కేరళ వయనాడ్ విషాదంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు. కొండచరియల కారణంగా సర్వం కోల్పోయిన బాధితులకు కాంగ్రెస్ పార్టీ తరుఫున 100 ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 300లు దాటింది. దాదాపు 300 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. వారి కోసం సైన్యం, నేవీ, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి.
బాధితుల్ని పరామర్శించేందుకు వయనాడ్‌లో రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీలు పర్యటిస్తున్నారు. ఈ సందర్భాంగా వియనాడ్ విషాదంపై రాహుల్ విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి విషాదం తానెక్కడ చూడలేదన్న ఆయన..బాధితులకు అండగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment