
వినియోగదారులు తమ సందేశాలు, మీడియా ఫైల్స్‌పై మరింత నియంత్రణను కల్పించేందుకు ప్రముఖ ఆన్‌లైన్ చాటింగ్ యాప్ వాట్సాప్ అడ్వాన్స్‌డ్ చాట్ ప్రైవసీ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ఇతరులు తమ చాట్‌లోని సందేశాలను, మీడియా ఫైల్స్‌ను ఎక్స్‌పోర్ట్ చేయకుండా, ఆటో డౌన్ లోడ్ చేయకుండా, ఏఐ సంబంధిత సాధనాల కోసం సందేశాలను ఉపయోగించకుండా నిరోధిస్తుంది.
ఇదీ చదవండి: బంకుల్లో పెట్రోల్, డీజిల్ పోయమన్నా పోయరు!
గోప్యతకు అత్యంత ప్రాముఖ్యతనిస్తూ వినియోగదారుల అవసరాల కోసం ఈ ఫీచర్‌ను తీసుకొచ్చినట్లు కంపెనీ తెలిపింది. గ్రూప్ మేసేజ్‌లకు మరింత భద్రత కల్పించేందుకు ఇది ఎంతో తోడ్పడుతుందని పేర్కొంది. చాట్ సెట్టింగ్స్‌లో ‘అడ్వాన్స్‌డ్ చాట్ ప్రైవసీ’ ఆప్షన్ ద్వారా దీన్ని మాన్యువల్‌గా ఎనేబుల్ చేయవచ్చు. ఒకసారి యాక్టివేట్ అయిన తర్వాత చాట్‌లో పాల్గొనే వారందరికీ పరిమితులు వర్తిస్తాయి. గ్రూప్‌లోని కంటెంట్ వాట్సాప్‌లోనే ఉండేలా చూసుకుంటుంది.