వాట్సాప్ హ్యాకింగ్: ఈ టిప్స్ పాటిస్తే మీరు సేఫ్ | Five Tips For WhatsApp Privacy | Sakshi
Sakshi News home page

వాట్సాప్ హ్యాకింగ్: ఈ టిప్స్ పాటిస్తే మీరు సేఫ్

Published Sun, Dec 15 2024 3:27 PM | Last Updated on Sun, Dec 15 2024 4:01 PM

Five Tips For WhatsApp Privacy

స్మార్ట్‌ఫోన్‌ వినియోగిస్తున్న ప్రతి ఒక్కరూ వాట్సాప్ ఉపయోగిస్తుంటారు. అయితే.. సైబర్ మోసగాళ్ల ఆగడాలు మితిమీరుతున్న తరుణంలో ఆన్‌లైన్ స్కామ్‌లు పెరిగిపోతున్నాయి. వాట్సాప్ ద్వారా కూడా ప్రజలను మోసాలు చేస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. కాబట్టి దీనిని దృష్టిలో ఉంచుకుని.. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) కొన్ని సూచనలు జారీ చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

టూ స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేసుకోవాలి
వాట్సాప్ అకౌంట్ సురక్షితంగా ఉండాలంటే.. టూ స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేయడం ఉత్తమం. దీని కోసం ముందుగా వాట్సాప్ ఖాతా ఓపెన్ చేసి.. అందులో టూ స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేసుకోవాలి. దీని కోసం ప్రత్యేకంగా ఒక పిన్ కూడా సెట్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మీ ఖాతాను ఎవరూ హ్యాక్ చేసే అవకాశం లేదు.

వాట్సాప్ అప్డేట్ చేసుకోవాలి
వాట్సాప్ ఖాతాను అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మెటా ఎప్పటికప్పుడు ఫీచర్స్ అప్డేట్ చేస్తూ ఉంటుంది. ఇది మీ భద్రతను పెంచడంలో సహాయపడుతుంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే.. యాప్ అప్డేట్ పేరుతో వచ్చే సందేశాల విషయంలో కూడా యూజర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే యాప్ అప్డేట్ పేరుతో ఫేక్ మెసేజ్‌లు వస్తుంటాయి.

తెలియని కాల్స్ స్వీకరించకండి
తెలియని నెంబర్ల నుంచి వచ్చే కాల్స్ (ఆడియో & వీడియో) స్వీకరించకపోవడం ఉత్తమం. కొంతమంది డిజిటల్ అరెస్ట్ పేరుతో చాలా మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వాళ్ళు వాట్సాప్ కాల్స్ ఉపయోగించే ప్రజలను మోసం చేస్తుంటారు. కాబట్టి తెలియని కాల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని డాట్ (DoT) హెచ్చరిస్తోంది.

వైఫై నెట్‌వర్క్‌లకు దూరంగా ఉండండి
పబ్లిక్ వైఫై నెట్‌వర్క్‌లు.. అంత సురక్షితమైనవి కాదు. కాబట్టి హ్యాకర్లు ఎక్కువగా ఇలాంటి నెట్‌వర్క్‌లను ఉపయోగించి హ్యాక్ చేస్తుంటారు. కాబట్టి వీలైనంత వరకు పబ్లిక్ వైఫై ఉపయోగించడాన్ని తగ్గించాలి. తప్పనిసరిగా ప్రైవేట్ నెట్‌వర్క్‌ను ఉపయోగించాలి. అప్పుడే మీ డేటా సేఫ్‌గా ఉంటుంది.

స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌ ఉపయోగించండి
మీ ఫోన్‌లో డేటా భద్రంగా ఉండాలంటే స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌ ఉపయోగించాలి. సింపుల్ పాస్‌వర్డ్‌లను సెట్ చేసుకుంటే.. హ్యాకర్స్ సులభంగా మొబైల్స్ హ్యాక్ చేసే అవకాశం ఉంటుంది. బయోమెట్రిక్ లేదా పేస్ ఐడెంటిటీ వంటివి సెట్ చేసుకోవడం కూడా ఉత్తమం. 123456 లేదా abcdef వంటివి సెట్ చేయడం పూర్తిగా మానేయాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement