దూకుడు మూలధన వ్యయం కారణంగా 2023 ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ( Reliance Industries Ltd )కు చెందిన రిటైల్ విభాగం నికర రుణం అనేక రెట్లు పెరిగింది. ఏడాది క్రితం రూ.1,600 కోట్లు ఉన్న రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ ( Reliance Retail Ventures Ltd ) నికర రుణం 2023 ఆర్థిక సంవత్సరంలో రూ.37,500 కోట్లకు పెరిగినట్లుగా కంపెనీ ఫైలింగ్స్ ద్వారా తెలుస్తోంది.
కంపెనీ మూలధన వ్యయంలో భారీ పెరుగుదలే నికర రుణం ఈ స్థాయిలో పెరగడానికి కారణంగా తెలుస్తోంది. కంపెనీ క్యాపెక్స్ 70 శాతం పెరిగి రూ.51,400 కోట్లకు చేరింది. ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మొత్తం మూలధన వ్యయంలో మూడవ వంతు.
రిలయన్స్ మూలధన వ్యయం గత ఏడు సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా 2023 ఆర్థిక సంవత్సరంలో 85 ఉందని జెఫ్రీస్ ఫైనాన్షియల్ గ్రూప్ ఒక పరిశోధనా నోట్‌లో తెలిపింది. ఇక కంపెనీ రిటైల్ సెగ్మెంట్ మూలధన వ్యయం గత నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో రూ. 1 లక్ష కోట్లకుపైగా ఉంది. స్థాయితో సంబంధం లేకుండా పోర్ట్‌ఫోలియో స్ప్రెడ్‌లో రిలయన్స్ రిటైల్ దూసుకెళ్తోంది.
ఇదీ చదవండి: Yousta: తక్కువ ధరలతో రిలయన్స్ కొత్త ఫ్యాషన్ బ్రాండ్.. తొలి స్టోర్ హైదరాబాద్‌లోనే..
Comments
Please login to add a commentAdd a comment