
డోకూరి చిన్నయ్య మృతదేహం
నాగర్‌కర్నూల్ క్రైం: చేపలు పట్టేందుకు వెళ్లిన ఓ మత్స్యకారుడు ఛాతిలో నొప్పితో మృతిచెందాడు. ఈ సంఘటన మండలంలోని ఉయ్యాలవాడలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది.కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన డోకూరి చిన్నయ్య(45) మంగళవారం సాయంత్రం గుడిపల్లి రిజర్వాయర్‌లో కొందరితో కలిసి చేపలు పడుతుండగా అకస్మాత్తుగా ఛాతిలో నొప్పి వచ్చింది. అక్కడే ఉన్న తన కుమారుడు సాయికుమార్‌కు విషయం చెప్పడంతో వెంటనే నీటిలో నుంచి ఒడ్డుకు తీసుకువస్తుండగా అక్కడికకక్కడే మృతిచెందాడు.
విషయం తెలుసుకున్న పోలిసులు ఘటనా స్దలానికి చేరుకుని పరిశీలించారు. చిన్నయ్య కుమారుడు సాయికుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పురుషోత్తం తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. చిన్నయ్యకు భార్య, ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment