సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరులోని క్రైస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ నకిలీ యూనివర్సిటీ అని విశ్వవిద్యాలయ నిధుల సంఘం(యూజీసీ) ప్రకటించింది. దేశవ్యాప్తంగా 21 నకిలీ యూనివర్సిటీల వివరాలను బహిర్గతం చేసింది. ఆయా వర్సిటీలు యూజీసీ చట్టానికి విరుద్ధంగా పనిచేస్తున్నాయని పేర్కొంది. వాటికి ఎలాంటి డిగ్రీలను అందజేసే అధికారం లేదని తేల్చిచెప్పింది. ఢిల్లీలో 8, ఉత్తరప్రదేశ్‌లో 4, పశ్చిమబెంగాల్‌లో 2, ఒడిశాలో 2, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, పుదుచ్చేరిల్లో ఒక్కొక్కటి చొప్పున నకిలీ యూనివర్సిటీలు ఉన్నట్లు వెల్లడించింది.
ఇదీ చదవండి: Viral Video:ఓట్ల కోసం స్టూడెంట్స్ కాళ్లు పట్టుకున్న విద్యార్థి నేత.. వీడియో చూస్తే నవ్వాపుకోలేరు
Comments
Please login to add a commentAdd a comment