సాక్షి,ముంబై: ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్, మెటా యాజమాన్యంలోని వాట్సాప్ మరో బంపర్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. వాట్సాప్ యూజర్లకు యాండ్రాయిడ్, ఐవోఎస్ స్మార్టఫోన్లలో 'పోల్స్' ఫీచర్‌ను జోడించింది. ఇంతకు ముందు, వినియోగదారులు ప్రత్యక్ష చాట్‌లు, గ్రూపు సంభాషణలలో పోల్‌లను నిర్వహించడానికి థర్డ్ పార్ట్ యాప్‌ల ద్వారా క్రియేట్ చేసిన పోల్ లింక్‌లను షేర్ చేయాల్సి వచ్చేది. ఇపుడు ఆ అవసరం లేకుండానే ప్రైవేట్ చాట్ లేదా గ్రూప్ మెసేజెస్‌లో పోల్ నిర్వహించేందుకు అనుమతినిస్తుంది. ప్రస్తుతం టెస్టింగ్ దశలోఉన్న వాట్సాప్‌లో పోల్‌లను ఎలా సృష్టించాలో ఒకసారి చూద్దాం. (ఎయిర్టెల్ యూజర్లకు భారీ షాక్! ఇక కనీస రీచార్జ్ ప్లాన్ ఎంతంటే?)
ఇదీ చదవండి : ఎయిర్టెల్ యూజర్లకు భారీ షాక్! ఇక కనీస రీచార్జ్ ప్లాన్ ఎంతంటే?
ఐఫోన్‌లలో వాట్సాప్ పోల్స్ ఎలా క్రియేట్ చేయాలి
♦ వాట్సాప్ యాప్‌ను అప్‌డేట్ చేయండి
♦ ఎక్కడ పోల్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ చాట్, ప్రైవేట్ లేదా గ్రూప్‌ని ఓపెన్ చేయాలి.
♦ టెక్స్ట్ బాక్స్‌కు ఎడమ వైపున ఉన్న ప్లస్ (+) గుర్తుపై నొక్కండి
♦ 'పోల్' ఎంపికపై నొక్కండి. పోల్‌కు సంబంధించిన
♦ పోల్‌కు సంబంధించిన ప్రశ్నను టైప్ చేసి, ఆ తర్వాత ఆప్షన్స్‌ను టైప్ చేయండి
♦ ఆ తరువాత చాట్‌లో పోల్‌ను షేర్ చేయడానికి సెండ్ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. ఎంపికపై నొక్కండి
ఆండ్రాయిడ్ ఫోన్‌లలో వాట్సాప్ పోల్స్ ఎలా క్రియేట్ చేయాలి
♦ వాట్సాప్ యాప్‌ను అప్‌డేట్ చేయండి
♦ ఎక్కడ పోల్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ చాట్, ప్రైవేట్ లేదా గ్రూప్‌ని ఓపెన్ చేయాలి.
♦ టెక్స్ట్‌బాక్స్‌కు కుడి వైపున ఉన్న పేపర్ క్లిప్ ఐకాన్‌ను ఎంచుకోవాలి.
♦ 'పోల్' ఎంపికపై క్లిక్ చేయండి.
♦ పోల్‌కు సంబంధించిన ప్రశ్నను, ఆప్షన్స్‌ను టైప్ చేయాలి.
♦ ఆ తర్వాత, చాట్‌లో పోల్ సెండ్ చేస్తే సరిపోతుంది.
(దూసుకొచ్చిన మ్యాటర్ ఎనర్జీ: అత్యాధునిక ఫీచర్స్‌తో ఎలక్ట్రిక్ బైక్)
యూజర్లు పోల్‌లో గరిష్టంగా 12 ఆప్షన్స్‌ను జోడించవచ్చు. రైట్ సైడ్‌లో ఉన్న హాంబర్గర్ సహాయంతో, వినియోగదారులు ప్రతిస్పందనల క్రమాన్ని మార్చు కోవచ్చు. అంతేకాదు ఇతర పోల్ ప్లాట్‌ఫారమ్‌ల మాదిరిగా కాకుండా, వాట్సాప్ పోల్స్ క్రియేట్ అయితన తర్వాత వినియోగదారులు ఎప్పుడైనా ఓటు వేయవచ్చు. ఎపుడు ఓటు వేస్తే అపుడు ఆటోమేటిగ్గా అప్‌డేట్ అవుతుంది. గ్రూపు సభ్యులు ఒకటి కంటే ఎక్కువ ఓట్లు వేయవచ్చు. అలాగే వ్యూ వోట్స్ ఆప్షన్ ద్వారా ఎవరు ఎన్ని ఓట్లు వేసింది, ఎవరు ఏయే ఆప్షన్‌ను ఎంచుకున్నారు అనేది కూడా చూడవచ్చు.
పాస్‌వర్డ్ లేదా పిన్
స్క్రీన్ లాక్ పేరుతో మరో కొత్త ఫీచర్‌ను వాట్సాప పరీక్షిస్తోంది. డెస్క్‌టాప్‌లో యాప్ ఓపెన్ చేసి మర్చిపోయేవాళ్లకు ఇది బాగా ఉపయోగపడుతుంది. డెస్క్‌టాప్ మీద వాట్సాప్ యాప్‌ను ఓపన్ చేసిన ప్రతిసారి పాస్వర్డ్ లేదా పిన్ ఎంటర్ చేయాల్సిందే. తద్వారా యూజర్ చాట్ సంభాషణలకు అదనపు భద్రత కల్పిస్తోంది సంస్థ, త్వరలోనే ఈ ఫీచర్ వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment