Hacker
-
‘50 కోట్లు ఇస్తే ఈవీఎం హ్యాక్ చేస్తా’
ముంబై : మరికొద్ది రోజుల్లో మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో మహారాష్ట్ర ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) కూటమికి లబ్ధి చేకూరుస్తానంటూ ఓ హ్యాకర్.. ఓ జాతీయ మీడియా రహస్య ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇందుకోసం కూటమికి చెందిన ఓ ఎంపీతో మంతనాలు జరిపినట్లు చెప్పడం గమనార్హం. సదరు మీడియా ప్రతినిధి..ఈవీఎంలు హ్యాక్ అయ్యాయని పలు మార్లు ఆరోపించిన సైబర్ నిపుణుడు సయ్యద్ షుజాతో వీడియో కాల్ మాట్లాడారు. తాను ఓ ఎంపీకి వ్యక్తిగత సహాయకుడినంటూ (పీఏ) పరిచయం చేసుకున్నారు. ఆ వీడియో కాల్లో ఎంపీకి పీఏగా పనిచేస్తున్న ప్రతినిధి.. మీతో ఓ ప్రముఖ వ్యక్తి మాట్లాడాలనుకుంటున్నారు. మీరు మాట్లాడుతారా? అని అడగ్గా.. ఒక్క నిమిషం తర్వాత మరో మీడియా ప్రతినిధి తాను మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు చెప్పారు. తాను పోటీ చేస్తున్న నియోజకవర్గంలో తనకు లబ్ధి చేకూరేలా ఈవీఎం హ్యాక్ చేయాలని కోరారు. మధ్యలో సయ్యద్ ఘజా కలగజేసుకుని నియోజవర్గం వివరాల గురించి ఆరాతీశారు. నేను ఈవీఎం హ్యాక్ చేస్తా. అందుకు భారీ మొత్తంలో డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు.ఈవీఎం హ్యాక్ చేసినందుకు తనకు సుమారు రూ. 52-53 కోట్లు చెల్లించాలి. ప్రాంతాలను స్కాన్ చేయడం,యాప్స్‌ను ఉపయోగించి ఈవీఎం సిగ్నల్స్‌ను మారుస్తానని చెప్పడం వీడియో సంభాషణల్లో వెలుగులోకి వచ్చాయి. కాగా, 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి లబ్ధి చేకూరేలా ఈవీఎంలను హ్యాక్ చేసినట్లు హ్యాకర్ సయ్యద్ షుజాతో చెప్పడం కలకలం రేపుతుంది.మరి ఈ స్టింగ్ ఆపరేషన్‌పై మహరాష్ట్ర అధికార,ప్రతిపక్షాలు ఏ విధంగా స్పందిస్తాయో చూడాలి మరి. 👉చదవండి : బీజేపీపై అజిత్ పవార్ తిరుగుబావుటా? -
సైబర్ దొంగ.. ఏఐకూ బెంగ!
కడవంత గుమ్మడికాయ అయినా కత్తిపీటకు లోకువ అన్నది సామెత. ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థల పరిస్థితి కూడా ఇలానే ఉంది. అద్భుతాలు సృష్టించే కృత్రిమ మేధోశక్తి (ఏఐ) గుప్పిట్లో ఉన్నా.. సైబర్ దొంగల ‘చోరకళ’ మాత్రం ఆ సంస్థలను భయపెడుతూనే ఉంది. ఏఐతో సమానంగా పనిచేస్తూ, డేటాను దొంగిలించే టూల్స్‌ను వారు రూపొందిస్తున్నారు. ఏఐతో దూసుకుపోతున్న బహుళ జాతి ఐటీ కంపెనీలు డేటా సెక్యూరిటీ సమస్యలను ఎదుర్కొనేందుకు ఎన్ని కోట్లయినా వెచ్చించేందుకు సిద్ధమవడం గమనార్హం. ప్రముఖ డేటా సెక్యూరిటీ, రెసిలెన్స్ సంస్థ ‘వీమ్’ఇటీవల సైబర్ దాడులపై చేసిన అధ్యయన నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది.సైబర్ దొంగల చేతుల్లో గ్లోబల్ డేటా..వీమ్ అధ్యయనం ప్రకారం..2023లో మైక్రోసాఫ్ట్, మెటా, ఓపెన్ ఏఐ వంటి పలు గ్లోబల్ సంస్థలు కూడా సైబర్ క్రిమినల్స్ చేతికి చిక్కాయి. వారు ర్యాన్సమ్వేర్ను తేలికగా ఆయా సంస్థల సర్వర్లలోకి పంపారు. కొన్ని కంపెనీల డేటా బ్యాకప్, రికవరీ, సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ వ్యవస్థలను గుప్పిట్లోకి తీసుకున్నారు. కంపెనీల నిర్వహణ, రహస్య సమాచారం, వ్యాపార లావాదేవీల డేటాను చోరీ చేశారు. సర్వర్లను ఎన్‌క్రిప్ట్ చేశారు. ఇలా సైబర్ దాడులకు గురైన సంస్థల్లో 81 శాతం కంపెనీలు చేసేదేమీ లేక, సైబర్ నేరస్తులకు గుట్టుచప్పుడు కాకుండా సొమ్మును ముట్టజెప్పాయని తేలింది. ఇలా డబ్బులు ఇచ్చినా కూడా మూడింట ఒకవంతు సంస్థలు, వ్యక్తులు డేటాను తిరిగి పొందలేకపోయారని అధ్యయనంలో తేలింది. 45 కోట్ల వినియోగదారులున్న మైక్రోసాఫ్ట్..5.5 కోట్ల కస్టమర్ల డేటానే పూర్తిస్థాయిలో తిరిగి పొందగలిగిందని నివేదిక పేర్కొంది. అంతపెద్ద కంపెనీలే నిస్సహాయ స్థితికి వెళ్తుంటే..పరిస్థితి ఏమిటని వీమ్ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.ఎదురవుతున్న సవాళ్లు..ప్రపంచవ్యాప్తంగా కంపెనీలన్నీ కృత్రిమ మేధతో పనిచేయడం అనివార్యమైంది. అన్ని సంస్థలూ ఇందుకోసం టూల్స్‌ను సమకూర్చుకుంటున్నాయి. డిజిటల్ లావాదేవీలు, ఈ–కామర్స్, స్మార్ట్ సిటీలు, ప్రత్యేక క్లౌడ్ బేస్డ్ టెక్నాలజీతో పెద్ద ఎత్తున డిజిటల్ డేటాను సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే సైబర్ నేరస్తులూ అప్డేట్ అవుతున్నారు. ఏఐ ఆధారిత మాల్వేర్లు, వైరస్‌లను రూపొందిస్తున్నారు. వాటితో కంపెనీల సర్వర్లపై దాడులు చేస్తున్నారు. ఏఐని అభివృద్ధి చేస్తున్న మేధావులే ఈ వినాశకర శక్తుల జాబితాలోనూ ఉంటున్నారని అంతర్జాతీయ సైబర్ సంస్థలు అంటున్నాయి. ‘ఎండ్ టు ఎండ్ సెక్యూరిటీ విధానాలపై, సైబర్ సెక్యూరిటీ చైన్ లింక్’పై అధ్యయనం చేసిన వారే సైబర్ దాడుల్లో ప్రధాన భూమిక పోషిస్తున్నారని పేర్కొంటున్నాయి.ఇదీ చదవండి: కొత్త అప్డేట్.. యాపిల్‌లో అదిరిపోయే ఫీచర్!రక్షణ వ్యవస్థలపై ఫోకస్ఏఐ ఆధారిత వ్యవస్థలను రక్షించే విధానాలపై కంపెనీలు ఫోకస్ చేశాయి. ప్రతీ కంపెనీ దీనిపై కోట్ల రూపాయలను వెచ్చిస్తోంది. దీన్ని మరింత విస్తృతం చేయాలని, పరిశోధన విధానాలను ప్రతీ కంపెనీలు అభివృద్ధి చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. డేటా స్టోరేజీ గతం కన్నా భిన్నంగా ఉంటోందని..ఇందుకోసం మైక్రో ఇంటెలిజెన్స్ వ్యవస్థలను అభివృద్ధి చేయాలని పేర్కొంటున్నారు.సైబర్ నేరాల లెక్కలివీ..వరల్డ్ సైబర్ క్రైం ఇండె క్స్– 2024 ప్రకారం.. సైబర్ నేరాల ఆనవాళ్లు రష్యాలో ఎక్కువగా ఉన్నాయి.ఉక్రెయిన్, చైనా, అమెరికా, నైజీరియా, రొమేనియా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.గ్లోబల్ సైబర్ క్రైమ్ నివేదిక ప్రకారం 2025 నాటికి ఏటా 10 ట్రిలియన్ డాలర్లకు పైగా సైబర్ నేరాలపై ఖర్చు పెట్టాల్సి వస్తుంది.సైబర్ నేరాలు గడచిన 11 ఏళ్లలో 15.63 ట్రిలియన్ డాలర్లకు చేరినట్టు స్టాటిస్టా సర్వే చెబుతోంది. ఇది 2029 నాటికి మూడు రెట్లు పెరిగే వీలుందని పేర్కొంది. -
ఫోన్‌కు స్పందించొద్దు.. వివరాలు చెప్పొద్దు
సిద్దిపేటకమాన్: సైబర్ నేరగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని సిద్దిపేట పోలీస్‌కమిషనర్ శ్వేత అన్నారు. లాటరీ, లోన్, బహుమతి పేరుతో, తక్కువ పెట్టుబడి పెడితే ఎక్కువ మొత్తంలో లాభాలు వస్తాయని వచ్చే ఫోన్‌కాల్స్‌కు ఎవరూ స్పందించకూడదన్నారు. గుర్తు తెలియని వ్యక్తులకు వ్యక్తిగత, బ్యాంక్, ఏటీఎం డెబిట్, క్రెడిట్ కార్డు వివరాలు, పిన్ నంబర్లు, ఓటీపీ వంటి వివరాలు చెప్పొద్దన్నారు. సిద్దిపేట జిల్లాలో ఈ సంవత్సరం సైబర్ మోసాల ద్వారా పోగొట్టుకున్న వాటిలో రూ.46,55,964 ఫ్రీజ్ చేశామని, త్వరలో విడతల వారీగా సంబంధిత బాధితుల ఖాతాల్లో జమవుతాయన్నారు. సిద్దిపేట పోలీసు కమిషనరేట్ పరిధిలో సోమవారం జరిగిన పలు సైబర్ నేరాలపై సీపీ తెలిపిన వరాల ప్రకారం.. ఇండియన్ బుల్స్ కంపెనీ పేరుతో.. సిద్దిపేట వన్‌టౌన్ పీఎస్ పరిధిలో ఓ వ్యక్తికి గుర్తుతెలియని ఒకరు ఫోన్‌చేసి ఇండియా బుల్స్ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌గా పరిచయం చేసుకున్నాడు. మీకు లోన్ మంజూరైంది... లోన్ ప్రాసెసింగ్ చార్జీల నిమిత్తం కొంత మొత్తం చెల్లించాలని గుర్తు తెలియని వ్యక్తి సూచించాడు. ఆ మాటలు నమ్మిన బాధితుడు గుర్తు తెలియని వ్యక్తి సూచించిన నంబర్‌కు ఫోన్ ఫే ద్వారా రూ.10,653 పంపించాడు. తర్వాత మరిన్ని డబ్బులు పంపాలని గుర్తు తెలియని వ్యక్తి భయపెట్టడంతో అనుమానం వచ్చిన బాధితుడు జాతీయ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు ఫిర్యాదు చేశాడు. లోన్‌యాప్ పేరిట.. రాజగోపాలపేట పీఎస్ పరిధిలోని ఓ వ్యక్తి ఆన్లైన్లో లోన్ టీకాయాప్లో లోన్ తీసుకుని తిరిగి మిత్తితో సహా అసలు మొత్తం డబ్బు చెల్లించాడు. కానీ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి ఇంకా డబ్బులు చెల్లించాలని బెదిరించడంతో బాధితుడు ఆన్లైన్లో రూ.6,100 పంపించాడు. అనంతరం సైబర్ నేరగాడు మళ్లీ ఫోన్ చేసి ఇంకా డబ్బులు పంపించాలని లేదంటే నీ ఫొటోలు న్యూడ్‌గా ఎడిట్ చేసి వాట్సాప్, సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బాధితుడిని బెదిరించాడు. అనుమానం వచ్చిన బాధితుడు వెంటనే జాతీయ హెల్ప్‌లైన్‌లో ఫిర్యాదు చేశాడు. మహిళ డీపీతో... రాజగోపాలపేట పీఎస్ పరిధిలోని ఓ మహిళ ఇన్‌స్ట్రాగామ్ ఖాతాను సైబర్ నేరగాడు హ్యాక్ చేశాడు. తాను ఆపదలో ఉన్నానని డబ్బులు పంపించాలని కోరాడు. స్పందించకపోవడంతో ఆమె డీపీ (ఫొటో)ను ఉపయోగించి వేరే ఫోన్‌నంబర్ ద్వారా వాట్సాప్ క్రియేట్ చేశాడు. మెసేజ్ పంపించగా స్పందించిన బాధితురాలు ఆన్లైన్లో రూ.5 వేలు పంపించింది. తర్వాత విచారణ చేసుకోగా గుర్తు తెలియని వ్యక్తికి డబ్బులు పంపినట్టు సైబర్ మోసం జరిగినట్టు గుర్తించి ఫిర్యాదు చేసింది. -
టెస్లా కారులో సీక్రెట్ ఫీచర్! ‘ఎలాన్ మోడ్’ అని పేరుపెట్టిన హ్యాకర్
టెస్లా కార్లలో ఒక రహస్య ఫీచర్ బయటపడింది. టెస్లా సాఫ్ట్వేర్ హ్యాకర్ కనుక్కున్న ఈ ఫీచర్‌కు ‘ఎలోన్ మోడ్’ అని పేరు పెట్టినట్లు ‘ది వెర్జ్’ వార్తా సంస్థ నివేదిక తెలిపింది. ఈ ఫీచర్ టెస్లా వాహనాల్లో హ్యాండ్స్ ఫ్రీ డ్రైవింగ్‌ను అనుమతిస్తుంది. @greentheonly అనే పేరుతో ట్విటర్లో ఈ రహస్య ఫీచర్ గురించి హాకర్ పేర్కొన్నారు. ‘ఎలాన్ మోడ్’ను కనుగొని, ఎనేబుల్ చేసి పరీక్షించిన హాకర్ దీనికి సంబంధించిన వీడియో ఫుటేజీలను ట్విటర్లో షేర్ చేశారు. అయితే ఈ ఫీచర్‌కు సంబంధించిన ఎలాంటి సమాచారం కార్ లోపల స్క్రీన్‌పై లేదు. టెస్లా పూర్తి స్వీయ డ్రైవింగ్ (ఎఫ్ఎస్డీ) అనేది బీటా స్థితిలో పరీక్ష స్థాయిలో ఉన్న అధునాతన డ్రైవర్ సహాయక వ్యవస్థ. ప్రస్తుతానికి 15 వేల డాలర్లు అదనంగా చెల్లించిన వారికి ఇది అందుబాటులో ఉంది. కానీ ఎఫ్ఎస్డీ సాఫ్ట్‌వేర్‌పై కస్టమర్ల నుంచి చాలా ఫిర్యాదులు వచ్చినట్లు గత నెలలో బయటకు పొక్కిన ఓ అంతర్గత నివేదిక ద్వారా తెలిసింది. ఉన్నట్టుండి ఆగిపోవడం, స్పీడ్ పెరిగిపోవడం వంటి లోపాలు ఉన్నట్లు కస్టమర్లు ఫిర్యాదు చేశారు. చెయ్యి వేయాల్సిన పని లేదు! టెస్లా ఆటోపైలట్ సిస్టమ్ అనేది హైవేల కోసం కంపెనీ రూపొందించిన మొదటి తరం డ్రైవర్ సహాయక వ్యవస్థ. సెల్ఫ్ డ్రైవింగ్ అయినప్పటికీ డ్రైవింగ్ సమయంలో అందులోని వ్యక్తి అప్రమత్తంగా ఉన్నారని నిర్ధారించడానికి స్టీరింగ్ వీల్‌ను అప్పుడప్పుడు తాకాల్సి ఉంటుంది. ఇలా తరచూ చేయాల్సి ఉండటంపై కస్టమర్ల నుంచి ఫిర్యాదులు ఉన్నాయి. ఇప్పటికే ఉన్న హ్యాండ్స్ ఆన్ స్టీరింగ్ కన్ఫర్మేషన్తోపాటు సెంటర్ ఇంటీరియర్ కెమెరా డ్రైవర్లు ముందుకు చూస్తున్నారా లేదా అని గమనిస్తాయి. హాకర్ ‘ఎలాన్ మోడ్’లో నిర్వహించిన 600 మైళ్ల పరీక్షలో అలాంటి ఇబ్బందులేవీ ఎదురవ్వలేదని నివేదిక పేర్కొంది. ఈ మోడ్‌లో సిస్టమ్ లేన్లను మార్చడం, హైవేపై నెమ్మదిగా డ్రైవింగ్ ముగించడం గుర్తించినట్లు హాకర్ ట్విటర్లో వివరించారు. 2017తో పోల్చితే టెస్లా సాఫ్ట్వేర్ మరింత సురక్షితమైనదని చెప్పుకొచ్చాడు. కాగా నాజ్ఫ్రీ డ్రైవింగ్ ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు గత డిసెంబర్లోనే మస్క్ హింట్ ఇచ్చారు. ఇదీ చదవండి: భారత్‌లో మొదటి టెస్లా కార్ ఇతనిదే.. And also when you kill one AP node, you retain some viz now, so now you can actually see which node does what. Node A does road layout/signs Node B does moving object detection as they still display with A dead. Also viz dies at times so you get AP functionality, but empty viz pic.twitter.com/Ldfi7cCPWh — green (@greentheonly) June 17, 2023 -
వీబీఐటీ కేసు: వల వేసి.. సవాల్ విసిరి.. పోలీసులకు చిక్కాడు
సాక్షి, మేడ్చల్-మల్కాజిగిరి: ఘట్కేసర్ మండలం అవుషాపూర్ వీబీఐటీ(విజ్ఞానభారతి ఇంజినీరింగ్) కాలేజ్ అమ్మాయిలపై వేధింపు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వేధింపులకు పాల్పడుతున్న ప్రధాన నిందితుడు(?) ప్రదీప్‌ను ఎట్టకేలకు పోలీసులు ట్రేస్ చేశారు. దమ్ముంటే పట్టుకోవాలంటూ పోలీసులకు సవాల్ విసిరిన ఈ హ్యాకర్‌ను.. పోలీసులు చాకచక్యంగా పట్టుకోవడం విశేషం. ప్రదీప్‌తో పాటు ఈ వ్యవహారంలో అతనికి సహకరించిన మరో ఇద్దరిని సైతం శుక్రవారం ఘట్కేసర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఏపీ విజయవాడకు చెందిన ప్రదీప్.. వీబీఐటీ కాలేజీ అమ్మాయిల ఫొటోలను మార్ఫింగ్ చేసి.. న్యూడ్ ఫొటోలుగా మార్చేసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డాడు. ఈ క్రమంలో.. వాట్సాప్ డీపీలతో పాటు ఏకంగా ఫోన్ డాటా మొత్తాన్ని హ్యాక్ చేసినట్లు పోలీసులు ధృవీకరించారు. సేకరించిన డాటాను డార్క్‌నెట్‌లో పెట్టి డబ్బు సంపాదించడంతో పాటు ఫేక్ ఫొటోల ద్వారా వాళ్లపై వేధింపులకు పాల్పడాలని యత్నించాడట ప్రదీప్. అయితే.. వేధింపులను భరించలేక యువతులు ఈ విషయాన్ని డిసెంబర్ 31వ తేదీకి ముందే కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ యాజమాన్యం ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తోంది. ఈ దశలో ధర్నాకు దిగగా.. పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు విద్యార్థినులకు మద్ధతుగా విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. యువతి వల్లే ఇదంతా! ఈ మొత్తం వ్యవహారం వెనుక వీబీఐటీలోనే చదివే ఒక అమ్మాయి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు దర్యాప్తు ద్వారా తేల్చారు. ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఓ అమ్మాయిని ట్రాప్ చేసిన ప్రదీప్.. ఆమెతో చాలాకాలం ఛాటింగ్ చేశాడు. ఇద్దరూ బాగా దగ్గరయ్యాక.. ఆమె ద్వారా యువతి ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూపుల్లో చేరాడు. ఆపై మిగిలిన అమ్మాయిల నెంబర్లు సంపాదించాడు కూడా. ఇక ప్రదీప్‌కు ఘనితో పాటు మరో స్నేహితుడు తోడయ్యారు. ఈ ముగ్గురూ వాట్సాప్ గ్రూపుల్లోని తరచూ ఏదో ఒక నెంబర్లకు ఫోన్లు చేశారు. అవి అమ్మాయిల పర్సనల్ నెంబర్లే అని నిర్ధారించుకునేదాకా.. పదే పదే ఫోన్ చేశారు. ఆపై పరిచయం పెంచుకుని స్నేహం ప్రారంభించారు. వాళ్ల వాట్సాప్ డీపీలుగా ఉన్న ఫోటోలను సేకరించారు. అదే సమయంలో ‘‘ఎంటర్ ది డ్రాగన్, కింగ్ ఈజ్ బ్యాక్’’ ల పేరుతో వాట్సప్ గ్రూప్‌లను క్రియేట్ చేశారు. ఆ గ్రూప్‌లో వీబీఐటీ స్టూడెంట్స్‌ను సైతం యాడ్ చేశారు. ఇక అపరిచిత లింకులను ఆ వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేసి.. అవి క్లిక్ చేసిన అమ్మాయిల ఫోన్లోని డాటాను హ్యాకింగ్ చేశారు ప్రదీప్ అండ్ కో. సుమారు 43 మంది డాటాను సేకరించినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులకు సవాల్ మరోవైపు ఏడు నెంబర్ల నుంచి అమ్మాయిల ఫోటోలను మార్ఫింగ్ చేసి న్యూడ్ ఫొటోలుగా మార్చేసి బ్లాక్ మెయిల్ దిగాడు. ఇక ఒకవైపు పోలీసులు దర్యాప్తు చేపట్టిన సమయంలోనూ ప్రదీప్ పోలీసులకు, బాధిత యువతులకు చుక్కలు చూపించాడు. దమ్ముంటే తమను పట్టుకోవాలని పోలీసులకు సవాల్ విసిరాడు. అలాగే.. పోలీసులకు ఫిర్యాదు చేస్తే నెట్లో ఆ ఫొటోలు పెడతానని అమ్మాయిలను బెదిరించిన సైబర్ ఛీటర్ ప్రదీప్.. అన్నంత పని చేయబోయాడట. అయితే.. సరైన సమయంలో ప్రదీప్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని మరికొందరి డాటా డార్క్‌నెట్‌లో అప్లోడ్ కాకుండా నిలువరించగలిగారట. ఇక ప్రదీప్‌కు నేరంలో సహకరించిన ఫస్ట్ ఇయర్ యువతిని సస్పెండ్ చేసే యోచనలో కాలేజీ యాజమాన్యం ఉన్నట్లు సమాచారం. కాలేజీ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతుండడంతో.. స్టూడెంట్స్‌కు సంక్రాంతి సెలవులు ముందుగానే ప్రకటించింది యాజమాన్యం!. -
నూపుర్ శర్మ వ్యాఖ్యలు.. భారత్‌పై సైబర్ దాడులు.. ఏకంగా 70 వెబ్సైట్లు హ్యాక్
న్యూఢిల్లీ: మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ నేతల వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వ్యాఖ్యలు భారత్‌కు భారీ చేటును తీసుకొచ్చాయి. తాజాగా దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ వెబ్సైట్లను సైబర్ దాడులు మొదలయ్యాయి. మలేషియాకు చెందిన హ్యాక్టివిస్ట్ గ్రూప్ ఆధ్వర్యంలో డ్రాగన్ పోర్స్ మలేషియా, 1877 సంస్థ కురుదేశ్ కోరడర్స్ పేరుతో సైబర్ దాడులకు పాల్పడటం వెలుగు చూసింది. ఇజ్రాయిల్‌లోని భారత ఎంబసీతో పాటు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ మేనేజ్మెంట్ ఎక్స్టెన్షన్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్‌లతో పాటు పలు ప్రముఖ సంస్థల వెబ్సైట్లపై సైబర్ దాడులు చేశారు. దాదాపు 70 వెబ్సైట్లను, పోర్టల్స్‌ను హ్యాక్ చేసినట్లు సమాచారం. హైదరాబాద్‌కు చెందిన అగ్రిటెక్ కంపెనీలు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పోర్టల్స్ వంటి ప్రముఖ సంస్థల వెబ్సైట్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. చదవండి: ప్రవక్తపై కామెంట్లు: మా బాస్‌ను మధ్యలోకి లాగి బద్నాం చేయకండి! -
రూ. కోట్లు కొల్లగొట్టిన హ్యాకర్.. ‘వన్ ప్లస్’తో చిక్కాడు!
సాక్షి, హైదరాబాద్: పేమెంట్ గేట్వేలను టార్గెట్‌గా చేసుకుని రూ. కోట్లు కొల్లగొట్టిన హ్యాకర్ వి.శ్రీరాం దినేష్ కుమార్‌ను ఓ పేమెంట్ గేట్‌వేలో లభించిన చిన్న క్లూ ఆధారంగా పట్టుకున్నారు. ఎక్కడా తన ఉనికి బయటపడకుండా పక్కా పథకం ప్రకారం నేరాలు చేసిన ఇతగాడు చిక్కడానికి సెకండ్ హ్యాండ్ వన్ ప్లస్ ఫోన్ కారణమైంది. నగరానికి చెందిన పేజీ పేమెంట్ గేట్‌వే సంస్థ సర్వర్‌ను హ్యాక్ చేసి రూ.52.9 లక్షలు కాజేసిన దినేష్‌ను సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం అరెస్టు చేసిన విషయం విదితమే. ఏపీలోని పెడనకు చెందిన దినేష్ విజయవాడలో వెబ్ డిజైనింగ్ కార్యాలయం ఏర్పాటు చేశాడు. లాక్డౌన్ కారణంగా నష్టాలు రావడంతో దీన్ని మూసేశాడు. అప్పటికే ఇతగాడికి పేమెంట్ గేట్‌వేలకు సంబంధించిన సాఫ్ట్వేర్ వల్నరబులిటీ టెస్ట్‌లపై పట్టు ఉండటంతో వాటినే టార్గెట్‌గా చేసుకున్నాడు. పేజీ సంస్థ నుంచి నగదు కొల్లగొట్టడానికి పథకం వేసిన ఇతడికి స్నేహితుడు, చార్టెడ్ అకౌంటెంట్ అయిన చింటు సహకరించాడు. వాట్సాప్‌లోని కొన్ని ‘నేరగాళ్ల గ్రూపుల్లో’ఔ దినేష్ సభ్యుడిగా ఉన్నాడు. వాటిలో ఉన్న వారి ద్వారానే జార్ఖండ్‌లోని జామ్‌తార చిరునామా, సోమ్‌నాథ్ పేరుతో ఉన్న గుర్తింపు పత్రాలు సంపాదించాడు. వీటిని వినియోగించే చెన్నైలోని ఈక్విటాస్ బ్యాంక్‌లో హైప్రోక్స్టెక్, ఇన్వెంట్ఫైల్ సంస్థల పేర్లతో వర్చువల్ ఖాతాలు తెరిచాడు. బెంగళూరులో ఎస్ బ్యాంక్ శాఖను వర్చుల్‌గా సంప్రదించి తను తయారు చేసిన మూడు యాప్‌ల ఆధారంగా ఏఎన్సార్ ఎంటర్ప్రైజెస్ పేరుతో వారి పూల్ ఖాతాకు యాక్సస్ పొందాడు. వీటికి లింక్ చేసిన ఫోన్ నంబర్ల సిమ్‌కార్డులను చింటు తప్పుడు పేర్లతో ఉత్తరాదిలోని ప్రాంతాల నుంచి తెప్పించాడు. పేజీ సంస్థ సర్వర్‌ను హ్యాక్ చేసిన దినేష్ దాని పూల్ ఖాతా నుంచి రూ.52.9 లక్షలు రెండు బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించాడు. వాటి నుంచి యస్ బ్యాంక్‌లోని పూల్ ఖాతాలోకి బదిలీ చేశాడు. ఈ ఖాతా నుంచి బోగస్ వివరాలతో తెరిచిన బిట్‌కాయిన్ వాలెట్‌లోకి, దాని నుంచి మరో బిట్‌కాయిన్ సైట్‌లోని తన సొంత వాలెట్‌లోకి మళ్లించాడు. అక్కడి నుంచి నగదుగా మార్చి తనతో పాటు సన్నిహితులకు చెందిన మూడు బ్యాంకు ఖాతాల్లోని ట్రాన్స్ఫర్ చేసి డ్రా చేసుకున్నాడు. ఈ కేసు దర్యాప్తులో ఎథికల్ హ్యాకర్ల సహకారం తీసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు నేరం జరిగిన తీరు గుర్తించారు. అయితే జామ్‌తార సైతం సైబర్ నేరగాళ్ల అడ్డా కావడంతో సోమ్నాథే నిందితుడిగా భావించారు. కొన్ని రోజులు అతడి కోసం గాలించినా ఫలితం లేదు. బోగస్ వివరాలతో సిమ్‌కార్డులు కొనే దినేష్ వాటిని వాడటానికి కొత్త ఫోన్లు ఖరీదు చేయడు. పోలీసులకు చిక్కకూడదనే సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనేవాడు. ఇదే తరహాలో విజయవాడకు చెందిన వ్యక్తి నుంచి వన్ ప్లస్ కంపెనీ ఫోన్‌ను రూ.16 వేలకు కొనుగోలు చేశాడు. అతడికి రూ.15 వేలు నగదు ఇచ్చి తాను వాడే ఓ బోగస్ నంబరే ఇచ్చాడు. తనకు రావాల్సిన రూ.వెయ్యి కోసం ఇతడు ఒత్తిడి చేయడంతో దినేష్ రూ.1000 పేటీఎం ద్వారా పంపాడు. తన వద్ద ఉన్న సిమ్‌కార్డును ఫోన్లో వేసి నేరంలో వాడాడు. ఫోన్ ఐఎంఈఐ నంబర్ ద్వారా సైబర్ క్రైమ్ పోలీసులు విజయవాడ వ్యక్తిని పట్టుకున్నారు. అతడి వద్ద కూడా దినేష్‌కు సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరకలేదు. అయితే తనకు రూ.1000 బదిలీ అయిన పేటీఎం నంబర్ ఇచ్చాడు. దీని ఆధారంగా ముందుకు వెళ్లిన పోలీసులు దినేష్‌ను పట్టుకోగలిగారు. పేజీ సంస్థలో దినేష్ చేసింది రెండో హ్యాకింగ్‌గా పోలీసులు చెబుతున్నారు. మొదటిసారిగా గతేడాది నవంబర్‌లో దీన్ని సర్వర్‌ను హ్యాక్ చేసి కొందరు హ్యాకర్లు రూ.1.28 కోట్లు కొల్లగొట్టారు. అప్పట్లో ఈ నగదు వెళ్లిన ఆరు ఖాతాలు ఒడిస్సా, వెస్ట్ బెంగాల్‌లకు చెందినవిగా తేలింది. అవన్నీ బోగస్ వివరాలతో తెరిచినవి కావడంతో ఆధారాలు దొరక్క కేసు ముందుకు వెళ్లలేదు. -
అమెరికాను గడగడలాడించిన హ్యాకర్?
ప్రస్తుతం ఇంటర్నెట్ ప్రపంచం మనం ఊహించని దానికంటే వేగంగా విస్తరిస్తుంది. దీంతో మనకు మేలు ఎంతో జరుగుతుందో అంతకంటే ఎక్కువ కీడు జరుగుతుంది అని చెప్పుకోవాలి. ప్రస్తుతం చాలా మంది నెటిజెన్స్ చిన్న చిన్న తప్పుల కారణంగా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు. సైబర్ నేరగాళ్లకు ఇంకొక పేరు హ్యాకర్స్. వీరి పేరు చెబితే సాదారణ ప్రజల నుంచి ప్రభుత్వాలు, దిగ్గజ ఐటీ కంపెనీలు వరకు ఇలా అందరూ వణికిపోతున్నారు. అంతలా ఉంది వీరి ప్రభావం మన అందరిమీద. ఇప్పుడు క్రైమ్ కేసులలో ఎక్కువగా సైబర్ క్రైమ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.(చదవండి: బిగ్ బ్యాటరీతో విడుదలైన పోకో ఎం3) ప్రస్తుతం మనం ఎంత ప్రమాదంలో ఉన్నామో అని దీన్ని బట్టి మనం అర్ధం చేసుకోవచ్చు. హ్యాకింగ్ చాలా ఏళ్ల క్రితం నుంచి ఉన్నప్పటికీ ఎక్కువగా మాత్రం మన 3జీ నెట్వర్క్ వచ్చినప్పటి నుంచే భాగా పెరిగి పోయింది. 3జీ రాకముందు హ్యాకర్స్ పెద్ద పెద్ద కంపెనీలను, ధనవంతులను, ప్రభుత్వాలను లక్ష్యంగా చేసుకొని ఎక్కువ శాతం వారి ఖాతాలను హ్యాక్ చేసేవారు. కానీ ఈ 3జీ, 4జీ వచ్చాక ఇప్పుడు సాదారణ ప్రజలు కూడా ఎక్కువ శాతం హ్యాకింగ్ భారీన పడుతున్నారు. అందుకే సైబర్ నిపుణులు ఆన్లైన్ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు. చాలా మంది హ్యాకర్స్ 2000 సంవత్సరం తర్వాత పుట్టుకొచ్చారు. కానీ ఒక హ్యాకర్ మాత్రం 1980 నుంచి 2000 వరకు ఈ ప్రపంచాన్ని వణికించాడు. ఇతను ప్రపంచంలోని ఐబీఎమ్, మోటోరోలా, నోకియా వంటి 40కి పైగా ఐటీ దిగ్గజ కంపెనీలను హ్యాక్ చేశాడు. అలాగే ప్రపంచాన్ని వణికించిన మాఫియా డాన్ లకు చుక్కలు చూపించాడు. అసలు అతని పేరు చెబితే అమెరికా ప్రభుత్వం వణికిపోయేది అంటే మనం అర్ధం చేసుకోవచ్చు. అతని ఎవరో కాదండీ కెవిన్ మిట్నిక్. మీరు ఇతని పేరు ఇప్పటి వరకు వినలేక పోవచ్చు. కెవిన్ మిట్నిక్ బాల్యం: కెవిన్ మిట్నిక్ కాలిఫోర్నియాలోని వన్ నుయ్స్(Van Nuys)లో 1963 ఆగస్టు 6న జన్మించాడు. ఇతను కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్‌లోని జేమ్స్ మన్రో హైస్కూల్లో విద్యాభ్యాసం గడించాడు. ఆ సమయంలో అతను ఔత్సాహిక రేడియో ఆపరేటర్ అయ్యాడు. తర్వాత అతను లాస్ ఏంజిల్స్ పియర్స్ కాలేజీలో చేరాడు. కొంతకాలం, అతను స్టీఫెన్ ఎస్. వైజ్ టెంపుల్లో రిసెప్షనిస్ట్‌గా పనిచేశాడు.(చదవండి: మరోసారి మహిళను కాపాడిన యాపిల్ వాచ్!) కెవిన్ మిట్నిక్ మొదటి కంప్యూటర్ హ్యాకింగ్: కెవిన్ మిట్నిక్ 12 సంవత్సరాల వయస్సులో లాస్ ఏంజిల్స్ బస్సు వ్యవస్థలో ఉపయోగించే పంచ్ కార్డ్ వ్యవస్థను హ్యాక్ చేయడానికి సోషల్ ఇంజనీరింగ్, డంప్‌స్టర్ డైవింగ్ అనే టెక్నిక్ ఉపయోగించాడు. “స్కూల్ ప్రాజెక్ట్” కోసం తన సొంత టికెట్ పంచ్ ఎక్కడ కొనవచ్చో చెప్పమని ఒక బస్సు డ్రైవర్‌ను కోరాడు. ఇలా అతను బస్సు కంపెనీ పక్కన ఉన్న డంప్‌స్టర్‌లో దొరికిన ఉపయోగించని బదిలీ స్లిప్‌లను ఉపయోగించి లాస్ ఏంజిల్స్ ప్రాంతంలో ప్రయాణించేవాడు. ఇది అతని మొదటి హ్యాకింగ్ అనే చెప్పుకోవాలి. సోషల్ ఇంజనీరింగ్ టెక్నిక్ తో ఇతరుల పేర్లు, పాస్వర్డ్లు, మోడెమ్ ఫోన్ నంబర్లతో సహా సమాచారాన్ని పొందేవాడు. మిట్నిక్ మొట్టమొదట కంప్యూటర్ నెట్‌వర్క్‌కు సంబందించి 1979లో హ్యాక్ చేశాడు. తన 16 ఏళ్ళ వయసులో ఒక స్నేహితుడు కంప్యూటరు సహాయంతో ఆర్ఎస్టిఎస్/ఇ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసే డిజిటల్ ఎక్విప్మెంట్ కార్పొరేషన్(డిఇసి) కంప్యూటర్ నెట్‌వర్క్‌లోకి ప్రవేశించి, కంపెనీ సాఫ్ట్‌వేర్‌ను కాపీ చేశాడు. ఈ నేరానికి గాను 1988లో12 నెలల జైలు శిక్ష అనుభవించాడు. అలాగే మూడు సంవత్సరాల పాటు పోలీసుల పర్యవేక్షణలో ఉన్నాడు. ఈ పోలీసుల పర్యవేక్షణలో ఉన్న కూడా మిట్నిక్ పసిఫిక్ బెల్ వాయిస్ మెయిల్ కంప్యూటర్లను హ్యాక్ చేశాడు. దీంతో మళ్లీ అతని మీద అరెస్టు వారెంట్ జారీ చేశారు. అయితే పోలీసులకు దొరకాకుండా రెండున్నర సంవత్సరాలు పరారీలో ఉన్నాడు.(చదవండి: 5జీతో మాట్లాడే ఏటిఎమ్ లు రాబోతున్నాయి!) అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, పోలీసులకు కెవిన్ మిట్నిక్ ఒక పెద్ద తల నొప్పిగా మారిపోయాడు. మిట్నిక్ డజన్ల కొద్దీ కంప్యూటర్ నెట్‌వర్క్‌లలో ప్రవేశించేవాడు. అతను తన స్థానాన్ని కనిపెట్టకుండా ఉండటానికి క్లోన్ చేసిన సెల్యులార్ ఫోన్లను ఉపయోగించేవాడు. దేశంలోని అతిపెద్ద సెల్యులార్ టెలిఫోన్, కంప్యూటర్ కంపెనీల నుంచి విలువైన సమాచారాన్ని, సాఫ్ట్‌వేర్‌ను కాపీ చేశాడు. ఇతర కంప్యూటర్ నెట్‌వర్క్‌లను మార్చేవాడు, ప్రైవేట్ ఇ-మెయిల్లను రహస్యంగా చదివేవాడు. ఒకానొక సమయంలో ప్రపంచంలోని అతి పెద్ద డాన్ ల ఫోన్ లను హ్యాక్ చేసి వారికీ చుక్కలు చూపించాడు. కెవిన్ మిట్నిక్ అరెస్ట్, జైలు శిక్ష కెవిన్ మిట్నిక్ 1995లో అమెరికాలోని 40 అతిపెద్ద కంపెనీలను హ్యాకింగ్ చేశాడు. వీటిలో ఐబిఎం, నోకియా మరియు మోటరోలా ఉన్నాయి. ఇలా రోజు రోజుకి అమెరికా ప్రభుత్వానికి ఒక పెద్ద తలనొప్పిగా మారిపోయాడు. అతనిని ఎలాగైనా పట్టుకోవాలని అతని పట్టించిన వారికి భారీ బహుమతి అని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. ఫిబ్రవరి 15, 1995న ఎఫ్బిఐ నార్త్ కరోలినాలోని రాలీలోని తన అపార్ట్మెంట్ లో మిట్నిక్ ను అరెస్టు చేసింది. రెండున్నర సంవత్సరాల కంప్యూటర్ హ్యాకింగ్ కు సంబంధించిన అనేక నేరాలు అతని మీద ఉన్నాయి. అతను క్లోన్ చేసిన సెల్యులార్ ఫోన్లు, 100కి పైగా క్లోన్ సెల్యులార్ ఫోన్ కోడ్లు వంటివి అతనిని అరెస్టు చేసే సమయంలో కనుగొన్నారు.(చదవండి: రూ 1.8లక్షలు ఖరీదైన సోనీ మొబైల్ విడుదల) 1997 డిసెంబర్ లో యాహు! వెబ్సైట్ హ్యాక్ చేయబడింది క్రిస్మస్ దినోత్సవం నాటికి మిట్నిక్ విడుదల చేయాలి లేకపోతే ఇంటర్నెట్ “విపత్తు”ను సృష్టిస్తామని ఒక మెసేజ్ భాగా అప్పుడు వైరల్ అయ్యింది. యాహు! మాత్రం కేవలం ఇది ప్రజలను భయపెట్టడానికి మాత్రమే అని పేర్కొంది. మిట్నిక్పై వైర్ మోసం, ఎలక్ట్రానిక్ సమాచార మార్పిడి, ఫెడరల్ కంప్యూటర్ను హ్యాక్ చేయడం వంటి ఆరోపణలపై తనపై ఉన్నాయి. 1999లో లాస్ ఏంజిల్స్‌లోని కాలిఫోర్నియా సెంట్రల్ డిస్ట్రిక్ట్ యునైటెడ్ స్టేట్స్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ముందు చివరకు చట్టవిరుద్ధంగా చేసిన తప్పులను అంగీకరించాడు. గతంలో కంప్యూటర్ మోసానికి 1989లో పోలీసుల పర్యవేక్షణ నుంచి పారీపోయినందుకు 22 నెలల జైలు శిక్ష, తర్వాత చట్టవిరుద్దంగా చేసిన తప్పులకు అతని మీద 46 నెలల జైలు శిక్ష విధించబడింది. మిట్నిక్ ఐదు సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాడు. టాప్ సెక్యూరిటీ కన్సల్టెంట్ జనవరి 21, 2003లో అతను పోలీసుల పర్యవేక్షణ నుంచి విడుదల అయ్యాడు. తన విడుదల అయ్యాక కూడా ఇంటర్నెట్ వాడకూడదు అనే నిబంధన ఉండేది. కమ్యూనికేషన్ కోసం కేవలం ల్యాండ్‌లైన్ టెలిఫోన్ వినియోగించాలని పోలీసులు ఆంక్షలు విధించారు. అయితే ఈ విషయంలో స్థానిక కొర్టులో కెవిన్ మిట్నిక్ పోరాడారు. చివరికి అతనికి అనుకూలంగా ఒక తీర్పును వచ్చిన తర్వాత ఇంటర్నెట్ను యాక్సెస్ వాడుకోవడానికి వీలు కల్పించారు. ప్రస్తుతం కెవిన్ మిట్నిక్ ప్రపంచంలోని గూగుల్, ఫేస్బుక్ వంటి అతిపెద్ద కంపెనీలకు టాప్ సెక్యూరిటీ కన్సల్టెంట్ గా పనిచేస్తున్నారు. దీనికి గాను అతను అత్యధిక పారితోషకం తీసుకుంటున్నారు. -
ఖతర్నాక్ హ్యాకర్.. భారీగా నగదు చోరీ
బెంగళూరు : శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో బెంగళూరు సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులకు పట్టుబడిన అంతర్జాతీయ హ్యాకర్ శ్రీకృష్ణ అలియాస్ శ్రీ జల్సా జీవితం కోసం బిట్‌కాయిన్ అకౌంట్‌ను హ్యాక్ చేసినట్లు విచారణలో వెల్లడైంది. ప్రస్తుతం అతడు పరప్పన సెంట్రల్ జైలులో రిమాండులో ఉన్నాడు. ఇతని ఖాతాలో రూ.9 కోట్లు విలువ చేసే 31 బిట్కాయిన్లను సీజ్ చేశారు. సీసీబీ విచారణలో నిర్ఘాంతపోయే నిజాలు వెలుగుచూశాయి. అంతర్జాతీయ స్థాయి వెబ్సైట్లతో పాటు వేర్వేరు దేశాల పోకర్‌గేమ్స్ వెబ్సైట్లలోని ఖాతాల్లోకి చొరబడి క్రిప్టో కరెన్సీలైన బిట్ కాయిన్, వైఎఫ్ఏ తదితరాలను దొంగించినట్లు కనిపెట్టారు. పోలీసులకు పట్టుబడిన శ్రీకృష్ణ అనుచరులు సునీశ్ శెట్టి, ప్రసిద్ శెట్టి, సంజయ్, హేమంత్ ముద్దప్ప, రాబిన్ ఖండేల్వాల్ ఇతరులతో కలిసి పోకర్ గేమింగ్ వెబ్సైట్లను హ్యాక్ చేసి డేటాను చోరీచేసి ఆ డేటాను తమ గేమింగ్ వెబ్సైట్ కోసం వినియోగించేవారు. ఇప్పటి వరకు మూడు బిట్‌కాయిన్ ఎక్సే్ఛంజిలను, 10 పోకర్ వెబ్సైట్లు, 4 సాధారణ వెబ్సైట్లను హ్యాచ్ చేసినట్లు గుర్తించారు. ప్రభుత్వ వెబ్‌సైట్‌కి కన్నం బెంగళూరు కేంద్రంగా హ్యాకర్ శ్రీకృష్ణ ప్రముఖ హోటళ్లు, రిసార్టుల్లో బస చేసేవాడు. దోచుకున్న బిట్కాయిన్లను తమ ఖాతాల్లోకి మళ్లించి ముఠాతో కలిసి నగదుగా మార్చుకునేవాడు. డార్క్‌నెట్ వెబ్సైట్ల గుండా విదేశాల నుంచి డ్రగ్స్‌ను ఈ బిట్కాయిన్ల ద్వారానే కొనేవాడు. 2019లో అక్రమంగా ధన సంపాదనకు కర్ణాటక ప్రభుత్వ ఇ–ప్రొక్యూర్మెంట్ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసి కోట్లాది ధనాన్ని తన అనుచరుల అకౌంట్లకు జమ చేశారని పోలీసుల విచారణలో వెలుగుచూసింది. కాగా, రూ.9 కోట్ల విలువైన 31 బిట్కాయిన్లను పోలీసులు సీజ్ చేశారు. అతని లావాదేవీలు, ఖాతాలపై విచారణ జరుపుతున్నారు. -
‘ఆరోగ్య సేతు’ భద్రతా సమస్య.. కేంద్రం క్లారిటీ
న్యూఢిల్లీ : ‘ఆరోగ్య సేతు’ యాప్ డేటా సెక్యూరిటీకి ఎలాంటి సమస్య లేదని, సమాచారం సురక్షితంగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. యాప్ ద్వారా ఇప్పటి వరకు ఎటువంటి భద్రతా ఉల్లంఘనలు గుర్తించలేదని, ఆరోగ్యా సేతు ప్రతి ఒక్కరికీ భరోసా ఇస్తుందని కేంద్రం తెలిపింది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య సేతు యాప్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇది కరోనా సమాచారాన్ని తెలుసుకునేందుకు, మనలో కరోనా లక్షణాలు ఉన్నాయో లేవో తెలిపి, పలు సలహాలు సూచనలు అందిస్తోంది. అయితే ప్రస్తుతం ఆరోగ్య సేతు యాప్‌లో ఉన్న ప్రజల సమాచారం భద్రంగా లేదంటూ, వివరాలు హ్యకింగ్ చేసే అవకాశం ఉందని ఫ్రెంచ్ హ్యకర్ మంగళవారం ట్విటర్లో ప్రభుత్వానికి సవాల్ విసిరాడు. (విషాదం: ‘వాడిని కనీసం ముట్టుకోలేకపోయా’) ఈ యాప్ భద్రతపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఇందులో సెక్యూరిటీ సమస్యలు ఉన్నట్లు పేర్కొన్నారు. దీని ద్వారా సుమారు 90 మిలియన్ల మంది భారతీయుల సమాచారం ప్రమాదంలో పడిందని హెచ్చరించాడు. అయితే దీనిపై స్పందించిన కేంద్రం హ్యాకర్ వాదనలను తోసిపుచ్చింది. ప్రజల సమాచారానికి ఎటాంటి భద్రతా సమస్యలు లేవని స్పష్టం చేసింది. ఆరోగ్య సేతు యాప్‌ను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, డేటా చోరీ కాలేదని పేర్కొంది. యాప్ ఉపయోగిస్తున్న ఏ ఒక్క వ్యక్తికి సంబంధించిన సమాచారం కూడా హ్యకింగ్‌కు గురవ్వలేదని ట్విటర్లో క్లారిటీ ఇచ్చింది. కాగా ఆరోగ్యా సేతు ట్విట్టర్లో విడుదల చేసిన ప్రకటనపై హ్యకర్ ఇలియట్ ఆల్డర్సన్ స్పందించారు. ‘యాప్‌లో ఎలాంటి లోపాలు లేవని మీరు చెప్పారు. మేము దానిని సమీక్షించి రేపు మళ్లీ వస్తాం’.. అంటూ బదులిచ్చాడు. Statement from Team #AarogyaSetu on data security of the App. pic.twitter.com/JS9ow82Hom — Aarogya Setu (@SetuAarogya) May 5, 2020 Basically, you said "nothing to see here" We will see. I will come back to you tomorrow. https://t.co/QWm0XVgi3B — Elliot Alderson (@fs0c131y) May 5, 2020 -
పోలీసుల అదుపులో అంతర్జాతీయ హ్యాకర్
వరంగల్ క్రైం: బ్యాంకుల నుంచి ఈ మెయిల్ అకౌంట్లను హ్యాకింగ్ చేస్తూ నగదును తన ఖాతాలోకి మళ్లించే ప్రయత్నం చేసిన అంతర్జాతీయ హ్యాకర్‌ను వరంగల్ సైబర్ క్రైం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ విశ్వనాథ రవీందర్ గురువారం ప్రకటించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. నైజీరియా దేశానికి చెందిన సైబర్ మోసగాడు మ్యాక్నెలన్ వరంగల్ కాశిబుగ్గలోని వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు డబ్బులను సాంకేతిక పరిజ్ఞానంతో తన ఖాతాలోకి మళ్లించే ప్రయత్నం చేయబోయాడు. దీంతో విషయాన్ని గుర్తించిన బ్యాంకు యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసిందన్నారు. వరంగల్ కోఆపరేటివ్ బ్యాంకు ఖాతాను హ్యాకింగ్ చేసి డబ్బులను కాజేయడానికి మ్యాక్నెల్సన్ వినియోగించిన మెయిల్‌ను కమిషనరేట్‌లో ఉన్న సైబర్ విభాగం అత్యాధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి హరియాణా రాష్ట్రం గురుగ్రామ్ ప్రాంతం నుంచి వచ్చినట్లు పోలీసులు గుర్తించినట్లు సీపీ చెప్పారు. దీంతో మడికొండ ఇన్స్పెక్టర్ సంతోష్ నేతృత్వలో ఎల్కతుర్తి ఎస్సై వీ ఎన్ సూరితో పా టు ప్రత్యేక దర్యాప్తు బృందం ఈనెల 14న నిందితుడిని గురుగ్రామ్‌లో అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. అతడి నుంచి ఒక ల్యాప్‌టాప్, వివిధ బ్యాంకులకు చెందిన నాలుగు డెబిట్ కార్డులు, నాలుగు పాస్‌పోర్టులు, మూడు సెల్ఫోన్లు, ఒక ప్రింటర్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. అనంతరం నిందితుడిని గురుగ్రామ్ కోర్టులో హాజరుపరిచి ఈనెల 16న వరంగల్‌కు తీసుకువచ్చినట్లుచెప్పారు. ఈ మేరకు మ్యాక్ నెల్సన్‌ను ఇంతేజార్గంజ్ ఇన్స్పెక్టర్ రవికుమార్ కోర్టులో హాజరుపరచినచిట్లు పేర్కొన్నారు. అనంతరం కోర్టు అనుమతితో అతడిని అదుపులోకి తీసుకోని విచారించగా మహారాష్త్రకు చెందిన పలు కోఆపరేటివ్ బ్యాంకుల నుంచి తన ఖాతాలోకి డబ్బును మళ్లించినట్లు అంగీకరించాడన్నారు. ఈ మెయిల్ అకౌంట్ల హ్యాకింగ్.. నిందితుడు మ్యాక్ నెల్సన్ వరంగల్ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంకు, హైదరాబాద్‌కు చెందిన శ్యాంరావ్‌విటల్ కో ఆపరేటివ్ బ్యాంకుల మధ్య లావాదేవిలకు సంబంధించిన అధికారిక ఈ మెయిల్ అకౌంట్లను హ్యాకింగ్ చేశాడన్నారు. దీంతో సంబంధిత బ్యాంకుల యూజర్ నేమ్‌తో పాస్వర్డ్లు సేకరించి అధికారుల సంతకాలు ఫోర్జరీ చేశాడన్నారు. ఆర్టీజీఎస్ పత్రాలను ఆన్లైన్ ఫోర్జరీ చేసి బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బులను తన ఖాతాలోకి మళ్లించే వాడన్నారు. గత నెల 18,20 తేదీలలో వరంగల్ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంకు ద్వారా శ్యాంరావ్‌విటల్ కోఆపరేటివ్ బ్యాంకుకు రూ.35 లక్షలు, రూ.85 లక్షలు విలువైన చెక్కులను హ్యాకింగ్ పద్ధతిలో శ్యాంరావుకు పంపించాడు. దీనిని గమనించిన బ్యాంకు అధికారులు ఇంతేజార్గంజ్ పోలీసులకు సమాచారం అందించినట్లు ఆయన వివరించారు. రూ.31 లక్షల రూపాయలు సీజ్... మహారా్రçష్టకు చెందిన సింధుదుర్గ్ కోఆపరేటివ్ బ్యాంకు ఈ మెయిల్ నుంచి హ్యాకింగ్ చేసిన సుమారు రూ.31 లక్షలను మ్యాక్ నెల్సన్ తన అధీనంలో ఉన్న ‘ఎస్’ ఢిల్లీ బ్యాంకు శాఖకు బది లీ చేసినట్లు అంగీకరించాడన్నారు. దీంతో ఢిల్లీ ‘ఎస్’ బ్యాంకులో అతడి సేవింగ్ అకౌంట్‌ను సీజ్ చేసినట్లు సీపీ పేర్కొన్నారు. నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న నాలుగు పాస్‌పోర్ట్‌లలో రెండు నకిలీవని తేలడంతో పాస్‌పోర్ట్ శిక్ష్మాస్మృతి కింది అతడిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అధికారులకు సీపీ అభినందనలు.. కమిషనరేట్‌లో సైబర్ విభాగం ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే అంతర్జాతీయ హ్యాకర్‌ను అరెస్టు చేసిన అధికారులను పోలీసు కమిషనర్ రవీందర్ అభినందించారు. నిందితుడి అరెస్టు చేసిన సైబర్ క్రైం ఇన్స్పెక్టర్ డి.విశ్వేశ్వర్, మడికొండ ఇన్స్పెక్టర్ సంతోష్, ఇంతేజార్గంజ్ ఇన్స్పెక్టర్ రవికుమార్, ఎల్కతుర్తి సబ్ ఇన్స్పెక్టర్ టీవీఆర్ సూరి, సిబ్బందిని సీపీ ప్రత్యేకంగా అభినందించారు. -
రైల్వే వెబ్సైట్ హ్యాకర్ అరెస్టు
కాశీబుగ్గ : రైల్వే టికెట్ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసి 35 నకిలీ ఐడీలతో టికెట్లు పొందుతున్న వ్యక్తిని పలాస రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. పలాస పురుషోత్తపురం గ్రామానికి చెందిన పత్తి బాలకృష్ణ(36) తప్పుడు మార్గాల్లో టికెట్లు పొందుతుండగా ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. తొమ్మిది మంది పేరుతో తీసుకున్న రిజర్వేషన్ టికెట్లు, ఖాళీ రిజర్వేషన్ పత్రాలు, రెండు సెల్ఫోన్లు, రూ.8270 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ డి.కుమార్ నిందితుడిపై రైల్వే సెక్షన్ 143 కింద కేసు నమోదు చేశారు. సోమవారం ఉదయం విలేకరుల ముందు ప్రవేశపెట్టి విశాఖపట్నం సెకెండ్ క్లాస్(ఎంఎం) రైల్వేకోర్టుకు జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం తరలించారు. -
నమో యాప్‌పై ఫ్రెంచ్ హ్యాకర్ తాజా ట్వీట్లు
సాక్షి, న్యూఢిల్లీ : నమో యాప్‌పై ఫ్రెంచ్ హ్యాకర్ ఇలియట్ అల్డర్సన్ తాజా ట్వీట్లు కలకలం రేపుతున్నాయి. ప్రధాని అధికారిక యాప్ యూజర్ల అనుమతి లేకుండానే వారి ఐపీ చిరునామాను అమెరికాకు చెందిన ఏపీఐ.నరేంద్రమోదీ.ఇన్ వెబ్‌సైట్‌కు చేరవేస్తోందని అల్డర్సన్ ఆరోపించారు. ప్రధాని మోదీ యాప్ యూరప్ నియంత్రణ సంస్థతో పాటు గూగుల్ ప్లే ప్రమాణాలను ఉల్లంఘిస్తోందని పేర్కొన్నారు. నమో యాప్‌ను మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుంటే మీ అనుమతి లేకుండానే మీ ఫోన్లో సమాచారం సమస్తం యాప్ లాగేస్తుందని వరుస ట్వీట్లలో వెల్లడించారు. నమో యాప్ యూరప్‌లో అందుబాటులో ఉన్నందున యూరప్ రెగ్యులేటర్ జీడీపీఆర్ ప్రమాణాలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందన్నారు. యూజర్ అనుమతి లేకుండా వ్యక్తిగత డేటాను సేకరించరాదని స్పష్టం చేశారు. యూజర్ అనుమతి కోరకపోవడం గూగుల్ ప్లే డెవలపర్ డిస్ట్రిబ్యూషన్ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనన్నారు. మరోవైపు అల్డర్సన్ సోమవారం కాంగ్రెస్ యాప్ సెక్యూరిటీ ఉల్లంఘనలపై ట్వీట్ చేసిన విషయం విదితమే. కాంగ్రెస్ మెంబర్షిప్ పేజ్ ఐపీ అడ్రస్ సింగపూర్‌లోని సర్వర్‌కు అనుసంధానమై ఉందని ఆయన ఆరోపించారు. అల్డర్సన్ ట్వీట్ చేసిన కొద్ది గంటలకే గూగుల్ ప్లేస్టోర్ నుంచి కాంగ్రెస్ తన యాప్‌ను తొలగించడం గమనార్హం. -
హ్యాకర్లకే హ్యాకర్.. భలే ట్విస్టిచ్చాడు!
శాన్ఫ్రాన్సిస్కో : ఓ హ్యాకర్ ఏకంగా హ్యాకర్స్ ఫోరం వెబ్‌సైట్‌ను హ్యాక్ చేశాడు. 50వేల డాలర్లు ఇస్తే సరి.. లేకుంటే ఫోరం వద్ద ఉన్న దొంగ సమాచారం అంతా అమెరికా ప్రభుత్వానికి అమ్మేస్తానని బెదిరింపులకు దిగాడు. బేస్టూల్స్.డబ్ల్యూఎస్ అనే అండర్‌గ్రౌండ్ హ్యాకింగ్ ఫోరం తాము తస్కరించిన క్రెడిట్ కార్డుల సమాచారాన్ని, స్పామింగ్ టూల్స్‌ను, ప్రొఫైల్ డేటాను ఇతరులకు అమ్మి సొమ్ము చేసుకుంటుంది. ఈ ఫోరంనకు 1.50 లక్షల సభ్యత్వం ఉందని బ్లీపింగ్‌కంప్యూటర్ డాట్ కామ్ అనే వెబ్సైట్ పేర్కొంది. ఓ గుర్తు తెలియని హ్యాకర్ బేస్టూల్స్ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసి.. దానిలోని డాటాబేస్ కొంతభాగాన్ని ఆన్లైన్లో పెట్టాడు. తను డిమాండ్ చేసిన 50వేల డాలర్లు ఇవ్వకుంటే మిగతా సమాచారాన్ని అమెరికా ప్రభుత్వానికి చెందిన వివిధ కీలక శాఖలకు అమ్మకానికి పెడతానని బెదిరించాడు. హ్యాక్ అయినట్లు ధ్రువీకరించేందుకు గాను బేస్టూల్ వెబ్సైట్ లోగోను లాగిన్ వివరాలను, ఐపీ అడ్రస్‌ను ఆన్లైన్లో ఉంచాడు ఆ అజ్ఞాత హ్యాకర్. బేస్టూల్స్ వినియోగదారులు విక్రయానికి పెట్టే కొన్ని టూల్స్‌ను కూడా ఆన్లైన్లో ఉంచాడు. -
హృతిక్‌కు చుక్కలు చూపించిన హ్యాకర్!
హృతిక్ రోషన్‌కు ఈ మధ్య ఏదీ కలిసిరావడం లేదు. ఈ ఏడాది ప్రారంభంలో ఆయనకు భార్య విడాకులు ఇచ్చేసింది. ఆ వెంటనే కంగనా రనౌత్-హృతిక్ గొడవ మీడియాలో రచ్చరచ్చ చేసింది. ఈ ఇద్దరి మధ్య జరిగిన అనేక ఆంతరంగిక విషయాలు వెలుగుచూశాయి. ఇది ఇలా ఉండగానే హృతిక్ రోషన్ ఎన్నో ఆశలు పెట్టుకున్న 'మొహెంజోదారో' సినిమా వచ్చింది. అశుతోష్ గోవరికర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చారిత్రక సినిమా బాక్సాఫీస్‌కు నిప్పు పెట్టింది. సినిమా ప్లాప్ అవ్వడం హృతిక్‌ను నిరాశ పరిచింది. ఈ క్రమంలోనే ఓ పిల్ల హ్యాకర్ హృతిక్ ఫేస్బుక్ పేజీతో ఆటలు ఆడుకున్నాడు. హృతిక్ అధికారిక పేజీని హ్యాక్ చేయడమే కాదు.. ప్రొఫైల్ ఫొటోలో తన ఫొటో పెట్టుకొని మురిసిపోయాడు. ఫేస్బుక్ లైవ్ వీడియో ఆన్‌చేసి.. కాసేపు హృతిక్ అభిమానుల్ని పలుకరించాడు. ఒకింత వింతగా, విచిత్రంగా ప్రవర్తిస్తూ కొన్ని నిమిషాలపాటు లైవ్ వీడియోలో కనిపించిన అతను.. ఎట్టకేలకు దానిని క్లోజ్ చేశాడు. ఈ హ్యాకర్ వింత ప్రవర్తన నెటిజన్లను ఒకరకంగా గిలిగింతలు పెట్టింది. తన ఫేస్బుక్ పేజీ హ్యాకింగ్‌కు గురైన విషయాన్ని గుర్తించిన హృతిక్ వెంటనే దానిని డియాక్టివేట్ చేశాడు. ఎవరో ఓ వ్యక్తి తన ఫేస్బుక్ పేజీని హ్యాక్ చేశాడని, దీంతో దానిని సరిచేసేందుకు చర్యలు తీసుకున్నామని హృతిక్ ట్విట్టర్లో తెలిపాడు. -
డెమొక్రాట్ల వ్యక్తిగత వివరాలు బహిర్గతం
వాషింగ్టన్ : ఓ వైపు ఎన్నికల సీజన్ హడావుడి.. మరోవైపు హ్యకర్ల తెగింపు.. 200 మంది ప్రస్తుత, మాజీ కాంగ్రెస్ డెమొక్రాట్ల వ్యక్తిగత వివరాలు బహిర్గతమయ్యాయి. డెమొక్రాట్ నేతల సెల్‌ఫోన్ నంబర్లు, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని హాకర్లు బయటపెట్టారు. గుసిఫర్ 2.0 హ్యాకర్ల గ్రూపు ఈ సెన్సిటివ్ రికార్డులను పబ్లిక్ గా తీసుకొచ్చింది. డెమొక్రాటిక్ కాంగ్రెషనల్ క్యాంపెయిన్ కమిటీ నుంచి ఈ ఫైల్స్‌ను దొంగతనం చేసినట్టు ఆ హ్యాకర్ల గ్రూపు వెల్లడించింది. తమ హ్యాకర్ల వెబ్సైట్లో డెమొక్రటిక్ నేతల ఫోన్ నంబర్లు, ఈ-మెయిల్ అడ్రస్‌లను పొందుపరిచినట్టు తెలిపింది. ఈ హ్యాకర్ల పోస్టు చేసిన సమాచారంలో అమెరికా ప్రతినిధుల సభకు మైనారిటీ లీడర్‌గా వ్యవహరిస్తున్న నాన్సీ పెలోసీ, హౌస్ డెమొక్రాటిక్ విప్ స్టెనీ హోయర్ల సెల్‌ఫోన్ వివరాలు కూడా ఉన్నాయి. అయితే తన వ్యక్తిగత సమాచారం దొంగతనం చేసినట్టు కానీ, ఆన్లైన్లో పోస్టు చేసినట్టు కానీ తనకు తెలియదని హోయర్ తెలిపారు. వైట్ హౌస్ అధికార ప్రతినిధి దీనిపై స్పందించడానికి తిరస్కరించారు. హ్యాకర్లు పోస్టు చేసిన సమాచారమంతా సరియైనది కాదని డెమొక్రాట్లు చెబుతున్నారు. ఈ వివరాలు బయటపెట్టడం జాతీయ భద్రతా పరమైన చిక్కులకు తెరతీస్తోందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అయితే రష్యన్ మిలటరీ ఇంటిలిజెన్స్ ఏజెన్సీతో కలిసి, హ్యకర్ గ్రూపు ఈ కుట్రపూరిత చర్యకు పాల్పడినట్టు రీసెర్చర్లు విశ్వసిస్తున్నారు. -
రైల్వే వెబ్ సైట్ హ్యాకర్ దొరికాడు
న్యూఢిల్లీ: తరచూ రైల్వే వెబ్ సైట్ ను హ్యాక్ చేస్తూ ప్రజల డబ్బును దండుకున్న నిందితుడిని ఎట్టకేలకు సీబీఐ అధికారులు వల పన్ని పట్టుకున్నారు. వెబ్ సైట్ ను హ్యాక్ చేసి రైల్వే ఫేక్ టికెట్లు జనరేట్ అయ్యేవిధంగా చేసిన హమీద్ ను గురువారం సీబీఐ, రైల్వే విజిలెన్స్ అధికారలు ఉత్తరప్రదేశ్ లోని బస్తీ టౌన్ లో అరెస్టు చేశారు. నకిలీ టికెట్లను తయారుచేసే సాఫ్ట్ వేర్ ను హమీద్ తయారు చేసినట్లు గుర్తించామని ఇందుకోసం, అతడిని పట్టుకునేందుకు మూడు రోజుల పాటు పట్టణంలోనే గడిపినట్లు కేసును డీల్ చేసిన అధికారి రోహిత్ మిశ్రా తెలిపారు. దేశవ్యాప్తంగా ఫేక్ టికెట్లను తయారు చేసే ముఠాలతో హమీద్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, అతని నుంచి 10 ల్యాప్ టాప్ లు, 16 ఏటీఏం కార్డులు, రెండు పాన్ కార్డులు, 50 లక్షల నగదును సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం సీబీఐ, రైల్వే విచారణా బృందాలు అతన్ని విచారిస్తున్నట్లు మరో అధికారి తెలిపారు.