University Grants Commission
-
అనుమతిచ్చే ముందు అడగండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలకు అటానమస్, డీమ్డ్ హోదా ఇచ్చేప్పుడు తమను సంప్రదించాలని రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‌ను కోరింది. ఇష్టానుసారం అనుమతులిస్తే స్థానికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొంది. రాష్ట్రంలో కాలేజీలకు భద్రతాపరమైన సమస్యలు ఎదురైనా, ఇతరత్రా సమస్యలు వచ్చినా పరిష్కరించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనని స్పష్టం చేసింది. కొన్ని ప్రైవేటు కాలేజీలు అడ్డగోలుగా అనుమతులు పొందుతుంటే, రాష్ట్రంలోని ఇతర కొన్ని ఇంజనీరింగ్ కాలేజీల పరిస్థితి ప్రశ్నార్థకంగా తయారైందని పేర్కొంది. మల్లారెడ్డి సంస్థలకు ఇటీవల కేంద్రం డీమ్డ్ హోదా ఇచ్చింది. మహేంద్ర యూనివర్సిటీకి కూడా ఇచ్చే యోచనలో ఉంది. ఈ నేపథ్యంలో యూజీసీతో పాటు ఏఐసీటీఈకి రాష్ట్ర విద్యాశాఖ లేఖ రాసింది. చిన్న కాలేజీలు విలవిల డీమ్డ్, అటానమ్ కాలేజీలు పెద్దఎత్తున ప్రచారం చే సుకుంటున్న నేపథ్యంలో చిన్న ఇంజనీరింగ్ కాలేజీల పరిస్థితి దయనీయంగా తయారైందని ఉన్నత విద్యా మండలి గుర్తించింది. 2016 నాటికి రాష్ట్రంలో 248 ఇంజనీరింగ్ కాలేజీలుంటే, ప్రస్తుతం వాటి సంఖ్య 159కి తగ్గింది. గ్రామీణ ప్రాంతాలకు చేరువగా ఉండే కాలేజీలే ఎక్కువగా మూతపడుతున్నా యి. ఒకప్పుడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 48 కాలేజీలుంటే, ఇప్పుడు వాటి సంఖ్య 11కు తగ్గింది. ఖమ్మం జిల్లాలో 28 ఉంటే, ఇప్పుడు 8 మాత్రమే ఉన్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 11 ఉంటే, ప్రస్తుతం రెండు మాత్రమే మిగిలాయి. ప్రతి జిల్లాలోనూ ఇదే పరిస్థితి కని్పస్తోంది. చివరకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనూ 2015లో 74 కాలేజీలుంటే, 20 కాలేజీలు మాయమై 54 మిగిలాయి. ఇటీవల ఉన్నతాధికారులు ప్రభుత్వానికి అందించిన నివేదికలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. భవిష్యత్తులో మరికొన్ని కాలేజీలు కనుమరుగయ్యే అవకాశం లేకపోలేదని ఉన్నత విద్యా మండలి వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అటానమస్, డీమ్డ్ వర్సిటీలు వస్తే మరికొన్ని కాలేజీలు మూతపడే అవకాశం ఉందని, దీనివల్ల పేద వర్గాలకు ఇంజనీరింగ్ విద్య మరింత ఖరీదయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నాయి. ప్రస్తుతం సీఎస్ఈ, డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ వంటి కోర్సుల వైపే విద్యార్థులు వెళ్తున్నారు. కొత్తగా వచ్చే కాలేజీలు ఈ కోర్సులనే ఆఫర్ చేయడం, భారీగా సీట్లు అమ్ముకునేందుకు డీమ్డ్ హోదా తెచ్చుకోవడం సరైన విధానం కాదని మండలి పేర్కొంటోంది. విదేశీ వర్సిటీలొస్తే మరింత ముప్పు! దేశంలో యూనివర్సిటీల ఏర్పాటుకు అమెరికా, ఆ్రస్టేలియా, ఇటలీలోని వర్సిటీలు ముందుకొస్తున్నాయి. వాటి బ్రాంచీలను భారత్‌లో ఏర్పాటు చేసేందుకు అనుమతి కోరుతున్నాయి. విదేశాల్లో విద్యపై ఆసక్తి చూపించే విద్యార్థులను ఇవి ఆకట్టుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇదే జరిగితే రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీలు తట్టుకునే అవకాశం తక్కువని, కొన్ని కాలేజీల మనుగడ ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం ఉందనే వాదన విన్పిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని 80 శాతం ఇంజనీరింగ్ కాలేజీల నాణ్యత పెంచాలని ఏఐసీటీఈ.. రాష్ట్రానికి సూచించింది. మరోవైపు ఇంజనీరింగ్ విద్యలో మార్పులు వస్తున్నాయి. బోధన ప్రణాళికను అంతర్జాతీయ స్థాయిలో రూపొందించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవన్నీ భవిష్యత్తులో మరికొన్ని కాలేజీలు మూతపడేందుకు కారణాలవుతాయని అంటున్నారు. ముందే తెలియజేస్తే బాగుంటుంది డీమ్డ్, అటానమస్ హోదా ఇచ్చేప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలని, ముందే తెలియజేయాలని కోరుతూ యూజీసీకి లేఖ రాశాం. మా విజ్ఞప్తిని యూజీసీ పరిగణనలోనికి తీసుకుంటుందని ఆశిస్తున్నాం. రాష్ట్ర ప్రమేయం లేకుండా అనుమతి ఇవ్వడం వల్ల అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. –ప్రొఫెసర్ వి.బాలకిష్ణారెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ -
ఉత్తమ పరిశోధనలకు ఉన్నత పురస్కారాలు
సాక్షి, అమరావతి: విద్యా రంగంలో ఉత్తమ పరిశోధనలను ప్రోత్సహించి, నాణ్యతను పెంపొందించేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఉన్నత స్థాయి అవార్డులను ప్రవేశపెడుతోంది. ఏటా దేశవ్యాప్తంగా 10 ఉత్తమ పీహెచ్డీ పరిశోధనలు అందించిన వారిని ‘పీహెచ్డీ ఎక్సలెన్స్ సైటేషన్’తో సత్కరించనుంది. నూతన జాతీయ విద్యా విధానం లక్ష్యాల్లో భాగంగా ఏటా వివిధ విభాగాల్లో అత్యుత్తమమైన పది పీహెచ్డీ థీసిస్‌లకు ఈ అవార్డు అందిస్తుంది. వ్యవసాయ శాస్త్రాల దగ్గర నుంచి వైద్య శాస్త్రాలతో సహా ఐదు విభాగాల్లో రెండు చొప్పున ఉత్తమ థీసిస్‌లకు సైటేషన్ అవార్డులు ప్రదానం చేస్తారు. దీనిపై అభిప్రాయ సేకరణ కోసం యూజీసీ సోమవారం మార్గదర్శకాలను విడుదల చేసింది.ఏటా సెప్టెంబర్ 5న ప్రదానంప్రతి సంవత్సరం జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు కాన్వకేషన్ ద్వారా పీహెచ్‌డీలు పొందిన రీసెర్చ్ స్కాలర్లు తదుపరి ఏడాదిలో ‘సైటేషన్’ అవార్డుకు అర్హులుగా పేర్కొంది. రాష్ట్ర, కేంద్ర, ప్రైవేటు, డీమ్డ్ వర్సిటీల నుంచి పీహెచ్‌డీలు పొందిన వారు వర్సిటీల ద్వారా నామినేట్ అవ్వొచ్చు. ఇందుకోసం ప్రతి విశ్వవిద్యాలయంలో స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది. ఈ కమిటీ విశ్వవిద్యాలయం నుంచి ఏటా ఐదు థీసిస్‌లను నామినేట్ చేస్తుంది. ఏటా జనవరి నుంచి మార్చి 31 వరకు ఆన్లైన్ పోర్టల్ ద్వారా వర్సిటీల నుంచి నామినేషన్లు యూజీసీ స్వీకరిస్తుంది. ఆగస్టు 1న విజేతలను ప్రకటిస్తారు. సెప్టెంబర్ 5న ఉపాధ్యాయుల దినోత్సవం రోజు ‘పీహెచ్డీ ఎక్సలెన్స్ సైటేషన్’తో విజేతలను యూజీసీ సత్కరిస్తుంది.యూజీసీ అధ్యయనం ప్రకారం దేశంలో పీహెచ్‌డీలో ప్రవేశాలు భారీగా పెరుగుతున్నాయి. 2010–11లో దేశవ్యాప్తంగా 77,798 పీహెచ్డీ ప్రవేశాలు నమోదవగా, 2017–18లో ఈ సంఖ్య 1,61,412కు పెరిగింది. ఏటా సగటున 10 శాతం వృద్ధి రేటు నమోదవుతోంది.కొత్త ఆవిష్కరణలు అవసరంకొత్త ఆవిష్కరణలు దేశ అభివృద్ధికి చాలా అవసరం. ఉన్నత విద్యా సంస్థలు కొత్త విజ్ఞానాన్ని సమాజానికి అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇది డాక్టోరల్ డిగ్రీల నాణ్యతపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. భారతీయ విశ్వవిద్యాలయాలలో మంచి నాణ్యమైన పరిశోధనలను ప్రోత్సహించే ప్రయత్నంలో యూజీసీ ఏటా ‘పీహెచ్డీ ఎక్సలెన్స్ సైటేషన్’ను ప్రదానం చేయాలని నిర్ణయించింది. ప్రజాభిప్రాయం కోసం మార్గదర్శకాలను విడుదల చేశాం. – మామిడాల జగదీశ్ కుమార్, యూజీసీ చైర్మన్ -
గుడ్ న్యూస్.. ఇకపై యూనివర్సిటీల్లో ఏడాదికి రెండుసార్లు అడ్మిషన్లు
న్యూఢిల్లీ: ఉన్నత విద్యా సంస్థల్లో ఏడాదికి రెండు సార్లు ప్రవేశాలు నిర్వహించేందుకు యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్(యూజీసీ) అనుమతించింది. ఈ విషయాన్ని కమిషన్ చైర్పర్సన్ ఎమ్ జగదీష్ కుమార్ మంగళవారం వెల్లడించారు. 2024-25 విద్యా సంవత్సరం నుంచి సంవత్సరానికి రెండుసార్లు అంటే జులై-ఆగస్టు, జనవరి-ఫిబ్రవరిలలో ప్రవేశాలు కల్పించేందుకు అనుమతించనున్నట్లు తెలిపారు. మే 5న జరిగిన యూజీసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.కాగా ప్రస్తుతం విశ్వవిద్యాలయాలు, కళాశాలలు ప్రతి సంవత్సరం జూలై-ఆగస్టులో విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. దీనివల్ల భారతదేశంలోని అన్ని ఉన్నత విద్యా సంస్థలు జూలై-ఆగస్టులో ప్రారంభమై మే-జూన్‌లో అకడమిక్ సెషన్‌ను ముగిస్తున్నాయి.గత ఏడాది ఒక అకాడమిక్ సంవత్సరంలో దూరవిద్యలో(ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్) విద్యార్థులు జనవరి, జూలైలో రెండుసార్లు ప్రవేశం పొందేందుకు యూజీసీ అనుమతించింది. ఈ నిర్ణయం వల్ల దాదాపు అయిదు లక్షల మంది విద్యార్థులు మరో విద్యా సంవత్సరం వరకు వేచి ఉండకుండా అదే ఏడాది డిగ్రీలొ చేరడానికి సహాయపడిందని కుమార్ పేర్కొన్నారు. ‘‘మన దేశంలోని యూనివర్సిటీలు ఏడాదికి రెండుసార్లు అడ్మిషన్ కల్పించినట్లయితే అది ఎంతో మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ముఖ్యంగా బోర్డు ఫలితాల్లో ఆలస్యం, ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగత కారణాల వల్ల జులై-ఆగస్టులో ప్రవేశం పొందలేకపోయిన వారికి ఎంతో దోహదపడుతుంది. రెండుసార్లు అడ్మిషన్ ప్రక్రియ ద్వారా విద్యార్థులకు ఏడాది సమయం వృథా కాకుండా ఉంటుంది. అటు కంపెనీలు కూడా రెండుసార్లు క్యాంపస్ ప్లేస్మెంట్లు నిర్వహించుకోవచ్చు. తద్వారా పట్టభద్రులకు ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగవుతాయి’ అని యూజీసీ చీఫ్ వెల్లడించారు.రెండుసార్లు ప్రవేశాలు కల్పించడం వల్ల ఉన్నత విద్యా సంస్థలు తమ ఫ్యాకల్టీ, ల్యాబ్, క్లాస్రూమ్, ఇతర సేవలను మరింత సమర్థవంతంగా నిర్వహించుకునేందుకు వీలు కలుగుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు ఇప్పటికే ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయని వెల్లడించారు. భారతీయ విద్యా సంస్థలు ఈ విధానం పాటించడం వల్ల అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేసేందుకు దోహదపడుతుందన్నారు. తద్వారా పోటీ ప్రపంచంలో మనం మరింత మెరుగుకావచ్చని, అంతర్జాతీయ విద్యా ప్రమాణాలకు అనుగుణంగా వ్యవహరించినట్టు ఉంటుందన్నారు.దేశంలోని అన్ని యూనివర్సిటీలు ఈ విధానాన్ని పాటించడం తప్పనిసరి కాదన్నారు. అవసరమైన మౌలిక సదుపాయాలు, బోధనా సిబ్బంది కలిగిన ఉన్నత విద్యా సంస్థలు మాత్రం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. రెండుసార్లు ప్రవేశాలు కల్పించేందుకు వీలుగా విద్యాసంస్థల అంతర్గత నిబంధనలను మార్చుకోవాలని సూచించారు. -
అభ్యర్థులు దొరక్కుంటే అన్ రిజర్వుడే
న్యూఢిల్లీ: ఉన్నత విద్యా సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు రిజర్వు చేసిన పోస్టుల్లో సంబంధిత కేటగిరీల అభ్యర్థులు దొరకని సందర్భాల్లో ఆయా పోస్టులను అన్ రిజర్వుడుగా ప్రకటించాలంటూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ)తాజా ప్రతిపాదిత మార్గదర్శకాలల్లో పేర్కొంది. ఈ మేరకు రూపొందించిన మార్గదర్శకాలను అభిప్రాయ సేకరణ కోసం ఆన్లైన్లో ఉంచింది. అయితే, యూజీసీ ప్రతిపాదించిన మేరకు ఉన్నత విద్యాసంస్థల్లోని రిజర్వుడు పోస్టులు వేటినీ కూడా డీ రిజర్వుడుగా మార్చడం లేదని కేంద్ర విద్యాశాఖ స్పష్టం చేసింది. యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్ స్పందిస్తూ ‘ఉన్నత విద్యా సంస్థల్లోని రిజర్వుడు పోస్టులను అన్ రిజర్వుడుగా ప్రకటించడమనే విధానం గతంలో లేదు, ఇకపై అమలు కాబోదు. రిజర్వుడు కేటగిరీలోని అన్ని బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ అయ్యేలా చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నత విద్యాసంస్థలదే’అని స్పష్టం చేశారు. -
ఆన్లైన్ డిగ్రీ కోర్సులతో జాగ్రత్త: యూజీసీ
న్యూఢిల్లీ: విదేశీ యూనివర్సిటీల సహకారంతో కాలేజీలు, ఎడ్టెక్ కంపెనీలు అందించే డిగ్రీల కు తమ గుర్తింపు లేదని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) స్పష్టం చేసింది. ఇటువంటి డిగ్రీలకు ఏమాత్రం విలువ లేదని, ఆయా కోర్సుల్లో చేరవద్దని విద్యార్థులను హెచ్చరించింది. విదేశీ వర్సిటీలు, విద్యా సంస్థలతో కొన్ని ఉన్నత విద్యా సంస్థలు, కాలేజీలు పొందే అనుబంధ గుర్తింపు, ఒప్పందాలను తాము అనుమతించడం లేదని యూజీసీ సెక్రటరీ మనీశ్ జోషి చెప్పారు. ఆయా సంస్థలు ఇచ్చే డిగ్రీలు, డిప్లొమాలకు ఎటువంటి విలువా ఉండదని వివరించారు. -
విదేశీ విద్యను ఇక్కడే కల్పించేలా...
భారతదేశంలో విదేశీ ఉన్నత విద్యా సంస్థల (ఎఫ్హెచ్ఇఐ) క్యాంపస్‌ల ఏర్పాటు, నిర్వహణ కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న క్రమబద్ధీకరణను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కొన్ని రోజుల క్రితం విడుదల చేసింది. ఈ క్రమబద్ధీకరణ ఉదారంగానూ, సమర్థంగానూ ఉందని చెప్పాలి. ఇది నూతన విద్యా విధానపు సిఫార్సులను అనుసరిస్తోంది. అయితే, ఇది ఇప్పటికే ఉన్న దేశంలోని విద్యా వ్యవస్థలను సవాలు చేయడానికి ప్రయత్నించడం అనేది ఒక అవకాశంతోపాటు ఆందోళన కరమైన విషయం కూడా! ఇంకా, విదేశీ ఉన్నత విద్యా సంస్థ తన భారతీయ క్యాంపస్‌లోని విద్యాపరమైన నాణ్యతను తమ దేశంలోని ప్రధాన క్యాంపస్‌తో సమానంగా ఉండేలా చూసుకోవాలి. చాలా గొప్ప ఆలోచనే అయినప్పటికీ, క్రమబద్ధీకరణ యంత్రాంగం దీన్ని ఎలా అనువర్తించగలుగుతుంది? యూజీసీ క్రమబద్ధీకరణ విదేశీ ఉన్నత విద్యాసంస్థలకు పాలన పరంగా ప్రత్యేక అధికారాలకు అనుమతిస్తోంది. అన్ని విభాగాలలో యూజీ/ పీజీ/ డాక్టోరల్/ పోస్ట్‌డాక్టోరల్ అధ్యయనాలు, డిగ్రీల ప్రదానం, డిప్లొమాలు, సర్టిఫికేట్లను ఇచ్చే వీలు కల్పిస్తోంది. ఈ విదేశీ విద్యా సంస్థలు మొత్తం సబ్జెక్ట్‌వారీగా, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 500 లోపు ఉంటే అది నిజంగా గొప్ప అడుగే. కాకపోతే, ప్రపంచంలో కనీసం 20 ప్రముఖ ర్యాంకింగ్ ఏజెన్సీలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన అనేక సంస్థలు వివిధ కారణాల వల్ల ఈ ర్యాంకింగ్ సంస్థల చర్యలలో పాల్గొనడం లేదనే విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఈ ర్యాంకింగ్‌లను ఎలా ప్రామాణీ కరిస్తారనేది ప్రశ్న. కాకపోతే భారతీయ, విదేశీ ఉన్నత విద్యాసంస్థల మధ్య సహకారం కోసం 2022లో జరిగిన విద్యా సంబంధ సహకార నియంత్రణ నేపథ్యంలో చూస్తే, ఉమ్మడి డిగ్రీ, ద్వంద్వ డిగ్రీ కార్య క్రమాలకు ఉత్తేజకరమైన కాలం ముందుందని చెప్పొచ్చు. దేశంలో అడుగుపెట్టే విదేశీ ఉన్నత విద్యా సంస్థలు, ఈ క్రమ బద్ధీకరణ ద్వారా, భారతీయ ఉన్నత విద్యా సంస్థలు లేదా భారతీయ కంపెనీలతో జాయింట్ వెంచర్లోకి ప్రవేశించవచ్చు. జాయింట్ వెంచర్లు అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ పక్షాలు తమ వనరులతో ఒక నిర్దిష్ట పనిని పూర్తి చేయడానికి అంగీక రించే వ్యాపార పరమైన ఏర్పాటు అని మనం అర్థం చేసుకున్నప్పటికీ – విదేశీ ఉన్నత విద్యా సంస్థ భౌతిక, విద్యా, పరిశోధనా మౌలిక సదుపాయాలతో కూడిన స్వతంత్ర క్యాంపస్‌ను కలిగి ఉండాలని ఈ నిబంధన ఎందుకు నొక్కి చెబుతోంది? దాని విద్యాపరమైన, పరిశోధనా కార్యక్రమాలను సీరి యస్‌గా నిర్వహించడానికి ఏ విదేశీ ఉన్నత విద్యా సంస్థ అయినా భారతదేశంలో ఉండటం కోసం భూమిపై, వనరులపై పెట్టుబడి పెడుతుందా? దీనికి సంబంధించి ఇప్పటికే ఉన్న భారతీయ క్యాంపస్ లతో వనరులను పంచుకునే సహకార క్యాంపస్ నమూనా మరింత ఆచరణీయంగా ఉంటుంది. ఇప్పుడు ‘కంపెనీ’ పాత్రను చూద్దాం. నిర్దేశిత లక్ష్యాల కోసం, సెక్షన్ 8 కింద నమోదు అయిన కంపెనీ, లాభాలు ఏవైనా ఉంటే, వాటిని ఆ నిర్దేశిత లక్ష్యాల కోసమే ఉపయోగించాలి. లాభాలను దాని సభ్యులకు చెల్లించకూడదు. ఇంకా, ఇండియన్ ట్రస్ట్ చట్టంలోని సెక్షన్ 10 ప్రకారం, ఒక విదేశీయుడు లేదా ఎన్నారై, భారతీయ ట్రస్ట్‌కు ట్రస్టీగా ఉండకూడదు. అయితే ఫెమా చట్టం, 1999 నిబంధనలకు అనుగుణంగా ఉండే పక్షంలో నిధులను సరిహద్దులు దాటించడానికీ, విదేశీ కరెన్సీ ఖాతాల నిర్వహణకూ, చెల్లింపులకూ, అమ్మకాలకూ అను మతిస్తోందని తెలుస్తున్నప్పుడు ఇక్కడ ఏదో లోపం ఉందని గమనించాలి. నిధులను స్వదేశానికి పంపగలిగే వీలు ఉన్నట్లయితే, సంబంధిత విదేశీ ఉన్నత విద్యా సంస్థ లాభాలను పొందగలదని దీని అర్థమా? అంటే ఇప్పుడు విద్య ‘లాభార్జన’ కోసమా? భవిష్యత్తులో భారతదేశం ఆకర్షణీయమైన ప్రపంచ అధ్యయన గమ్యస్థానంగా మారుతుందని ఈ క్రమబద్ధీకరణ ఆశిస్తోంది. ఏ విదేశీ ఉన్నత విద్యాసంస్థలు, ఏయే కార్యక్రమాలతో తమ క్యాంపస్‌లను మన దేశంలో ఏర్పరుస్తాయి; వారు స్థానిక అధ్యాపకులను తీసుకుంటారా, అంతర్జాతీయంగానా; విద్యార్థుల ప్రవేశం కోసం వారు ఉప యోగించే కొలమానాలు ఏవి అనే అంశాలపై ఇది ఆధారపడి ఉంటుంది. సాంప్రదాయకంగా, అక్రిడిటేషన్ అనేది భారతదేశంతో పాటు చాలా దేశాలలో నాణ్యతా తనిఖీ విధానం. విదేశీ ఉన్నత విద్యా సంస్థ నాణ్యతాపరమైన హామీ, ఆడిట్‌కు లోనవుతుందనీ, యూజీసీకి తన నివేదికను సమర్పించాలనీ ఈ క్రమబద్ధీకరణ నిర్దేశిస్తోంది. ఏదైనా నెరవేరదగిన హామీ నెరవేర్చని పక్షంలో వినియోగదారు న్యాయస్థానంలో పరిష్కారాన్ని కోరవచ్చు. ఒక విదేశీ ఉన్నత విద్యా సంస్థ తన రుసుముల చట్రాన్ని నిర్ణ యించుకోవడానికి ఈ క్రమబద్ధీకరణ అనుమతించడం నిజానికి ప్రగతి శీలమైనది. భారతదేశంలోని విద్యాసంస్థలు మాత్రం ఫీజు నిర్ణా యక కమిటీల ఇష్టాలకు లోబడుతున్నప్పుడు, విదేశీ ఉన్నత విద్యాసంస్థలకు ఈ ప్రత్యేక గౌరవం ఎందుకు? ఫెమా నిబంధనలు ఉన్నప్ప టికీ, పరిమాణాత్మకం కాని మొత్తాలను ఎల్లప్పుడూ సర్దుబాటు చేయ వచ్చు. అలాంటప్పుడు, అకడమిక్ పరపతి ఆధారితమైన రుసుము చట్రాన్ని తప్పనిసరి చేయడం మరింత విశ్వసనీయమైన ఎంపిక. విదేశీ ఉన్నత విద్యా సంస్థ అందించే కార్యక్రమాలు ఆన్లైన్ , బహిరంగ మరియు దూరవిద్యా (ఓడీఎల్) విధానంలో అనుమతించ బడవు అనే షరతు నిర్బంధపూరితంగా ఉంది. ఎమ్ఐటి, స్టాన్ ఫోర్డ్, హార్వర్డ్ వంటి అ్రగ్రశ్రేణి విద్యాసంస్థలు అద్భుతమైన ఆన్లైన్ ప్రోగ్రామ్‌లను కలిగి ఉన్నాయి. ఇటీవలి కాలంలో యూజీసీ అనేక ఓపెన్, దూరవిద్యా నిబంధనలను సడలించినప్పుడు, వాటిని మన విద్యార్థులకు ఎందుకు దూరంచేయాలి? విశ్వవిద్యాలయాల ప్రపంచ ర్యాంకింగ్‌లను గుర్తించడానికి రెండు ముఖ్యమైన కొలమానాలు ఏవంటే... అంతర్జాతీయీకరణ, పరిశో ధన. భారతీయ క్యాంపస్‌లలో విదేశీ విద్యార్థులు, అధ్యాపకులు వర్ధిల్ల డాన్ని అంతర్జాతీయీకరణ అంటారు. ఒక ప్రముఖ ఫ్యాకల్టీ ఎక్కువ డబ్బు సంపాదించడం లేదా మెరుగైన పరిశోధనా సౌకర్యాల కోసం, లేదా తన పరిధిలోని అత్యుత్తమ వ్యక్తులతో పరస్పర సంభాషణ కోసం; అవకాశాలను అన్వేషించడం లేదా కొత్త ఉత్పత్తులు, ప్రక్రియలకు దారితీసే పేటెంట్లను, ఐపీఆర్‌లను తమ హోదాకు జతచేసు కోవడం కోసం పనిచేస్తారు. అవి సాధ్యం కాదని తెలిసినప్పుడు, మహా అయితే ఏదో ఒక వారం సందర్శన కోసం తప్ప, ఎవరూ బయ టకు రారు. అప్పుడు విదేశీ ఉన్నత విద్యా సంస్థ ఎలా పని చేస్తుంది? అధ్యాపకులు, సిబ్బంది నియామకంలో పూర్తి స్వయంప్రతిపత్తి ఈ క్రమబద్ధీకరణలో అత్యంత ముఖ్యమైన భాగం. మన సంస్థలలోని అత్యుత్తమ అధ్యాపకులు విదేశీ ఉన్నత విద్యా సంస్థలకు వలసవెళ్లే అవకాశం ఉండటం ఈ నిబంధనకు రెండో కోణం. బహుశా, చివరికి ఒక కొత్త సాధారణ స్థితి ఏర్పడవచ్చు. ఆ స్థితి మన విద్యా సంస్థలలో నాణ్యతను పెంచినట్లయితే, దానిని స్వాగతించాలి. మన విద్యా సంస్థల ఫీజు కమిటీ సిఫార్సులు, అడ్మిషన్ల కోసం రాష్ట్ర లేదా కేంద్ర నిబంధనలు మొదలైన వాటికి కట్టుబడి ఉండాలి. అధ్యాపకు లను ఎన్నుకోవడంలో, ఫీజులను నిర్ణయించడంలో ప్రవేశ నిబంధనలను ఏర్పర్చడంలో మన సంస్థలకు స్వయంప్రతిపత్తిని ఎందుకు పొడిగించకూడదు? అవన్నీ అంతర్జాతీయ ర్యాంకింగ్ సంస్థలకు చెందిన అవే కొలమానాలపై పోటీ పడాలని భావిస్తున్నాం కదా! ఏదైనా ప్రయోగం విషయంలో దాని విమర్శకులు దానికి ఉంటారు. విదేశాల్లోని మాతృసంస్థల్లో అయ్యేదానితో పోల్చినప్పుడు తక్కువ ఖర్చుతో, విదేశీ విద్యార్హతలతో భారతీయ విద్యార్థులు నాణ్యమైన విద్యను ఇక్కడే పొందేందుకు ఈ క్రమబద్ధీకరణ వీలు కల్పిస్తే, ఇది స్వాగతించాల్సిన విషయమే. అయితే ఐఐటీల వంటి మన ప్రథమశ్రేణి విద్యాసంస్థలను సాధారణంగా ఎంపిక చేసుకునే విద్యార్థులు కూడా ఈ కొత్త క్యాంపస్‌లలో చేరేలా ప్రభావితం అయితే, అది ఆందోళన కలిగించే అంశం అవుతుంది. అందుకే, నాణ్యతా ప్రమాణాలు ఎన్నో రెట్లు పెరిగినందున విద్యారంగానికి భారీ పెట్టుబడులు అవసరం. పరిశోధనా సౌకర్యాల్లో భారీ స్థాయి వృద్ధి అవసరం. ప్రభుత్వ నిధులను అలా ఉంచుతూనే, విదేశీ నిధులను అనుమతించడం, విజయవంతమైన వ్యవస్థలను అనుసరించడం మేలు. ఎస్ఎస్ మంథా, ఏఐసీటీఈ (ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్) మాజీ ఛైర్మన్; అశోక్ ఠాకూర్, కేంద్ర ప్రభుత్వ విద్యా శాఖ మాజీ కార్యదర్శి (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
తస్మాత్ జాగ్రత్త! ఈ 20 యూనివర్సిటీలు నకిలీవి.. 8 రాజధానిలోనే..
న్యూఢిల్లీ: దేశంలో మరో 20 సంస్థలు విశ్వవిద్యాలయాలుగా చెలామణి అవుతున్నాయని, అవన్నీ నకిలీవని యునివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) బుధవారం ప్రకటించింది. ఈ 20 సంస్థల్లో ఎనిమిది ఢిల్లీలోనే ఉన్నట్టు పేర్కొంది. ‘‘ఉత్తరప్రదేశ్‌లో గాంధీ హిందీ విద్యాపీఠ్, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎలక్ట్రో కాంప్లెక్స్ హోమియోపతి, నేతాజీ సుభాష్‌చంద్రబోస్ (ఓపెన్) యూనివర్సిటీ, భారతీయ శిక్షా పరిషత్ అనే నాలుగు నకిలీ యూనివర్సిటీలు ఉన్నాయి. పశ్చిమబెంగాల్, ఏపీల్లో రెండేసి నకిలీ వర్సిటీలున్నాయి. కర్ణాటకలో బదగాన్వీ సర్కార్ వరల్డ్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్, కేరళలో సెయింట్ జాన్స్ వర్సిటీ, మహారాష్ట్రలో రాజా అరబిక్ యూనివర్సిటీ, పుదుచ్చెరిలో శ్రీ బోధి అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ నకిలీవే’’ అని యూజీసీ కార్యదర్శి మనీశ్ జోషి స్పష్టంచేశారు. ఢిల్లీలోని 8 నకిలీ వర్సిటీలు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అండ్ ఫిజికల్ హెల్త్ సైన్సెస్; కమర్షియల్ యూనివర్సిటీ లిమిటెడ్, దరియాగంజ్; యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ ఒకేషనల్ యూనివర్సిటీ; ఏడీఆర్–సెంట్రిక్ జ్యుడీషియల్ యూనివర్సిటీ; ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ అండ్ ఇంజనీరింగ్; విశ్వకర్మ ఓపెన్ యూనివర్సిటీ ఫర్ సెల్ఫ్–ఎంప్లాయిమెంట్; ఆధ్యాత్మిక్ విశ్వవిద్యాలయ. -
ఇక స్థానిక భాషల్లోనే ఉన్నత విద్య
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యలో ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యతనివ్వాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిర్ణయించింది. ఈ ప్రక్రియను వేగంగా ముందుకు తీసు కెళ్ళేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా రాష్ట్రాల పరిధి లోని ఉన్నత విద్య పాఠ్య పుస్తకాలను ప్రాంతీయ భాషల్లో తర్జుమా చేయాలని రాష్ట్రాల ఉన్నత విద్యా మండళ్ళకు సూచించింది. జాతీయ విద్యా విధానం–2020లో భాగంగా ఈ నిర్ణ యం తీసుకున్నట్టు పేర్కొంది. కీలక మైన ఉన్నత విద్య లో ప్రమాణాలు మెరుగవ్వాలంటే, బోధన, పాఠ్య పుస్తకాలు స్థానిక భాషల్లోనే ఉండాలని కేంద్రం జరిపిన అధ్యయ నాల్లో వెల్లడైంది. దీనివల్ల సబ్జెక్టుపై విద్యా ర్థులకు పట్టు లభిస్తుందని, పలితంగా విద్యార్థి ఉన్నత విద్యను పూర్తి చేసేలోగా మార్కెట్ అవసరాలకు అనువైన నైపుణ్యాన్ని సంపాదిస్తాడని ఎన్ఈపీ–2020లో పేర్కొన్నారు. దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ముందుగా పాఠ్య పుస్తకాలను స్థానిక భాషల్లో తర్జుమా చేయా లని భావించారు. దీనికోసం అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీ) ఆర్టిఫీషి యల్ ఇంటిలిజెన్స్ టెక్నాలజీ ఆధారంగా ‘అనువాదిని’ అనే ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. దీన్ని అన్ని రాష్ట్రాలూ ఉపయోగించుకుని డిగ్రీ, ఇంజనీరింగ్‌తో పాటు అన్ని రకాల ఉన్నత విద్య పాఠ్యపుస్తకాలను ఆయా రాష్ట్రాల మాతృభాషల్లో తర్జుమా చేయాలని సూచించింది. అయితే, ఇంగ్లిష్, స్థానిక భాషను ఎంచుకోవడం విద్యార్థి ఐచ్ఛికమే. తెలుగు మీడియం ఉంటే ప్రత్యేక తరగతి బోధన చేపట్టాల్సి ఉంటుంది. ఈ క్రమంలో పాఠ్యపుస్తకాల తర్జుమాకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంటూ యూజీసీ మార్గదర్శకాలు విడుదల చేసింది. డిగ్రీలో మొదలైంది... ఇంజనీరింగ్‌పై త్వరలో నిర్ణయం ఎన్ఈపీ–2020లో భాగంగా స్థానిక భాషల్లో పుస్తకాల ప్రచురణపై తెలంగాణ ఉన్నత విద్యా మండలి దృష్టి పెట్టింది. తెలుగు అకాడమి ద్వారా పుస్తకాల తర్జుమా చేయిస్తున్నాం. సాంకే తిక విద్యకు సంబంధించిన పుస్తకాలపై త్వరలో ఉన్నత స్థాయి సమీక్ష జరిపి, నిర్ణయం తీసుకుంటాం. – ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి (ఉన్నత విద్యామండలి చైర్మన్) ప్రత్యేక బోధకులుండేలా చూడాలి.. స్థానిక భాషలో బోధన అంశాన్ని ముందుకు తెచ్చేటప్పుడు కాలేజీల్లో బోధకుల సంఖ్య పెంచాలి. ఇంగ్లిష్, తెలుగు మీడియాలను వేర్వేరుగా బోధించడం ఒకే అధ్యాపకుడికి సాధ్యం కాదు. దాని వల్ల ప్రతికూల ఫలితాలు వస్తాయి. – డాక్టర్ వి బాలకృష్ణ, సాంకేతిక, వృత్తి విద్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు) -
వాటిల్లో కుల వివక్ష తీవ్రమైన అంశం
న్యూఢిల్లీ: ఉన్నత విద్యా సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులపై కుల వివక్షను ప్రదర్శించడం అత్యంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అంశమని సుప్రీం కోర్టు పేర్కొంది. కుల వివక్షను రూపుమాపడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో , ఏయే చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారో తెలపాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)ని ఆదేశించింది. కులపరమైన వివక్షను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారన్న ఆరోపణలు వచ్చిన హైదరాబాద్‌కు చెందిన రోహిత్ వేముల, ముంబైకు చెందిన పాయల్ తాడ్విల తల్లులు దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ ఎ.ఎస్. బొపన్న, ఎంఎం. సంద్రేశ్లతో కూడిన సుప్రీం డివిజన్ బెంచ్ గురువారం విచారించింది. ఉన్నత విద్యా సంస్థల్లో కుల వివక్షపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు ఈ వివక్షను పారద్రోలడానికి చేపట్టిన చర్యలేంటో వెల్లడించాలని యూజీసీకి ఆదేశాలు జారీ చేసింది. ‘‘ఇది తీవ్రమైన అంశం. వారి ఆందోళల్ని మీరు ఎలా చూస్తున్నారు ? కులవివక్షకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు చేపట్టారు ? ఈ సమస్య పరిష్కారానికి యూజీసీ నిర్దిష్టమైన చర్యలు చేపట్టాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు వారి తల్లిదండ్రుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని చర్యలు తీసుకోవాలి. ఈ తరహా ఘటనలు భవిష్యత్తులో జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలి’ కోర్టు∙యూజీసీ తరఫు∙లాయర్‌కు చెప్పింది. రోహిత్ వేముల, తాడ్వి తల్లుల తరఫున వాదించిన సీనియర్ అడ్వకేట్ ఇందిర కొడుకు, కూతురిని పోగొట్టుకున్న వారి మనోవేదన తీర్చలేదని అన్నారు. వీరిద్దరే కాకుండా గత ఏడాది కాలంలో మరో ముగ్గురు విద్యార్థులు ఉన్నత విద్యా సంస్థల్లో కులవివక్షను తట్టుకోలేక నిండు ప్రాణాలను బలి తీసుకున్నారని సుప్రీం దృష్టికి తీసుకువెళ్లారు. -
ఒకే విద్యా విధానం.. మార్కుల స్థానంలో క్రెడిట్స్.. ఏమిటిది?
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయిలో ఒకే విద్యా విధానం ఉండాలన్న ఆలోచనకు అనుగుణంగా జాతీయ క్రెడిట్ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించామని యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (యూజీసీ) చైర్మన్ ప్రొఫెసర్ జగదీష్‌కుమార్ స్పష్టం చేశారు. జాతీయ విద్యావిధానం–2020కి అనుగుణంగా పాఠశాల విద్య నుంచే క్రెడిట్స్ ఇవ్వడం దీని ఉద్దేశమని చెప్పారు. నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్ వర్క్ (ఎన్సీఆర్ఎఫ్)ను యూజీసీ సోమవారం విడుదల చేసింది. దీనిపై వస్తున్న సందేహాలపై యూజీసీ ఛైర్మన్ సమగ్ర వివరణ ఇచ్చారు. అంతర్జాతీయ స్థాయిలోనూ ఏకీకృత విధానాన్ని అనుసరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఏమిటీ ఎన్సీఆర్ఎఫ్? విద్యావిధానానికి జాతీయ స్థాయి గుర్తింపు ఇవ్వడం దీని ఉద్దేశం. దీనికోసం సమీకృత క్రెడిట్ విధానాన్ని అన్ని విద్యా సంస్థలు అనుసరిస్తాయి. పాఠశాల, ఉన్నత విద్య, ఒకేషనల్, స్కిల్ ఎడ్యుకేషన్.. ఏదైనా మార్కులతో పనిలేకుండా క్రెడిట్స్గానే పరిగణిస్తారు. దీనికోసం జాతీయ స్థాయిలో పాఠశాల, ఉన్నత విద్య, నైపుణ్య విద్యలకు ప్రత్యేక క్రెడిట్ విధానంతో మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసింది. క్రెడిట్ విధానం అంటే..? వివిధ స్థాయిల్లో మార్కుల స్థానంలో క్రెడిట్స్ ఇస్తారు. ఒక విద్యార్థి సంవత్సరంలో రెండు సెమిస్టర్లలో 30 గంటల బోధన (ఏదైనా సబ్జెక్టులో) తరగతులకు హాజరవ్వాలి. ప్రతీ సెమిస్టర్‌కు 20 క్రెడిట్స్ ఉంటాయి. ఏడాదికి 40 క్రెడిట్స్ వస్తాయి. అన్ని సబ్జెక్టులు కలిపి 1200 గంటల బోధన సమయంలో విద్యార్థి 40 క్రెడిట్స్ పొందే వీలుంటుంది. విద్యార్థి 5వ తరగతి పూర్తి చేసిన తర్వాత దీన్ని లెవర్–1గా భావిస్తారు. 6–8 తరగతులు పూర్తి చేస్తే లెవల్–2, తర్వాత 9, 10 తరగతులు పూర్తి చేస్తే లెవల్–3గా, 11, 12 పూర్తి చేస్తే లెవల్–4గా గుర్తిస్తారు. స్కూల్ విద్య మొత్తంగా 160 క్రెడిట్స్ ఉంటాయి. మూడేళ్ళ బ్యాచిలర్ డిగ్రీలో ప్రతి సంవత్సరం 40 క్రెడిట్స్ చొప్పున మొత్తం 120 క్రెడిట్స్ ఉంటాయి. నాలుగేళ్ళ డిగ్రీని 6.5 లెవల్‌గా, మూడేళ్ళ డిగ్రీ తర్వాత మాస్టర్ డిగ్రీని లెవల్ 7గా, నాలుగేళ్ళ ఇంజనీరింగ్ డిగ్రీ, పీహెచ్‌డీని కలిపి 8 లెవల్‌గా చూస్తారు. పీహెచ్డీ పూర్తిచేసిన విద్యారి్థకి మొత్తం 320 క్రెడిట్స్ ఇస్తారు. ఒకేషనల్, స్కిల్ ఎడ్యుకేషన్‌కు కూడా వివిధ స్థాయిలో (4.5 నుంచి 8 లెవల్స్) క్రెడిట్స్ ఉంటాయి. క్రెడిట్స్ నిల్వ ఇలా... ప్రతీ లెవల్లో విద్యార్థి సాధించిన క్రెడిట్స్ అన్నీ అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ (ఎబీసీ) టెక్నాలజీ ప్లాట్‌ఫాంలో నిక్షిప్తమై ఉంటాయి. ప్రతి విద్యా సంస్థ ఈ ప్లాట్‌ఫాం కిందకు వస్తుంది. క్రెడిట్స్ ఆధారంగానే విద్యార్థి స్థాయిని ఎన్సీఆర్ఎఫ్ నిర్ణయిస్తుంది. ఉదాహరణకు టెన్త్ తర్వాత ఐటీఐ పాస్ అయిన విద్యార్థి అదనంగా లాంగ్వేజ్ కోర్సు చేస్తే ఇది 12వ క్లాసుకు సమానం అవుతుంది. అతను యూనివర్సిటీలో చేరేందుకు వీలు కల్పిస్తుంది. అదే విధంగా 5వ స్థాయి విద్యార్థి బ్రిడ్జ్ కోర్సులు అదనంగా చేస్తే అదనపు క్రెడిట్స్ వస్తాయి. అతను నేరుగా 8వ క్లాసు పరీక్షకు హాజరవ్వొచ్చు. విద్యార్థి ఆన్లైన్ కోర్సులు చేసినా ఆ క్రెడిట్స్‌ను కూడా లెక్కలోకి తీసుకుంటారు. క్రెడిట్స్‌ను లెక్కగట్టడానికి ప్రత్యేక మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసింది. ఇవి అకడమిక్, స్కిల్, అనుభవం ద్వారా పొందే విద్యను బట్టి ఉంటాయి. ఇవి కూడా క్రెడిట్సే.. అకడమిక్ విద్యే కాదు... క్రీడలు, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్, మ్యూజిక్, హెరిటేజ్, ట్రెడిషనల్ స్కిల్స్, ఫైన్ ఆర్ట్స్ వంటి ప్రత్యేక కళలకూ క్రెడిట్స్ ఇస్తారు. ఇవి కూడా క్రెడిట్ బ్యాంకులో చేరతాయి. క్రెడిట్ సిస్టమ్‌ను ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో అనుసరిస్తున్నారు. కొన్ని క్రెడిట్స్‌ను అన్‌స్కిల్డ్, కొన్ని క్రెడిట్స్‌ను స్కిల్ అని అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగానే మన దేశమూ అంతర్జాతీయ స్థాయిలో క్రెడిట్ విధానం ఇచ్చేందుకు ప్రయతి్నస్తోంది. -
ఉన్నత విద్యలో ‘షేరింగ్’
సాక్షి, అమరావతి: సెంట్రల్ వర్సిటీలు సహా దేశంలోని అన్ని ఉన్నత విద్యాసంస్థల్లోని వనరులను సద్వినియోగం చేయడం, సమీపంలోని ఇతర ఉన్నత విద్యాసంస్థలు కూడా వాటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడానికి వీలుగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ‘షేరింగ్’ విధానానికి శ్రీకారం చుట్టింది. వివిధ సదుపాయాలతో పాటు అత్యున్నత ప్రమాణాలతో కూడిన బోధన ఇతర అంశాల్లో విద్యా సంస్థల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణికి తెరతీసింది. నాలెడ్జ్ షేరింగ్, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్కి వీలుగా టెక్నాలజీని, ఇతర వనరులను ఆయా సంస్థలు ఉమ్మడిగా వినియోగించుకునేందుకు ఈ విధానం దోహదపడనుంది. సెంట్రల్ వర్సిటీలు సహా అన్ని ఉన్నత విద్యా సంస్థలకు యూజీసీ ఆదేశాలిచ్చింది. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్–గ్రాడ్యుయేట్ కోర్సులతో పాటు పరిశోధన కోర్సుల్లోనూ దీన్ని అమలుచేయాలని సూచించింది. వనరులు లేని విద్యాసంస్థలు వాటిని ఏర్పాటు చేసుకునేందుకు అదనపు పెట్టుబడి పెట్టాల్సిన అవసరంలేకుండా దగ్గర్లోని విద్యా సంస్థల వనరులను వినియోగిస్తూ తమ విద్యార్థులను ఆయా సంస్థలు తీర్చిదిద్దడానికి ఈ విధానంతో వీలుపడుతుంది. రెట్టింపు ఫలితాలు ఈ విధానంవల్ల రెట్టింపు ఫలితాలు వస్తాయని యూజీసీ భావిస్తోంది. అకడమిక్ అంశాలు సహా ఏదైనా అభివృద్ధి కార్యకలాపాలను సమగ్రంగా అమలుచేయాలంటే అదనపు సదుపాయాలు అవసరమవుతుంటాయి. ఇందుకోసం ఆయా సంస్థలు అదనపు పెట్టుబడి పెట్టాలి. అలా కాకుండా.. ఇప్పటికే ఉన్న వనరులను సమర్థంగా ఉపయోగించడంవల్ల రెట్టింపు ఫలితాలు వస్తాయి. ఉన్నత విద్యాసంస్థలు పరస్పర సహకారంతో విద్యాపరమైన మౌలిక వనరులను పంచుకోవడం వల్ల విద్యార్థులకు సమానమైన విద్య అందుతుంది. ప్రస్తుతం ల్యాబ్‌లు, లైబ్రరీలు, ఇతర వనరులున్న సంస్థల్లో చదివే వారికి ఆ వనరుల ద్వారా ఉత్తమ బోధన లభిస్తుంది. కానీ, అలాంటివిలేని సంస్థల విద్యార్థులకు ఉన్నత బోధన దూరమవుతోంది. వనరులను పంచుకునేలా ఆయా సంస్థల మధ్య జరిగేఒప్పందాలతో విద్యార్థులందరికీ మేలు చేకూరుతుంది. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్–గ్రాడ్యుయేట్, పీహెచ్డీ కోర్సులన్నిటికీ ఈ విధానాన్ని అమలుచేయాలని యూజీసీ సూచించింది. ఆయా విద్యాసంస్థలన్నీ తమ సంస్థలోని తరగతి గదులు, ల్యాబ్‌లు ఇతర వనరుల సమాచారాన్ని సమీపంలోని ఇతర ఉన్నత విద్యాసంస్థలన్నిటికీ తెలిసేలా వెబ్సైట్ ద్వారా తక్షణమే అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. వీటిని వినియోగించుకోవాలనుకునే ఇతర ఉన్నత విద్యా సంస్థల నుంచి నిర్దిష్ట వనరులకు సాధారణ కనీస ఛార్జీలు నిర్ణయించి వసూలుచేయవచ్చని సూచించింది. ఆ కనీస ఛార్జీల వివరాలూ అందుబాటులో ఉంచాలని పేర్కొంది. సంస్థల మధ్య ఒప్పందాలు ఇక ఉన్నత విద్యా సంస్థల్లోని వనరులను పరస్పర భాగస్వామ్యంతో వినియోగించుకునేందుకు వీలుగా ఆయా సంస్థలు ఎంఓయూ కుదుర్చుకోవాలని యూజీసీ పేర్కొంది. ఏ సమయంలో ఏ సంస్థ విద్యార్థులు వనరులు వినియోగించుకోవాలో సమగ్ర టైమ్‌టేబుల్‌ను రూపొందించి ఆ ప్రకారం కార్యక్రమాలకు కమిటీలను ఏర్పాటుచేసుకోవాల్సి ఉంటుంది. తరగతి గదులు, ల్యాబ్‌లు, ఇతర వనరులు పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా సంస్థలు చర్యలు చేపట్టాలని, ఏ ఒక్క తరగతి ఖాళీగా ఉండకుండా చూసుకోవాలని యూజీసీ సూచించింది. ఈ విధానంతో విద్యార్థులకు మేలు.. తరగతి గదులు, మౌలిక సదుపాయాలు పంచుకోవడం ద్వారా విద్యార్థులకు మేలు చేకూరుతుంది. క్రీడా మైదానాలు, స్టేడియం, సమావేశ మందిరాలను కూడా అవసరాలను అనుసరించి పంచుకోవచ్చు. సైన్సేతర అంశాలకు సంబంధించిన వనరుల విషయంలో కూడా సంస్థలు పూర్తిస్థాయిలో తమ వద్ద ఉన్న అన్ని సదుపాయాలను ఇతర సంస్థలకు అందుబాటులో ఉంచాలని యూజీసీ పేర్కొంది. పరికరాలు దెబ్బతినే విషయంలోనూ వాటిని తిరిగి ఏర్పాటుచేయడంపైనా ఒప్పందంలో పేర్కొనాలి. అకడమిక్ అంశాలకు సంబంధించి ఆన్లైన్ లెక్చర్లు, వీడియోలు, లెర్నింగ్ మెటీరియల్‌లు, లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ లలోనూ ఇచ్చిపుచ్చుకోవచ్చు. విద్యార్థుల నమోదు ప్రక్రియ మొత్తం ముందుగా ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్ ద్వారా పూర్తిచేయాలి. ఉపాధ్యాయుల శిక్షణ, ఫ్యాకల్టీ అభివృద్ధి కార్యక్రమాలు కూడా నిర్వహించవచ్చు. ఖర్చులపై ముందుగానే ప్రణాళిక వనరులను పంచుకోవడానికి ముందు వ్యయ విశ్లేషణ, ఖర్చును నిర్ణయించే పద్ధతులపై ప్రణాళిక రూపొందించుకోవాలి. లాభనష్టాలకు తావులేని రీతిలో వనరుల వినియోగంపై ఛార్జీలు వసూలుచేయాలి. ప్రయోగాల వినియోగం ఆధారంగా, నిర్వహణ వ్యయం ప్రకారం పరికరాలు ఛార్జీలు నిర్ణయించాలి. ఉన్నత విద్యాసంస్థల మధ్యే కాకుండా కాలేజీలు, పరిశ్రమల మధ్య కూడా ఒప్పందాలు చేసుకోవాలని యూజీసీ సూచించింది. -
ఇక ఎంసీఏ రెండేళ్లే...కొత్త డిగ్రీ కోర్సులకు శ్రీకారం
సాక్షి, అమరావతి: దేశంలో కొత్తగా కొన్ని డిగ్రీ కోర్సులకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ శ్రీకారం చుట్టింది. కొన్ని ప్రోగ్రామ్‌ల కోర్సు వ్యవధిని సవరించింది. అలాగే వివిధ డిగ్రీ ప్రోగ్రామ్‌ల అర్హతల్లో మార్పులు చేసింది. ఇందుకు సంబంధించి నూతన విధివిధానాలు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీన్ని www.ugc.ac.in లో పొందుపరిచింది. ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థుల కోసం.. ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థుల కోసం ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, డిజైన్ విభాగాల్లో తొమ్మిది కొత్త కోర్సులను యూజీసీ ప్రకటించింది. ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణుల కోసం బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, బ్యాచిలర్ ఆఫ్ అర్బన్ డిజైన్ (వ్యవధి: నాలుగేళ్లు), బ్యాచిలర్ ఆఫ్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్, బ్యాచిలర్ ఆఫ్ స్పోర్ట్స్ సైన్సెస్ (వ్యవధి: మూడేళ్లు) కోర్సులను ప్రవేశపెట్టింది. ఈ డిగ్రీలు పూర్తి చేసిన వారి కోసం ఫ్యాషన్ టెక్నాలజీ, ఫ్యాషన్ మేనేజ్మెంట్, అర్బన్ డిజైన్, స్పోర్ట్స్ మేనేజ్మెంట్, స్పోర్ట్స్ సైన్స్‌లో రెండేళ్ల మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్‌లను కూడా ప్రకటించింది. ఈ కోర్సులను ఎప్పటి నుంచి అమలు చేయాలనేదాన్ని యూనివర్సిటీల ఇష్టానికి వదిలేసింది. కొత్త మార్పులు ఇలా.. యూజీసీ తాజా నోటిఫికేషన్ ప్రకారం.. ఇప్పటిదాకా మూడేళ్లుగా ఉన్న మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (ఎంసీఏ) కోర్సు వ్యవధిని రెండేళ్లకు తగ్గించారు. అలాగే బ్యాచిలర్ ఆఫ్ ఆక్యుపేషనల్ థెరపీ (బీవోటీ) కోర్సు వ్యవధిని నాలుగేళ్ల నుంచి నాలుగున్నరేళ్లకు పెంచారు. 12వ తరగతి ఉత్తీర్ణులై వైద్య రంగంలోకి రావాలనుకునే విద్యార్థుల కోసం కొత్తగా బ్యాచిలర్ ఆఫ్ సోవా రిగ్పా మెడిసిన్ అండ్ సర్జరీ (బీఎస్‌ఆర్‌ఎంఎస్) కోర్సును యూజీసీ ప్రవేశపెడుతోంది. ఈ కోర్సు కాలవ్యవధి.. ఐదున్నరేళ్లు. మెడిసిన్, సర్జరీ, ఆయుర్వేద, యునాని, హోమియోపతి, హెల్త్ అనుబంధ సైన్సెస్, ఫార్మసీ, పారామెడికల్, నర్సింగ్ తదితర విభాగాల్లో ఈ బీఎస్‌ఆర్‌ఎంఎస్ కోర్సును అందిస్తారు. (చదవండి: ఏపీ పథకాలు బాగున్నాయ్..) -
పరిశోధనా? ఉపరితల శోధనా?
కార్యకారణాలేమైనా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఇన్నాళ్ళకు కళ్ళు తెరిచినట్టుంది. కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో పాఠాలు చెప్పేందుకు ఆయా రంగాల నిపుణులను వినియోగించుకోవాలని నిర్ణయించడం మంచిదే. ఎంత అనుభవం, నైపుణ్యం ఉన్నా – పీహెచ్డీ పట్టా కానీ, జాతీయ అర్హతా పరీక్ష (నెట్)లో కృతార్థులై కానీ ఉంటే తప్ప అధ్యాపకులుగా పనిచేయడానికి వీలు లేదన్న షరతుకు వెసులుబాటు లభించింది. సివిల్ సర్వీసులలో లాగా కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఫుల్‌టైమ్, పార్ట్‌టైమ్ ఆచార్య పదవుల్లోకి లేటరల్ ఎంట్రీ వచ్చినట్టయింది. ఈ కొత్త విధానంతో పాటు, కొంతకాలంగా ఉద్యోగానికీ – పీహెచ్‌డీకీ ముడిపెట్టిన ప్రహసనంపై ఇప్పుడు చర్చ రేగింది. నిజానికి డాక్టోరల్ థీసిస్ (పీహెచ్డీ) అనేది నిర్ణీత అంశాన్ని లోతుగా తెలుసుకోవాలనే ఆసక్తితో, మనసు పెట్టి చేయాల్సిన పని. ఉద్యోగార్హత కోసం చేసే మొక్కుబడి వ్యవహారం కాదు. అలాగే, నాణ్యమైన బోధన చేయాలంటే పీహెచ్డీ చేసి తీరాలని అనుకోవడం బోడిగుండుకూ, మోకాలికీ ముడిపెట్టడమే! అద్భుతంగా పాఠం చెప్పగలిగినవాళ్ళందరూ పరిశోధకులై ఉంటారనుకున్నా, ఉత్తమ పరిశోధకులైనంత మాత్రాన అర్థమయ్యేలా పాఠం చెప్పే నేర్పు ఉంటుందనుకున్నా పొరపాటు. విధాన నిర్ణేతలు ఈ చిన్న తర్కం మర్చిపోయారు. పీహెచ్డీ చేయకున్నా, దాదాపు 40 గౌరవ డాక్టరేట్లొచ్చిన అబ్దుల్ కలామ్ ఎంత అద్భుత బోధకులో గుర్తు చేసుకోవాలి. అధ్యాపకులుగా ఎంపిక కావాలన్నా, ఇప్పటికే అధ్యాపక వృత్తిలో ఉన్నవారు ఆ పనిలోనే కొనసాగాలన్నా పీహెచ్డీ చేసి తీరాల్సిందే అని కొన్నేళ్ళ క్రితం పెట్టిన నిబంధన నిర్హేతుకమనేది అందుకే! ఒకప్పుడు ఉద్యోగానికి పీహెచ్డీ తప్పనిసరి కాదు. 2021 జూలై నుంచి యూనివర్సిటీ బోధనకు పీహెచ్డీ తప్పనిసరి చేసింది యూజీసీ. కరోనాతో తేదీని 2023 వరకు పొడిగించారు. కానీ, ఉన్నత విద్యాబోధనలో ఉండాలంటే పీహెచ్డీ సాధించాల్సిందేనని మెడ మీద కత్తి పెడితే ప్రయోజనం ఉంటుందా? ఒకప్పుడు డాక్టరేట్ అంటే అదో విశిష్ట సాధన. గౌరవ డాక్టరేట్లు, కష్టపడి పరిశోధన చేసి పీహెచ్డీ పట్టాతో పేరు ముందు వచ్చే డాక్టర్ అనే మూడక్షరాలు సమాజంలో విశేష గౌరవం. ఆ మోజు పెరిగేసరికి పేరు లేని విదేశీ సంస్థల మొదలు ప్రైవేట్ విద్యా లయాల దాకా అనేకుల గౌరవ డాక్టరేట్లు ఇవాళ అంగడి సరుకయ్యాయి. గౌరవ డాక్టరేట్లను పేరు ముందు ఇంటి పేరులా వాడరాదన్నది విస్మరించిన వేళ అసలు డాక్టరేట్కే గౌరవం లేకుండా పోయే ప్రమాదం వచ్చింది. 1920లలో మన దగ్గర కొన్ని డజన్ల మందే పీహెచ్డీ స్కాలర్లుండేవారు. ఇవాళ అమెరికాలో ఏటా 64 వేలకు పైగా డాక్టరేట్లు వస్తుంటే, 24 వేల మంది పీహెచ్డీ స్కాలర్లతో మనం ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉన్నాం. 2010తో పోలిస్తే 2017లో పీహెచ్‌డీలో చేరేవారి సంఖ్య రెట్టింపు దాటింది. 2000 నాటికి దేశంలో డాక్టరేట్ ప్రదానం చేసే సంస్థలు 326. కానీ, 2017 కల్లా వాటి సంఖ్య 912 అయిందంటే పీహెచ్డీ ఎంత వేలంవెర్రిగా మారిందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి, నిరంతర అధ్యయనం, క్షేత్రస్థాయి పర్యటనలు, ప్రొఫెసర్ల మార్గదర్శనం, విశ్వవిద్యాలయాల్లో పరిశోధన పత్రాల సమర్పణ – అంతా ఒక సీరియస్ జ్ఞానార్జన. కానీ, ఇవాళ పరిశోధకులకే కాదు... వారికి దిశా నిర్దేశ విధుల్లో ఉన్న చాలామందిలోనూ విషయ పరిజ్ఞానం హుళక్కి. ఇప్పటికే పలు విశ్వవిద్యాలయ శాఖలు పీహెచ్డీ స్కాలర్లను టోకున బయటకు పంపే కర్మాగారాలయ్యాయి. అనేకచోట్ల అజ్ఞాత రచయితల సహకారం, గ్రంథ చౌర్యం, నాసిరకం పరిశోధనాంశాలు, పత్రాలతో ప్రమాణాలు నానాటికీ తీసికట్టు అయ్యాయి. నాలుగు వాక్యాలు రాయలేనివాళ్ళు, నాలుగు మాటలు సదస్సులో మాట్లాడలేనివాళ్ళూ నేడు పీహెచ్డీ పట్టాదారుల్లో ఉంటున్నారన్నది నిష్ఠురమైన నిజం. ఉద్యోగానికీ, ఉద్యమంగా చేయాల్సిన పరిశోధనకూ లింకు పెట్టడం మన విధాన నిర్ణేతల ఘోర తప్పిదం. దానివల్లే పీహెచ్డీ ప్రవేశాలు 50 శాతం పెరిగాయి. ప్రమాణాలు పాతాళానికి చేరాయి. కనీసం మూడు నుంచి అయిదేళ్ళ కఠోర శ్రమతో తపించి చేయాల్సిన పరిశోధనపై తపన లేనివాళ్ళు కూడా ఉద్యోగం కోసం వట్టి ఉపరితల శోధకులవుతున్న దౌర్భాగ్యం. ఆర్ట్స్ మొదలు సైన్స్ దాకా అనేకచోట్ల ఇదే పరిస్థితి. ఏటా 60 లక్షల మంది గ్రాడ్యుయేట్లు, 15 లక్షల మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు వస్తున్న దేశంలో నిఖార్సయిన పరిశోధక విద్యార్థుల శాతం ప్రశ్నార్థకమే. విశ్లేషణాత్మక శోధన, వర్తమాన ప్రాసంగికత లోపించి, పునరుక్తులతో, సర్వే ఆధారిత సిద్ధాంతాలుగా తూతూ మంత్రపు ఉపరిశోధనలు పెరిగిపోయాయని తాజా నివేదికల మాట. వెరసి, జ్ఞానార్జనలో సరికొత్త అంశాలు వెలికి తీయాల్సిన పరిశోధన మౌలిక లక్ష్యం, లక్షణం నిర్వీర్యమైపోతున్నాయి. మౌలిక పరిశోధన మృగ్యమై, ఎంతసేపటికీ చూచిరాతలు, ఎత్తిపోతలతోనే వివిధ శాఖల్లో పీహెచ్డీ సిద్ధాంత గ్రంథాలు సిద్ధమవుతున్నట్టు ఆరోపణ. గ్రంథ చౌర్యాన్ని కనిపెట్టే సాఫ్ట్‌వేర్‌ను కొన్నేళ్ళ క్రితం ప్రవేశపెట్టారు. కానీ, ఆ ఒక్క పనితో పీహెచ్‌డీల నాణ్యత పెరుగుతుందా? చిత్తశుద్ధి లేని పీహెచ్‌డీతో నిర్ణీత విద్యాశాఖకు కలిగే ప్రయోజనం ఏమిటి? అలాంటి వారు బోధకులైతే విద్యా ర్థులకు వచ్చిపడే విజ్ఞానం ఏముంటుంది? ఇప్పటికైనా నిష్ప్రయోజనమైన ఈ డిగ్రీల తంతును వదిలించుకొని, నిఖార్సయిన పరిశోధనలను యూజీసీ, మానవ వనరుల అభివృద్ధిశాఖ ప్రోత్సహిస్తే మేలు. ప్రహసనప్రాయంగా మారిన ‘నెట్’ లాంటి వాటి పైనా పునఃసమీక్ష అవసరం. పీహెచ్డీ లేకున్నా, అనుభవజ్ఞులైన వారి సేవలు తీసుకోవాలన్న తాజా నిర్ణయం అందుకే స్వాగతనీయం. -
యూజీసీ చైర్మన్‌గా తెలుగు తేజం జగదీశ్
న్యూఢిల్లీ/సాక్షి, నల్లగొండ: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ)గా ప్రొఫెసర్ మామిడాల జగదీశ్‌కుమార్ నియమితులయ్యారు. ఐదేళ్లపాటు ఈ పదవిలో ఆయన కొనసాగనున్నారు. కమిషన్‌కు ఛైర్మన్‌గా పనిచేసిన ప్రొఫెసర్ డిపి సింగ్ పదవీకాలం ముగియడంతో డిసెంబర్ 7న పదవీ విరమణ చేశారు. అప్పటినుంచి ఖాళీగా ఉన్న పోస్టుకు ప్రకటన ఇవ్వడంతో, 55 మంది దరఖాస్తు చేసుకోగా జగదీశ్ ఎంపికయ్యారు. యూజీసీకి చైర్మన్‌గా నియమితులైన మూడో తెలుగు వ్యక్తి జగదీశ్ కుమార్. 1961లో డాక్టర్ వాసిరెడ్డి శ్రీకృష్ణ, 1991 నుంచి 1995 వరకు జి.రామిరెడ్డి యూజీసీ చైర్మన్లుగా పనిచేయగా, ఇప్పుడు ప్రొఫెసర్ జగదీశ్ కుమార్ నియమితులయ్యారు. 60 ఏళ్ల జగదీశ్ కుమార్ ప్రస్తుతం జేఎన్‌యూ వైస్‌చాన్స్‌లర్‌గా పనిచేస్తున్నారు. వీసీగా పదవీకాలం గతేడాదే ముగిసినా ఆయనను కొనసాగించారు. జేఎన్‌యూలో ఆయన వీసీగా ఉన్నప్పుడు 2016లో విద్యార్థులపై దేశద్రోహం కేసులు నమోదు కావడం, అఫ్జల్ గురు ఉరికి వ్యతిరేకంగా విద్యార్థులు నిర్వహించదలిచిన కార్యక్రమాన్ని వీసీ వద్దనడం, విద్యార్థులు వీసీ కార్యాలయాలనికి తాళాలేయడం, 2019లో జరిగిన స్నాతకోత్సవ వేదికపై దాదాపు ఆరు గంటలపాటు మానవవనరుల శాఖ మంత్రిని నిర్బంధించడం వంటి అనేక వివాదాస్పద సంఘటనలు జరిగాయి. నల్లగొండ వాసి... తెలుగువాడైన జగదీశ్ కుమార్ స్వస్థలం నల్లగొండ జిల్లా తిప్పర్తిమండలం మామిడాల గ్రామం. పాఠశాల విద్యను స్వగ్రామంలో, ఏడవ తరగతి నుంచి ఇంటర్ వరకు మిర్యాలగూడలో చదివారు. డిగ్రీతో పాటు ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ హైదరాబాద్‌లో చదివారు. ఆ తరువాత ఐఐటీ మద్రాసులో ఎంఎస్, పీహెచ్డీ పూర్తి చేశారు. ఆ తరువాత పోస్ట్ డాక్టో్టరల్ రీసెర్చ్ కోసం కెనడా వెళ్లి 1994లో స్వదేశానికి తిరిగి వచ్చారు. 1995లో ఢిల్లీ ఐఐటీ ప్రొఫెసర్‌గా ఉద్యోగంలో చేరారు. 2013లో ఐఐటీ ఢిల్లీ నుంచి ‘అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ టీచింగ్’ అందుకున్నారు. ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్‌లో నిష్ణాతుడైన ఆయన 2016 ఢిల్లీ జేఎన్‌యూ వైస్ చాన్స్‌లర్‌గా నియమితులయ్యారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ సాంçస్కృతిక మంత్రిత్వ శాఖలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియమ్స్ పాలకమండలి చైర్మన్‌గా, నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా, యూజీసీ, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) సభ్యునిగా ఉన్నారు. ఇండియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్, ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీర్స్ ఫెలో అందుకున్నారు. సెమీకండక్టర్ డివైజ్ డిజైన్, మోడలింగ్ రంగంలో విశేష కృషికి గాను ఆయనకు 29వ ఐఈటీఈ రామ్‌లాల్ వాధ్వా గోల్డ్ మెడల్ లభించింది. భారతదేశ ఎలక్ట్రానిక్స్ – సెమీకండక్టర్ అసోసియేషన్ అందించే మొట్టమొదటి ఐఎస్ఏ అండ్ వీఎస్‌ఐ టెక్నోమెంటర్ అవార్డును కూడా అందుకున్నారు. ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా 2008 ఐబీఎం ఫ్యాకల్టీ అవార్డును పొందారు. నూతన బాధ్యతలు చాలెంజింగ్‌గా ఉంటాయని భావిస్తున్నా. నూతన జాతీయ విద్యా విధానం ఎంత తొందరగా అమల్లోకి వస్తే దేశానికి అంత మేలు జరుగుతుంది. ఇదే విషయమై త్వరలో అన్ని విశ్వవిద్యాలయాల వీసీలతో సమావేశమవుతాను. మల్టీడిసిప్లినరీ కోర్సుల విషయమై చర్చిస్తాం. ప్రభుత్వం ఇటీవలే బడ్జెట్లో డిజిటల్ యూనివర్సిటీని ప్రకటించింది. విద్యను మరింత సులభతరం చేసే డిజిటల్ సాంకేతికత కూడా ప్రాధాన్య జాబితాలో ఉంటుంది. -
నవంబర్ 1 నుంచి డిగ్రీ తరగతులు
సాక్షి, హైదరాబాద్ : సంప్రదాయ డిగ్రీ కోర్సులు, ఇంజనీరింగ్ వంటి వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల ప్రథమ సంవత్సర మొదటి సెమిస్టర్ తరగతులను నవంబర్ ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలోనూ ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. దేశవ్యాప్తంగా డిగ్రీ, పీజీ తరగతులను అదే రోజు నుంచి ప్రారంభించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్రంలోనూ అదే విధానాన్ని అనుసరించేందుకు చర్యలు చేపట్టా లనుకుంటోంది. ఇందులో భాగంగా డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ వంటి కోర్సుల ప్రవేశాలను వచ్చే నెల 31లోగా పూర్తి చేసేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టింది. అందుకు అనుగుణంగా ఈ నెల 21న డిగ్రీ మొదటి దశ సీట్ల కేటాయింపును ప్రకటించింది. రెండు, మూడు దశల కౌన్సెలింగ్‌ను కూడా వచ్చే నెల 10లోగా నిర్వహించి 15వ తేదీలోగా విద్యార్థులంతా కాలేజీల్లో చేరేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ నెల 9, 10, 11, 14 తేదీల్లో ఇంజనీరింగ్ ఎంసెట్ పరీక్షలను నిర్వహించిన ప్రభుత్వం... ఫలితాలను ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అలాగే ఈ నెల 28, 29 తేదీల్లో అగ్రికల్చర్ ఎంసెట్‌ను నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. అవి పూర్తయి, ఫలితాలు ప్రకటించగానే ప్రవేశాల కౌన్సెలింగ్‌ను నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పీజీ ఇంజనీరింగ్, ఫార్మసీ వంటి 19 రకాల పీజీ కోర్సులకూ ఈ నెల 21 నుంచి 24 నుంచి ప్రవేశపరీక్షలను నిర్వహిస్తోంది. అవి పూర్తవగానే పీజీ ప్రవేశాలను కూడా వచ్చే నెలలో చేపట్టి పూర్తి చేయనుంది. ఇప్పటికే సంప్రదాయ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. వాటికి సంబంధించిన పరీక్షల నిర్వహణను నవంబర్ 9 వరకు పూర్తి చేయాలని నిర్ణయించింది. అయితే వాటి ప్రవేశాలు కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అయితే ఇంజనీరింగ్ పీజీ ప్రవేశాలు మాత్రం పూర్తి కానున్నాయి. యూజీసీ షెడ్యూల్ ప్రకారమే రాష్ట్రంలోనూ అకడమిక్ కేలండర్‌ను అమలు చేస్తామని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. 3లోగా ఎంసెట్ ఫలితాలు! సాక్షి, హైదరాబాద్: ఈ నెల 9, 10, 11, 14 తేదీల్లో నిర్వహించిన ఇంజనీరింగ్ ఎంసెట్ ఫలితాలు వచ్చే నెల 3వ తేదీలోగా విడుదల కానున్నాయి. అందుకు అనుగుణంగా ప్రవేశాల కమిటీ కసరత్తు ప్రారంభిం చింది. వీలైతే ఈ నెల 30న ఫలితాలను విడుదల చేసే అవకాశాలనూ కమిటీ పరిశీలిస్తోంది. ఒకవేళ కుదరకపోతే వచ్చే నెల 1న లేదా 3న విడుదల చేయనుంది. ఈ నెల 28, 29 తేదీల్లో నిర్వహించే అగ్రికల్చర్ ఎంసెట్ పరీక్షల ఫలితాలను కూడా వచ్చే నెల మొదటి వారంలోనే ప్రకటించేలా ప్రవేశాల కమిటీ కసరత్తు చేస్తోంది. -
ఐఐటీలు, ఐఐఎంలపై కేంద్రం కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ : ఇటీవల నూతన విద్యా విధానాన్ని ఆవిష్కరించిన నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉన్నత విద్యా రంగంలోనూ పెనుమార్పులకు శ్రీకారం చుడుతోంది. ఐఐటీలు, ఐఐఎంలను ఆన్లైన్ విద్యా వ్యవస్ధ కిందకు తీసుకురావాలని యోచిస్తోన్న ప్రభుత్వం ఈ దిశగా యూజీసీ, ఏఐసీటీఈ నుంచి సూచనలను కోరుతోంది. విద్యార్ధులకు భౌతికంగా క్లాసులను నిర్వహించే భారాన్ని విద్యా సంస్ధలకు తగ్గించే దిశగా మొత్తం విద్యా వ్యవస్ధను ఆన్లైన్ విద్యా వ్యవస్థగా మార్చే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు సమాచారం. తొలుత ఉన్నత విద్యాసంస్ధలైన ఐఐటీలు, ఐఐఎంలను ఆన్లైన్ విద్యా వ్యవస్ధ కిందకు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి సంబంధించి బ్లూప్రింట్‌ను తయారుచేసేందుకు ఏఐసీటీఈ చీఫ్ అనిల్ సహస్రబుధే, యూజీసీ వైస్ చైర్మన్ డాక్టర్ ఎంపి పునియాల నేతృత్వంలో ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. భారత విద్యార్ధులకు నాణ్యతతో కూడిన ఆన్లైన్ విద్యను అందించేందుకు అవసరమైన డిజిటల్ వేదికను ఏర్పాటు చేసే గురుతర బాధ్యతలను ఈ ఇద్దరు దిగ్గజాలకు ప్రభుత్వం కట్టబెట్టింది. ఆన్లైన్ విద్యకు అవసరమైన పటిష్ట మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంపైనా వీరు కసరత్తు సాగిస్తారు. మరోవైపు చైనా యాప్‌లకు దీటుగా యాప్స్‌ను తయారుచేయాలని కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రి రమేష్ పోఖ్రియాల్ ఇటీవల ఐఐటీలను కోరారు. చదవండి : ఇంట్లోనే కరోనా టెస్టులు -
నా పరిస్థితి ఏమిటి?
సాక్షి, హైదరాబాద్ : క్యాంపస్ ప్లేస్మెంట్ల ద్వారా కొలువులకు ఎంపిౖకైన 14 వేల మంది ఇంజనీరింగ్ కాలేజీల ఫైనలియర్ విద్యార్థులు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తీరుతో ఉసూరు మంటున్నారు. కరోనా మహ మ్మారి విజృంభణతో ఓవైపు లక్ష లాది మంది ఉపాధి కోల్పోతున్న వేళ అందివచ్చిన ఉద్యోగాల్లో చేరేందుకు డిగ్రీ పట్టా లేకపోవ డం అడ్డంకిగా మారడంతో ఆవే దన చెందుతున్నారు. ఐఐటీ, ఎన్ఐటీ, బిట్స్ పిలానీ, డీమ్డ్ వర్సిటీల్లో చదివి క్యాంపస్ కొలువులకు ఎంపికైన బీటెక్ ఫైనలియర్ విద్యార్థులు ఇప్పటికే ఉద్యోగాల్లో చేరి పోగా యూజీసీ పరిధిలోని ఇంజ నీరింగ్ కాలేజీలకు చెందిన వేలాది మంది విద్యార్థులు మాత్రం క్యాంపస్ ప్లేస్మెంట్లు పొందినా ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నారు. డిగ్రీ సర్టిఫికెట్లు సమర్పించా లంటూ ఉద్యోగాలిచ్చిన కంపెనీలు పంపుతున్న లేఖలకు బదులివ్వలేక తలపట్టుకుంటున్నారు. యూజీసీకి ఎందుకీ మొండిపట్టు.. కరోనా విజృంభిస్తున్న తరుణంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోని ఐఐటీలు, ఎన్ఐటీలు, డీమ్డ్ వర్సిటీలు ఆన్లైన్ పరీక్షలు నిర్వహించి ఇంజనీరింగ్ ఫైనలియర్ విద్యార్థులకు సర్టిఫి కెట్లు ఇచ్చేశాయి. కొన్ని కాలేజీలు అయితే ఇంటర్నల్ మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇచ్చి విద్యా ర్థులను ప్రమోట్ చేసి పాస్ సర్టిఫికెట్లు ఇచ్చేశాయి. మరోవైపు కరోనా తీవ్రంగా ఉన్నప్పటికీ విశ్వవిద్యాలయాలు, వాటి పరిధి లోని ఇంజనీరింగ్ కాలేజీల ఫైనలియర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాల్సిందేనని యూజీసీ అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. అయితే యూజీసీ వైఖరిని తప్పుపడుతూ పశ్చిమ బెంగాల్, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభు త్వానికి లేఖలు రాశాయి. యూజీసీ నిర్ణయం అసం బద్ధమంటూ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఏపీ, తెలంగాణ ప్రభు త్వాలు మాత్రం వీలైనంత త్వరగా పరీక్షలు నిర్వ హిస్తామని ప్రకటిం చాయి. కానీ కరోనా ఉధృతమైతే పరీక్షల నిర్వహణ సాధ్యం కాదని, తమకు వచ్చిన ఉద్యోగాలు పోతాయని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. స్పష్టత కరువు... రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇంజనీరింగ్ కాలేజీలు ఇంటర్నల్ మార్కులు లేదా ఆన్లైన్ ద్వారా పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు జారీ చేస్తే వారు ఇప్పటికే ఉద్యోగాల్లో చేరిపోయేవారని, యూజీసీ మొండి పట్టుదల కారణంగా విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఏర్పడిందని ఓ ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ వ్యాఖ్యానించారు. ‘ఎన్ఐటీలు నామమాత్రంగా ఆన్లైన్ పరీక్షలు నిర్వహించాయి. డీమ్డ్ వర్సిటీలు ఇంటర్నల్ మార్కుల ఆధారంగా విద్యార్థులను ప్రమోట్ చేశాయి. వాళ్లకు లేని నిబంధన ఇంజనీరింగ్ కాలేజీలకు ఎందుకు? ఒకవేళ పరీక్షలు నిర్వహించాల్సి వస్తే ఎప్పుడు నిర్వహించాలన్న దానిపై స్పష్టత లేదు. కరోనా తగ్గుముఖం పడితే గానీ సాధ్యం కాదు. పరీక్షలు నిర్వహించాక వ్యాల్యుయేషన్, ట్యాబులేషన్ వంటి వాటికి చాలా సమయం పడుతుంది. అప్పటిదాకా విద్యార్థుల ఉద్యోగాలకు యూజీసీ గ్యారంటీ ఇస్తుందా? అని ఆ ప్రిన్సిపల్ ప్రశ్నించారు. పరీక్షల నిర్వహణ, విద్యా సంవత్సరం కేలండర్ విషయంలో యూజీసీ విధానాలు అస్తవ్యస్తంగా ఉన్నాయని విద్యావేత్తలు మండిపడుతున్నారు. ‘ఫైనలియర్ విద్యార్థులకు మూడు సబ్జెక్టులే ఉంటాయి. అప్పటికే వారు ఏడు సెమిస్టర్లలో 35–40 సబ్జెకుŠట్లు చదివి పాసైన వారే. నా ఉద్దేశంలో ఇంటర్నల్ మార్కుల ఆధారంగా వారిని పాస్ చేయవచ్చు’ అని మాజీ వైస్ చాన్స్‌లర్ అభిప్రాయపడ్డారు. నా పరిస్థితి ఏమిటి? ‘నన్ను ఓ కార్పొరేట్ కంపెనీ రూ. 28 లక్షల వార్షిక వేతనానికి నియమించుకుంది. డిగ్రీ సర్టిఫికెట్ కాపీలు పంపాలని ఇప్పటికే పలుమార్లు మెయిల్ పంపింది. తాజాగా అక్టోబర్ 31 వరకు డెడ్‌లైన్ పెట్టింది. అప్పటికీ నా చేతికి సర్టిఫికెట్ రాకపోతే నేను మళ్లీ ఆ ఉద్యోగం సాధిస్తానా? కరోనా నేపథ్యంలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవాలని కంపెనీలు భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే నాకు నిద్రపట్టట్లేదు’ అని ఓ ప్రతిష్టాత్మక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన ఫైనలియర్ ఇంజనీరింగ్ విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు. యీజీసీ ఇప్పటికైనా పరీక్షల విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయానికి వదిలివేయాలని లేకుంటే పరీక్షల నిర్వహణ మరింత ఆలస్యమై విద్యార్థులు నస్టపోతారని ఓ ప్రైవేట్ కాలేజీ ప్లేస్మెంట్ డైరెక్టర్ పేర్కొన్నారు. -
వర్సిటీల్లో పరీక్షలు రద్దు!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో జూలైలో జరగాల్సిన ఫైనల్ ఇయర్ పరీక్షలన్నీ రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభాన్ని అక్టోబర్ వరకు వాయిదా వేయనున్నట్టు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ అధికారులు బుధవారం వెల్లడించారు. ఈ మేరకు త్వరలో అధికారిక ప్రకటన రానుంది. ఇంటర్మీడియెట్, టెర్మినల్ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించిన మార్గదర్శకాలను తిరిగి రూపొందించి, కొత్త విద్యా సంవత్సరం కేలండర్‌ను తయారు చేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)ని హెచ్ఆర్డీ మంత్రి రమేష్ పోఖ్రియాల్ గతంలో ఆదేశించారు. కొత్త మార్గదర్శకాలను రూపొందించడానికి హరియాణా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఆర్సీ కుహాద్ ఆధ్వర్యంలో యూజీసీ ప్యానెల్‌ను ఏర్పాటు చేశారు. కొత్త ఎకడమిక్ కేలండర్పై కసరత్తు చేస్తున్న ఈ ప్యానెల్ మరో వారం రోజుల్లో కొత్త మార్గదర్శకాలను ప్రకటిస్తుందని హెచ్ఆర్డీ అధికారులు తెలిపారు. విద్యార్థులు, అధ్యాపకులు, ఇతర సిబ్బంది ఆరోగ్యాన్ని, భద్రతను దృష్టిలో ఉంచుకొని కొత్త విధానాన్ని రూపొందిస్తారు. ఫైనల్ ఇయర్ పరీక్షలు రద్దు చేసి, విద్యార్థులు పూర్వ ప్రతిభ ఆధారంగా మార్కులు నిర్ణయించేలా కసరత్తు జరుగుతోంది. అయితే ఆ మార్కుల పట్ల విద్యార్థులెవరైనా అసంతృప్తిగా ఉంటే, కోవిడ్ తగ్గుముఖం పట్టాక జరిగే పరీక్షల్లో పాల్గొనే అవకాశం ఇస్తారని అధికారులు వివరించారు. ఆగస్టు, సెప్టెంబర్‌లో ప్రారంభం కావల్సి ఉన్న విద్యా సంవత్సరాన్ని అక్టోబర్ వరకు వాయిదా వేసే అవకాశాలున్నాయి. ఎన్సీఈఆర్టీకి కొత్త మార్గదర్శకాలు 2020–21 విద్యాసంవత్సరానికి సంబంధించి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ)కి పలు మార్గదర్శకాలు జారీ చేసింది. 1–5 క్లాస్‌ల వరకు ఆన్లైన్ తరగతులు నిర్వహించడానికి వీలుగా ఇన్ఫోగ్రాఫిక్స్, పోస్టర్ ప్రజెంటేషన్స్ వంటివి అక్టోబర్ నాటికల్లా రూపొందించాలి. 6–12తరగతుల వారికి మార్చికల్లా సిద్ధంచేయాలి. ఆన్లైన్ తరగతుల్లో పాల్గొనేలా టీచర్లకు శిక్షణతరగతుల్ని డిసెంబర్‌నాటికి పూర్తి చేయాలి. 6–12తరగతుల విద్యార్థులకి ఆన్లైన్ బోధనకు టీచర్లకు శిక్షణ వచ్చే ఏడాది జూన్ నాటికల్లా పూర్తి కావాలి. ఆన్లైన్ తరగతుల్లో పాల్గొనే సదుపాయాలు లేని విద్యార్థులకు చదువు చెప్పడానికి సిలబస్‌ను, పుస్తకాల తయారీ పని డిసెంబర్‌కల్లా పూర్తి కావాలని కేంద్రం స్పష్టం చేసింది. -
త్వరలో ఏకకాలంలో రెండు డిగ్రీలు
న్యూఢిల్లీ: ఒకే సమయంలో రెండు డిగ్రీలను పూర్తి చేసే అవకాశం త్వరలో అమలయ్యేలా కనిపిస్తోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆమోదం తెలిపిందని అధికారులు తెలిపారు. అయితే ఇందులో ఒక డిగ్రీని రెగ్యులర్ మోడ్‌లోనూ, మరోటి ఆన్లైన్ డిస్టెన్స్ లెర్నింగ్(ఓడీఎల్) ద్వారా చేయాల్సి ఉంటుందని యూజీసీ కార్యదర్శి రజనీశ్ జైన్ స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెల్లడించే అవకాశం ఉందన్నారు. ఈ వ్యవహారంపై గతేడాది యూజీసీ వైస్ చైర్మన్ భూషన్ పట్వర్థన్ ఆధ్వర్యంలో కమిటీ వేయడం తెల్సిందే. -
కరోనా: ఇంటి నుంచి ఈ పనులు చేయండి
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ నివారణలో భాగంగా దేశంలోని అన్ని యూనివర్సిటీలు, వాటి పరిధిలోని అన్ని విద్యా సంస్థలను మూసేసి ఇంటి నుంచే పని విధానాన్ని ఈ నెల 31 వరకు అమలు చేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు విడుదల చేసిన ఉత్తర్వుల్లో ఫ్యాకల్టీ మెంబర్లు, టీచర్లు, రీసెర్చి స్కాలర్లు, కాంట్రాక్టు ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది మొత్తం ఇంటి నుంచే విధులు నిర్వర్తించేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. ఆన్లైన్ కంటెంట్, ఆన్లైన్ బోధన, ఆన్లైన్ మూల్యాంకనం కార్యక్రమాలను అభివృద్ధి చేయాలని పేర్కొంది. (కరోనా: చప్పట్లు కాదు అవి ఇవ్వండి!) వర్క్ ఫ్రమ్ హోమ్ సందర్భంగా ఫ్యాకల్టీ సభ్యులు, ఉపాధ్యాయులు, పరిశోధకులు వివిధ విద్యా కార్యకలాపాల కోసం ఈ కాలాన్ని ఉపయోగించుకోవాలి. ► వచ్చే విద్యా సంవత్సరం లేదా తదుపరి సెమిస్టర్లో అందించే కోర్సులకు పాఠ్య ప్రణాళికను సిద్ధం చేయాలి. ► బోధనా సామగ్రిని అభివృద్ధి పరచాలి. ► పరిశోధకులు ఇంటి నుంచే పరిశోధనలు కొనసాగించాలి. ► వివిధ అంతర్జాతీయ జర్నల్స్‌కు, ఇతర మ్యాగజైన్లకు వ్యాసాలు, పేపర్లు మొదలైనవి ఇంటి నుంచే రాసి పంపించాలి. ► విద్యార్థులకు ఉపయోగపడేలా ప్రశ్నలను సిద్ధం చేయాలి. ► ‘ఏక్ భారత్ శ్రేష్ట భారత్’ తదితర అంశాలపై వినూత్న ప్రాజెక్టులను సిద్ధం చేయాలి. ► ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కాలాన్ని విధుల్లో ఉన్నట్లు పరిగణిస్తారు. ► హాస్టళ్లలో ఉన్న విద్యార్థులు ముఖ్యంగా విదేశీ విద్యార్థులుంటే వారిని హాస్టళ్లలో కొనసాగడానికి అనుమతించాలి. వారికి అవసరమైన ఏర్పాట్లు, ఇతర భద్రతా చర్యలు తీసుకోవాలి. ► ఫ్యాకల్టీ సభ్యులు, ఉపాధ్యాయులు, పరిశోధకులు, బోధనేతర సిబ్బందిని సంప్రదించేందుకు మొబైల్ నంబర్లు, ఈ–మెయిల్ ఐడీ తదితర సమాచారాన్ని తమ సంస్థలకు పంపించాలి. -
కరోనా ఎఫెక్ట్: కంటెంట్, బోధన.. ఆన్లైన్లోనే
సాక్షి, అమరావతి: కోవిడ్ వైరస్ నివారణలో భాగంగా దేశంలోని అన్ని యూనివర్సిటీలు, వాటి పరిధిలోని అన్ని విద్యా సంస్థలను మూసేసి ఇంటి నుంచే పని విధానాన్ని ఈ నెల 31 వరకు అమలు చేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు విడుదల చేసిన ఉత్తర్వుల్లో ఫ్యాకల్టీ మెంబర్లు, టీచర్లు, రీసెర్చి స్కాలర్లు, కాంట్రాక్టు ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది మొత్తం ఇంటి నుంచే విధులు నిర్వర్తించేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. ఆన్లైన్ కంటెంట్, ఆన్లైన్ బోధన, ఆన్లైన్ మూల్యాంకనం కార్యక్రమాలను అభివృద్ధి చేయాలని పేర్కొంది. వర్క్ ఫ్రమ్ హోమ్ సందర్భంగా ఫ్యాకల్టీ సభ్యులు, ఉపాధ్యాయులు, పరిశోధకులు వివిధ విద్యా కార్యకలాపాల కోసం ఈ కాలాన్ని ఉపయోగించుకోవాలి. వచ్చే విద్యా సంవత్సరం లేదా తదుపరి సెమిస్టర్లో అందించే కోర్సులకు పాఠ్య ప్రణాళికను సిద్ధం చేయాలి. బోధనా సామగ్రిని అభివృద్ధి పరచాలి. పరిశోధకులు ఇంటి నుంచే పరిశోధనలు కొనసాగించాలి. వివిధ అంతర్జాతీయ జర్నల్స్‌కు, ఇతర మ్యాగజైన్లకు వ్యాసాలు, పేపర్లు మొదలైనవి ఇంటి నుంచే రాసి పంపించాలి. విద్యార్థులకు ఉపయోగపడేలా ప్రశ్నలను సిద్ధం చేయాలి. ‘ఏక్ భారత్ శ్రేష్ట భారత్’ తదితర అంశాలపై వినూత్న ప్రాజెక్టులను సిద్ధం చేయాలి. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కాలాన్ని విధుల్లో ఉన్నట్లు పరిగణిస్తారు. హాస్టళ్లలో ఉన్న విద్యార్థులు ముఖ్యంగా విదేశీ విద్యార్థులుంటే వారిని హాస్టళ్లలో కొనసాగడానికి అనుమతించాలి. వారికి అవసరమైన ఏర్పాట్లు, ఇతర భద్రతా చర్యలు తీసుకోవాలి. ఫ్యాకల్టీ సభ్యులు, ఉపాధ్యాయులు, పరిశోధకులు, బోధనేతర సిబ్బందిని సంప్రదించేందుకు మొబైల్ నంబర్లు, ఈ–మెయిల్ ఐడీ తదితర సమాచారాన్ని తమ సంస్థలకు పంపించాలి. -
కేంద్ర ఉద్యోగులకూ వర్క్ ఫ్రమ్ హోం
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కట్టడే లక్ష్యంగా భారత ప్రభుత్వ సంస్థలు, వేర్వేరు మంత్రిత్వ శాఖలు మరిన్ని చర్యలకు శ్రీకారం చుట్టాయి. ప్రజలు గుమికూడేందుకు ఉన్న అన్ని అవకాశాలను వీలైనంత వరకూ తగ్గించే దిశగా పలు చర్యలు చేపట్టాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో సగం మంది ఇంటి నుంచే పని చేయవచ్చునని ఆదేశించడం మాత్రమే కాకుండా... రైలు ప్రయాణాలను తగ్గించేందుకు రైల్వే శాఖ రోగులకు మినహా మిగిలిన వారందరికీ రాయితీలు తొలగించగా, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అన్ని రకాల పరీక్షలను ఈ నెలాఖరు వరకూ వాయిదా వేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. వైరస్ తీవ్రత దృష్ట్యా పదవ తరగతి నుంచి పన్నెండవ తరగతి ఐసీఎస్ఈ బోర్డు పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ‘ద కౌన్సిల్ ఫర్ ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్’ప్రకటించింది. సగం మంది ఇంటి నుంచే.. కోవిడ్ విజృంభణ నేపథ్యంలో ఇప్పటికే దేశంలోని పలు ఐటీ కంపెనీలు ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయాల్సిందిగా ఆదేశించగా కేంద్ర ప్రభుత్వం గురువారం నుంచి సగం మంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం చేయవచ్చునని ప్రకటించింది. మిగిలిన సగం మంది మాత్రం ఆఫీసులకు రావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా ఉద్యోగులకు వేర్వేరు పనిగంటలను కేటాయించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతోంది. సిబ్బంది మంత్రిత్వ శాఖ విభాగాధిపతులకు జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఆఫీసుల్లో కనీసం యాభై శాతం మంది గ్రూప్ బీ, సీ ఉద్యోగులు కచ్చితంగా ఉండాలి. మిగిలిన వారు ఇంటి నుంచి పనిచేయవచ్చు. ఈ రెండు వర్గాల ఉద్యోగులు వారానికి ఒకసారి ఎక్కడి నుంచి పనిచేస్తారన్నది మార్చుకుంటారు. తొలి వారం ఎవరు ఆఫీసుకు రావాలన్న అంశంలో ఆఫీసుకు దగ్గరగా ఉన్న వారు...సొంత వాహనాలు వాడేవారికి ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ఉద్యోగులందరినీ మూడు వర్గాలుగా విభజించి ఒకరికి 9 – 5 గంటలు, ఇంకొకరికి 9.30 –5.30, మరొకరికి 10 – 6 గంటల పనివేళలు నిర్ణయించాలని కూడా సూచించారు. ఇళ్ల నుంచి పనిచేసే ఉద్యోగులు టెలిఫోన్ ద్వారా, ఎలక్ట్రానిక్ పద్ధతుల్లోనూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. రైల్వే రాయితీలు కట్ రైళ్లలో జనసమ్మర్ధాన్ని నివారించే ఉద్దేశంతో కేంద్ర రైల్వే శాఖ ఇస్తున్న పలు రాయితీలను నిలిపివేస్తూ గురువారం ఆదేశాలు జారీ అయ్యాయి. రోగులు, విద్యార్థులు, దివ్యాంగుల కేటగిరీలో కొందరికి మాత్రం మినహాయింపు ఉంటుంది. మార్చి 20వ తేదీ అర్ధరాత్రి నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ ఈ ఆదేశాలు కొనసాగుతాయి. ఇప్పటివరకూ దాదాపు 53 వర్గాల వారికి రాయితీలు లభిస్తూండగా ఇక ఇవి 15కు మాత్రమే పరిమితమవుతాయి. వయోవృద్ధులు అనవసర ప్రయాణాలను నివారించేందుకు ఈ ఆదేశాలు ఉపయోగపడ తాయని అంచనా. ఈ నెల 20వ తేదీ ఆ తరువాత బుక్ చేసుకున్న టికెట్లకు ఈ షరతులు వర్తిస్తాయి. ఇప్పటికే బుక్ చేసుకున్న రాయితీ టికెట్లను ఎవరైనా క్యాన్సిల్ చేసుకుంటే వారి నుంచి క్యాన్సలేషన్ ఛార్జీలు వసూలు చేయమని రైల్వే శాఖ స్పష్టం చేసింది. ఐసీఎస్ఈ పరీక్షలువాయిదా ఐసీఎస్ఈ సిలబస్‌లో 10, 12వ తరగతుల పరీక్షలను వాయిదావేస్తూ కౌన్సిల్ ఫర్ ద ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్ నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఈ నెలాఖరు వరకూ పరీక్షలను వాయిదా వేసుకోవాలని మానవ వనరుల శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో పరీక్షలను యూజీసీ వాయిదావేసింది. స్టాఫ్ సెలక్షన్ పరీక్షలు సైతం కరోనా వైరస్ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్త చర్యగా ఉద్యోగ నియామక పరీక్షలన్నింటినీ వాయిదా వేస్తున్నట్లు స్టాఫ్ సెలక్షన్ కమిటీ (ఎస్ఎస్సీ)గురువారం ప్రకటించింది. వాయిదా వేసిన పరీక్షల్లో మార్చి 20న జరగాల్సిన కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్‌తోపాటు మార్చి 30న జరగాల్సిన జూనియర్ ఇంజినీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, క్వాంటిటీ సర్వేయింగ్ కాంట్రాక్ట్) పరీక్షలు ఉన్నాయి. వృద్ధులు, పిల్లలు ఇళ్లకే పరిమితం వైరస్ విస్తృతి నేపథ్యంలో దేశంలో 65 ఏళ్ల పైబడ్డ వృద్ధులు, పదేళ్ల లోపు వయసున్న వారు ఇళ్లకే పరిమితం కావాలని కేంద్ర ఆరోగ్య శాఖ సలహా ఇచ్చింది. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, వైద్యనిపుణులకు మాత్రం ఈ ఆదేశాల నుంచి మినహాయింపు ఉంటుందని విదేశీ వ్యవహారాల శాఖ జాయింట్ సెక్రటరీ రవి తెలిపారు. మాస్కులు, శానిటైజర్ల వంటివాటిని అధిక ధరలకు అమ్మే వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఫార్మాస్యూటికల్ డిపార్ట్మెంట్, వినియోగదారుల శాఖలను కోరినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. దేశంలో వైరస్ సామూహికంగా వ్యాప్తి చెందడం లేదని ఆరోగ్యశాఖ తెలిపింది. పంజాబ్‌లో మరణించిన వ్యక్తి వృద్ధుడే కాకుండా మధుమేహం, గుండె సంబంధిత సమస్యలు కూడా ఉన్న వారని తెలిపారు. మార్చి 22వ తేదీ నుంచి మార్చి 29 వరకూ అన్ని అంతర్జాతీయ విమానాలు భారత్‌లో అడుగుపెట్టకుండా నిషేధం విధించినట్లు భారత్ ప్రకటించింది. -
నిఖార్సుగా కోర్సు..
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా డిగ్రీ, పీజీ కోర్సుల్లో సమూల మార్పులకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) శ్రీకారం చుట్టింది. ఈ మేరకు లెర్నింగ్ ఔట్‌కమ్స్ బేస్డ్ కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్‌ను (ఎల్‌వోసీఎఫ్) రూపొందించింది. అందుకు అనుగుణంగా సిద్ధం చేసిన మోడల్ కరిక్యులమ్‌ను అందుబాటులోకి తెచ్చింది. డిగ్రీ, పీజీలో వివిధ కోర్సుల కాంబినేషన్లలో మార్పులు తీసుకువచ్చింది. విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా ఈ కరిక్యులమ్‌ను సిద్ధం చేసింది. ప్రతి విద్యా సంస్థ సమాజం, పరిశ్రమలతో కచ్చితంగా అనుసంధానమై ఉండేలా ఈ మార్పులకు శ్రీకారం చుట్టింది. దేశంలోని అన్ని యూనివర్సిటీల నుంచి అభిప్రాయాలను స్వీకరించి దీనిని రూపొందించింది. వాస్తవానికి 2019–20 విద్యా సంవత్సరం నుంచే దీనిని అమల్లోకి తేవాలని భావించినా సాధ్యం కాకపోవడంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేసే అవకాశం ఉంది. అయితే ఈ కరిక్యులమ్‌ను అన్ని రాష్ట్రాలు కచ్చితంగా అమలు చేయాలన్న నిబంధన లేదు. తమ రాష్ట్రాల్లో అందిస్తున్న కోర్సుల ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు బాగున్నాయనుకుంటే వాటినే కొనసాగించే సదుపాయం ఉంది. ఒకవేళ మార్పులు చేసుకోవాలనుకుంటే ఈ మోడల్ కరిక్యులమ్‌కు అనుగుణంగా మార్పులు చేసుకోవాలని యూజీసీ స్పష్టం చేసింది. 50% మందికి ఉపాధి లక్ష్యంగా.. దేశంలో 2022 నాటికి డిగ్రీ, పీజీ కోర్సులు చేసే విద్యార్థుల్లో కనీసంగా 50% మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా చేయడమే లక్ష్యంగా ఈ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఇందులో ముఖ్యంగా విద్యార్థుల చదువులకు పారిశ్రామిక రం గంతో అనుసంధానం చేసేలా వాటిని రూపొందించింది. తద్వారా చదువుకునే సమయాల్లో మూడింట రెండొంతుల మంది విద్యార్థులు ఉపాధి, స్వయం ఉపాధిని పొందేలా చూసే లక్ష్యంతో కరిక్యులమ్‌ను రూపొందించింది. విద్యార్థులకు తప్పనిసరిగా అవసరమైన వృత్తిపరమైన నైపుణ్యాలు, టీమ్‌వర్క్, కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ క్వాలిటీస్, టైమ్ మేనేజ్మెంట్ స్కిల్స్‌ను నేర్పించేలా ఈ మార్పులు తీసుకువచి్చంది. వీటితోపాటు మానవ విలువలు, ప్రొఫెషనల్ ఎథిక్స్ కూడా నేర్చుకోవడాన్ని కోర్సుల్లో భాగం చేసింది. మరోవైపు ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఇస్తూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు దోహదపడేలా కోర్సుల్లో మార్పులు చేసినట్లు వెల్లడించింది. ప్రతి అంశానికీ నిర్ణీత క్రెడిట్స్.. లెరి్నంగ్ ఔట్‌కమ్స్ బేస్డ్ కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్‌ను డిగ్రీ, పీజీల్లో 16 రకాల కోర్సుల్లో రూపొందించింది. ఫిజిక్స్, ఇంగ్లి‹Ù, మ్యాథమెటిక్స్, బోటనీ, ఆంత్రోపాలజీ, హ్యూమన్ రైట్స్, క్రిమినాలజీ, సైకాలజీ, లైబ్రరీ సైన్స్, ఎల్రక్టానిక్ సైన్స్, హిందీ, స్టాటిస్టిక్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బయోకెమిస్ట్రీ సబ్జెక్టుల్లో మార్పులు చేసింది. అలాగే పోస్టు గ్రాడ్యుకేషన్లోనూ ఆయా కోర్సులకు సంబంధించిన కరిక్యులమ్‌లో మార్పులు చేసింది. ఉదాహరణకు పోస్టు గ్రాడ్యుయేషన్ ఆంత్రోపాలజీలో విద్యార్థులకు పక్కాగా బేసిక్ కాన్సెప్‌్ట, ప్రొసీజరల్ నాలెడ్జ్, స్పెషలైజ్డ్ స్కిల్స్ కచి్చతంగా ఉండేలా దీనిని రూపొందించింది. వాటితోపాటు ఐడెంటిఫికేషన్ ఆఫ్ అప్రాప్రియేట్ ఇష్యూస్, ప్రాబ్లం సాలి్వంగ్ స్కిల్స్, ఇన్వెస్టిగేషన్ స్కిల్స్, ఐసీటీ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రొఫెషనల్, ఎథికల్ బిహేవియర్, ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ కూడా నేర్చుకునేలా దీనిని రూపొందించింది. అందుకు అనుగుణంగా క్రెడిట్స్ ఇవ్వాలని పేర్కొంది. మొత్తంగా డిగ్రీలో 148 క్రెడిట్స్ ఉండేలా చర్యలు చేపట్టాలని, అందులో ప్రధాన సబ్జెక్టులతోపాటు ప్రతి అంశానికీ నిరీ్ణత క్రెడిట్స్ ఇచ్చేలా కోర్సుల వారీగా పరీక్షల విధానాన్ని పొందుపరిచింది. ఎప్పటికప్పుడు ఖాళీల భర్తీకి సూచన.. ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణాల పెంపునకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా ప్రతి విద్యా సంస్థలో విద్యార్థులకు బోధించే అధ్యాపకుల ఖాళీలు 10 శాతానికి మించకూడదని స్పష్టం చేసింది. ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేసేలా రాష్ట్రాలు చర్యలు చేపట్టాలని పేర్కొంది. సమాజంలో వస్తున్న మార్పులు, పారిశ్రామిక రంగంలో పురోగతిని అధ్యాపకులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ విద్యార్థులకు అందించాలని వెల్లడించింది. 2022 నాటికి దేశంలోని ప్రతి విద్యా సంస్థ కనీసం 2.5 స్కోర్‌తో నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ గుర్తింపు పొంది ఉండాలని పేర్కొంది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం... యూజీసీ జారీ చేసిన మోడల్ కరిక్యులమ్‌ను పరిశీలించాక ఉన్నత స్థాయిలో చర్చించి ముందుకు సాగుతాం. మోడల్ కరిక్యులమ్‌లో పేర్కొన్న కోర్సులు, మార్పులు, తెలంగాణలో ఉన్న కోర్సులను పరిశీలించి అవసరమైన వాటిని పరిశీలిస్తాం. అవసరం అనుకుంటే తగిన మార్పులు చేసే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. –-ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్, డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్) కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి -
జామర్ల నిబంధనలను పాటించాల్సిందే: యూజీసీ
న్యూఢిల్లీ: పరీక్షా కేంద్రాల్లో జామర్లు ఏర్పాటు చేసేటప్పుడు ప్రభుత్వ విధి విధానాలను తప్పనిసరిగా అనుసరించాల్సిందేనని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) యూనివర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థలకు సూచించింది. ప్రభుత్వ జామర్ విధానం ప్రకారం జామర్లు ఏర్పాటు చేయాలనుకుంటే భద్రతా కార్యదర్శి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని యూనివర్సిటీలు, విద్యాసంస్థలకు రాసిన లేఖలో యూజీసీ తెలిపింది. అలాగే ప్రతీ కేంద్రంలో జామర్ల పనితీరును పరీక్ష ప్రారంభానికి ముందే పరీక్షించాల్సి ఉంటుంది. విద్యార్థులు ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా ఎటువంటి మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడకుండా నిరోధించేందుకు పరీక్షా కేంద్రాల్లో తక్కు వ సామర్థ్యం గల జామర్లు ఏర్పాటు చేసేందుకు 2016లో కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. -
‘ఉన్నత’ పాఠాలు ఇక సమున్నతం
సాక్షి, అమరావతి: ఉన్నత విద్యారంగాన్ని మరింత పటిష్టపర్చి.. విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించేలా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఆయా కోర్సుల్లోని పాఠ్యాంశాలకు మరింత పదునుపెడుతోంది. అన్ని రంగాల్లో మార్పులు శరవేగంగా జరుగుతుండటంతో అందుకు తగ్గట్టుగా యువతనూ సిద్ధం చేసేలా పలు డిగ్రీ కోర్సుల పాఠ్యాంశాలకు కొత్త రూపునిచ్చింది. నిపుణుల కమిటీ సూచనలతో కొత్త అంశాలను ప్రకటించింది. ఆయా కోర్సుల్లో చదివే వారికి భవిష్యత్తులో ఏయే నైపుణ్యాలు అలవడాలి, కోర్సుల లక్ష్యం ఏమిటన్న వాటిని ముందుగానే నిర్దేశించుకుని ఆ ఫలితాలు వచ్చేలా పాఠ్యాంశాలను కూర్చి.. అభ్యాస ఫలిత ఆధారిత పాఠ్యప్రణాళిక’లు విడుదల చేసింది. 2019–20 విద్యా సంవత్సరం నుంచే కొత్త పాఠ్యాంశాలు అమల్లోకి తెస్తోంది. మహత్తర లక్ష్యం విద్యార్థుల్లో నైపుణ్యాలు, సృజనాత్మకతను పెంచి వారు చదువులు ముగించి విద్యాసంస్థల నుంచి బయటకు వచ్చేసరికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా కోర్సులను తీర్చిదిద్దింది. ఉన్నత విద్య పూర్తిచేసిన యువత సమాజాభివృద్ధిలో భాగస్వాములయ్యేలా కోర్సుల సిలబస్‌లలో మార్పులు చేసింది. గత ఏడాది జూలై 26 నుంచి మూడు రోజుల పాటు దేశంలోని అన్ని యూనివర్సిటీల ఉప కులపతులతో ఉన్నత విద్యాకోర్సుల్లో చేపట్టాల్సిన సంస్కరణలపై యూజీసీ జాతీయస్థాయి సదస్సు నిర్వహించింది. అభ్యాస ఫలిత ఆధారిత పాఠ్య ప్రణాళికలను డిగ్రీ స్థాయిలో అమలు చేయించాలని ఈ సదస్సులో తీర్మానించారు. పాఠ్య ప్రణాళికలను, మెరుగైన విధానాలను ప్రవేశపెట్టేలా సబ్జెక్టుల వారీగా నిపుణులతో కమిటీలను నియమించి కసరత్తు చేయించింది. ఈ కమిటీలు జాతీయ స్థాయిలో విస్తృతమైన చర్చా గోషు్టలు నిర్వహించి, పలు వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరించి సబ్జెక్టుల వారీగా పాఠ్యాంశాల్లో చేయాల్సిన మార్పులు, చేర్పులను యూజీసీకి నివేదించాయి. వెబ్సైట్లో పాఠ్య ప్రణాళికలు నిపుణుల కమిటీలిచ్చిన నివేదికల ఆధారంగా యూజీసీ పలు డిగ్రీకోర్సుల్లో అభ్యాస ఫలిత ఆధారిత పాఠ్య ప్రణాళికలు విడుదల చేసింది. ఫిజిక్స్, ఇంగ్లి‹Ù, మేథమేటిక్స్, బోటనీ, ఆంథ్రోపాలజీ, హ్యూమన్ రైట్స్, క్రిమినాలజీ, సైకాలజీ, లైబ్రరీ సైన్స్ కోర్సులకు సంబంధించిన కొత్త పాఠ్య ప్రణాళికలను యూజీసీ ప్రకటించింది. తాజాగా ఎల్రక్టానిక్ సైన్స్, హిందీ, స్టాటిస్టిక్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బయోకెమిస్ట్రీ అంశాలపై పాఠ్యప్రణాళికలను తన వెబ్సైట్లో పొందుపరిచింది. వీటిని‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.యూజీసీ.ఏసీ.ఐఎన్’ వెబ్సైట్లో యూనివర్సిటీలు సందర్శించవచ్చని యూజీసీ కార్యదర్శి ప్రొఫెసర్ రజనీష్ జైన్ ఒక వెబ్ నోట్ విడుదల చేశారు. అభ్యాస ఫలిత ఆధారిత పాఠ్య ప్రణాళికలను అనుసరించి ఆయా వర్సిటీలు తమ పాఠ్యాంశాలను సవరించుకోవాలని యూనివర్సిటీల ఉప కులపతులకు ఆదేశాలు ఇచ్చింది. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరిస్తూ నివేదికను ‘ఎల్ఓసీఎఫ్యూజీసీఎట్దరేటాఫ్జీమెయిల్.కామ్’కు లేదా ‘నీతుతులసీ.యూజీసీ.జీఓవీ.ఐఎన్’కు మెయిల్ చేయాలని సూచించింది. వర్సిటీలలో సబ్జెక్టుల వారీగా సమీక్షలు యూజీసీ ప్రకటించిన ‘లెర్నింగ్ అవుట్ కమ్ బేస్డ్ కరిక్యులమ్ ఫ్రేమ్ వర్క్’ను అనుసరించి రాష్ట్రంలోని ఆయా సబ్జెక్టుల పాఠ్యాంశాలపై సమీక్ష జరిగేలా చర్యలు చేపడుతున్నాం. మన రాష్ట్రంలో ఇప్పటికే డిగ్రీ కోర్సుల్లో పలు సంస్కరణల దిశగా ఉన్నత విద్యామండలి ద్వారా ముందుకు వెళ్తున్నాం. వీటిపై నిపుణుల కమిటీని నియమించాం. చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ (సీబీసీఎస్) విధానాన్ని పకడ్బందీగా అమలు చేయనున్నాం. విద్యార్థులు తమకు నచి్చన కోర్సులు చేస్తూనే.. మరికొన్ని కోర్సులను ఇతర విద్యాసంస్థల ద్వారా అభ్యసించేలా కొత్త విధానాలకు శ్రీకారం చుట్టనున్నాం. – ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి, చైర్మన్, ఉన్నత విద్యామండలి