
Samantha Conversation With Her Mother Post Goes Viral: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం కెరీర్ విషయంలో దూకుడు పెంచింది. వరుస సినిమాలు సైన్ చేస్తూ తనను తాను కొత్తగా నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక సోషల్ మీడియాలో కూడా సామ్ యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే చైతూతో విడాకుల తర్వాత మరింత యాక్టివ్‌గా కనిపిస్తున్న సామ్ గత కొన్నాళ్లుగా ''మై.. మమ్మా సెయిడ్''(మా అమ్మ చెప్పింది) ..అనే హ్యాష్‌ట్యాగ్‌తో వరుస పోస్టులు షేర్ చేస్తుంది.
తాజాగా తన తల్లితో చేసిన వాట్సాప్ చాటింగ్‌ను బయటపెట్టింది.'నాలోని కొత్తదనం నీకు తెలియదు.. నా ముక్కలను తిరిగి పేరుస్తా'.. అంటూ ఉన్న కొటేషన్‌ను సామ్‌కు ఆమె తల్లి వాట్సాప్‌లో షేర్ చేసింది. గాడ్ బ్లెస్ యూ మై బేబీ (ఆ దేవుడు నిన్ను చల్లగా చూడాలి) అంటూ మెసేజ్‌ను కూడా పంపించింది. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను సమంత తన ఇన్‌స్టా స్టోరీలో పంచుకుంది.
ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇది చూసిన నెటిజన్లు.. విడాకుల అనంతరం కూతురు డిప్రెషన్‌లోకి వెళ్లకుండా సామ్ తల్లి ఇలా మోటివేట్ చేస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.