ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, కృష్ణా: పొట్టకూటి కోసం చేపల వేటకు వెళ్లిన నలుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. ఈ విషాద ఘటన మచిలీపట్నం మండలంలో చోటు చేసుకోంది. వివరాల ప్రకారం.. నాలుగు రోజుల క్రితం చేపల వేట కోసం నలుగురు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లారు. అనుకోకుండా వాళ్లు ప్రయాణిస్తున్న బోటు ఇంజన్ పాడైనట్లు తమ కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు.
అయితే గత రెండు రోజుల నుంచి వారి సెల్ ఫోన్లు పనిచేయకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. దీంతో తమ వారు ప్రాణాలతో ఉన్నారో...లేరో తెలియక గల్లంతైన మత్స్యకారుల కుటుంబసభ్యులు తల్లడిల్లిపోతున్నారు. ఆ నలుగురు క్యాంబెల్‌పేటకి చెందిన వారుగా అధికారులు తెలిపారు. గల్లంతైన మత్యకారుల వివరాలు..విశ్వనాథపల్లి చినమస్తాన్(55), రామాని, నాంచార్లు(55), చెక్క నరసింహారావు (50), మోకా వెంకటేశ్వరరావు (35). మరో బోటులో క్యాంబెల్ పేట మత్స్యకారులు గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ వారి ఆచూకీ లభించలేదు.
చదవండి: రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం.. చరిత్రలో ఇది రెండోసారి
Comments
Please login to add a commentAdd a comment