మత్స్యకారులను బెదిరిస్తున్న సీఎం చంద్రబాబు(ఫైల్)
సాక్షి, విశాఖ: సీఎం చంద్రబాబు నాయుడు మత్స్యకారులపై చేసిన వ్యాఖ్యలపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ' నేను సీఎంగా ఉండగా ఏ కులం వాళ్లు రోడ్డెక్కే అవకాశం ఇవ్వలేదు. మీ ధర్నాలు, దీక్షలకు భయపడను. రాజకీయాలు చేస్తే సహించను. వెంటనే టెంట్లు ఎత్తేయండి. లేదంటే తోలుతీస్తా.. ఖబాడ్దార్!' అంటూ చంద్రబాబు మత్య్సకారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే ఇదే అంశంపై మత్య్సకారులు ఆందోళనకు సిద్ధమయ్యారు. తక్షణమే చంద్రబాబు తమకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మత్య్సకారులను ఎస్టీల్లో చేరుస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
'జన్మభూమి- మా ఊరు' కార్యక్రమంలో పాల్గొనేందుకు శుక్రవారం విశాఖలో చంద్రబాబాబు పర్యటించారు. ఈ క్రమంలో గత కొంతకాలంగా దీక్షలు చేస్తున్న మత్స్యకారులను టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్ సీఎం వద్దకు తీసుకెళ్లారు. అయితే మత్స్యకారులను చూసిన ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏం.. తమాషా చేస్తున్నారా? మీ బెదిరింపులకు భయపడను అంటూ ఫైర్ అయ్యారు. వెంటనే దీక్షలు విరమించకపోతే మత్స్యకార ప్రాంతాల్లో రోడ్లు కూడా వేయను.. మీకు దిక్కున్న చోట చెప్పుకోండంటూ బెదిరించారు. ఇప్పుడే మీ ఎమ్మెల్యేకి గట్టిగా అయ్యిందంటూ రుసరుసలాడారు. సీఎం తీరుతో షాక్ తిన్న మత్స్యకారులు.. ఎస్టీల్లో చేరుస్తానని ఎన్నికలప్పుడు హామీ ఇచ్చారు కదా? అని ప్రశ్నించగా.. సీఎం స్పందిస్తూ ఎప్పుడేమి చేయాలో తనకు తెలుసని సమాధానమిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment