మత్స్యకారులకు వరాలు ! | Funds Release For Fishers | Sakshi
Sakshi News home page

మత్స్యకారులకు వరాలు !

Published Thu, Apr 12 2018 2:06 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM

Funds Release For Fishers - Sakshi

నల్లగొండ టూటౌన్‌: జిల్లా మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది అత్యధిక నిధులు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన సమీకృత మత్స్య అభివృద్ధి పథకంలో భాగంగా 2018–19 సంవత్సరానికి   జిల్లాకు రూ. 37.96 కోట్లు కేటాయించింది. వ్యక్తిగత, సాముహిక యూనిట్లు ఏర్పాటు చేసుకుని మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి వీలు కల్పించింది.

జిల్లాలో సుమారు 90వేల మందికి ఉపాధి
జిల్లాలో 147 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉండగా 25 వేల మందికి పైగా సభ్యులు ఉన్నారు. దాదాపు జిల్లాలో మత్స్యకారులు 90 వేల మంది ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా సుమారు 90 వేల మంది మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు పుష్కలంగా లభించనున్నాయి. గతంతో పోలిస్తే ఇటీవల కాలంలో మత్స్యకారుల అభివృద్ధికి నిధుల కేటాయింపు ఈ ఏడాది అమాంతం పెరిగిందని చెప్పవచ్చు.

సబ్సిడీల పరంపర
కొత్త పథకాల ద్వారా 75 నుంచి 100 శాతం వరకు సబ్సిడీ పొందే అవకాశం ఉంది.  ఎక్కువ శాతం 75 శాతం, 90 శాతం వరకు సబ్సిడీ ప్రభుత్వం ఇవ్వనుండగా లబ్ధిదారులు మిగతా డబ్బులు భరించాల్సి ఉంటుంది. ఓ నాలుగు పథకాలకు మాత్రం 100 శాతం ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వనుంది.

ఆన్‌లైన్, కార్యాలయంలో దరఖాస్తుల స్వీకరణ
సమీకృత మత్స్య అభివృద్ధి పథకం పకడ్బందీగా అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పథకాల అమలులో ఎక్కడా వివాదాలు చోటు చేసుకోకుండా ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలి. పథకాలను పూర్తిగా అర్హులైన వారికి అందించేందుకు జిల్లా మత్స్య శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అర్హులు ఈనెల 12వ తేదీ 25వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌తో పాటు మత్స్యకార కార్యాలయంలో కూడా డైరెక్ట్‌గా దరఖాస్తు చేసుకునే విధంగా ప్రభుత్వం వీలు కల్పించింది. ఠీఠీఠీ.్ఛ్చ్చbజి.్ట్ఛ ్చnజ్చn్చ.జౌఠి.జీn వెబ్‌సైట్‌ ద్వారా మీ సేవ కేంద్రంలో లబ్ధిదారులు దరఖాస్తు  చేసుకోవచ్చు.

దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు
దరఖాస్తుల ఆధార్‌ కార్డు
బ్యాంకు అకౌంట్‌ పాస్‌ పుస్తకం, సంఘం వివరాలు, (సంఘం పేరు, రిజిస్ట్రేషన్‌ నంబర్‌)
సంఘంలో దరఖాస్తుదారుని ప్రవేశ సంఖ్య
వాహనాలకు సంబంధించిన అంశాలకు చెట్టుబాటు అయ్యే డ్రైవింగ్‌ లైసెన్స్‌
భూమి ఆధారిత అంశాలకు పట్టాదారు పాస్‌ పుస్తకం లేదా పట్టా భూమి దస్తావేజులు లేదా కౌలు ఒప్పందపత్రాలు.

పథకాలు కేటగిరి –1 చిన్న యూనిట్లు
ద్విచక్ర వాహనంతో చేపల అమ్మకం యూనిట్, ప్లాస్టిక్‌ చేపల క్రేట్లు, పోర్టబుల్‌ చేపల అమ్మకం కియోస్కూ, వలల క్రాప్టులు.

కేటగిరి –2 పెద్ద యూనిట్లు
లగేజీ ఆటోతో చేపల అమ్మకం యూనిట్, సంచార చేపల అమ్మకం వాహనం, కొత్త చేపల చెరువు నిర్మాణం, , ఉత్పాదకాల వ్యయం, రీ సర్క్యులేటరీ ఆక్వా కల్చర్‌ యూనిట్, అలంకరణ చేపల యూనిట్‌ నిర్మాణం, వినూత్న ప్రాజెక్టులు, విత్తన చేపల పెంపకం చెరువులు, ఆక్వా టూరిజం యూనిట్‌లు ఉన్నాయి.

ప్రభుత్వ మార్గదర్శకాలప్రకారమే అమలు
సమీకృత మత్స్య అభివృద్ధి పథకాన్ని ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే అమలు చేస్తాం. 12వ తేదీ నుంచి మత్స్యకారులు దరఖాస్తులు చేసుకోవచ్చు. మీ సేవ కేంద్రాల ద్వారా కూడా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకునే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది. అర్హులైన వారందరికీ ఈ పథకాలు అందిస్తాం.– చరిత, మత్స్యకార జిల్లా అధికారి, నల్లగొండ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement