net
-
మెరుగైన నెట్‌వర్క్‌లో వొడాఫోన్‌ఐడియాకు గుర్తింపు
తెలుగు రాష్ట్రాల్లో వొడాఫోన్ఐడియా 4జీ నెట్వర్క్ అత్యుత్తమ నెట్‌వర్క్‌గా గుర్తింపు పొందినట్లు కంపెనీ తెలిపింది. నవంబర్ నెలలో కంపెనీ మెరుగైన నెట్వర్క్ అందించినట్లు ఓపెన్‌సిగ్నల్ 4జీ నెట్వర్క్ ఎక్స్పీరియన్స్ రిపోర్ట్ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 4జీ డౌన్లోడ్ స్పీడ్, వీడియో స్ట్రీమింగ్, లైవ్ వీడియో ప్రసారం, 4జీ వాయిస్ వంటి సర్వీసుల్లో పటిష్ట సేవలు అందిస్తున్నందుకు ఈ గుర్తింపు లభించినట్లు కంపెనీ పేర్కొంది. ఇటీవల బ్యాండ్‌విడ్త్ అప్‌గ్రేడ్ చేయడం, 8700 పైగా లొకేషన్లను తమ నెటవర్క్ పరిధిలోకి తీసుకురావడం వంటి తదితర అంశాలు ఇందుకు ఎంతో తోడ్పడ్డాయని ఏపీ, తెలంగాణ, కర్ణాటక క్లస్టర్ బిజినెస్ హెడ్ ఆనంద్ దానీ తెలిపారు.‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అత్యుత్తమ 4జీ నెట్వర్క్ అందిస్తున్నందుకుగాను మాకు గుర్తింపు లభించడం చాలా సంతోషంగా ఉంది. మా నెట్‌వర్క్‌ను మరింత పటిష్ఠ పరిచేందుకు, నిరాంటకంగా కనెక్టివిటీ ఉండేలా చూసేందుకు మేము చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ ప్రతిఫలమే ఈ గుర్తింపులు. వినియోగదారులకు ఆటంకంలేని అత్యుత్తమ కనెక్టివిటీని అందించడానికి మేము కట్టుబడి ఉన్నాం’ అని ఆనంద్ దానీ పేర్కొన్నారు.ఇదీ చదవండి: అమెరికాలో టిక్‌టాక్ భవితవ్యం ప్రశ్నార్థకంఓపెన్సిగ్నల్ 4జీ నెట్వర్క్ ఎక్స్పీరియన్స్ రిపోర్ట్ ప్రకారం..కంపెనీ వినియోగదారులు నవంబర్ నెలలో వేగవంతమైన 4జీ సేవలను ఉపయోగించుకున్నారు.యూజర్లు 17.4 ఎంబీపీఎస్ డౌన్లోడ్ వేగాన్ని, 4.7 ఎంబీపీఎస్ అప్లోడ్ వేగాన్ని అనుభవించారు.వీడియో స్ట్రీమింగ్, లైవ్ వీడియోకు సంబంధించి వినియోగదారులకు మెరుగైన సర్వీసు లభించింది.యూజర్లు స్థిరంగా ఈ నాణ్యమైన సేవలను అనుభవించారు.కంపెనీ ఈ గుర్తింపు సాధించేందుకు 2500 మెగాహెట్జ్ బ్యాండ్ స్పెక్ట్రంను రెట్టింపు స్థాయిలో అప్‌గ్రేడ్ చేసింది.ఫలితంగా 5,000కు పైగా లొకేషన్లలో కంపెనీ 4జీ సామర్థ్యాలను మెరుగుపర్చుకుంది.2000కు పైగా పట్టణాలు, 60 జిల్లాలవ్యాప్తంగా వేగవంతమైన ఇంటర్నెట్ స్పీడ్ అందించే దిశగా ప్రయత్నాలు చేసింది. -
ఆరేళ్లకే యూట్యూబ్ సంచలనం.. 16 ఏళ్లకే రూ.50 కోట్ల సంపద.. ప్రపంచంలోనే సంపన్నుడిగా!
ఈ రోజుల్లో మిలియనీర్ కావాలంటే మాటలు కాదు. బిజినెస్‌లో రాణించేవారికే ఆ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కోట్ల సంపాదన కూడబెట్టాలన్న వ్యాపారంలో రాణిస్తేనే సాధ్యమవుతుంది. కానీ 16 కోటీశ్వరుడైతే ఎలా ఉంటుంది. ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది. అలా చిన్న వయసులోనే కోట్లు సంపాదించిన బాలనటుడు ఒకరు ఉన్నారు. అతని పేరే ఇయాన్ ఆర్మిటేజ్. ఇంతకీ అతను ఎలా సంపాదించాడో తెలుసుకుందాం.ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన బాలనటుడిగా ఇయాన్ ఆర్మిటేజ్ నిలిచారు. ఆరేళ్లకే తన యూట్యూబ్ వీడియో సిరీస్ ఇయాన్ లవ్స్ థియేటర్ ద్వారా యూట్యూబ్ స్టార్‌గా సంచలనం సృష్టించాడు. ఆ తర్వాత తొమ్మిదేళ్లకే ప్రైమ్‌టైమ్ టీవీ షోలో లీడ్ రోల్లో కనిపించాడు. 2008లో జార్జియాలో జన్మించిన ఇయాన్ ఆర్మిటేజ్ 2017లో నటనలో ఎంట్రీ ఇచ్చాడు. ది గ్లాస్ కాజిల్, అవర్ సోల్స్ ఎట్ నైట్, ఐయామ్ నాట్ హియర్ లాంటి చిత్రాలతో పాటు లా అండ్ ఆర్డర్: స్పెషల్ విక్టిమ్స్ యూనిట్, బిగ్ లిటిల్ లైస్ లాంటి టీవీ షోల్లో మెరిశాడు.అయితే యంగ్ షెల్డన్ అనే సిట్కామ్తోనే ఇయాన్ ఆర్మిటేజ్ మరింత ఫేమస్ అయ్యాడు. తొమ్మిదేళ్లకే లీడ్ రోల్ పోషించిన బాలనటుడిగా నిలిచాడు. దాదాపు ఏడేళ్ల పాటు ఈ సిట్‌కామ్‌లో కనిపించాడు. ఈ సిరీస్ ఏడు సీజన్ల తర్వాత ఈ ఏడాది ప్రారంభంలో ముగిసింది.16 ఏళ్లకే రూ.50 కోట్ల సంపద..యంగ్ షెల్డన్లో పాత్రకు గానూ ఇయాన్ ఒక ఎపిసోడ్‌కు 30 వేల డాలర్లు పారితోషికం అందుకున్నాడు. సీజన్ -1 కోసం ఏకంగా రూ.4.6 కోట్లు సంపాదించాడు. ఈ సిట్కామ్ సీజన్ -5 నాటికి ఒక్కో సీజన్‌కు దాదాపు రూ.8 కోట్లు పారితోషికం తీసుకున్నాడు. దీంతో 13 ఏళ్లకే ప్రపంచంలో మిలినీయర్లలో ఒకరుగా నిలిచాడు. అతని నికర ఆస్తుల విలువ దాదాపు రూ.50 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. 2024 నాటికి ప్రపంచంలోనే అత్యంత సంపన్న బాల నటుడి రికార్డ్ సృష్టించాడు.యూట్యూబ్ నుంచి మొదలైన ఇయాన్ ఆర్మిటేజ్ ఏకంగా టీవీ స్టార్‌గా ఎదిగారు. యంగ్ షెల్డన్ సిరీస్‌తో స్టార్డమ్ తెచ్చుకున్న ఇయాన్ మరో రెండు చిత్రాలలో నటించాడు. స్కూబ్, పా పెట్రోల్: ది మూవీస్‌లో కనిపించాడు. -
నెట్టింట.. ప్రభుత్వ బడులు!
సాక్షి, అమరావతి: కనీస సదుపాయాల లేమి.. శిథిలమైన గదులు.. ఇది ఒకప్పటి ప్రభుత్వ పాఠశాలల దుస్థితి. ప్రస్తుతం వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. కార్పొరేట్ సదుపాయాలతో అవి కళకళలాడుతున్నాయి. గతంలో విద్యార్థులకు టెక్ట్స్ బుక్స్ కూడా లేని పరిస్థితుల నుంచి బూట్లు, బెల్టు, టై, నోటు పుస్తకాలతో సహా ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు సగర్వంగా చదువుకుంటున్నారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత పాఠశాలల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్ల(ఐఎఫ్‌పీ)ను అందుబాటులోకి తేవడంతో డిజిటల్ వైపు అడుగులు వేసింది. ఇప్పుడు వాటిని సమర్థంగా వినియోగించి, పేదింటి విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో అన్ని ప్రభుత్వ బడులను ఇంటర్నెట్తో అనుసంధానం చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నిరంతరాయంగా డిజిటల్ బోధన అందించేందుకు, సమకాలీన ప్రపంచ పోకడలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు అన్ని పాఠశాలలను డిజిటలైజేషన్ చేయనున్నారు. ఇందుకోసం ప్రతి పాఠశాలకు ప్రభుత్వం ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పి స్తోంది. ఇప్పటికే 8,700 పాఠశాలలకు నెట్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురాగా, ఇందులో 3,700 ఉన్నత పాఠశాలలు, మరో 5 వేలు ప్రాథమిక పాఠశాలలున్నాయి. వచ్చే రెండు, మూడు నెలల్లో అన్ని ప్రభుత్వ బడులకు నెట్ సదుపాయం కల్పించే లక్ష్యంతో పాఠశాల విద్యాశాఖ మౌలిక సదుపాయాల కల్పన విభాగం పనిచేస్తోంది. 100 ఎంబీపీఎస్ వేగంతో నెట్ సదుపాయం ఈ ఏడాది ప్రారంభంలో 4,800 ఉన్నత పాఠశాలల్లో ఆరు నుంచి 10వ తరగతి, +2 వరకు సెక్షన్‌కు ఒకటి చొప్పున 30,715 ఐఎఫ్‌పీ స్క్రీన్లను అందుబాటులోకి తీసుకువచ్చిన రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ బోధనను అందుబాటులోకి తెచ్చింది. ప్రాథమిక పాఠశాలల్లో 60మంది విద్యార్థులకు ఒక స్మార్ట్ టీవీ చొప్పున 10,038 స్మార్ట్ టీవీలను అందించి, టోఫెల్ బోధన చేపట్టారు. రెండో దఫాలో 32వేల ఐఎఫ్‌పీలు, 22వేల స్మార్ట్ టీవీలను పాఠశాలలకు అందించింది. వీటితోపాటు విద్యార్థులకు మెరుగైన బోధన, ఉత్తమ కంటెంట్‌ను అందించేందుకు, 4 డీటీహెచ్ (ఈ విద్య) చానెళ్లు, 5 దీక్ష–ఏపీ చానెళ్లు, ఏపీ ఈ–పాఠశాల పోర్టల్ ద్వారా కూడా కంటెంట్‌ను పంపిస్తున్నారు. ఇప్పుడు విద్యార్థులకు టోఫెల్ బోధన అందిస్తున్నారు. 8వ తరగతి విద్యార్థులకు బైజూస్ కంటెంట్‌తో ట్యాబ్‌లు, మ్యాథ్స్ ల్యాబ్స్ పాల్ ల్యాబ్స్, కంప్యూటర్ ల్యాబ్స్‌ను అందుబాటులోకి తెచ్చి విద్యపై దృష్టి పెట్టిన ప్రభుత్వం.. ఇకపై విద్యార్థులకు ఫ్యూచర్ టెక్ పాఠాలను సైతం బోధించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. విద్యార్థుల్లో ఆలోచన శక్తిని విస్తరించడం, విజ్ఞానంలో ముందుండేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా మేనేజ్మెంట్, మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), లార్జ్ లెర్నింగ్ మాడ్యూల్స్, 3డీ ప్రింటింగ్, గేమింగ్ వంటి భవిష్యత్ సాంకేతిక పరిజ్ఞానంలో శిక్షణ ఇవ్వనున్నారు. పాఠశాలల్లో డిజిటల్ లెర్నింగ్ కోసమే ప్రభుత్వం దాదాపు రూ.2400 కోట్లు ఖర్చు చేసింది. ప్రతి పాఠశాలలోను డిజిటల్ లెర్నింగ్ అంతరాయం లేకుండా కొనసాగేందుకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోను హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాన్ని సైతం కల్పిస్తోంది. హైసూ్కళ్లకు ఏపీ ఫైబర్‌నెట్, బీఎస్ఎన్ఎల్ ద్వారా 100 ఎంబీపీఎస్ వేగంతో బ్రాడ్‌బ్యాండ్ సదుపాయాన్ని, ప్రాథమిక పాఠశాలలకు జియో ద్వారా నెట్ అందిస్తోంది. అందుకు అవసరమైన 5జీ సిమ్ కార్డులతో వైఫై రౌటర్లను సరఫరా చేస్తోంది. -
ప్రపంచంలోనే నాసా కంటే ఎక్కువ డేటా ట్రాన్స్ఫర్..! కానీ..
ప్రస్తుత పరిస్థితుల్లో ఏ చిన్న సందేహం వచ్చినా తెలుకునేందుకు ఇంటర్నెట్లో వెతుకుతుంటాం. సాంకేతికత అందుబాటులోకి వచ్చాక ఇంటర్నెట్ వినియోగం పెరిగిపోయింది. అందుకే వినియోగదారులకు వేగవంతమైన ఇంటర్నెట్ సేవలను అందించేందుకు కంపెనీలు పోటీ పడుతున్నాయి. తాజాగా జపాన్‌కు చెందిన పరిశోధకుల బృందం ప్రపంచంలోనే అధిక ట్రాఫిక్ కలిగిన ఇంటర్నెట్ను సరఫరాచేసి రికార్డు నెలకొల్పారు. ఆప్టికల్ఫైబర్ ద్వారా సెకనుకు 22.9 పెటాబిట్ల డేటాను సరఫరాచేసి రికార్డు సృష్టించారు. అక్టోబర్‌లో స్కాట్లాండ్లో జరిగిన యూరోపియన్ కాన్ఫరెన్స్ ఆన్ ఆప్టికల్ కమ్యూనికేషన్లో ఈ పరిశోధన నివేదికను సమర్పించారు. జపాన్‌కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ (ఎన్ఐసీటీ) సెకనుకు 22.9 పెటాబిట్ల(1 పెటాబిట్ అంటే 10 లక్షల గిగాబిట్లకు సమానం) డేటా ట్రాన్స్మిషన్ రేటును అధిగమించినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. ప్రపంచంలోనే అత్యధిక ట్రాఫిక్ కలిగిన డేటాను ఇంటర్నెట్ ద్వారా సరఫరా చేశారు. దీంతో ఇంటర్నెట్లోని మొత్తం ట్రాఫిక్‌ను సెకండ్ బై సెకండ్ 22 సార్లు ప్రసారం చేయవచ్చు. నాసా కూడా కూడా సెకనుకు 46 టెరాబిట్ల డేటాను మాత్రమే ట్రాన్స్ఫర్ చేస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత వేగంగా దాదాపు సెకనుకు 10 గిగాబిట్ డేటాను ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంది. కానీ చాలావరకు సెకనుకు వందల మెగాబిట్ డేటాను మాత్రమే సరఫరా అవుతోంది. అయితే తాజాగా ఎన్ఐసీటీ సెకనుకు 22.9 పెటాబిట్ డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్‌ను సాధించడానికి కొన్ని అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను ఉపయోగించింది. డేటాను ప్రసారం చేయడానికి ఒక కోర్ ఛానల్‌కు బదులుగా, 38 ఫైబర్కేబుళ్లను వినియోగించింది. వీటిలో ఒక్కోటి 3 మోడ్ల చొప్పున మొత్తం 114 ఛానెల్‌ల ద్వారా డేటాను ప్రసారం చేశారు. ప్రతి ఛానెల్లోని ప్రతి మోడ్ ద్వారా 750 వేవ్లెంత్, 18.8 టెరాహెడ్జెస్ బ్యాండ్‌విడ్త్‌తో ఈ డేటాను పంపించినట్లు తెలిసింది. అయితే కనెక్షన్లోని కొన్ని లోపాలు సవరించి ఆప్టిమైజ్ చేయడం వల్ల దాని ప్రస్తుత వేగం సెకనుకు 24.7 పెటాబిట్కు చేరుకోగలదని బృంద సభ్యులు తెలిపారు. ఇదీ చదవండి: జాతీయ రికార్డు సృష్టించిన అదానీ కంపెనీ అయితే, ఇకపై మనకు కావాల్సిన ఎంత డేటా అయినా సెకనులో డౌన్లోడ్ చేసుకోవచ్చని అనుకుంటున్నారేమో. ఈ డేటాను డీకోడ్ చేయడానికి సంక్లిష్టమైన సిగ్నల్ ప్రాసెసింగ్ ఉంటుందని చెప్పింది. దీనికి ఎంఐఎంఓ రిసీవర్లు అని పిలువబడే ప్రత్యేక పరికరాలు నెట్‌వర్క్‌లో ఇన్స్టాల్ చేయాలని వివరించింది. ప్రస్తుతం 4 కోర్ వర్షన్ ద్వారా ఒక్కోమోడ్ విధానంలో సెకనుకు 1 పెటాబిట్ డేటా ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉందని తెలిపింది. -
వలలో చిక్కి.. చెట్టుకు వేలాడిన చిరుత
అడ్డతీగల: కోతుల బెడద నివారణ కోసం వరి చేను చుట్టూ అమర్చిన వలలో చిక్కిన చిరుత పులి తప్పించుకుపోవడానికి చెట్టు పైకి ఎక్కి.. దానికి వేలాడుతూ రాత్రంతా అవస్థ పడింది. అటవీ అధికారులు వచ్చి రక్షించినా.. తీవ్ర గాయంతో చివరకు ప్రాణాలు విడిచింది. అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం ఎల్లవరం శివారున రేగులపాడు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బుధవారం ఉదయం రేగులపాడు వద్ద చెట్టుకు వేలాడుతున్న చిరుతను చూసిన స్ధానికులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంపచోడవరం డీఎఫ్‌వో జీజీ నరేంద్రన్, అడ్డతీగల సబ్ డీఎఫ్‌వో బి.శ్రీరామారావు, అడ్డతీగల రేంజి అధికారి షేక్ షెహన్షా, ఎస్ఐ అప్పలరాజు ఇతర సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. వల నడుముకు చుట్టుకుపోయి వేలాడుతున్న చిరుతను రక్షించేందుకు వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. విశాఖపట్నం జూ నుంచి రెస్క్యూ టీంని రప్పించి రాజమహేంద్రవరం నుంచి బోను తెప్పించారు. రాత్రి నుంచి చెట్టుకు వేలాడడంతో చిరుత అలసిపోయిన విషయం గమనించి.. ట్రాక్టర్లో నిచ్చెన ఉంచి దాని మీద ఆధారపడి చిరుత సేదతీరేలా చేశారు. మంచినీటిని అందించారు. అనంతరం రెస్క్యూ టీం సభ్యులు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి చిరుతను బోనులోకి చేరవేశారు. అయితే కొద్దిసేపటి అనంతరం చిరుత మరణించింది. దీంతో అటవీ అధికారులు పోస్ట్‌మార్టం నిర్వహించి ఘటనా స్ధలంలోనే చిరుతను దహనం చేశారు. కొన్నిగంటల పాటు వల నడుం చుట్టూ చుట్టుకుపోవడంతో చిరుత పెనుగులాడటం, ఆహారం లేక నీరసించి పోవడంతో మృతి చెందిందని డీఎఫ్‌వో నరేంద్రన్ చెప్పారు. ఈ ప్రాంతంలో చిరుతలు మరిన్ని ఉండవచ్చని, ప్రజలు రాత్రి సమయాల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. వన్యప్రాణులకు ఎటువంటి హాని తలపెట్టకుండా అటవీ అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. -
గింజనే చూస్తే.... గింజవయిపోతావు
‘వాగురయని తెలియక మగ గణములు వచ్చి తగులురీతియున్నది..’’ వాగుర అంటే వల. వల వేసేవాడు వల ఒక్కటే వేయడు. కింద గింజలు వేసి వలేస్తాడు. ఆకలిమీద ఉన్న ప్రాణి కిందున్న గింజలనే చూస్తుంది. రివ్వున వచ్చి వలలో చిక్కుకుని తినేవాడికి అదే గింజయి పోతుంది. తన ఆహారం కోసం వెళ్ళి వేరొకడికి ఆహారమయి పోతుంది. తాను ఏది పొందడానికి వచ్చాడో అది పొందకపోగా వేరొక దానిచేత దానిని పొందబడుతున్నాడు. కారణం – మత్సరం. అప్పటికి నా అంతటి వాడు లేడు.. అని అహంకరించడం. మరొకడిని తక్కువ చేయడం, హేళనచేస్తూ తనను తాను గొప్పవాడిగా భావించుకోవడంలో ఒక చిన్న సంతోషం ఉంది. కానీ నిజానికి అది పతనం చేసే సంతోషం. మృగ గణములు వచ్చి తగులుకున్న రీతిగా నాకు హెచ్చరిక అందట్లేదు. అదే నాకు అప్పటికి సుఖకారణమనిపించి వలకు చిక్కినట్టు నన్ను కట్టిపడేస్తున్నదంటున్నాడు త్యాగయ్య. ఒకసారి పక్షులన్నీ వలలో చిక్కుకుపోయి ఉంటే... అటునుంచి ఒక రుషి వెళ్ళిపోతున్నాడు. రక్షించమని అవి వేడుకున్నాయి. విడిపిస్తాగానీ నేనొక మాట చెబుతా వింటారా...అనడిగితే సరే అన్నాయి. ‘‘గింజలు కనబడగానే వాల రాదు’’. ఇది బాగా గుర్తుపెట్టుకుంటే మీకు మళ్లీ ఇలాటి ఆపద రాదని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. మరో పది రోజుల తరువాత ఆయన మళ్ళీ అటుగా వస్తుంటే...మళ్ళీ అవే పక్షులు వలలో చిక్కుకుని ‘రక్షించమని వేడుకున్నాయి. నా మాట మీరెందుకు వినలేదని ఆయన అడిగాడు. వినకపోవడమేమిటి... మీరు చెప్పినట్లే కదా చేసాం... అన్నాయి...అంటూ ‘గింజలు కనబడగానే వాలరాదు’ అందుకే వెంటేనే వాలలేదు కదా... అన్నాయి... అలాగే వాగ్గేయకారుల కీర్తనలు ఎన్నిసార్లు పాడుకున్నాం, ఎన్నిసార్లు విన్నాం, ఎన్నిసార్లు చదివాం ... అని కాదు. అది అర్థం కావాలి. అర్థమయితే సుఖం. ఎంత బాగా పాడావు అన్నదానికన్నా... దానిలోని తత్త్వాన్ని ఎంత బాగా అర్థం చేసుకున్నావన్నది కదా ముఖ్యం. తత్త్వం అర్థమయితే అరిషడ్వర్గాలు గురువుగారి అనుగ్రహం వల్ల వెంటనే పోయినట్టే కదా! అప్పుడు ఆయన సద్గురువు. అందుకే కీర్తన చివరన మదమత్సరమను తెరదీయగరాదా... అన్నాడు. ఎక్కడ మత్సరం ఉంటుందో అక్కడ మదం కూడా ఉంటుంది. అది నాకు కదా దక్కాలి... అన్నప్పుడు కామం ఉంది. వాడికే ఎందుకు దక్కాలి ... అన్నప్పుడు క్రోధం ఉంది. నాకు ఉండాలన్నప్పుడు లోభం ఉంది. దీనికంతా కారణ అజ్ఞానం అన్నప్పుడు మోహం ఉంది. అరిషడ్వర్గాలు అక్కడ పుట్టాయి. అందువల్ల తెర అంత దట్టంగా ఉంది.‘నీలో మత్సరమను తెర ఉంది. అది తొలగించుకో’ అని ఆయన అనలేదు. తన మీద పెట్టుకున్నాడు. శంకరభగవత్పాదులు రాసిన శ్లోకాల్లో నాకు అంటూంటారు. అంటే ఆయనకు కాదు. ఆ శ్లోకం ఎవరు చదువుతుంటే వాళ్ళకు–అని. వాళ్ళకు దైవానుగ్రహం కలగాలి. అలాగే త్యాగరాజస్వామి తనకు అన్వయం చేసుకుని చెప్పారు. మత్సరం ... మద మత్సరం... అసూయ వినాశ హేతువు. ఆ తెర తీయమంటున్నాడు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
అంబానీ కంపెనీ దూకుడు! భారీగా పెరిగిన నికర రుణం
దూకుడు మూలధన వ్యయం కారణంగా 2023 ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ( Reliance Industries Ltd )కు చెందిన రిటైల్ విభాగం నికర రుణం అనేక రెట్లు పెరిగింది. ఏడాది క్రితం రూ.1,600 కోట్లు ఉన్న రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ ( Reliance Retail Ventures Ltd ) నికర రుణం 2023 ఆర్థిక సంవత్సరంలో రూ.37,500 కోట్లకు పెరిగినట్లుగా కంపెనీ ఫైలింగ్స్ ద్వారా తెలుస్తోంది. కంపెనీ మూలధన వ్యయంలో భారీ పెరుగుదలే నికర రుణం ఈ స్థాయిలో పెరగడానికి కారణంగా తెలుస్తోంది. కంపెనీ క్యాపెక్స్ 70 శాతం పెరిగి రూ.51,400 కోట్లకు చేరింది. ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మొత్తం మూలధన వ్యయంలో మూడవ వంతు. రిలయన్స్ మూలధన వ్యయం గత ఏడు సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా 2023 ఆర్థిక సంవత్సరంలో 85 ఉందని జెఫ్రీస్ ఫైనాన్షియల్ గ్రూప్ ఒక పరిశోధనా నోట్లో తెలిపింది. ఇక కంపెనీ రిటైల్ సెగ్మెంట్ మూలధన వ్యయం గత నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో రూ. 1 లక్ష కోట్లకుపైగా ఉంది. స్థాయితో సంబంధం లేకుండా పోర్ట్‌ఫోలియో స్ప్రెడ్‌లో రిలయన్స్ రిటైల్ దూసుకెళ్తోంది. ఇదీ చదవండి: Yousta: తక్కువ ధరలతో రిలయన్స్ కొత్త ఫ్యాషన్ బ్రాండ్.. తొలి స్టోర్ హైదరాబాద్‌లోనే.. -
కసితో ఆడుతున్నాడు.. నెట్‌ను కూడా వదలడం లేదు!
వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ దూసుకెళ్తున్నాడు. కెరీర్లో 24వ గ్రాండ్‌స్లామ్ టైటిలే లక్ష్యంగా సాగుతున్న జొకోవిచ్ వింబుల్డన్‌లో 14వ సారి క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టాడు. 2021 సెమీఫైనలిస్ట్, ప్రపంచ 18వ ర్యాంకర్ హుబెర్ట్ హుర్కాజ్ (పోలాండ్)తో జరిగిన మ్యాచ్‌లో రెండో సీడ్ జొకోవిచ్ 7–6 (8/6), 7–6 (8/6), 5–7, 6–4తో నెగ్గి క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు. కాగా మ్యాచ్‌లో రెండో సెట్ సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. హుర్కాజ్ సర్వీస్ చేసి డ్రాప్ షాట్ ఆడాడు. దీంతో బంతి జొకోవిచ్ నెట్ దగ్గర్లోనే పడేలా కనిపించింది. ఒక్క పాయింట్ కూడా వదలకూడదన్న ఉద్దేశంతో జొకోవిచ్ వేగంగా పరిగెత్తుకొచ్చి బాడీ బాగా స్ట్రెచ్ చేస్తూ షాట్ ఆడాడు. అయితే ఇదే సమయంలో బాడీ కంట్రోల్ కోల్పోయిన జొకోవిచ్ ఒక్కసారిగా నెట్‌పై పడిపోయాడు. అదృష్టవశాత్తూ జొకోకు ఎలాంటి గాయాలు కాలేదు. అయితే జొకోవిచ్ చర్య తన ప్రత్యర్థి హుర్కాజ్తో పాటు అభిమానులను ఆశ్చర్యపరిచింది. హుర్కాజ్ జొకోవిచ్ దగ్గరికి వెళ్లి అతన్ని పైకి లేపి జాగ్రత్త చెప్పి కాసేపు మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోపై ఒక లుక్కేయండి. కాగా జొకోవిచ్‌కు ఇది వింబుల్డన్‌లో వందో మ్యాచ్ కావడం విశేషం. కాగా మ్యాచ్ ఆదివారం, సోమవారం రెండు రోజులపాటు జరిగింది. టోర్నీ నిబంధనల ప్రకారం రాత్రి 11 గంటల వరకే ఆటను కొనసాగించాలి. ఆదివారం రెండు సెట్లు ముగిసిన తర్వాత మ్యాచ్‌ను సోమవారానికి వాయిదా వేశారు.సోమవారం ఆటను కొనసాగించగా... మూడో సెట్‌ను హుర్కాజ్ గెల్చుకున్నాడు. అయితే నాలుగో సెట్లో జొకోవిచ్ తన అనుభవాన్నంతా రంగరించి పోరాడాడు. ఏడో గేమ్‌లో హుర్కాజ్ సర్విస్‌ను బ్రేక్ చేసి ఎనిమిదో గేమ్‌లో తన సర్విస్‌ను కాపాడుకొని 5–3తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అనంతరం పదో గేమ్‌లో జొకోవిచ్ తన సర్విస్‌ను కాపాడుకొని సెట్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. వింబుల్డన్ టోర్నీ చరిత్రలో జొకోవిచ్‌కిది 90వ విజయం కావడం విశేషం. Djokovic went for it 😅 #Wimbledon pic.twitter.com/q05cHyJJBt — SportsCenter (@SportsCenter) July 9, 2023 చదవండి: MS Dhoni Reaction To Fan: 'భయ్యా.. నొప్పి ఎలా ఉంది?'.. ధోని రియాక్షన్ వైరల్ #LakshyaSen: చరిత్ర సృష్టించిన లక్ష్య సేన్ -
ఆ ఒక్కటి జరిగితే యశస్వి జైస్వాల్ కెరీర్ నెక్స్ట్ లెవెల్ కే..!
-
ప్రాణాన్ని బలిగొన్న ‘ఉచ్చు’
మారేడుమిల్లి: వన్యప్రాణులకోసం విద్యుత్ తీగలతో ఏర్పాటుచేసిన ఉచ్చు ఒకరిని బలిగొంది. మరొకరిని తీవ్ర గాయాల పాల్జేసింది. ఎస్ రాము, బంధువుల కథనం మేరకు వివరాలిలావున్నాయి. మండలంలోని చట్లవాడ పంచాయతీ పరిధిలోని బొజ్జలగండి గ్రామానికి చెందిన కొండ్ల శ్యాముల్ రెడ్డి (26), పల్లాల రమేష్ రెడ్డితో కలిసి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో కర్రల నిమిత్తం శనివారం రాత్రి వెళ్లారు. వాటిని నరికి అటవీ ప్రాంతం నుంచి రహదారి వద్దకు తీసుకువస్తున్నారు. అదేమార్గంలో కొందరు వేటగాళ్లు వన్యప్రాణుల కోసం ఉచ్చు ఏర్పాటుచేశారు. దానికి విద్యుత్ తీగలు అమర్చారు. శ్యాములరెడ్డి, సురేష్ రెడ్డి తెస్తున్న కర్రల చివర్లు విద్యుత్ తీగలకు తగలడంతో ఇరువురు షాక్‌కు గురయ్యారు. దీంతో శ్యాముల్రెడ్డి సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. అతని వెనుక వస్తున్న రమేష్ రెడ్డి కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన రమేష్‌రెడ్డిని అదే ప్రాంతంలో ఉన్న స్థానికులు బోదులూరు పీహెచ్‌సీకి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్య సేవలు నిమిత్తం రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. పోలీసులకు బంధువులు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ రాము సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు. (చదవండి: చెత్తకు కొత్త రూపుం...వేస్ట్ క్రాఫ్ట్) -
జాలరి వలలో పంచలోహ మీనాక్షి అమ్మన్ విగ్రహం
సాక్షి, చెన్నై(తిరువొత్తియూరు): తిరుచెందూరు సమీపంలో జాలరి విసిరిన వలలో మీనాక్షి అమ్మన్ విగ్రహం చిక్కింది. తిరుచెందూరు అమలినగర్ మాతా ఆలయానికి చెందిన జోషఫ్ కుమారుడు జయన్ (37). గత 15వ తేదీ రాత్రి సముద్రంలో చేపలు పడుతుండగా వలలో సుమారు అడుగు ఎత్తు కలిగిన మీనాక్షి అమ్మవారి పంచలోహ విగ్రహం చిక్కుకుంది. దీన్ని గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులకు అప్పగించాడు. తిరుచెందూర్ తహసీల్దార్ స్వామినాథన్, శనివారం అమలినగర్‌కు వెళ్లి విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే తిరుకుళకుండ్రంలో ప్రసిద్ధి పొందిన వేద గిరీశ్వరర్ ఆలయంలో శనివారం ఉదయం దేవాదాయశాఖ మంత్రి బి.కె.శేఖర్‌బాబు తనిఖీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. త్వరలో వేదగిరీశ్వరర్ స్వామి ఆలయానికి రోప్‌కార్ సౌకర్యం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. చదవండి: (సీఎం స్టాలిన్ మరో కీలక నిర్ణయం.. సరికొత్త పథకానికి శ్రీకారం) -
విషాదం: కూడు పెట్టిన వల.. కాటికి పంపింది
సాక్షి, భైంసా(నిర్మల్): గోదావరి నదిలో చేపలు పడుతూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్న తొందూర్ నాగేశ్(45) చేపల కోసం తాను కట్టిన వలకే ప్రమాదవశాత్తు చిక్కుకొని మృతి చెందిన సంఘటన బాసరలో శనివారం జరిగింది. ఎస్సై ప్రేమ్‌దీప్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం తొందూర్ నాగేశ్ బాసర వద్ద నదిలో చేపలు పడుతూ జీవనం సాగిస్తుంటాడు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు నది నీటి ప్రవాహం విపరీతంగా పెరిగింది. దీంతో చేపలు లభిస్తాయన్న ఆశతో శుక్రవారం నదిలో చేపల కోసం వలవేశాడు. తిరిగి శనివారం చేపల కోసం నాటుపడవపై వెళ్లి తాను వేసిన వలలోనే అనుకోకుండా చిక్కుకున్నాడు. నీటిలో మునిగిపోతున్న నాగేశ్‌ను ఒడ్డుపై ఉన్న తోటి జాలర్లు గమనించి కాపాడే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. వారు నాగేశ్ ఉన్న చోటికి చేరేలోపే ప్రాణాలు కోల్పోయాడు. ఎందరివో ప్రాణాలు కాపాడి.. తొందూర్ నాగేశ్ బాసర వాసులకు, ఆలయ అధికారులకు, గోదావరి నది వద్ద విధులు నిర్వహించే సిబ్బందికి సుపరిచితుడే. బాసర ఆలయానికి వచ్చి వెళ్లేవారిలో పుణ్యస్నానాలు ఆచరిస్తూ నీటమునగబోయే ఎంతో మంది భక్తులను నాగేశ్ కాపాడాడు. కుటుంబ కలహాలతో ఆత్మహత్యలు చేసుకోవాలని గోదావరి నదిలో దూకిన పలువురిని ప్రాణాలతో ఒడ్డుకు చేర్చాడు. అలాంటిది నాగేశ్ చివరికి తానే వేసిన చేపల వలలో చిక్కి ప్రాణాలు వదిలాడు. ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి ఫోన్లో బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి ఘటన వివరాలను తెలుసుకున్నారు. మృతుడికి భార్యతోపాటు కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు. చదవండి: దారుణం: 16రోజులు... నాలుగు హత్యలు -
‘ఇలాంటి సాహసం చేయాలంటే ఎంతో గుండె ధైర్యం కావాలి’
అహ్మదాబాద్: గుజరాత్లో గీర్ అడవిలో వలలో చిక్కిన ఓ సింహం పిల్లను ఆటవీ సిబ్బంది రక్షించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సీనియర్ ఆటవీ శాఖ అధికారి రమేష్ పాండే శుక్రవారం షేర్ చేసిన ఈ వీడియో చూసి నెటిజన్లంత సదరు సిబ్బందిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రాణాలకు ప్రమాదమని తెలిసిన ఈ సింహాన్ని రక్షించిన వారి ధైర్యానికి ఫిదా అవుతూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ వీడియోలో రాజూలకు చెందిన ఆటవీ సిబ్బంది, ఫీల్డ్ రిసెచ్చర్స్ వలలో ఓ సింహం పిల్ల చిక్కడం గమనించి దాన్ని రక్షించే ప్రయత్నం చేశారు. అయితే అది వలలో చిక్కుకోవడంతో అది గంభీరంగా అరవడం మొదలు పెట్టింది. అయితే ఈ పిల్ల సింహం తల్లి సంఘటన స్థలానికి సమీపంలోనే మిగతా పిల్లతో ఉండటం కూడా వారు గమనించారు. అయినప్పటికి ఈ సింహం పిల్లను రక్షించాలని వారు నిర్ణయించుకున్నారు. దీంతో దాన్ని అణచి పట్టి ఆ నలుగురు సిబ్బంది కలసి సింహం పిల్లను వల నుంచి తప్పించారు. దీంతో అది అడవిలోకి పరుగులు తీసింది. కాగా ఈ వీడియోకు ఇప్పటి వరకు 28వేలకు పైగా వ్యూస్, వందల్లో లైక్స్, కామెంట్స్ వచ్చాయి. ‘ఎంతో గుండె ధైర్యం ఉంటే తప్ప ఇలాంటి సాహసాలు చేయలేరు. నిజంగా వీరు రియల్ హీరోలు’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. Forest staffs and field researchers in Rajula, Greater Gir (Gujrat) heard a roar and found a lion cub trapped in net. Lioness with other cubs was sitting nearby. To avoid strangulation of cub they put their lives at risk and freed the cub. Salute to our green guards.@CentralIfs pic.twitter.com/sHloH9bb1J — Ramesh Pandey (@rameshpandeyifs) March 4, 2021 చదవండి: మినీ ట్యాంక్‌బండ్‌లో మొసలి సోషల్ మీడియాలో రచ్చ: సీక్రెట్‌గా లోగో మార్చిన అమెజాన్ -
నీట్, జేఈఈ ఏటా రెండుసార్లు
న్యూఢిల్లీ: తరచూ ప్రశ్నాపత్రాల లీకేజీ ఉదంతాలు వెలుగుచూస్తున్న నేపథ్యంలో జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల నిర్వహణలో కేంద్రం భారీ సంస్కరణలకు తెర లేపింది. వైద్య విద్య ప్రవేశ పరీక్ష(నీట్), జేఈఈ(మెయిన్స్), జాతీయ అర్హత పరీక్ష(నెట్) లాంటి పరీక్షలను ఇకపై సీబీఎస్ఈకి బదులుగా, కొత్తగా ఏర్పాటైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) నిర్వహిస్తుంది. నీట్, ఐఐటీ జేఈఈ–మెయిన్స్ పరీక్షలు ఏడాదికి రెండుసార్లు జరుగుతాయి. నీట్‌ను ఫిబ్రవరి, మే నెలల్లో, జేఈఈ–మెయిన్స్‌ను జనవరి, ఏప్రిల్ నెలల్లో నిర్వహిస్తారు. విద్యార్థి ఈ పరీక్షలను రెండుసార్లు రాసినా, ఉత్తమ స్కోరునే ప్రవేశాల సమయం లో పరిగణనలోకి తీసుకుంటారు. ఒక్కసారి హాజరైనా సరిపోతుంది. కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్(సీమ్యాట్), గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్(జీప్యాట్)ల నిర్వహణ బాధ్యతను కూడా ఎన్టీఏకే అప్పగించారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి ప్రకాశ్ జవదేకర్ శనివారం ఈ వివరాలను వెల్లడించారు. ప్రశ్నపత్రాల లీకేజీని అడ్డుకుని, పారదర్శకంగా, సమర్థంగా, అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా పోటీ పరీక్షలు నిర్వహించేందుకే కొత్త విధానం అమల్లోకి తెస్తున్నట్లు ఆయన వివరించారు. ఆయా పరీక్షలకు తాత్కాలిక షెడ్యూల్ ప్రకటించారు. నెట్‌తో ప్రారంభం.. విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేయాలంటే అర్హత సాధించాల్సిన నెట్ పరీక్షతో(డిసెంబర్లో) ఎన్టీఏ పని ప్రారంభిస్తుంది. జేఈఈ మెయిన్స్ నిర్వహణను ఎన్టీఏకు అప్పగించినా, అడ్వాన్స్డ్ మాత్రం యథావిధిగా ఐఐటీల ఆధ్వర్యంలోనే జరుగుతుందని జవదేకర్ వెల్లడించారు. పైన పేర్కొన్న అన్ని పరీక్షలకు సిలబస్, ఫీజు, భాష, ప్రశ్నలు అడిగే తీరు మారవని స్పష్టం చేశారు. టైం టేబుల్‌ను ఎప్పటికప్పుడు మానవ వనరుల మంత్రిత్వ శాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. 4–5 రోజుల పాటు జరిగే ఈ పరీక్షలన్నింటినీ ఆన్లైన్లోనే నిర్వహిస్తామని, పరీక్షకు ఎప్పుడు హాజరుకావాలో విద్యార్థే నిర్ణయించుకోవచ్చని అన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీని అరికట్టడానికి అధునాతన ఎన్క్రిప్షన్ విధానాన్ని అవలంబిస్తామని తెలిపారు. ఎన్టీఏ విధానంలో పరీక్షల నిర్వహణ విద్యార్థులకు ఎంతో అనుకూలమని, ఆగస్టు మూడో వారం నుంచి విద్యార్థులు అధీకృత కంప్యూటర్ కేంద్రాలకు వెళ్లి ఉచితంగా సాధన చేయొచ్చని జవదేకర్ తెలిపారు. పాఠశాలలు, ఇంజనీరింగ్ కళాశాలల్లో అలాంటి కేంద్రాలను ఏర్పాటు చేసి, ఆ వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు కూడా ప్రత్యేకంగా ఉచిత సాధన కేంద్రాలను ఏర్పాటుచేస్తామని వెల్లడించారు. ఎన్టీఏ అంటే... దేశంలో ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశానికి పరీక్షలు నిర్వహించేందుకు ఎన్టీఏని ఏర్పాటుచేయాలని 2017–18 బడ్జెట్లో ప్రతిపాదించారు. దానికి కేంద్ర కేబినెట్ గతేడాది నవంబర్ 10న ఆమోదం తెలిపింది. ఎన్టీఏ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థగా పనిచేస్తుంది. ప్రముఖ విద్యావేత్తను ఎన్టీఏకు డైరెక్టర్ జనరల్/సీఈఓగా మానవ వనరుల శాఖ నియమిస్తుంది. నిపుణులు, విద్యావేత్తల నేతృత్వంలోని 9 వేర్వేరు విభాగాలు సీఈఓకి సహాయకారిగా ఉంటాయి.యూజీసీ, ఎంసీఐ, ఐఐటీ సభ్యులతో పాలక మండలిని ఏర్పాటుచేస్తారు. కేంద్రం ఎన్టీఏకు తొలుత రూ.25 కోట్ల ఏకకాల గ్రాంటు కేటాయిస్తుంది. తరువాత ఆ సంస్థే సొంతంగా నిధులు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎన్టీఏకు డైరెక్టర్ జనరల్‌గా వినీత్ జోషి కొనసాగుతున్నారు. -
మత్స్యమాఫియా
అలంపూర్ రూరల్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో పారుతున్న తుంగభద్ర, కృష్ణానదుల్లో మత్స్యసంపదను కొల్లగొడుతున్న అలవి వలలు స్థానిక మత్స్యకారుల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. మత్స్యసంపదను మధ్య దళారీలు తరలించకుండా మత్స్యశాఖ, పోలీస్ యంత్రాంగం వరుస దాడులు నిర్వహిస్తూ కేసులు నమోదు చేస్తున్నా పెద్దగా స్పందన కనిపించడం లేదు. జోగుళాంబ గద్వాల జిల్లాలో ప్రధానంగా అలంపూర్ గొందిమల్ల, కూడవెల్లి తదితర ప్రాంతాల్లో స్థానికేతరులు ధనార్జనే ధ్యేయంగా వైజాగ్, రాజమండ్రి, తమిళనాడు, ఏపీ వంటి ప్రాంతాల నుంచి అలవి వలలతో చేపలను వేటాడే నైపుణ్యం గల వారికి రోజువారి కూలీలు ఇస్తూ ప్రభుత్వం నిషేధించిన అలవి, పట్టు, నంజు, మ్యాట్ వంటి వలలతో చేపలను వేటాడుతూ మత్స్య సంపదను కొల్లగొడుతూ ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. దీంతో జోగుళాంబ గద్వాల జిల్లాలో దాదాపు 20 వేల మత్స్యకారుల కుటుంబాలు జీవనోపాధి కోల్పోతున్నాయి. లైసెన్స్‌లు.. సొసైటీలు కులవృత్తి అయినంత మాత్రనా లేదా గంగపుత్రులు అయినంత మాత్రాన చేపలు వేటాడే అధికారం లేదు. ఇందుకోసం సంబంధిత మత్స్యశాఖ దగ్గర పేరు నమోదు చేసుకుని లైసెన్సులు పొందాలి. లేదా మత్స్యశాఖ సొసైటీలో కనీసం సభ్యుడై ఉన్నా చేపలను వేటాడవచ్చు. జోగుళాంబ గద్వాల జిల్లాలో 20 వేల మంది మత్స్యకారులున్నారు. రాజోళి, అలంపూర్, క్యాతూరు ఇలా మిగతా చోట సొసైటీలు కూడా ఉన్నాయి. ఒక్కో సొసైటీలో 400–600 మంది దాకా ఉన్నారు. అలంపూర్ నియోజకవర్గంలో అయిజ నుంచి అలంపూర్ దాక 13 సొసైటీలు ఉండగా యాక్టివ్ ఉన్న సొసైటీలు కేవలం 6 మాత్రమే ఉన్నాయి. గద్వాల నియోజకవర్గంలో 25 సొసైటీల్లో 38 సంఘాలు, 3,200 మంది లైసెన్స్‌దారులు ఉన్నారు. ఇక వీరి ఆర్థిక పరిస్థితిలు గమనిస్తే చాలా దయనీయంగా ఉన్నాయి. భద్రపరిచే పరికరాలేవీ..? రాష్ట్ర ప్రభుత్వం సహజసిద్ధ ఆర్థిక వనరులు పెంచే ప్రణాళికలో భాగంగా 2016–17 సంవత్సరానికి గాను రూ.వెయ్యి కోట్లు కేటాయించింది. ఇందులో రూ.900 కోట్లు నాబార్డు నుంచి రాగా కేవలం రూ.100 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించి చేపపిల్లను సరఫరా చేసింది. కానీ వీటిని భద్రపరిచేందుకు గాను టీవీఎస్ ఎక్సెల్ టాంటి మోపైడ్, బోట్లు, వల, ఐస్ బాక్స్ లాంటి పరికరాలు ఏవీ ఇవ్వలేదు. దీంతో పట్టిన చేపలను భద్రపరిచే పరిస్థితి లేకపవడంతో మత్స్యకారులు వాటిని మధ్యదళారీలకే అప్పగిస్తున్నారు. మధ్య దళారికే లాభాలు ఉదయం నుంచి సాయంత్రం దాక కష్టపడిన మత్స్యకారుడికి కడుపు నిండటం గగనంగా మారింది. రోజంతా కష్టపడితే 100 కిలోల చేపలు పడుతాయి. ఇందులో చేప బరువును బట్టి మార్కెట్లో ధర నిర్ణయిస్తారు. అయితే మార్కెట్లో అమ్మకంపై మెళకువలు తెలియని అసలైన మత్స్యకార్మికుడు దళారీకి చేపలు విక్రయిస్తున్నాడు. దీంతో కష్టపడిన మత్స్యకార్మికుడుకి రోజుకు సగటున రూ.150–200 వస్తే గగనం. ఇక అదే చేపలను కొనుగోలు చేసిన మధ్య దళారీ మాత్రం వాటిని హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రధాన నగరాలకు ఎగుమతి చేసి పెద్దఎత్తున లాభాలు పొందున్నాడు. లైసెన్సులు పొంది పేరు రిజిష్ట్రేషన్ చేయించుకున్న వారికి మత్స్యశాఖ అధికారులు మార్కెటింగ్‌పై ఎలాంటి శిక్షణ ఇవ్వకపోవడం, వారికి అవగాహన లేకపోవడంతో మధ్య దళారీలే లాభపడుతున్నారు. త్వరలో ఐఎఫ్‌డీఎస్ విధానం.. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఐఎఫ్‌డీఎస్ (ఇంటిగ్రేటెడ్ ఫిషరీస్ డెవలప్మెంట్ స్కీం) సమీకృత మత్స్య అభివృద్ధి పథకం అమలు చేసే యోచనలో ఉన్నట్టు తెలిసింది. ఈ విధానం ద్వారా మత్స్యకారులకు 75 శాతం రుణ సౌకర్యం కల్పిస్తారు. అదేవిధంగా రూ.310 చెల్లించిన లైసెన్స్‌దారులకు కావాల్సిన పరికరాలు 75 శాతం సబ్సిడీపై ఇవ్వనున్నారు. ఇప్పటికే వీటికి సంబంధించిన ప్రతిపాదనలు సైతం పంపారు. అమాయకులు బలవుతున్నారు.. అలవి వలల విషయంలో అమాయకులైన స్థానిక మత్స్యకారులే బలవుతున్నారు. వీరి వెనక ఉన్న అసలైన మాఫియా మాత్రం తప్పించుకుంటున్నారు. దీనికంతా కారణం మత్స్యకారులకు మత్స్యశాఖ తగిన రుణ సౌకర్యాలు కానీ మార్కెటింగ్ స్కిల్స్, అవైర్నెస్ ప్రోగ్రాం నిర్వహించకపోవడమే. – అశోక్, ఉమ్మడి జిల్లా కార్యదర్శి, ముదిరాజ్ మహాసభ కఠిన చర్యలు తప్పవు.. ప్రభుత్వం నిషేధించిన వలల ను ఉపయోగించడం కా కుండా ఎలాంటి అనుమతి, లై సెన్స్లు లేకుండా చేపలను వే టాడుతు మత్స్యసంపదను కొల్లగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. స్థానికంగా కొందరు మా ఫియా దీని వెనక ఉండి నడిపిస్తున్నట్టు సమాచారం. తగిన ఆధారాలతో వారిని కూడా పట్టుకుంటాం. – ప్రవీణ్‌కుమార్, ఎస్ఐ, అలంపూర్ -
వలేస్తే భారీ కొండచిలువ చిక్కింది!
భువనేశ్వర్: నదిలో విసిరిన వలలో చేపకు బదులుగా పాము చిక్కింది. చూడబోతే అదో పెద్ద కొండ చిలువ. 15 అడుగుల పొడవు ఉంది. పూరీ జిల్లా గోప్ సమితి నేతాపూర్ కుశభద్ర ఉపనదిలో చేపల వేట కోసం మత్స్యకారుడు బుధవారం రాత్రి వలపన్నాడు. గురువారం ఉదయం వలను లాగి చూడబోతే పెద్ద పాము చిక్కుకున్నట్లు గుర్తించి బెంబేలెత్తాడు. తోటి మత్స్యకారుల సహకారంతో సురక్షితంగా వలను ఒడ్డుకు లాగాడు. విషయాన్ని స్థానిక అటవీ విభాగం అధికారులకు తెలియజేశాడు. పామును సురక్షితంగా చేరువలో ఉన్న అడవిలోకి విడిచి పెడతామని అధికారులు తెలిపారు. -
నెట్‌పై క్లారిటీ ఇచ్చిన యూజీసీ
న్యూఢిల్లీ: జాతీయ అర్హత పరీక్ష(నెట్) నిర్వహణపై ఉన్న అనిశ్చితి తొలిగింది. సీబీఎస్ఈనే ఈ పరీక్షను నిర్వహిస్తుందని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) స్పష్టం చేసింది. జేఈఈ మెయిన్స్, నీట్ వంటి ఇతర పరీక్షల నిర్వహణ వల్ల బోర్డుపై అధిక భారం పడుతోందని, అందువల్ల నెట్‌ను నిర్వహించలేమని సీబీఎస్ఈ గతేడాది కేంద్ర మానవవనరుల మంత్రిత్వ శాఖ ఎదుట తన అశక్తతను వ్యక్తపరిచింది. అయితే, దీనికి సంబంధించి కేంద్ర మంత్రిత్వ శాఖ ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేయలేదు. మరోవైపు జూలై నిర్వహించాల్సిన నీట్‌కు ఏటా ఏప్రిల్ మొదటి వారంలోనే నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉండగా.. సీబీఎస్ఈ నోటిఫికేషన్ విడుదల చేయకపోవడంతో అనిశ్చితి నెలకొన్ని విషయం తెలిసిందే. దీంతో పరీక్ష నిర్వహణపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని, వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ విద్యార్థులు యూజీసీ ముందు నిరసన వ్యక్తం చేశారు. దీంతో మానవవనరుల మంత్రిత్వ శాఖ అధికారులతో సమావేశమైన యూజీసీ అధికారులు సీబీఎస్ఈనే జూలైలో పరీక్ష నిర్వహించేలా ఆదేశాలు జారీ చేశారు. -
పాపం పండింది
జంగారెడ్డిగూడెం : అవినీతి నిరోధక శాఖ ఉచ్చునుంచి రెండుసార్లు తప్పించుకున్న జంగారెడ్డిగూడెం సబ్ రిజిస్ట్రార్ డి.జయరాజు మూడోసారి పన్నిన వలలో దొరికిపోయారు. ఓ వ్యక్తి కొనుగోలు చేసిన స్థలానికి రిజిస్ట్రేషన్ పూర్తయినా.. సంబంధిత పత్రాలు ఇచ్చేందుకు రూ.15 వేలు లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీకి పట్టుబడ్డారు. డీఎస్పీ వి.గోపాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెంకు చెందిన బైర్రాజు ఫణీంద్రవర్మ అదే గ్రామంలో 238 గజాల ఇంటి స్థలాన్ని కొనుగోలు చేయగా.. సదరు స్థలాన్ని అతడి పేరిట రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్ట్రార్ జయరాజు రూ.15 వేలు లంచం డిమాండ్ చేశారు. ఆ సొమ్ము ఇస్తేనే రిజిస్ట్రేషన్ పత్రాలు ఇస్తానని.. లేదంటే రిజిస్ట్రేషన్ రద్దవుతుందని భయపెట్టారు. దీంతో ఫణీంద్రవర్మ ఏసీబీని ఆశ్రయించగా, డీఎస్పీ వి.గోపాలకృష్ణ, సీఐ జీజే విల్సన్ సబ్ రిజిస్ట్రార్‌పై వల పన్నారు. ఫణీంద్రవర్మకు రూ.15 వేలు ఇచ్చి పంపించారు. సబ్ రిజిస్ట్రార్ జయరాజు ఆ మొత్తాన్ని తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు దాడిచేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్రైవేట్ వ్యక్తి ద్వారా వ్యవహారం సబ్ రిజిస్ట్రార్ జయరాజు మామూళ్ల వసూలు వ్యవహారమంతా రాజు అనే ఓ ప్రైవేట్ వ్యక్తి ద్వారా నిర్వహిస్తున్నారని ఏసీబీ డీఎస్పీ చెప్పారు. తాము దాడి చేసిన సమయంలో రాజు పరారయ్యాడన్నారు. అతని వద్ద రూ.లక్ష వరకు ఉన్నట్టు తమకు సమాచారం ఉందన్నారు. రాజు కోసం గాలిస్తున్నామని, అతనిపైనా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సబ్ రిజిస్ట్రార్ జయరాజుకు సంబంధించి ఆస్తుల వివరాలు సేకరిస్తామని వెల్లడించారు. రెండుసార్లు తప్పించుకున్నా.. గతంలో ఏసీబీ దాడి నుంచి సబ్ రిజిస్ట్రార్ జయరాజు రెండుసార్లు తప్పించుకున్నట్టు డీఎస్పీ చెప్పారు. ఏడాది కాలంలో రెండుసార్లు తనిఖీ చేయగా.. అతని వద్ద అనధికారికంగా ఉన్న నగదు దొరికిందని తెలిపారు. దీనిపై అప్పట్లో ఉన్నతాధికారులకు నివేదిక పంపామన్నారు. రెండుసార్లు తనిఖీలు నిర్వహించినా సబ్ రిజిస్ట్రార్ జయరాజు తీరు మార్చుకోలేదని డీఎస్పీ పేర్కొన్నారు. -
మరోసారి చిక్కాడు
కామవరపుకోట: అవినీతి కేసు విచారణలో ఉండగానే మరోసారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు కామవరపుకోట సబ్ రిజి స్ట్రార్ ఆళ్ల మధుసూదనరావు. 2013లో వట్లూరు సబ్ రిజిస్ట్రార్‌గా ఆయన పనిచేస్తుండగా కార్యాలయంలో దాడులు చేసిన ఏసీబీ అధికారులు రూ.98 వేలు లెక్కల్లో చూపని నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు విచారణలో ఉండగానే మరలా రెడ్ హ్యాండెడ్‌గా ఆయన ఏసీబీకి చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ వి.గోపాలకృష్ణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. జంగారెడ్డిగూడెంకు చెందిన కిరాణా వ్యాపారి పీతల కృష్ణమూర్తి టి.నరసాపురం మండలం అల్లంచర్ల రాజుపాలెంలో రెండు సెంట్ల ఇంటి స్థలాన్ని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌కోసం కామవరపుకోట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి రాగా సబ్ రిజిస్ట్రార్ ఆళ్ల మధుసూదనరావు రూ.10 వేలు డిమాండ్ చేసినట్టు తమకు ఫిర్యాదు అందిందన్నారు. ఈ మేరకు సోమవారం కృష్ణమూర్తికి రసాయనా లు పూసిన ఐదు రూ.2 వేల నోట్లను ఇచ్చి సబ్ రిజి స్ట్రార్ ఆఫీసుకు పంపామని చెప్పారు. రిజిస్ట్రేషన్ కోసం కృష్ణమూర్తి నుం చి సబ్ రిజిస్ట్రార్ మధుసూదనరావు రూ.10 వేలు తీసుకుంటుండగా తాము రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నామన్నారు. ఫిర్యాదుదారు గతంలో ఓ ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు రాగా రూ.లక్ష డిమాండ్ చేశారని, దీంతో ఫిర్యాదుదారు రిజిస్ట్రేషన్ మానేశారని చెప్పారు. ఇదే సబ్ రిజిస్ట్రార్ 2013లో వట్లూరులో పనిచేస్తుండగా దాడులు చేశామని లెక్కల్లో చూపని రూ.98 వేలు స్వాధీనం చేసుకున్నామన్నారు. దీనిపై విచారణ ఇంకా సాగుతోందని డీఎస్పీ గోపాలకృష్ణ తెలిపారు. ఏసీబీ సీఐ విల్సన్, సిబ్బంది దాడిలో పాల్గొన్నారు. కక్షిదారు రిజిస్ట్రేషన్ చేయమన్న స్థలంపై వివాదం చింతలపూడి కోర్టులో నడుస్తుండటం తో వివాదం పరిష్కారమైనట్టు లేఖ తీసుకురావాలని సూచించానని సబ్ రిజిస్ట్రార్ మధుసూదనరావు చెప్పారు. అయితే సోమవారం 1బి కాగితాలు తీసుకువచ్చి చూపిస్తుండగా, ఇవి అవసరం లేదని చెబుతుండగానే కృష్ణమూర్తి కాగితం చుట్ట తన ముఖం మీదకు విసిరేశాడన్నారు. ఇంతలోనే ఏసీబీ అధికారులు వచ్చారని మధుసూదనరావు అంటున్నారు. -
మోల్డ్‌టెక్ మరో 3 ప్లాంట్లు
• 2018లో ఉత్పత్తి కార్యకలాపాలు • రూ.54 కోట్ల దాకా పెట్టుబడి • మూడో త్రైమాసికంలో తగ్గిన నికరలాభం • కంపెనీ సీఎండీ లక్ష్మణరావు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్యాకేజింగ్ రంగంలో ఉన్న మోల్డ్‌టెక్ ప్యాకేజింగ్ మరో మూడు ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. ఏసియన్ పెయింట్స్ కోసం మైసూరు, వైజాగ్‌లో ప్లాంట్లు రానున్నాయి. స్థల సేకరణ కూడా పూర్తయింది. అలాగే మరో పెయింట్ కంపెనీ కోసం దక్షిణాదిన ఒక యూనిట్ ఏర్పాటు చేయనుంది. నెల రోజుల్లోగా ఈ కంపెనీతో ఒప్పందం ఖరారు కానున్నట్లు తెలియవచ్చింది. ప్రతిపాదిత మూడు ప్లాంట్లలో 2018 జూన్–అక్టోబర్ కాలంలో ఉత్పత్తి ప్రారంభమవుతుంది. ఒక్కో యూనిట్లో తొలి దశ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 3,500 టన్నులుంటుంది. మూడు ప్లాంట్ల ఏర్పాటుకు మొత్తం రూ.54 కోట్ల దాకా వెచ్చిస్తున్నట్లు మోల్డ్‌టెక్ సీఎండీ జె.లక్ష్మణ రావు ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. సామర్థ్యం రెట్టింపు.. నూతన కేంద్రాల సామర్థ్యాన్ని 2021 కల్లా రెట్టింపు చేస్తామని లక్ష్మణరావు తెలిపారు. ఇందుకోసం మరో రూ.27 కోట్ల దాకా ఖర్చవుతుందన్నారు. సంస్థకు ఇప్పటికే ఏడు ప్లాంట్లున్నాయి. ఈ ప్లాంట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 30,000 టన్నులు. ప్రస్తుతం కంపెనీ ఉద్యోగుల సంఖ్య ప్రత్యక్షంగా, పరోక్షంగా 1,300 దాకా ఉంది. విస్తరణతో మరో 800 మందికి ఉపాధి లభిస్తుందని ఆయన చెప్పారు. ప్యాకేజింగ్ సేవలందించేందుకు మరిన్ని ఫుడ్, ఎఫ్ఎంసీజీ రంగ కంపెనీలతో చర్చలు జరుపుతున్నామని, అవి పురోగతిలో ఉన్నాయని వివరించారు. నికర లాభం రూ.5.5 కోట్లు.. డిసెంబర్ త్రైమాసికం స్టాండెలోన్ ఫలితాల్లో మోల్డ్‌టెక్ ప్యాకేజింగ్ నికర లాభం క్రితంతో పోలిస్తే రూ.6 కోట్ల నుంచి రూ.5.5 కోట్లకు వచ్చి చేరింది. ఆదాయం రూ.75.7 కోట్ల నుంచి రూ.76 కోట్లకు ఎగసింది. ఫుడ్, ఎఫ్ఎంసీజీ విభాగం ప్రస్తుతం 7 శాతం సమకూరుస్తోంది. వచ్చే ఏడాది ఇది 15–20 శాతానికి చేరుతుందని కంపెనీ భావిస్తోంది. -
నేటి నుంచి ‘నెట్’ దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కోసం ప్రధాన అర్హతగా పరిగణనలోకి తీసుకునే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్టు (నెట్) దరఖాస్తులు ఈనెల 17 నుంచి తీసుకునేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) చర్యలు చేపట్టింది. ఈ నెల 17 నుంచి వచ్చే నెల 16 వరకు అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దరఖాస్తు ఫారాల్లో ఏమైనా తప్పులు దొర్లితే వచ్చే నెల 22 నుంచి 29 వరకు సవరించుకోవచ్చని పేర్కొంది. పరీక్షను 2017 జనవరి 22న నిర్వహించనున్నట్లు వివరించింది. -
వలకు చిక్కిన వింత చేపలు
మధిర రూరల్ : మత్స్యకారుల వలలకు వింత చేపలు చిక్కాయి. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు మధిర సమీపంలోని వైరా నది, రాయపట్నం, మధిర, చెరువుల సమీపంలోని కల్వర్టుల వద్ద మత్స్యకారులు, కొందరు యువకులు వలలు, గాలాలతో చేపలు పడుతున్నారు. ఈ క్రమంలో రాయపట్నం సమీపంలోని చెరువు వద్ద యువకులు పెట్టిన వలలకు వింత చేపలు చిక్కాయి. వాటిని మధిరకు చెందిన సతీష్ గమనించి ప్రజలకు చూపిస్తున్నాడు. ఈ చేపలు చాలా గట్టిగా.. రకరకాల చారలు కలిగి ఉన్నట్లు తెలిపాడు. వీటిని చూసేందుకు పలువురు పోటీపడ్డారు. -
వలకు చిక్కిన రాకాసి చేప
కొల్లూరు: వింతాకారంలో శరీరం, రెక్కలపై రంపాన్ని పోలిన ముళ్ళతో ఉన్న చేప కొల్లూరు పశ్చిమ బ్యాంక్ కెనాల్లో సోమవారం మత్యకారుల వలకు చిక్కింది. సాధారణ చేపలకు మాదిరిలా కాక దీని నోరు కింది భాగంలో ఉండి నోటికి ఇరువైపులా రెండు కోరలు వలే ఉండటంతో రాకాసి చేప అయ్యింటుందని మత్యకారులు భావిస్తున్నారు. దీనిని వల నుంచి తీసిన అనంతరం గంటపాటు నీటిలో కాకుండా నేలమీద ఉంచినా బతికేఉందని ఈచేపను పట్టుకున్న కట్టా శ్రీను తెలిపారు. చేపను తాకితే దానిపై రంపాలవలే ఉన్న ముళ్ళ వల్ల చేయి కోసుకుపోతుందని, తాము ఇటువంటి చేపను ఇంతవరకు చూడలేదని పేర్కొన్నాడు. అడుగు పొడవున్నా ఈ చేప ఏ జాతికి చెందినది అన్నది స్థానికుల్లో చర్చానీయాంశంగా మారింది. -
నెట్ బాండ్ బడ!
సమస్త సమస్యలకీ, సమాచారానికీ ఇప్పుడు ఇన్స్టంట్ గైడ్ - గూగుల్, వికీపీడియాలే. నెట్ ఇలా మన నట్టింటిలోకి వచ్చాక, వాట్సప్‌లు, ఫేస్‌బుక్‌ల లాంటి సోషల్ మీడియా కూడా పెరిగిపోయాక, నెట్లో రకరకాల వింత చర్చలు, విచిత్రమైన ఫోటోలు హల్చల్ చేస్తున్నాయి. ఈ మధ్య ‘500 కోట్లు కాదు... వెయ్యి కోట్లిచ్చినా సరే, నేనిక బాండ్ పాత్రలు చేసేది లేదు’ అంటూ హాలీవుడ్ స్టార్, ఇటీవలి పాపులర్ సినీ జేమ్స్‌బాండ్ డేనియల్ క్రేగ్ తేల్చేసిన విషయం బయటకొచ్చాక నెట్ వరల్డ్‌లో దీనిపై చర్చోపచర్చలు మొదలయ్యాయి. జేమ్స్‌బాండ్ వారసుడెవరా అని ఒళ్లంతా కళ్లు చేసుకుని మరీ వెతుకుతున్నాయి ఇంటర్నెట్ సెర్చింజన్లు. కొందైరె తే ‘జేమ్స్‌బాండ్ పాత్రకు అంతంత డబ్బెందుకు... బ్యాండు కాకపోతే ! అందులో సగం కాదు... పావు వంతు ఇచ్చినా అంతకన్నా మంచివాళ్లే దొరుకుతారు’ అంటున్నారు. అందుకు ఉదాహరణగా మైఖేల్ ‘ఫాస్బాండర్’ను చూపుతున్నారు. మరోపక్క, తాజాగా తీసే 25వ జేమ్స్‌బాండ్ చిత్రంలో బాండ్ పాత్రకు టామ్ హిడెల్స్టన్ను ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చేశాయి. అయినా సరే, నెట్లో మాత్రం కొత్త బాండ్ పాత్ర, క్రెగ్ నిరాకరణ సహా అనేక విషయాల గురించి రకరకాల బొమ్మలు, వార్తలు రచ్చ రచ్చ చేస్తున్నాయి. ఆ మాటకొస్తే జేమ్స్‌బాండ్ పాత్ర చేయడానికి బ్రిటీష్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరాన్‌కి ఏమి తక్కువ అంటూ కొందరు బయల్దేరారు. ఏకంగా డేవిడ్ కామెరాన్ ముఖాన్ని ఫొటోషాపులో జేమ్స్‌బాండ్ బొమ్మకు అతికించి మరీ, బాండ్‌గా చిత్రీకరిస్తున్నారు ఇంకొందరు వీరాభిమానులు. ఇక్కడే కథ కొత్త మలుపు తిరిగింది. ‘జేమ్స్ బాండ్ అంటే ఎప్పుడూ మగవాళ్లేనా? లేడీ బాండ్లు ఎందుకు ఉండకూడదు? వాళ్లయితే బాగా ఒళ్ళు వంచగలరు. పైగా వెరైటీగా కూడా ఉంటుంది’ అని కొందరు అంటున్నారు. అలా ఇప్పుడు కొత్త జేమ్స్‌బాండ్ పాత్రధారి ఎవరనే విషయంలో లింగ విచక్షణ అనే కొత్త కోణం వచ్చి చేరింది. ‘ఉబుసుపోక కబుర్లు... ఉచిత సలహాలకేం గానీ, ఎమిలీ బ్లంట్ ఐతే ఎలా ఉంటుందీ’ అని ఒకరు, ‘యాబ్సల్యూట్లీ ఫ్యాబ్యులస్’ అనే ప్రఖ్యాత టీవీ షో చేసిన ‘ప్యాట్సీ స్టోన్ అయితే అద్దిరిపోతుంది’ అని మరొకరు- ఇలా రకరకాల మాటలు, బొమ్మలు అంతర్జాలంలో ఇప్పుడు షికారు చేస్తున్నాయి. అయితే వీటన్నిటి కన్నా అధికంగా ఇప్పుడు అందరి దృష్టినీ ఆకట్టుకుంటున్న గమ్మత్తై నెట్ క్రియేషన్ ఒకటి ఉంది. అది ఏమిటంటే... నటి గిలియన్ ఆండర్సన్‌ను ప్రసిద్ధ జేమ్స్‌బాండ్ సినిమా ‘స్కైఫాల్’ పోస్టర్లో బాండ్ పాత్రలో సూపర్ ఇంపోజ్ చేస్తూ పెట్టిన ఫొటో. తమాషాగా చేసిన ఈ అభూత నెట్ కల్పన వీక్షకులందరినీ ఆకట్టుకుంటోంది. ‘అవును! ఈమె బాండ్... ‘జేన్’ బాండ్!’ అంటూ దాని కింద రాసిన ఫొటో క్యాప్షన్ అయితే మరీనూ! ‘జేన్’ అంటే ఏమిటని ఖంగారు పడకండి! పాశ్చాత్య దేశాల్లో చదువుకున్న పెద్దోళ్ళు ‘స్త్రీ మూర్తి’ని ‘జేన్’ అంటారు లెండి! ఇక్కడ ‘జేన్’ బాండ్ అంటే... ‘లేడీ బాండ్’ అని ప్రతిపదార్థమూ, తాత్పర్యమున్నూ అని ఇంగ్లిపీసు బాగా తెలిసినవాళ్ళ ఉవాచ. ఈ భాషాతత్త్వ విచార చర్చ మాటెలా ఉన్నా, ఈ కొత్త నెట్ కల్పన, ఆ ఫొటో, క్యాప్షన్ - హంగామా అంతా సదరు గిలియాన్ ఆండర్సన్ దృష్టికి వెళ్లింది. అంతే! ‘‘లేడీ బాండ్‌గా నేనైతే బాగుంటానని అనడం సంతోషంగా ఉంది. ఈ పోస్టర్ ఎవరు రూపొందించారో తెలియదు కానీ, దీని రూపకర్తలకు నా కృతజ్ఞతాభివందనాలు’’ అంటూ గిలియన్ ఆండర్సన్ సంతోషంతో ట్వీట్ చేసింది. ఇది ఇలా ఉంటే, ‘జీవితంలో మీ గురించి చలామణీ అయిన పుకార్లలో మిమ్మల్ని అమితంగా ఆకట్టుకున్నది ఏమిటి?’ అని ఎవరో ఆమెను కొంటెగా క్వశ్చన్ చేశారు. ‘‘నన్ను జేమ్స్‌బాండ్‌ను చేస్తూ జరుగుతున్న ఈ ప్రచారం కన్నా సంచలనమైనది ఇంకేమైనా ఉంటుందా?’’ అంటూ అంతకన్నా కొంటెగా జవాబిచ్చారు గిలియన్. మొత్తానికి, ఈ కొత్త చర్చకు చాలా మందే మద్దతు పలికారు. గతంలో నాలుగేసి సార్లు బాండ్ పాత్ర చేసిన పియర్స్ బ్రోస్నన్, డేనియల్ క్రెగ్లు ఇద్దరూ నల్ల బాండ్ అయినా, లేడీ బాండ్ అయినా తప్పేముంది అన్నారు. చివరకు ఏమవుతుందో వేచి చూడాలి. తిమ్మిని బమ్మి... బమ్మిని తిమ్మి చేసేది ఏమైనా ఉంటే - అది నెట్టే! అదేనండీ... ఇంటర్నెట్! ‘ఎన్ని కోట్లిచ్చినా, నేను బాండ్ పాత్ర వేయను’ అని డేనియల్ క్రెగ్ అనడంతో ఇప్పుడు నెట్లో రకరకాల బాండ్లు తయారయ్యారు. దాంట్లో మోస్ట్ ఇంట్రెస్టింగ్... లేడీ బాండ్! గిలియన్ ఆండర్సన్! కొత్త బాండ్ ఎవరు? త్వరలో తెరకెక్కనున్న 25వ జేమ్స్‌బాండ్ చిత్రానికి బాండ్ ఎవరనే విషయంలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నెక్స్ట్బాండ్గా టామ్ హిడెల్‌స్టన్ చేస్తా రని ఒక వార్త. మరోపక్క బాండ్ పాత్రకోసం తొలిసారిగా ఆడవారి పేర్లు కూడా ప్రచారంలోకి వస్తున్నాయి. ‘ఎక్స్-ఫైల్స్’ ఫేమ్ గిలియన్ ఆండర్సన్ పేరు అందరి కన్నా టాప్‌లో నెట్లో సందడి చేస్తోంది. ‘ఘోస్ట్ బస్టర్స్’, ‘ఓషన్స్2’ లాంటి కొత్త చిత్రాల్లో ఆడవాళ్ళదే ప్రధానపాత్ర. జేమ్స్‌బాండ్ సిరీస్‌లోనూ ఈ మార్పు ఎందుకు రాకూడదన్నది కొత్త వాదన. ఇక, వర్ణ వివక్ష వ్యవహారం తెర మీదకు తెచ్చి, నల్లజాతీయుడైన 45 ఏళ్ళ ఇడ్రిస్ ఎల్బా ఎలా ఉంటారనే చర్చ వచ్చింది. ఆ మాటకొస్తే క్రెగ్‌ను తొలిసారిగా బాండ్ పాత్రకు తీసుకున్నప్పుడూ ఇలానే చర్చలు జరిగాయి. కొత్త బాండ్ ఎవరన్నది కొద్దిరోజుల్లో కానీ అధికారికంగా తేలదు. క్రెగ్ మాటెలా ఉన్నా, వీళ్ళకెంత పారితోషికమి స్తారో తెలీదు. అయినా, పాపులర్ బాండ్ పాత్రకు మించి పారితోషికం ఏముంటుంది! బాండ్... లేడీ బాండ్... జేమ్స్‌బాండ్ సినిమాలో లేడీ బాండ్‌నే హీరోగా పెట్టడమనేది ఇప్పుడిప్పుడే ఎంతవరకు జరుగుతుందో అనుమానమే కానీ, లేడీ బాండ్‌గా అందరి కన్నా ఎక్కువగా వినిపిస్తున్న పేరు మాత్రం గిలియన్ ఆండర్సన్. అమెరికన్ - బ్రిటీష్ సినీ, టీవీ, రంగస్థల నటి అయిన అమెరికన్ సైన్స్ - ఫిక్షన్ సిరీస్ ‘ఎక్స్-ఫైల్స్’లో అమెరికన్ నేర దర్యాప్తు సంస్థలో స్పెషల్ ఏజంట్ పాత్రధారిణిగా జనంలో ఫేమస్. కుటుంబాన్ని పోషించడం కోసం 22 ఏళ్ళ వయసులో హోటల్లో పనిచేస్తూ, రంగస్థలంపై నటిగా కాలుమోపారు. ఆ పైన టీవీ సిరీస్‌లలో నటిగా పేరు తెచ్చుకున్నారు. నవలా రచయిత్రి, ఉద్యమకారిణి అయిన ఆమె తెరపై బలమైన స్త్రీ పాత్రల్ని పోషిస్తుంటారు. పలు మహిళా సంస్థలకు, ఉద్యమాలకు మద్దతుదారైన గిలియన్ తనను తాను ‘ఫెమినిస్టు’గా అభివర్ణించుకుంటారు. ‘‘మహిళల గురించి ఎవరైనా కాస్త తేడాగా మాట్లాడినా, ప్రవర్తించినా నేను ఊరుకోలేను’’ అని బాహాటంగా అంటారు. అన్నట్లు భారతీయ సంతతి మహిళా డెరైక్టర్ గురిందర్ చద్ధా దేశ విభజన నేపథ్యంలో తీస్తున్న ‘వైస్రాయ్స్ హౌస్’లో మౌంట్‌బాటెన్ భార్య ఎడ్వినా మౌంట్బాటెన్గా గిలియన్ నటిస్తున్నారు. లేడీ బాండ్‌గా నటించినా, నటించకపోయినా - నెట్ ఫ్యాన్స్ పుణ్యమా అని ఇంత ప్రచారం వచ్చినందుకు గిలియన్ సహజంగానే సంతోషిస్తున్నారు. కోట్లిస్తానన్నా... బాండ్ అంటే భయమెందుకు? ‘జేమ్స్‌బాండ్‌గా నటించడం కన్నా మణికట్టు కోసుకుని చావడం బెటర్’ అని హాలీవుడ్ నటుడు డేనియల్ క్రెగ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటివరకూ 24 బాండ్ చిత్రాలు వస్తే, ఆ మధ్య విడుదలైన ‘స్పెక్టర్’ సహా 4 చిత్రాల్లో టైటిల్ రోల్ చేశారు క్రెగ్. ఇక బాండ్‌గా నటించనని ప్రకటించారు. ఎక్కువ డబ్బిస్తే క్రెగ్ నిర్ణయం మార్చుకుంటారని భావించి, దర్శక - నిర్మాతలు అనుకున్నారు. ఏకంగా 100 మిలియన్ డాలరు ్ల(రూ. 674 కోట్లపైగా) ఆఫర్ చేశారట. అంత డబ్బు అన్నా క్రెగ్ మనసు చలించలేదు. బాండ్ సినిమాల్లోని రిస్కీ యాక్షన్ సీన్స్ కారణంగా క్రెగ్‌కు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయట. పైగా, బాండ్ సినిమాల షూటింగ్ కోసం విమానం మీద నుంచి వేలాడడం, అతి వేగంగా వెళుతున్న కారులో ప్రయాణం లాంటి వాటితో ఆయనకు ఒళ్ళంతా దెబ్బలేనట! దాంతో, డబ్బు కన్నా ఆరోగ్యానికి ఓటేశారు. -
నెట్‌తో సొంత నిర్ణయాలు
వాషింగ్టన్: ఇంటర్నెట్ వినియోగించే పిల్లలు సమస్యల పరిష్కారానికి అవసరమయ్యే నిర్ణయాలను సొంతంగా నెట్ నుంచి క్రమంగా నేర్చుకుంటారని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. నెట్ వాడకుండా నిషేధించడం కంటే వినియోగించేలా చేయడ మే పిల్లల విషయంలో తల్లిదండ్రులు తీసుకున్న ఉత్తమ నిర్ణయం అవుతుందని స్పష్టంచేశారు. యుక్తవయసులో ఉన్న 68 మందిపై రెండు నెలలపాటు అధ్యయనం చేశారు. ప్యూ రీసెర్చ్ సెంటర్ సర్వే ప్రకారంప్రపంచ వ్యాప్తంగా 92 శాతం టీన్స్ నెట్ వాడుతున్నారు.