సాక్షి,తిరువొత్తియూరు(తమిళనాడు): తిరువన్నామలై జిల్లా వందవాసి సమీపంలో జైన మతానికి సంబంధించిన వృద్ధురాలు (102). గత కొన్ని రోజులుగా ఆహార, పానీయాలు తీసుకోకుండా (సల్లేఖన వ్రతం)ముక్తి మార్గంలో జీవ సమాధి పొందారు. ఈమెకు దేవదత్త, సుశీల, నాగరత్నం, కస్తూరిబాయి, సాందన, గౌరి అనే ఆరుగురు కుమార్తెలు ఉన్నారు. ఈమె ఎరుపూర్ గ్రామంలో తన ఇంటిలో నివాసం ఉంటున్నారు.
శతాధిక వృద్ధురాలు అయినప్పటికీ ఆమె ఇప్పటి వరకు కంటికి అద్దాలు లేకుండా పుస్తకాలు చదవగలిగే సామర్థ్యం కలిగి ఉన్నారు. ఈ క్రమంలో విజయలక్ష్మి తాను జీవ సమాధి కావాలని నిర్ణయించుకున్నారు. దీంతో గత 11వ తేదీ వంద వాసి, పొన్నూరు కొండ దిగువ భాగంలో ఉన్న కుంద, కుందర విశాఖచారిని జైన ఆశ్రమానికి వెళ్లి.. అక్కడ అన్నపానీయాలు మాని ముక్తి కోసం ఆమె జైనమతంలోనే అత్యంత ఉత్కృష్టమైన సల్లేఖన వ్రతం చేశారు. ఈ క్రమంలో ఆదివారం తుదిశ్వాస విడిచి జీవ సమాధి పొందారు.
Comments
Please login to add a commentAdd a comment