fake universities
-
అలాంటి చిల్లర కవులు ఎక్కువయ్యారు!
విద్యకు సాటి వచ్చే ధనం లేదనేది సుభాషితం. కాని నేటి వ్యాపార యుగంలో ధనం అన్ని రంగాలనూ శాసిస్తున్నట్టే... విద్య మీద కూడా ఆధిపత్యాన్ని చలాయిస్తూ దాన్ని అంగడి సరుకుగా దిగజారుస్తోంది. నేడు సాధారణ డిగ్రీలు మొదలుకొని విద్యారంగంలో అత్యున్నత అర్హతలకు సంబంధించిన పట్టాల వరకు కొనగలిగిన స్తోమత ఉన్నవారికి లభించడం ఈ దుఃస్థితికి నిదర్శనం.ముఖ్యంగా విదేశాలలోనూ, ఉత్తర భారతదేశంలోనూ పుట్టగొడుగుల్లా వెలుస్తున్న నకిలీ విశ్వవిద్యాలయాలు విక్రయిస్తున్న ఈ డిగ్రీలను ప్రచార వ్యామోహం గల సంపన్నులు తమ పేర్లకు అలంకారాలుగా తగిలించుకొని, అవి తమ ప్రతిభాచిహ్నాలుగా చాటుకుంటున్నారు. ఊరేగింపులు, అభినందన సభలు, విందులు, వినోదాలు ఏర్పాటు చేసుకొని అవి తమ కీర్తి కిరీటాలుగా జనాన్ని భ్రమపెడుతున్నారు. ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ మురారి తనకో విదేశీ సంస్థ డాక్టరేట్‌ను ఇవ్వజూపితే ‘డాక్టరేట్ ఇంత తేలికా?’ అని నిజాయతీగా వ్యాఖ్యానించడమే కాదు, తెచ్చుకున్న ఆ డాక్టరేట్ బిరుదును ఎప్పుడూ తన పేరు ముందు, కనీసం ‘నవ్విపోదురు గాక’ పుస్తక రచయితగా కూడా ఉపయోగించలేదు. అలా ప్రలోభాలకు లొంగకుండా అర్హత లేని బిరుదులను తోకలుగా ఉపయోగించని వారు అరుదు. నకిలీ విద్యార్హతలతో ఆత్మవంచనకు, పరవంచనకు పాల్పడుతున్న పెద్దమనుషులే ఎక్కువ.డాక్టరేట్ల సంతర్పణకు కాణాచులుగా మన విశ్వవిద్యాలయాలను చెప్పుకోవాలి. పీహెచ్డీ పట్టాల కోసం పరిశోధనలు ఉద్యోగాలకో, పదోన్నతులకో అవసరం కావడంతో నాటి ప్రమాణాలు దిగజారుతున్నాయి. ఈ జాతరలో పరిశోధక విద్యార్థులు అడ్డదారులను వెతు క్కుంటుంటే పర్యవేక్షకులు వారి కోర్కెలకు అనుగుణంగా తోడ్పడి లబ్ధి పొందుతున్నారు. ‘కాదేదీ కవిత కనర్హం’ అన్నట్లు పరిశోధన ఆవశ్యకత లేని, కేవలం ‘మెథడాలజీ’ చట్రంలో ఇమిడ్చి పీహెచ్డీ పట్టాను పొందే సులభమైన, ఎందుకూ పనికిరాని అంశాన్ని పరిశోధక విద్యార్థికి సూచించడం... విద్యార్థి ఆర్థికంగా ఆశపెడితే సిద్థాంత గ్రంథాన్ని తామే అన్నీ రాసి ఇవ్వడం కొందరు పర్యవేక్షక గురువులు చేస్తున్న నిర్వాకాలు. విశ్వవిద్యాలయాల వెలుపల సిద్ధాంత గ్రంథ రచనకు ధరను మాట్లాడుకొని రాసిపెట్టడం వృత్తిగా కలిగిన నిరుద్యోగ మేధావులు కూడా ఉండడంతో కొందరు పరిశోధకులు వారు అడిగిన డబ్బిచ్చి శ్రమ పడకుండా ‘డాక్టర్లు’ అనిపించుకుంటున్నారు.తెలుగే కాదు, ఆంగ్లం, హిందీ వంటి ఇతర భాష ల్లోనూ, సాంఘిక విజ్ఞాన శాస్త్ర విభాగాల్లోనూ పరిశోధనల స్థాయి భిన్నంగా లేదు. కొందరు ప్రబుద్ధులు ఎలాగోలా ‘పీహెచ్డీ’ అనిపించుకుంటే చాలని పూర్వుల కృషిని కొల్ల గొట్టి రాసిన సిద్ధాంత గ్రంథాలకు కూడా అయ్యవార్ల ఆశీస్సులతో ఆమోద ముద్రను వేయించుకొని ‘మమ’అంటున్న సందర్భాలు కూడా లేక పోలేదు. అయితే పరిశోధనలన్నీ కాకి బంగారం బాపతేననీ, యోగ్యతకూ నిజాయతీకి స్థానం లేదనీ అనడం కువిమర్శే అవుతుంది. విశ్వవిద్యాలయాలు వివిధ రంగాలలో– ప్రతిభామూర్తులను గుర్తించి వారికి గౌరవ డాక్టరేట్లను, కళాప్రపూర్ణ వంటి బిరుదులనూ ప్రకటించడం ఆనవాయి తీగా వస్తోంది. అయితే వాటిని కానీ, కొన్ని ప్రామాణిక సంస్థలు ఇస్తున్న బిరుదులను కానీ విశ్వనాథ, శ్రీశ్రీ, జాషువా, పుట్టపర్తి, సినారె, ఆరుద్ర వంటి దిగ్దంతులెవరూ ఎప్పుడూ, ఎక్కడా భుజకీర్తులుగా వినియోగించుకోలేదు. ఏనుగులపై ఊరేగించినా, గురుతుల్యుల చేత గండ పెండేరాలతో సన్మానింపబడినా వారు వాటిని స్వోత్కర్షగా వాడుకోలేదు. కానీ నేడు కీర్తి కాంక్షతో అభినవ కృష్ణదేవరాయలం అనుకునే కవి పోషకులు, ‘అంతా కవులము కామా’ అనుకునే చిల్లర కవులు ఎక్కువయ్యారు. చదవండి: ఇది మాయ కాక మరేమిటి?వారు ఆశ్రిత కవులకు ‘కవిరత్న’, ’కవిశేఖర’, ‘కవితిలక’ వంటి బిరుదులను ప్రదానం చేసి శాలువాలను కప్పడం... వీరు మరునాడు స్థానిక పత్రికలలో ఆ సత్కారాల గురించి ఘనంగా రాయించుకోవడం ప్రహస నమైపోయింది. ఇటీవల కొన్ని సంస్థలు ఏకంగా కొందరు స్థానిక కవులకు ‘గౌరవ డాక్టరేట్’లను కూడా ప్రదానం చేస్తున్నాయి. కొంతనయం– పద్మ పురస్కారాలను కూడా ప్రకటించడం లేదు! ఏ హక్కు, అధికారం లేకుండా ఎవరు పడితే వారు ఇలా బిరుదులనివ్వడం, ప్రతిభాశూన్యులైన కవులు కూడా వాటిని అలంకారాలుగా ప్రదర్శించడం సమాజానికి హానికరం. దీనికి నియంత్రణ అవసరం!చదవండి: ఎవరిని ఎలా పిలవాలి?ఇటీవల ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు రాహుల్ ద్రావిడ్‌కు బెంగుళూరు విశ్వవిద్యాలయం వారు ‘గౌరవ డాక్టరేట్’ను ప్రకటిస్తే ఆయన సున్నితంగా తిరస్కరించడమే గాక ‘అవసరమనుకుంటే ‘నేను థీసిస్‌ను సమర్పించి డాక్టరేట్ తీసుకుంటాను కాని ఉచితంగా కాదు’ అని వ్యాఖ్యానించడం అభినందనీయం. ఆదర్శవంతులు ముఖ్యంగా రాజకీయ, చిత్ర రంగాలకు చెందిన ప్రముఖులు ఎటువంటి ప్రలోభాలకూ లోను కాకుండా గౌరవ డాక్టరేట్ల ప్రత్యేకతను కాపాడుతారని ఆశిద్దాం.- పైడిపాలవిశ్రాంత తెలుగు ఉపన్యాసకులు -
తస్మాత్ జాగ్రత్త! ఈ 20 యూనివర్సిటీలు నకిలీవి.. 8 రాజధానిలోనే..
న్యూఢిల్లీ: దేశంలో మరో 20 సంస్థలు విశ్వవిద్యాలయాలుగా చెలామణి అవుతున్నాయని, అవన్నీ నకిలీవని యునివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) బుధవారం ప్రకటించింది. ఈ 20 సంస్థల్లో ఎనిమిది ఢిల్లీలోనే ఉన్నట్టు పేర్కొంది. ‘‘ఉత్తరప్రదేశ్‌లో గాంధీ హిందీ విద్యాపీఠ్, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎలక్ట్రో కాంప్లెక్స్ హోమియోపతి, నేతాజీ సుభాష్‌చంద్రబోస్ (ఓపెన్) యూనివర్సిటీ, భారతీయ శిక్షా పరిషత్ అనే నాలుగు నకిలీ యూనివర్సిటీలు ఉన్నాయి. పశ్చిమబెంగాల్, ఏపీల్లో రెండేసి నకిలీ వర్సిటీలున్నాయి. కర్ణాటకలో బదగాన్వీ సర్కార్ వరల్డ్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్, కేరళలో సెయింట్ జాన్స్ వర్సిటీ, మహారాష్ట్రలో రాజా అరబిక్ యూనివర్సిటీ, పుదుచ్చెరిలో శ్రీ బోధి అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ నకిలీవే’’ అని యూజీసీ కార్యదర్శి మనీశ్ జోషి స్పష్టంచేశారు. ఢిల్లీలోని 8 నకిలీ వర్సిటీలు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అండ్ ఫిజికల్ హెల్త్ సైన్సెస్; కమర్షియల్ యూనివర్సిటీ లిమిటెడ్, దరియాగంజ్; యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ ఒకేషనల్ యూనివర్సిటీ; ఏడీఆర్–సెంట్రిక్ జ్యుడీషియల్ యూనివర్సిటీ; ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ అండ్ ఇంజనీరింగ్; విశ్వకర్మ ఓపెన్ యూనివర్సిటీ ఫర్ సెల్ఫ్–ఎంప్లాయిమెంట్; ఆధ్యాత్మిక్ విశ్వవిద్యాలయ. -
దేశవ్యాప్తంగా 21 నకిలీ వర్సిటీలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరులోని క్రైస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ నకిలీ యూనివర్సిటీ అని విశ్వవిద్యాలయ నిధుల సంఘం(యూజీసీ) ప్రకటించింది. దేశవ్యాప్తంగా 21 నకిలీ యూనివర్సిటీల వివరాలను బహిర్గతం చేసింది. ఆయా వర్సిటీలు యూజీసీ చట్టానికి విరుద్ధంగా పనిచేస్తున్నాయని పేర్కొంది. వాటికి ఎలాంటి డిగ్రీలను అందజేసే అధికారం లేదని తేల్చిచెప్పింది. ఢిల్లీలో 8, ఉత్తరప్రదేశ్‌లో 4, పశ్చిమబెంగాల్లో 2, ఒడిశాలో 2, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, పుదుచ్చేరిల్లో ఒక్కొక్కటి చొప్పున నకిలీ యూనివర్సిటీలు ఉన్నట్లు వెల్లడించింది. ఇదీ చదవండి: Viral Video:ఓట్ల కోసం స్టూడెంట్స్ కాళ్లు పట్టుకున్న విద్యార్థి నేత.. వీడియో చూస్తే నవ్వాపుకోలేరు -
భారత్‌లో ఫేక్ యూనివర్సిటీల లిస్టు ఇదే.. తస్మాత్ జాగ్రత్త
న్యూఢిల్లీ: సక్రమమైన అనుమతులు లేకుండా నడుస్తున్న 24 ఫేక్ యూనివర్సిటీలను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) గుర్తించిందని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజల ద్వారా తమ దృష్టికి వచ్చిన ఫేక్ యూనివర్సిటీలను చెల్లవని చెప్పినట్లు వెల్లడించారు. మరో రెండు యూనివర్సిటీలు సైతం నిబంధనలను మీరాయని, వాటి వ్యవహారంప ప్రస్తుతం కోర్టులో ఉందని పేర్కొన్నారు. లోక్‌సభలో వచ్చిన రాతపూర్వక ప్రశ్నకు ఆయన ఈ విధంగా స్పందించారు. ఫేక్ యూనివర్సిటీలు ఉన్న ప్రాంతాల్లోని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, విద్యాశాఖ కార్యదర్శులకు ప్రత్యేక లేఖలను రాసి ఆయా ఫేక్ వర్సిటీలపై చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఆయా ఫేక్ యూనివర్సిటీల లిస్టు ఇదే.. ఉత్తరప్రదేశ్ (8): వారనసేయ సంస్కృతి విశ్వవిద్యాలయ, వారణాసి; మహిళా గ్రామ్ విద్యాపీఠ్, అలహాబాద్; గాంధీ హింది విద్యాపీఠ్, అలహాబాద్; నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎలక్ట్రో కాంప్లెక్స్ హోమియోపతి, కాన్పూర్; నేతాజీ సుభాశ్ చంద్రబోస్ ఓపెన్ యూనివర్సిటీ, అలీగఢ్; ఉత్తరప్రదేశ్ విశ్వవిద్యాలయ, మథుర; మహారాణా ప్రతాప్ శిక్షా నికేతన్ విశ్వవిద్యాలయ, ప్రతాప్‌గఢ్; ఇంద్రప్రస్త శిక్షా పరిషద్, నోయిడా ఢిల్లీ (7): కమర్షియల్ యూనివర్సిటీ లిమిటెడ్, యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ, వకేషనల్ యూనివర్సిటీ, ఏడీఆర్ సెంట్రిక్ జ్యురిడిసియల్ యూనివర్సిటీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, విశ్వకర్మ ఓపెన్ యూనివర్సిటీ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఆధ్యాత్మిక్ విశ్వవిద్యాలయ (ఆధ్యాత్మిక యూనివర్సిటీ) పశ్చిమబెంగాల్ (2): ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్, కోల్‌కతా; ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అండ్ రీసెర్చ్, కోల్‌కతా ఒడిశా (2): నవభారత్ శిక్షా పరిషద్, రూర్కెలా? నార్త్ ఒరిస్సా యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ. వీటితో పాటు పుదుచ్చేరిలోని శ్రీబోధి అకాడెమీ ఆఫ్ హైయ్యర్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్‌లోని క్రైస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ, నాగ్‌పూర్‌లోని రాజా అరబిక్ యూనివర్సిటీ, కేరళలోని సెయింట్ జాన్స్ యూనివర్సిటీ, కర్ణాటకలోని బదగాన్వి సర్కార్ వరల్డ్ ఓపెన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సొసైటీలు కూడా ఫేక్ యూనివర్సిటీలని యూజీసీ తెలిపింది. 17.94 లక్షల ‘కరోనా’ క్లెయిమ్‌లు సెటిల్ దేశంలో గత 15 నెలల్లో కోవిడ్–19కు సంబంధించి రూ.21,837 కోట్ల విలువైన 17.94 లక్షల ఆరోగ్య బీమా క్లెయిమ్‌లను ఇన్సూరెన్స్ సంస్థలు సెటిల్ చేసినట్లు భగవత్ కరాడ్ లోక్‌సభలో లిఖితపూర్వకంగా తెలియజేశారు. ఆరోగ్య బీమా క్లెయిమ్‌లను సాధ్యమైనంత త్వరగా సెటిల్ చేసేందుకు ఐఆర్డీఏఐ చర్చలు చేపట్టిందని అన్నారు. 2020 ఏప్రిల్ 1 నుంచి 2021 జూలై 15 వరకూ 17.94 లక్షల క్లెయిమ్‌లు సెటిల్ అయ్యాయని వివరించారు. 204 ప్రైవేటు చానెళ్ల నిలిపివేత నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా 2016–20ల మధ్య 204 ప్రైవేటు చానెళ్ల లైసెన్సులను రద్దు చేసినట్లు కేంద్రం ప్రకటించింది. మరో 128 కేసులకు సంబంధించి హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపింది. దేశంలో ప్రస్తుతం 916 ప్రైవేటు శాటిలైట్ టీవీ చానెళ్లకు అప్–లింకింగ్, డౌన్–లింకింగ్ల మార్గదర్శకాల ప్రకారం అనుమతులు ఉన్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ రాజ్యసభలో వెల్లడించారు. నిబంధలను పాటించలేకపోవడం వల్లే 204 చానళ్ల అనుమతులను రద్దు చేసినట్లు ప్రకటించారు. కొత్త చానెళ్ల వ్యవహారంపై స్పందిస్తూ.. 2016–17లో 60 చానెళ్లు, 2017–18లో 34 చానెళ్లు, 2018–19లో 56 చానెళ్లు, 2020–21లో 22 చానెళ్లకు అనుమతులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ►దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాల్లో 2.96 కోట్ల మంది స్కూలు విద్యార్థులకు డిజిటల్ పరికరాలు అందుబాటులో లేవని కేంద్రం లోక్‌సభలో వెల్లడించింది. ఆన్లైన్ విద్య కోసం ఉపయోగించాల్సిన మొబైల్/లాప్‌టాప్‌లు లేని విద్యార్థులు అత్యధికంగా బిహార్‌లో ఉన్నారని పేర్కొంది. మరి కొన్ని రాష్ట్రాల్లో సర్వే ఇంకా కొనసాగుతోందని తెలిపింది. ►కరోనా కారణంగా మరణించిన 101 మంది జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సాయం కింద రూ. 5.05 కోట్లకు కేంద్రం అనుమతి ఇచ్చిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ రాజ్యసభలో వెల్లడించారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నిర్ధారించిన విధానాలకు లోబడి సాయం అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఎన్హెచ్ఏఐ రుణాలు రూ.3.06 లక్షల కోట్లు: గడ్కరీ భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) తీసుకున్న రుణాలు 2021 మార్చి నాటికి రూ.3,06,704 కోట్లకు చేరాయని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం రాజ్యసభలో చెప్పారు. 2017 మార్చి నాటికి ఈ రుణాలు రూ.74,742 కోట్లు ఉండేవని తెలిపారు. రుణాలపై ఎన్హెచ్ఏఐ 2020–21లో రూ.18,840 కోట్ల వడ్డీని చెల్లించిందని పేర్కొన్నారు. పాత వాహనాలపై గ్రీన్ ట్యాక్స్ విధించాలంటూ కేంద్రం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదన్నారు. అయినప్పటికీ తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ తదితర రాష్ట్రాలు పాత వాహనాలపై అత్యధికంగా గ్రీన్ ట్యాక్స్ విధిస్తున్నాయని నితిన్ గడ్కరీ వెల్లడించారు. -
చిత్తూరు జిల్లాలో నకిలీ డాక్ట‘రేట్ల’ బాగోతం
వివిధ విభాగాల్లో ప్రముఖులు, పలు రంగాల్లో అత్యున్నత సేవలు అందించిన వారికి గౌరవ డాక్టరేట్ అందిస్తారు. అలాంటి ఉన్నత పురస్కారానికి కొందరు మకిలీ అంటిస్తున్నారు. కాసుల కోసం కక్కుర్తి పడి అంగట్లో సరుకులా అమ్మేస్తున్నారు. విశిష్ట పట్టాకు విలువ లేకుండా చేస్తున్నారు. నకిలీ యూనివర్సిటీలను సృష్టించి దందా సాగిస్తున్నారు. కేవలం రూ.పదివేలు ఇస్తే చాలు అర్హత లేకున్నా డాక్టరేట్ డిగ్రీ ప్రదానం చేసేస్తున్నారు. ఏజెంట్లు, సామాజిక మాధ్యమాలను వినియోగించుకుని ఫేక్ డాక్టరేట్‌ను యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఇలాంటి నకిలీ బిరుదాంకితులు వందమంది వరకు ఉండవచ్చని సమాచారం. పలమనేరు: జిల్లాలో నకిలీ డాక్ట‘రేట్ల’ బాగోతం కలకలం రేపుతోంది. సుమారు వంద మంది వరకు కొన్ని ఫేక్ యూనివర్సిటీల నుంచి గౌరవ డాక్టరేట్లు పొందినట్టు తెలుస్తోంది. ఈ మేరకు కర్ణాటక పోలీసులు రంగంలోకి దిగారు. ఎవరెవరు పొందారు.. ఎక్కడి నుంచి పొందారు..? అనే దానిపై లోతుగా అధ్యయనం చేస్తున్నట్టు సమాచారం. వెలుగులోకి ఇలా.. మూడు రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వర్తిస్తున్న ఇంటర్నేషనల్ పీస్ యూనివర్సిటీ తాజాగా కర్ణాటకలోని మైసూరులో వంద మందికి గౌరవ డాక్టరేట్ల ప్రదాన కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించింది. డబ్బులు తీసుకుని డాక్టరేట్లను ప్రదానం చేస్తున్నారని ఫిర్యాదులు అందడంతో అక్కడి డీసీపీ ప్రకాగౌడ అవాక్కయ్యారు. వెంటనే తమ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. ఆ కార్యక్రమాన్ని అడ్డుకుని కొందరు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. డాక్టరేట్ల డొంక కదిలించారు. ఇందులో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూసినట్టు తెలిసింది. చిత్తూరు జిల్లాకు చెందిన వంద మంది వరకూ ఇప్పటికే ఫేక్ డాక్టరేట్లను పొందినట్టు నిర్ధారణయ్యింది. తాజాగా మరో 50 మంది డాక్టరేట్లకు డబ్బులు చెల్లించినట్టు సమాచారం. పదుల సంఖ్యలో నకిలీ యూనివర్సిటీలు పాండిచేరి, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన పలు ఫేక్ యూనివర్సిటీలు డబ్బులకు డాక్టరేట్లను ప్రదానం చేస్తున్నాయి. కోయంబత్తూరు, చెన్నై, బెంగళూరు, మైసూ రు, పాండిచ్చేరి కేంద్రాలుగా యూనివర్సల్ పీస్ యూనివర్సిటీ (అమెరికా), మలేషియా లింకోక్వింగ్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ గ్లోబల్ ఆక్స్ఫర్డ్ తదితర యూనివర్సిటీలు ఐదేళ్లుగా నకిలీ డాక్టరేట్ల ప్రదానంతో లక్షలాది రూపాయలు వసూలు చేసినట్టు సమాచారం. కొందరు ఏజెంట్లు పట్టణాల్లోని వీఐపీలకు గాలం వేస్తున్నట్టు తెలుస్తోంది. జిల్లాలో ఎవరెవరో? డాక్టరేట్ల కోసం ఇప్పటికే రూ.10 వేల నుంచి రూ.50 వేల దాకా డబ్బులు చెల్లించిన వీఐపీలు జిల్లాలో వంద మంది దాకా ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో రాజకీయ నాయకులు, రిటైర్ట్ అధికారులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, సంఘ సేవకులు, రియల్టర్లు, బిల్టర్లు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు, శాస్త్రవేత్తలు ఉన్నట్టు సమాచారం. ఇప్పటిదాకా డాక్టరేట్లు పొందిన వారి జాబితా మైసూరు పోలీసుల చేతికి చిక్కినట్టు తెలిసింది. వీరిలో చాలామంది ఇప్పటికే ‘గౌరవ డాక్టర్లు’గా సమాజంలో గుర్తింపు పొందుతుండడం గమనార్హం!. పోలీసులు కేసు నమోదు చేసి నకిలీ వర్సిటీల బాగోతం తేల్చే పనిలో పడ్డారు. -
తస్మాత్ జాగ్రత్త.. ఫేక్ యూనివర్సిటీలివే..!
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో 23 ఫేక్ యూనివర్సిటీలు కొనసాగుతున్నాయని ఉన్నత విద్యా నియంత్రణ సంస్థ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వెల్లడించింది. ఆ జాబితాను మంగళవారం విడుదల చేసింది. యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న ఇలాంటి విద్యాసంస్థల పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. డిగ్రీ కాలేజీలుగా గుర్తింపు పొందిన ఆయా సంస్థలు అక్రమంగా విశ్వవిద్యాలయాలుగా చలామణి అవుతున్నాయని వివరించింది. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 8, ఢిల్లీలో 7 నకిలీ విశ్వవిద్యాలయాలున్నట్టు తెలిపింది. రాష్ట్రాల వారీగా ఫేక్ యూనివర్సిటీల జాబితా.. ఢిల్లీ: 1. కమర్షియల్ యూనివర్సిటీ లిమిటెడ్, దర్యాగంజ్ 2. ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయం 3. ఒకేషనల్ యూనివర్శిటీ 4. ఏడీఆర్-సెంట్రిక్ జురిడికల్ విశ్వవిద్యాలయం, ఏడీఆర్ హౌస్, 8 జె, గోపాల్ టవర్, 25 రాజేంద్ర ప్లేస్, న్యూఢిల్లీ -110008. 5. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, న్యూఢిల్లీ 6.విశ్వకర్మ ఓపెన్ యూనివర్సిటీ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్. ఇండియా రోజ్‌గార్ సేవాసదన్, 672, సంజయ్ ఎన్క్లేవ్ ఎదురుగా. జీటీకే డిపో, న్యూ న్యూఢిల్లీ -110033. 7. ఆధ్యాత్మిక్ విశ్వవిద్యాలయ (స్పిరిచ్చువల్ యూనివర్సిటీ), 351-352, ఫేజ్-1, బ్లాక్-ఎ, విజయ్ విహార్, రిథాలా, రోహిణి, న్యూఢిల్లీ -110085. కర్ణాటక : 8. బడగన్వి సర్కార్ వరల్డ్ ఓపెన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సొసైటీ, గోకాక్, బెల్గాం (కర్ణాటక) కేరళ 9. సెయింట్ జాన్స్ విశ్వవిద్యాలయం, కిషానట్టం మహారాష్ట్ర : 10. రాజా అరబిక్ విశ్వవిద్యాలయం, నాగ్‌పూర్. పశ్చిమ బెంగాల్ : 11. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్, 80, చౌరింఘీ రోడ్, కోల్‌కతా -20. 12. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అండ్ రీసెర్చ్, 8-ఎ, డైమండ్ హార్బర్ రోడ్, బిల్టెక్ ఇన్ 2 వ అంతస్తు, కుర్పుకుర్, కోల్‌కతా -700063. ఉత్తర్‌ప్రదేశ్ : 13. వారణాసియా సంస్కృత విశ్వవిద్యాలయ, వారణాసి(యూపీ)/జగత్‌పురి, ఢిల్లీ. 14. మహిళాగ్రామ్ విద్యాపీఠ్/విశ్వవిద్యాలయ,(మహిళా) యూనివర్సిటీ, ప్రయాగ్‌రాజ్ 15. గాంధీ హిందీ విద్యాపీఠ్, ప్రయాగ్‌రాజ్, ఉత్తర్‌ప్రదేశ్. 16. నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ ఎలక్ట్రో కాంప్లెక్స్ హోమియోపతి, కాన్పూర్, ఉత్తర్‌ప్రదేశ్. 17. నేతాజీ సుభాష్ చంద్రబోస్ విశ్వవిద్యాలయం (ఓపెన్ విశ్వవిద్యాలయం), అచల్తాల్, అలీఘర్ 18. ఉత్తర్‌ప్రదేశ్ విశ్వవిద్యాలయ, కోషి కలాన్, మధుర 19. మహారాణా ప్రతాప్ శిక్షా నికేతన్ విశ్వవిద్యాలయ, ప్రతాప్‌ఘర్ 20. ఇంద్రప్రస్థ శిక్షా పరిషత్, ఇన్స్టిట్యూషనల్ ఏరియా, కోహోడా, మకాన్పూర్, నోయిడా ఫేజ్ -2. ఒడిశా : 21. నవభారత్ శిక్షా పరిషత్, అనుపూమా భవన్, ప్లాట్ నెంబర్ 242, పానీ టాంకి రోడ్, శక్తినగర్, రూర్కెలా -769014. 22. నార్త్ ఒరిస్సా యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ, యూనివర్సిటీ రోడ్ బారిపాడ, మయూరభంజ్ జిల్లా, ఒడిశా -757003. పుదుచ్చేరి.. 23. శ్రీ బోధి అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, నెం. 186, తిలాస్పేట్, వజుతావూర్ రోడ్, పుదుచ్చేరి -605009. -
‘ఆ మూడు వర్సిటీల స్టడీ సెంటర్లే నకిలీవి’
తెలంగాణలో వివిధ యూనివర్సిటీల స్టడీ సెంటర్ల పేరుతో ఏర్పాటు చేసిన విద్యా సంస్థలు నకిలీవేనని, ఆయా విద్యా సంస్థల్లో చదవొద్దని తెలంగాణ ఉన్నత విద్యా మండలి వెల్లడించింది. ఉత్తరప్రదేశ్ ఆగ్రాలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ, రాజస్థాన్ ఝుంఝునులోని సంఘానియా యూనివర్సిటీ, ఉత్తరప్రదేశ్ ఫిరోజాబాద్‌లోని జేఎస్ యూనివర్సిటీల స్టడీ సెంటర్ల పేరుతో తెలంగాణలో విద్యా సంస్థలను ఏర్పాటు చేసి బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సును నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది. వాటితోపాటు తెలంగాణలో వివిధ పేర్లతో ఏర్పాటు చేసిన మరో 8 కాలేజీల్లో (గురువారం ఉన్నత విద్యా మండలి పేర్కొన్న జాబితాలోని కాలేజీలు) కూడా బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సు నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వంకానీ, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయంగానీ, యూజీసీకానీ ఎలాంటి అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేసింది. వాటిల్లో చేరి విద్యార్థులు నష్టపోవద్దని వివరించింది. అవన్నీ నకిలీవేనని వివరించింది. -
దేశంలో 22 నకిలీ వర్సిటీలు
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా 22 నకిలీ యూనివర్సిటీలు ఉన్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రకటించింది. ఆయా యూనివర్సిటీలు ఇచ్చే డిగ్రీలు చెల్లవని పేర్కొంది. వాటిల్లో విద్యార్థులెవరూ చేరొద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు యూజీసీ సెక్రటరీ జస్పాల్ సింగ్ సంధూ ఉత్తర్వులు జారీ చే శారు. ఇవీ నకిలీ యూనివర్సిటీలు 1. మైథిలీ యూనివర్సిటీ, దర్భంగ, బిహార్; 2. వారణాసేయ సంస్కృత విశ్వ విద్యాలయం, వారణాసి, యూపీ/జగత్‌పురి, ఢిల్లీ; 3. కమర్షియల్ యూనివర్సిటీ లిమిటెడ్, దర్యాగంజ్, ఢిల్లీ; 4. యునెటైడ్ నేషన్స్ యూనివర్సిటీ, ఢిల్లీ; 5. వొకేషనల్ యూనివర్సిటీ, ఢిల్లీ; 6. ఏడీఆర్-సెంట్రిక్ జ్యుడీషియరీ, ఏడీఆర్ హౌజ్, ఢిల్లీ 7. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, న్యూఢిల్లీ,; 8. బడాగన్వి సర్కార్ వరల్డ్ ఓపెన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సొసైటీ, గోకక్, బెల్గాం (కర్ణాటక); 9. సెయింట్ జాన్స్ యూనివర్సిటీ, కిషణట్టం, కేరళ; 10. రాజా అరబిక్ యూనివర్సిటీ, నాగ్‌పూర్; 11. డి.డి.బి. సంస్కృత యూనివర్సిటీ, పుతూర్, తిరుచి, తమిళనాడు; 12. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడి సిన్, చౌరింఘీరోడ్, కోల్‌కతా; 13. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అండ్ రీసర్చ్, కోల్‌కతా 14. మహిళ గ్రామ్ విద్యాపీఠ్/విశ్వవిద్యాలయ (ఉమెన్స్ యూనివర్సిటీ) ప్రయాగ్, ఉత్తరప్రదేశ్; 15. గాంధీ హిందీ విద్యాపీఠ్, ప్రయాగ్, ఉత్తరప్రదేశ్ 16. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎలక్ట్రో కాంప్లెక్స్ హోమియోపతి కాన్పూర్ 17. నేతాజీ సుభాష్ చంద్రబోస్ యూనివర్సిటీ (ఓపెన్ యూనివర్సిటీ) అలీగఢ్, ఉత్తరప్రదేశ్; 18. ఉత్తరప్రదేశ్ విశ్వవిద్యాలయ, కోసికలన్, మధుర, ఉత్తరప్రదేశ్ 19. మహా రాణాప్రతాప్ శిక్షానికేతన్ విశ్వ విద్యాలయం, ప్రతాప్గ ఢ్, ఉత్తరప్రదేశ్ 20. ఇంద్రప్రస్త శిక్షా పరిషత్, మకన్‌పూర్, నోయిడా ఫేస్-2, ఉత్తరప్రదేశ్ 21. గురుకుల్ విశ్వ విద్యాలయ బృందావనం, మధుర, ఉత్తరప్రదేశ్ 22. నవభారత్ శిక్షా పరిషత్ శక్తినగర్, రూర్కేలా -
దేశవ్యాప్తంగా 22 నకిలీ వర్సిటీలు
లక్నో (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్‌లో 8 నకిలీ విశ్వవిద్యాలయాలను నకిలీ వర్సిటీలుగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) శనివారం తేల్చింది. దేశవ్యాప్తంగా 22 నకిలీ యూనివర్సిటీలున్నాయని యూజీసీ అధికారులు పేర్కొన్నారు. ఇందులో యూపీలోనే 8 నకిలీ వర్సిటీలున్నాయని చెప్పారు. జాబితాలో గురుకుల యూనివర్సిటీ (వ్రిందావన్), మహిళా గ్రామ్ విద్యాపీఠ్ (అలహాబాద్), గాంధీ హిందీ విద్యాపీఠ్ (అలహాబాద్), నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎలక్ట్రో కాంప్లెక్స్ హోమియోపతి (కాన్పూర్), ఇంద్రప్రస్థ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (నోయిడా), వారణాసీయ సంస్కృత విశ్వవిద్యాలయం (వారణాసి), నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఓపెన్ యూనివర్సిటీ (అలీగఢ్) ఉన్నాయి. -
దేశంలో 22 నకిలీ యూనివర్సిటీలు
న్యూఢిల్లీ: దేశంలో 22 నకిలీ యూనివర్సిటీలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇందులో అత్యధికంగా ఉత్తరప్రదేశ్ లో 9, ఢిల్లీలో 5 ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు వీటిపై చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. ఫేక్ వర్సటీల వివరాలను విదేశాంగ శాఖకు లేఖ రాసే పనిలో ఉన్నామని తెలిపారు. విద్యార్థులు నఖిలీ వర్సిటీల బారిన పడకుండా చూస్తామని వివరించారు . నఖిలీ వర్సిటీల వివరాలు (యూనియన్ గ్రాండ్ కమిషన్) యూజీసీ దగ్గర ఉన్నాయని తెలిపారు. ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ,పశ్చిమ బెంగాల్, బీహార్ ,కర్నాటక, కేరళ,మహారాష్ట్ర , తమిళనాడు ,ఒడిషాల్లో ఇవి యూజీసీ చట్టానికి విరుద్ధంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయని చెప్పారు. నకిలీ వర్సిటీలను గుర్తించడానికి 'నో యువర్ కాలేజ్' ఆప్ ను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురానున్నామని మంత్రి తెలిపారు. -
దేశంలో నకిలీ యూనివర్సిటీలు ఇవే!
దేశంలో నకిలీ యూనివర్సిటీలు ఉన్నాయి.. కాస్త జాగ్రత్త పడాలంటూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) హెచ్చరించింది. ఈ జాబితాను కూడా వెల్లడించింది. మొత్తం 21 యూనివర్సిటీలను ఈ జాబితాలో చేర్చారు. వీటిలో అత్యధికంగా 8 ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నాయి. మరో 6 నకిలీ వర్సిటీలు ఢిల్లీలో ఉన్నాయి. తమిళనాడు, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ఒక్కోటి చొప్పున నకిలీ యూనివర్సిటీలున్నాయి. తెలుగు రాష్ట్రాలు రెండింటిలోనూ ఇవి ఏవీ లేకపోవడం కొంతలో కొంత ఊరట. 1956 నాటి యూజీసీ చట్టం ప్రకారం కేంద్ర/ రాష్ట్ర/ ప్రొవెన్షియల్ చట్టాల ప్రకారం ఏర్పాటైన విశ్వవిద్యాలయాలు లేదా, చట్టంలోని సెక్షన్ 3 కిందకు వచ్చే డీమ్డ్ వర్సిటీలు మాత్రమే తమను తాము యూనివర్సిటీలని చెప్పుకోడానికి అర్హత కలిగి ఉంటాయి. ఈ పరిధిలోకి రానివన్నీ నకిలీ యూనివర్సిటీలే అవుతాయి. అందువల్ల ఈ 21 యూనివర్సిటీలలో పొరపాటున కూడా చదవొద్దని, ఇవి ఇక మీదట డిగ్రీలు ఇవ్వడానికి వీల్లేదని యూజీసీ ఆ నోటీసులో తెలిపింది. నకిలీ యూనివర్సిటీల జాబితా ఇదీ.. 1. మైథిలి యూనివర్సిటీ, దర్భాంగా, బీహార్ 2. వారణాసీయ సంస్కృత్ విశ్వవిద్యాలయ, ఢిల్లీ 3. కమర్షియల్ యూనివర్సిటీ లిమిటెడ్, ఢిల్లీ 4. యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ, ఢిల్లీ 5. వొకేషనల్ యూనివర్సిటీ, ఢిల్లీ 6. ఏడీఆర్- సెంట్రల్ జ్యురిడికల్ యూనివర్సిటీ, ఢిల్లీ 7. ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఢిల్లీ 8. బడగ్నవీ సర్కార్ వరల్డ్ ఓపెన్ ఎడ్యుకేషనల్ సొసైటీ, బెల్గాం, కర్ణాటక 9. సెయింట్ జాన్స్ యూనివర్సిటీ, కిషనట్టం, కేరళ 10. కేసర్వానీ విద్యాపీఠ్, జబల్పూర్, మధ్యప్రదేశ్ 11. రాజా అరబిక్ యూనివర్సిటీ, నాగపూర్, మహారాష్ట్ర 12. డీడీబీ సంస్కృత యూనివర్సిటీ, పుత్తూరు, తిరుచ్చి, తమిళనాడు 13. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్, కోల్‌కతా, పశ్చిమబెంగాల్ 14. మహిళా గ్రామ్ విద్యాపీఠ్, అలహాబాద్, ఉత్తరప్రదేశ్ 15. గాంధీ హిందీ విద్యాపీఠ్, అలహాబాద్, ఉత్తరప్రదేశ్ 16. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎలక్ట్రో కాంప్లెక్స్ హోమియోపతి, కాన్పూర్, ఉత్తరప్రదేశ్ 17. నేతాజీ సుభాష్ చంద్రబోస్ యూనివర్సిటీ, అలీగఢ్, ఉత్తరప్రదేశ్ 18. ఉత్తరప్రదేశ్ విశ్వవిద్యాలయ, ఉత్తరప్రదేశ్ 19. మహా రాణాప్రతాప్ శిక్షా నికేతన్ విద్యాలయ, ప్రతాప్‌గఢ్, ఉత్తరప్రదేశ్ 20. ఇంద్రప్రస్థ శిక్షా పరిషత్, నోయిడా ఫేజ్ 2, ఉత్తరప్రదేశ్ 21. గురుకుల విశ్వవిద్యాలయ, మథుర, ఉత్తరప్రదేశ్