ఫైల్‌ఫోటో
సాక్షి, న్యూఢిల్లీ : నమో యాప్‌పై ఫ్రెంచ్ హ్యాకర్ ఇలియట్ అల్డర్‌సన్ తాజా ట్వీట్లు కలకలం రేపుతున్నాయి. ప్రధాని అధికారిక యాప్ యూజర్ల అనుమతి లేకుండానే వారి ఐపీ చిరునామాను అమెరికాకు చెందిన ఏపీఐ.నరేంద్రమోదీ.ఇన్ వెబ్‌సైట్‌కు చేరవేస్తోందని అల్డర్‌సన్ ఆరోపించారు. ప్రధాని మోదీ యాప్ యూరప్ నియంత్రణ సంస్థతో పాటు గూగుల్ ప్లే ప్రమాణాలను ఉల్లంఘిస్తోందని పేర్కొన్నారు. నమో యాప్‌ను మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటే మీ అనుమతి లేకుండానే మీ ఫోన్‌లో సమాచారం సమస్తం యాప్ లాగేస్తుందని వరుస ట్వీట్లలో వెల్లడించారు.
నమో యాప్ యూరప్‌లో అందుబాటులో ఉన్నందున యూరప్ రెగ్యులేటర్ జీడీపీఆర్ ప్రమాణాలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందన్నారు. యూజర్ అనుమతి లేకుండా వ్యక్తిగత డేటాను సేకరించరాదని స్పష్టం చేశారు. యూజర్ అనుమతి కోరకపోవడం గూగుల్ ప్లే డెవలపర్ డిస్ట్రిబ్యూషన్ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనన్నారు.
మరోవైపు అల్డర్‌సన్ సోమవారం కాంగ్రెస్ యాప్ సెక్యూరిటీ ఉల్లంఘనలపై ట్వీట్ చేసిన విషయం విదితమే. కాంగ్రెస్ మెంబర్‌షిప్ పేజ్ ఐపీ అడ్రస్ సింగపూర్‌లోని సర్వర్‌కు అనుసంధానమై ఉందని ఆయన ఆరోపించారు. అల్డర్‌సన్ ట్వీట్ చేసిన కొద్ది గంటలకే గూగుల్ ప్లేస్టోర్ నుంచి కాంగ్రెస్ తన యాప్‌ను తొలగించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment