భారత్‌లో యాపిల్ సరఫరాదారుగా ఉన్న ఫాక్స్‌కాన్ తన ఉద్యోగుల నియామక ఏజెంట్లకు ఆదేశాలు జారీచేసింది. కంపెనీ నియామక పద్ధతుల్లో మార్పులు చేసింది. ఉద్యోగ ప్రకటనల్లో లింగం, వైవాహిక స్థితి, వయసు వంటి వివక్షతతో కూడిన ప్రమాణాలను తొలగించాలని స్పష్టం చేసింది. ఈమేరకు రాయిటర్స్ దర్యాప్తును అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు.
చెన్నై సమీపంలోని శ్రీపెరంబుదూర్‌లోని ఐఫోన్ తయారీ ప్లాంట్‌లో వివాహిత మహిళలను అసెంబ్లింగ్-లైన్ విభాగంలో పని చేసేందుకు ఫాక్స్‌కాన్ గతంలో మినహాయించినట్లు రాయిటర్స్ దర్యాప్తులో తేలింది. కానీ హై ప్రోడక్టివిటీ అవసరం అయినప్పుడు మాత్రం వివాహత మహిళలపై ఎలాంటి షరతులు విధించలేదని తెలిపింది. ఈ మేరకు జూన్ 25న రాయిటర్స్ సిద్ధం చేసిన పరిశోధన పత్రాన్ని అనుసరించి కంపెనీ తాజాగా వివక్షతతో కూడిన వివరాలు రిక్రూట్‌మెంట్ ప్రకటనలో ఉండకూడదని ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారిని లింగం, వయసు, వైవాహిక స్థితిని అనుసరించి వేరు చేయడం సరికాదని తెలిపింది. దాంతో సదరు వివరాలు లేకుండానే చెన్నైలో కొన్ని సంస్థలు ఉద్యోగాల కోసం ప్రకటనలు ఇస్తున్నాయి.
ఇదీ చదవండి: నారాయణ మూర్తిని మించిన సేనాపతి
ఫాక్స్‌కాన్ ఏజెన్సీ ఇచ్చిన ఓ ప్రకటన ప్రకారం స్మార్ట్‌ఫోన్ తయారీ యూనిట్‌లోని మొత్తం అసెంబ్లింగ్ స్థానాలు తెలిపారు. కానీ వయసు, లింగం, వైవాహిక ప్రమాణాల గురించి ప్రస్తావించలేదు. ‘ఎయిర్ కండిషన్డ్ వర్క్‌ప్లేస్, ఉచిత రవాణా, క్యాంటీన్ సౌకర్యం, ఉచిత హాస్టల్, నెలవారీ జీతం రూ.14,974 లేదా దాదాపు 177 అమెరికన్ డాలర్ల’ వివరాలతో ప్రకటన ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment