
మహారాణిపేట (విశాఖ దక్షిణ): భీమిలి తీరంలో ఓ మత్స్యకారుడికి పులిబొగ్గాల సొర్ర అనే అరుదైన చేప చిక్కింది. సుమారు టన్నున్నర నుంచి రెండు టన్నుల బరువు ఉండే ఈ చేపను తినరు. పులిచారలు పోలి ఉంది. భీమిలి తీరంలో లభ్యమైన ఈ చేపను ఎన్నో వ్యయప్రయాసలకోర్చి విశాఖ ఫిషింగ్ హార్బర్‌కు తీసుకొచ్చారు. అయితే అప్పటికే ఆ చేప మృతి చెందింది. దీంతో మరో బోటులో తరలించి సముద్రంలో పడేసినట్టు రాష్ట్ర మరపడవల సంఘం కార్యవర్గ సభ్యుడు గణగళ్ల రాజేష్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment