కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్‌ఐఆర్), యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) సంయుక్తంగా నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్) నిర్వహిస్తున్నాయి. ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థుల పరిశోధనలకు ఆర్థిక తోడ్పాటు అందిస్తారు. తాజాగా ఈ పరీక్షకు నోటిఫికేషన్ విడుదలైంది...
నెట్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు సీఎస్‌ఐఆర్, యూజీసీలు సంయుక్తంగా జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్‌ఎఫ్) పేరిట ఆర్థిక సహకారం అందిస్తున్నాయి. పీహెచ్‌డీకి రిజిస్టర్ చేసుకున్న తర్వాత సంవత్సరానికి రూ.20,000 కంటింజెన్సీ ఫండ్‌తోపాటు నెలకు రూ.25 వేలు జేఆర్‌ఎఫ్ లభిస్తుంది.
అర్హత: జనరల్, ఓబీసీ అభ్యర్థులు కనీసం 55శాతం మార్కులతో ఎంఎస్సీ/ఇంటిగ్రేటెడ్ బీఎస్-ఎంఎస్/ బీఎస్-లుగేళ్లు/బీఈ/బీటెక్/బీఫార్మా/ఎంబీబీఎస్ (ఎస్సీ, ఎస్టీ, ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులు 50 శాతం). వయసు: 2015, జూలై 1 నాటికి గరిష్టంగా 28 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ప్రత్యేక కేటగిరీ, మహిళా అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో 5 ఏళ్ల సడలింపు ఉంటుంది.
రఖాస్తు రుసుం: జనరల్ అభ్యర్థులకు రూ.1000, నాన్ క్రీమీలేయర్ ఓబీసీ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.250. ఓబీసీ అభ్యర్థులు క్రీమీలేయర్ పరిధిలోకి వస్తే వారిని జనరల్ అభ్యర్థులుగానే పరిగణిస్తారు.
పరీక్షా విధానం:
ప్రశ్నపత్రం 200 మార్కులకు మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటుంది. పరీక్ష కాల వ్యవధి మూడు గంటలు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. ప్రశ్నపత్రం 3 విభాగాలుగా ఉంటుంది.
సబ్జెక్టులు: కెమికల్ సెన్సైస్; ఎర్త్, అట్మాస్పియరిక్, ఓషన్, ప్లానెటరీ సెన్సైస్; లైఫ్ సెన్సైస్; మ్యాథమెటికల్ సెన్సైస్; ఫిజికల్ సెన్సైస్
పార్ట్-ఎ: ఇది అన్ని సబ్జెక్టుల అభ్యర్థులకు కామన్‌గా ఉంటుంది. ఇందులో 20 ప్రశ్నలు ఉంటాయి. ఏవైనా 15 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు చొప్పున 30 మార్కులు ఉంటాయి . ఇందులో జనరల్ ఆప్టిట్యూడ్ ముఖ్యంగా లాజికల్ రీజనింగ్, గ్రాఫికల్ అనాలిసిస్, న్యూమరికల్ ఎబిలిలీ, క్వాంటిటేటివ్ కంపారిజన్ వంటి అంశాలపై ప్రశ్నలుంటాయి.
పార్ట్-బి: ఈ విభాగంలో అభ్యర్థి ఎంపిక చేసుకున్న సబ్జెక్టు సంబంధించి 50 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో 35 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ఒక్కో ప్రశ్నకు 2 మార్కుల చొప్పున మొత్తం 70 మార్కులు. పార్ట్-సి: ఇందులో మొత్తం 75 ప్రశ్నలుంటాయి. ఏవైనా 25 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కుల చొప్పున మొత్తం 100 మార్కులు. పరిశోధనాత్మక అంశాలపై అభ్యర్థికి ఉన్న అవగాహనను పరీక్షించేలా ప్రశ్నలుంటాయి. సైంటిఫిక్ నాలెడ్జ్‌తో ఏదైనా సమస్య వస్తే ఎలా పరిష్కరిస్తారనే కోణంలో ప్రశ్నలుంటాయి.
ముఖ్య సమాచారం:
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: ఆగస్టు 25, 2015.
దరఖాస్తు రుసుం చెల్లించేందుకు చివరి తేదీ:
ఆగస్టు 24, 2015.
ఆన్‌లైన్ దరఖాస్తు హార్డ్‌కాపీ పోస్ట్ ద్వారా సీఎస్‌ఐఆర్ ఎగ్జామినేషన్ యూనిట్‌కు చేరేందుకు చివరి తేదీ: సెప్టెంబరు 3, 2015.
పరీక్ష తేదీ: డిసెంబర్ 20, 2015.
పరీక్షా కేంద్రాలు: గుంటూరు, హైదరాబాద్.
వెబ్‌సైట్: www.csirhrdg.res.in
సీఎస్‌ఐఆర్ నెట్
Published Thu, Aug 6 2015 1:19 AM | Last Updated on Sun, Sep 3 2017 6:50 AM
Advertisement