
మీనాక్షి అమ్మన్ విగ్రహం
సాక్షి, చెన్నై(తిరువొత్తియూరు): తిరుచెందూరు సమీపంలో జాలరి విసిరిన వలలో మీనాక్షి అమ్మన్ విగ్రహం చిక్కింది. తిరుచెందూరు అమలినగర్ మాతా ఆలయానికి చెందిన జోషఫ్ కుమారుడు జయన్ (37). గత 15వ తేదీ రాత్రి సముద్రంలో చేపలు పడుతుండగా వలలో సుమారు అడుగు ఎత్తు కలిగిన మీనాక్షి అమ్మవారి పంచలోహ విగ్రహం చిక్కుకుంది. దీన్ని గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులకు అప్పగించాడు.
తిరుచెందూర్ తహసీల్దార్ స్వామినాథన్, శనివారం అమలినగర్‌కు వెళ్లి విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే తిరుకుళకుండ్రంలో ప్రసిద్ధి పొందిన వేద గిరీశ్వరర్ ఆలయంలో శనివారం ఉదయం దేవాదాయశాఖ మంత్రి బి.కె.శేఖర్‌బాబు తనిఖీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. త్వరలో వేదగిరీశ్వరర్ స్వామి ఆలయానికి రోప్‌కార్ సౌకర్యం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
చదవండి: (సీఎం స్టాలిన్ మరో కీలక నిర్ణయం.. సరికొత్త పథకానికి శ్రీకారం)