jaina
-
ఆహరం మానేసి.. 102 ఏళ్ల వృద్ధురాలి సల్లేఖన వ్రతం
సాక్షి,తిరువొత్తియూరు(తమిళనాడు): తిరువన్నామలై జిల్లా వందవాసి సమీపంలో జైన మతానికి సంబంధించిన వృద్ధురాలు (102). గత కొన్ని రోజులుగా ఆహార, పానీయాలు తీసుకోకుండా (సల్లేఖన వ్రతం)ముక్తి మార్గంలో జీవ సమాధి పొందారు. ఈమెకు దేవదత్త, సుశీల, నాగరత్నం, కస్తూరిబాయి, సాందన, గౌరి అనే ఆరుగురు కుమార్తెలు ఉన్నారు. ఈమె ఎరుపూర్ గ్రామంలో తన ఇంటిలో నివాసం ఉంటున్నారు. శతాధిక వృద్ధురాలు అయినప్పటికీ ఆమె ఇప్పటి వరకు కంటికి అద్దాలు లేకుండా పుస్తకాలు చదవగలిగే సామర్థ్యం కలిగి ఉన్నారు. ఈ క్రమంలో విజయలక్ష్మి తాను జీవ సమాధి కావాలని నిర్ణయించుకున్నారు. దీంతో గత 11వ తేదీ వంద వాసి, పొన్నూరు కొండ దిగువ భాగంలో ఉన్న కుంద, కుందర విశాఖచారిని జైన ఆశ్రమానికి వెళ్లి.. అక్కడ అన్నపానీయాలు మాని ముక్తి కోసం ఆమె జైనమతంలోనే అత్యంత ఉత్కృష్టమైన సల్లేఖన వ్రతం చేశారు. ఈ క్రమంలో ఆదివారం తుదిశ్వాస విడిచి జీవ సమాధి పొందారు. -
ఆరుగురు కూతుళ్లు అందరూ డాక్టర్లు
ఆ తల్లి ఏమీ చదువుకోలేదు. ఆ తండ్రీ మామూలు తండ్రే. కాని కూతురు పుట్టడం శుభసూచకం అని తెలిసేంత తెలివి వారికుంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఆరుమంది కుమార్తెలు పుట్టారు. ఆడపిల్లకు చదువుకు మించిన ధైర్యం లేదని ఆ తల్లిదండ్రులు వారిని చదివించారు. ఒకరు కాదు ఇద్దరు కాదు... ఆరుగురూ డాక్టర్లు అయ్యారు. ఆడపిల్ల విషయంలో పాతకాలపు భావాలున్న వారికి వీరి వైద్యం తప్పనిసరి కదూ. ‘నేను వరుసపెట్టి ఆడపిల్లలను కంటుంటే ఊళ్లో అందరికీ కంగారే. ఆ పిల్లల పరిస్థితి ఏం కాను. వాళ్ల పెళ్లిళ్లు ఎలా కాను అని. పెళ్ళిళ్లేమిటి... వాళ్లు ముందు చదువుకోవాలి కదా’ అంటుంది ఆరుగురు కుమార్తెలను కని, వారిని డాక్టర్లను చేసిన జైనా. పిల్లల ప్రయోజకత్వాన్ని చూడటానికి భర్త ఉంటే బాగుండునని ఆమె అనుకుంటుంది గాని ఆయన మరణించి ఆరేడేళ్లు అయిపోతోంది. అతని పేరు అహమద్. వారిది కోజికోడ్ జిల్లాలోని నాదపురం అనే చిన్న పల్లె. ‘నాకు పన్నెండు పెళ్లయ్యేటప్పటికి. ఐదో క్లాసుకే చదువు మాన్పించి ఇంట్లో కూచోబెట్టి పెళ్లి చేశారు. మా ఆయన నాకు బంధువే. అతను మద్రాసులో ఉద్యోగం చేసేవాడు. నాకు బాగా చదువుకోవాలని ఉండేది. ఆ తర్వాత సంసారంలో పడ్డాను. మద్రాసు నుంచి మేము కతార్ వెళ్లాం. అక్కడ నా భర్త ఒక ఆయిల్ కంపెనీలో పని చేసేవాడు. అక్కడే మా ఆరుమంది అమ్మాయిలు చదువుకున్నారు’ అంటుంది జైనా. అహమద్‌కు డాక్టర్ కావాలని ఉండేదట. కాని కాలేకపోయాడు. తమ్ముణ్ణి చేద్దామని అనుకుంటే ఆ తమ్ముడు టీచర్ అయ్యాడు. పిల్లలు డాక్టర్లు అయితే చూడాలనుకున్నాడు. జైనా కూడా అదే చెప్పింది. ‘నేను ఎలాగూ చదువుకోలేకపోయాను. పిల్లల్ని ఇద్దరం చదివిద్దాం’ అంది. ఇక అప్పటి నుంచి ఆ భార్యాభర్తలు తమ ప్రతి పైసా పిల్లల చదువుకు ఉపయోగించేవారు. ‘సాయంత్రం స్కూళ్లు అయ్యి పిల్లలు ఆడుకునే మూడ్‌లో ఉంటే పిలిచి ఒకటే మాట చెప్పేదాన్ని– మీరంతా బాగా చదువుకోవాలి. అందులో రాజీ లేదు అని’ అంటుంది జైనా. ఇంకో సంగతి ఏమిటంటే ఆ ఆరుమంది ఆడపిల్లలను కన్న అహమద్‌కు లోకజ్ఞానం, పుస్తక జ్ఞానం ఎక్కువ. నా పిల్లలు పుస్తకాలు బాగా చదవాలి అని రకరకాల పుస్తకాలు తెచ్చి ఇచ్చేవాడు. అలా వారికి చదువు మీదే కాక జనరల్ నాలెడ్జ్‌లో కూడా పరిణితి ఉండేలా చేశాడు. ఆరుమంది ఆడపిల్లల్లో ఇప్పుడు డాక్టర్ ఫాతిమా అహమద్ (39), హాజరా అహమద్ (33), ఆయిషా అహమద్ (30), ఫైజా అహమద్ (28) ఇప్పటికే వైద్యులుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. రీహానా అహమద్ (23) ఫైనలియర్ ఎంబిబిఎస్ చేస్తోంది. అమీరా అహమద్(19) మొదటి సంవత్సరం ఎంబిబిఎస్‌లో ఉంది. ‘మొదట నేను మెడిసిన్ చేశాను. అదేం పెద్ద విషయం కాదని నా చెల్లెళ్లకు చెప్పాను. వారు వరుస అందుకున్నారు’ అంటుంది పెద్ద కూతురు ఫాతిమా అహమద్. ఈమె అబూదాబిలోని మిలట్రీ హాస్పిటల్లో పని చేస్తోంది. ‘కతర్ నుంచి మేము ఇండియాకు తిరిగొచ్చేసి రెండేళ్లు గడిచేసరికి ఇద్దరు అమ్మాయిలకు పెళ్లి చేశాం. నా భర్తకు అంత అదృష్టమే ఉంది. ఆయన హార్ట్ ఎటాక్‌తో పోయారు’ అంది జైనా. అయితే భర్త చనిపోయినా ఆమె తన సంకల్పాన్ని వదల్లేదు. మిగిలిన కూతుళ్లను మెడిసిన్ చదివించాల్సిందే అనుకుంది. ‘నా మూడో కుమార్తె మాత్రం లా చేయాలని అనుకుంది. లా చేస్తే నీ భర్త ప్రాక్టీసు చేయించొచ్చు. మాన్పించవచ్చు. కాని మెడిసిన్ చేస్తే తప్పకుండా ప్రాక్టీస్ చేయించే అవకాశం ఉంది. డాక్టర్ని ఎవరు ఖాళీ పెడతారు అని సలహా ఇచ్చేసరికి మెడిసిన్ చేసింది’ అంది జైనా. ఈ తల్లి పాటించిన మరో గొప్ప ఆదర్శం ఏమిటంటే అమ్మాయిలకు కట్నం ఇవ్వకూడదు అని. ఏ సంబంధం వచ్చినా ‘నా పిల్లల్ని అమ్మకానికి పెట్టలేదు. నేను కట్నం ఇవ్వను’ అని కచ్చితంగా చెప్పేసిందామె. ఇంకో విషయం డాక్టర్లకే ఇచ్చి చేస్తే ఇద్దరూ ఒకే రంగం కనుక ఒకరి సాధక బాధకాలు తెలుస్తాయని కూడా అనుకుంది. ఇప్పటికి పెళ్లయిన నలుగురి భర్తలూ డాక్టర్లే. పండక్కి పబ్బానికి అందరూ కలిస్తే తన ఆరుగురు కూతుళ్లను చూసుకుని ఆ తల్లి గుండె పొంగిపోతుంది. ‘నా పిల్లలు సమాజానికి సేవ చేస్తున్నారు’ అని గర్వంగా ఇరుగు పొరుగు వారితో అంటుంది. కాకుంటే ఒకటే లోటు. ఆ ఆరుగురు ఆడపిల్లలు తండ్రితో కలిసి దిగిన ఫొటో ఒక్కటీ లేదు. ‘ఏం పర్వాలేదు. ఆయన మా గుండెల్లో ఉన్నారు’ అంటారా ఆడపిల్లలు. నిజంగా వారిని కన్న తల్లిదండ్రులు ధన్యులు. కంటే కూతుర్నే కనాలి అని వీరు చెబుతున్నారు. అందరూ వినాల్సిన మాటే కదా అది. ఈ తల్లి పాటించిన మరో గొప్ప ఆదర్శం ఏమిటంటే అమ్మాయిలకు కట్నం ఇవ్వకూడదు అని. ఏ సంబంధం వచ్చినా ‘నా పిల్లల్ని అమ్మకానికి పెట్టలేదు. నేను కట్నం ఇవ్వను’ అని కచ్చితంగా చెప్పేసిందామె. -
గోదావరిలో పడి మత్స్య కార్మికుడు మృతి
ధర్మపురి: చేపల వేట కోసం వెళ్లిన మత్స్య కార్మికుడు ప్రమాదవశాత్తు గోదావరిలో పడి మరణì ంచాడు. గురువారం ధర్మపురి మండలం జైనా వద్ద గోదావరిలో మృతదేహం లభ్యమైంది. ఎసై ్స రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. జైనా గ్రామానికి చెందిన మత్స్య కార్మికుడు కూనారపు రమేశ్ (32) గత నెల 24న చేపల వేట కోసం గోదావరికి వెళ్లాడు. వారం నుంచి ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బంధువులందరికీ సమాచారం అందించారు. అయినా అతడి ఆచూకీ తెలియరాలేదు. గురువారం జైనా వద్ద గోదావరిలో మతదేహం పైకి తేలడంతో గ్రామస్తుల సాయంతో గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించినట్లు ఎసై ్స తెలిపారు. మతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. రమేశ్ తండ్రి చిన్న రాజం ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎసై ్స తెలిపారు. -
వరంగల్ జిల్లాలో జైన మత ఆనవాళ్లు
వరంగల్: వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండలో జైనుల శాసనాలను జనగామ డివిజన్ చరిత్ర పరిశోధకులు రత్నాకర్‌రెడ్డి సోమవారం వెలుగులోకి తెచ్చారు. ఆయన తెలిపిన వివరాలివీ..గ్రామంలో కాకతీయుల కాలంలో గణపతి దేవుడి సోదరి కుందమాంబ నిర్మించిన త్రికూటాలయం అలనాటి అపురూప శిల్పకళకు ప్రతీకగా నిలుస్తోంది. కాకతీయుల కంటే ముందు జైనం ఈ ప్రాంతంలో వర్ధిల్లినట్లు స్థానిక శివాలయ మంటపంలోని శాసనాలు చెబుతున్నాయి. స్థానిక ఉన్నత పాఠశాల సమీపంలోని గుట్టపై 8 మంది స్త్రీలతో పాటు పురుషుడు, ఓ చిన్నారి ఉన్న శిల్పతోరణాన్ని గుర్తించారు. ఇరవై అడుగుల పొడవున్న ఈ శిల్ప తోరణంపై కన్నడ లిపి ఉంది. దీనిని స్థానికులు సంకెల మైసమ్మగా కొలుస్తున్నారు. గుట్టకు ఆనుకుని ఉన్న చెరువు దిశగా గుర్రం గుండు సమీపంలో భైరవుని గుడి ఉంది. గుడిచుట్టూ మూడు భైరవ విగ్రహాలు, 10 వీరుల విగ్రహాలు ఉన్నాయి. అందులో ఏడడుగుల ఎతైన వీరుని విగ్రహం శిల్పకళతో ఉట్టిపడుతోంది. అంతేకాకుండా గుట్టపై గుహలో రాతిని తొలచి మలిచిన చిత్రాలు ఉన్నాయని రత్నాకర్‌రెడ్డి వెల్లడించారు.