Akhil Akkineni Respond On Samantha Myositis Post Goes Viral - Sakshi
Sakshi News home page

Akhil Akkineni : సమంత 'మయోసైటిస్‌' వ్యాధిపై స్పందించిన అఖిల్‌ అక్కినేని

Published Sun, Oct 30 2022 9:37 AM | Last Updated on Sun, Oct 30 2022 1:10 PM

Akhil Akkineni Respond On Samantha Myositis Post Goes Viral - Sakshi

స్టార్‌ హీరోయిన్‌ సమంత అనారోగ్యానికి సంబంధించిన వార్త ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతుంది. కొద్ది రోజులుగా ఆమో సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటూ వస్తుండటంతో పలు వార్తలు తెరమీదకి వచ్చాయి. సామ్‌ కాస్మొటిక్‌ సర్జరీ చేయించుకుందని, అందుకే బయటికి రావడం లేదంటూ సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. దీనికి తోడు సమంత రీసెంట్‌గా కనిపించిన ఓ యాడ్‌ షూట్‌లోనూ ఆమె ముఖంలో స్పష్టమైన మార్పులు కనిపించాయి. దీంతో సర్జరీ కోసమే సామ్‌ అమెరికా వెళ్లిందనే ఊహాగానాలకు మరింత బలం చేకూరినట్లయ్యింది.

సోషల్‌ మీడియాలో ఆమె అనారోగ్యంపూ రకరకాల రూమర్స్‌ పుట్టుకొచ్చాయి. వీటిపై ఇంతవరకు స్పందించని సామ్‌ తొలిసారిగా ఓపెన్‌ అయ్యింది. తాను మయోసైటిస్‌ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పి అందరికి షాక్‌ ఇచ్చింది.ఓవైపు చికిత్స తీసుకుంటూనే, మరోవైపు యశోద సినిమాకు సంబంధించిన డబ్బింగ్‌ చెబుతున్న ఓ ఫోటోను సమంత సోషల్‌ మీడియాలో చేసింది. దీంతో అటు ఇండస్ట్రీ ప్రముఖులు సహా నెటిజన్లు సామ్‌ త్వరగా కోలుకోవాలంటూ పోస్టులు పెడుతున్నారు.

ఇక సామ్‌ పోస్టు చూసి అఖిల్‌ అక్కినేని సైతం స్పందించారు. అందరి ప్రేమాభిమానాలే నీకు మరింత బలాన్ని ఇస్తాయి డియర్‌ సామ్‌ అంటూ అఖిల్‌ చేసిన కామెంట్స్‌ నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇది చూసిన నెటిజన్లు మరి నాగ చైతన్య ఇంకా ఎందుకు స్పందించలేదు అంటూ అభిప్రాయపడుతున్నారు.

చదవండి: అరుదైన వ్యాధితో చికిత్స తీసుకుంటున్న సమంత.. ఎమోషనల్‌ పోస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement