంబాల ఆశను తీర్చడానికేనని వినమ్రంగా చెప్పే ఈ సాహసికుల ధీరత్వాన్ని ‘సాక్షి’ మీ కళ్లముందుంచుతోంది. డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): వశిష్ట విషాదం.. కన్నీటి కెరటం! శోకాశ్రు సాగరం! ఆనందం కోసం అందాల పడవెక్కి.. అద్భుతాల గోదారిని తనివితీరా చూస్తూ.. పాపికొండల తీరం చేరాలన్న ఆరాటంతో బయల్దేరిన వారిని తల్లిలాటి గోదావరి అమాంతం మింగేస్తే.. ఎన్నో కుటుంబాలను ఉప్పెనలా ముంచేసిన కొండంత.. కడలంత.. దారుణం. ఈ ఘటన రాష్ట్రాన్నే కాదు..యావత్ దేశాన్నే దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎన్నో కుటుంబాలను కన్నీటి సుడిగుండంలోకి నెట్టింది. ఆ ఘటనలో కొందరి మృతదేహాలే మొదట లభ్యమయ్యాయి. బోట్ గోదారి గర్భంలోనే ఉండిపోయింది. అందులో మరికొన్ని మృతదేహాలు ఉండే అవకాశం ఉండడంతో దానిని వెలికితీయాలన్న సంకల్పంతో ప్రభుత్వం.. దాన్నో సవాలుగా తీసుకుంది. రోజుల తరబడి ఎన్నో సంస్థలు.. నావికాదళ నిపుణులు ప్రయత్నించినా.. అది దుస్సాధ్యమైంది. చివరికి ధర్మాడి సత్యం అనే అపార అనుభవజ్ఞుడి నేతృత్వంలో పనిచేసిన ఓ బృందం.. చిట్టచివరి ప్రయత్నం చేయడానికి సంకల్పించింది. ఈ లక్ష్య సాధనకు విశాఖలోని ఓం శ్రీ శివ శక్తి డైవింగ్ సర్వీసెస్ సాయం తీసుకుంది. ఆ సంస్థకు చెందిన గజ ఈతగాళ్లు.. నిపుణులైన మత్స్యకారులు.. ప్రాణాలకు తెగించి.. శాయశక్తులా శ్రమించడంతో గోదావరి నదీగర్భంలోని రాయల్ వశిష్ట బోట్ ఉనికిని తెలసుకోవడం సాధ్యమైంది. ఈ సాహసికుల బృందం నానా పాట్లు పడి.. ఎట్టకేలకు పడవను గట్టుకు చేర్చగలిగింది. దాంతో పాటు దాదాపు 38 రోజుల పాటు కనిపించకుండా పోయిన 12 మంది పార్థివదేహాలను గట్టెక్కించి.. సంబంధిత కుటుంబాలకు కనీసం తమ వారిని కడసారి చూశామన్న సాంత్వనను కలిగించింది. తూర్పుగోదావరి జిల్లా కచ్చలూరు ప్రాంతంలో జరిగిన ఘోర ప్రమాదంలో మునిగిన పడవను విశాఖలోని బురుజుపేటకు చెందిన ఓం శ్రీ శివ శక్తి డైవింగ్ సర్వీసెస్ సిబ్బంది కనబరిచిన మానవతా దృక్పథం అందరి మన్ననలు అందుకుంది. బోటు వెలికితీతకు సంబంధించి వివరాలు తెలుసుకోవడానికి ‘సాక్షి’ వారిని కలిసినప్పుడు తమది ఓ ప్రయత్నమని వినమ్రంగా చెబుతూనే.. ఆ సంఘటన గురించి వివరించారు. ఇలా ప్రారంభం కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం.. బోటు తీసేందుకు ముందుకొచ్చి.. దాదాపు 20 రోజులకు పైగా ఎన్నో విధాలుగా యత్నించారు. యాంకర్లు వేశారు. రోప్‌లు కట్టారు. కొంతమేరకు తీయగలిగినా చివరకు తమకు సాధ్యం కాదని నిర్ణయించుకున్నారు. ఈ అసాధ్యాన్ని సాధించగలవారెవరని ప్రయత్నించి చివరకు విశాఖ వచ్చారు. విశాఖలో గల పలు డైవింగ్ సంస్థలను ఆశ్రయించారు. ఎవరూ సంసిద్ధత వ్యక్తం చేయని పరిస్థితుల్లో.. చివరగా వన్‌టౌన్‌లోని బురుజుపేటలో గల ఓం శ్రీ శివ శక్తి డైవింగ్ సర్వీసెస్‌ను ఆశ్రయించారు. అక్కడి సిబ్బంది మానవతా దృక్పథంతో ముందుకొచ్చారు. వరదపై ఉన్న గోదావరిలో.. దాదాపు 100 అడుగుల లోతులో ఉన్న బోటును వెలికి తీయడం అసాధ్యమని తెలిసి కూడా.. మునిగిపోయిన బోటును వెలికి తీస్తే.. తమవారిని కడసారైనా చూడాలని తపిస్తున్న వారి కోరిక తీర్చవచ్చని భావించారు. దాంతో సవాలుకు సై అన్నారు. ఎనిమిది దిక్కులా యత్నం ఎనిమిది మంది ఈతగాళ్ల బృందం ఒక్కొక్కరూ ఒక్కో వైపుగా బోటు తీసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. చీకటి పడింది. మొదటి రోజు సమయం మించిపోయింది. రెండో రోజు ఉదయం మళ్లీ యత్నించారు. బోటుకు చుట్టుపక్కలా పేరుకుపోయిన బురదను నానా కష్టాలు పడి తొలగించారు. మూడు వైపులా రోప్ వేశారు. బోటు లోపల ఉండిపోయిన 12 మృతదేహాలు(డికంపోజ్ అయిన బాడీలు) ఒక్కొక్కటిగా తీశారు. ఎన్నెన్నో కష్టాలు ఓ వైపు దుర్వాసన..మరొవైపు చిమ్మ చీకటి.. ఇంకో వైపు నీటి ప్రవాహం జోరు.. కెరటాల ఒరవడి... ఇవన్నీ వారికి అవరోధంగా నిలిచాయి. అయినా పట్టు వదలని వీరు అసాధ్యాన్ని సుసాధ్యం చేసి అందరి మన్ననలు అందుకున్నారు. అంతా మత్స్యకారులే.. ఆపరేషన్ బోట్లో పాల్గొన్న వారంతా మత్స్యకారులే. వీరు పెద్దగా చదువుకోలేదు. చిన్నప్పటి నుంచి వేటే వీరి జీవనాధారం. వీరిలో చాలామందికి స్విమింగ్‌లో 10 నుంచి 20 ఏళ్ల అనుభవం ఉంది. డైవింగ్ సంస్థ ద్వారా ఏమైనా పనులు ఉంటే..రోజుకి రూ.1500 నుంచి రూ.2వేలు మాత్రమే(ప్రాణాలు ఫణంగా పెట్టి) సంపాదిస్తుంటారు. మిగిలిన రోజుల్లో కూలీ పనులు చేస్తుంటారు. వీరంతా ఫిషింగ్ హార్బర్ పరిధిలోని వారే. బతుకుతెరువు కోసం..ప్రభుత్వాలపై ఆధారపడకుండా ఉండేందుకు వేటే జీవనాధారంగా ఎంచుకున్నారు. ప్రమాదమైనా.. సై తమ ప్రయత్నం ఎంత ప్రమాదకరమైనదో వారికి తెలుసు. గోదావరి ప్రవాహాన్ని.. సుడి గుండాన్ని దాటి.. దాదాపు వంద అడుగుల లోతులో కూరుకుపోయిన బోటును బయటకు తీయాలంటే తలకు మించిన పని అన్నది పూర్తిగా తెలుసు. పైగా 38 రోజుల పాటు ఆ బోటులో చిక్కుకొని పాడైన మృతదేహాలను గుర్తించి.. బయటకు తీయడం ఎంతో కష్టమని తెలిసినా... వారు సిద్ధపడ్డారు. ఓం శ్రీశివ శక్తి డైవింగ్ సర్వీసెస్‌కు చెందిన మారుపిల్లి దాసు, గనగల రాజాబాబు, కదిరి ఎల్లారావు, పిళ్లా ఎల్లాజీ, గనగల అప్పలరాజు, వాసుపల్లి మురళి, ఒలిశెట్టి కోటేశ్వరరావు, పొనమండ రమణ, బడే ఎల్లాజీ, పేర్ల నల్లరాజు, మారుపిల్లి సతీష్‌కుమార్ గత ఆదివారం ఉదయం బోటు మునిగిన ప్రాంతానికి చేరుకున్నారు. మధ్యాహ్నం వరకు అక్కడి సిబ్బంది అనుమతించలేదు. ఆ తర్వాత ఎనిమిది మంది డైవర్లు (మారుపిల్లి దాసు, గనగల రాజాబాబు, కదిరి ఎల్లారావు, పిళ్లా ఎల్లాజీ, గనగల అప్పలరాజు, వాసుపల్లి మురళీ, ఒలిశెట్టి కోటేశ్వరరావు, పొనమండ రమణ) నీటిలోకి దిగారు. దాదాపు 80 అడుగుల లోతుకి వెళ్లారు. అక్కడ ఏమీ కనిపించలేదు. కానీ కాళ్లకు బోటు పరికరాలు తగులుతూ ఉండడంతో.. అక్కడ బోటు ఉన్నట్టు గుర్తించారు. వారి వద్ద ఉన్న ఆక్సిజన్‌ను అంచనా వేసుకుంటూ ఓ ఇనుప తీగ వేశారు. పైనుంచి లాగే ప్రయత్నంలో ఆ రోప్ తెగిపడింది. మళ్లీ నీటిలో ఉన్న వారు మరో రోప్ కట్టారు. ముందుగా బోటు కేబిన్‌ను (ఇంజన్ ప్రాంతం) బయటకు తీయగలిగారు. దీంతో బోటును తీయగలమన్న నమ్మకం కలిగింది. ఓం శ్రీశివశక్తి తోడ్పాటు 2012 ఆగస్టులో బురుజుపేటలో ఈ సంస్థ ప్రారంభమైంది. ఇక్కడ 30 మంది పనిచేస్తున్నారు. గతంలో నర్మదా నదిలో మునిగిన విమానాన్ని వెలికితీయడానికి నేవల్ డైవర్స్ నిస్సహాయత వ్యక్తం చేయగా.. ఈ సంస్థ సిబ్బంది వారం రోజుల్లోనే విమానాన్ని బయటకు తీయగలిగారు. కేరళ, ముంబై, పారాదీప్, చెన్నై, కాకినాడ, కోల్‌కత, హల్దియా, విశాఖపట్నంలో ఎన్నో కార్యకలాపాల్లో పాల్గొన్నారు. చేశారు. గోదావరి తీరంలో భద్రాచలం, గోవిందపల్లి వద్ద... విశాఖలో తాటిపూడి రిజర్వాయర్‌లో వెలికితీతకు సంబంధించి బాధ్యతలు నెరవేర్చారు. -
చేపా చేపా.. ఎప్పుడేదుగుతవ్ !
సాక్షి, మంచిర్యాల : మత్స్యకారులకు ఉపాధి కల్పించే నీలి విప్లవంపై జిల్లాలో నిర్లక్ష్యం కొనసాగుతోంది. జలాశయాల్లో చేపపిల్లలు వదిలే కార్యక్రమంలో జాప్యం కావడంతో అనుకున్న లక్ష్యం నెరవేరదే మో.. నని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జూలై, ఆగస్టు నెలల్లో చేపపిల్లలను చెరువులు, కుంటలు, జలశయాల్లో వదిలితే ఏప్రిల్, మే నాటికి మత్స్యసంపద చేతికొచ్చేదని.. ఇప్పుడు వేస్తే అనుకున్న ఫలితం ఉండదని అంటున్నారు. జిల్లాలో ఈ ఏడాది 2 కోట్ల 23 లక్షలు చేపపిల్లలు ఆయా జలాశయాల్లో వదలా లని లక్ష్యంగా పెట్టుకున్నా.. శుక్రవారంనాటికి నాలుగోవంతు కూడా పూర్తి కాలేదు. వర్షాకాలం ముగిశాక చేపపిల్లలు వేసినా.. అవి ఎదగడం కష్టంగానే ఉంటుంది. అధికారుల నిర్లక్ష్యం, సరై న ప్రణాళిక లేని కారణంగా జిల్లా మత్స్యసంపదకు దూరం కానుంది. లక్ష్యం 2.23 కోట్లు.. వేసింది 32.5 లక్షలు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడు కూడా ప్రభుత్వం జలాశయాల్లో చేపపిల్లలు వదిలేందుకు ప్రణాళిక రూపొందించింది. ఈ ఏడాది జిల్లాలో 2 కోట్ల 23 లక్షల 89 వేల చేపపిల్లలను వదలాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం జిల్లాలోని 274 జలాశయాలను గుర్తించింది. దీంతోపాటు ఎల్లంపల్లి, సుందిళ్ల ప్రాజెక్టులలో 2.63 లక్షల రొయ్య పిల్లలను కూడా వదలాలని నిర్ణయించింది. జిల్లాలో రొహు, కట్ల, బొచ్చ చేపపిల్లల ద్వారా 20 వేల టన్నుల చేపలు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ వర్షాకాలం ముగింపు దశకు వచ్చినా.. లక్ష్యం పాతిక శాతం కూడా పూర్తి కాకపోవడం విమర్శలకు తావునిస్తోంది. 35 నుంచి 40 ఎంఎం సైజు చేపపిల్లలు 1.50 లక్షలు, 80 నుంచి 100 ఎంఎం సైజు గల 68,089 చేపపిల్లలు చెరువుల్లో వదిలేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. జిల్లాలో వర్షకాలం ఆరంభంలో ఆశించిన వర్షాలు లేకపోవడంతో చేపలను వదలలేదు. గత నెల భారీ వర్షాలు కురవడంతో సుందిళ్ల బ్యారేజీ బ్యాక్‌వాటర్ మంచిర్యాల గోదావరిలోకి చేరింది. ఈ క్రమంలోనే గతనెల 19న కలెక్టర్ భారతిహోళికేరి, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు తొమ్మిది లక్షల చేపపిల్లలను వదిలారు. అదే నెలలో చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారం బ్యారేజ్‌లో 15 లక్షల చేప పిల్లలను వదిలారు. గురువారం బెల్లంపల్లి ఎమ్మెల్యే 30వేల చేపపిల్లలను వదిలారు. మొత్తం కలిపి ఇప్పటివరకు జిల్లాలో మొత్తం 32.5 లక్షల వరకు చేపపిల్లలను మాత్రమే వదిలారు. ఇప్పుడేస్తే...ఎదిగేదెట్లా..? జిల్లాలో 72 మత్య్సకార సంఘాల్లో 4,850 మంది సభ్యులు ఉన్నారు. కాలం దాటిన తరువాత చేపపిల్లలు వేస్తే అవి ఎదిగేదెట్లా అని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఇప్పటికే చెరువులు, కుంటల్లో చేపపిల్లలను మొత్తం వదలాల్సి ఉంది. జూన్, జూలైలో ఆశించిన వర్షాలు కురువక పోవడంతో జలాశయాల్లోకి నీరు చేరక చేపపిల్లలు వదలేదు. ఆగస్టు నెలలో భారీ వర్షాలు కురవడంతో నీళ్లు ఎక్కువై, చెరువుల నుంచి వెళ్లిపోతున్నాయని వేయలేదు. కారణాలేవైనా ఇప్పుడు చేపపిల్లలు వేయడం వల్ల పెద్దగా ఫలితం ఉండదని మత్స్యకారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టడంతో పంటల సాగుకు చెరువుల్లోంచి నీటిని వదులుతున్నారు. దీంతో చేపపిల్లల మనుగడ కష్టంగా మారుతోంది. జూలై, ఆగస్టులో చేపపిల్లలను వేస్తే ఏప్రిల్, మే నాటికి ఒక్కో చేప మూడు నుంచి నాలుగు కిలోల వరకు ఎదుగుతుంది. కానీ.. ఇప్పుడు వేయడం వల్ల కిలో నుంచి కిలోన్నర కంటే మించి పెరగదని మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు. వర్షకాలం ముగింపు లోపు చేపపిల్లలను వదిలితే, చెరువుల్లో నీరుండడం వల్ల వాటికి సరిపడా ఆహారం అభిస్తుంది. ఆలస్యంగా వదిలితే నీరు తగ్గిపోతుండడం, ఆహారం లభించకపోవడం, వాతావరణ మార్పులతో ఆక్సిజన్ లభించక చేపపిల్లల ఎదుగుదల నిలిచిపోయే ప్రమాదం ఉంటుంది. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత పెరిగితే చేపపిల్లలు మత్యువాతపడే అవకాశం ఉంటుందని మత్స్యకారులు వాపోతున్నారు. అధికారులు మాత్రం చేపపిల్లల ఎదుగుదలకు ఎలాంటి ఇబ్బందీ లేదంటున్నారు. ఏదేమైనా లక్ష్యంలో కనీసం పాతిక శాతం కూడా ఇప్పటివరకు పూర్తికాకపోగా.. మిగిలిన వాటికి మరింత సమయం పడుతుండడంపై మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. నెలాఖరుకు లక్ష్యం పూర్తి చేస్తాం ఈ నెలాఖరు వరకు జిల్లా లక్ష్యాన్ని పూర్తి చేస్తాం. చేపపిల్లలు వేయడం ఆలస్యం కాలేదు. ఇప్పుడు వేసినా ఆరు నెలల సమయం ఉంటుంది కాబట్టి చేపపిల్లలు పెరగవనే ప్రశ్నేలేదు. ఏప్రిల్‌లో చేపలు పడుతారు కాబట్టి ఆలోపు బరువు పెరుగతాయి. రెండు సంవత్సరాల క్రితం అక్టోబర్‌లో వేశాం. జలాశయాలకు నీళ్లు రావడం, ఆ నీళ్లు వెళ్లిపోతుండడంతో చేపలు వేసినా ప్రయోజనం ఉండేది కాదు. అందుకే ఈ నెలలో చేపపిల్లలు వేయడాన్ని పూర్తి చేస్తున్నాం. – సత్యనారాయణ, ఏడీ, మత్స్యశాఖ చేపపిల్లలు ఎదగకపోతే నష్టం పోయిన నెల భారీ వర్షాలతో చెరువులు, కుంటులు, ప్రాజెక్టులు నిండినయి. అప్పుడే చేపపిల్లలు వేసేదుండే. వానకాలం అయిపోవడానికి వచ్చింది. ఎండలు ముదరక ముందే పిల్లలు వదిలితే ఎదుగుదల ఉంటుంది, సాగుకు చెరువుల్లో నీటిని వదలుతే నీరుతగ్గి చేపల ఎదగవు. ఆలస్యమైతే చేపపిల్లలు పెరగక నష్టపోతాం. – కంపెల రమేష్, మత్స్యకారుడు, నెన్నెల -
వీజీ సిద్ధార్థ అదృశ్యం : నదిలో దూకింది ఎవరు?
కెఫే కాపీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్దార్థ హెగ్డే అదృశ్యంపై అనేక అనుమానాలు కొనసాగుతుండగా, స్థానిక మత్స్యకారుడు అందించిన సమాచారం కీలకంగా మారింది. సోమవారం రాత్రి ఒకవ్యక్తి నదిలోకి దూకుతుండగానే చూశాననీ, అతణ్ని రక్షించడానికి ప్రయత్నించినప్పటికీ, భారీ వర్షం కారణంగా సాధ్యం కాలేదని సైమండ్ డిసౌజా (65) మీడియాకు తెలిపారని న్యూస్ మినిట్ రిపోర్ట్ చేసింది. ‘‘నా ఇల్లు రైల్వే వంతెన సమీపంలోనే ఉంది. చిన్నప్పటించీ చేపల వేటలో ఉన్నాను. నా ఫిషింగ్ నెట్ తీసుకొని ఇంటికి తిరిగి వస్తున్నా. ఇంతలో ఒక వ్యక్తి (ఆ వ్యక్తి ఎవరో తెలియదు) దూకతూ వుండటాన్ని చూశా.. అతని వైపు పరుగెత్తాను. అప్పటికే ఆయన దూకేశాడు. నా చిన్న బోటుసాయంతో రక్షించాలని చూశా. నా వల్ల కాలేదు. వెంటనే మా వాళ్లను పిలిచాను. కానీ, అప్పటికే ఆలస్యమైపోయిందం’’టూ సైమండ్ డిసౌజా తెలిపారు. వీజీ సిద్ధార్థ డ్రైవర్ బసవరాజు పాటిల్ అందించిన సమాచారం ప్రకారం సోమవారం సాయంత్రం మంగళూరులోని నేత్రావతి నదికి అడ్డంగా ఉన్న వంతెన సమీపంలో తన కారులోంచి దిగిపోయారు సిద్ధార్థ. ఒక గంటలో తిరిగి రాకపోవడంతో డ్రైవర్ భయపడి కాల్ చేశాడు. మొబైల్ స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో ఆందోళన చెందిన పాటిల్ కుటుంబ సభ్యులకు, అనతరం పోలీసులకు సమాచారం అందించారు మరోవైపు సిద్ధార్థకోసం తీవ్రంగా గాలిస్తున్న పోలీసులు తనిఖీల్లో డాగ్ స్క్వాడ్ వంతెన మధ్యలో ఆగి పోయింది. ఈ సమాచారం ఆధారంగా బ్రిడ్జిపై ఉన్న పిల్లర్ 8 వద్ద తనిఖీని ముమ్మరం చేశారు. పోలీసులు, డైవర్లు, ఫైర్ అండ్ రెస్క్యూ సిబ్బంది సహా 150 మందికి పైగా ఈ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. తాను చాలాకాలంగా పోరాడుతూ అలసిపోయాననీ, వాటాలను తిరిగి కొనుగోలు చేయమని బలవంతం చేస్తున్న ప్రైవేట్ ఈక్విటీ భాగస్వాములు, ఇతర రుణదాతల నుండి ఎదుర్కొంటున్న "విపరీతమైన ఒత్తిడి" తనను ఈ పరిస్థితికి లొంగదీసిందని బోర్డుకి రాసిన చివరి లేఖలో సిద్ధార్థ పేర్కొన్నారు. బోర్డు అత్యవసర సమావేశం సోమవారం సాయంత్రం నుంచి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వీజీ సిద్ధార్థ తప్పిపోయినట్లు మంగళవారం కంపెనీ ధృవీకరించింది. ఈ పరిణామాల నేపథ్యంలో కెఫే కాఫీ డే బోర్డు అత్యవసరంగా సమావేశమైంది. కాఫీ డే ఎంటర్ప్రైజెస్ కంపెనీ వ్యవహారాలను సమర్ధవంతంగా నిర్వహించే టీం నేతృత్వం వహిస్తోందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. సిద్ధార్థ భార్య, కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ కుమార్తె, మాలవికా హెగ్డే 2008 నుంచి కంపెనీ నిర్వహణా, హాస్పిటాలిటీ బాధ్యతలను చూస్తున్నారు. అలాగే ఎస్ వి. రంగనాథ్, డాక్టర్ ఆల్బర్ట్ హిరోనిమస్, సులక్షణా రాఘవన్, సంజయ్ ఓంప్రకాష్ నాయర్ బోర్డు సభ్యులుగా ఉన్నారు. చదవండి: కాఫీ మొఘల్కు ఏమైంది? షేర్లు డీలా -
ఉపాధినిచ్చే వల ఊపిరి తీసింది
కడలి కెరటాలతో సయ్యాటలాడటం అతడికి వెన్నతో పెట్టిన విద్య. ఒడుపుగా వల విసరడంలో అతడు నేర్పరి. నిత్యం అలవోకగా చేసే పనే అయినా.. విధి వక్రీకరించింది.. తనకు ఉపాధి చూపే వలే మృత్యువులా చుట్టుకొని జల సమాధి చేసింది. చేపల వేటే జీవనాధారంగా కుటుంబాన్ని పోషిస్తున్న ఆ మత్స్యకారుడిని తిరిగిరాని లోకాలకు తీసుకెళ్లింది. సాక్షి, సింగరాయకొండ (ప్రకాశం): చేపల వేటకు వల విసురుతున్న మత్స్యకారుడు ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగి చనిపోయాడు. ఈ సంఘటన మంగళవారం సింగరాయకొండ మండలం పాకల పంచాయతీలో పోతయ్యగారి పట్టపుపాలెంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. పోతయ్య గారి పట్టపుపాలేనికి చెందిన వాయిల పోలయ్య(47) మంగళవారం సముద్రంలో చేపలు వేటాడేందుకు వల తీసుకుని సముద్రపు ఒడ్డుకు వెళ్లాడు. వలను వేసే ప్రయత్నం చేస్తున్న సమయంలో సముద్రంలో అలల ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో అలల తాకిడికి పోలయ్య వలతో పాటు సముద్రంలో తిరగబడ్డాడు. వల అతనిని చుట్టుకోవటంతో తనను తాను రక్షించుకోలేక నీట మునిగాడు. ఊపిరి ఆడక మృత్యువాత పడ్డాడు. మృతుడికి ఇతనికి భార్య, నలుగురు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నాడు. పేదరికంలో ఉన్న పోలయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని మత్యకార నాయకులు కొందరు వైఎస్సార్సీపీ కొండపి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మాదాసి వెంకయ్యను వేడుకున్నారు. పోలయ్య కుటుంబానికి ప్రభుత్వం ద్వారా ఆర్థిక సాయం వచ్చేందుకు కృషి చేస్తానని వెంకయ్య వారికి హామీ ఇచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ పులి రాజేష్ తెలిపారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కందుకూరు ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. -
చేపల వేటలో మత్స్యకారుడి దుర్మరణం
తిరుమలాయపాలెం: మండలంలోని బచ్చోడు గ్రామంలోని ఏనెగచెరువులో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు చేపల వేట చేస్తూ తెప్పపై నుంచి పడిపోయి వలలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..గ్రామానికి చెందిన చెన్నబోయిన రామకృష్ణ(38) గురువారం ఉదయం తోటి మత్స్యకారులతో కలిసి తెప్ప సహాయంతో చేపల వేట చేసేందుకు ఏనిగచెరువుకి వెళ్లాడు. వలను సరిచేసుకుంటూ వెళ్తుండగా ప్రమాదవశాత్తూ నీటిలో పడిపోయాడు. ఇదే క్రమంలో వలలో కాళ్లు చిక్కుకుని బయటకు వెళ్లే మార్గం లేక నీటిలో మునిగిపోయి మృతిచెందాడు. ఈ విషయాన్ని గమనించిన తోటి మత్స్యకారులు అతడి కోసం చెరువులో గాలింపు చేపట్టగా వలలో చిక్కుకుని విగతజీవిగా మారిన రామకృష్ణ మృతదేహాన్ని వెలికి తీశారు. చెరువు నిండుగా నీళ్లు ఉండడంతో శవాన్ని వెలికితీసేందుకు మత్స్యకారులు తీవ్రంగా శ్రమించారు. రెక్కాడితే కానీ..డొక్కాడని రామకృష్ణకు భార్య ఎల్లమ్మ, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. చేపల వేటకు మృత్యువాత పడడంతో ఆ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడు ఓర వెంకటేశ్వర్లు సందర్శించి నివాళులర్పించారు. రామకృష్ణ కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందజేసి ఆదుకోవాలని కోరారు. సర్పంచ్ రామసహాయం హరితారెడ్డి కూడా సంఘటన స్థలానికి చేరుకుని మత్స్యకార్మికుడు రామకృష్ణ మృతిపట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
అమ్మో..తుపాను!
అచ్యుతాపురం (యలమంచిలి): తుపాను వచ్చిందంటే మత్స్యకారుల కంటి మీద కునుకు ఉండదు. ఒక పక్క కెరటాల ఉద్ధృతితో తీరం చేరి పడవలు తాకుతూ భయంకర శబ్దం చేస్తాయి. సముద్రం కోతకు గురై ఇసుక కొట్టుకుపోయి గోతులు ఏర్పడతాయి. తీరంలో ఉన్న గుడిసెలపైకి కెరటాలు దూసుకు వస్తాయని భయం.. ఒక పక్క పడవల్ని కాపాడుకోవాలి మరో పక్క ఇళ్లను కాపాడుకోవాలి. వలలు, ఇతర సామగ్రి భద్రపరచుకోవాలి. అర్ధరాత్రి అ యినా మత్స్యకారులకు కష్టాలు తప్పడం లేదు. పూడిమడకతీరంలో వెయ్యి పడవలకు రక్షణ లేకుండా పో యింది. మత్స్యకారులకు ప్రశాంతత కరువైంది. ఫొని తుఫాను హెచ్చరికతో మత్స్యకారుల మరోసారి ఉలిక్కిపడ్డారు. పడవల్ని కాపాడుకోవడానికి నానా అవస్థలు పడ్డారు. జెట్టీ నిర్మించకపోవడం, రక్షణగోడ ఏర్పాటు కాకపోవడంతో మత్స్యకారులకు తుపాను కష్టాలు తప్పటం లేదు. రక్షణగోడ నిర్మించాలి విశాఖకు – కాకినాడకు మధ్య వెయ్యి పడవలలో ఆరువేలమంది మత్స్యకారులు వేటాడే పెద్దగ్రామం పూడిమడక. పూడిమడక జనాబా 16వేల మంది ఉన్నారు. ఇక్కడి తీరం వేటకు అనుకూలంగా ఉండటంతో çపరవాడ, అచ్యుతాపురం, రాంబిల్లి , ఎస్.రాయవరం, నక్కపల్లి, పాయకరావుపేట మండలాల మత్స్యకారులు ఇక్కడ నుంచి వేటాడతారు. పూడిమడక మత్స్యకారులకు చెందిన బంధువులు సీజన్లో ఇక్కడికి వచ్చి వేటసాగిస్తారు. ఆ వేట ప్రశ్నార్థకంగా మారింది. తీరం వద్ద నివాసం ఉండేవéరు ప్రాణాలు అరచేతిలో పెట్టుకోక తప్పదు. జాలరిపాలెం కొండ నుంచి మెరైన్‌పోలీస్ స్టేషన్ వరకూ రెండు కిలోమీటర్ల పరిధిలో రక్షణ గోడ నిర్మించాలని మత్స్యకారులు కోరుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. తీరం వెంబడి ఆరువందల కుటుం బాలను ఖాళీ చేయించడానికి ప్రభుత్వం ఇళ్లు నిర్మించింది. ఆ ఇళ్లను పంపిణీ చేయకపోవడంతో ఇప్పటికీ మత్స్యకారుల తీరానికి సమీపంలో నివాసం ఉంటున్నా రు. తీరప్రాంత మత్స్యకారులకు సురక్షిత ప్రాంతంలో ఇళ్లు నిర్మించి తరలించాలని తీరం నుంచి రెండువందల అడుగుల దూరంలో రక్షణ గోడ నిర్మించాలని మత్స్యకారులు కోరుతున్నారు. జెట్టీ లేక పడవలకు ముప్పు ఖరీదైన చేపల్ని వేటాడడానికి మత్స్యకారులు 200 కిలోమీటర్లకు మించి దూరం వేటకు వెళ్తున్నారు. ఇందుకోసం పెద్దబోట్లు, ఇంజిన్లను విని యోగిస్తున్నారు.రూ.పదిలక్షల ఖర్చుతో వేటసామగ్రి తయారు చేసుకుంటున్నారు. జెట్టీ లేకపోవడంతో తీరం వద్ద ఇసుకతిన్నలపై ఉంచేస్తున్నారు. కెరటాల తీ వ్రత పెరిగినప్పుడు తక్షణమే పడవల్ని సురక్షిత ప్రాం తానికి చేర్చాలి. జాగ్రత్తపడకపోతే పడవలు ఢీకొని దెబ్బతింటున్నాయి. ఒక్కొక్క పడవని జరపాలంటే కనీ సం 12 మంది భుజంపట్టి ఈడ్చాల్సి వస్తుంది. వేటకు వెళ్లేటప్పడు, వేట ముగిసిన తరువాత పడవల్ని భూజంపట్టి లాగుతారు. చేపలు పడినా పడకపోయినా ఈ మోత తప్పడం లేదు. గతంలో సీజన్‌ను బట్టి కెరటాలు ఎక్కడికి వస్తాయో అంచనా ఉండేది. తుపానుకు కెరటాలు ఉద్ధృతంగా వస్తాయని భావించేవారు. ఇప్పుడు క్షణంలో పరిస్థితి మారుతోంది. దీంతో రాత్రులు కంటి మీద కునుకు ఉండటం లేదు. జెట్టీ నిర్మిస్తే కెరటాల తీవ్రత పెరిగినా జెట్టీలో లంగరు వేసిన పడవలు సురక్షితంగా ఉంటాయి. వేటసామగ్రి భద్రంగా ఉంటుంది. మోతభారం పూర్తిగా ఉండదు.. ఇద్దరు మత్స్యకారులు లంగరు విదిలించి పడవను తీసుకొని వేటకు వెళ్లగలరు. మోతకు భయపడి పలువురు వేటకు దూరమవుతున్నారు. జెట్టీ నిర్మాణానికి నిధులు మంజూరు పూడిమడక తీరం కోతకు గురవుతోందన్నది వాస్తవం. తీరం వెంబడి ఇళ్లకు ప్రమాదం ఏర్పడుతుంది. ఎక్కువ బోట్లు వేట సాగిస్తున్నందు వల్ల జెట్టీ్ట నిర్మాణం జరిగితే మత్స్యకారులకు శ్రమ తగ్గుతుంది. రక్షణగోడ, జెట్టీ నిర్మాణానికి గతంలో పతిపాదనలు పంపించాం. జెట్టీ నిర్మాణానికి రూ. 50లక్షల నిధులు మంజూరయ్యాయి. పనులు ప్రారంభించాల్సి ఉంది. –పి.శ్రావణి కుమారి, ఎఫ్‌డీవో, అచ్యుతాపురం -
మాటలు ఘనం.. చేతలు శూన్యం
అంతన్నారు..ఇంతన్నారు..అది చేస్తాం..ఇది చేస్తామంటూ ఎన్నో హామీలిచ్చారు. తీరా మళ్లీ ఎన్నికలకు వచ్చే నాటికి ఏం చేశారంటే చేసింది శూన్యం. ఐదేళ్ల టీడీపీ పాలనలో మత్స్యకారుల అభివృద్ధి చేసింది ఏం లేదు. బోట్ ల్యాండింగ్, చేపల మార్కెట్, హేచరీ, రెసిడెన్షియల్ స్కూల్ అంటూ ఎన్నో హామీలిచ్చిన స్థానిక ఎమ్మెల్యే స్వామి ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయారు. తమ సమస్యలపై నిర్లక్ష్యం వహించిన ప్రభుత్వ తీరుపై మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, సింగరాయకొండ (ప్రకాశం): మత్స్యకారుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ఊదరగొట్టే ప్రభుత్వం ఈ ఐదేళ్లలో వారి కోసం చేసింది శూన్యమనే చెప్పాలి. ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే స్వామి మా గురించి ఏనాడూ పట్టించుకోలేదని స్థానిక మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బోట్ ల్యాండింగ్, చేపల హేచరీ ఎక్కడ..? మండలంలోని మత్స్యకారుల కోసం సుమారు రూ.3 కోట్ల అంచనా వ్యయంతో బోట్ ల్యాండింగ్ సదుపాయం, సుమారు కోటి రూపాయల అంచనా వ్యయంతో చేపల హేచరీ ఏర్పాటు చేస్తానని సుమారు ఏడాది క్రితం హడావుడి చేశారు. ఈ రెండు పాకల పల్లెపాలెం వద్ద ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. అయితే చేపల హేచరీ ఏర్పాటుచేస్తే ఉన్న కాస్త ఇంటిస్థలం హేచరీకి పోతుందని పల్లెపాలెం మత్స్యకారులు హేచరీ ఏర్పాటుకు నిరాకరించారు. అయితే పక్కనే ఉన్నపోతయ్యగారి పట్టపుపాలెం మత్యకారులు ఆ హేచరీ మా ప్రాంతంలో ఏర్పాటు చేయాలని కోరారు. అయితే ఆ ప్రాంతంలో ఏర్పాటుకు ఎమ్మెల్యే స్వామి పట్టించుకోలేదని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. చివరికి ఈ రెండు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయకుండానే పక్క జిల్లాలకు తరలిపోయాయి. తీవ్ర తాగునీటి ఎద్దడి మత్స్యకార పాలెంలో తీవ్ర నీటి ఎద్దడి ఉంది. సుమారు 6 నెలలుగా పాకల పల్లెపాలెంలోని రక్షిత మంచినీటి పథకం నిరుపయోగంగా ఉంది. వాస్తవానికి నీటి ఎద్దడి ఉన్న గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని తోలాల్సి ఉన్నా కాంట్రాక్టరు సక్రమంగా సరఫరా చేయడం లేదని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. ఒక్క ఇంటి పట్టా అయినా ఇచ్చారా..? మత్స్యకారపాలెంలో ఒక్కో ఇంటిలో నాలుగైదు కుటుంబాలు నివాసం ఉంటున్నారు. దీంతో మాకు ఇంటి పట్టా ఇచ్చి పక్కా గృహం కట్టించి ఇవ్వాలని ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినా ప్రయోజనం లేదని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు.. అరకొరగా వేట నిషేధ భత్యం.. వేట నిషేధ భత్యం ఇవ్వడంలోనూ అన్యాయం జరుగుతోందని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. మండలంలో సుమారు 1,200 మందికి మాత్రమే వేట నిషేధ భత్యం లభిస్తోంది. వాస్తవానికి చేపల వేటలో ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గానీ సుమారు 5 వేల మంది వరకు ఆధారపడి ఉన్నారు. కానీ వీరెవరికి వేటనిషేధ భత్యం లభించడం లేదు. చేపల వేటపై ఆధారపడే ప్రతి ఒక్కరికీ వేటనిషేధ భత్యం ఇవ్వాలని మత్స్యకారులు కోరుతున్నారు. మత్స్యకారుల కోసం చేపల మార్కెట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినా ఇంతవరకు అవి నిర్మాణ దశలో ఉన్నాయే తప్ప ప్రారంభానికి నోచుకోలేదు. పాకల బీచ్‌లో చేపల కేంద్రం నిర్మించినా అది కూడా ప్రారంభానికి నోచుకోలేదు. అంతేకాక బీచ్‌లో మాత్రం సుమారు రూ.4 కోట్ల రూపాయల అంచనావ్యయంతో రెస్టారెంటు మాత్రం నిర్మిస్తున్నారని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. శిథిలావస్థలో తుఫాన్ షెల్టర్లు ప్రకృతి వైపరీత్యాల సమయంలో మత్స్యకారులను ఆదుకునేందుకు ప్రభుత్వం తుఫాన్షెల్టర్లను ఏర్పాటు చేసింది. అయితే పాకల పల్లెపాలెం, ఊళ్లపాలెం దేవలం పల్లెపాలెం తుఫానుషెల్టర్లు శిథిలావస్థకు చేరుకున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. వీటి నిర్మాణంపై ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. అదే విధంగా 10 ఏళ్ల క్రితం మత్స్యకారపాలెంలో ఏర్పాటు చేసిన తుఫాన్ హెచ్చరికల కేంద్రం నిరుపయోగంగా మారింది. దాని గురించి పట్టించుకునే వారే కరువయ్యారు. అద్దె భవనంలోనే రెసిడెన్షియల్ స్కూలు.. మత్స్యకారుల పిల్లల కోసం సుమారు రూ.25 కోట్ల అంచనా వ్యయంతో గురుకుల పాఠశాలల తరహాలో వసతి గృహాన్ని నిర్మిస్తామని సుమారు మూడేళ్ల క్రితం ఎమ్మెల్యే స్వామి వాగ్దానం చేశారు. ఈ వసతి గృహం కోసం అప్పటి తహశీల్దార్ షేక్ దావూద్‌హుస్సేన్ ఉళ్లపాలెం పంచాయతీ పరిధిలోని వడ్డెరకాలనీ పక్కన ఉన్న 9 ఎకరాల స్థలాన్ని పరిశీలించి ఎంపిక చేశారు. ఈ స్థలాన్ని అప్పటి కందుకూరు ఆర్డీఓ మల్లికార్జునరావు కూడా పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక అందజేశారు. వాస్తవానికి గతంలో ఈ స్థలాన్ని ఊళ్లపాలెం గ్రామస్తులకు ప్రభుత్వం పట్టాలు కూడా ఇచ్చింది. అయితే వీరికి మరోచోట స్థలం ఇస్తామని చెప్పటంతో పట్టాదారులు అంగీకారం తెలిపారు. అయితే ఈ స్థలంలో నేటికి వసతి గృహం నిర్మాణానికి శంకుస్థాపన చేయలేదు. అయితే ఈ వసతి గృహాన్ని టంగుటూరులో అద్దె భవనంలో ఏర్పాటు చేశానని. త్వరలో శంకుస్థాపన చేస్తానని ఎమ్మెల్యే చెబుతున్నారని మత్స్యకారులు తెలియజేస్తున్నారు. వాస్తవానికి మండలంలో ఏర్పాటు చేయకుండా టంగుటూరులో ఏర్పాటు చేయడమేంటని మత్స్యకారులు ప్రశ్నిస్తున్నారు. అంతేకాక టంగుటూరులో ఏర్పాటు చేయడంతో మత్స్యకారుల పిల్లలు 80 శాతం ఉండాల్సి ఉండగా కేవలం 30 శాతం మాత్రమే ఉన్నారని పేర్కొంటున్నారు. దీనికి తోడు ఈ భవనంలో వసతులు కూడా సక్రమంగా లేవని, అది కూడా కేవలం బాలికలకు మాత్రమే ఏర్పాటు చేశారంటున్నారు. ఒక్క హామీ అమలు చేయలేదు టీడీపీ ప్రభుత్వం మత్స్యకారుల కోసం ఎటువంటి పథకాలు సక్రమంగా అమలు చేయలేదు. చివరికి మా పిల్లల కోసం శాశ్వత వసతిగృహæం ఏర్పాటు చేస్తామని చెప్పి టంగుటూరులో అద్దె భవనంలో ఏర్పాటు చేశారు. అక్కడ విద్యార్థినులకు పూర్తిస్థాయిలో వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. - ప్రళయకావేరి రోశయ్య, పాకల పట్టించుకున్న వారు లేరు మా పాలెంలో చేపల హేచరీ ఏర్పాటు చేయాలని కోరాం. ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశాం. కానీ విజ్ఞప్తి పట్టించుకున్న నాథుడు లేడు. చివరికి బాపట్ల ప్రాంతానికి ఈ హేచరీ వెళ్లిపోయిందని అధికారులు తెలిపారు. - వాయిల రమేష్, పోతయ్యగారి పట్టపుపాలెం మత్స్యకారులకు తీవ్ర అన్యాయం టీడీపీ ప్రభుత్వంలో సాంప్రదాయ మత్స్యకారులకు తీవ్ర అన్యాయం జరిగింది. చేపలు అమ్ముకోవటానికి ఎటువంటి వాహనాలు ఇవ్వలేదు. మాకన్నా ఇతర కులాల వారికి అధిక సంఖ్యలో ఇచ్చారు. ప్రస్తుతం మాకు మోపెడ్లు మంజూరైనా ఎన్నికల కోడ్ అని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదు. వీటిని ఎప్పుడు పంపిణీ చేస్తారో అర్థం కావడం లేదు. - రాసాని కృపారావు, పాకల -
శాకాహారి ఎంపీకి చేపల మార్కెట్లో ఆదరణ
తిరువనంతపురం: కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ వివాదంలో చిక్కుకున్నారు. మత్స్యకారులను ఉద్దేశించి ఆయన చేసిన ట్వీట్‌పై కేరళ బీజేపీ, సీపీఎం నాయకులు మండిపడ్డారు. మత్స్యకారులకు ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. థరూర్ ట్వీట్‌కు వ్యతిరేకంగా కొచ్చి, కొల్లాం, కోజికోడ్‌లలో మత్స్యకారులు ఆందోళనకు దిగారు. తాను రాసిన పదాల్ని ఉద్దేశపూర్వకంగా వక్రీకరించారని థరూర్ వివరణ ఇచ్చారు. తిరువనంతపురం నుంచి లోక్‌సభ బరిలో నిలిచిన థరూర్ ప్రచారంలో భాగంగా ఇటీవల స్థానిక చేపల మార్కెట్లో పర్యటించారు. ‘ఎంతో నిష్టతో శాకాహారాన్ని మాత్రమే భుజించే ఎంపీకి చేపల మార్కెట్లో మంచి ఆదరణ లభించింది’ అని ట్వీట్ చేశారు. అనంతరం వివాదం రేగడంతో.. ప్రేమ కురిపించారని చెప్పడమే తన ఉద్దేశమని, ఎవరినీ అవమానించడం కాదని వివరణ ఇచ్చారు. తన కుటుంబంలో తాను మినహా అందరూ చేపలు తింటారన్నారు. మత్స్యకారులకు ఏమీ చేయని వారు కూడా ఒక్క పదాన్ని సాకుగా చూపి విమర్శిస్తున్నారని మండిపడ్డారు. కేరళ వరదల సందర్భంగా సహాయక చర్యల్లో పాలుపంచుకున్న మత్స్యకారులను థరూర్ ఫిబ్రవరిలో నోబెల్ శాంతి బహుమతికి సిఫార్సు చేయడం తెల్సిందే. -
నీలివిప్లవానికి సర్కారు చేయూత
సాక్షి, హైదరాబాద్: చేపల ఉత్పత్తి పెంచడం, ప్రాసెసింగ్, మార్కెటింగ్‌కు అవసరమైన మౌలిక సదుపాయాల ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో నీలి విప్లవాన్ని తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుం బిగిం చింది. దీనిలో భాగంగా మత్స్యకారులకు రూ. 535 కోట్ల విలువైన పరికరాలను సమగ్ర మత్స్య అభివృద్ధి పథకం కింద సబ్సిడీపై అందజేసింది. ఈ పథకానికి వచ్చిన దరఖాస్తుల్లో 1.69 లక్షలు అర్హమైనవిగా నిర్ధారించి 1.60 మందికి వివిధ రకాల పరికరాలను ప్రభుత్వం మంజూరు చేసినట్లు మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ ‘సాక్షి’కి తెలిపారు. ఇప్పటివరకూ 80 వేలమంది లబ్ధిదారులు తమ వాటా సొమ్మును ప్రభుత్వానికి చెల్లించగా వారికి రూ. 535.93 కోట్ల విలువైన 77,448 యూనిట్ల పరికరాలను అందజేసింది. 60,398 మందికి వెండింగ్ యూనిట్ల కింద పంపిణీ చేసే మోపెడ్లను అందజేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకూ 50,460 మందికి పంపిణీ చేసింది. ప్లాస్టిక్ ఫిష్ క్రేట్స్ 30 వేలకు గాను, 3,515 ఇచ్చారు. 9,759 లగేజీ ఆటోలకు గాను, 2 వేలు పంపిణీ చేశారు. రూ. వెయ్యి కోట్లు మంజూరు సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద లబ్ధిదారులకు అందజేసే పరికరాలకు ప్రభుత్వం 75% నుంచి 100% వరకు రాయితీని కల్పిస్తోంది. దీని అమలుకు జాతీయ సహకార అభివృద్ధి సంస్థ రూ. వెయ్యి కోట్లు మంజూరు చేసింది. చేపలు అమ్మేందుకు 50 వేల బైక్‌లను 75% రాయితీపై ఇస్తోంది. ద్విచక్ర వాహనం ధర రూ. 50 వేలు కాగా, లబ్ధి దారుడు రూ.12,500 చెల్లిస్తే సరిపోతుంది. ప్లాస్టిక్ చేపల క్రేట్లు 30 వేలు ఇస్తారు. వాటి ధర ఒక్కోటి రూ.4 వేలు కాగా, లబ్ధిదారుడు రూ. వెయ్యి చెల్లిస్తే సరిపోతుంది. 45 వేల వలలు, క్రాఫ్టులు అందజేస్తారు. పోర్టబుల్ చేపల అమ్మకానికి కియోస్కూలు 19 వేల యూనిట్లు ఇస్తారు. వాటి ధర రూ. 20 వేలు కాగా, లబ్ధిదారుడు రూ. 5 వేలు చెల్లిస్తే సరిపోతుంది. -
మత్స్యకారులకు అన్నివిధాలా చేయూత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మత్స్యకారులకు అన్ని విధాలా చేయూతనిచ్చి ఆదుకుంటామని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. సీఫా (సొసైటీ ఫర్ ఇండియన్ ఫిషరీస్, ఆక్వాకల్చర్), తెలంగాణ పశుసంవర్థక, మత్స్యశాఖ, ఆక్వా ఫామింగ్ టెక్నాలజీస్ అండ్ సొల్యూషన్స్ (ఏఎఫ్‌టీఎస్), హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లు సంయుక్తంగా నిర్వహించిన ఆక్వా ఎక్స్పో–2019 సదస్సును తలసాని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పుడు ఆంధ్ర ప్రాంత మత్స్యకారుల అభివృద్ధిని మాత్రమే చూసేవారని, తెలంగాణ మత్స్యశాఖ దరిదాపులకు కూడా ఎవరు రాలేదన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ చొరవ తో మత్స్య పరిశ్రమ మీద ఆధారపడిన ముదిరాజ్, గంగపుత్ర వాటి ఉపకులాల అభివృద్ధికి ఎంతో కృషి చేశామని తెలిపారు. దేశంలోనే మత్స్యకారులకు ఉచితంగా చేపల ఫీడ్‌ను అందించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో నీటి లభ్యత ఉన్న ప్రతీ చోట చేపల పెంపకానికి చర్యలు తీసుకున్నామని తెలిపారు. రాష్ట్ర మత్స్యశాఖ అధికారుల కృషి, సీఎం కేసీఆర్ సంకల్పంతో మత్స్యశాఖ అభివృద్ధి దిశగా నడుస్తోందన్నారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తయితే నీటి లభ్యత పెరుగుతుందని, దానికి అనుగుణంగా చేపల పెంపకానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. చేపల పెంపకంతో పాటు మార్కెటింగ్ పెంచేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. మత్స్యకారులకు చేపల పెంపకానికి అధునాతన టెక్నాలజీతో కూడిన పరికరాలను అందజేశామన్నారు. 2018– ఆక్వా ఎక్స్పో విజయవంతం కావడంతో అదే ఉత్సాహంతో 2019–ఎక్స్పోను ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర పశుసంవర్థక, మత్స్యశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా మాట్లాడుతూ, రెండేళ్ల నుంచి ఆక్వా రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఇందుకు రూ.వెయ్యి కోట్ల బడ్డెట్‌ను కేటాయించిందని పేర్కొన్నారు. సదస్సులో ఫిషరీస్ కమిషనర్ సువర్ణ, సీఫా అధ్యక్షుడు రామచందర్రాజు, పలు దేశాల ప్రతినిధులు, తెలుగు రాష్ట్రాల మత్స్యకారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
చేపలవేటకు వెళ్లి మత్స్యకారుడి మృతి
శాలిగౌరారం(తుంగతుర్తి) : బతుకుదెరువు కోసం కుల వృత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తున్న ఓ మత్స్యకార్మికుడు చేపలవేటకు వెళ్లి మృత్యువాతపడ్డాడు. ఈ సంఘటన మండలంలోని ఇటుకులపహాడ్ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, బాధిత కుటుంబీకుల బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఇటుకులపహాడ్ గ్రామానికి చెందిన నీలం వెంకటేశ్(56) 30 సంవత్సరాలుగా కులవృత్తి అయిన చేపలవేటపై ఆధారపడి కుటుంబ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో రోజువారి మాదిరిగానే గురువారం తన సన్నిహితులతో కలిసి గ్రామ సమీపంలో ఉన్న మూసీ ప్రాజెక్టులోకి చేపలవేటకు వెళ్లాడు. దీంతో ప్రాజెక్టులోకి దిగి కొన్ని చేపలను పట్టిన ఆయన అదే రీతిలో చేపలను పట్టుకుంటూ వెనుదిరిగాడు. ఈ క్రమంలో ఆయన వల విసిరిన ప్రదేశంలో ఇసుకను తవ్విన గొయ్యి ఉండడంతో కాలుజారి గోతిలో పడడంతో అదేగోతిలో ఉన్న చేపలవల కాళ్లకు చుట్టుకుంది. తప్పించుకునే క్రమంలో వలలోనే చిక్కుకున్నాడు. చేపల వల నుంచి బయటపడేందుకు వీలుకాకపోవడంతో నీటమునిగిన వెంకటేశం ఊపిరాడక ప్రాజెక్టునీటిలోనే మృతిచెందాడు. కొంత సమయం తర్వాత అతనితో పాటు చేపలవేటకు వెళ్లిన అతని సన్నిహితులు తమ పనిని ముగించుకొని ఒడ్డుకు చేరుకోగా వెంకటేశం మాత్రం కనిపించలేదు. కానీ ప్రాజెక్టు ఒడ్డున వెంకటేశానికి సంబంధించిన సైకిల్, చెప్పులు ఉండడంతో ప్రాజెక్టులో ఎక్కడో ఓ చోట ఉన్నాడనుకున్న అతని సన్నిహితులు ప్రాజెక్టు ఒడ్డున మరికొంత సేపు వేచిచూశారు. ఎంత సేపటికి వెం కటేశం రాకపోవడం, ప్రాజెక్టులో ఎక్కడా కని పించకపోవడంతో ఆందోళనకు గురైన సన్నిహితులు ప్రాజెక్టులో కొంతమేర వెతకసాగారు. ఈ క్రమంలో ఓ లోతట్టు ప్రాంతంలో చేపల వలకు సంబంధించిన దిండు(థర్మకోల్) కనిపించడంతో వారు దానిని పైకి లాగడంతో వెంకటేశం మృతదేహం కనిపించింది. దీంతో వారు లబోదిబోమం టూ చెరువు ఒడ్డుకు వచ్చి విషయాన్ని గ్రామస్తులకు తెలిపారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు వెంకటేశం మృతదేహాన్ని చూసేందుకు అధికసంఖ్యలో తరలివచ్చారు. వెంటనే మరికొంతమంది మత్స్యకారులతో పాటు గ్రామస్తులు కలిసి తెప్పపడవలో వెంకటేశం మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకువచ్చారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. తండ్రి మృతదేహంపై పడి ఆయన కుమార్తె రోదిస్తున్న తీరు అక్కడకు వచ్చిన ప్రతీ ఒక్కరిని కంటతడి పెట్టించింది. ఇదిలా ఉండగా వెంకటేశం భార్య ఇటీవల కొంత అనారోగ్యానికి గురికావడంతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. భర్త మృతిచెందిన విషయాన్ని తెలుసుకున్న ఆమెను బంధువులు, గ్రామస్తులు రాత్రి ఇటుకులపహాడ్‌కు తీసుకువచ్చారు. ప్రమాద సంఘటనపై బాధిత కుటుంబీకులు శుక్రవారం పోలీసులకు పిర్యాదు చేయనున్నట్లు తెలిసింది. ఇటుకులపహాడ్‌లో విషాదఛాయలు చేపలు పట్టేందుకు వెళ్లి వలలో చిక్కుకొని ప్రాజెక్టులో నీటమునిగి నీలం వెంకటేశం మృతిచెందడంతో ఇటుకులపహాడ్ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఇటుకులపహాడ్‌లో అత్యధికంగా మత్స్యకారుల కుటుంబాలు ఉండడం, వారంతా చేపలవేటపైనే ఆధారపడి జీవనోపాధి పొందడంతో గ్రామం విషాదంలో మునిగిపోయింది. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని గ్రామస్తులు, మత్స్యకారులు, రాజకీయపార్టీల నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. -
ఫిట్‌లెస్ పడవలు
కృష్ణాజిల్లా, తాడేపల్లి రూరల్(మంగళగిరి): అధికారం ముసుగులో బరితెగిస్తున్నారు.. నది గర్భాన్ని దోచుకుంటున్నారు.. నిబంధనలకు తిలోదకాలుస్తున్నారు.. అడ్డగోలుగా తవ్వకాలకు పాల్పడుతున్నారు.. ప్రజల ప్రాణాలను బలిగొంటున్నారు.. వివరాలు.. రాజధాని పరిధిలో ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోంది. మూడు రోజుల క్రితం తుళ్లూరు మండలం లింగాయపాలెంలో యువకుడు మృతి చెందాడు. అయినా క్వారీని యథాతథంగా నిర్వహించారు. దీంతో ఓ పడవ ప్రమాదవశాత్తు శుక్రవారం నీటిలో మునిగిపోయింది. ఆ సమయంలో పడవలో ఐదుగురు కార్మికులు ఉన్నారు. కృష్ణానది ఒడ్డున వంద మీటర్ల దూరంలో పడవ మునిగిపోవడంతో, కార్మికులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని ఎలాగోలా ప్రమాదం నుంచి బయటపడ్డారు. బుధవారం కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తుమ్మలపాలేనికి చెందిన పి.దుర్గాప్రసాద్ మృతి చెందిన ఘటన మర్చిపోకముందే ఇసుకరీచ్‌లో పడవ మునగడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఎవరైనా ఈ విషయాన్ని బయటకు చెబితే మీ అంతు చూస్తామని ఇసుక మాఫియా, టీడీపీ నాయకులు బెదిరించడంతో, జరిగిన ఘటనలను బయటకు చెప్పడానికి కార్మికులు భయపడుతున్నారు. ఇంత జరుగుతున్నా స్థానిక అధికారులు పట్టించుకోకపోవడంతో పలు విమర్శలు వినిపిస్తున్నాయి. కనిపించని రెవెన్యూ సిబ్బంది.. టీడీపీ నాయకులు ఆధీనంలో ఉన్న ఏ ఇసుకరీచ్‌లో కూడా అధికారులు, రెవెన్యూ సిబ్బంది కనిపించరు. నామాత్రంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, నిబంధనలకు విరుద్ధంగా టన్నుల కొద్దీ ఇసుక తరలిస్తున్నా పట్టించుకునే వారు కనిపించడం లేదు. వారికి అనుమతించిన సామర్థ్యం కంటే ఎక్కువ తరలించడం, కేటాయించిన స్థలంలో కాకుండా వేర్వేరు ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలు నిర్వహిస్తున్నారు. సర్టిఫికెట్లు, లైసెన్స్‌లు ఎక్కడ..? నది, సముద్రం, పెద్ద పెద్ద చెరువుల్లో పడవలు నడపాలంటే కాకినాడ పోర్టులో తర్ఫీదు పొంది, లైసెన్స్ పొందాల్సి ఉంది. ప్రస్తుతం ఇసుక రీచ్‌లో పడవలు నడుపుతున్న డ్రైవర్లకు ఒక్కరికి కూడా లైసెన్స్‌లు లేవు. బుధవారం మునిగిన పడవ డ్రైవర్‌కు లైసెన్స్ లేదని కార్మికులు చెబుతున్నారు. పడవలకు సంబంధించి ఫిట్నెస్ సర్టిఫికెట్ కాకినాడ పోర్టులో తీసుకోవాల్సి ఉంది. లింగాయపాలెం, ఉద్దండరాయపాలెం, రాయపూడి, పెనుమాక క్వారీల్లో నడిపే పడవల్లో ఒక్క పడవకు కూడా లైసెన్స్‌లు లేవు. ఈ ఇసుకరీచ్‌లన్నీ సీఎం నివాసానికి కూతవేటు దూరంలో ఉండటంపై విస్మయం వ్యక్తమవుతోంది. పోర్టు అధికారి ఏమన్నారంటే.. కృష్ణానది ఎగువ ప్రాంతంలో తిరుగుతున్న పడవల ఫిట్నెస్ గురించి వివరణ కోరగా మచిలీపట్నం పోర్టు ఫిట్నెస్ అధికారి దుర్గానాగమల్లేశ్వరరావు స్పందిస్తూ ఆ బాధ్యత మా ఒక్కరిదే కాదని, పోలీసు, రెవెన్యూ, ఇరిగేషన్, మైనింగ్ శాఖలకు కూడా ఉందని, వారు గుర్తించి మాకు వివరాలు అందించాలని చెప్పారు. ప్రస్తుతానికి ఏడు ఇసుక పడవలకు మాత్రమే అనుమతులు ఇచ్చామన్నారు. మాకన్నా ఎక్కువ బాధ్యత కాకినాడ పోర్టు వారికి ఉందని చెప్పుకొచ్చారు. -
జలాశయాల్లోకి 4 కోట్ల రొయ్యలు
సాక్షి, హైదరాబాద్: నీలకంఠ రొయ్యల ఉత్పత్తి మత్స్యకారులకు మంచి లాభాలు తెచ్చిపెడుతుండటంతో ఈ సారి దాదాపు 4.07 కోట్ల రొయ్యలను వదిలేందుకు మత్యశాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. 23 రిజర్వాయర్లలో వీటిని వదలాల్సి ఉండగా ఇప్పటికే పలు జలాశయాల్లో వదిలారు. గతేడాది రూ.కోటి పెట్టుబడితో రొయ్యలను వదలగా ఏకంగా ఏడింతలు రూ.8 కోట్ల పైన లాభాలు రావడం విశేషం. గతేడాది పైలట్ ప్రాజెక్టు కింద ప్రారంభించిన ఈ పథకం మత్స్యశాఖకు మంచి ఫలితాలను తెచ్చిపెట్టింది. గత నవంబర్‌లో పైలట్ ప్రాజెక్టు కింద 11 రిజర్వాయర్లలో రూ.1.39 కోట్లతో 1.08 కోట్ల నీలకంఠ రొయ్యలను వదిలారు. ఒక్కో రొయ్య పిల్లకు రూ.1.28 చొప్పున 1.08 కోట్ల రొయ్య పిల్లలకు మొత్తం రూ.1.39 కోట్లు ఖర్చయ్యాయి. వీటికి రూ. 8.06 కోట్లు పైన లాభాలు వచ్చాయి. 10 వేల మంది మత్స్యకారులకు మంచి ఆదాయం సమకూరింది. కాగా ఈ సారి నిజాంసాగర్ ప్రాజెక్టు, సింగూర్ ప్రాజెక్టు, కడెం, ఎస్సార్ఎస్పీ, ఎల్ఎండీ, ఎగువ మానేరు, పోచారం ప్రాజెక్టు, సతనాల, మత్తడివాగు, శ్రీపాద ఎల్లంపల్లి, శ్రీ కొమురం భీం ప్రాజెక్టు, ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు, మూíసీ ప్రాజెక్టు, దిండి, కోయిల్ సాగర్, పాలేరు, వైరా, లంకసాగర్, పెద్దవాగు ప్రాజెక్టు, తాలిపేరు, ఘన్పూర్ ములుగు ప్రాజెక్టు, శనిగరం ప్రాజెక్టుల్లో రొయ్యలు వదులుతున్నారు. యూరోపియన్ దేశాలకు ఎగుమతి.. నీలకంఠ రొయ్య (స్కాంపి) నీలంరంగులో రెండు పొడువైన కాళ్లు కలిగి ఉంటుంది. 1.5 అంగుళాల సైజులో ఉండే ఈ రొయ్య పిల్లలు 4 నుంచి 6 నెలల్లో దాదాపు 100గ్రా. వరకు బరువు పెరుగుతాయి. వీటికి మార్కెట్ ధర కిలోకు రూ.240 వరకు ఉంటుంది. ఈ రొయ్యలు ఎక్కువగా యూరోపియన్ దేశాలకు ఎగుమతవుతాయి. -
చేపా చేపా 'ఎక్కడికెళ్లావ్?'
రాష్ట్రంలో ఉచిత చేప పిల్లల పంపిణీ మందకొడిగా సాగుతోంది. ఈ ఏడాది 74.73 కోట్ల చేప పిల్లలను పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నా 15 శాతానికి మించి పంపిణీ జరగలేదు. రాష్ట్రంలోని 21 వేల నీటి వనరులకుగాను 3 వేల చెరువులు, కుంటల్లోనే చేపలను వదిలారు. మిగిలిన కోట్లాది చేపల్ని ఎప్పుడు వదులుతారో స్పష్టత లేదు. నీటిపారుదల వర్గాల లెక్కల ప్రకారం ఇటీవలి భారీ వర్షాలకు అనేక జలాశయాలు, చెరువులు, కుంటల్లోకి అవసరమైన స్థాయిలో నీరొచ్చింది. కానీ ఆ సమయంలో అధికారులు మేలుకోకపోవడంతో పూర్తిస్థాయిలో చేపలను వదలలేకపోయారని ప్రజలు చెబుతున్నారు. – సాక్షి, హైదరాబాద్ ఈసారి 74.73 కోట్లు మత్స్యకారులను ఆర్థి కంగా బలోపేతం చేసేందుకు మత్స్యకార సొసైటీల ద్వారా ‘ఉచిత చేప పిల్లల పంపిణీ’కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. రెండేళ్లుగా చేప పిల్లలలను ఉచితంగా పం పిణీ చేస్తూ వస్తోంది. పథకంతో 4 లక్షల మత్స్య కార కుటుంబాలకు లబ్ధి చేకూర్చాలనేది సర్కారు సంకల్పం. ఈ ఏడాది 74.73 కోట్ల చేప పిల్లలను పంపిణీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. 21,569 నీటి వనరుల్లో చేప పిల్లలను వదిలేందుకు ఏర్పాట్లు చేసింది. అయితే ఇప్పటివరకు 3,147నీటి వనరుల్లో 11.40 కోట్ల చేప పిల్లలనేవదిలినట్లు ప్రభుత్వానికి మత్స్య శాఖ వెల్లడించింది. అంటే లక్ష్యంలో 15.25 శాతమే. ఆ జిల్లాల్లో .. కొన్ని జిల్లాల్లో దారుణంగా చేప పిల్లల పంపిణీ జరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురవడంతో అక్కడి 160 నీటి వనరుల్లో 99.68 లక్షల చేప పిల్లలను పంపిణీ చేయాలనుకున్నారు. కానీ 6 నీటి వనరుల్లో 7.67 లక్షలనే వదిలారు. భద్రాద్రి జిల్లాలోనూ కుండపోత వర్షాలు కురిశాయి. ఆ జిల్లాలో 702 నీటి వనరుల్లో 2.03 కోట్ల చేపలను వదలాలనుకున్నారు. కానీ 2 నీటి వనరుల్లో 3.82 లక్షల చేపలనే వదిలిపెట్టారు. కొమురంభీం జిల్లాలో 242 నీటి వనరుల్లో 1.14 కోట్ల చేపలను వదలాలనుకున్నా కేవలం ఒకే నీటి వనరులో 70 వేల చేపలను వదిలారు. గతం లో ఆలస్యంగా అక్టోబర్ వరకు చేప పిల్లల పంపిణీ జరగడంతో అప్పటికే అనేకచోట్ల మత్స్యకారులు సొంతంగా చేపలను కొన్నారు. దీంతో ఈసారి ఆగస్టు మూడు లేదా చివరి వారంలోనే చేపలను వదలాలని అనుకున్నా.. గడువులోగా చేయలేకపోయారు. దీంతో మిగిలిన చేప పిల్లలను పంపిణీ చేయడానికి ఏ మేరకు అవకాశం ఉంటుందోనని చర్చ జరుగుతోంది. ఏటికేడు లక్ష్యం పెంపు 2016– 17లో చేప పిల్లల పంపిణీని ప్రభుత్వం ప్రారంభించింది. రూ. 22 కోట్లు ఖర్చు చేసి 27 కోట్ల చేప పిల్లలను వదిలింది. 2017–18లో రూ. 44 కోట్లతో 51 కోట్ల చేప పిల్లలను పంపిణీ చేసింది. గతేడాదితో పోలి స్తే ఈసారి 23.72 కోట్లు అదనంగా 74.73 కోట్ల చేపల పంపిణీకి సిద్ధ మైంది. ఇలా ఏటికేడు పంపిణీ లక్ష్యం పెరుగుతోంది. కానీ సకాలంలో చేపలను వదలడంలోనే అధికారులు విఫలమవుతున్నారని ఆరోపణలు విని పిస్తున్నాయి. -
ఐఎం ఉగ్రవాదులకు కలిసొచ్చిన చేపల వేట విధానం
సాక్షి, సిటీబ్యూరో: కర్ణాటకలోని తీర ప్రాంతాల మత్స్యకారులు చేపల వేటకు అవలంభించే విధానమే ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాదులకు కలిసొచ్చింది. గోకుల్‌చాట్, లుంబినీపార్క్, పుణె, ముంబై, బెంగళూర్లలో పేలుళ్లకూ బాంబులు తయారు చేయడానికి ముష్కరులు ‘మీన్ తూటా’ ల నుంచే పేలుడు పదార్థం సేకరించారు. ఐఎం మాస్టర్ మైండ్ రియాజ్ భత్కల్ వృత్తిరీత్యా సివిల్ కాంట్రాక్టర్. తనకున్న పరిచయాలతో తొలినాళ్లలో అమ్మోనియం నైట్రేట్‌ను సమీకరించుకునేవాడు. అయితే దేశంలోని కొన్ని చోట్ల విధ్వంసాలు జరగడం, ఆ బాంబుల్లో అమ్మోనియం నైట్రేట్ వాడినట్లు తేలడంతో నిఘా పెరిగింది. దీంతో పేలుడు పదార్థం సమీకరణకు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్న రియాజ్ కన్ను మీన్ తూటాలపై పడింది. ఇదీ ‘మీన్ తూటా’... కర్ణాటకలోని ఉడిపి, రత్నగిరి, శిరుల్గుప్ప తీరప్రాంతాల మత్స్యకారులు చేపల వేటకు వలలతో పాటు ‘మీన్ తూటా’లను వినియోగిస్తుంటారు. అమ్మోనియం నైట్రేట్ స్లర్రీ (పేస్టులా ఉండే పదార్థం) ప్యాకెట్ లో డిటోనేటర్ ఏర్పాటు చేసి దానికి చిన్న ఫ్యూజ్ వైర్ జత చేస్తారు. ఈ వైరును వెలిగించి నీటిలో తడవకుండా చిన్న కుండలో పెట్టి కాస్త బరువుతో పడవకు కాస్త దూరంగా సముద్రంలో పడేస్తారు. స్లర్రీ పేలుడు ధాటికి వెలువడే షాక్ వేవ్స్ ప్రభావంతో ఆ ప్రాంతంలోని చేపలన్నీ చనిపోయి పైకి తేలుతాయి. దీన్నే అక్కడి మత్స్యకారులు ‘మీన్ తూటా’ అంటారు. మీన్ అంటే చేప, తూటా అంటే పేలేది అని అర్థం. ఈ విధానం నిషేధం అయినప్పటికీ ఎవరూ పట్టించుకోవట్లేదు. దేశం దాటే వరకు... ఉత్తర కన్నడ, మంగుళూరుల్లోని కొన్ని ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతుడడంతో నిర్మాణరంగంలో వినియోగించడానికి అమ్మోనియం నైట్రేట్ స్లర్రీ విక్రయానికి పలువురు లైసెన్సులు పొందారు. ప్రభుత్వ నిఘా, ఆడిట్ పక్కాగా లేకపోవడంతో ఆ వ్యాపారులే అక్రమంగా మత్స్యకారులకు ‘మీన్ తూటా’లు అమ్మేస్తుంటారు. ఈ విధానాలు అధ్యయనం చేసిన రియాజ్ పేలుడు పదార్థం సమీకరణకు ఇదే మార్గాన్ని ఎంచుకున్నాడు. 2008లో దేశం దాటే వరకు తానే సమీకరించాడు. ఆ ఏడాది ఐఎం ఉగ్రవాదుల అరెస్టులు ప్రారంభం కావడంతో దేశం దాటేశాడు. ఆ తర్వాత పేలుడు పదార్థం సమీకరించే మార్గం తెలిసినప్పటికీ.. దాన్ని ఎలా సేకరించాలి? ఎవరితో అవసరమైన వారికి అందించాలి? అంశంలోనూ అనేక జాగ్రత్తలు తీసుకున్నాడు. భత్కల్ ప్రాంతానికి చెందిన అనేక మందికి ఎరవేసిన రియాజ్... అనుచరుడు అఫాఖీని ‘మీన్ తూటా’లు ఖరీదు చేయడానికి వినియోగించుకున్నాడు. పాక్ నుంచి రియాజ్ ఇచ్చే ఆదేశాల ప్రకారం అఫాఖీ పని చేసేవాడు. చేపల వేటకని మీన్తూటాలు తెప్పించేవాడు. వీటిలోని స్లర్రీ ప్యాకెట్లను పేలుళ్లు జరిపే ప్రాంతాల్లో ఉన్న ఉగ్రవాదులకు అనుచరుల ద్వారా పంపడం లేదా వారినే మంగుళూరు, బెంగళూరు రప్పించి అప్పగించడం చేసేవాడు. ఈ అమ్మోనియం నైట్రేట్ స్లర్రీని వినియోగించే ఉగ్రవాదులు బాంబులు తయారు చేసి పేల్చారు. అమ్మోనియం నైట్రేట్ స్లర్రీ దుర్వినియోగం కాకుండా.. ఉత్పత్తి సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. తయారు చేసిన నాటి నుంచి గరిష్టంగా ఆరు నెలలు మాత్రమే అది సమర్థంగా పని చేస్తుంది. ఆ తర్వాత అందులోని శక్తి తగ్గిపోయి పెద్దగా ప్రభావం చూపదు. అయితే ఐఎం ఉగ్రవాదులు చిన్నస్వామి స్టేడియం, జంగ్లీ మహరాజ్ రోడ్లలో పేలుళ్లకు వినియోగించిన స్లర్రీ ఎక్స్పైర్ అయిపోయింది. ఈ నేపథ్యంలో ఆ రెండు చోట్లా దాంతో తయారు చేసిన బాంబులు పేలడంతో తీవ్రత తక్కువగా ఉండి ప్రాణనష్టం జరగలేదు. ముష్కరుల తరలింపునకు సన్నాహాలు... జంట పేలుళ్లతో పాటు పేలని బాంబు కేసులో దోషులుగా తేలిన ఉగ్రవాదులు అనీఖ్, అక్బర్, తారీఖ్లతో పాటు ఈ కేసుల్లో అభియోగాలు వీగిపోయిన సాదిఖ్, ఫారూఖ్‌లను (వీరిపై ఇతర రాష్ట్రాల్లో కేసులున్నాయి. దీంతో జైలు నుంచి బయటకు రారు) ముంబై క్రైమ్ బ్రాంచ్ సహా ఇతర విభాగాల అధికారులు పట్టుకున్నారు. వీరిపై దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో కేసులు నమోదై ఉన్నాయి. ఈ ఉగ్రవాదుల్ని ఆయా కారాగారాల నుంచి ప్రిజనర్స్ ట్రాన్సిట్ వారెంట్‌పై హైదరాబాద్ తీసుకొచ్చారు. అలాగే మిగిలిన రాష్ట్రాల వారూ తీసుకెళ్లాల్సి ఉంది. ఇప్పుడు ఇక్కడి కేసుల విచారణ, శిక్షల విధింపు సైతం పూర్తి కావడంతో తమ తమ కేసులకు సంబంధించి తీసుకెళ్లడానికి ఇతర రాష్ట్రాల పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. సోమవారం న్యాయస్థానం ఉరిశిక్షలు విధించిన తర్వాత కూడా ముష్కరుల ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదని చర్లపల్లి జైలు అధికారులు చెబుతున్నారు. వీరిలో ఏ కోణంలోనూ పశ్చాత్తాపం కనిపించట్లేదనిపేర్కొంటున్నారు. -
కులవృత్తులకు ప్రభుత్వ ప్రోత్సాహం: తలసాని
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కులవృత్తులను ప్రోత్సహిస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. బుధవారం పీపుల్స్ ప్లాజాలో సమీకృత మత్స్య అభివృద్ది పథకం, ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మత్స్యకారులకు మోపెడ్, 4 చక్రల వాహనాలను అందజేసి వారి ఆర్థికాభివృద్దికి కృషి చేస్తున్నామన్నారు మత్స్యకారుల కుటుంబంలో ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే రూ.6 లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తున్నామన్నారు. మిషన్ కాకతీయ కింద పునరుద్ధరించిన చెరువుల ద్వారా మత్స్యకారులు సర్వతోముఖాభివృద్ధికి బాట లు వేసుకోవాలని మహమూద్ అలీ ఆకాంక్షించారు. -
వైఎస్ జగన్‌ను కలిసిన ముత్యాలమ్మపాలెం మత్స్యకారులు
-
మత్స్యకారులకు ప్రత్యేక శాఖ
అలప్పుజ: కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మత్స్యకారులకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటుచేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ఇటీవల వరదలతో అతలాకుతలమైన కేరళలో సహాయక చర్యల్లో మత్స్యకారులు కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం రాహుల్ మంగళవారం లండన్ నుంచి నేరుగా కేరళ వచ్చారు. పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న బాధితులను పరామర్శించారు. వరదల సమయంలో ప్రాణాలకు తెగించి బాధితులను కాపాడిన మత్స్యకారులను సన్మానించేందుకు అలప్పుజలో పార్టీ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశంలో మత్స్యకారులు కూడా రైతుల లాంటి సంక్షోభాన్నే ఎదుర్కొంటున్నారన్నారు. ‘ఎన్ని కష్టా లెదురైనా కేరళకు అవసరమైనప్పుడల్లా మీరు (మత్స్యకారులు) అండగా నిలిచారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మత్స్యకారులకు ప్రత్యేక శాఖను ఏర్పాటుచేస్తాం. శుష్క వాగ్దానాలు చేయడం నాకిష్టం లేదు’ అని అన్నారు. విపత్తులప్పుడు తక్షణమే స్పందించేలా.. న్యూఢిల్లీ: ప్రకృతి వైపరీత్యాల సమయంలో తక్షణమే స్పందించడం, అనారోగ్య సవాళ్లను ఎదుర్కొనే దిశగా టెక్ దిగ్గజం గూగుల్ నడుం బిగించింది. ఇందుకు కృత్రిమ మేధస్సు (ఏఐ), మిషన్ లెర్నింగ్ (ఎంఎల్) సాంకేతి కతను వినియోగించుకునేందుకు పలు సంస్థల తో కలసి పని చేయనున్నట్లు ప్రకటించింది. విపత్తు సమయంలో ప్రమాదకర ప్రదేశాలను గుర్తించడం, తక్షణమే కచ్చిత వరద హెచ్చరి కలు జారీ చేసేందుకు నీటి వనరుల శాఖతో కలసి గూగుల్ పైలట్ ప్రాజెక్టు చేపట్టింది. కేరళలో దీని ప్రాథమిక ఫలితాలు సంతృప్తినిచ్చినట్లు సంస్థ తెలిపింది. -
కేరళ వరదలు ; వెన్నును మెట్టుగా మార్చి.. వైరల్ వీడియో!
తిరువనంతపురం : భారీ వర్షాలకు కేరళ చివురుటాకులా వణికిపోతున్న సంగతి తెలిసిందే. వరద బాధితులను రక్షించడానికి సహాయక బృందాలు శక్తికి మించి కృషి చేస్తున్నాయి. సహాయక చర్యలో పాల్గొంటున్న ఎన్డీఆర్ఎఫ్, నేవీ, ఆర్మీ బలగాలకు పలువురు మత్య్సకారులు తమ వంతు సహకారాన్ని అందజేస్తున్నారు. వెంగర ప్రాంతంలో దాదాపు 600 మంది స్థానిక మత్స్యకారులు వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించి సహాయక శిబిరాలు చేర్చేందుకు తమ వంతు కృషిచేస్తున్నారు. అలా సహాయక చర్యల్లో పాలు పంచుకున్న కేపీ జైస్వాల్ అనే మత్య్సకారుడు రియల్ హీరోగా నిలిచాడు. వరదల్లో చిక్కుకున్న మహిళలను, చిన్నారులను బోట్లోకి ఎక్కించడానికి అతను నీటిలో వంగి తన వెన్నును మెట్టుగా మార్చాడు. అలా మహిళలు, చిన్నారులు బోటు ఎక్కడానికి సహాయపడ్డాడు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఆ ప్రాంతంలోకి చేరుకోవడం కష్టంగా మారడంతో.. వారి వద్ద నుంచి బోట్లను తీసుకుని వరదల్లో చిక్కుకున్న వారిని తామే సహాయక శిబిరాలకు చేరవేస్తున్నట్టు జైస్వాల్ తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మరింది. జైస్వాల్ చర్యను నెటిజన్లు అభినందిస్తున్నారు. అతన్ని రియల్ హీరో అంటు నెటిజన్లు కొనియాడుతున్నారు. కాగా, కేరళ ప్రజలను ఆదుకోవడానికి ఇతర రాష్ట్రాలతో పాటు, దేశ నలుమూలల నుంచి పలువురు తమకు తోచిన సహాయాన్ని అందజేస్తున్నారు. ఇతర దేశాలు కూడా కేరళ వరదల్లో చిక్కుకున్న వారికి ఆపన్న హస్తం అందించడానికి ముందుకొస్తున్నాయి. -
కేరళ వరదలు ; వెన్నును మెట్టుగా మార్చాడు
-
చేపల వేటకు వెళ్లి...
నాగర్‌కర్నూల్ క్రైం: చేపలు పట్టేందుకు వెళ్లిన ఓ మత్స్యకారుడు ఛాతిలో నొప్పితో మృతిచెందాడు. ఈ సంఘటన మండలంలోని ఉయ్యాలవాడలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది.కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన డోకూరి చిన్నయ్య(45) మంగళవారం సాయంత్రం గుడిపల్లి రిజర్వాయర్‌లో కొందరితో కలిసి చేపలు పడుతుండగా అకస్మాత్తుగా ఛాతిలో నొప్పి వచ్చింది. అక్కడే ఉన్న తన కుమారుడు సాయికుమార్‌కు విషయం చెప్పడంతో వెంటనే నీటిలో నుంచి ఒడ్డుకు తీసుకువస్తుండగా అక్కడికకక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలిసులు ఘటనా స్దలానికి చేరుకుని పరిశీలించారు. చిన్నయ్య కుమారుడు సాయికుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పురుషోత్తం తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. చిన్నయ్యకు భార్య, ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. -
బతుకుజీవుడా
పొట్టకూటి కోసం 9 మంది మత్స్యకారులు ఎప్పటిలానే సముద్రంలో వేటకు వెళ్లి తిరుగు ప్రయాణమయ్యారు. ఒకరు వేరే బోటులో వెళ్లిపోగా మిగిలిన ఎనిమిది మంది సోనాబోటులో గమ్యానికి బయలుదేరారు. ఇంతలో వాతావరణంలో మార్పులతో కడలి కల్లోలంగా మారింది. దీంతో వారు వస్తున్న బోటు ప్రమాదానికి గురైంది. అర్ధరాత్రి.. నడిసంద్రంలో ఎటు వెళుతున్నారో తెలియని దిక్కుతోచని స్థితిలో ఉండగా.. ముగ్గురు మత్స్యకారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దూకేసి గుప్పెడుపేట తీరానికి చేరుకున్నారు. మరో నలుగురు బోటులోనే ఉండిపోయారు. ఈ బోటు అలల ఉద్ధృతికి గుప్పెడుపేట–ఉమిలాడ గ్రామాల్లోని తీరానికి కొట్టుకొచ్చింది. స్థానికులు ఆరు గంటల పాటు తీవ్రంగా శ్రమించి వీరిని ప్రాణాలతో రక్షించారు. పోలాకి: విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చింతపల్లి గ్రామానికి చెందిన మత్స్యకారులు బర్రి తాతయ్య, వాసుపల్లి నరసింహ, మైలపల్లి శ్రీను, బర్రి అమ్మోరు, బర్రి ఎర్రయ్య, గనగళ్ల తాతయ్య, బర్రి మసేను, గోవింద అప్పన్న ఈనెల 9వ తేదీ సోమవారం విశాఖపట్నం నుం చి సోనాబోటులో సముద్రంలో వేటకు బయలుదేరారు. అక్కడి నుంచి బారువా తీరం వరకు వచ్చి 20వ తేదీ శుక్రవారం ఉదయాన్నే విశాఖకు తిరుగు పయనమయ్యారు. వీరిలో ఒకరు అదే ప్రాంతానికి చెందిన వేరే బోటులో వెళ్లిపోయారు. మిగిలిన 8 మంది సోనాబోటులో ప్రయాణిస్తున్నారు. వారిలోని బర్రి తాతయ్య, వాసుపల్లి నరసింహ, బర్రి మసేను, గోవింద అప్పన్న, మైలపల్లి శ్రీను విశ్రాంతి తీసుకోవడానికి బోటులోని గదిలోకి వెళ్లిపోయారు. బర్రి అమ్మోరు, బర్రి ఎర్రయ్య, గనగళ్ల తాతయ్య బోటుపైనే ఉండిపోయారు. శుక్రవారం సాయంత్రం జీపీఎస్ పని చేయకపోవటంతో బోటు గతి తప్పింది. రాత్రి 10 గంటల నుంచి 12 గంటల సమయంలో పోలాకి మండలంలోని గుప్పెడుపేట గ్రామం వైపు వస్తుండగా అలల ఉద్ధృతికి బోటు బోల్తాపడింది. బోటుపై ఉన్న బర్రి అమ్మోరు, బర్రి యర్రయ్య, గనగళ్ల తాతయ్య సముద్రంలోకి దూకి ఈదుకుంటూ గుప్పెడుపేట ఒడ్డుకు శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో చేరుకున్నారు. అక్కడకు 2 కిలోమీటర్ల దూరంలోని సంతబొమ్మాళి మండలంలోని ఉమిలాడ తీరానికి.. ప్రమాదానికి గురైన సోనాబోటు ఉదయం 6 గంటలకు కొట్టుకొచ్చి ంది. బర్రి తాతయ్య, మైలపల్లి శ్రీను, వాసుపల్లి నర్సింహ, బర్రి మసీను, గోవింద అప్పన్న లోపలే చిక్కుకున్నారు. దీనిని గుర్తించిన స్థానికులు హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. 35 టన్నుల బరువైన బోటును సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు పెద్ద క్రేన్ అవసరం ఉన్నా.. అలాంటి ఏర్పాటు జరగలేదు. స్థానికులే చొరవతీసుకుని దాదాపు 6 గంటల పాటు శ్రమించి యంత్రాల సాయంతో బోటును కట్ చేసి నలు గురు మత్స్యకారులను సురక్షితంగా ఒడ్డుకు చే ర్చారు. బోటులోని మైలపల్లి శ్రీను(22) అనే ఒక మత్య్సకారుడి ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. అధికారుల మధ్య సమన్వయలోపం అత్యవసర పరిస్థితిలో అధికారుల మధ్య సమన్వయ లోపంతో సహాయక చర్యలు డీలా పడ్డాయి. ఫైర్ సిబ్బంది గానీ అత్యవసర సేవా విభాగాలకు చెందిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గానీ హాజరుకాలేదు. ఇక పోలీసులు, మెరైన్, మత్స్యశాఖ, రెవెన్యూ అధికారులు అక్కడకు చేరుకున్నా అక్కడి పరిస్థితులను బట్టి చేసేదిలేక చేతులెత్తేశారు. గుప్పెడుపేట వైద్యాధికారి బలగ మురళి క్షతగాత్రులకు ప్రథమచికిత్స అందించి 108లో రిమ్స్‌కు తరలించారు. మత్స్యశాఖ డీడీ కృష్ణమూర్తి, టెక్కలి ఆర్డీవో వెంకటేశ్వరరావు, భావనపాడు మెరైన్సీఐ సాయిసత్యారావు, టెక్కలి సీఐ శ్రీనివాసరావు, పోలాకి తహసీల్దార్ జె.రామారావు, తదితరులు సహాయక చర్యలను పర్యవేక్షించారు. హడావుడే తప్ప అధికారులు చేసిందేం లేదు సంఘటనా స్థలంలో అధికారులు హడావుడే తప్ప చేసిందేం లేదు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు క్రేన్ తెప్పించలేకపోయారు. ఇక్కడి యువకులు సాహసం చేయకపోతే నిండు ప్రాణాలు నీటిలో కలిసిపోయేవి. బాధిత మత్స్యకారులను, బోటు యజమానిని ప్రభుత్వం ఆదుకోవాలి. – లండ యర్రయ్య, మత్స్యకారసంఘ నాయకుడు, గుప్పెడుపేట గంగమ్మ తల్లే కాపాడింది రాత్రి బోటు పల్టీ కొట్టిన తర్వాత ఎవరికి వారు నడిసముద్రంలో విడిపోయాం. ఆ గంగమ్మ తల్లే మమ్మల్ని కాపాడింది. ఈ ప్రాంత వాసులకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. నేను ముందు ఒడ్డుకు వచ్చాను. అదే బోటులో మా నాన్న బర్రి తాతయ్య కూడా ఉన్నారు. ఇద్దరం క్షేమంగా బయటపడ్డాం. – బర్రి యర్రయ్య, మత్స్యకారుడు, చింతపల్లి -
చేపలు పెరగనంటున్నాయ్ !
సాక్షి, జగిత్యాల అగ్రికల్చర్ : మత్స్యకారులకు ఏడాది పొడవునా ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చేపల పెంపకం కార్యక్రమం జిల్లాలో విజయవంతం కాలేకపోయింది. చెరువులు, కుంటల్లో సరిపడా నీరు లేకపోవడంతో చేపల ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. ప్రభుత్వం చేపపిల్లలను మత్స్యసహకార సంఘాలకు ఇస్తున్నప్పటికీ.. చెరువుల్లో నీళ్లు లేక ఎండాకాలంలో ఆక్సిజన్ అందక చాలామటుకు చనిపోతున్నాయి. ఉన్న వాటిని సైతం కొన్ని ప్రాంతాల్లో మత్స్యకారులు నేరుగా అమ్ముకోలేకపోతున్నారు. చెరువులను కాంట్రాక్టర్లకు లీజుకు ఇస్తూ అంతంతే ఉపాధి పొందుతున్నారు. జిల్లాలో 611 చెరువులు జిల్లాలో 1,227 చెరువులు, కుంటలు ఉన్నప్పటికీ 611 చెరువులు మాత్రమే గ్రామపంచాయతీ కింద ఉన్నాయి. 175 చెరువులు మత్స్యసహకారశాఖ పరిధిలో ఉన్నాయి. దాదాపు 274 చెరువుల్లో పరిస్థితులు చేపల పెంపకానికి అనువుగా లేవు. ఎంపిక చేసిన చెరువుల్లో మత్స్యశాఖ తరఫున ప్రభుత్వం చేపల పిల్లలను పంపిణీ చేస్తుంది. జిల్లాలో 184 మత్స్యసహకార సంఘాలు ఉండ గా, అందులో 10,187 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో 26 మహిళా సంఘాలు ఉండగా 800 మంది సభ్యులు, 158 పురుషుల సంఘాలు ఉం డగా 9,387 మంది సభ్యులు ఉన్నారు. ఈ ఏడాది 1.12 కోట్ల చేపపిల్లల పెంపే లక్ష్యం ఈ ఏడాది పుష్కలంగా వర్షాలు కురుస్తాయనే అంచనాతో 1.12కోట్ల చేపపిల్లలను చెరువుల్లో వదలాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈమేరకు టెండర్ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. గతేడాది 258 చెరువుల్లో 65.91 లక్షల చేపపిల్లలను వదిలారు. జిల్లాలోని కథలాపూర్, మల్యాల, కొడిమ్యాల వంటి మండలాల్లోని చెరువుల్లో నీళ్లు లేక చేపలు పెంచలేకపోయారు. అయితే వర్షాలు ఆలస్యమవుతుండడంతో చేపపిల్లలను చెరువుల్లో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వేయనున్నారు. ఇలా వేసిన చేపపిల్లల్లో కొన్ని నీళ్లు లేక, మరికొన్ని చెరువుల్లోని చెత్తతో ఆక్సిజన్ అందక చనిపోతున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో చెరువుల్లో నీరు తగ్గుతుండడం.. ఆ సమయంలోనే ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో ఎక్కువ మొత్తంలో చేపలు మృత్యువాత పడుతున్నాయి. లక్ష్యం భారీగానే జిల్లాలోని చెరువుల్లో వేసిన చేపపిల్లలకుగాను 3,200 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అవుతుందని అధికారుల అంచనా వేసినప్పటికీ 2,048 మెట్రిక్‌టన్నుల చేపల ఉత్పత్తి మాత్రమే జరిగింది. ఉత్పత్తి తగ్గడానికి సవాలక్ష కారణాలు ఉన్నాయంటున్నారు అధికారులు. చెరువుల్లో రవు, కట్ల, మృగ, బంగారుతీగలను వదిలారు. 8–9 నెలల్లోనే దాదాపు ముప్పావు కిలో నుంచి కిలో వరకు పెరిగాయి. ప్రస్తుతానికి జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి ప్రాంతాల్లో చేపల మార్కెట్లు ఉండగా, ధర్మపురి, కోరుట్ల మండలం అయిలాపూర్‌లో చేపల మార్కెట్ల పనులు సాగుతున్నాయి. రాయికల్, జగిత్యాల మండలం మోతె, కొండగట్టు కింద ముత్యంపేట వంటి చోట్ల చేపల మార్కెట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయి. వీటికితోడు గోదావరి తీర ప్రాంతం వెంబడి చేపలను విక్రయిస్తున్నారు. కొన్ని ప్రధాన చెరువుల వద్ద కూడా మత్స్యకారులే స్వయంగా చేపల మార్కెట్లు ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందుతున్నారు. ఉపాధి అంతంతే.. ప్రభుత్వం చెరువుల్లో చేపపిల్లలను వదులుతున్నప్పటికీ చాలా చోట్ల మత్స్యసహకార సంఘాలు మళ్లీ బడా వ్యక్తులకే లీజుకు ఇస్తున్నాయి. సహకార సంఘం సభ్యులే చేపలను పట్టి లీజుదారులకు కిలోకు కొంత చొప్పున తీసుకొని విక్రయిస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో చేపలు పెరిగిన తర్వాత లీజుదారులతో సంఘాలు ఒప్పందం చేసుకుంటున్నాయి. నేరుగా మత్స్యకారులు చెరువుల్లో చేపలు పట్టుకుని ఉపాధి పొందుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు శిక్షణ సదస్సులు పెట్టి మత్స్యకార సంఘాల సభ్యులకు శిక్షణ ఇస్తున్నప్పటికీ ఆ స్థాయిలో ఉపాధి పొందలేకపోతున్నారు. ముందుగా సరఫరా చేయాలి చేప పిల్లలను వర్షాలు రాగానే సరఫరా చేస్తే బాగుంటుంది. కొన్ని చోట్ల సంఘాలు కొని తె చ్చి వేసిన తర్వాత ప్రభుత్వం సరఫరా చేస్తుంది. దీనివల్ల కొన్ని చేపలు పెద్దగా, మరికొన్ని చిన్నవిగా ఉంటున్నాయి. ఇలా ఉండడంతో చేపలు విక్రయించే సమయంలో ఇబ్బందులు పడుతున్నాం. – గంగారాం, మత్స్యకారుడు -
పడవ ప్రమాదం: తల్లీకూతుళ్లు మృతి
సాక్షి, గుంటూరు : జిల్లాలోని తుళ్లూరు మండలం బోరుపాలెంలో శుక్రవారం అర్థరాత్రి విషాద ఘటన చోటుచేసుకుంది. బోటు ప్రమాదంలో చేపల వేటకు వెళ్లి తల్లీకూతుళ్లు మృతిచెందారు. వివరాల్లోకి వెళితే.. కృష్ణా నదిలో చేపల వేట కోసం సైదారాజ్ అతని భార్య మాధవి(26), కూతురు కావ్య(3)తో కలిసి పడవలో వెళ్లారు. నదిలో వలవేసి పడవపై నిద్రిస్తుండగా ఇసుక బోటు పడవను ఢీకోట్టడంతో నదిలో పడి తల్లీకూతుళ్లు మృతిచెందగా.. మత్స్యకారుడు ఈదుకుంటూ ఒడ్డుకుచేరుకున్నాడు. మృతులను పోలీసులు ఇబ్రహీంపట్నం వాసులుగా గుర్తించారు. -
గల్లంతైన మత్స్యకారుడి మృతదేహం లభ్యం
విజయనగరం జిల్లా : భోగాపురం మండలం కుండ్రాజుపాలెం వద్ద సముద్రంలో గల్లంతైన మత్స్యకారుడు చిన్న అమ్మోరు మృతదేహం లభ్యం గురువారం లభ్యమైంది. గ్రామ సమీపంలోనే సముద్ర తీరానికి గురువారం ఉదయం మృతదేహం కొట్టుకువచ్చింది. మూడు రోజుల క్రితం కుండ్రాజుపాలెం వద్ద పడవలను ఒడ్డుకు చేర్చుతుండగా చిన్న అమ్మోరు ఈదురుగాలులకు సుడిగుండంలో చిక్కుకుని గల్లంతయ్యాడు. చిన్న అమ్మోరు కోసం గ్రామస్తులు అప్పుడు వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. తాజాగా ఆయన మృతదేహం ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. -
మత్స్యకారులకు వరాలు !
నల్లగొండ టూటౌన్: జిల్లా మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది అత్యధిక నిధులు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన సమీకృత మత్స్య అభివృద్ధి పథకంలో భాగంగా 2018–19 సంవత్సరానికి జిల్లాకు రూ. 37.96 కోట్లు కేటాయించింది. వ్యక్తిగత, సాముహిక యూనిట్లు ఏర్పాటు చేసుకుని మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి వీలు కల్పించింది. జిల్లాలో సుమారు 90వేల మందికి ఉపాధి జిల్లాలో 147 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉండగా 25 వేల మందికి పైగా సభ్యులు ఉన్నారు. దాదాపు జిల్లాలో మత్స్యకారులు 90 వేల మంది ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా సుమారు 90 వేల మంది మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు పుష్కలంగా లభించనున్నాయి. గతంతో పోలిస్తే ఇటీవల కాలంలో మత్స్యకారుల అభివృద్ధికి నిధుల కేటాయింపు ఈ ఏడాది అమాంతం పెరిగిందని చెప్పవచ్చు. సబ్సిడీల పరంపర కొత్త పథకాల ద్వారా 75 నుంచి 100 శాతం వరకు సబ్సిడీ పొందే అవకాశం ఉంది. ఎక్కువ శాతం 75 శాతం, 90 శాతం వరకు సబ్సిడీ ప్రభుత్వం ఇవ్వనుండగా లబ్ధిదారులు మిగతా డబ్బులు భరించాల్సి ఉంటుంది. ఓ నాలుగు పథకాలకు మాత్రం 100 శాతం ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వనుంది. ఆన్లైన్, కార్యాలయంలో దరఖాస్తుల స్వీకరణ సమీకృత మత్స్య అభివృద్ధి పథకం పకడ్బందీగా అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పథకాల అమలులో ఎక్కడా వివాదాలు చోటు చేసుకోకుండా ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలి. పథకాలను పూర్తిగా అర్హులైన వారికి అందించేందుకు జిల్లా మత్స్య శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అర్హులు ఈనెల 12వ తేదీ 25వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌తో పాటు మత్స్యకార కార్యాలయంలో కూడా డైరెక్ట్‌గా దరఖాస్తు చేసుకునే విధంగా ప్రభుత్వం వీలు కల్పించింది. ఠీఠీఠీ.్ఛ్చ్చbజి.్ట్ఛ ్చnజ్చn్చ.జౌఠి.జీn వెబ్సైట్ ద్వారా మీ సేవ కేంద్రంలో లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు ♦ దరఖాస్తుల ఆధార్ కార్డు ♦ బ్యాంకు అకౌంట్ పాస్ పుస్తకం, సంఘం వివరాలు, (సంఘం పేరు, రిజిస్ట్రేషన్ నంబర్) ♦ సంఘంలో దరఖాస్తుదారుని ప్రవేశ సంఖ్య ♦ వాహనాలకు సంబంధించిన అంశాలకు చెట్టుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ♦ భూమి ఆధారిత అంశాలకు పట్టాదారు పాస్ పుస్తకం లేదా పట్టా భూమి దస్తావేజులు లేదా కౌలు ఒప్పందపత్రాలు. పథకాలు కేటగిరి –1 చిన్న యూనిట్లు ద్విచక్ర వాహనంతో చేపల అమ్మకం యూనిట్, ప్లాస్టిక్ చేపల క్రేట్లు, పోర్టబుల్ చేపల అమ్మకం కియోస్కూ, వలల క్రాప్టులు. కేటగిరి –2 పెద్ద యూనిట్లు లగేజీ ఆటోతో చేపల అమ్మకం యూనిట్, సంచార చేపల అమ్మకం వాహనం, కొత్త చేపల చెరువు నిర్మాణం, , ఉత్పాదకాల వ్యయం, రీ సర్క్యులేటరీ ఆక్వా కల్చర్ యూనిట్, అలంకరణ చేపల యూనిట్ నిర్మాణం, వినూత్న ప్రాజెక్టులు, విత్తన చేపల పెంపకం చెరువులు, ఆక్వా టూరిజం యూనిట్లు ఉన్నాయి. ప్రభుత్వ మార్గదర్శకాలప్రకారమే అమలు సమీకృత మత్స్య అభివృద్ధి పథకాన్ని ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే అమలు చేస్తాం. 12వ తేదీ నుంచి మత్స్యకారులు దరఖాస్తులు చేసుకోవచ్చు. మీ సేవ కేంద్రాల ద్వారా కూడా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకునే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది. అర్హులైన వారందరికీ ఈ పథకాలు అందిస్తాం.– చరిత, మత్స్యకార జిల్లా అధికారి, నల్లగొండ -
వైజాగ్ చేప.. ‘కోనాం’గలరా?
డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ): విశాఖ మత్స్యకారులకు బుధవారం అతి భారీకొమ్ము కోనాం చేపలు లభ్యమయ్యాయి. ఫిషింగ్ హార్బర్లో బుధవారం సాయంత్రం సుమారు 20 వరకు కొమ్ము కోనాం చేపలను విక్రయించారు. ఒక్కో కొమ్ము చేప 100 కేజీల నుంచి 800 కేజీల బరువు తూగాయి. వీటి ధర రూ.15 వేల నుంచి రూ.50 వేలు పలికింది. ఇంత బరువున్న చేపలను నీటిలో నుంచి బయటకు తీసేందుకు జాలర్లు కష్టపడాల్సి వచ్చింది. వీటిని వేలం పాటలో పాడుకునేందుకు జనం పెద్దఎత్తున తరలివచ్చారు. -
కబళించిన కడలి
రణస్థలం: ఆ కుటుంబానికి చేపల వేటే జీవనాధారం. సుమారు 35 ఏళ్లకు పైగా సముద్రాన్ని నమ్ముకుని వారంతా జీవిస్తున్నారు. రోజూలానే ఆదివారం తెల్లవారు జా మున ఐదుగురు మత్స్యకారులు వేటకు వెళ్లారు. చేపలను పట్టుకుని ఆనందంగా తిరిగి వస్తున్నారు. మరికొద్ది సేపట్లో తీరానికి చేరుకుంటారనగా ఒక్కసారిగా సముద్రంలో అలలు ఉద్ధృతంగా రావడంతో వారు ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మత్స్యకారుడు ఒకరు మృతిచెందగా మరో నలు గురు సురక్షితంగా బయటపడ్డారు. ఈ సంఘటన మండలంలోని అల్లివలస సముద్ర తీరంలో ఆదివారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సూరాడ రాముడు(52) గార మండలంలోని కళింగపట్నంలో 20 ఏళ్లుగా నివసిస్తున్నాడు. సొంత గ్రామమైన అల్లివలసలో కూతురు ఉండటంతో అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి వేటకు వెళుతుంటారు. ఆదివారం ఉదయం 5 గంటలకు మరో నలుగురితో కలిసి రాముడు చేపల వేటకు పడవలో వెళ్లారు. వేట ముగించుకుని 11 గంటలకు తిరిగి వస్తుండగా అల్లివలస సముద్ర తీరానికి వంద మీటర్ల దూరంలో కెరటాల ఉద్ధృతి పెరిగింది. దీంతో పడవ ఒక్కసారిగా బోల్తా పడింది. ఒకవైపు కుర్చున్న రాముడు పడవ కింద ఇరుక్కుపోయారు. మిగిలిన నలుగురు పడవను, రాముడిని బయటకు తీసుకువచ్చారు. అప్పటికే కొన ఊపిరితో ఉన్న ఆయన్ను ఒడ్డుకు తీసుకువచ్చినా ఫలితం లేకుండాపోయింది. కొద్ది నిమిషాల్లోనే రాముడు చనిపోయాడని మత్స్యకారులు తెలిపారు. కెరటాల తాకిడికి పడవ ఆయనపై పడిపోవడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయని వివరించారు. సంఘటనా స్థలాన్ని వీఆర్వో సుబ్రహ్మణ్యం, జె.ఆర్.పురం ఎస్సై వి.సత్యనారాయణ పరిశీలించారు. మృతుడికి కుమారుడు, కూతురు ఉన్నారు. రాముడి కుమారుడు ఇచ్చిన ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని శవపంచనామాకు పంపించారు. నెల రోజుల వ్యవధిలోనే పక్కపక్క గ్రామాల్లో ప్రమాదాలు సంభవించడంతో మత్స్యకార గ్రామాల్లోని ప్రజలు అందో ళన చెందుతున్నారు. తమ జీవితాలు ఎప్పడు ఎలాం టి ఉపద్రవం సంభవిస్తుందోనని వాపోతున్నారు. ప్రభుత్వమే మత్స్యకార కుటుంబాలను ఆదుకోవాలని మత్స్యకార నాయకులు, ఎంపీటీసీ మైలపల్లి వెంకటేష్ కోరారు. -
దొరకని ఆచూకీ
శ్రీకాకుళం, రణస్థలం: మండలంలోని జీరుపాలెంలో శనివారం పడవ బోల్తా పడి గల్లంతైన మత్స్యకారుడు మైలపల్లి రాము ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. రెండో రోజు ఆదివారం కూడా స్థానిక మత్స్యకారులు తీవ్రంగా గాలించినా ఫలితం లేకపోయింది. దీంతో రాము కుటుంబంలో ఆందోళన పెరుగుతోంది. స్థానిక మర పడవలతో మత్స్యకారులు రణస్థలం, ఎచ్చెర్ల, గార, పూసపాటిరేగ మండలాల సముద్ర తీరం వెంబడి గాలింపు చేపట్టారు. మత్స్యశాఖ అధికారులెక్కడ? మత్స్యకారుడు గల్లంతైనా మత్స్యశాఖ అధికారులు నుంచి కనీసం స్పందించడం లేదని జీరుపాలెం మత్స్యకారులు మైలపల్లి కామరాజు, సర్పంచ్ బడి చిన్న రాములు, దుమ్ము రాముడు, మైలపల్లి లక్షు్మడుతో పాటు పలువురు ఆగ్రహం వ్యక్తంచేశారు. మత్స్యకారుల అభివృద్ధికి పాటు పడతామని ప్రకటనలు ఇవ్వడమే తప్ప మత్స్యకారుల సాదకబాధకాలు కనిపించడం లేదని వాపోతున్నారు. గల్లంతైన తోటి మత్స్యకారుడి కోసం గ్రామమంతా కంటి మీద కునుకు లేకుండా గాలింపు చర్యలు చేపడుతోంది. మత్స్యకారులకు, బాధిత కుటుంబానికి భరోసాగా నిలవాల్సిన మత్స్యశాఖ.. కనీసం మానవత్వాన్ని చాటుకోవడానికి ప్రయత్నించలేదని గ్రామస్తులు, స్థానిక మత్స్యకారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కళ్లెదుటే కనుమరుగైపోయాడు మైలపల్లి రాము కళ్లెదుటే కనుమరుగైయిపోయాడు. పడవ బోల్తా విషయాన్ని వెనువెంటనే గ్రామస్తులతో పాటు, సంబంధిత అధికారులకు తెలియజేశా. గ్రామస్తులు చర్యలు చేపట్టినా.. అధికారుల నుంచి ఎటువంటి సహకారం లేదు. – మృత్యంజయుడైన మాగుపల్లి లక్షు్మడు -
నదిలోని చేప ‘మనది’ కావాల్రా అబ్బీ!
మామిడికుదురు (పి.గన్నవరం): అందరికీ దప్పిక తీర్చే నీరు వారికి.. అన్నం పెట్టే పెన్నిధి కూడా! అమ్మ ఒడిలో పారాడే బిడ్డల్లా వారు.. వారు నదిలో వేట సాగిస్తారు. రేయైనా, పగలైనా తన ప్రయాణానికి ఏ దిక్సూచీ అవసరం లేని నదిలాగే.. ఆ నది కడుపులో చేపలను అన్వేషించే వారి వేటకూ, వలలకూ కూడా వేళలతో, వాతావరణంతో పని లేదు. చిక్కని చీకటి రాత్రయినా, దట్టమైన మంచు కమ్ముకున్న వేకువనైనా.. గంగపుత్రుల వేటకు ఆటంకం ఉండదు. అందరూ కప్పుకున్న దుప్పట్లను వీడి, తల బయటకు పెట్టడానికి కూడా ఇష్టపడని వేళ.. ఇదిగో ఇక్కడ ఇద్దరు మత్స్యకారులు కమ్ముకున్న మంచుకు అణుమాత్రం ‘చలి’ంచకుండా వేట సాగిస్తున్నారు. ఒక వృద్ధుడు సారథిలా నావకు తెడ్డు వేస్తుంటే, నడివయస్కుడొకరు యోధునిలా వల విసురుతున్నారు. వైనతేయ గోదావరి నదీతీరంలో గురువారం వేకువన పెదపట్నంలంక వద్ద ‘సాక్షి’ కెమెరాకు చిక్కిన జీవన ‘చిత్రం’ ఇది. మన కంటికి పసందైన ఈ దృశ్యం.. నది కడుపున వెతికే వారి వల కన్నులకు చేపలు కంటబడి, పట్టుబడితేనే వారి కృషి ఫలించినట్టవుతుంది. -
‘హద్దు’ దాటిన వివాదం
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు,సూళ్లూరుపేట : పులికాట్ సరస్సుపై ఆధారపడి జీవనం సాగిస్తున్న ఆంధ్రా మత్స్యకారుల నోటికాడ కూడును ఏటా తమిళనాడు జాలర్లు తన్నుకుపోతున్నారు. ఇదేమని అడిగితే దాడులకు తెగబడుతున్నారు. పట్టించుకోండి మహప్రభో అంటూ ఇక్కడి మత్స్యకారులు నెత్తీనోరు బాదుకుంటూ పాలకులకు గోడు వెళ్లబోసుకుంటున్నా పట్టించుకోవడం లేదు. ఈ తరుణంలో ప్రజాసంకల్ప పాదయాత్ర చేపట్టి జిల్లాకు వస్తున్న వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి తమ బాధలు చెప్పుకునేందుకు ఈ ప్రాంత మత్స్యకారులు సన్నద్ధమయ్యారు. ఇదీ అసలు సమస్య ఆంధ్రా–తమిళనాడు రాష్ట్రాల పరిధిలో విస్తరించి ఉన్న పులికాట్ సరస్సులో చేపల వేట విషయమై రెండు రాష్ట్రాల్లోని జాలర్ల మధ్య తరచూ వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఏటా ఫిబ్రవరి, మార్చి నెలల్లో స్థానిక మత్స్యకారులు తమిళ మత్స్యకారుల కారణంగా తీవ్రంగా నష్టపోతున్నారు. నెల్లూరు, తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాల మధ్య సుమారు 620 చదరపు కిలోమీటర్ల మేర పులికాట్ సరస్సు విస్తరించి ఉంది. ఇందులో 500 చదరపు కిలోమీటర్లు నెల్లూరు జిల్లాలోను, 120 చదరపు కిలోమీటర్లు తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా పరిధిలో ఉంది. బంగాళాఖాతం నుంచి పులికాట్ సరస్సుకు తమిళనాడు పరిధిలోని పలవేరికాడ్ వద్ద, వాకాడు మండలం కొండూరుపాళెం, రాయదొరువు వద్ద ముఖద్వారాలు ఉన్నాయి. వర్షాకాలంలో స్వర్ణముఖి, కాళంగి, తమిళనాడులో ఆరణియార్ నదులతోపాటు సాముల కాలువ, దొండ కాలువ, కరిపేటి తదితర కాలువల నుంచి మంచినీరు పులికాట్ సరస్సులోకి చేరుతుంది. సముద్రంలో ఆటుపోట్ల సమయంలో అలల ఉ«ధృతి పెరిగినప్పుడు అందులోని ఉప్పునీరు కూడా పులికాట్‌లోకి ప్రవేశిస్తుంది. మంచినీరు, ఉప్పునీరు కలగలసిన సంగమం కాబట్టి దీన్ని జీవి వైవిధ్యం కలిగిన సరస్సుగా గుర్తించారు. ఈ సరస్సుపై ఆధారపడి మన జిల్లాలో 17 గ్రామాలకు చెందిన 20 వేల మంది, తమిళనాడు వైపు 10 కుప్పాలకు చెందిన మరో 7, 8 వేల మంది మత్స్యకారులు చేపల వేటే ఆధారంగా జీవనం సాగిస్తున్నారు. వర్షాకాలంలో పులి కాట్ సరస్సు నిండా నీళ్లు వచ్చినపుడు తమిళనాడు వైపు చేపలు దొరకవు. ఆ కాలంలో అక్కడి జాలర్లు సరిహద్దులు దాటి ఇక్కడకొచ్చి చేపల్లి వేటాడి వెళుతున్నారు. ఫిబ్రవరి నుంచి సరస్సులో నీళ్లు తగ్గిపోవడం వల్ల ఇక్కడి జాలర్లకు మత్స్య సంపద దొరకదు. ఆ కాలంలో తమిళనాడు వైపు వేటకు వెళ్లే ఇక్కడి మత్స్యకారుల వలలను తమిళ జాలర్లు లాక్కోవడం, పడవలు తీసుకెళ్లడం, ఘర్షణలకు దిగటం, కవ్వింపు చర్యలకు పాల్పడం చేస్తున్నారు. దీంతో ›ఏటా ఎండాకాలం ప్రారంభం కాగానే రెండు రాష్ట్రాల జాలర్ల మధ్య ఏ క్షణంలో ఎలాంటి వివాదం తలెత్తుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. తరచూ తప్పని వివాదాలు పులికాట్ సరస్సుకున్న మూడు సముద్ర ముఖద్వారాల్లో తమిళనాడు పరిధిలో వున్న పల్వేరికాడ్ ముఖద్వారాన్ని అక్కడి ఫ్రభుత్వం ఏటా రూ.30 లక్షలు వెచ్చించి పూడిక తీయిస్తోంది. ఇదిలావుంటే.. ఆంధ్రా వైపు వాకాడు మండలం కొండూరు పాళెం వద్ద వున్న ముఖద్వారం పూర్తిగా పూడిపోయింది. రాయదొరువు ముఖద్వారం మాత్రమే అంతో ఇంతో ఆదుకుంటూ వస్తోంది. ఈ ముఖద్వారం ఎండాకాలంలో పూడిపోతుండటంతో సరస్సులో నీళ్లు లేక ఆంధ్రాకు చెందిన 17 కుప్పాల జాలర్లు దక్షిణంవైపు సరస్సులో ఆంధ్రా పరిధిలోనే ఉండే కురివి తెట్టు, తెత్తుపేట ప్రాంతాల్లో వేటకు వెళుతుంటారు. కురివితెట్టు, తెత్తుపేట ప్రాంతాలు తమిళనాడు పరిధి లో ఉన్నాయంటూ చిన్నమాంగోడు కుప్పం, పెద్ద మాం గోడు కుప్పం, కీరపాకపుదు కుప్పానికి చెందిన వారు వాదిస్తున్నారు. ఇక్కడి జాలర్లను అటువైపు రానివ్వకుండా ఆంక్షలు విధిస్తున్నారు. అక్కడ చేపలవేట చేస్తే ఆంధ్రా జాలర్లకు చెందిన వలల్ని ధ్వంసం చేయడం, పడవలను లాక్కోవడం వంటి కవ్వింపు చర్యలకు పాల్ప డుతున్నారు. దీంతో జాలర్ల కుప్పాల్లో వివాదాలు రావణ కాష్టంలా రగులుతూనే వున్నాయి. హద్దులు తేల్చమన్నా పట్టించుకోరు పులికాట్ సరస్సులో ఆంధ్రా, తమిళనాడు సరిహద్దుల్ని తేల్చాల్సిందిగా మత్స్యశాఖ అధికారులు, మంత్రుల చుట్టూ మత్స్యకారులు తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. 1989లో రెండు రాష్ట్రాల జాలర్ల మధ్య భారీ ఎత్తున దాడులు జరిగి పడవలను సైతం కాల్చివేశారు. తరువాత 1992లో సరస్సు పరిధి ఏ రాష్ట్రంలో ఎంత ఉంది, ఎక్కడ నుంచి ఎక్కడి వరకు ఉందనే దానిపై రెండు రాష్ట్రాల అధికారులు సర్వే చేయించాలని ఇక్కడి జాలర్లు ప్రభుత్వానికి ఎన్నోసార్లు విన్నవించారు. దీనికి సంబంధించి కొంతమేర నగదు కూడా ప్రభుత్వానికి చెల్లించారు. అయినా, ప్రయోజనం లేకపోయింది. శ్రీహరికోట దీవిలోని తెత్తుపేట వద్ద కొత్త ముఖద్వారాన్ని తెరిస్తే సమస్య సమసిపోతుందని జిల్లా జాలర్లు ప్రభుత్వానికి విన్నవించారు. అప్పడే కాకినాడ, బెంగళూరు, చెన్నైలాంటి నగరాలనుంచి మత్స్యశాఖకు చెందిన శాస్త్రవేత్తలతో అధ్యయనం చేయించారు. అది కూడా కార్యరూపంలోకి రాకపోవడంతో ఈ సమస్య అపరిష్కృతంగానే మిగిలిపోయింది. ఎండాకాలం సమీపిస్తుందంటే పులికాట్ సరస్సులో తాటి దుంగలను నాటి.. అక్కడి వరకు తమిళనాడు సరిహద్దులు ఉన్నాయంటూ అక్కడి జాలర్లు ఆంధ్రా మత్స్యకారలు రాకూడదని హెచ్చరిం చడం అనవాయితీగా మారింది. ప్రభుత్వం స్పందిస్తే తప్ప ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చేకూరదు. మహిళలపై ఆధారపడ్డాం పులికాట్ సరస్సులో మత్స్యసంపద తగ్గిపోయింది. మూడు రోజుల పాటు వేట సాగించినా పూట గడవటం లేదు. ఆడవాళ్లు తమిళనాడులోని పల్వేరికాడ్ నుంచి పచ్చి చేపలు, చెన్నైనుంచి ఎండుచేపలు తీసుకొచ్చి గ్రామాల్లో తిరిగి విక్రయించి మా కుటుంబాల్ని పోషిస్తున్నారు. పులికాట్ సరస్సుకు ఆంధ్రా పరిధిలోని తెత్తుపేట–పుళింజేరి మధ్యలో కొత్తగా ముఖద్వారం తెరిపిస్తే మత్స్య సంపద పెరిగే అవకాశం వుంది. సరస్సులో సరిహద్దు వివాదాలను పరిష్కరించేందుకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పట్టించుకోవాలి. సోదరుల్లా మెలగాల్సిన మేం బ్రతుకుదెరువు కోసం శత్రువులుగా మారుతున్నాం. – కేసీ రమేష్, మత్స్యకారుడు, భీములవారిపాళెం కొత్తకుప్పం -
ఎస్టీల్లో చేర్చాలంటూ మత్స్యకారులు దర్నా
-
'తోలుతీస్తా.. ఖబడ్దార్!' పై ఆందోళనలు
సాక్షి, విశాఖ: సీఎం చంద్రబాబు నాయుడు మత్స్యకారులపై చేసిన వ్యాఖ్యలపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ' నేను సీఎంగా ఉండగా ఏ కులం వాళ్లు రోడ్డెక్కే అవకాశం ఇవ్వలేదు. మీ ధర్నాలు, దీక్షలకు భయపడను. రాజకీయాలు చేస్తే సహించను. వెంటనే టెంట్లు ఎత్తేయండి. లేదంటే తోలుతీస్తా.. ఖబాడ్దార్!' అంటూ చంద్రబాబు మత్య్సకారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే ఇదే అంశంపై మత్య్సకారులు ఆందోళనకు సిద్ధమయ్యారు. తక్షణమే చంద్రబాబు తమకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మత్య్సకారులను ఎస్టీల్లో చేరుస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 'జన్మభూమి- మా ఊరు' కార్యక్రమంలో పాల్గొనేందుకు శుక్రవారం విశాఖలో చంద్రబాబాబు పర్యటించారు. ఈ క్రమంలో గత కొంతకాలంగా దీక్షలు చేస్తున్న మత్స్యకారులను టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్ సీఎం వద్దకు తీసుకెళ్లారు. అయితే మత్స్యకారులను చూసిన ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏం.. తమాషా చేస్తున్నారా? మీ బెదిరింపులకు భయపడను అంటూ ఫైర్ అయ్యారు. వెంటనే దీక్షలు విరమించకపోతే మత్స్యకార ప్రాంతాల్లో రోడ్లు కూడా వేయను.. మీకు దిక్కున్న చోట చెప్పుకోండంటూ బెదిరించారు. ఇప్పుడే మీ ఎమ్మెల్యేకి గట్టిగా అయ్యిందంటూ రుసరుసలాడారు. సీఎం తీరుతో షాక్ తిన్న మత్స్యకారులు.. ఎస్టీల్లో చేరుస్తానని ఎన్నికలప్పుడు హామీ ఇచ్చారు కదా? అని ప్రశ్నించగా.. సీఎం స్పందిస్తూ ఎప్పుడేమి చేయాలో తనకు తెలుసని సమాధానమిచ్చారు. -
నడి సంద్రంలో పడవకు రంధ్రం
సాక్షి, చెన్నై : నడిసంద్రంలో పయనిస్తున్న పడవకు ఒక్కసారిగా రంధ్రం పడింది. పడవలోని 20 మంది జాలర్లు భయాందోళనకు గురయ్యారు. వారంతా జాలర్లు కావడంతో ప్రమాదాన్ని పసిగట్టి చాకచక్యంగా ఒడ్డున పడ్డారు. ఈ సంఘటన చెన్నై తీరంలో శనివారం చోటుచేసుకుంది. చెన్నైలోని కాశిమేడుకు చెందిన ఇరవై మంది జాలర్లు ఓ పడవలో శనివారం తెల్లవారుజామున చేపల వేటకు బయలుదేరారు. ఉదయం ఎనిమిది గంటలకు వీరంతా బంగాళాఖాతంలోని తీర్పు దిశగా తీరానికి దాదాపు వంద కిలోమీటర్ల దూరంలోని నడి సంద్రానికి చేరుకున్నారు. ఇక చేపల వేటకు వలలు వేసేందుకు సిద్దంమవుతుండగా పడవ మధ్యలో కింద నుండి ఓ రంద్రం ఏర్పడటం గమనించారు. ఆ రంధ్రం నుండి పడవలోకి నీరు రావటం అధికమవుతుండటంతో ప్రమాదాన్ని గ్రహించిన జాలర్లు దైర్యంగా రంద్రాని మూసే ప్రయత్నం చేస్తూనే నీటిని బయటకు తోడేశారు. రంధ్రం నుండి నీరు పడవలోకి చేరుకోవటాన్ని అడ్డుకుని అక్కడి నుండి హుటాహుటిన ఒడ్డుకు చేరుకునే ప్రయత్నం చేశారు. తీవ్రంగా శ్రమించి ఎలాగోలా గాలిదిశగా వస్తూ చివరకు ఈసీఆర్ రోడ్డులోని పెరుందురై కుప్పం తీరానికి చేరుకున్నారు. అక్కడ తాళ్లతో పడవను ఒడ్డుకు చేర్చిన జాలర్లు ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం తెలుసుకున్న అధికారులు వారిని స్వంత ప్రాంతాలకు తరలించారు. -
చేప ఎండేలోగా వానొచ్చేసింది..!
►భారీ వర్షానికి కొట్టుకుపోయిన ఎండుచేపలు ► రూ.20 లక్షల మేర నష్టం ► తీరంలో ఆకలి కేకలు బాపట్ల: ఎగిసిపడుతున్న కెరటాలకు ఎదురొడ్డి జీవనం సాగించే మత్స్యకారులకు ఈ ఏడాది అన్ని కష్టాలే ఎదురవుతున్నాయి. ఈ ఏడాది ఏ గడియలో ఐల వలల వేటలు సాగించారో కానీ వలలు వేసినప్పటికీ నుంచి వాళ్లను వరుణుడు వెంటాడుతున్నాడు. వలలు రెండు నెలల క్రితం ప్రారంభించినప్పటికీ మొన్నటి దాక చేపలు పడక రేయింబవళ్లు కష్టపడినా కనీసం రోజుకు రూ.100 నుంచి 150 కూడా రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ జీవించారు. నెల మొదటి వారంలో వేట కలిసొచ్చినప్పటికీ 15 రోజులుగా కురిసిన వర్షాలకు మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. కురిసిన వర్షం మత్స్యకారుల ఆశలపై నీళ్లుచల్లింది. దీంతో ఎండబెట్టుకున్న చేపలన్నీ తడిచిపోయి కాలువల గుండా కొట్టుకుపోయి సముద్రంలో కలిశాయి. రూ. 20 లక్షల మేర నష్టం.. 15 రోజుల క్రితం వేటాడిన చేపలను సూర్యలంక సమీపంలో ఫారెస్ట్ భూమి (పర్ర)లో ఎండపెట్టుకున్నారు. నేడో రేపో లారీలకు లోడ్ చేస్తే వచ్చిన సొమ్ముతో కుటుంబ అవసరాలు తీర్చుకోవచ్చంటూ ఆశగా ఎదురు చూస్తున్న మత్స్యకారుల ఆశలను వరుణుడు తుడిచేశాడు. వారంరోజులుగా అనేకసార్లు వర్షాలు కురవడంతో వాగులు, పర్ర మొత్తం మునిగిపోయి చేపలు కాలువ ద్వారా కొట్టుకుపోయాయి. పూర్తిగా ఎండిపోయిన చేపలు తడిచిన తర్వాత ఎందుకు పనిరాకుండా పోతాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి రూ. 20 లక్షల వరకూ నష్టం వాటిల్లుతుందని చెప్పారు. ఇదిలా ఉండగా వర్షంతో పాటు ఆలల ఉధృతికి సముద్రంలో లంగర్ వేసి ఉన్న పడవలు వడ్డుకు కొట్టుకు వచ్చి ఐలవలలు తీరం వెంబడి ఇసుకు పూడుకుపోయి తెగిపోయాయి. వీటిని సరిచేసుకోవడానికి మరో వారంరోజుల సమయం పడుతుందని మత్స్యకారులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. -
జాలరి పట్టే.. పాము తన్నుకుపోయే..!
అనగనగా రాజుకు ఏడుగురు కొడుకులు. ఏడుగురు వేటకు వెళ్లి ఏడు చేపలు తెచ్చారు. ఆగండి.. ఆగండి.. ఈ కథకు స్టోరికి అసలు సంబంధం లేదు. అయితే, చేపతో మాత్రం సంబంధం ఉంది. సరదాగా చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తికి ఎదురైన వింత అనుభవం మనం చిన్ననాటి నుంచి వింటున్న కథలానే ఉంటుంది. అయితే, ఆ కథ నిజమో కాదో తెలీదు కానీ ఇది మాత్రం నిజమే. అమెరికాలోని ఐయోవా రాష్ట్రానికి చెందిన బాబ్ హోవర్డ్ సరదాగా చేపలు పట్టుకోవడం కోసం తన నివాసానికి చేరువలోని రత్బున్ సరస్సుకు వెళ్లాడు. చేపల కోసం నీళ్లలోకి గాలం విసిరాడు. అరగంటైంది ఒక్క చేపా గాలానికి తగల్లేదు. ఎదురు చూస్తున్నాడు. మళ్లీ ప్రయత్నం చేశాడు. కొంతసేపు నిరీక్షణ అనంతరం గాలానికి చేప చిక్కింది. ఓ మోస్తారు సైజు ఉన్న చేపను బయటకు తీద్దాం అనుకునేలోపు బాబ్‌కు షాక్ తగిలింది. అప్పటిదాకా ఎక్కడ నక్కిందో తెలియని ఓ పాము.. బాబ్ చేపను తన్నుకుపోయింది. ఈ ఘటనను తన ఫోన్‌తో ఫొటోలు తీసి సోషల్‌మీడియాలో షేర్ చేశాడు. ఒక్కగానొక్క చేప చిక్కితే అది కూడా ఈ పాము తన్నుకుపోయిందని తెగ బాధపడిపోయాడు. బాబ్ పెట్టిన పోస్టు సోషల్‌మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. -
వలేస్తే భారీ కొండచిలువ చిక్కింది!
భువనేశ్వర్: నదిలో విసిరిన వలలో చేపకు బదులుగా పాము చిక్కింది. చూడబోతే అదో పెద్ద కొండ చిలువ. 15 అడుగుల పొడవు ఉంది. పూరీ జిల్లా గోప్ సమితి నేతాపూర్ కుశభద్ర ఉపనదిలో చేపల వేట కోసం మత్స్యకారుడు బుధవారం రాత్రి వలపన్నాడు. గురువారం ఉదయం వలను లాగి చూడబోతే పెద్ద పాము చిక్కుకున్నట్లు గుర్తించి బెంబేలెత్తాడు. తోటి మత్స్యకారుల సహకారంతో సురక్షితంగా వలను ఒడ్డుకు లాగాడు. విషయాన్ని స్థానిక అటవీ విభాగం అధికారులకు తెలియజేశాడు. పామును సురక్షితంగా చేరువలో ఉన్న అడవిలోకి విడిచి పెడతామని అధికారులు తెలిపారు. -
రూ.వెయ్యి కోట్లతో మత్స్య సంపద అభివృద్ధి
రెండేళ్లలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలపై సర్కారు ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మత్స్యకారుల సహకార సంఘాల సమాఖ్యకు జాతీయ సహకారాభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ) మంజూరు చేసిన రూ. వెయ్యి కోట్ల రుణాన్ని ఏ విధంగా ఖర్చుచేయాలన్న దానిపై మత్స్యశాఖ పలు ప్రణాళికలు రూపొందించింది. ఈ రుణంతో 2017–18, 2018–19 సంవత్సరాలకు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ మేరకు పశుసంవర్థకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేష్‌చందా మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. రూ. వెయ్యి కోట్ల రుణంతో చేపట్టే కార్యక్రమాలతో 31 జిల్లాల్లోని 3.26 లక్షల మంది మత్స్య సహకార సంఘాల సభ్యులు లబ్దిపొందనున్నారు. 38 రకాల అంశాల్లో ఈ నిధులను ఖర్చు చేయనున్నారు. రెండేళ్లలో చేపట్టనున్న కార్యక్రమాలు... ♦ జిల్లా మత్స్యకారుల సంఘాలు, మత్స్యశాఖ ఆధ్వర్యంలో వంద శాతం సబ్సిడీపై చేప విత్తన కేంద్రాలను బలోపేతం చేస్తారు. నూతన చేప విత్తన కేంద్రాల నిర్మాణం, రిటైల్ చేపల మార్కెట్లు, హోల్‌సేల్ చేపల మార్కెట్ల నిర్మాణం చేపడతారు. ♦ చెరువుల్లో చేప పిల్లలు, రొయ్య పిల్లలు వేసేందుకు వంద శాతం గ్రాంటు ఇస్తారు. ఈ చెరువులపై మత్స్య సహకార సంఘాల సభ్యులకు హక్కులు ఇస్తారు. ♦ 75 శాతం సబ్సిడీతో చేప విత్తన హ్యాచరీస్, చేప పిల్లల విత్తన అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. కొత్త చేపల చెరువుల తవ్వకం, మొబైల్ షిప్ ఔట్లెట్ల ఏర్పాటు, ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు చేస్తారు. ♦ మత్స్యకారులకు అవసరమైన వలలు, తూకం వేసే వస్తువులు, మోపెడ్లు, చేపల రవాణా ఆటోలు, ట్రక్కులకు ప్రస్తుతమున్న సబ్సిడీని 75 శాతానికి పెంచుతారు. ♦ నూతన పద్ధతుల్లో చేపల పెంపకం, చేప విత్తన కేంద్రాలు ఏర్పాటు చేయాలనుకునే మత్స్యకార సంఘాల సభ్యులను ప్రోత్సహించేందుకు 90 శాతం సబ్సిడీపై నిధులు కేటాయిస్తారు. ♦ మత్స్య సహకార సంఘాల సభ్యుల భాగస్వామ్యంతో రిజర్వాయర్లలో పది ఆక్వా టూరిజం కేంద్రాల ఏర్పాటుకు 80 శాతం సబ్సిడీ ఇస్తారు. ♦ చేపల పెంపకంలో మెళకువలు నేర్పేలా మత్స్యసహకార సంఘాల సభ్యులకు వివిధ శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తారు. ♦ మత్స్యరంగ అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణకు ఆన్లైన్ మానిటరింగ్ వ్యవస్థ ఏర్పాటుకు రూ. 3.50 కోట్లు వంద శాతం గ్రాంటుపై కేటాయిస్తారు. -
మత్స్యకారుల మధ్య ఘర్షణ
దస్తూరాబాద్: నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలంలోని రాపూర్, దస్తూరాబాద్ గ్రామాల మత్స్యకారుల (జాలరుల) మధ్య ఘర్షణ జరిగింది. గోదావరిలోని చేపలను తమ గ్రామ మత్స్యకారులే పట్టుకోవాలని, వేరే గ్రామ మత్స్యకారులు పట్టుకోరాదని రెండు గ్రామాల వారు ఘర్షణకు దిగారు. ఈ సంఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో ఆందోళన కొనసాగుతున్నది. -
‘కృష్ణ’లో అడుగు పెడితే తాటతీస్తాం
-
‘కృష్ణ’లో అడుగు పెడితే తాటతీస్తాం
-
‘కృష్ణ’లో అడుగు పెడితే తాటతీస్తాం
♦ కబ్జా రాయుళ్లకు మత్స్యకారుల హెచ్చరిక ♦ నదిలో ఆక్రమిత ప్రాంతంలో 250 బోట్లతో ♦ మూడు గంటలపాటు మహా ధర్నా ♦ ఐరన్ రోప్ తొలగించాలని డిమాండ్ సాక్షి, అమరావతి బ్యూరో: కృష్ణా నదీ గర్భాన్ని కొందరు పెద్దలు కబ్జా చేయడంపై మత్స్యకారులు నిప్పులు చెరిగారు. నది జోలికి వస్తే తాట తీస్తామని హెచ్చరించారు. ఆదివారం సుమారు 250 బోట్లలో వారు నదిలో కలియదిరుగుతూ మూడు గంటల పాటు వినూత్న రీతిలో మహాధర్నా చేపట్టారు. కృష్ణా, గుంటూరు జిల్లా పరిధిలో విస్తరించిన కృష్ణా నది గర్భాన్ని ప్రభుత్వ పెద్దలు కొందరు ఆక్రమించుకున్నారు. ఐరన్ రోప్‌లను నదిలోపల కంచెగా ఏర్పాటు చేసి వాటిపై ప్లాస్టిక్ డబ్బాలు, ఎర్రజెండాలు పాతి కబ్జా చేసేందుకు సిద్ధమ య్యారు. ఈ విషయాన్ని ‘కృష్ణమ్మ గర్భంలో పెద్దల కబ్జా’ శీర్షికన ఏప్రిల్ 28వ తేదీన ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. సాక్షి కథనంపై వివిధ వర్గాలకు చెందిన వారు, పలువురు నిపుణులు తీవ్రంగా స్పందించారు. ‘ప్రపం చంలోనే ఎక్కడా లేని విధంగా టీడీపీ నాయకులు ఇంతకు దిగజారారా?’ అంటూ ఆరా తీశారు. మత్స్యకారులకు అండగా ఉంటామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో తుమ్మల పాలెం, గుంటుపల్లి, తాళ్లాయపాలెం, ఉద్దండ్రాయునిపాలెం మధ్యలో కృష్ణానది గర్భంలో సుమారు 150 ఎకరాల విస్తీర్ణం మేర ‘పెద్దలు’ కబ్జా చేయడంపై మత్స్యకారులు తీవ్రంగా స్పందించారు. తుమ్మలపాలేనికి చెందిన మత్స్యకారులు ఆదివారం ఉదయం 9కి బోట్లలో కృష్ణానది ఆక్రమిత ప్రాంతా నికి చేరుకున్నారు. గుంటుపల్లి, తాళ్లాయపాలెం, ఉద్దండ్రా యునిపాలెం పరిధిలోని మత్స్యకారులూ అక్కడికి వచ్చారు. నదిలో కలియదిరుగుతూ నిరసన సుమారు 250 బోట్లలో 500 మందికిపైగా మత్స్యకారులు నదిలో ఆక్రమిత ప్రాంతం చుట్టూ తిరుగుతూ... ‘కృష్ణా నదిని కబ్జారాయుళ్ల నుంచి కాపాడండి’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కబ్జాకు పాల్పడిన పెద్దలపై విచారణ జరిపి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మరి కొందరు బోట్లపై అర్ధనగ్నంగా నిల్చొని.. నదినే నమ్ముకుని బతుకుతున్న తమ పొట్టకొట్టొద్దంటూ రెండు చేతులెత్తి నమస్కరించారు. కబ్జా ప్రయత్నాన్ని విరమించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తప్పదని స్పష్టం చేశారు. నదిలో ఏర్పాటు చేసిన భారీ ఐరన్ రోప్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. లేదంటే తామే తొలగించాల్సి ఉంటుందని ప్రభుత్వ పెద్దలు, అధికారులను హెచ్చరించారు. మత్స్యకారుల ఆందోళన విషయం తెలుసుకున్న ప్రభుత్వ పెద్దలు.. కొందరు వ్యక్తులను ఆ ప్రాంతానికి పంపారు. వారు అక్కడికి వచ్చి ఆందోళనను సెల్ఫోన్లో చిత్రీకరిస్తుండగా.. ఆందోళనకారులు నేరుగా వారి వద్దకు వెళ్లి నినాదాలు చేశారు. కాగా, పెద్దల కబ్జా యత్నాన్ని వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’కి మత్స్యకారులు కృతజ్ఞతలు తెలిపారు. ఇదేనా నదుల అనుసంధానం? రైతులు, ప్రజల సాగు, తాగు నీటి కష్టాలు తీర్చేందుకు నదులు అను సంధానం చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఇందుకు రూ.కోట్లు వెచ్చిస్తోంది. నది ఉంటేనే కదా నదుల అనుసంధానం చేయటానికి? నదినే ఆక్రమించి కప్పెడితే నదుల అనుసంధానం లక్ష్యం ఎలా నెరవేరుతుంది? – అబ్రహాం, మత్స్యకారుడు నదిని పూడ్చేందుకు మిషన్లు తెచ్చారు కృష్ణా నదిని ఆక్రమించి పూడ్చేందుకు కేరళ, కర్ణాటక, చెన్నై నుంచి పెద్ద పెద్ద మిషన్లు తీసుకొచ్చారు. ఈ విషయమై ‘సాక్షి’లో వార్త రావడంతో వాటిని నది లోపలికి తీసుకెళ్లలేదు. లేదంటే ఈ పాటికే పనులు ప్రారంభమయ్యేవి. – విజయకుమార్, మత్స్యకారుడు దుర్మార్గపు చర్య టీడీపీ నేతలకు భూములు, కొండలు ఆక్రమించుకుంది చాల్లేదు. ఇసుక, మట్టినీ అమ్ముకున్నారు. అవీ చాలక ఏకంగా నదినే మింగడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతోంది. ఫలితం అనుభవించక తప్పదు. – ఆంజనేయులు, మైలవరం సీపీఎం నియోజకవర్గ ఇన్చార్జి -
చేపల వేటకు బ్రేక్
-
మత్స్యకారులకు రూ.కోటి
►కొత్త రుణ పథకాన్ని ప్రకటించిన ప్రధాని ►సోమ్‌నాథ్ ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు ►మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు డామన్ డయ్యూ: చిన్న, మధ్యతరహా మత్స్యకారులు పెద్దవైన, ఆధునిక పడవలను కొనుక్కునేందుకు కోటి రూపాయల రుణం ఇవ్వనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. బుధవారం డామన్ డయ్యూలో జరిగిన ఓ బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని ఈ నిర్ణయం పేద మత్స్యకారులకు ఓ వరమన్నారు. ‘చిన్న బోట్లలో సముద్రంలోకి వెళ్లి వేటాడలేకపోతున్న పేద మత్స్యకారుల కోసం మేం కొత్త పథకాన్ని తెస్తున్నాం. ఈ పథకం ముసాయిదా దాదాపు పూర్తయింది. దేశవ్యాప్తంగా దీన్ని అమలుచేస్తాం. పేద మత్స్యకారులు ఓ బృందంగా ఏర్పడాలి. ఈ బృందానికి ముద్ర పథకంలో భాగంగా రూ. కోటి రుణం ఇస్తాం. ఇందులో 50 శాతం నిధులను కేంద్రం ఇస్తుంది’ అని చెప్పారు. పెద్ద బోట్ల ద్వారా ఈ గ్రూపు సభ్యులు కలిసి సముద్రంలోకి వెళ్లి 12 నాటికల్ మైళ్లు (22.2 కి.మీ. ప్రాదేశిక జలాలు) దాటి వెళ్లి మరింత మత్స్య సంపద లాభాలను పంచుకోవచ్చన్నారు. దీనిపై డామన్ డయ్యూ ప్రజలు మరిన్ని సలహాలు సూచనలు ఇక్కడి అధికారులకు అందజేయవచ్చన్నారు. 9 మెగావాట్ల విద్యుత్ వాడుతున్న ఈ కేంద్ర పాలిత ప్రాంతం 10 మెగావాట్ల సౌరవిద్యుత్‌ను ఉత్పత్తి చేయటం గొప్పవిషయన్నారు. సోమ్‌నాథ్ ఆలయంలో మోదీ అంతకుముందు రెండ్రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా.. గిర్ జిల్లాలోని సోమ్‌నాథ్ ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మోదీకి ఆలయ ట్రస్టు చైర్మన్ కేశుభాయ్ పటేల్, బోర్డు సభ్యుడు, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, ట్రస్టీలు స్వాగతం పలికారు. మహిళా సాధికారతతోనే సంపూర్ణత మహిళా సాధికారత జరగనంతవరకు మానవత్వానికి సంపూర్ణత రాదని మోదీ చెప్పా రు. అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా తన అధికారిక వెబ్సైట్ ద్వారా మహిళలకు శుభాకాంక్షలు తెలి పారు. మహిళల అభివృద్ధి గురించి కాకుం డా.. మహిళల నేతృత్వంలో అభివృద్ధి గురిం చి ఆలోచించాలన్నారు. బాలికలపై వివక్ష వద్దు బాలికల పట్ల వివక్షచూపే ధోరణి మారాలని ప్రధాని తెలిపారు. బాలికలను కాపాడుకోవటం ప్రతి ఒక్కరి సామాజిక, జాతీయ, మానవతావాద బాధ్యతన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గాంధీనగర్‌లో ఏర్పాటుచేసిన మహిళా సర్పంచుల జాతీయ సదస్సులో మోదీ పాల్గొన్నారు. అనంతరం సర్పంచులకు ‘స్వచ్ఛ శక్తి’ అవార్డులను అందజేశారు. -
చేపలు పట్టడానికి వెళ్లి మృత్యువాత
కంగ్టి: చెరువులో చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు గల్లంతై వ్యక్తి మృతి చెందిన సంఘటన కంగ్టి మండలంలోని తడ్కల్‌లో సోమవారం చోటుచేసుకొంది. స్థానికుడైన మత్స్యకారుడు పస్పుల రాములు (45) ఉదయం తడ్కల్ గ్రామ శివారులోని చిన్న చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు చెరువులో పడడంతో వెంట వెళ్లిన వారు పసిగట్టి కాపాడే ప్రయత్నం చేసేలోపే నీటిలో మునిగి గల్లంతైనట్లు సమాచారం. ఈ విషయమై పోలీసులకు సమాచారం అందించి గ్రామస్తుల సహాయంతో గాలించగా మృతదేహం లభ్యమైంది. సంఘటన స్థలాన్ని ఎస్ఐ నానునాయక్ సందర్శించి పంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య గంగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి ఒక కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. -
షార్క్ చేప కోసం మనిషి మొసలి పోటీ
-
తుపాను గుప్పెట్లో బోట్లు!
సముద్రంలోనే కొత్తపల్లి, తొండంగి మండలాల మత్స్యకారులు అనుకున్న సమయానికి తీరం చేరటం కష్టమని బంధువుల ఆందోళన పిఠాపురం : వార్దా తుపాను తీవ్రమవుతున్న తరుణంలో కొత్తపల్లి, తొండంగి మండలాలకు చెందిన 30 బోట్లు సముద్రంలో చిక్కుకోవడం మత్స్యకార కుటుంబాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఆ బోట్లలో వేటకెళ్లిన సుమారు 160 మంది వరకు మత్స్యకారులు ఉండడంతో వారి బంధువులు భయపడుతున్నారు. తుపాను తీవ్రరూపం దాల్చే అవకాశం వుందని చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తీరానికి చేరుకోవాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారే తప్ప ఆ హెచ్చరికలు నడిసముద్రంలో ఉన్న మత్స్యకారులకు చేరే అవకాశం మాత్రం కనిపించడం లేదు. మత్స్యకారులందరి వద్ద సెల్ఫోన్లు ఉన్నా సుదూర ప్రాంతం కావడంతో సెల్ఫోన్లు పనిచేయని పరిస్థితి నెలకొంది. శనివారం ఉదయానికి తప్పక తీరానికి చేరుకోవాలని అధికారులు హెచ్చరిస్తుండగా సుమారు 150 నాటికన్ మైళ్ల దూరంలో ఉన్న మత్స్యకారులకు ఆ సమాచారం అంది, వారు వేటను నిలిపివేసి తిరిగి ప్రయాణం అయినా తీరానికి చేరుకోవడానికి సుమారు 24 గంటల నుంచి 36 గంటలు పడుతుందని మత్స్యకారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తుపానులో చిక్కుకునే అవకాశం ఉందని మత్స్యకారుల బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఉప్పాడలో కడలి కన్నెర్ర తుపాను ప్రభావంతో ఉప్పాడ సమీపంలోని తీరప్రాంతం వెంబడి ఉన్న బీచ్‌రోడ్డు కడలి ఆగ్రహానికి గురై ముక్కలైంది. దీంతో కాకినాడ–ఉప్పాడల మధ్య బీచ్‌రోడ్డుపై ప్రయాణం ప్రమాదకరంగా మారింది. శుక్రవారం ఉదయం నుంచి సముద్రం ఉగ్రరూపం దాల్చి గ్రామాలపైకి విరుచుకుపడింది. తీరంలో కెరటాలు సుమారు 4 మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడుతూ తీరప్రాంతాన్ని తీవ్ర కోతకు గురిచేస్తున్నాయి. తీరానికి సమీపంలో ఉన్న గ్రామాలు ముంపునకు గురయ్యే అవకాశం కనిపిస్తోంది. బలమైన ఈదురుగాలులు ఈ ప్రాంతంలో మత్స్యకారుల గృహాలను ధ్వంసం చేస్తున్నాయి. అందరికీ సమాచారం అందించే ఏర్పాట్లు చేశాం సముద్రంలో చేపల వేటలో ఉన్న మత్స్యకారులకు ఇప్పటికే సమాచారం అందించాం. చాలాబోట్లు ఇప్పటికే ఒడ్డుకు చేరుకున్నాయి. ఇంకా 30 వరకు బోట్లు ఒడ్డుకు చేరుకోవాలి. అవి శనివారం ఉదయానికి తప్పక చేరుకుంటాయి. మత్స్యకారులకు సంబంధించినంత వరకు అందరి ఫోన్ నంబర్లు మా దగ్గర ఉన్నాయి. అలాగే రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా సాంకేతికపరమైన పరికరాలతో సమాచారం అందించే ఏర్పాట్లు చేశాం. ఎవరికైనా సమాచారం అందకపోతే తక్షణం చర్యలు తీసుకునే విధంగా మత్స్యఖాధికారులను అప్రమత్తం చేశాం. మత్స్యకార కుటుంబీకులు ఎవరు ఆందోళన పడాల్సిన పనిలేదు. – అంజలి, మత్స్యశాఖ డీడీ, కాకినాడ -
వీటినేం చేస్తారు సారూ?
పంపిణీకి నోచుకోని ‘ఎస్సారెస్పీ’ చేపపిల్లలు బాల్కొండ : ప్రభుత్వం మత్స్య కారుల జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాల నుంచి చేప పిల్ల్లలను దిగుమతి చేసి వంద శాతం సబిడీపై చెరువులకు చేప పిల్లలను పంపిణీ చేస్తున్నారు. కానీ శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ దిగువ భాగాన ఉన్న జాతీయ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంలోని చేప పిల్లలను ఇప్పటి వరకు పంపిణీ చేపట్టలేదు. ఈ కేంద్రంతో ఉత్పత్తి చేసిన చేప పిల్లలను ఏం చేస్తారో అంటూ మత్స్య కారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంలో 1.37 కోట్ల చేప పిల్లలను ఉత్పత్తి చేశారు. ఎస్సారెస్పీలో 4 కోట్ల చేప పిల్లలను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్నా, అధికారుల నిర్లక్ష్యం వల్ల 1.37 కోట్లతోనే సరిపెట్టారు. వాటిని కుండీల్లో వేసి పెంచుతున్నారు. ప్రాజెక్ట్ నీటి ఆధారంగా చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంలో ఉత్పత్తి జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఉత్పత్తి చేసిన చేప పిల్లలను జిల్లాతో పాటు ఆదిలాబాద్, నాందెడ్ జిల్లాల మత్స్య సహకార సంఘాలకు 50 శాతం సబ్సిడీపై పంపిణీ చేసేవారు. కానీ ప్రస్తుత సంవత్సరం చేప పిల్లల ఉత్పత్తి ప్రక్రియ పూర్తరుు రెండున్నర నెలలు గడిచినా ఇప్పటి వరకు ఒక్క చేప పిల్లలను కూడా పంపిణీ చేయలేదు. నిర్ణయం తీసుకోలేదు.. ఎస్సారెస్పీ చేప పిల్లల కేంద్రంలో ఈ సంవత్సరం 1.37 కోట్ల చేప పిల్లల ఉత్పత్తి జరిగింది. వాటిపై ఉన్నత అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. త్వరలోనే ఉన్నత అధికారుల అనుమతి తీసుకుంటాం. - రాజానర్సయ్య, ఎఫ్‌డీవో, ఎస్సారెస్పీ -
కళతప్పిన పులికాట్!
సరస్సు నిండా ఉప్పునీరు వర్షం నీళ్లు కలవక పెరగని మత్స్య సంపద వేటలేక దిక్కుతోచని స్థితిలో మత్స్యకారులు నవంబర్ వచ్చినా కనిపించని పక్షుల ఆందాలు విదేశీ పక్షుల విన్యాసాలు.. వాటికి అందాలు అద్దుతూ సాయంత్ర సమయంలో సరస్సుపై ప్రసరించే భానుడి కిరణాలు.. పరవశింపచేసే ప్రకృతి.. హలెస్సా.. అంటూ మత్స్యకారులు సాగించే చేపటల వేట దృశ్యాలు.. ఇవన్నీ పులికాట్లో సాక్ష్యాత్కారమయ్యే కమనీయ దృశ్యాలు.. అంతటి అందమైన సరస్సు కళతప్పుతోంది.. వెరసి మత్స్యకారులు.. పర్యాటలకు నిరాశను నింపుతోంది. తడ: తడ మండలానికి తలమానికంగా, వేలాది మంది మత్స్యకారులకు అన్నదాతగా, దేశ విదేశీ పక్షులకు ఆహార భాండాగారంగా ఉండే పులికాట్ సరస్సు ప్రస్తుతం కళతప్పుతోంది. తన రూపు రేఖలని కోల్పోతూ ఆందోళన కలిగిస్తోంది. పాలకుల నిర్లక్ష్యం, ప్రకృతి కన్నెర్ర చేయడంతో తన సహజ గుణాన్ని కోల్పోతూ నిర్జీవంగా మారే పరిస్థితికి చేరుకుంది. భిన్నమైన పరిస్థితుల్లో పెరిగే మత్స్యసంపద పులికాట్ సరస్సులో పెరిగే చేపలు, రొయ్యలు, పీతలు భిన్నమైన వాతావరణంలో పెరుగుతాయి. ఉప్పునీరు, మంచి నీరు కలగలిసి ఉండే వాతావరణంలో మాత్రమే ఇవి వేగంగా వృద్ధి చెందుతాయి. పులికాట్లో మాత్రమే లభించే మొయ్యలు, తుళ్లులు, కోలాసులు వంటి చేపలతోపాటు రొయ్యలు, పీతలు కూడా ఎంతో రుచికరంగా ఉంటాయి. ఉప్పు శాతం 30కి పైగా ఉండే అచ్చం ఉప్పు నీళ్లు మాత్రమే ఉంటే ఈ చేపలు, రొయ్యలు వృద్ధి చెందవు. ఉప్పు నీటితోపాటు వర్షాల వల్ల వచ్చే నీటి పారుదల కూడా కలిసినప్పుడే గుడ్లు పిగిలి కొత్త పిల్లలు వృద్ధి చెందుతాయి. ఈ కారణంతోనే ప్రస్తుతం సముద్రపు నీళ్లు పులికాట్ నిండా చేరినా వర్షపు నీళ్లు లేకపోవడంతో చేపలు, రొయ్యలు వృద్ధి చెందలేదు. పూడిపోయిన ముఖద్వారాలు సముద్రపు నీటిని పులికాట్ సరస్సుతో కలిపి సముద్రం, సరస్సు మధ్య నీటితోపాటు మత్స్య సంపద రాకపోకలకు అనువుగా ఉండే ముఖద్వారాలు చాలా కాలంగా పూడిపోతూ వస్తున్నాయి. వీటిని తెరిపించేందుకు చేసిన విన్నపాల మేరకు అధికారులు కాస్త హడావుడి చేసినా ప్రస్తుతం అది మరుగున పడిపోయింది. దీంతో సముద్రం నుంచి పులికాట్‌కి ఉన్న సంబంధం చెడుతూ వస్తోంది. దీని వల్ల మత్స్యసంపదకు అనువైన మడచెట్లు అంతరించిపోయి, వాతావరణం దెబ్బతిని పిల్లల ఉత్పత్తికి వాతావరణం అనుకూలంగా లేకుండా పోయింది. దీంతో పలు రకాల మత్స్య జాతులు పునరుత్పత్తి లేక అంతరించిపోయే ప్రమాదంలో పడ్డాయి. ఉపాధి కోల్పోతున్న జాలర్లు నవంబర్ మాసంలో ఎక్కడ వల వేసినా చేపలు, రొయ్యలు పుష్కలంగా లభించేవి. చేతినిండా సొమ్ము చేసుకోవాల్సిన సమయంలో కనీసం బువ్వకు కూడా చేపలు దొరకని పరిస్థితి మత్స్యకారులను ఆందోళనకు గురిచేస్తోంది. సరస్సుని నమ్ముకుని మండలంలోని 17 కుప్పాలకు చెందిన వేలాది మంది జాలర్లు జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. నవంబర్ వచ్చినా కనిపించని పక్షుల జాడ అక్టోబర్ వచ్చిందంటే ఫ్లెమింగోలు, ఇతర బాతు జాతి పక్షులు పులికాట్లో సందడి చేస్తూ పర్యాటకులను ఆకట్టుకోవడం ఆనవాయితీ. కానీ ఈ ఏడాది నవంబర్ మొదటి వారం ముగుస్తున్నా ఇంతవరకు ఒక్క పిట్టకూడా ఇక్కడ వాలలేదు. దేశ విదేశాల నుంచి ఆహారం కోసం అక్టోబర్‌లో పులికాట్ వచ్చి నేలపట్టులో సంతాన ఉత్పత్తి చేసుకుని మార్చి నెలకల్లా పిల్లలతో కలిసి తమ స్వస్థలాలలకు పయనమవుతాయి. కానీ పక్షులు అన్నీ ఒకేసారి రాకుండా తమ రాకకు ముందే కొన్ని పైలెట్ పక్షులను ఇక్కడికి పంపి అవి సంకేతాలు ఇస్తేనే మిగిలినవి ఇక్కడకు చేరుకుంటాయి. కానీ ప్రస్తుతం ఇక్కడ ఆహారం అదుబాటులో లేకపోవడంతో పక్షులు ఒక్కటి కూడా ఇక్కడ కనిపించడం లేదు. ఇది ఇలాగే కొనసాగితే అందమైన విహంగాల విన్యాసాలు చూసే భాగ్యం కోల్పోవడం జరుగుతుంది. ఫ్లెమింగోల కోసం ఏర్పాటు చేసే పండగను ఆనందంగా కాకుండా విషాదంగా జరుపుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. -
మహా సముద్రంలో 438 రోజులు..!
‘లైఫ్ ఆఫ్ పై’ సినిమా చూసినవారికి సముద్రంలో తప్పిపోయినవారి కష్టాలు అర్థమవుతాయి. తినడానికి తిండి లేక, తాగడానికి నీరు లేక, కప్పుకోవడానికి ఒంటినిండా గుడ్డలు లేక.. చావుకు రోజులు లెక్కబెట్టుకుంటూ బతుకుతారు వీరు. చివరకు ఏదో ఒకరోజు వీరికి మోక్షం లభిస్తుంది. మరణించినవారు సముద్రగర్భంలో కలిసిపోతారు. బతికిబట్టకట్టినవారు చరిత్రలో నిలిచిపోతారు. అలా నిలిచి గెలిచినవాడే జోస్ సాల్వడార్ అల్వరెంజా..! 2012 నవంబర్ 17.. తను ఎంతగానో నమ్ముకున్న బోటును ప్రేమగా ముద్దాడి సముద్రంలోకి బయలుదేరాడు అల్వరెంజా. సాల్వడార్‌కు చెందిన ఈ జాలరి.. అప్పటికి 20 ఏళ్ల క్రితమే మెక్సికోకు వలసవచ్చాడు. అక్కడే చేపలు పట్టుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఎప్పటిలాగే చియాపాస్ తీరం నుంచి చేపల వేటకు సాగరంపైకి దూకాడు. అయితే, తోడుగా అలవాటైన మిత్రుడు ‘రే పెరేజ్’ వెంట రాలేదు. వేరే ఏదో పనిమీద అతడు బయటకు వెళ్లడంతో ఆరోజు అల్వరెంజా బోటెక్కాడు 23 ఏళ్ల కార్దోబా. చాలా చురుకైన అథ్లెట్, ఆ ఊరి ఫుట్‌బాల్ జట్టులో మొనగాడు. కానీ, చేపల వేట మాత్రం కార్దోబాకు పూర్తిగా కొత్త. అంతకు ముందెప్పుడూ ఈ కుర్రాడితో కలిసి పనిచేసిన అనుభవం లేకపోవడంతో మొదట్లో అల్వరెంజా పెద్దగా మాట్లాడేవాడు కాదు. తర్వాత కూడా వీరిద్దరి మధ్యా పెద్దగా మాటలు సాగలేదు. బోట్లోని జీపీఎస్, సగం ఛార్జింగ్ ఉన్న మొబైల్ ఫోన్, పాతకాలం రేడియో, వైర్లెస్.. వీటితో పాటు కొద్దిపాటి చేపలవేటకు అవసరమైన పరికరాలతో కొద్ది గంటలు బాగానే వేటాడసాగారు. దాదాపు వేట పూర్తి కావస్తోందన్న సమయంలో అతి భయంకరమైన తుపాను వారిని అతలాకుతలం చేసింది. ఉవ్వెత్తున లేచిపడుతోన్న కెరటాల ధాటికి జీపీఎస్ పరికరం పాడైంది. మొబైల్, వైర్‌లెస్‌లు కూడా దాదాపుగా పనిచేయడం ఆగిపోయాయి. ఉన్నట్టుండి బోటు మోటారు చెడిపోయింది. ఈ క్రమంలో చివరగా తమను కాపాడాలంటూ తీరంలోని తమ యజమానికి అల్వరెంజో చేసిన విన్నపాలు వినిపించకుండాపోయాయి. ఇక, విధిలేని పరిస్థితుల్లో ఇద్దరూ బోటులో బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఐదురోజుల పాటు తుపాను వారిని భయపెట్టింది. తర్వాత చూసుకునేసరికి.. వారు మెక్సికో తీరానికి ఏమాత్రమూ దగ్గరగా లేరు. ఎక్కడో నడిసంద్రంలో కొట్టుకుపోతున్నారు. గమ్యం తెలీని ప్రయాణమే అయింది వారి పరిస్థితి. సముద్రపు వేట మీద అనుభవం లేని కార్దోబాకు తాము తిరిగి తీరానికి చేరుతామనే నమ్మకం పోయింది. ఏడ్చుకుంటూ కూర్చున్నాడు. దీనికి తోడు వాంతులు చేసుకుంటూ నీరసంగా తయారయ్యాడు. అతడి పరిస్థితి చూసిన అల్వరెంజా చేపలు పట్టి అతడికి ఆహారంగా ఇవ్వాలనుకున్నాడు. కానీ, దురదృష్టమేంటంటే.. చేపల వేటకు అవసరమైన పరికరాలన్నీ తుపానులో కొట్టుకుపోయాయి. దీంతో సాధారణ చేతులతోనే వేటాడటం మొదలుపెట్టాడు అల్వరెంజా. చేపలు, తాబేళ్లు పట్టుకుని వాటి మాంసాన్ని కార్దోబాకు తినిపించాడు. అయితే, ఈ మాంసం అతడి శరీరానికి అంతగా నప్పలేదు. రోజురోజుకీ నీరసంగా తయారయ్యాడు. సముద్ర ప్రయాణంలో బతికిబట్టకట్టాలంటే ఉత్సాహంగా ఉండాలని అల్వరెంజా ఎంత చెప్పినా కార్దోబా తేరుకోలేకపోయాడు. ఎప్పుడూ ఇంటిపైనే ధ్యాసతో మరింత నీరసించాడు. అలా రెండు నెలలు గడిచాయి. ఈ కాలంలో చేపలు, సముద్రపు పక్షులు, తాబేళ్లను తింటూ కాలం గడిపేవారు వీరిద్దరూ. మంచినీరు దొరక్కపోవడంతో డీహైడ్రేషన్ బారి నుంచి తప్పించుకునేందుకు మూత్రాన్ని తాగి బతికేవారు. కానీ, ఒకరోజు ఉదయాన లేచి చూసేసరికి కార్దోబా మరణించాడు. అతడి శవాన్ని పక్కనే పెట్టుకుని ఆరు రోజుల పాటు పిచ్చివాడిలా మాట్లాడుకునేవాడు అల్వరెంజా. చివరకు ఓ రోజు సముద్రంలో కార్దొబాను పడేయ్యక తప్పలేదు. అలా పద్నాలుగు నెలలు సముద్రంలోనే గడిపిన తర్వాత చిక్కి శల్యమయ్యాడు అల్వరెంజా. చివరకు అదృష్టం బాగుండి.. 2014 జనవరి 30న మార్షల్ ఐల్యాండ్స్ అనే చిన్న దీవిలో నగ్నంగా తేలాడు. వెంటనే స్థానికులు చికిత్స అందించడంతో బతికి బట్టకట్టాడు. 438 రోజుల పాటు సముద్రంలో ఒంటరిగా గడిపిన ఏకైక వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు. -
చేప కాదు.. కొండ చిలువ చిక్కింది!
కొల్చారం: చేపలు పట్టేందుకు ఓ జాలరి వల విసరగా కొండచిలువ చిక్కింది. ఈ అరుదైన ఘటన మెదక్ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. కొల్చారం మండలం తుక్కాపూర్ గ్రామ సమీపంలోని మంజీర వాగులో చేపలు పడుతున్న ఓ జాలరి వలకు కొండచిలువ చిక్కింది. దాదాపు 10 ఫీట్ల వరకు ఉన్న కొండచిలువను మరికొందరు వ్యక్తులతో కలిసి గట్టుపైకి చేర్చారు. సమీపంలోని చెట్ల పొదల్లోకి వదిలేసినట్లు స్థానికలు తెలిపారు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది. -
మత్స్యకారుల సంక్షేమానికి కృషి
సూర్యాపేట : చెరువులపైన ఆధారపడి జీవనం సాగిస్తున్న మత్స్యకారుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీఠ వేస్తుందని మున్సిపల్ చైర్ పర్సన్ గండూరి ప్రవళిక అన్నారు. శనివారం పట్టణంలోని చౌదరి చెరువులో మున్సిపల్ చైర్పర్సన్ చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చెరువుల్లో చేపల పెంపకం కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిందన్నారు. వరుణిడి కరుణతో చెరువులు నిండి కళకళలాడుతున్నాయన్నారు. మత్స్యకారులు, ముదిరాజ్, గంగపుత్రులతోపాటు ఇతర కులాలకు చెందిన మత్స్య కార్మిక సంఘాల ఆర్థికాభివృద్ధి సాధించేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. వలస పాలనలో నిర్లక్ష్యానికి గురైన మత్స్య పారిశ్రామిక రంగం అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. సూర్యాపేట పట్టణంలోని చౌదరి, పుల్లారెడ్డి, నల్లచెరువు తండాల్లో ఈ చేపల పెంపకం చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ ఏడీ రాధారోహిణి, ఎఫ్డీఓ ఎస్కె.రెహమాన్, వై.వెంకటేశ్వర్లు, గండూరి ప్రకాష్, ఆకుల లవకుశ, వర్థెల్లి శ్రీహరి, షాహినాబేగం, వెలుగు వెంకన్న, షఫీఉల్లా, నెమ్మాది భిక్షం, బైరబోయిన శ్రీను, తండు శ్రీను, బత్తుల ఝాన్సీలక్ష్మి, అంగిరేకుల రాజశ్రీ, గోదల భారతమ్మ, పెదపంగు స్వరూపారాణి, గుడిపూడి వెంకటేశ్వర్రావు, దేవేందర్, ఈఈ విద్యాసాగర్‌రావు, డీఈ వెంకటేశ్వర్రావు, ఏఈ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
గోదావరిలో పడి మత్స్య కార్మికుడు మృతి
ధర్మపురి: చేపల వేట కోసం వెళ్లిన మత్స్య కార్మికుడు ప్రమాదవశాత్తు గోదావరిలో పడి మరణì ంచాడు. గురువారం ధర్మపురి మండలం జైనా వద్ద గోదావరిలో మృతదేహం లభ్యమైంది. ఎసై ్స రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. జైనా గ్రామానికి చెందిన మత్స్య కార్మికుడు కూనారపు రమేశ్ (32) గత నెల 24న చేపల వేట కోసం గోదావరికి వెళ్లాడు. వారం నుంచి ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బంధువులందరికీ సమాచారం అందించారు. అయినా అతడి ఆచూకీ తెలియరాలేదు. గురువారం జైనా వద్ద గోదావరిలో మతదేహం పైకి తేలడంతో గ్రామస్తుల సాయంతో గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించినట్లు ఎసై ్స తెలిపారు. మతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. రమేశ్ తండ్రి చిన్న రాజం ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎసై ్స తెలిపారు. -
అర్ధాకలి బతుకులు
సంతబొమ్మాళి: రోజులు మారుతున్నా మత్స్యకారుల బతుకు రాతలు మారడం లేదు. నిత్యం కల్లోల కడలిలో వేట సాగించే మత్స్యకారుల బతుకులు కూడా కల్లోలంగానే ఉంటున్నాయి. మండలంలోని భావనపాడు తీరంలో పదిహేను రోజులుగా చేపలు దొరక్క పోవడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. భావనపాడు గ్రామంలో వంద బోట్లు, 60 తెప్పలు పై నిత్యం వేట సాగిస్తున్నారు. ఒకప్పుడు భావనపాడు తీరంలో చేపలు వ్యాపారం బాగా సాగేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో మత్స్యకారులు ఆలోచనలో పడ్డారు. సముద్రంలో మత్స్య సంపద రోజు రోజుకు తగ్గిపోతోంది. వాతావరణం అనుకూలించక పోవడంతో సముద్రంలో ఇసుక అలలు ఎక్కువ కావడంతో మత్స్య సంపద తగ్గుతోందని మత్స్యకారులు అంటున్నారు. కేవలం సముద్రం పైనే ఆధారపడి బతుకుతున్న మత్స్యకారులకు ఈ పరిస్థితి ఇబ్బందికరమే. ఒక్కో బోటులో 6 నుంచి 8 మంది మత్స్యకారులు వేట కొనసాగిస్తారు. సముద్రంలో సుమారు ఏడు గంటల సమయం పాటు వేట జరుగుతుంది. దీని కోసం డీజిల్, వగైరా ఖర్చులు బోటు రెండు వేల రూపాయల వరకు అవుతుంది. అయితే రెండు వారాలు పాటు మత్స్యసంపద చిక్కక పోవడంతో ఒట్టి చేతులతో తిరిగి ఒడ్డుకు వస్తున్నారు. దీంతో అప్పుల పాలవుతున్నామని మత్స్యకారులు అంటున్నారు. మరికొందరు వలస బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. దీనిపై ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించాలంటూ మత్స్యకారులు కోరుతున్నారు. -
మళ్లీ చొరబడిన తమిళ జాలర్లు
తడ : పులికాట్ సరస్సులో చేపల వేట విషయమై గత కొన్నేళ్లుగా సాగుతున్న వివాదం తాజాగా మళ్లీ మొదలైంది. తాజాగా తమిళనాడుకు చెందిన చిన్నమాంగోడు, పెద్దమాంగోడు, పుదుకుప్పం జాలర్లు రెండు రోజులుగా ఆంధ్ర హద్దుల్లోని ప్రాంతంలో చేపల వేట కొనసాగిస్తున్నట్టు జాలర్ల సంఘ నాయకుడు బొమ్మన్ ధనుంజయ గురువారం తెలిపారు. దాదాపు పది పడవల్లో తమిళ జాలర్లు ఆంధ్రా హద్దుల్లోకి ప్రవేశించడంతో అక్కడ వేట సాగిస్తున్న ఆంధ్రా జాలర్లు వివాదాలు తలెత్తకుండా అక్కడి నుంచి వెనక్కు తిరిగి వచ్చేసినట్లు ఆయన తెలిపారు. దీనిపై ఎస్ఐకి ఫిర్యాదు చేశామని, న్యాయస్థానం ద్వారా పరిష్కరించేందుకు సన్నద్ధం అవుతున్నట్టు తెలిపారు. . -
బతుకు వెతుక్కుంటూ...
♦ ఉపాధి లేక వలస బాట ♦ వలస వెళ్తున్న మత్స్యకారులతో నిండిన రైల్వే స్టేషన్ ఆమదాలవలస: సంక్షేమ పథకాలు, ఉపాధి హామీలు మత్స్యకారులకు భరోసా ఇవ్వలేకపోతున్నాయి. కష్టకాలంలో బతుకు వెతుక్కుంటూ గంగపుత్రులు వేరే రాష్ట్రాలకు వలస వెళ్లిపోతున్నారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, మత్స్యకారులకు కరువు భత్యం వంటి మాటలు చెప్పిన వారు చేసిన మోసం వల్లనే తాము ఇలా వలస వెళ్లాల్సి వస్తోందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. గుజరాత్ రాష్ట్రం వీరావళికి వెళ్లేందుకు ప్రయాణమైన ప్రయాణికులు(మత్స్యకారులతో) ఆమదాలవలస రైల్వే స్టేషన్ ఆదివారం రద్దీగా కనిపించింది. వీరావళికి ప్రయాణం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన డి.మచిలేశ్వరం, చింతపల్లి, జీరుపాలేం, గణగలపేట, కొమరవానిపేట, రాళ్లపేట, బడివానిపేట, బోడుగుట్ల పాలేం, జీరుపాలేం, కొవ్వాడ, కొత్తముఖవాడ తదితర గ్రామాలకు చెందిన వేల సంఖ్యలో యువకులు, పురుషులు అందరూ గుజరాత్ రాష్ట్రంలోని వీరావళికి ప్రయాణ మయ్యారు. వీరంతా అక్కడ సముద్రంలో చేపల వేటకు వెళ్తున్నామని చెబుతున్నారు. అక్కడ బోట్లలో వెళ్లి చేపలు వేటాడుతామని, నెలకు భోజనాలు పెట్టుకొని రూ..7వేలు జీతం ఇస్తారని తెలిపారు. ఎనిమిది నెలల వరకు అక్కడ ఉండి మళ్లీ సంక్రాంతి వెళ్లాక నాలుగో నెలలో తిరిగి ఇంటికి వస్తామని చెబుతున్నారు. అంతవరకు తమ కుటుంబాలను విడిచి పెట్టి, భార్యా బిడ్డలకు దూరంగా ఉంటూ పొట్టకూటి కోసం పనిచేస్తామని చెప్పారు. గ్రామాల్లో పనులు లేకపోవడంతోనే వలస వెళ్తున్నామని, ఉపాధి ఉంటే వెళ్లేవారం కాదని అన్నారు. డిగ్రీలు, పీజీలు పూర్తి చేసి ఉద్యోగ అవకాశాలు లేక ఇలా వేరే రాష్ట్రాల్లో పనులు చేసుకుంటున్నామని యువకులు చెబుతున్నారు. -
విద్యుత్ షాక్‌కు గురై మత్స్యకారుడు మృతి
కవిటి : చేపల వేటకోసమని వెళ్లి విద్యుత్ షాక్‌కు గురై మత్స్యకారుడు మృతి చెందిన సంఘటన శుక్రవారం ఇక్కడ చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...మాణిక్యపురం గ్రామానికి చెందిన ఖెత్రోబెహరా(47) తన గ్రామం నుంచి బల్లిపుట్టుగ పొలాల మార్గం గుండా కుసుంపురం తంపరబీలలో చేపల వేటకు వెళ్తుండగా నేలకొరిగిన విద్యుత్ స్తంభం వైర్లు తగిలి మృతి చెందాడు. వేకువ జామున వెళ్లడంతో వైర్లు కనిపించక ప్రమాదానికి గురయ్యాడు. అక్కడే విద్యుత్ షాక్‌కు గురై నక్క కూడా మృతి చెందింది. నేలకొరిగిన విద్యుత్ స్తంభం విషయంలో సంబంధిత శాఖాధికారులు నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ స్తంభాన్ని తగినంత లోతులో పాతిపెట్టకపోవడం వల్లే నేలకొరిగి ఈ ప్రమాదం సంభవించిందని వారు ఆరోపిస్తున్నారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. మృతునికి భార్య నర్సిబెహరాణి, దత్త కుమార్తె సుజాత ఉన్నారు. -
గాలిలో దీపాలు
కూలిన బతుకులు.. కోలుకోని మత్స్యకారులు చేపలతిమ్మాపురంలో దయనీయ దృశ్యాలు తగరపువలస: భీమిలి మండలం చేపలతిమ్మాపురంలో ఇళ్లు కోల్పోయిన బాధితులు 24 గంటలు గడచినా ఇంకా కోలుకోలేదు. బిక్కుబిక్కుమంటూ కొండపై కాలం వెళ్లదీస్తున్నారు. గురువారం ఉదయం సమాచారం లేకుండా అధికారులు పిల్లలు, మహిళలను నిర్ధాక్షిణ్యంగా బయటకు ఈడ్చుకువచ్చారని ఆరోపిస్తున్నారు. వస్తువులేవీ బయటకు తీసుకోనీయకుండా జులుం ప్రదర్శించారన్నారు. శుక్రవారం పలుచోట్ల మహిళలు శిథిలాలకింద వంటపాత్రలు, ఆహారధాన్యాలు, పుస్తకాలు, దుప్పట్లు తదితర వస్తువుల కోసం వెతుకులాట ప్రారంభించారు. తమను ఆదుకునేవారికోసం ఎండలోనే నిరీక్షిస్తున్నారు. గురువారం రాత్రంగా చిమ్మచీకటిలోనే కొండపై గడిపారు. గాలికి దీపాలు ఆరిపోతుండటంతో చీకట్లో చెట్లు, టెంట్ల కింద ఉన్నవారిని తేళ్లు కాటువేశాయి. వెలుతురు కోసం కనీసం టార్చ్లైట్లు కూడా వీరి వద్ద లేవు. ఇళ్ల నిర్మాణానికి ఒక్కొక్కరు రూ.2 నుంచి రూ.4 లక్షల వరకు అప్పులు చేసి ఖర్చు చేసినా నేలమట్టం కావడంతో ఉసూరుమంటున్నారు. ప్రభుత్వం తమకు న్యాయం చేసేవరకు ఎండైనా, వానైనా కొండ దిగేదిలేదని తేల్చిచెబుతున్నారు. పుస్తకాలు శిథిలాలలో కలిసిపోవడంతో చిన్నారులు శుక్రవారం పాఠశాలలకు వెళ్లలేకపోయారు. 30 గంటలుగా ఎవరూ వంట చేసుకోలేదు. తెలిసినవారు ఆహారం పంపడంతో శుక్రవారం ఎంగిలిపడ్డారు. తమ ఇళ్ల కూల్చివేతలో పోలీసులు మానవత్వంతో వ్యవహరించినా అధికారపక్షం ఒత్తిడితో రెవెన్యూ సిబ్బంది తమపట్ల కఠినంగా వ్యవహరించారని మత్స్యకార మహిళలు వాపోయారు. ఇంత జరిగినా తమను పరామర్శించడానికి అధికార పార్టీకి చెందిన నాయకులెవరూ రాలేదని వాపోయారు. -
సముద్రంలో పాము కరిచి మత్స్యకారుడి మృతి
సంతబొమ్మాళి (శ్రీకాకుళం) : చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు సముద్రంలో పాము కాటు వేయడంతో మృతి చెందాడు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం భావనపాడులో గురువారం చోటుచేసుకుంది. ఇదే గ్రామానికి చెందిన మత్స్యకారుడు తెప్పల కామయ్య(60) ఉదయం ఆరు గంటలకు భావనపాడు జట్టీ నుంచి బోటులో బై.రామ్మూర్తి, దున్న అప్పన్న, సత్యంతో పాటు మరో నలుగురుతో కలిసి బోటుపై సముద్రంలో చేపలు వేటకు వెళ్లారు. వలలో భారీగా చేపలు పడడంతో ఆనందపడిన మత్స్యకారులు వాటిని బోటులోకి లాగే ప్రయత్నం చేశారు. అయితే వలలోని చేపలు తీస్తుండగా... అందులో చిక్కుకున్న సముద్ర పాము కామయ్యను కాటు వేయడంతో అస్వస్థతకు గురయ్యాడు. ఆయన వెంట ఉన్నవారు ఒడ్డుకు తీసుకొచ్చేలోగానే చనిపోయాడు. నౌపడ ఏఎస్సై రామారావు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి.. కామయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం టెక్కలి ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
బతుకు పోరుకు సంసిద్ధం
రేపటి నుంచి చేపలవేట పున: ప్రారంభం రెండు నెలల విరామం తర్వాత 981 బోట్లు సముద్రంలోకి జిల్లాలో 1.12 లక్షలమంది మత్స్యకారులు చేపలు, రొయ్యల ఆచూకీ తెలిపే టెక్నాలజీ లేనేలేదు మచిలీపట్నం : బతుకు పోరుకు రంగం సిద్ధమైంది. రెండు నెలల విరామం అనంతరం సముద్రంలో చేపటవేటకు మత్స్యకారులు సిద్ధమవుతున్నారు.జూన్15వ తేదీ అర్ధరాత్రి నుంచి చేపలవేట పునఃప్రారంభం కానుంది. వాతావరణంలో మార్పులుచోటు చేసుకోవడంతో సముద్రంలో చేపలవేట జూదంలా తయారైంది. జిల్లా వ్యాప్తంగా 122 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. తీరం వెంబడి ఉన్న 38 గ్రామాల్లో 1.12 లక్షలమంది మత్స్యకారులు చేపలవేట ఆధారంగా జీవనం సాగిస్తున్నారు. 981 మరపడవల ద్వారా సముద్ర సంపదను వేటాడుతూ వచ్చే ఆదాయమే వారికి ప్రధాన ఆధారం. ప్రభుత్వం నుంచి మత్స్యకారులకు అందే సహకారం అంతంత మాత్రమే. సముద్రంతో తమ జీవితాలను పెనవేసుకున్నారు. సముద్రపు అగాధాల్లో చేపలు, రొయ్యలు ఎక్కడదొరుకుతాయో ఇట్టే పసిగట్టేతత్వం అనుభవపూర్వకంగా వారికి ఉంది. ఇదే వారికి ఎనలేని పెట్టుబడిగా ఉపయోగపడుతోంది. సాంకేతక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా మత్స్యకారుల జీవితాల్లో ఇసుమంతైనా మార్పు చోటు చేసుకోవడంలేదు. వేటకు సంసిద్ధం చేపలు, రొయ్యలు గుడ్లు పెట్టి సంతానాన్ని వృద్ధి చేసే కాలాన్ని పురస్కరించుకుని ఏటా ఏప్రిల్ 15వ తేదీనుంచి జూన్15 వరకు 60 రోజులపాటు సముద్రంలో చేపల వేటపై కేంద్ర ప్రభుత్వం నిషేధం అమలు చేస్తోంది. జూన్15వ తేదీతో నిషేధం సడలించనున్నారు. మచిలీపట్నంలోని గిలకలదిండి హార్బర్‌నుంచి 95 మెకనైజ్డ్ బోట్లు(పెద్దబోట్లు). సముద్రతీరంలోని నాగాయలంక, కోడూరు, మోపిదేవి, బందరు, బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాలనుంచి మరో 886 మోటారైజ్డ్(ఫైబర్) బోట్ల ద్వారా చేపల వేటను మత్స్యకారులు కొనసాగిస్తూ ఉంటారు. తీరంనుంచి 15 నాటికల్ మైళ్ల పరిధి వరకూ వీరు చేపల వేటను కొనసాగించేందుకు వెసులుబాటు ఉంది. మెకనైజ్డ్ బోటు చేపల వేటకు వెళితే తిరిగి రావడానికి వారం పడుతుంది. ఫైబర్ బోట్ల ద్వారా చేపల వేట కొనసాగించే వారు తెల్లవారు వేకువజాము 3 గంటలకు చేపల వేటకు వెళ్లి అదే రోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో తిరిగి వస్తారు. సమాచారం ఇచ్చేవారేరి? సముద్రంలో మత్స్యసంపద ఎక్కడ లభ్యమవుతుందో తెలుసుకునే పరిజ్ఞానం శాటిలైట్ ద్వారా అందుబాటులోకి వచ్చింది. జిల్లాలో ఈ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సమాచారం ఇచ్చే ప్రక్రియ అంతంత మాత్రంగానే అందుబాటులో ఉంది. సముద్రంలో చేపలు, రొయ్యలు ఇన్ని మీటర్ల లోతులో, ఇన్ని కిలోమీటర్ల దూరంలో తిరుగుతున్నాయని మత్స్యశాఖ అధికారులు చేపటవేట కొనసాగించే వారికి ఎస్‌ఎంఎస్‌ద్వారా, హ్యామ్ రేడియోల ద్వారా సమాచారం అందించాలి. అయితే జిల్లాలో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. గిలకలదిండి హార్బర్, గిరిపురంలో ఈ సమాచార కేం్రద్రాలను ఏర్పాటు చేశారు. మత్స్యశాఖ పర్యవేక్షణలో జరగాల్సిన ఈ పనిని స్వచ్ఛంద సంస్థలకు అప్పగించారు.ఆ సంస్థలు తమ వద్ద ఉన్న సాంకేతిక పరికరాలు మరమ్మతులకు గురయ్యాయంటూ సమాచారం ఇవ్వడం నిలిపివేస్తున్నారు. ఈ వ్యవస్థను ఎప్పటికి పునరుద్ధరిస్తారో మత్స్యశాఖ అధికారులే చెప్పలేని దుస్థితి నెలకొంది. సముద్రంలోనే జీవనం గిలకలదిండి హార్బర్‌నుంచి అత్యధికంగా మెకనైజ్డ్ బోట్లు, మోటారైజ్డ్ బోట్లు చేపల వేటకు వెళుతుంటాయి. ఒక్కో మొకనైజ్డ్ బోటులో ఏడునుంచి ఎనిమిదిమంది ఉంటారు. ఒక డ్రైవరు, మిగిలిన వారిని కళాసీలని పిలుస్తారు. వారంపాటు సముద్రంలోనే ఉండి చేపలవేట కొనసాగించే వీరు ఏడాదిలో అధిక రోజలు సముద్రంలోనే గడుపుతారు. బోటుకు ఏవైనా చిన్న,చిన్న రిపేర్లు ఉంటే ఒకటి రోజులో చేసుకుని వెంటనే మళ్లీ వేటకు వె ళతారు. నెల్లూరు జిల్లా కావలి, తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ తదితర ప్రాంతాలకు చెందిన వారు గిలకలదిండి హార్బర్ నుంచి చేపల వేటకు వెళుతుంటారు. బోటు యజమానులు చేపలు,రొయ్యల వేటలోనూ, బోటు నడపడంలోనూ ఇతర ప్రాంతాలకు చెందిన నిపుణులను గుర్తించి వారికి అధిక మొత్తంలో నగదు ఇచ్చి సముద్రంలో చేపలు, రొయ్యల వేటకు పంపుతుంటారు. గిలకలదిండి హార్బర్లో 80శాతం మంది ఇతర జిల్లాలకు చెందిన వారే ఉన్నారు. అత్యధిక రోజులు కుటుంబాలకు దూరంగా సముద్రంలోనే ఉంటారు. జీవనభృతి ఎప్పటికో ... జిల్లాలో 4,200మంది మత్స్యకారుల కుటుంబాలకు చేపలవేట నిషేధ సమయంలో జీవనభృతిగా ఒక్కొక్క కుటుంబానికి రూ. 4వేలు అందజేస్తామని అధికారులు చెబుతున్నారు. గత ఏడాది రూ. 4వేలు ఇస్తామని ప్రకటించి రూ. 2వేలు మాత్రమే అందజేశారు. ఈ ఏడాది పూర్తిస్థాయిలో నగదును అందజేస్తారా, లేదా అనేది తెలియని పరిస్థితి నెలకొంది. మత్స్యకారులకు రక్షణ కోసం లైఫ్‌జాకెట్లు తదితర పరికరాలను అందజేయాల్సి ఉంది. అయితే ఈ పరికరాల అందజేతలో మత్స్యశాఖ అధికారులు తీవ్రజాప్యం చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 12వ తేదీన సముద్రంలో చేపలవేట కొనసాగిస్తున్న నాగాయలంక మండలం సొర్లగొందికి చెందిన ఫైబర్బోటును మరో పెద్దబోటు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సొర్లగొందికి చెందిన వాటపల్లి వీరనారాయణ (55), కొక్కిలిగడ్డ భిక్షం (45) మరణించారు. మిగిలిన నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. పోలీసుల విచారణలో వీరి వద్ద లైఫ్ జాకెట్లు లేవని తేలింది. మత్స్యకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వటంలోనూ జాప్యం చేస్తున్నారని మత్స్యకారులు చెబుతున్నారు. -
తెప్ప బోల్తా.. మత్స్యకారుడు గల్లంతు
శ్రీకాకుళం : చేపల వేటకు వెళ్లి తెప్ప బోల్తా పడి ఓ మత్స్య కారుడు గల్లంతయ్యాడు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం అల్లివలస తీరంలో ఆదివారం చోటుచేసుకుంది. మొత్తం ఏడుగురు మత్స్యకారులు తెప్పలో చేపల వేటకు వెళ్లారు. ఈ క్రమంలో తెప్ప బోల్తా పడటంతో ఆరుగురు సురక్షితంగా ఒడ్డుకు చేరగా.. ఓ మత్స్యకారుడు మాత్రం గల్లంతయ్యాడు. అతని కోసం మత్స్యకారులు గాలింపు చర్యలు చేపట్టారు. -
చేపా..చేప ఎందుకు రాలేదు?
గడువు దాటి 7 నెలలు గడుస్తున్నా అరణియార్ ప్రాజెక్ట్‌లో చేపపిల్లలను వదలని వైనం అధికారుల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం శూన్యం ఉపాధి కోల్పోరుు వీధిన పడుతున్న మత్స్యకార్మిక కుటుంబాలు జిల్లాలో అతిపెద్ద రిజర్వాయర్ అరణియార్‌లో నిండా నీరున్నా అధికారుల నిర్లక్ష్యం వుత్స్యకారులకు శాపంగా మారింది. దశాబ్దాల తర్వాత గత ఏడాది చివర్లో కురిసిన వర్షాలతో ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో నిండింది. గడువు దాటి 8 నెలలు గడుస్తున్నా చేప పిల్లలను వదలక పోవడంతో 2వేల మందికి పైగా లెసైన్స్డ్ మత్స్యకారులు బతుకుదెరువు కోల్పోతున్నారు. రిజర్వాయుర్‌లో పది అడుగులు నీరున్నా ఏటా అక్టోబర్‌లో 10 లక్షల చేపపిల్లలు వదిలేవారని, పుష్కలంగా నీరున్నా ఎందుకు వదలడం లేదోనని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. పిచ్చాటూరు:అరణియూర్ ప్రాజెక్టులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వుత్స్యశాఖ బోర్డు అధ్వర్యంలో ఏటా అక్టోబర్‌లో బయట నుంచి చేపపిల్లలు తెచ్చి రిజర్వాయుర్‌లో వదులుతున్నారు. పదేళ్లుగా ఏ టా కనీసం 10 లక్షలు చేపపిల్లలు వదులుతున్నారు. అవి పెరిగి పెద్దదైతే వా టిని పట్టి అమ్ముకుంటూ మత్సకార్మికుల కుటుంబాలు జీవనం సాగించేవి. ఇందుకోసం చుట్టు పక్కల గ్రామాలకు చెందిన సుమారు 2 వేల వుంది మత్స్యకార్మికులు రిజర్వాయుర్‌లో చేపలు పట్టేందుకు ప్రభుత్వం నుంచి లెసైన్సులు సైతం పొంది ఉన్నా రు. దశాబ్దాల తరువాత అరణియార్ రిజర్వాయర్ గత ఏడాది నవంబర్‌లో కురిసిన భారీ వర్షాలకు పూర్తి స్థారుులో నిండింది. ఈ నీటిలో ప్రభుత్వం చేప పిల్లలను విడుదల చేస్తే సువూరు రెండేళ్ల వరకు తవు జీవనోపాధికి కొదవ ఉండదని మత్స్యకార్మికులు సంబరపడ్డారు. కానీ గత ఏడాది అక్టోబర్‌లో వదలాల్సిన చేపపిల్లలను ప్రభుత్వం ఇంతవరకు వదల లేదు. తామ బతుకు తెరువును కోల్పోతున్నామని మత్స్యకారులు వాపోతున్నారు. పట్టించుకోని అధికారులు.. రిజర్వాయుర్‌లో చేపపిల్లలు వదలడానికి గడువుదాటి ఏడు నెలలు కావస్తున్నా మత్స్యశాఖ అధికారులకు కనీసం చీమకుట్టినట్లు కూడా లేదని మత్స్యకార్మికు లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిజర్వాయుర్‌లో చేపపిల్లలు వదలాల్సిందిగా అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఫలితం లేకుండా పో తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై బోర్డు అధికారులను వివరణ కోరగా, తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు అందలేదని తెలిపారు. అధికారులు స్పందించాలి.. రిజర్వాయుర్‌లో చేపపిల్లలను వదలాలి. లేదంటే మాకు ఆత్మహత్యలు చేసుకోవడం తప్ప వేరే దారిలేదు. ఆరు నెలలుగా రిజర్వాయర్‌లో చేపలు దొరకడం లేదు. రోజూ చేపల వేటకు వెళ్లడం వల్ల మాకు కష్టం తప్ప ఇంకేమి మిగలడం లేదు. -కె.బాబు రెడ్డి, వుత్స్యకార్మికుడు, పిచ్చాటూరు కుటుంబాలు వీధినపడుతున్నాయి... రిజర్వాయర్‌లో చేపలు పడక కుటుంబాలు వీధిన పడుతున్నాయి. రిజర్వాయర్‌లో కనీసం 10 అడుగు లు నీరు ఉన్నప్పుడు కూడా పది లక్షల చేపపిల్లలు వదిలేవారు. ఈసారి చేప పిల్లలను ఎందుకు వదలడం లేదో అంతుపట్టడం లేదు. పూట గడవటం కష్టంగా ఉంది. -రాఘవరెడ్డి, మత్స్యకార్మికుడు కీళపూడి -
గల్లంతైన మత్స్యకారుల మృతదేహాల గుర్తింపు
నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి గ్రామంలోని చెరువులో గల్లంతైన ఇద్దరు మత్స్యకారుల మృతదేహాలను ఆదివారం గుర్తించారు. పెద్దదేవులపల్లి గ్రామానికి చెందిన సుమారు 200 మంది మత్స్యకారులు శనివారం సాయంత్రం గ్రామం సమీపంలోని చెరువులో వలలు వేయడానికి వెళ్లారు. చేపల వేటకు వీలుగా నీటిలో వలలు విడిచి తిరిగి రాగా, ముగ్గురు మాత్రం తెప్ప తిరగబడడంతో గల్లంతయ్యారు. వారిలో అంబటి వెంకన్న మృతదేహం రాత్రి ఒడ్డుకు కొట్టుకువచ్చింది. వడ్డి సోమయ్య (50), నాగయ్య (22) మృతదేహాలను ఆదివారం ఉదయం గాలింపు చర్యల్లో భాగంగా గుర్తించారు. ఇక్కడి చెరువు భారీ విస్తీర్ణంలో ఉంటుంది. భారీ ఈదురు గాలులకు చెరువు మధ్య భాగంలో తెప్ప తిరగబడడం వల్ల అక్కడి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒడ్డుకు ఈదుకుంటూ రాలేకపోయి ఉంటారని తోటి మత్స్యకారులు అంటున్నారు. కాగా, ప్రమాదం జరిగిన చెరువును జిల్లా కలెక్టర్ సత్యనారాయణ ఆదివారం ఉదయం పరిశీలించారు. ఆర్డీవో, డీఎస్పీలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వ పరంగా అన్నిరకాల సాయం అందించే కృషి చేస్తామన్నారు. -
మత్స్యకారుల భగీరథ ప్రయత్నం
► చెరువులోకి బావుల నీళ్లు మళ్లింపు ► చేపలు మృత్యువాత పడకుండా ప్రత్యామ్నాయం కేసముద్రం : రూ.లక్షలు వెచ్చించి చెరువుల్లో పోసిన చేపపిల్లలు పెద్దవయ్యూక పట్టి అమ్ముకోవడం ద్వారా నాలుగు రాళ్లు సంపాదించుకోవచ్చన్న మత్స్యకారులు ఆశలు ఆవిరవుతున్నారుు. ఎండ వేడితో చెరువుల్లో నీరు అడుగంటుతుండగా చేపలు చనిపోరుు తేలుతున్నారుు. దీంతో ఏం చేయూలో పాలుపోని మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో వారికో ఆలోచన వచ్చింది! ఇంకేం అనుకున్నదే తడవుగా ఆలోచనను ఆచరణలో పెట్టి తమ జీవనాధారమైన చేపలను బతికించుకునే యత్నాలు ఆరంభించారు. కేసముద్రం మండలంలోని కోరుకొండపల్లి గ్రామానికి చెందిన మంగి ఉప్పలయ్య రూ.2లక్షల విలువైన చేపపిల్లలను ఊరచెరువులో పెంపకానికి వేశాడు. ఎండల కారణంగా నీరు అడుగంటి రెండు టన్నుల చేపలు మృత్యువాత పడ్డారుు. ఎండతో చెరువు మూడు పాయలుగా విడిపోగా.. ఓ పాయలోనే కొద్ది మేర నీళ్లు ఉన్నారుు. దీంతో మిగతా పాయల్లోని చేపలను పట్టి పెద్ద పాయలో వేరుుంచాడు. అరుుతే, అక్కడ కూడా నీరు అడుగంటుతోందనే భావనతో పక్కనే ఉన్న ఇద్దరు రైతులకు రూ.30వేలు చెల్లించి నీటిని కందకాల ద్వారా చెరువులోకి మళ్లించాడు. ఈ విధంగా వేడెక్కిన నీళ్లను చల్లబర్చడంతో పాటు చేపలను బతికించుకోవాలని లీజుదారుడు ఉప్పలయ్య పడుతున్న తపన భగీరథ ప్రయత్నాన్ని తలపిస్తోంది. -
మత్స్య పరిశ్రమ అభివృద్ధికి కృషి
మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం(చిలకలపూడి) : మత్స్యకారుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మత్స్యపరిశ్రమ అభివృద్ధికి కృషి చేయనున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశపు హాలులో గురువారం జాతీయ సముద్ర మత్స్యవిధానం-2016పై తీరప్రాంత మత్స్యకారుల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రి మాట్లాడుతూ రాబోయే పదేళ్ల కాలానికి జాతీయస్థాయి మత్స్యప్రణాళిక తయారుచేసేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. గత సంవత్సరం మత్స్యరంగంలో 36శాతం వృద్ధి నమోదైనప్పటికీ సముద్రజలాల్లో అనుకున్నంత స్థాయిలో మత్స్య ఉత్పత్తులు లభించటం లేదన్నారు. నిర్ధిష్టమైన ప్రణాళిక, పర్యవేక్షణ కొరవడి మత్స్యవనరులను తగ్గుముఖం పట్టిస్తున్నాయన్నారు. అర్హులందరికీ ఆయిల్ సబ్సిడీ అందివ్వాలని సూచించారు. చేపల వేట నిషేధ కాలంలో బియ్యం మాత్రమే ఇచ్చేవారని తమ ప్రభుత్వం రూ. 4వేలు ఇచ్చేందుకు కృషి చేసిందన్నారు. మత్స్యకారుల గృహనిర్మాణ వ్యయాన్ని రూ.5 లక్షలకు పెంచే ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. మత్స్యసంపద పాడవ్వకుండా కోల్డ్‌స్టోరేజీ నిర్మాణాలు చేస్తామన్నారు. సముద్రముఖద్వారం పూడికతీయటం, జెట్టీలు అదనంగా నిర్మించటంపై దృష్టి సారించినట్లు చెప్పారు. చేపల వేటకు వెళ్లి మరణించిన మత్స్యకార కుటుంబాలను ఆదుకునేం దుకు బీమామొత్తాన్ని రూ.10లక్షలకు పెంచే యోచన చేస్తున్నామన్నారు. రేపు మునిసిపల్ కార్యాలయ భవనానికి శంకుస్థాపన మచిలీపట్నం మునిసిపల్ కార్యాలయ నూతన భవనానికి శనివారం మునిసిపల్‌శాఖ మంత్రి పి.నారాయణ శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ చల్లపల్లి బైపాస్ రోడ్డును ఆర్‌అండ్‌బీశాఖ మంత్రి సిద్దా రాఘవరావు ప్రారంభిస్తారన్నారు. కలెక్టరేట్లో ఎంఏడీఏ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి భూసమీకరణ కోసం 15 రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామన్నారు. 45 రోజుల్లో పోర్టు శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి చెప్పారు. మంగినపూడి బీచ్‌ను అధునాతనంగా తీర్చిదిద్దేందుకు రూ.10 కోట్ల అంచనాలతో ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. మచిలీపట్నం తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో ఇంకుడు గుంట పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల జగన్నాధరావు (బుల్లయ్య), మునిసిపల్ చైర్మన్ బాబాప్రసాద్, ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీ లంకే నారాయణప్రసాద్, మత్స్యశాఖ డీడీ సాల్మన్‌రాజు, బందరు ఆర్డీవో పి సాయిబాబు, కాకినాడ మత్స్యశిక్షణా కేంద్రం వైస్‌ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తహసీల్దార్ నారదముని, ఎంపీడీవో జీవీ సూర్యనారాయణ పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
వలలకు విరామం
అమలులోకి వచ్చిన వేట నిషేధం జిల్లా వ్యాప్తంగా నిలిచిన 600 మెకనైజ్డ్, 3 వేల మోటరైజ్డ్ బోట్లు జూన్ 14 అర్ధరాత్రి వరకు ఇదే పరిస్థితి లక్ష మంది ఉపాధికి ఆటంకం కాకినాడ సిటీ : వలలు కడలికి దూరమయ్యాయి. వేట బోట్లు లంగరేసుకున్నాయి. నిత్యం కెరటాల దారుల్లో సాగుతూ, ఆ జలనిధి నుంచే జీవనోపాధిని పొందే ‘వేటగాళ్లు’ తీరానికే పరిమితమయ్యారు. సముద్ర జలాల్లో చేపలవేట నిషేధం గురువారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చింది. ఈ నిషేధం జూన్ 14 అర్ధరాత్రి వరకూ.. 61 రోజులు అమలులో ఉంటుంది. నిషేధంతో తూర్పుగోదావరి జిల్లాలో తీర ప్రాంతాల్లోని బోట్లు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. వేసవి కాలంలో చేపలు, రొయ్యలతో పాటు ఇతర సముద్ర జీవులు గుడ్లు పెట్టే సమయం కావడంతో చేపలు వేటాడడం వల్ల ఆ గుడ్లు పగిలి మత్స్యసంపద అభివృద్ధికి విఘాతం వాటిల్లే ప్రమాదముంది. ఈ కారణంగా ప్రభుత్వం ప్రతి సంవత్సరం వేట నిషేధాన్ని అమలు చేస్తోంది. గతంలో 45 రోజుల పాటు ఉండే నిషేధాన్ని గత ఏడాది నుంచి 61 రోజులకు పెంచింది. సంప్రదాయ బోట్లతో వేట సాగిస్తే పెద్దగా నష్టం లేకపోవడంతో వాటికి మినహాయింపు ఉంది. అయితే మోటరైజ్డ్, మెకనైజ్డ్ బోట్లు నిషేధకాలంలో సముద్రంలో చేపలవేటకు వెళ్లకూడదు. ఆ సమయంలో మత్స్యకారులు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఒక్కొక్కరికి రూ.4 వేల వంతున ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సారైనా పటిష్టంగా అమలయ్యేనా..? జిల్లాలోని సుమారు 144 కిలోమీటర్ల సముద్ర తీరంలో సుమారు 600 మెకనైజ్డ్, మూడువేల వరకు మోటరైజ్డ్ బోట్లు సముద్రంలో చేపలవేట సాగిస్తున్నాయి. వీటిపై దాదాపు లక్ష మంది మత్స్యకారులు, ఇతర వర్గాలవారు ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ప్రతి సంవత్సరం వేట నిషేధాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాల్సిన అధికారులు మాత్రం చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల మత్స్యకారుల నుంచి మత్స్యశాఖాధికారులు సొమ్ములు దండుకుని వేట నిషేధాన్ని నీరుగారుస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఈ సంవత్సరం నిషేధాన్ని పటిష్టంగా అమలు చేసేలా జిల్లా యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మత్స్యకార నాయకులు కోరుతున్నారు. -
అవసాన దశలో ఆ జాతి మత్స్యసంపద
అత్యంత ప్రమాదకర స్థితిలో 60 రకాలు కాలుష్య కాసారంగా సముద్ర తీరం అవగాహనలేక వేటాడుతున్న మత్స్యకారులు సాక్షి ప్రతినిధి, కాకినాడ: షార్క్.. అచ్చతెలుగులో చెప్పాలంటే సొరచేప! మత్స్యరాశులకు రాజులాంటిది! రూపం, లక్షణాల రీత్యా వివిధ జాతులుగా ఉన్నా మత్స్యకారులకు వలలకు చిక్కాయంటే వారికి పండుగే! గత కొన్నేళ్లుగా అవి వలలకు చిక్కడం లేదు. మత్స్యకారుల్లో ఆ సందడికనిపించడం లేదు. జిల్లాలో ఉప్పాడ నుంచి అంతర్వేది వరకూ ఉన్న నదీముఖద్వార సముద్రతీర ప్రాంతంలో ఒకప్పుడు విరివిగా దొరికే సొరచేపలు ఇప్పుడు అంతరించిపోతున్న మత్స్యజాతుల్లోకి చేరిపోయాయి. కారణం ఎవరూ అంటే.. ‘వేరెవరో కాదు.. కచ్చితంగా మనమే’ అని సమాధానం వస్తోంది పర్యావరణవేత్తల నుంచి! ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన జలచర జాతులు దాదాపు 1,700 వరకూ ఉంటే వాటిలో 93 జాతులు ప్రమాదకరస్థాయిలో అంతరించిపోతున్న (క్రిటికల్లీ ఎన్డేంజ ర్డ్) జాబితాలో చేరిపోయాయి. వాటిలో 60 రకాల చేపలు మన జిల్లా తీరంలో సందడి చేసినవే. పొడవైన ముక్కుతో చూపరులను భయపెట్టే చిన్నరంపపు సొర (స్మాల్టూత్ సాఫిష్), రంపపు సొర (లాంగ్కాంబ్ సాఫిష్) గత పదిహేనేళ్లుగా అసలు కనిపించడం లేదు. అలాగే ఒకప్పుడు మాంసాహార ప్రియుల ఇళ్లలో కనీసం వారానికి ఒకసారైనా నోరూరించిన పాలసొర (పాండిచ్చేరి షార్క్) గత ఏడేళ్లుగా కానరావడం లేదు. ఇది కూడా ప్రమాదకరస్థాయిలో అంతరించిపోతున్న జాతుల జాబితాలో చేరిపోయింది. అలాగే సముద్ర బొచ్చు అని పిలిచే విదేశీ చేప ఎర్ర వెంపలి (విక్టోరియా తిలాపియా) జాడ కూడా కొద్దిరోజులుగా కరువైంది. జిల్లా సముద్రతీరంలో ఎక్కువగా దొరికే యాల-రంపపు సొర (నైఫ్టూత్ సాఫిష్), పంజు (స్లిప్పెరే సిలూరాయిడ్), సుత్తితల చేప (స్కాల్లోపెడ్ హేమర్‌హెడ్), కొమ్ము సొర (గ్రేట్ హేమర్‌హెడ్) అంతరించిపోతున్న మత్స్యజాతుల జాబితాలో ఉన్నాయి. ఇటీవల ఇవి సముద్రంలోనే చనిపోతుండగా కళేబరాలు తరచుగా తీరానికి కొట్టుకొస్తున్నాయి. మరి కొన్నింటిపైనా మృత్యుఛాయ మత్స్యకారుల వలలో తరచుగా చిక్కుకునే జాతుల్లో గున్న సొర (వేల్ షార్క్) ఒకటి. శరీరం నిండా చక్కని చుక్కలతో ఆకర్షించే ఇది కొన్ని రోజులకు కనిపించకుండా పోయే ప్రమాదం ఉంది. జీబ్రా సొరది కూడా అదే పరిస్థితి. అలాగే హనుమంతు సొర, లెమన్ షార్క్, కొమ్ము సొర, తిరగల దిండి (బోమౌత్ గుయిటర్ ఫిష్), ఉలవ, టిప్పు ఉలవ తదితర రకాల చేపలకు ప్రమాదం పొంచి ఉంది. మన తీరంలో ఎక్కువగా కనిపించే టేకి చేపలదీ అదే పరిస్థితి. టేకి, పులిటేకి, తప్పుకూటి, మూకర టేకి, దెయ్యపు టేకి తదితర జాతులకు ముప్పు పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువమంది ఆహారంగా తీసుకునే ఎర్రమోసు, చైనా బొచ్చు, మూర (బిగ్‌ఐ టూనా) చేపలు కూడా కొన్ని రోజులకు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అవగాహన లేమే అసలు సమస్య 1980 దశకంలో మెకనైజ్డ్ (మర) బోట్లతో చేపల వేట మొదలైన తర్వాత మత్స్యసంపద క్రమేపీ తగ్గిపోవడం ప్రారంభమైంది. ఇక ఇప్పుడు రెండున్నర మిల్లీమీటర్ల కన్నా తక్కువ పరిమాణం కన్నులు ఉన్న వలలను.. అదీ రెండు పొరలున్నవి వాడుతుండటం మరీ ఎక్కువైంది. దీంతో సముద్రగర్భంలో దొరికే మత్స్యజాతులన్నింటినీ ఒడ్డుకు చేర్చేస్తున్నారు. తినే చేపలను అమ్ముకొని, మిగతా (దాదాపు 60 శాతం) వాటిని కోళ్ల మేత (ఫీడ్) తయారుచేసే పరిశ్రమలకు తరలిస్తున్నారు. వాటిలో చేపలే కాదు వాటి గుడ్లు కూడా పోతున్నాయి. సహజంగా సొరచేపలు, టేకి జాతి చేపలు రెండు మూడేళ్లకు ఒకసారే గుడ్లు పెడతాయి. అదీ ఆగస్టు నుంచి నవంబరు వరకూ సీజన్లోనే. వాటిలో అధికభాగం వలలకు చిక్కుతుండటంతో ఆయా మత్స్యజాతుల ఉనికే ప్రమాదంలో పడుతోంది. మరబోట్లు, వలల వినియోగం, సముద్రంలో ఎంతమేర వేట సాగించాలనే విషయాలపై ఏపీ మెరైన్ ఫిషింగ్ రెగ్యులేషన్ యాక్ట్‌లో స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. అయితే వాటిని అమలు చేసే అధికారులు కానీ, వాటి గురించి మత్స్యకారుల్లో అవగాహన కల్పించే యంత్రాంగం కానీ లేకపోవడం పెద్ద లోటు. కాలుష్యమూ సమస్యే.. జిల్లాలో ఒక్క కాకినాడ నుంచే సగటున రోజుకు 37 లక్షల లీటర్ల మురుగునీరు సముద్రంలో కలుస్తోంది. చివరకు పరిశ్రమల నుంచి విడుదలయ్యే వ్యర్థాలను శుద్ధి చేయకుండానే వదిలేస్తున్నారు. తప్పనిసరి అవసరమే అయినా గోదావరి బేసిన్లో చమురు, సహజవాయువు వెలికితీత కార్యక్రమాల ప్రభావం కూడా మత్స్యసంపదపై పడుతోంది. -
రొయ్య @ రూ.600
సముద్రంలో వేటకు వెళ్లిన ఓ మత్య్స కారుడికి ఓ భారీ రొయ్య దొరికింది. తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలం కరవాక వద్ద చింతా కాసులు అనే మత్స్యకారుడువేటకువెళ్లాడు. అతని వలలో 1,200 గ్రాముల బరువైన భారీ రొయ్య పడింది. దీన్ని కొనేందుకు పెద్ద సంఖ్యలో జనం ఆసక్తి చూపారు. చివరకి ఈ రొయ్యను రూ.600కు విక్రయించారు. ఇది ఆళ్ల జాతికి చెందిన రొయ్యగా మత్స్యకారులు తెలిపారు. -
నడి సంద్రంలో ధర్నా, జల్‌రోకో
సాధారణంగా ధర్నా, ముట్టడి వంటి ఆందోళన కార్యక్రమాలు నేలపై ఉండే ప్రభుత్వ లేదా సంస్థలకు చెందిన కార్యాలయాల ఎదుట జరుగుతుంటాయి. రోడ్లపై రాస్తారోకోలు నిర్వహిస్తుంటారు. అందుకు భిన్నంగా మత్స్యకారులు నడిసంద్రంలో ధర్నా, ముట్టడి, జల్ రోకో నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం చినమైనవానిలంక వద్ద నడి సముద్రం దీనికి వేదికైంది. బుధవారం చోటుచేసుకున్న ఈ సంఘటనకు పూర్తి వివరాలు.. సముద్ర గర్భంలో చమురు నిక్షేపాలు గుర్తించేందుకు చినమైనవానిలంక తీరానికి 10 కిలోమీటర్ల దూరంలో సముద్రం మధ్యన ఓఎన్జీసీ అధికారులు సర్వే చేపట్టారు. దీంతో ఆగ్రహించిన సుమారు 400 మంది మత్స్యకారులు బుధవారం ఉదయం 40 బోట్లలో 10 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి సముద్రం మధ్యకు వెళ్లారు. అక్కడ సర్వే పనుల్లో పాల్గొంటున్న 8 ఓడలను ముట్టడించారు. బోట్లను నిలిపివేసి జల్‌రోకో చేశారు. అనంతరం మత్స్యకార పెద్దలు ఓఎన్జీసీ ఓడల్లోకి వెళ్లి ధర్నా జరిపారు. సర్వే వల్ల తమ ఉపాధికి గండిపడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు, సిబ్బంది సముద్రంలోనే మత్స్యకారులతో చర్చలు జరిపారు.ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి రెండు రోజుల్లో సమస్యను పరిష్కరించి న్యాయం చేస్తామని వారు హామీ ఇవ్వడంతో మత్స్యకారులు శాంతించారు. -నరసాపురం రూరల్ -
సముద్రంలో మత్స్యకారుడి గల్లంతు
అచ్యుతాపురం (విశాఖపట్నం) : సముద్రంలో దరివేటకు వెళ్లిన యువకుడు పడవ బోల్తా కొట్టి గల్లంతయ్యాడు. ఈ సంఘటన విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక సమీపంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గంటాలయ్య(21) వేటకు వెళ్లి పడవ బోల్తా కొట్టడంతో గల్లంతయ్యాడు. ఇది గుర్తించిన తోటి జాలరులు అతని కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. -
బోటు తిరగబడి మత్స్యకారుడు మృతి
కవిటి (శ్రీకాకుళం) : సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుడు బోటు తిరగబడి మృతిచెందాడు. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం బెజ్జిపుట్టుగ గ్రామానికి చెందిన వి.ముకుంద(38) చేపలు పట్టుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున ఐదుగురు మత్స్యకారులతో కలిసి వేటకు వెళ్లాడు. ఈ క్రమంలో బోటు బోల్తా కొట్టడంతో.. నీట మునిగి మృతిచెందాడు. దీంతో తోటి మత్స్యకారులు అతని మృతదేహాన్ని తీరానికి తీసుకొచ్చారు. -
తీరం చేరని సంక్షేమం
కడలిని నమ్ముకున్న వారికి కన్నీళ్ల్లు ఎన్నాళ్లైనా ఆటుపోట్ల జీవితమే నేడు మత్స్యకార దినోత్సవం సముద్రాన్నే నమ్ముకున్నారు. వారి జీవితమంతా నీటిలోనే. కష్టం వచ్చినా..సుఖం వచ్చినా...అన్నీ ఆ గంగమ్మతల్లే వారికి. వారు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వాల స్పందన కంటితుడుపునకేపరిమితం. మత్స్యవేట తప్ప మరో ఆధారం లేని కడలిపుత్రుల సంక్షేమం నీటి మీద రాతలా మారిపో యింది. వారు నడిపే పడవలాగే వారి జీవితాలు కూడా ఆటుపోట్లతో సహజీవనం చేస్తున్నాయి. డాబాగార్డెన్స్ : రాష్ట్రంలో ఉన్న తొమ్మిది కోస్తా జిల్లాల్లో సుమారుగా 60 లక్షల పైబడి మత్స్యకారులు సముద్రతీరాన్ని నమ్ముకున్నారు. ఎన్నికల ముందు మత్స్యకార ఓట్ల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా ఏ ఒక్క పథకం సక్రమంగా అమలు కావడం లేదనే ఆవేదన వారి నుంచి వినిపిస్తోంది. అంతేగాక సముద్రానే నమ్ముకున్న మత్స్యకారులను అభివృద్ధి పేరిట తీరం నుంచి దూరం చేస్తూ జీవనోపాధికి దెబ్బతీస్తున్నారన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. విశాఖజిల్లాలో 139 కిలోమీటర్ల తీరప్రాంతంలో 64 మత్స్యకార గ్రామాలున్నాయి. లక్షా 50 వేల పైబడి మత్స్యకారులు ఉన్నారు. రాష్ట్ర విభజన తరువాత రాష్ట్రంలో తొమ్మిది కోస్తా జిల్లాల్లో భవిష్యత్ అభివృద్ధి పేరిట వేల కోట్లలో అనేక పారిశ్రామిక, పర్యాటక పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదిస్తున్నారు. వీటి కోసం సముద్ర తీర ప్రాంతంతో పాటు పెద్ద ఎత్తున వ్యవసాయ భూములను భూసేకరణ చేపట్టడం జరుగుతోంది. దీంతో సంప్రదాయ మత్స్యకారులు, మత్స్యకార్మికులు, మహిళా కార్మికులు, రైతులు, దళితులు, యునాదిలు, చేతివృత్తి చేసుకుంటున్న వారందరి జీవనోపాధికి అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి. హుద్ హుద్..మిగిల్చిన వేదన హుద్‌హుద్ తుపాన్...ప్రధానంగా మత్స్యకారులకే తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. తుపాను బీభత్సానికి విశాఖ జిల్లా భీమిలి మండలం అన్నవరం గ్రామం నుంచి రాంబిల్లి మండలం వాడపాలెం వరకు 6429 ఇళ్లు కూలిపోయాయి. 185 ఇళ్లు పూర్తిగా సముద్రంలోకి కొట్టుకుపోయాయి. తుపాన్ బాధిత కుటుంబాలకు పలువురు దాతలిచ్చిన రూ.250 కోట్లు, ప్రభుత్వం రూ.250 కోట్లు, మౌలిక వసతుల కల్పనకు రూ.60 కోట్లు కలుపుకొని మొత్తంగా రూ.560 కోట్లతో ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో 10 వేల గృహాలు నిర్మించడానికి ప్రభుత్వం ప్రణాళిక తయారు చేయగా అందులో విశాఖ జిల్లాకు కేటాయించింది 6వేలు. ఇది కూడా కేవలం కాగితాలకే పరిమితమైంది. ఇప్పటి వరకు ఆయా గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక గానీ, భూసేకరణ జరగలేదు. మరపడవలు, ఫైబర్ బోట్లు కలిసి మత్స్యశాఖ నష్టపరిహారం రూ.206 కోట్లు అంచనా వెయ్యగా కేవలం రూ.17 కోట్లు ఇవ్వడం జరిగింది. అందులో ఇప్పటికీ నష్టపోయిన లబ్ధిదారులకు కేవలం రూ.తొమ్మిది కోట్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. చేపలు విక్రయించే మహిళలకు రూ.10వేలు ప్రభుత్వం ప్రకటించింది. అదీ కూడా ఫిషింగ్ హార్బర్లో ఉన్న వారికే. జీవనోపాధికి సవాలు... విశాఖ -కాకినాడ పెట్రోలియం కెమికల్, పెట్రో కెమికల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్(వీకేపీసీపీఐఆర్) ఏర్పాటుతో విశాఖ జిల్లా పెదగంట్యాడ నుంచి తూర్పుగోదావరి జిల్లా వాకలపూడి గ్రామం వరకు 10 మండలాల్లో ఉన్న 97 గ్రామాలను కలుపుకొంటూ 640 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 10 మండలాల్లో ఉన్న 55 మత్స్యకార గ్రామాల్లో ఉన్న ప్రజల జీవనోపాధి ప్రశ్నార్థకం కానుంది. విశాఖ నుంచి చెన్నై వరకు ఇండస్ట్రియల్ కారిడార్ పేరిట తీరప్రాంతాన్ని ఆనుకుని కొత్త పోర్టుల ఏర్పాటు, రహదారుల విస్తరణ, పెట్రో పరిశ్రమల ఏర్పాటును ప్రతిపాదిస్తున్నారు. దీనివల్ల స్థానిక ప్రజలకు ఎంత వరకు లాభం? ఎంత వరకు నష్టం? అనే అంశాలు ఎక్కడా చెప్పలేదు. ఇప్పటికే కాలుష్యం కారణంగా మత్స్యవేటకు నష్టం వాటిల్లుతుండగా, మరిన్ని పరిశ్రమల రాకతో సమస్య మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇవీ డిమాండ్లు.. 2014 సాధారణ సార్వత్రిక ఎన్నికల్లో సుమారు 60 లక్షల పైబడి ఉన్న మత్స్యకారుల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను పూర్తిగా అమలు చెయ్యాలి..హుద్‌హుద్ తుపాన్లో సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాలకు వెంటనే పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందివ్వాలి. రాష్ట్రంలో బీసీ-ఏలో ఉన్న మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్చాలి. లేదా పక్క రాష్ట్రాల్లో ఉన్న ఎంబీసీ రిజర్వేషన్ కల్పించాలి.తీరప్రాంతం, సముద్రంపై సమగ్రమైన హక్కుచట్టం కల్పించాలి. తీరప్రాంతం, సముద్ర సంప్రదాయ మత్స్యకారుల చట్టం-2009(రక్షణ హక్కు చట్టం) ముసాయిదా బిల్లును చట్టంగా చెయ్యాలి. మత్స్యకార మహిళలకు చేపల బజార్లలో చేపలు విక్రయించేందుకు మౌలిక సదుపాయాలు కల్పించాలి. మత్స్యకార మహిళలకు ప్రభుత్వం గుర్తింపు కార్డులివ్వాలి. తీరప్రాంత క్రమబద్దీకరణ మండలి(సీఆర్‌జెడ్)-2011 ముసాయిదాను చట్టం రూపంలోకి తీసుకురావాలి. ఎంఆర్ఎఫ్ చట్టం -1994ను పటిష్టంగా అమలు చెయ్యాలి. చేపల వేట నిషేధ కాలంలో పొరుగు రాష్ట్రాల్లో వలే బియ్యానికి బదులుగా 60 రోజులకు దినసరి కార్మిక వేతనం ప్రకారం రూ.12 వేలు నగదు ఇవ్వాలి. మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చెయ్యాలి. ఎస్టీ జాబితాలో చేర్చేందుకు దశాబ్ధాల పోరాటం.. రాష్ట్రంలో ఉన్న మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్పించాలంటూ ఐదు దశాబ్ధాలుగా పోరాటాలు చేస్తున్నా ఇప్పటికీ సాధ్యపడలేదు. పక్క రాష్ట్రాల్లో ఉన్న ఎంబీసీ రిజర్వేషన్ కూడా కల్పించడం లేదు. ప్రతిసారి ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న మత్స్యకారులను ఎస్టీ జాబితాలోకి చేర్చుతామని వాగ్దానాలు చేసి, అధికారంలోకి వచ్చిన తర్వాత హామీల మాట మరిచారు. హామీలే తప్ప..పరిష్కార మార్గాలేవి? ఎన్నో ప్రభుత్వాలు చూశాం. ఎందరో ప్రజాప్రతినిధులనూ చూశాం. ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు. ఒక్క వాగ్దానాన్నైనా నెరవేర్చారా అంటే ప్రశ్నార్థకమే. తీరప్రాంతం, సముద్ర సంప్రదాయ మత్స్యకారుల చట్టం-2009 (రక్షణ హక్కు చట్టం) ముసాయిదా బిల్లును చట్టంగా చెయ్యాలి. చేపల వేట నిషేధ కాలంలో పక్క రాష్ట్రాల మాదిరిగా బియ్యానికి బదులు 60 రోజులకు దినసరి కార్మిక వేతనం ప్రకారం రూ.12 వేలు నగదు ఇవ్వాలి. - తెడ్డు శంకర్, కార్యదర్శి, కోస్తా మత్స్యకార సంక్షేమ సంఘం మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్చాలి చేపల వేటే ఆధారంగా జీవనం సాగిస్తున్న మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్చి తగు న్యాయం చేయాలి. హుద్‌హుద్ తుపాన్లో నష్టపోయిన మత్స్యకారులకు రూ.10వేల ఆర్థిక సాయం ఇస్తామని చెప్పి ఇంతవరకూ ఇవ్వలేదు. మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్లు, ఫైబర్నావ, ఫైబర్బోట్లకు బకాయిపడ్డ డీజిల్ సబ్సిడీ వెంటనే విడుదల చేయాలి. రాష్ట్రంలోని అన్ని తీరప్రాంతాల్లో మినీ జెట్టీలు, గంగవరం, భీమిలి, మహారాణిపేట, భావనపాడు, కళింగపట్నం, నువ్వులరేవు, రేవుపోలవరం, వాడలరేవు, అంతర్వేది తదితర ప్రాంతాల్లో మినీ ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు చేయాలి. - అల్లిపిల్లి ఎల్లాజీ, ఆంధ్రప్రదేశ్ మత్స్యకారుల అభివృద్ధి సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
ఉలవపాడుబీచ్కు కొట్టుకొచ్చిన బోటు
ప్రకాశం జిల్లాలోని ఉలవపాడు బీచ్‌కు సోమవారం ఉదయం ఓ బోటు కొట్టుకు వచ్చింది. బోటుపై తమిళ అక్షరాలు ఉండటంతో తమిళనాడుకు చెందినదై ఉంటుందని భావిస్తున్నారు. తీరానికి బోటు వచ్చిన సమయానికి అందులో ఎవరూ లేరు. బోటును గమనించిన మత్స్యకారులు తీర ప్రాంత అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు బోటు ఎవరిదై ఉంటుంది.. బంగాళా ఖాతంలో నెలకొని ఉన్న పరిస్థితుల రీత్యా ఏదైనా ప్రమాదం జరిగి ఉంటుందా అనే కోణంలో విచారణ ప్రారంభించారు. -
పుట్టీ మునుగుతోంది..
షికారు లేదు.. మరో ఉపాధి తెలియదు ఆకలితో అలమటిస్తున్న మత్స్యకారుల కుటుంబాలు పస్తులుంటున్నా పట్టించుకోని ప్రభుత్వం విజయపురిసౌత్ : కృష్ణమ్మను నమ్ముకొని.. పుట్టీలనే ఆవాసంగా మార్చుకుని ఏటి ఒడ్డున జీవనం సాగిస్తున్న మత్స్యకారులు నేడు పూట గడవని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది సాగర్ జలాశయానికి కొత్తనీరు రాకపోవటంతో చేపల షికారు జరగడం లేదు. రోజు మొత్తం షికారు ప్రభుత్వంవైపు చూస్తున్నారు. ఒక్క కృష్ణా జిల్లాలో 1.75లక్షల ఎకరాల్లో నాట్లు పడకపోగా, పడినచోట పంటలు ఎండిపోయే దుస్థితి కళ్లకు కడుతున్నా ఈ జిల్లాలో అసలు కరువు మండలమే లేదని ప్రభుత్వం తేల్చేసింది. కరువు కోరలు చాస్తున్నా... కృష్ణా జిల్లాలో ఏటా 8.60 లక్షల ఎకరాలు సాగు విస్తీర్ణంగా ఉంటుంది. దీనిలో 6.34 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తుంటారు. ఈ ఏడాది ఇప్పటివరకు 4.64 లక్షల ఎకరాలే సాగు కాగా, మిగిలిన 1.70 లక్షల ఎకరాల్లో అసలు నాట్లు పడలేదు. డెల్టాలోని కాల్వల ద్వారా చివరి ప్రాంతాల్లోని భూములకు నీరు అందకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఆగస్టు 15నాటికల్లా సాగు నీరు విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు, మంత్రి దేవినేని ఆర్భాటంగా ప్రకటించినా నీరు విడుదల కాలేదు. అధికారులేమో సాగర్‌లో నీటిమట్టం తక్కువ ఉందని నీళ్లివ్వలేమని చెబుతున్నారు. 3,200 క్యూసెక్కులు మాత్రమే... ప్రస్తుతం పులిచింతలో 0.9 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. దీనిలో కొంత తాగునీటి అవసరాలకు కేటాయించి మిగిలిన నీటిని సాగునీటి కోసం విడుదల చేస్తున్నారు. రోజుకు 16 వేల క్యూసెక్కులు అవసరంకాగా, 3,200 క్యూసెక్కులు మాత్రమే వదులుతున్నారు. కృష్ణాలో 21 మండలాల్లో వర్షపాతం సైతం తక్కువ నమోదైంది. రాజధాని జిల్లా అనే కారణంతో కృష్ణాను కరువు జిల్లాల జాబితాలోకి చేర్చలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గుంటూరులో గగ్గోలు... రాష్ట్రప్రభుత్వం రెండో విడత ప్రకటించిన కరువు మండలాల జాబితాలో గుంటూరు జిల్లాకు చెందిన ఒక్క మండలం కూడా లేకపోవడం వ్యవసాయంపై ప్రభుత్వానికి ఉన్న చిన్నచూపును స్పష్టం చేస్తోంది. తక్షణం ప్రభుత్వం పునరాలోచన చేయాలని వ్యవసాయ నిపుణులు, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. జిల్లాలో ప్రస్తుతం సాగునీటి సరఫరా లేక ఎండిపోయిన పంటలను రైతులు దున్నేస్తున్నారు. వ్యవసాయ కార్మికులు ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్నారు. వాస్తవానికి వర్షపాతం, జిల్లా కలెక్టర్ల నివేదిక, పంట దిగుబడి తగ్గుదల తదితర కోణాల్లో కరువు మండలాలను ప్రకటించినట్టు ప్రభుత్వం పేర్కొంటోంది. అయితే మండల అధికారులు క్షేత్రస్థాయిలోని పరిస్థితులను పరిశీలించకుండా అధికార యంత్రాంగానికి నివేదిక పంపడం వల్లనే జిల్లాలో కరువు మండలాల సంఖ్య పెరగలేదనే అభిప్రాయం ఉంది. పల్నాడులో మిర్చి, పత్తి, ఇతర వాణిజ్య పంటలు సాగునీరులేక ఎండిపోతు న్నాయి. డెల్టాలో పొట్టదశకు చేరుకున్న వరిని కాపాడుకునేందుకు రైతులు కాల్వలోని నీటిని డీజిల్ ఇంజన్లతో తోడి పొలాలు తడుపుతున్నారు. రోజూ అయిదు లేదా ఆరుగంటలు డీజిల్ ఇంజన్లు వినియోగించడంతో ఖర్చులు తడిసిమోపెడై అప్పుల పాలవుతున్నారు. వినుకొండ, మాచర్ల, గురజాల, నరసరావుపేట, బాపట్ల నియోజకవర్గాల్లోని పంటలు పూర్తిగా ఎండిపోయి రైతులు ఆందోళన చెందుతున్నారు. బాపట్ల నియోజకవర్గంలో ఎండిపోయిన వరిపొలాలను రైతులు దున్నేస్తున్నారు. నరసరావుపేట రూరల్, రొంపిచర్ల మండలాలు, వినుకొండలోని శావల్యాపురం, నూజెండ్ల మండలాల్లో కరువు పరిస్థితులు మరింత దుర్భరంగా ఉన్నాయి. వైఎస్సార్ సీపీ వినతి... సాగునీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) , గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కోన రఘుపతి, నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు రావి వెంకట రమణ, జంగా కృష్ణమూర్తి, అన్నాబత్తుని శివకుమార్ తదితరులు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీధర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. -
ఎదురీత
పడిపోయిన చేపల లభ్యత నిలిచిన ఎగుమతులు 75 శాతం ఒడ్డునపడ్డ బోట్లు మత్స్యకారులు విలవిల విశాఖపట్నం: మత్స్యకారులు నష్టాల కడలిలో ఈదుతున్నారు. ప్రకృతి కరుణించక పల్టీలు కొడుతున్నారు. పుష్కలంగా చేపలు లభ్యం కావలసిన సమయంలో వాటి జాడలేక ఉసూరుమంటున్నారు. దాదాపు నెల రోజుల నుంచి వేట ఆశాజనకంగా సాగక వందలాది బో ట్లను జెట్టీలకే పరిమితం చేశారు. మరోవైపు ఎగుమతులూ నిలి చిపోయాయి. విశాఖ నుం చి సుమారు 650 మరబోట్లు వేట సాగిస్తుం టాయి. వీటిలో నిత్యం 40-50 బోట్లు చేపలతో హార్బర్‌కు చేరుకుంటాయి. చేపల ల భ్యత బాగుంటే ఒక్కో బోటు సగటున మూ డు టన్నుల వరకు తెస్తా యి. ఇలా కనీసం రోజుకు 100 టన్నుల చేపలు హార్బర్‌కు వస్తాయి. వీటిలో మూడొంతులు తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాలకు ఇన్సులేటెడ్ వాహనాల్లో ఎగుమతి అవుతుంటాయి. మిగిలినవి స్థానిక అవసరాలకు వినియోగమవుతాయి. కానీ కొన్నా ళ్ల నుంచి ఆయా రాష్ట్రాలకు ఎగుమతులు నిలి చిపోయాయి. అక్కడ ప్రస్తుతం చేపల విని యోగం తగ్గించడం, ఆయా ప్రాంతాల్లోనూ స్థానిక అవసరాలకు సరిపడినంతగా చేపలు లభ్యత వంటి కారణాలతో ఎగుమతులు లేకుం డా పోయాయని చెబుతున్నారు. ఎగుమతుల్లేక స్థానిక అవసరాలకు మించి చేపలు హార్బరులో దొరకడం వల్ల ధరలు గణనీయంగా పడిపోయాయి. దీంతో ఆరు కిలోల బరువుండే బుట్ట చేపలు (పెద్ద, బల్ల గులివిందలు, పారలు, బడేమట్టలు వంటి రకాలు) ధర రూ.600ల నుంచి 400లకు పడిపోయింది. వీటిలో చిన్నరకాలైతే రూ.450 నుంచి 200లకు దిగజారింది. ఫలితంగా గిట్టుబాటు ధర రాక మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో 75 శాతానికి పైగా బోట్లను ఫిషింగ్ హార్బర్‌లోనే లంగరేసి ఉంచేశారు. అందులో పనిచేస్తున్న కళాసీలు ఇళ్లకే పరిమితమయ్యారు. సీజన్లో అన్‌సీజన్.. అక్టోబర్ నెల నుంచి సముద్రంలో చేపలు విరివిగా చిక్కుతాయి. అందువల్ల ఈ సీజనులో లాభాలొస్తాయని మత్స్యకారులు సంబరపడతారు. ప్రస్తుతం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. దీంతో పది, పదిహేను రోజులకు సరిపడా సరంజామాతో బోట్లలో వేటకెళ్లే వారు.. అరకొర చేపలే దొరకడం వల్ల వారం రోజులకే వెనక్కి తిరిగొచ్చేస్తున్నారు. చేపల సీజనుగా భావించే అక్టోబర్‌లో ఇలాంటి పరిస్థితి మునుపెన్నడూ లేదని వైశాఖి డాల్ఫిన్ బోటు ఆపరేటర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సీహెచ్. సత్యనారాయణమూర్తి ‘సాక్షి’కి చెప్పారు. జులై, ఆగస్టుల్లో వేట బాగుంద న్న సంతోషం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రుతుపవనాలు ఆశాజనకంగా లేకపోవడంతో పాటు అండర్ వాటర్ కరెంటు (మత్స్యకారులు ఒడుసుగా పేర్కొంటారు) ఎక్కువగా ఉండడం కూడా చేపల లభ్యత తగ్గడానికి ఒక కారణమని రాష్ట్ర మరపడల సంక్షేమ సంఘం అధ్యక్షుడు పీసీ అప్పారావు అభిప్రాయపడ్డారు. -
వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి
రేపల్లె (గుంటూరు) : చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు ప్రమాదవశాత్తూ కృష్ణానదిలో పడి మృతిచెందిన సంఘటన గుంటూరు జిల్లా రేపల్లె మండలం లంకెవాని దిబ్బలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నాగేశ్వర్రావు(40) సోమవారం ఉదయం కృష్ణానదిలో వేటకు వెళ్లాడు. ఈ క్రమంలో నదిలో పడి గల్లంతయ్యాడు. ఇది గుర్తించిన స్థానికులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టగా అతని మృతదేహం లభ్యం అయింది. -
వేట సాగిస్తూ మత్స్యకారుడు హఠాన్మరణం
అచ్యుతాపురం (విశాఖ జిల్లా) : వేట సమయంలో గుండెపోటు రావడంతో ఓ మత్స్యకారుడు సముద్రంలోనే హఠాన్మరణం చెందాడు. విశాఖ జిల్లా పూడిమడకకు చెందిన వాసుపల్లి నూకరాజు (40) తోటి మత్స్యకారులతో కలసి వేటకు వెళ్లాడు. గుండెపాటు రావడంతో పడవలోనే కుప్పకూలిపోయాడు. దీంతో తోటి మత్స్యకారులు మంగళవారం పూడిమడక తీరానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. -
చేపల వేటకెళ్లి మత్స్యకారుడు మృతి
పి.గన్నవరం (తూర్పుగోదావరి) : గోదావరి నదిలోకి చేపలవేటకు వెళ్లి మత్స్యకారుడు మృతిచెందిన సంఘటన పి.గన్నవరం మండలం కె.ముంజవరం వద్ద గోదావరిలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. కె.ముంజవరం గ్రామానికి చెందిన మల్లాడి పెద అచ్చయ్య(44) అనే మత్స్యకారుడు ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో చేపలు పట్టడానికి తన పడవలో గోదావరి నదిలోకి వెళ్లాడు. చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తూ నదిలో పడి చనిపోయాడు. ఆయన మృతదేహాన్ని తోటి మత్స్యకారులు వెలికి తీశారు. -
చంద్రబాబును నిలదీసిన మత్స్యకారుడు
విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండో రోజు పర్యటనలో భాగంగా ఆదివారం విశాఖ పట్నంలో ఫిష్ మార్కెట్‌ను పరిశీలించారు. ఈ నేపథ్యంలో ఓ మత్య్సకార యువకుడు ఫిష్ మార్కెట్ వద్ద చంద్రబాబును ఉద్యోగం లేదంటూ నిలదీశాడు. తాను డీఎస్సీ క్వాలిఫై అయినా ఉద్యోగం లేదని యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. దాంతో చంద్రబాబు ఆ యువకుడికి సర్దిచెప్పినట్టు తెలిసింది. వైఎస్ఆర్ పార్క్ వద్ద యాచకురాలికి రూ. 2 వేలు చంద్రబాబు ఇచ్చారు. అనంతరం రాజీవ్ స్మతిభవన్ను చంద్రబాబు సందర్శించారు. -
వేటకు వెళ్లి మత్స్యకారుడు గల్లంతు
పి. గన్నవరం: తూర్పుగోదావరి జిల్లాలో ఓ మత్స్యకారుడు గల్లంతయ్యాడు. ఈ ఘటన జిల్లాలోని పి.గన్నవరం మండలంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. మండలంలోని కె.ముంజవరం గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు(38 ) ఈ రోజు ఉదయం చేపల వేటకు వెళ్లాడు. అయితే ప్రమాదవశాత్తు సముద్రంలో పడి గల్లంతయ్యాడు. దీంతో బాధితుడి కుటుంబం విషాదంలో మునిగిపోయింది. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆంక్షలతో చేపల వేటకు ఇబ్బంది
వాపోతున్న మత్స్యకారులు ఆంక్షల వల్ల వేట మానుకోవాల్సి వస్తోందని ఆవేదన గుజరాత్ విధానం అమలు చేయాలని డిమాండ్ సాక్షి, ముంబై : తీర ప్రాంత భద్రత నెపంతో పోలీసులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని మత్స్యకారులు వాపోతున్నారు. ఆంక్షలు విధించడంతో చేపల వేటను మానుకోవాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. రెక్కాడితేగాని డొక్కాడని తమకు చేపల వేటే జీవనాధారమని మచ్చీమార్ కృతి సమితి అధ్యక్షుడు దామోదర్ తాండేల్ అన్నారు. తీర ప్రాంత భద్రతలో భాగంగా గుజరాత్ ప్రభుత్వం మత్స్యకారుల లాంచీలకు జీపీఎస్ పరికరం అమర్చుతోందని, ఆ విధానాన్ని రాష్ట్రంలోనూ అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. నగరానికి ఉగ్రదాడుల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో పోలీసులు తీర ప్రాంత భద్రతను కట్టుదిట్టం చేశారు. అందులో భాగంగా చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు లాంచీలకు ప్రత్యేక రంగులు వేయించుకోవాలని పోలీసులు ఆంక్షలు విధించడంతో జాలర్లు ఆ ప్రకారం లాంచీలకు రంగులు వేసుకున్నారు. సముద్రంలో అనుమానస్పద వ్యక్తులు, లంగరు వేసిన స్టీమర్లు, నౌకలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని స్థానిక మత్స్యకారులకు తెలిపారు. తాజాగా మత్స్యకారులు చేపల వేటకు వెళ్లే ముందు కూపన్ తీసుకోవాలని ఆంక్షలు విధించారు. లేదంటే తిరుగు ప్రయాణంలో నగరంలోకి ప్రవేశం ఉండదని హెచ్చరించారు. అయితే క్యూలో నిలబడి కూపన్ తీసుకోవడం వల్ల సమయం వృథా అవుతోందని, దీని వల్ల మత్స్యకారుల ఉపాధిపై తీవ్ర పభావం పడుతోందని దామోదర్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 56 బందర్లు, 23 వేల లాంచీలు ఉన్నాయని, 10 లక్షలకుపైగా మత్స్యకారులు చేపల వేటకు వెళ్తారని, ప్రతి రోజు రెండు వేల కోట్ల చేపలు ఎగుమతి చేస్తుంటారని ఆయన వెల్లడించారు. కూపన్ పద్ధతి అమలు చేస్తే ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆయన చెప్పారు. -
వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి
పిఠాపురం (తూర్పుగోదావరి) : సముద్రంలో వేటకు వెళ్లి ఓ మత్స్యకారుడు అసువులు బాశాడు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం అమీనాబాద్‌కు చెందిన సత్తిబాబు(32) గురువారం ఉదయం సముద్రంలో వేటకు వెళ్లాడు. చేపలు పట్టే క్రమంలో ప్రమాదవశాత్తు సముద్రంలో పడి ప్రాణాలు కోల్పోయాడు. కాగా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఎప్పుడొస్తారో..!
తొండంగి : వేటకు వెళ్లి గల్లంతై, బంగ్లాదేశ్ తీరానికి చేరిన మత్స్యకారులు ఇంకా స్వగ్రామాలకు చేరలేదు. దీంతో వారెప్పుడు వస్తారా అని కుటుంబ సభ్యులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. జూన్ 15, 16 తేదీల్లో మండలంలోని పాతపెరుమాళ్లపురం, హుకుంపేట గ్రామాల మత్స్యకారులు కొన్ని బోట్లపై సముద్రంలో వేటకు వెళ్లారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను కారణంగా దాదాపుగా 42 మంది వరకూ ఆచూకీ లభించలేదు. అయితే రెండు మూడు రోజులకు కొన్ని బోట్లు విశాఖ, శ్రీకాకుళం, ఒడిశా తీర ప్రాంతాలకు చేరాయి. వీరంతా సంఘటన జరిగిన పది రోజుల్లోనే స్వగ్రామాలకు చేరుకున్నారు. మరో 13 మంది ఆచూకీ తెలియలేదు. చొక్కా సింహాచలం, అర్జిల్లి రాంబాబు, కోడా లోవరాజు, తిత్తి అప్పలరాజు, చొక్కా పెంటయ్య, చొక్కా రాజుల జాడ ఇప్పటికీ తెలియరాలేదు. కోడాపెద్ద అమ్మోరియ్య, మల్లె నందీష్, సూరాడ మసేను, గంట బ్రహ్మేష్, చవాకుల జోగిరాజు, గంటా అడివిరాజుల బోటు బంగ్లాదేశ్ తీరానికి చేరుకుంది. ఈ విషయాన్ని బాధిత మత్స్యకారులు తమ బంధువులకు సమాచారమిచ్చారు. 50 రోజులవుతున్నా..: గల్లంతైన సంఘటన జరిగి 50 రోజులవుతున్నా, బంగ్లాదేశ్ నుంచి సమాచారం అంది నెల గడుస్తున్నా తమవారిని ప్రభుత్వం స్వగ్రామాలకు తీసుకు రాలేకపోయిందని బాధిత మత్స్యకారుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మరో వారం రోజులు పట్టవచ్చు : ఎఫ్డీఓ చినవెంకటరావు. సముద్రంలో ఏర్పడిన తుఫాను కారణంగా గల్లంతై బంగ్లాదేశ్ తీరానికి చేరిన ఆరుగురు మత్స్యకారులు స్వదేశానికి చేరడానికి మరో వారం రోజుల పట్టొచ్చని తుని మత్స్యశాఖ అభివృద్ధి అధికారి సీహెచ్ చిన వెంకటరావు తెలిపారు. కొద్ది రోజుల క్రితం మత్స్యశాఖ ఉన్నతాధికారులకు బంగ్లాదేశ్ నుంచి సమాచారం అందడంతో సరిహద్దులో ఉన్న మత్స్యశాఖ అధికారులను పంపామన్నారు. త్వరలో వారంతా స్వదేశానికి చేరే అవకాశం ఉందన్నారు. -
గొంతెత్తితే ఖబడ్దార్
ఈ చిత్రం చూస్తే సరిహద్దులో అప్రమత్తమైన సైనిక వాతావరణం తలపిస్తోంది కదూ..కానీ కాదు.. పూడిమడక వద్ద ఆల్ట్రా సూపర్ థర్మల్ విద్యుత్తు కేంద్రం ఏర్పాటుపై బుధవారం ప్రజాభిప్రాయసేకరణ కార్యక్రమానికి పోలీసుల బందోబస్తు ఇది . ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన గళం ఎత్తనీయకుండా ప్రభుత్వం తీసుకున్న అతి అప్రమత్తత ఇది. భారీగా పోలీసు బలాన్ని ప్రయోగించింది. 600 మంది పోలీసులతో మార్చిఫాస్ట్ నిర్వహించి మత్స్యకారులను భయాందోళనలకు గురిచేశారు. -
వర్షాలపై అలెర్ట్!
అధికారులను అప్రమత్తం చేసిన కలెక్టర్ మత్స్యకారులు వేటకెళ్లొద్దని సూచన చింతపల్లిలో 12 సెం.మీల వర్షపాతం విశాఖపట్నం: జిల్లాలో కురుస్తున్న వర్షాలపై అధికార యంత్రాంగం అప్రమత్తమయింది. భారీ వర్షాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఎన్.యువరాజ్ ఆదేశించారు. జిల్లాలోని చింతపల్లిలో 12 సెం.మీల వర్షపాతం నమోదు, రానున్న 24 గంటల్లో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ విభాగం హెచ్చరికల నేపథ్యంలో కలెక్టర్ స్పందించారు. ఇందులోభాగంగా రెవిన్యూ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు హెడ్క్వార్టర్లలో అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి పరిస్థితులు తలెత్తినా సంబంధిత అధికారులు తక్షణమే అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లోని వరద నీరు పోటెత్తే అవకాశం ఉందని, నదులు దాటేందుకు ప్రయత్నించ వద్దని, వీఆర్వోలు, గ్రామ కార్యదర్శులను అప్రమత్తం చేయాలని సూచించారు. అవసరమైన పక్షంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా ఒక భవనాన్ని అందుబాటులో ఉంచాలన్నారు. శిథిలావస్థలో ఉన్న పాఠశాల, అంగన్వాడీ భవనాల్లో తరగతులు నిర్వహించ వద్దని, దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించి తక్షణమే రేషన్, అవసరమైన మందులు సమకూర్చాలని ఆదేశించారు. రేషన్ సరకుల నిల్వలను తనిఖీ చేసి, మండల స్థాయిలో స్టాకు సరిపడా ఉండేలా చూడాలన్నారు. అవసరమైతే మంచినీటి ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలన్నారు. అత్యవసర పరిస్థితులు తలెత్తితే పోలీసులకు కూడా సమాచారం అందించి వారి సేవలు వినియోగించు కోవాలని అధికారులను కోరారు. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లొద్దని కలెక్టర్ సూచించారు. -
పుష్కరాల్లో ఈదేదెలా
- గజ ఈతగాళ్లకు అందని కూలి సొమ్ము - పడవలు తెచ్చి మరీ విధులు నిర్వర్తిస్తున్న మత్స్యకారులు - జిల్లాలో రూ.99.61 లక్షల బకాయిలు కొవ్వూరు : పుష్కరాల సందర్భంగా భక్తులు స్నానాలు చేసే సమయంలో ప్రమాదంబారిన పడితే రక్షించేందుకు ఏర్పాటు చేసిన గజ ఈతగాళ్లకు ఇప్పటి వరకు కూలి సొమ్ము చెల్లించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. వారం రోజులుగా రాత్రింబవళ్లు విధులు నిర్వహిస్తున్నా ప్రభుత్వం చిల్లిగవ్వ కూడా ఇవ్వకపోవడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వేటకు వెళితే వచ్చే ఆదాయం కంటే కూలి తక్కువైనా అధికారుల మాటకు విలువనిచ్చి విధులు నిర్వహిస్తున్నామని, కనీసం అల్పాహారం కూడా సక్రమంగా అందజేయడం లేదని వారు వాపోతున్నారు. 2 వేల ఈతగాళ్లు.. 700 పడవలు జిల్లావ్యాప్తంగా ఉన్న 97 స్నానఘట్టాల్లో 2 వేల మంది గజఈతగాళ్లు, 700 పడవలను ఏర్పాటు చేశారు. ఇందుకోసం ప్రభుత్వం మత్య్సశాఖకు రూ.2 కోట్లు నిధులు మంజూరు చేసింది. గజ ఈతగాళ్లకు రోజుకి రూ.449, పడవకి రూ.700 చొప్పున చెల్లించాల్సి ఉంది. ఈ లెక్కన రోజుకి రూ.14.23 లక్షల చొప్పున గడిచిన వారం రోజులకు రూ. 99.61 లక్షలు బకాయిలు చెల్లించాలి. నాలుగు రోజులకోసారి కూలి సొమ్ము చెల్లిస్తామని అధికారులు ముందుగా హామీ ఇచ్చారు. జిల్లాలో ఏ గ్రేడు 14 స్నానఘట్టాల్లో ఒక్కో షిఫ్ట్‌కి 12 మంది, 54 బి గ్రేడ్ స్నానఘట్టాల్లో షిఫ్ట్‌కి 8 మంది చొప్పున రోజుకి మూడు షిఫ్టులకు, సి గ్రేడ్‌లో ఉన్న 29 స్నాన ఘట్టాల్లోనూ, మరో 15 చోట్ల ఏర్పాటైన తాత్కాలిక స్నాన ఘట్టాల్లో వీరంతా విధులు నిర్వర్తిస్తూ పుష్కర భక్తులకు సేవలందిస్తున్నారు. అంతేకాకుండా నదిలో భక్తులు విడిచిపెట్టిన పువ్వులు, పూజా ద్రవ్యాలు నెట్ వలలతో ఎప్పటికప్పుడు తొలగిస్తూ నది కాలుష్యంలో చిక్కుకోకుండా కాపాడుతున్నారు. గతంలోనూ ఇంతే 2003 పుష్కర సమయంలో కూడా అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం అప్పట్లో విధులు నిర్వహించిన మత్స్యకారులకు సగం సొమ్ములు ఇవ్వకపోవడంతో గజఈతగాళ్లు ఆందోళనకు దిగారు. కూలి సొమ్ములు, పడవల అద్దె కోసం రోజుల తరబడి అధికారుల చుట్టూ తిరిగామని వాడబలిజ సంఘం అధ్యక్షుడు పరిమెళ్ల నాగరాజు గుర్తు చేశారు. అడ్వాన్సులు అందిస్తాం పుష్కర విధుల్లో ఉండడం వల్ల సకాలంలో కూలి డబ్బులు, పడవలకు అద్దె చెల్లించలేకపోయాం. ఒకటి, రెండు రోజుల్లో అందరికీ అడ్వాన్సులు చెల్లిస్తాం. పుష్కరాలు ముగిసిన వెంటనే మిగిలిన సొమ్ము చెల్లిస్తాం. - ఎస్కే.లాల్ మహ్మద్, ఇన్చార్జ్ డెప్యూటీ డెరైక్టర్ మత్య్సశాఖ -
బతికాం!
చేపలు తిని.. నీళ్లు తాగి.. స్వస్థలానికి చేరిన మత్స్యకారుల వెల్లడి 20 రోజుల అనంతరం గిలకలదిండికి కుటుంబసభ్యులు, గ్రామస్తుల్లో ఆనందం మచిలీపట్నం : ‘‘తీసుకెళ్లిన ఆహార పదార్థాలు ఆరు రోజులకే అయిపోయాయి.. రెండు రోజులకోసారి గాలం ద్వారా చేపలు పట్టి, వాటినే కాల్చుకుని తిన్నాం.. బోటులో ఉన్న ఐస్‌ని కరగబెట్టి, ఆ నీటిని తాగాం.. అలా ప్రాణాలు కాపాడుకున్నాం..’’ ఇదీ గల్లంతై సోమవారం తిరిగి గిలకలదిండికి చేరుకున్న మత్స్యకారులు సైకం నాగూర్, తిరుమాని నాగరాజు చెప్పిన మాటలు. సోమవారం ఉదయం విజయవాడ రైల్వేస్టేషన్‌కు ఆరుగురు మత్స్యకారులు తమ స్వస్థలాలకు వెళ్లారు. వారిలో గిలకలదిండికి చెందిన నాగూర్, నాగరాజు తమ ఇళ్లకు చేరారు. ఈ సందర్భంగా వారు తాము ఎదుర్కొన్న పరిస్థితులను వివరించారు. తాము చేపల వేటకు వెళ్లిన మూడో రోజునే బోటు చెడిపోయిందని, సముద్రంలో భయంకరమైన అలల తాకిడికి బోటు కొట్టుకుపోయిన దిశ కూడా తెలియలేదని చెప్పారు. దీంతో జాయింటు బోటుకు కబురుపెట్టామని, అది గత నెల 18వ తేదీ సాయంత్రం నాలుగు గంటల సమయంలో తమ బోటు సమీపానికి వచ్చిందని తెలిపారు. ఈలోగా అలల ఉధృతి మరింతగా పెరడంతో జాయింట్ బోటు దూరంగా వెళ్లిపోయిందని చెప్పారు. ఆ రాత్రి బోటు ఎటు వెళుతోందో, గాలులు, అలల తీవ్రతకు ఏ దిక్కుకు వెళుతున్నామో తెలియలేదన్నారు. జీపీఎస్ సిస్టమ్ ఆగిపోయిందని, వైర్లెస్ సెట్లు పనిచేయకుండా పోయాయని చెప్పారు. సమీపానికి ఏదైనా ఓడ వస్తే జెండా ఊపినా వారు పట్టించుకోలేదని తెలిపారు. ఈ నెల రెండోతేదీ మధ్యాహ్నం రెండు గంటలకు నేవీకి చెందిన చిన్న విమానం తమను గుర్తించిందని, మూడో తేదీన తమ వద్దకు వారు ఓడను పంపారని వివరించారు. అక్కడి నుంచి ఒడ్డుకు చేరటంతో ప్రాణం లేచొచ్చిందని తెలిపారు. అధికారులు చొరవ తీసుకోవటంతో ప్రాణాలతో బయటపడ్డామని వివరించారు. మొక్కుబడులు చెల్లించుకుని ఇంటికి గ్రామానికి చేరుకున్న నాగరాజు, నాగూర్‌లు గ్రామంలో ఉన్న అన్ని దేవాలయాలకు తిరిగి మొక్కుబడులు చెల్లించుకున్నారు. మంత్రి కొల్లు రవీంద్ర వీరిని వెంట పెట్టుకుని సోమవారం గిలకలదిండికి తీసుకువచ్చారు. గ్రామస్తులు వీరికి ఎదురేగి వెళ్లి అన్ని ఆలయాల్లో పూజలు చేయించారు. నాగూర్ భార్య మేనక, కుమార్తె లక్ష్మీదుర్గ, నాగరాజు భార్య సరస్వతి, కుమారుడు నెహెమ్యా, కుమార్తె ప్రిస్కిల్లాతో పాటు పలువురు గ్రామస్తులు గల్లంతైన వారు తిరిగి రావటంతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మత్స్యశాఖ డెప్యూటీ డెరైక్టర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ కోస్ట్‌గార్డ్ సిబ్బంది మత్స్యకారులను గుర్తించిన సమాచారం అందుకున్న వెంటనే తాము అక్కడికి బయలుదేరి వెళ్లామని, అక్కడినుంచి ఐదో తేదీన బయల్దేరి ఇక్కడికి చేరుకున్నామని చెప్పారు. -
బోట్ తయారీ కేంద్రంగా బందరు
గిలకలదిండిలో బోట్ తయారీ నిపుణులు వంద సంవత్సరాలుగా ఈ రంగంలోనే.. ఈ సంవత్సరం మూడు బోట్ల తయారీ పోర్టు నేపథ్యంలో మత్స్యకారుల్లో ఆశలు సరకుల రవాణా పెరుగుతుందన్న అంచనా బోట్ల తయారీ రంగంలోనే ఉన్నారు. కొన్ని కుటుంబాలు వారసత్వంగా ఈ వృత్తినే నమ్ముకుని జీవిస్తున్నాయి. గతంలో బోల్టులు లేనందున రివిట్మెంట్ ద్వారా బోట్లను నిర్మించేవారు. రివిట్మెంట్ రంగంలో స్థానికులు ఆరితేరిన వారు. ప్రస్తుతం బోల్టులతో బోట్లు తయారుచేస్తున్నారు. ప్రస్తుతం గిలకలదిండికి ఇతర జిల్లాలవారు వచ్చి చెక్క బోట్లు తయారు చేయించుకుంటున్నారు. ఈ సంవత్సరంలో 14 బోట్లు ఇక్కడ తయారయ్యాయి. ఒక్క బోటు తయారు చేయాలంటే 50 మంది నిపుణులు మూడు నెలలపాటు కష్టపడాల్సి ఉంటుంది. బోటు తయారీకి చెక్కతో పాటు ఫైబర్, రజన, మ్యాట్‌ను ఉపయోగిస్తారు. కాకినాడ ప్రాంతంలో చేపల వేట చేసే మత్స్యకారులు కూడా గిలకలదిండిలోనే బోట్లు చేయించుకుంటారు. బోట్లు రెండు రకాలు బోట్లను ఫైబర్, చెక్కతో రెండు రకాలుగా తయారుచేస్తారు. ఫైబర్ బోట్లు తక్కువ ఖర్చుతో పూర్తవుతాయి. రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షలకే (వలలు కలుపుకొని) ఈ బోటు తయారవుతుంది. చెక్క బోటు కంటే ఇది చిన్నది. ఈ బోటు ద్వారా చేపల వేట చేసేవారు తెల్లవారు జామున మూడు గంటలకు సముద్రంలోకి వెళ్లి మధ్యాహ్నం ఒంటి గంటకు వస్తారు. చెక్కబోటు తయారీకి ఉపయోగించే పాచి కర్ర (కలప)ను శ్రీకాకుళం నుంచి, ఇతర వస్తువులను కేరళ నుంచి తెప్పిస్తారు. అప్పుడప్పుడు సముద్రంలో కొట్టుకువచ్చే గుగ్గిలం కర్రను కూడా వాడతారు. పాచి కర్ర వెల అడుగు రూ.300 వరకు ఉంటుంది. ఈ కలప తేలికగా, మంచి నాణ్యతతో ఉంటుంది. గుగ్గిలం కర్ర మరింత నాణ్యంగా ఉన్నా ఆంధ్రప్రదేశ్‌లో దొరకదు. ఒక్క బోటు తయారీకి కనీసంగా వెయ్యి అడుగుల కర్ర కావాలి. బోటు సముద్రంలోకి వెళ్లేందుకు సిద్ధం కావాలంటే మొత్తం రూ.80 లక్షల వరకు ఖర్చవుతుంది. బోటు తయారీలోనే వలల ఖర్చు కలుపుతున్నారు. వలలు రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ధర పలుకుతాయి. చెక్కబోటులో చేపల వేటకు వెళ్లేవారు నాలుగు నుంచి పది రోజుల పాటు సముద్రంలోనే ఉంటారు. బోటులోనే వంట చేసుకునే సదుపాయం ఉంటుంది. తయారు చేయించేది వ్యాపారులే... సముద్రంలో చేపల వేట చేసే బోట్లను తయారు చేయించేది వ్యాపారులే. అన్ని హంగులతో తయారైన బోటును మత్స్యకారులకు అద్దెకు ఇస్తారు. నాలుగు నుంచి ఎనిమిది మంది ఒక బోటులో వేటకు వెళ్లొచ్చు. ఈ ఏడాది తమ గ్రామంలో మత్స్యకారులకు 14 బోట్లు తయారు చేసి ఇచ్చామని బోటు తయారుదారు కొక్కిలిగడ్డ నాగాంజనేయులు తెలిపారు. రోజు కూలీ రూ.500 వస్తుందని వివరించారు. పోలాటితిప్ప కాలువను మరమ్మతు చేయాలి ప్రస్తుతం మత్స్యకారులు బోట్లను పోలాటితిప్ప కాలువలో లంగరేస్తున్నారు. కాలువకు ఇరువైపులా మంచి రివిట్మెంట్ కట్టిస్తే బోట్ల నుంచి సరకును దించుకునేందుకు కూడా వీలుగా ఉంటుందని, స్థానికులు కూడా ఇక్కడికొచ్చి చేపలు కొనుగోలు చేసేందుకు వీలుగా ఉంటుందని వారు పేర్కొంటున్నారు. ఎగుమతి దారుల కంపెనీలు ఈ దారిలోనే ఉన్నాయని, వారి గోడౌన్లు సమీపంలోనే ఉన్నందున కాలువను బాగుచేసి ఆదుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు.