ప్రస్తుతం ఇంటర్నెట్ ప్రపంచం మనం ఊహించని దానికంటే వేగంగా విస్తరిస్తుంది. దీంతో మనకు మేలు ఎంతో జరుగుతుందో అంతకంటే ఎక్కువ కీడు జరుగుతుంది అని చెప్పుకోవాలి. ప్రస్తుతం చాలా మంది నెటిజెన్స్ చిన్న చిన్న తప్పుల కారణంగా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు. సైబర్ నేరగాళ్లకు ఇంకొక పేరు హ్యాకర్స్. వీరి పేరు చెబితే సాదారణ ప్రజల నుంచి ప్రభుత్వాలు, దిగ్గజ ఐటీ కంపెనీలు వరకు ఇలా అందరూ వణికిపోతున్నారు. అంతలా ఉంది వీరి ప్రభావం మన అందరిమీద. ఇప్పుడు క్రైమ్ కేసులలో ఎక్కువగా సైబర్ క్రైమ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.(చదవండి: బిగ్ బ్యాటరీతో విడుదలైన పోకో ఎం3)
ప్రస్తుతం మనం ఎంత ప్రమాదంలో ఉన్నామో అని దీన్ని బట్టి మనం అర్ధం చేసుకోవచ్చు. హ్యాకింగ్ చాలా ఏళ్ల క్రితం నుంచి ఉన్నప్పటికీ ఎక్కువగా మాత్రం మన 3జీ నెట్వర్క్ వచ్చినప్పటి నుంచే భాగా పెరిగి పోయింది. 3జీ రాకముందు హ్యాకర్స్ పెద్ద పెద్ద కంపెనీలను, ధనవంతులను, ప్రభుత్వాలను లక్ష్యంగా చేసుకొని ఎక్కువ శాతం వారి ఖాతాలను హ్యాక్ చేసేవారు. కానీ ఈ 3జీ, 4జీ వచ్చాక ఇప్పుడు సాదారణ ప్రజలు కూడా ఎక్కువ శాతం హ్యాకింగ్ భారీన పడుతున్నారు. అందుకే సైబర్ నిపుణులు ఆన్లైన్ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు.
చాలా మంది హ్యాకర్స్ 2000 సంవత్సరం తర్వాత పుట్టుకొచ్చారు. కానీ ఒక హ్యాకర్ మాత్రం 1980 నుంచి 2000 వరకు ఈ ప్రపంచాన్ని వణికించాడు. ఇతను ప్రపంచంలోని ఐబీఎమ్, మోటోరోలా, నోకియా వంటి 40కి పైగా ఐటీ దిగ్గజ కంపెనీలను హ్యాక్ చేశాడు. అలాగే ప్రపంచాన్ని వణికించిన మాఫియా డాన్ లకు చుక్కలు చూపించాడు. అసలు అతని పేరు చెబితే అమెరికా ప్రభుత్వం వణికిపోయేది అంటే మనం అర్ధం చేసుకోవచ్చు. అతని ఎవరో కాదండీ కెవిన్ మిట్నిక్. మీరు ఇతని పేరు ఇప్పటి వరకు వినలేక పోవచ్చు.
కెవిన్ మిట్నిక్ బాల్యం:
కెవిన్ మిట్నిక్ కాలిఫోర్నియాలోని వన్ నుయ్స్(Van Nuys)లో 1963 ఆగస్టు 6న జన్మించాడు. ఇతను కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్‌లోని జేమ్స్ మన్రో హైస్కూల్‌లో విద్యాభ్యాసం గడించాడు. ఆ సమయంలో అతను ఔత్సాహిక రేడియో ఆపరేటర్ అయ్యాడు. తర్వాత అతను లాస్ ఏంజిల్స్ పియర్స్ కాలేజీలో చేరాడు. కొంతకాలం, అతను స్టీఫెన్ ఎస్. వైజ్ టెంపుల్‌లో రిసెప్షనిస్ట్‌గా పనిచేశాడు.(చదవండి: మరోసారి మహిళను కాపాడిన యాపిల్ వాచ్!)
కెవిన్ మిట్నిక్ మొదటి కంప్యూటర్ హ్యాకింగ్:
కెవిన్ మిట్నిక్ 12 సంవత్సరాల వయస్సులో లాస్ ఏంజిల్స్ బస్సు వ్యవస్థలో ఉపయోగించే పంచ్ కార్డ్ వ్యవస్థను హ్యాక్ చేయడానికి సోషల్ ఇంజనీరింగ్, డంప్‌స్టర్ డైవింగ్ అనే టెక్నిక్ ఉపయోగించాడు. “స్కూల్ ప్రాజెక్ట్” కోసం తన సొంత టికెట్ పంచ్ ఎక్కడ కొనవచ్చో చెప్పమని ఒక బస్సు డ్రైవర్‌ను కోరాడు. ఇలా అతను బస్సు కంపెనీ పక్కన ఉన్న డంప్‌స్టర్‌లో దొరికిన ఉపయోగించని బదిలీ స్లిప్‌లను ఉపయోగించి లాస్ ఏంజిల్స్ ప్రాంతంలో ప్రయాణించేవాడు. ఇది అతని మొదటి హ్యాకింగ్ అనే చెప్పుకోవాలి. సోషల్ ఇంజనీరింగ్ టెక్నిక్ తో ఇతరుల పేర్లు, పాస్‌వర్డ్‌లు, మోడెమ్ ఫోన్ నంబర్‌లతో సహా సమాచారాన్ని పొందేవాడు.
మిట్నిక్ మొట్టమొదట కంప్యూటర్ నెట్‌వర్క్‌కు సంబందించి 1979లో హ్యాక్ చేశాడు. తన 16 ఏళ్ళ వయసులో ఒక స్నేహితుడు కంప్యూటరు సహాయంతో ఆర్‌ఎస్‌టిఎస్/ఇ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసే డిజిటల్ ఎక్విప్‌మెంట్ కార్పొరేషన్(డిఇసి) కంప్యూటర్ నెట్‌వర్క్‌లోకి ప్రవేశించి, కంపెనీ సాఫ్ట్‌వేర్‌ను కాపీ చేశాడు. ఈ నేరానికి గాను 1988లో12 నెలల జైలు శిక్ష అనుభవించాడు. అలాగే మూడు సంవత్సరాల పాటు పోలీసుల పర్యవేక్షణలో ఉన్నాడు. ఈ పోలీసుల పర్యవేక్షణలో ఉన్న కూడా మిట్నిక్ పసిఫిక్ బెల్ వాయిస్ మెయిల్ కంప్యూటర్లను హ్యాక్ చేశాడు. దీంతో మళ్లీ అతని మీద అరెస్టు వారెంట్ జారీ చేశారు. అయితే పోలీసులకు దొరకాకుండా రెండున్నర సంవత్సరాలు పరారీలో ఉన్నాడు.(చదవండి: 5జీతో మాట్లాడే ఏటిఎమ్ లు రాబోతున్నాయి!)
అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, పోలీసులకు కెవిన్ మిట్నిక్ ఒక పెద్ద తల నొప్పిగా మారిపోయాడు. మిట్నిక్ డజన్ల కొద్దీ కంప్యూటర్ నెట్వర్క్లలో ప్రవేశించేవాడు. అతను తన స్థానాన్ని కనిపెట్టకుండా ఉండటానికి క్లోన్ చేసిన సెల్యులార్ ఫోన్‌లను ఉపయోగించేవాడు. దేశంలోని అతిపెద్ద సెల్యులార్ టెలిఫోన్, కంప్యూటర్ కంపెనీల నుంచి విలువైన సమాచారాన్ని, సాఫ్ట్‌వేర్‌ను కాపీ చేశాడు. ఇతర కంప్యూటర్ నెట్‌వర్క్‌లను మార్చేవాడు, ప్రైవేట్ ఇ-మెయిల్‌లను రహస్యంగా చదివేవాడు. ఒకానొక సమయంలో ప్రపంచంలోని అతి పెద్ద డాన్ ల ఫోన్ లను హ్యాక్ చేసి వారికీ చుక్కలు చూపించాడు.
కెవిన్ మిట్నిక్ అరెస్ట్, జైలు శిక్ష
కెవిన్ మిట్నిక్ 1995లో అమెరికాలోని 40 అతిపెద్ద కంపెనీలను హ్యాకింగ్ చేశాడు. వీటిలో ఐబిఎం, నోకియా మరియు మోటరోలా ఉన్నాయి. ఇలా రోజు రోజుకి అమెరికా ప్రభుత్వానికి ఒక పెద్ద తలనొప్పిగా మారిపోయాడు. అతనిని ఎలాగైనా పట్టుకోవాలని అతని పట్టించిన వారికి భారీ బహుమతి అని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. ఫిబ్రవరి 15, 1995న ఎఫ్బిఐ నార్త్ కరోలినాలోని రాలీలోని తన అపార్ట్మెంట్ లో మిట్నిక్ ను అరెస్టు చేసింది. రెండున్నర సంవత్సరాల కంప్యూటర్ హ్యాకింగ్ కు సంబంధించిన అనేక నేరాలు అతని మీద ఉన్నాయి. అతను క్లోన్ చేసిన సెల్యులార్ ఫోన్లు, 100కి పైగా క్లోన్ సెల్యులార్ ఫోన్ కోడ్‌లు వంటివి అతనిని అరెస్టు చేసే సమయంలో కనుగొన్నారు.(చదవండి: రూ 1.8లక్షలు ఖరీదైన సోనీ మొబైల్ విడుదల)
1997 డిసెంబర్ లో యాహు! వెబ్‌సైట్ హ్యాక్ చేయబడింది క్రిస్మస్ దినోత్సవం నాటికి మిట్నిక్ విడుదల చేయాలి లేకపోతే ఇంటర్నెట్ “విపత్తు”ను సృష్టిస్తామని ఒక మెసేజ్ భాగా అప్పుడు వైరల్ అయ్యింది. యాహు! మాత్రం కేవలం ఇది ప్రజలను భయపెట్టడానికి మాత్రమే అని పేర్కొంది. మిట్నిక్‌పై వైర్ మోసం, ఎలక్ట్రానిక్ సమాచార మార్పిడి, ఫెడరల్ కంప్యూటర్‌ను హ్యాక్ చేయడం వంటి ఆరోపణలపై తనపై ఉన్నాయి. 1999లో లాస్ ఏంజిల్స్‌లోని కాలిఫోర్నియా సెంట్రల్ డిస్ట్రిక్ట్ యునైటెడ్ స్టేట్స్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ముందు చివరకు చట్టవిరుద్ధంగా చేసిన తప్పులను అంగీకరించాడు. గతంలో కంప్యూటర్ మోసానికి 1989లో పోలీసుల పర్యవేక్షణ నుంచి పారీపోయినందుకు 22 నెలల జైలు శిక్ష, తర్వాత చట్టవిరుద్దంగా చేసిన తప్పులకు అతని మీద 46 నెలల జైలు శిక్ష విధించబడింది. మిట్నిక్ ఐదు సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాడు.
టాప్ సెక్యూరిటీ కన్సల్టెంట్
జనవరి 21, 2003లో అతను పోలీసుల పర్యవేక్షణ నుంచి విడుదల అయ్యాడు. తన విడుదల అయ్యాక కూడా ఇంటర్నెట్ వాడకూడదు అనే నిబంధన ఉండేది. కమ్యూనికేషన్ కోసం కేవలం ల్యాండ్‌లైన్ టెలిఫోన్ వినియోగించాలని పోలీసులు ఆంక్షలు విధించారు. అయితే ఈ విషయంలో స్థానిక కొర్టులో కెవిన్ మిట్నిక్ పోరాడారు. చివరికి అతనికి అనుకూలంగా ఒక తీర్పును వచ్చిన తర్వాత ఇంటర్నెట్‌ను యాక్సెస్ వాడుకోవడానికి వీలు కల్పించారు. ప్రస్తుతం కెవిన్ మిట్నిక్ ప్రపంచంలోని గూగుల్, ఫేస్బుక్ వంటి అతిపెద్ద కంపెనీలకు టాప్ సెక్యూరిటీ కన్సల్టెంట్ గా పనిచేస్తున్నారు. దీనికి గాను అతను అత్యధిక పారితోషకం తీసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment