
ఎట్టకేలకు చిక్కింది..
కొల్చారం: మెదక్ జిల్లా కొల్చారం మండలం చుక్కాపూర్లో మంగళవారం ఉదయం నుంచి కలకలం సృష్టించిన చిరుత ఎట్టకేలకు అటవీ సిబ్బంది వలలో చిక్కింది. చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు చేసిన రెండో ప్రయత్నంలో సఫలీకృతులయ్యారు. తొలి ప్రయత్నంలో నాసిరకం వల విసరడంతో ఎంతో నేర్పుతో చిరుత తప్పించుకున్న విషయం తెలిసిందే.
అటవీశాఖ అధికారులను ముప్పుతిప్పులు పెట్టి మూడు చెరువల నీళ్లు తాగించిన చిరుత తమ వలలో చిక్కడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. గ్రామంలో చిరుతపులి సంచరించడంతో ఉదయం నుంచి బిక్కుబిక్కుమంటున్న చుక్కాపూర్ వాసులు.. చిరుత పట్టివేతపై హర్షం వ్యక్తం చేశారు. నేటి ఉదయం గ్రామంలో ప్రవేశించిన చిరుత ఆరుగురు వ్యక్తులపై దాడి చేసి గాయపరిచింది. గాయాలపాలైనవారు మెదక్ ఏరియా ఆస్పత్రిలో చికిత్స విషయం అందరికీ విదితమే.