అదృష్టం ఏ రూపాన వస్తుందో ఎవరికీ తెలియదు. అలా ఓ సారి వచ్చిన చాలు దెబ్బకు కోటీశ్వరులుగా మారిన వాళ్లు ఉన్నారు. తాజాగా ఓ జాలరీకి కూడా ఇలాంటి అదృష్టమే వరించింది. వివరాల్లోకి వెళితే.. ఓ మత్స్యకారుడు ఎప్పటిలానే సముద్రంలో వేటకి వెళ్లాడు. కొంత దూరం వెళ్లాక చేపల కోసం వల వేసి ఎదురుచూస్తున్నాడు. కాసేపు తరువాత తాను విసిరిన వలలో ఏదో చిక్కుకున్నట్లు అనిపించింది. అదేమిటో చూడాలని వలను లాగడానికి ప్రయత్నించాడు. అయితే అది కాస్త బరువుగా ఉండడంతో అంత సులువుగా రాలేదు.
చివరికి ఎలాగో ఒకలా వలను పైకి లాగగా అందులో చాలా పెట్టెలు ఉన్న విషయాన్ని గ్రహించాడు. అలాగే ఆ పెట్టెలపై ఆపిల్ లోగో ఉంది. మొదట్లో ఆ పెట్టె ఖాళీ అయ్యుంటుందని భావించినప్పటికీ, దాన్ని తెరిచే చూసి షాక్ అయ్యాడు. ఎందుకంటే ఆ బాక్సులన్నీ యాపిల్ ఉత్పత్తులతో నిండిపోయాయి. అందులో చాలా ఐఫోన్, మ్యాక్‌బుక్‌లు ఉన్నాయి. వాటి విలువ లక్షల్లో ఉంటుంది. మరో రకంగా చెప్పాలంటే అతనికో చిన్న నిధి దొరికినట్లుగా భావించాడు. అయితే నీటిలో ఉన్న కారణంగా ఫోన్, మ్యాక్‌బుక్ పాడై ఉండొచ్చని అనుకున్నప్పటికీ అలా ఏం జరగలేదు.
అందులో కొన్ని ఫోన్‌లను తెరిచి చూడగా అవి బాగానే పనిచేస్తున్నాయి. ఎందుకుంటే ఐఫోన్ వాటర్‌ప్రూఫ్ కనుక అవి నీటిలో ఉన్న అవి పాడైపోలేదు. మత్స్యకారుడు ఈ ఘటనను వీడియో తీసి టిక్‌టాక్‌లో అప్‌లోడ్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్లు పబ్లిసిటీ కోసమే ఈ బాక్సులను తానే మొదట విసిరాడని, తర్వాత అవి దొరికనట్లుగా సృష్టించాడని పలువురు వాపోతున్నారు. కొందరు లక్కీ బాయ్ అంటూ కామెంట్ పెట్టారు.
చదవండి: బాప్‌రే! 14 అంతస్థుల భవనంలో అగ్ని ప్రమాదం... ఐతే ఆ ఇద్దరు...!! షాకింగ్ వీడియో
Comments
Please login to add a commentAdd a comment