ఏడాదిలోనే రూ.2 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం | Apple Inc achieved a business value exceeding Rs 2 lakh cr in India | Sakshi
Sakshi News home page

ఏడాదిలోనే రూ.2 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం

Published Mon, Aug 19 2024 10:06 AM | Last Updated on Mon, Aug 19 2024 10:21 AM

Apple Inc achieved a business value exceeding Rs 2 lakh cr in India

ప్రపంచ దిగ్గజ సంస్థగా పేరున్న యాపిల్‌ భారత్‌లో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కేవలం ఇండియాలోనే రూ.2 లక్షల కోట్ల వ్యాపారం సాగించింది. దేశీయంగా ఐఫోన్లు, మ్యాక్‌బుక్‌లు, ఐప్యాడ్‌లు, యాపిల్‌ వాచ్‌లకు భారీ గిరాకీ ఏర్ప​డిందని కంపెనీ తెలిపింది. ఏడాది వ్యవధిలోనే రూ.2 లక్షల కోట్లు వ్యాపార మార్కును సాధించడానికిగల కారణాలను కంపెనీ విశ్లేషించింది.

  • కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు ఎంతో ఉపయోగపడ్డాయి.

  • పాక్స్‌కాన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుని తమిళనాడులో ఐఫోన్లను తయారు చేస్తోంది.

  • 2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా తయారైన రూ.1.35 లక్షల కోట్ల విలువైన ఐఫోన్లను కంపెనీ ఇతర దేశాలకు ఎగుమతి చేసింది. స్థానికంగా రూ.68,000 కోట్ల విక్రయాలు నమోదయ్యాయి.

  • అంతర్జాతీయంగా యాపిల్‌ ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్‌కు తగిన విధంగా తయారీ పెంచేందుకు ఫాక్స్‌కాన్‌తోపాటు విస్ట్రోన్, పెగాట్రాన్ వంటి సంస్థలతో ఒప్పందం చేసుకుంది.

  • కర్ణాటకలో యాపిల్‌ ఐఫోన్‌ తయారీ ప్లాంట్‌ ‘ప్రాజెక్ట్‌ ఎలిఫెంట్‌’ను సిద్ధం చేస్తోంది. ఏటా ఆ ప్లాంట్‌లో దాదాపు 2 కోట్లు యూనిట్‌లను తయారుచేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.

  • దేశీయంగా యాపిల్‌ ఉత్పత్తులను విక్రయించేందుకు ప్రత్యేకంగా ముంబయి, ఢిల్లీలో అవుట్‌లెట్‌లు ఏర్పాటు చేశారు.

  • ఈకామర్స్‌ ప్లాట్‌పామ్‌లతో జతకట్టి యాపిల్‌ 42 శాతం ఉత్పత్తులను విక్రయిస్తోంది.

ఇదీ చదవండి: చిన్న కిటుకుతో సిబిల్‌ స్కోర్‌ పెంపు

  • ప్రధానంగా యాపిల్‌ ప్రీమియం ఉత్పత్తులపై ఎక్కువ దృష్టి పెడుతోంది. దానివల్ల మార్జిన్‌ ఎక్కువగా సమకూరుతుంది.

  • అత్యాధునిక మార్కెటింగ్‌తో పెరుగుతున్న బ్రాండ్ విలువ కంపెనీకి ఎంతో లాభం చేకూరుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement