శాన్‌ఫ్రాన్సిస్కో : ఓ హ్యాకర్ ఏకంగా హ్యాకర్స్ ఫోరం వెబ్‌సైట్‌ను హ్యాక్ చేశాడు. 50వేల డాలర్లు ఇస్తే సరి.. లేకుంటే ఫోరం వద్ద ఉన్న దొంగ సమాచారం అంతా అమెరికా ప్రభుత్వానికి అమ్మేస్తానని బెదిరింపులకు దిగాడు. బేస్‌టూల్స్.డబ్ల్యూఎస్ అనే అండర్‌గ్రౌండ్ హ్యాకింగ్ ఫోరం తాము తస్కరించిన క్రెడిట్ కార్డుల సమాచారాన్ని, స్పామింగ్ టూల్స్‌ను, ప్రొఫైల్ డేటాను ఇతరులకు అమ్మి సొమ్ము చేసుకుంటుంది. ఈ ఫోరంనకు 1.50 లక్షల సభ‍్యత్వం ఉందని బ్లీపింగ్‌కంప్యూటర్ డాట్ కామ్ అనే వెబ్‌సైట్ పేర్కొంది.
ఓ గుర్తు తెలియని హ్యాకర్ బేస్‌టూల్స్ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసి.. దానిలోని డాటాబేస్ కొంతభాగాన్ని ఆన్‌లైన్‌లో పెట్టాడు. తను డిమాండ్ చేసిన 50వేల డాలర్లు ఇవ్వకుంటే మిగతా సమాచారాన్ని అమెరికా ప్రభుత్వానికి చెందిన వివిధ కీలక శాఖలకు అమ్మకానికి పెడతానని బెదిరించాడు. హ్యాక్ అయినట్లు ధ్రువీకరించేందుకు గాను బేస్‌టూల్ వెబ్‌సైట్ లోగోను లాగిన్ వివరాలను, ఐపీ అడ్రస్‌ను ఆన్‌లైన్‌లో ఉంచాడు ఆ అజ్ఞాత హ్యాకర్. బేస్‌టూల్స్ వినియోగదారులు విక్రయానికి పెట్టే కొన్ని టూల్స్‌ను కూడా ఆన్‌లైన్‌లో ఉంచాడు.
Comments
Please login to add a commentAdd a comment