తస్మాత్‌ జాగ్రత్త! ఈ 20 యూనివర్సిటీలు నకిలీవి.. 8 రాజధానిలోనే.. | UGC declares 20 universities as fake, not authorised to award degrees | Sakshi
Sakshi News home page

తస్మాత్‌ జాగ్రత్త! ఈ 20 యూనివర్సిటీలు నకిలీవి.. 8 రాజధానిలోనే..

Published Thu, Aug 3 2023 6:18 AM | Last Updated on Thu, Aug 3 2023 8:26 AM

UGC declares 20 universities as fake, not authorised to award degrees - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో మరో 20 సంస్థలు విశ్వవిద్యాలయాలుగా చెలామణి అవుతున్నాయని, అవన్నీ నకిలీవని యునివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) బుధవారం ప్రకటించింది. ఈ 20 సంస్థల్లో ఎనిమిది ఢిల్లీలోనే ఉన్నట్టు పేర్కొంది.

‘‘ఉత్తరప్రదేశ్‌లో గాంధీ హిందీ విద్యాపీఠ్, నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఎలక్ట్రో కాంప్లెక్స్‌ హోమియోపతి, నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌ (ఓపెన్‌) యూనివర్సిటీ, భారతీయ శిక్షా పరిషత్‌ అనే నాలుగు నకిలీ యూనివర్సిటీలు ఉన్నాయి. పశ్చిమబెంగాల్, ఏపీల్లో రెండేసి నకిలీ వర్సిటీలున్నాయి. కర్ణాటకలో బదగాన్వీ సర్కార్‌ వరల్డ్‌ యూనివర్సిటీ ఎడ్యుకేషన్, కేరళలో సెయింట్‌ జాన్స్‌ వర్సిటీ, మహారాష్ట్రలో రాజా అరబిక్‌ యూనివర్సిటీ, పుదుచ్చెరిలో శ్రీ బోధి అకాడమీ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ నకిలీవే’’ అని యూజీసీ కార్యదర్శి మనీశ్‌ జోషి స్పష్టంచేశారు.

ఢిల్లీలోని 8 నకిలీ వర్సిటీలు
ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ అండ్‌ ఫిజికల్‌ హెల్త్‌ సైన్సెస్‌; కమర్షియల్‌ యూనివర్సిటీ లిమిటెడ్, దరియాగంజ్‌; యునైటెడ్‌ నేషన్స్‌ యూనివర్సిటీ ఒకేషనల్‌ యూనివర్సిటీ; ఏడీఆర్‌–సెంట్రిక్‌ జ్యుడీషియల్‌ యూనివర్సిటీ; ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌ అండ్‌ ఇంజనీరింగ్‌; విశ్వకర్మ ఓపెన్‌ యూనివర్సిటీ ఫర్‌ సెల్ఫ్‌–ఎంప్లాయిమెంట్‌; ఆధ్యాత్మిక్‌ విశ్వవిద్యాలయ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement