మెరుగైన నెట్‌వర్క్‌లో వొడాఫోన్‌ఐడియాకు గుర్తింపు | Vi emerged top performer across all six categories nationally as per OpenSignal 4G Network Experience Report | Sakshi
Sakshi News home page

మెరుగైన నెట్‌వర్క్‌లో వొడాఫోన్‌ఐడియాకు గుర్తింపు

Published Thu, Dec 19 2024 1:55 PM | Last Updated on Thu, Dec 19 2024 2:54 PM

Vi emerged top performer across all six categories nationally as per OpenSignal 4G Network Experience Report

తెలుగు రాష్ట్రాల్లో వొడాఫోన్‌ఐడియా 4జీ నెట్‌వర్క్‌ అత్యుత్తమ నెట్‌వర్క్‌గా గుర్తింపు పొందినట్లు కంపెనీ తెలిపింది. నవంబర్‌ నెలలో కంపెనీ మెరుగైన నెట్‌వర్క్‌ అందించినట్లు ఓపెన్‌సిగ్నల్‌ 4జీ నెట్‌వర్క్‌ ఎక్స్‌పీరియన్స్‌ రిపోర్ట్ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 4జీ డౌన్‌లోడ్ స్పీడ్, వీడియో స్ట్రీమింగ్‌, లైవ్ వీడియో ప్రసారం, 4జీ వాయిస్‌ వంటి సర్వీసుల్లో పటిష్ట సేవలు అందిస్తున్నందుకు ఈ గుర్తింపు లభించినట్లు కంపెనీ పేర్కొంది. ఇటీవల బ్యాండ్‌విడ్త్ అప్‌గ్రేడ్ చేయడం, 8700 పైగా లొకేషన్లను తమ నెటవర్క్‌ పరిధిలోకి తీసుకురావడం వంటి తదితర అంశాలు ఇందుకు ఎంతో తోడ్పడ్డాయని ఏపీ, తెలంగాణ, కర్ణాటక క్లస్టర్ బిజినెస్ హెడ్ ఆనంద్ దానీ తెలిపారు.

‘ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో అత్యుత్తమ 4జీ నెట్‌వర్క్ అందిస్తున్నందుకుగాను మాకు గుర్తింపు లభించడం చాలా సంతోషంగా ఉంది. మా నెట్‌వర్క్‌ను మరింత పటిష్ఠ పరిచేందుకు, నిరాంటకంగా కనెక్టివిటీ ఉండేలా చూసేందుకు మేము చేస్తున్న ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రతిఫలమే ఈ గుర్తింపులు. వినియోగదారులకు ఆటంకంలేని అత్యుత్తమ కనెక్టివిటీని అందించడానికి మేము కట్టుబడి ఉన్నాం’ అని ఆనంద్ దానీ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: అమెరికాలో టిక్‌టాక్‌ భవితవ్యం ప్రశ్నార్థకం

ఓపెన్‌సిగ్నల్‌ 4జీ నెట్‌వర్క్‌ ఎక్స్‌పీరియన్స్‌ రిపోర్ట్ ప్రకారం..

  • కంపెనీ వినియోగదారులు నవంబర్‌ నెలలో వేగవంతమైన 4జీ సేవలను ఉపయోగించుకున్నారు.

  • యూజర్లు 17.4 ఎంబీపీఎస్‌ డౌన్‌లోడ్‌ వేగాన్ని, 4.7 ఎంబీపీఎస్‌ అప్లోడ్ వేగాన్ని అనుభవించారు.

  • వీడియో స్ట్రీమింగ్, లైవ్ వీడియోకు సంబంధించి వినియోగదారులకు మెరుగైన సర్వీసు లభించింది.

  • యూజర్లు స్థిరంగా ఈ నాణ్యమైన సేవలను అనుభవించారు.

  • కంపెనీ ఈ గుర్తింపు సాధించేందుకు 2500 మెగాహెట్జ్ బ్యాండ్ స్పెక్ట్రంను రెట్టింపు స్థాయిలో అప్‌గ్రేడ్ చేసింది.

  • ఫలితంగా 5,000కు పైగా లొకేషన్లలో కంపెనీ 4జీ సామర్థ్యాలను మెరుగుపర్చుకుంది.

  • 2000కు పైగా పట్టణాలు, 60 జిల్లాలవ్యాప్తంగా వేగవంతమైన ఇంటర్నెట్ స్పీడ్‌ అందించే దిశగా ప్రయత్నాలు చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement