ప్రమాదంలో మృతి చెందిన ఖెత్రోబెహరా
చేపల వేటకోసమని వెళ్లి విద్యుత్ షాక్‌కు గురై మత్స్యకారుడు మృతి చెందిన సంఘటన శుక్రవారం ఇక్కడ చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...మాణిక్యపురం గ్రామానికి చెందిన ఖెత్రోబెహరా(47) తన గ్రామం నుంచి బల్లిపుట్టుగ పొలాల మార్గం గుండా కుసుంపురం తంపరబీలలో చేపల వేటకు వెళ్తుండగా నేలకొరిగిన విద్యుత్ స్తంభం వైర్లు తగిలి మృతి చెందాడు. వేకువ జామున వెళ్లడంతో వైర్లు కనిపించక ప్రమాదానికి గురయ్యాడు.
కవిటి : చేపల వేటకోసమని వెళ్లి విద్యుత్ షాక్‌కు గురై మత్స్యకారుడు మృతి చెందిన సంఘటన శుక్రవారం ఇక్కడ చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...మాణిక్యపురం గ్రామానికి చెందిన ఖెత్రోబెహరా(47) తన గ్రామం నుంచి బల్లిపుట్టుగ పొలాల మార్గం గుండా కుసుంపురం తంపరబీలలో చేపల వేటకు వెళ్తుండగా నేలకొరిగిన విద్యుత్ స్తంభం వైర్లు తగిలి మృతి చెందాడు. వేకువ జామున వెళ్లడంతో వైర్లు కనిపించక ప్రమాదానికి గురయ్యాడు. అక్కడే విద్యుత్ షాక్‌కు గురై నక్క కూడా మృతి చెందింది. నేలకొరిగిన విద్యుత్ స్తంభం విషయంలో సంబంధిత శాఖాధికారులు నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ స్తంభాన్ని తగినంత లోతులో పాతిపెట్టకపోవడం వల్లే నేలకొరిగి ఈ ప్రమాదం సంభవించిందని వారు ఆరోపిస్తున్నారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. మృతునికి భార్య నర్సిబెహరాణి, దత్త కుమార్తె సుజాత ఉన్నారు.