వలలో చిక్కిన కొండ చిలువ
భువనేశ్వర్: నదిలో విసిరిన వలలో చేపకు బదులుగా పాము చిక్కింది. చూడబోతే అదో పెద్ద కొండ చిలువ. 15 అడుగుల పొడవు ఉంది.
పూరీ జిల్లా గోప్ సమితి నేతాపూర్ కుశభద్ర ఉపనదిలో చేపల వేట కోసం మత్స్యకారుడు బుధవారం రాత్రి వలపన్నాడు. గురువారం ఉదయం వలను లాగి చూడబోతే పెద్ద పాము చిక్కుకున్నట్లు గుర్తించి బెంబేలెత్తాడు. తోటి మత్స్యకారుల సహకారంతో సురక్షితంగా వలను ఒడ్డుకు లాగాడు. విషయాన్ని స్థానిక అటవీ విభాగం అధికారులకు తెలియజేశాడు. పామును సురక్షితంగా చేరువలో ఉన్న అడవిలోకి విడిచి పెడతామని అధికారులు తెలిపారు.