50 ఏళ్లుగా.. 10వేల కుటుంబాలకు జీవనోపాధి
నాగార్జునసాగర్: అనుమతి లేకుండా కృష్ణానది తీరంలో నివాసం ఉండొద్దని అటవీశాఖ అధికారులు మత్స్యకారులను హెచ్చరించి, వారు వేసుకున్న గుడిసెలను తొలగించి వలలను తగులబెట్టారు. నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం వరకు కృష్ణానది తీరం వెంట పుట్టీలనే గృహాలుగా మార్చుకొని గత 50 ఏళ్లుగా 2 తరాల వారు 10 వేల మత్స్యకారుల కుటుంబాలు చేపలు పట్టుకొని జీవనోపాధి పొందుతున్నాయి.
అయితే ఎలాంటి హెచ్చరికలు చేయకుండా అటవీ అధికారులు తమ గుడిసెలు తొలగించి వలలు తగలబెట్టారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తాము సుమారుగా రూ.8 లక్షల మేర నష్టపోయినట్లు తెలిపారు. రెండు రాష్ట్రాల అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment