గోదావరిలో పడి మత్స్య కార్మికుడు మృతి | fisherman dead | Sakshi
Sakshi News home page

గోదావరిలో పడి మత్స్య కార్మికుడు మృతి

Sep 1 2016 8:26 PM | Updated on Sep 4 2017 11:52 AM

చేపల వేట కోసం వెళ్లిన మత్స్య కార్మికుడు ప్రమాదవశాత్తు గోదావరిలో పడి మరణì ంచాడు. గురువారం ధర్మపురి మండలం జైనా వద్ద గోదావరిలో మృతదేహం లభ్యమైంది.

ధర్మపురి: చేపల వేట కోసం వెళ్లిన మత్స్య కార్మికుడు ప్రమాదవశాత్తు గోదావరిలో పడి మరణì ంచాడు. గురువారం ధర్మపురి మండలం జైనా వద్ద గోదావరిలో మృతదేహం లభ్యమైంది. ఎసై ్స రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. జైనా గ్రామానికి చెందిన మత్స్య కార్మికుడు కూనారపు రమేశ్‌ (32) గత నెల 24న చేపల వేట కోసం గోదావరికి వెళ్లాడు. వారం నుంచి ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బంధువులందరికీ సమాచారం అందించారు. అయినా అతడి ఆచూకీ తెలియరాలేదు. గురువారం జైనా వద్ద గోదావరిలో మతదేహం పైకి తేలడంతో గ్రామస్తుల సాయంతో గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించినట్లు ఎసై ్స తెలిపారు. మతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. రమేశ్‌ తండ్రి చిన్న రాజం ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎసై ్స తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement