
చెంగన్నూర్ శిబిరంలో బాధితులతో రాహుల్
అలప్పుజ: కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మత్స్యకారులకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటుచేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ఇటీవల వరదలతో అతలాకుతలమైన కేరళలో సహాయక చర్యల్లో మత్స్యకారులు కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం రాహుల్ మంగళవారం లండన్ నుంచి నేరుగా కేరళ వచ్చారు. పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న బాధితులను పరామర్శించారు.
వరదల సమయంలో ప్రాణాలకు తెగించి బాధితులను కాపాడిన మత్స్యకారులను సన్మానించేందుకు అలప్పుజలో పార్టీ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశంలో మత్స్యకారులు కూడా రైతుల లాంటి సంక్షోభాన్నే ఎదుర్కొంటున్నారన్నారు. ‘ఎన్ని కష్టా లెదురైనా కేరళకు అవసరమైనప్పుడల్లా మీరు (మత్స్యకారులు) అండగా నిలిచారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మత్స్యకారులకు ప్రత్యేక శాఖను ఏర్పాటుచేస్తాం. శుష్క వాగ్దానాలు చేయడం నాకిష్టం లేదు’ అని అన్నారు.
విపత్తులప్పుడు తక్షణమే స్పందించేలా..
న్యూఢిల్లీ: ప్రకృతి వైపరీత్యాల సమయంలో తక్షణమే స్పందించడం, అనారోగ్య సవాళ్లను ఎదుర్కొనే దిశగా టెక్ దిగ్గజం గూగుల్ నడుం బిగించింది. ఇందుకు కృత్రిమ మేధస్సు (ఏఐ), మిషన్ లెర్నింగ్ (ఎంఎల్) సాంకేతి కతను వినియోగించుకునేందుకు పలు సంస్థల తో కలసి పని చేయనున్నట్లు ప్రకటించింది. విపత్తు సమయంలో ప్రమాదకర ప్రదేశాలను గుర్తించడం, తక్షణమే కచ్చిత వరద హెచ్చరి కలు జారీ చేసేందుకు నీటి వనరుల శాఖతో కలసి గూగుల్ పైలట్ ప్రాజెక్టు చేపట్టింది. కేరళలో దీని ప్రాథమిక ఫలితాలు సంతృప్తినిచ్చినట్లు సంస్థ తెలిపింది.