recruitement board
-
వివక్షతతో కూడిన ప్రమాణాలు తొలగింపు
భారత్‌లో యాపిల్ సరఫరాదారుగా ఉన్న ఫాక్స్‌కాన్ తన ఉద్యోగుల నియామక ఏజెంట్లకు ఆదేశాలు జారీచేసింది. కంపెనీ నియామక పద్ధతుల్లో మార్పులు చేసింది. ఉద్యోగ ప్రకటనల్లో లింగం, వైవాహిక స్థితి, వయసు వంటి వివక్షతతో కూడిన ప్రమాణాలను తొలగించాలని స్పష్టం చేసింది. ఈమేరకు రాయిటర్స్ దర్యాప్తును అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు.చెన్నై సమీపంలోని శ్రీపెరంబుదూర్‌లోని ఐఫోన్ తయారీ ప్లాంట్‌లో వివాహిత మహిళలను అసెంబ్లింగ్-లైన్ విభాగంలో పని చేసేందుకు ఫాక్స్‌కాన్ గతంలో మినహాయించినట్లు రాయిటర్స్ దర్యాప్తులో తేలింది. కానీ హై ప్రోడక్టివిటీ అవసరం అయినప్పుడు మాత్రం వివాహత మహిళలపై ఎలాంటి షరతులు విధించలేదని తెలిపింది. ఈ మేరకు జూన్ 25న రాయిటర్స్ సిద్ధం చేసిన పరిశోధన పత్రాన్ని అనుసరించి కంపెనీ తాజాగా వివక్షతతో కూడిన వివరాలు రిక్రూట్మెంట్ ప్రకటనలో ఉండకూడదని ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారిని లింగం, వయసు, వైవాహిక స్థితిని అనుసరించి వేరు చేయడం సరికాదని తెలిపింది. దాంతో సదరు వివరాలు లేకుండానే చెన్నైలో కొన్ని సంస్థలు ఉద్యోగాల కోసం ప్రకటనలు ఇస్తున్నాయి.ఇదీ చదవండి: నారాయణ మూర్తిని మించిన సేనాపతిఫాక్స్కాన్ ఏజెన్సీ ఇచ్చిన ఓ ప్రకటన ప్రకారం స్మార్ట్‌ఫోన్ తయారీ యూనిట్‌లోని మొత్తం అసెంబ్లింగ్ స్థానాలు తెలిపారు. కానీ వయసు, లింగం, వైవాహిక ప్రమాణాల గురించి ప్రస్తావించలేదు. ‘ఎయిర్ కండిషన్డ్ వర్క్‌ప్లేస్, ఉచిత రవాణా, క్యాంటీన్ సౌకర్యం, ఉచిత హాస్టల్, నెలవారీ జీతం రూ.14,974 లేదా దాదాపు 177 అమెరికన్ డాలర్ల’ వివరాలతో ప్రకటన ఇచ్చారు. -
తెలంగాణ: పోలీస్ ఉద్యోగాల్లో గర్భిణీలకు శుభవార్త
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల్లో గర్భీణులకు శుభవార్త తెలిపింది రిక్రూట్మెంట్ బోర్డు. గర్బీణిలకు ఈవెంట్స్ మినహాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. బదులుగా గర్భీణీలకు నేరుగా మెయిన్స్ రాసేలా వెసులుబాటు కల్పించింది బోర్డు. అయితే.. మెయిన్స్ పాసైతే నెలరోజుల్లో ఈవెంట్స్‌లో పాల్గొనాలని ఆ ఆదేశాల్లో పేర్కొంది. -
‘పోలీసు పరీక్ష’కు నిమిషం నిబంధన.. అభ్యర్థులకు కీలక సూచనలు
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించే ఎస్ఐ అభ్యర్థుల రాత పరీక్ష ఆదివారం జరుగనుంది. ఈ పరీక్షకు నిమిషం నిబంధన వర్తింపజేశారు. నిర్దేశిత సమయానికి ఒక్క నిమిషం ఆలస్యంగా వచి్చనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించేది లేదని నగర పోలీసులు స్పష్టం చేశారు. పరీక్ష కోసం నగరంలో 33 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల మందికి పైగా హాజరవుతుండగా..వీరిలో దాదాపు 50 వేల మంది నగరంలోనే రాయనున్నారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలకు పంపడం, నిర్దేశిత ప్రాంతాల నుంచి పరీక్ష పత్రాలకు పరీక్ష కేంద్రాలకు చేర్చడం, పూర్తయిన తర్వాత జవాబుపత్రాలను జేఎనీ్టయూలోని స్ట్రాంగ్ రూమ్ సిబ్బందికి అప్పగించడం..వంటి ప్రతి అంశానికీ ప్రాధాన్యం ఇస్తూ బందోబస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై సంయుక్త కమిషనర్ ఎం.రమేష్ శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నగర కొత్వాల్ సీవీ ఆనంద్ చేస్తున్న కీలక సూచనలివి.. ►ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్ష జరుగుతుంది. ►ఉదయం 9 గంటల నుంచి అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. సరిగ్గా 10 గంటలకు గేట్లు మూసేస్తారు. ►సెల్ఫోన్లు, బ్యాగులు, స్మార్ట్ వాచీలు, కాలిక్యులేటర్లు సహా ఎలాంటి ఎల్రక్టానిక్ పరికరాలను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. ప్రతి అభ్యర్థి కచ్చితంగా మాస్క్ ధరించాలి. ►అభ్యర్థులు తమ వెంట హాల్‌టిక్కెట్, పెన్ మాత్రమే తెచ్చుకోవాలి. ►అభ్యర్థుల హాజరు బయోమెట్రిక్ విధానంలో తీసుకుంటారు. ఈ నేపథ్యంలోనే పరీక్ష రాసేవాళ్లు మెహిందీ, టాటూలకు దూరంగా ఉండాలి చదవండి: ‘చీకోటి’ కేసులో ఓ మంత్రి, ముగ్గురు ఎమ్మెల్యేలు? వాట్సాప్ చాట్లు వెలుగులోకి -
తెలంగాణ: డీఎస్పీ ఉద్యోగ అభ్యర్థులకు శుభవార్త
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. డీఎస్పీ ఉద్యోగ అభ్యర్థులకు శుభవార్త చెప్పింది. అభ్యర్థుల ఎత్తును 167 సెం.మీ నుంచి 165 సెం.మీకు తగ్గిస్తూ శుక్రవారం నిర్ణయం ప్రకటించింది. గ్రూప్ 1 ఉద్యోగ నియామకాల్లో భాగంగా.. డీఎస్పీ అభ్యర్థుల ఎత్తు చర్చనీయాంశంగా మారింది. ఎక్కడా లేని విధంగా తెలంగాణలో మాత్రమే ఎత్తు ఎక్కువగా ఉండడంపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. దీంతో ఈ డిమాండ్‌కు తలొగ్గి.. ఇప్పుడు ఎత్తు తగ్గించి నిరుద్యోగులకు ఊరట ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. చదవండి👉తెలంగాణ పోలీస్ నియామక అభ్యర్థులకు మరో గుడ్‌న్యూస్ -
పోలీస్ రిక్రూట్మెంట్లో యువతి.. మెడికల్ టెస్ట్‌లో ‘అతడు’గా తేలింది!
ముంబై: పోలీస్ రిక్రూట్మెంట్లో భాగంగా దరఖాస్తు చేసుకున్న ఓ యువతికి.. మెడికల్ టెస్టుల్లో మాత్రం ఊహించిన పరిణామం ఎదురైంది. ఆమె ఆమె కాదు.. అతడు అని ధృవీకరిస్తూ ఉద్యోగం ఇవ్వలేమని తేల్చి చెప్పింది రిక్రూట్మెంట్ బోర్డు. ఈ తరుణంలో ఆమె న్యాయపోరాటంలో విజయం సాధించింది. బాంబే హైకోర్టు తాజాగా సంచలన ఆదేశాలు జారీ చేసింది. మెడికల్ టెస్టుల వల్ల ఉద్యోగం దక్కకుండా పోయిన ఓ యువతికి.. రెండు నెలల్లో అపాయింట్మెంట్ ఇప్పించాలని చెప్పింది. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. 2018లో సదరు యువతి (23) నాసిక్ రూరల్ పోలీస్ రిక్రూట్మెంట్ 2018కి ఎస్సీ కేటగిరీలో దరఖాస్తు చేసుకుంది. రాత పరీక్ష, ఫిజికల్ ఎగ్జామ్‌లు అన్నీ క్వాలిఫై అయ్యింది. అయితే మెడికల్ ఎగ్జామ్‌లో ఆమె జనానాంగాలు లేవని గుర్తించారు. మరో పరీక్షలో ఆమెలో మగ-ఆడ క్రోమోజోమ్స్ ఉన్నట్లు తేడంతో ఆమెను పురుషుడిగా నిర్ధారించి పక్కనపెట్టారు. ఈ పరిస్థితిలో ఉద్యోగం రాకపోవడంతో ఆమె బాంబే హైకోర్టును ఆశ్రయించింది. తనకున్న జన్యుపరమైన సమస్య గురించి తనకు ఏమాత్రం అవగాహన లేదని, పుట్టినప్పటి నుంచి తాను మహిళగానే పెరిగాని, చదువు కూడా అలాగే కొనసాగిందని, ఈ పరిస్థితుల్లో తనకు న్యాయం చేయాలంటూ ఆమె న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. దీంతో కార్యోటైపింగ్ క్రోమోజోమ్ టెస్ట్‌ల ద్వారా ఆమెను పురుషడిగా గుర్తించడం ఏమాత్రం సరికాదన్న ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన బెంచ్.. ఆమెకు ఉద్యోగం ఇప్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ తరుణంలో.. సానుభూతి ధోరణితో యువతికి ఉద్యోగం ఇప్పించేందుకు పోలీస్ శాఖ సుముఖత వ్యక్తం చేసినట్లు అడ్వొకేట్ జనరల్ అశుతోష్ కుంభకోణి హైకోర్టుకు వెల్లడించారు. చదవండి: గుడ్ బై.. గుడ్ లక్.. కాంగ్రెస్‌కు షాక్ -
ఆ 257 మందికి అర్హత లేదు
హైదరాబాద్ : పోలీస్ శాఖలోని ఎస్ఐ ఫలితాల్లో అర్హత సాధించని అభ్యర్థులకు రిక్రూట్మెంట్ బోర్డు ఓపెన్ చాలెంజ్ అవకాశం కల్పించింది. గత నెల 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు 257 మంది ఓపెన్ చాలెంజ్ ద్వారా అభ్యంతరాలను వ్యక్తంచేయగా, వాటిని స్వీకరించిన బోర్డు అందులో ఏ ఒక్కరి అభ్యంతరం కూడా పరిగణలోకి తీసుకునేలా లేదని తేల్చిచెప్తూ శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. అభ్యంతరాలు వ్యక్తంచేసిన అభ్యర్థులు, వాళ్లు లేవనెత్తిన అంశాలపై శనివారం 2గంటల తర్వాత జాబితాను రిక్రూట్మెంట్ బోర్డు వెబ్సైట్లో అందుబాటులో ఉంటుందని బోర్డు చైర్మన్ పూర్ణచందర్రావు ప్రకటనలో స్పష్టంచేశారు. -
వెబ్సైట్ సృష్టికర్త పోలీసు ఉద్యోగి!
‘ఆర్థిక’ కోణాలు తేలాకే అరెస్టుపై నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రస్థాయి పోలీసు రిక్రూట్మెంట్ బోర్డ్ వెబ్‌సైట్‌ను పోలిన నకిలీ వెబ్‌సైట్‌ను సృష్టించిన నిజామాబాద్ జిల్లావాసి క్రాంతికుమార్ ‘పోలీసు ఉద్యోగే’ నని సమాచారం. నవీపేట్‌కు చెందిన కాంత్రికుమార్ అక్కడ ఓ కార్యాలయంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్నాడని తెలిసింది. నగర నేర పరిశోధన విభాగం(సీసీఎస్) అధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని వివిధ కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. తనకు ఎలాంటి దురుద్దేశం లేదని, కేవలం రేటింగ్స్ ద్వారా ఆన్లైన్ యాడ్స్ పొందడానికి మాత్రమే నకిలీ వెబ్‌సైట్‌ను సృష్టించానని వెల్లడించినట్లు తెలిసింది. మరోపక్క ఓ వైబ్‌సైట్‌తో సారూప్యత ఉన్న మరో సైట్‌ను సృష్టించడం నేరమేనా? పోలీసు లోగోను నకిలీ వెబ్‌సైట్‌పై వినియోగించడం కాపీరైట్ యాక్ట్ పరిధిలోకి వస్తుందా? తదితర న్యాయపరమైన అంశాలను అధికారులు ఆరా తీస్తున్నారు. నకిలీ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకున్నవారు చెల్లించిన ఫీజు ఏ ఖాతాలోకి వెళ్లిందనేది కీలకంగా మారింది. ఈ వివరాలన్నీ బయటపడిన తరవాతే నిందితుడిపై చర్యలకు సంబంధించి పోలీసులు తుది నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. తాను గతంలో పోలీసు కార్యాలయంలో ఔట్సోర్సింగ్ విధులు నిర్వర్తించానని, ప్రస్తుతం మానేశానని క్రాంతికుమార్ చెప్తున్నాడని ఓ అధికారి తెలిపారు.