univeristy
-
నానో శాటిలైట్ సాధనలో తొలిమెట్టు.. పుణేలో గ్రౌండ్ స్టేషన్
మిట్ వరల్డ్ పీస్ యూనివర్సిటీ (MIT-WPU) సంస్థ నానో-శాటిలైట్ చొరవలో భాగంగా పుణే క్యాంపస్‌లో అత్యాధునిక గ్రౌండ్ స్టేషన్‌ను ఏర్పాటు చేసింది. శాటిలైట్ రిసెప్షన్, రేడియో ఆస్ట్రానమీ రెండింటిలోనూ సామర్ధ్యం కలిగిన ఈ కేంద్రాన్ని మిట్ వరల్డ్ పీస్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ రాహుల్ కరాద్ ప్రారంభించారు.రేడియో ఆస్ట్రానమీ పరిశోధన పురోగతికి, శాటిలైట్ కమ్యూనికేషన్ సామర్థ్యాలను మెరుగుపరచడానికి అవసరమైన విలువైన డేటాను ఈ గ్రౌండ్ స్టేషన్ అందిస్తుంది. శాటిలైట్ కమ్యూనికేషన్ (డౌన్‌లింక్), కాస్మిక్ అబ్జర్వేషన్ సంక్లిష్ట పనులను ఏకకాలంలో నిర్వహించగల సామర్థ్యం ప్రపంచంలోనే అరుదైన ఈ కేంద్రానికి ఉంది.లో ఎర్త్ ఆర్బిట్ (LEO), మీడియం ఎర్త్ ఆర్బిట్ (MEO), హై ఎలిప్టికల్ ఆర్బిట్ (HEO), జియోస్టేషనరీ ఎర్త్ ఆర్బిట్ (GEO)లోని ఉపగ్రహాల నుండి సిగ్నల్స్ అందుకోవడానికి రూపొందించిన ఆరు వేర్వేరు యాంటెన్నాలు ఈ గ్రౌండ్ స్టేషన్లో ఉంటాయి. ప్రత్యేకమైన డిష్ అండ్ హార్న్ యాంటెనాలు అధిక-ఫ్రీక్వెన్సీ సంకేతాలను స్వీకరిస్తాయి. వాటిని శక్తివంతమైన రేడియో ఆస్ట్రానమీ సాధనంగా మారుస్తాయి. అత్యంత సూక్ష్మమైన సంకేతాలు, గెలాక్సీ మ్యాపింగ్, డార్క్ మ్యాటర్, కాస్మోస్ రేడియో చిత్రాలను అధ్యయనం చేయడానికి వీలు కల్పిస్తాయి.గ్రౌండ్ స్టేషన్ వాతావరణ డేటాను సేకరించడానికి ఓపెన్ సోర్స్ ఉపగ్రహాల నుండి సిగ్నల్‌లను అందుకోగలదు, అలాగే క్యూబ్శాట్లు, నానోశాట్లు, మైక్రోసాట్ల నుండి టెలిమెట్రీని అందుకోగలదు.స్కూల్ ఆఫ్ సైన్స్ & ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అసోసియేట్ డీన్ డాక్టర్ అనుప్ కాలే, ప్రొఫెసర్ అనఘా కర్నే, డాక్టర్ డియోబ్రత్ సింగ్, డాక్టర్ సచిన్ కులకర్ణిలతో సహా 35 మంది మిట్ వరల్డ్ పీస్ యూనివర్సిటీ విద్యార్థుల బృందం ప్రాజెక్ట్‌లో పని చేస్తోంది. -
యూనివర్సిటీకి రూ.500 కోట్లు.. ఆనంద్ మహీంద్రాపై ప్రశంసల జల్లు
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. అనేక స్ఫూర్తిదాయక కథనాలను షేర్ చేస్తూ, అప్పుడప్పుడు కొందరికి రిప్లై ఇస్తుంటారు. ఎంతో మందికి రోల్ మోడల్‌గా నిలిచిన ఈయన ఇటీవల హైదరాబాద్‌లోని మహీంద్రా యూనివర్శిటీ కోసం రూ. 500 కోట్లు కేటాయించి మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. ఆనంద్ మహీంద్రా ప్రకటించిన నిధులతో మహీంద్రా యూనివర్సిటీలో అనేక కొత్త కోర్సులు ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇంటర్ డిసిప్లినరీ అకడమిక్ ఎక్సలెన్స్ కోసం పాటుపడే మహీంద్రా యూనివర్సిటీ మిషన్‌ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు వీటిని ఉపయోగించనున్నారు. ఆనంద్ మహీంద్రా తల్లి 'ఇందిరా మహీంద్రా' పేరుతో నిర్మించిన ఇందిరా మహీంద్రా స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసం కూడా వ్యక్తిగతంగా రూ.50 కోట్లను అందించనున్నట్లు హామీ ఇచ్చారు. దీనిని విద్యా రంగంలో.. పరిశోధనలు, ఆవిష్కరణలకు సంబంధించిన అంశాల్లో అగ్రగామగా తీర్చిదిద్దాలని సంకల్పించారు. ఇది మహీంద్రా యూనివర్శిటీలో భాగంగా ఉంటుంది. టెక్ మహీంద్రా మాజీ వైస్-ఛైర్మన్ వినీత్ నాయర్ ఆలోచన ద్వారా పుట్టిన మహీంద్రా యూనివర్సిటీ 2020లో ప్రారంభమైంది. నేడు ఇందులో సుమారు 35 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డాక్టరేట్ వంటి కోర్సులు ఉన్నాయి. మహీంద్రా యూనివర్సిటీలో సుమారు 4100 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి స్కూల్ ఆఫ్ హాస్పిటాలిటీ కూడా ప్రారంభం కాబోతుంది. దీనితో పాటు స్కూల్ ఆఫ్ లిబరల్ ఆర్ట్స్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఆనంద్ మహీంద్రా తీసుకున్న ఈ నిర్ణయాన్ని పలువురు ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. -
రాష్ట్రంలో స్కిల్ వర్సిటీ: మంత్రి శ్రీధర్‌బాబు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 165 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయని, ఆయా విద్యార్థుల్లో నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు నైపుణ్య విశ్వ విద్యాలయం ఏర్పాటుకు ప్రణాళికలు చేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) తరహాలో ఈ వర్సిటీ నైపుణ్య మానవ వనరులను అందిస్తుందని వివరించారు. టాటా, మహీంద్ర కంపెనీలు స్కిల్ వర్సిటీ స్థాపనకు ముందుకు వచ్చాయని చెప్పారు. వర్సిటీ కార్యరూపంలోకి వస్తే రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటారని వ్యాఖ్యానించారు. బుధవారం మాదాపూర్‌లోని ఐటీసీ కోహినూర్‌లో జరిగిన టెలిపర్ ఫార్మెన్స్ ఇంప్రెసివ్ ఎక్స్పీరియన్స్ సమ్మిట్‌లో మంత్రి శ్రీధర్‌బాబు ప్రసంగించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు తమ ప్రభుత్వం సరళీకృతమైన విధానం ప్రవేశపెడుతుందని పునరుద్ఘాటించారు. పరిశ్రమల స్థాపనకు హైదరాబాద్ అత్యంత అనువైన ప్రాంతమని స్పష్టం చేశారు. పరిశ్రమలు, ఐటీ, మౌలిక వసతులకు ప్రత్యేక పాలసీలను రూపొందిస్తున్నామని ఆయన చెప్పారు. జూన్‌లో హైదరాబాద్‌లో ఆర్టిఫియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని, దీనికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని ఏఐ కంపెనీలను ఆహ్వనిస్తున్నామని శ్రీధర్‌బాబు వివరించారు. ఏఐ సాంకేతికతలో హైదరాబాద్‌ను గ్లోబల్ హెడ్ క్వార్టర్స్‌గా చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టిసారించామని, టూరిజం అభివృద్ధిని 20 శాతం పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఐటీ, ఇండస్ట్రీ గ్రోత్ ఖాయం 1990వ దశకంలో దేశ ప్రధానిగా పీవీ నర్సింహారావు ఉన్నప్పుడే హైదరాబాద్‌లో ఐటీ ఇండస్ట్రీకి అంకురార్పణ చేశారని మంత్రి శ్రీధర్‌బాబు గుర్తుచేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ... తాము హైదరాబాద్‌లో ఐటీ, ఇండస్ట్రీ గ్రోత్ కొనసాగిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. టెలిపర్ ఫార్మెన్స్ గ్రూప్ ఫౌండర్ డానియల్ జులియన్, సీఈఓ అనీష్ ముక్కర్‌ను ఇండియాకు వచ్చి ఇండస్ట్రీ స్థాపనకు హైదరాబాద్‌ను ఎంపిక చేసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు మంత్రి వివరించారు. గురువారం నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఐటీ, ఇండస్ట్రీ, ఇన్ ఫ్రా స్ట్రక్చర్ పాలసీలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. -
వరల్డ్ యూనివర్సిటీ పోటీలకు అనన్యశ్రీ
మహబూబ్‌నగర్: ఉమ్మడి జిల్లాలోని మక్తల్‌కు చెందిన అనన్యశ్రీ వాలీబాల్‌లో విశేష ప్రతిభ కనబరుస్తుంది. 2019లో ప్రతిష్టాత్మక ఖేలో ఇండియా అథ్లెట్ పథకం కింద కేరళలోని పట్టణమిట్టలోగల వాలీబాల్ అకాడమీకి ఎంపికై శిక్షణ తీసుకుంటుంది. ఈమె తెలంగాణతో పాటు కేరళ జట్టుకు ప్రాతినిథ్యం వహించడం విశేషం. తెలంగాణ నుంచి 2018 పంజాబ్‌లో జూనియర్ నేషనల్ వాలీబాల్ టోర్నీలో రాష్ట్రానికి ప్రాతినిథ్యం వహించింది. 2019లో తమిళనాడు రాష్ట్రం ధర్మపురి, 2020 కడపలో జూనియర్ నేషనల్ వాలీబాల్ పోటీల్లో పాల్గొంది. కేరళ రాష్ట్రం తరపున గతేడాది ఉత్తరాఖండ్ రాష్ట్రం రుద్రాపూర్‌లో 23వ జాతీయస్థాయి, మహారాష్ట్ర సాంగ్లి జిల్లా ఇస్లాంపూర్‌లో 24వ జాతీయస్థాయి యూత్ వాలీబాల్ పోటీల్లో పాల్గొంది. కేరళలో సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ, మహారాష్ట్ర రాష్ట్రం కొల్హాపూర్‌లో సీనియర్ లీగ్ (హరియంట్ చసాక్) వాలీబాల్ టోర్నీలో పాల్గొంది. ఈ మూడు టోర్నీల్లో కేరళ జట్టు విన్నర్‌గా నిలిచింది. అస్సాం రాష్ట్రం గౌవహాటిలో ఈ ఏడాది ఫిబవరిలో 71వ ఉమెన్ సీనియర్ నేషనల్ వాలీబాల్ పోటీలకు కేరళ రాష్ట్ర జట్టుకు అనన్యశ్రీ ప్రాతినిథ్యం వహించింది. సీనియర్ నేషనల్ వాలీబాల్ చాంపియన్‌షిప్‌లో కేరళ మహిళా జట్టు విజేతగా నిలవడంతో అనన్యశ్రీ బంగారు పతకం సాధించింది. పాండిచ్చేరిలో ఫెడరేషన్ కప్ వాలీబాల్ పోటీల్లో పాల్గొనగా కేరళ రాష్ట్ర జట్టు రన్నరప్‌గా నిలిచింది. వరల్డ్ యూనివర్సిటీ పోటీలకు.. అనన్యశ్రీ తొలిసారిగా విదేశీగడ్డపై వాలీబాల్ పోటీల్లో పాల్గొననుంది. చైనా దేశం చెంగ్డ్ నగరంలో ఈనెల 28 నుంచి వచ్చేనెల 7వ తేదీ వరకు నిర్వహించే శ్రీవరల్డ్ యూనివర్సిటీ చాంపియన్షిప్శ్రీకు ఎంపికైంది. కేరళ యూనివర్సిటీ నుంచి చైనాకు వెళ్లే ఆలిండియా యూనివర్సిటీ వాలీబాల్ జట్టులో అనన్యశ్రీ చోటు దక్కించుకుంది. ఒరిస్సా రాష్ట్రం భువనేశ్వర్‌లో ఈనెల 19 నుంచి 24 వరకు నిర్వహించిన ప్రత్యేక కోచింగ్ క్యాంపులో పాల్గొంది. -
చదువుకు పరదాలా?
కరోనా భయంతో ప్రపంచం క్వారంటైన్ అవుతున్న రోజుల్లో, అఫ్గానిస్తాన్ మహిళలు అంతకన్నా భయానకమైన వేరొక కారణంతో ఏకాంతవాస శిక్ష అనుభవిస్తున్నారు. వారు అన్ని హక్కులూ కోల్పోయి జీవితాన్నీ, భవిష్యత్తునూ తాలిబన్ ముష్కర పాలకుల దయాదాక్షిణ్యాలకే వదిలేసు కోవాల్సి వచ్చింది. గత నెలలో పార్కులు, జిమ్‌లు, ఈతకొలనుల తర్వాత ఇప్పుడు అఫ్గాన్ విశ్వవిద్యాలయాల్లో మహిళల ప్రవేశాన్ని తాలిబన్ ఏలికలు నిరవధికంగా నిషేధించారు. అలా విద్యార్థినుల్ని చదువుకు దూరం చేస్తూ మంగళవారం హుకుం జారీ చేశారు. అదేమంటే ‘జాతీయ ప్రయోజనం, మహిళల గౌరవం’ కోసం ఈ పని చేశామంటున్నారు. జనాభాలో సగాన్ని పిడికిట బంధించి, విద్యావంతులు కాకుండా చేస్తే ఏ జాతీయ ప్రయోజనం సిద్ధిస్తుందో దేవుడికి తెలియాలి. తాలిబన్ల ధోరణి తెలుసు గనక ఈ దుర్నిర్ణయం ఆశ్చర్యమేమీ కాకున్నా, అంతర్జాతీయ సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఆడిన మాట తప్పిన అనాగరిక పాలనను కళ్ళకు కట్టింది. అఫ్గాన్‌లో మానవ హక్కులను పరిరక్షించాలంటూ ఐరాస ప్రధాన కార్యదర్శి పిలుపునిచ్చిన మర్నాడే తాలిబన్ల తాజా నిర్ణయం వెలువడింది. తాలిబన్ల నిర్ణయంపై స్థానిక ఉద్యమకారుల మొదలు అమెరికా నేతల దాకా అంతా నిరసన గళం విప్పారు. 2021 ఆగస్ట్‌లో అమెరికా సారథ్యం లోని పాశ్చాత్య సేనల అర్ధంతర ఉపసంహరణతో అధికారం హస్తగతం చేసుకున్న తాలిబన్ మూకల అకృత్యాలకు ఇదే మొదలు కాదు. తాలిబన్లు గద్దెనెక్కిన నాటి నుంచి అత్యధికంగా అణచివేతకు గురైంది మహిళలే. స్త్రీలను ప్రభుత్వ, ప్రజావిధాన పాత్రల నుంచి పక్కకు తప్పించి ఇంట్లో పరదాల చాటుకు పరిమితం చేశారు. ఈ మార్చిలోనే ఆడపిల్లల చదువుపై నిషేధాల కథ మొదలైంది. ఆరో తరగతి దాటాక ఆడపిల్లలకు బడి చదువు తోసిపుచ్చారు. ఉన్నత విద్యకు ఇప్పుడు తెర దించేశారు. ఒక్కముక్కలో ఈడొచ్చిన పిల్లలెవరూ వీధుల్లోకి ఒంటరిగా రావడానికి వీల్లేదు. చదువు, ఉద్యోగాలే కాదు, చివరికి పక్కనున్న పార్కుకు వెళ్ళే స్వతంత్రం కూడా స్త్రీలకు లేకుండా చేయడం అమానుషం. ఈ ఛాందసత్వమే అస్థిరతకూ, దారిద్య్రానికీ, అదుపు లేని జనాభా పెరుగుదలకూ దారి తీస్తుంది. 1990లలోని నిరుటి తాలిబన్ పాలన తర్వాత 2001 నుంచి దాదాపు ఇరవై ఏళ్ళ కాలంలో అఫ్గాన్ కాస్త ఊపిరి పీల్చుకుంది. స్త్రీ విద్య సహా పలు అంశాల్లో సామాజికంగా ఎంతోకొంత పురోగతీ సాధించింది. వాటన్నిటినీ ఇప్పుడు తుంగలో తొక్కుతోంది తాజా తాలిబన్ మధ్యంతర సర్కార్. అందరినీ కలుపుకొనిపోతామంటూ దోహా చర్చల్లో గొప్పగా చెప్పిన ఈ తాలిబన్ 2.0 సర్కార్ ఆచరణలో ఆది నుంచి అందుకు విరుద్ధంగానే వ్యవహరిస్తోంది. ఏడాది దాటినా, ఇప్పటికీ వారికి చట్టబద్ధమైన పాలకులుగా అంతర్జాతీయంగా అధికారిక గుర్తింపు రాలేదు. స్త్రీల పట్ల తిరోగమన విధానాలే అందుకు ప్రధాన కారణం. తాలిబన్లు అనుసరిస్తున్నామని చెబుతున్న ఇస్లామిక్ షరియా చట్టం సైతం ఈ విధానాలను సమర్థించదు. ఆ మాటకొస్తే, గతంలోనూ ఇలాంటి విధానాలు, వ్యవహారాల వల్లే అఫ్గాన్‌లో అంతర్జాతీయ జోక్యం మొదలైంది. తాలిబన్లకు సన్నిహితమైన పాక్ సైతం స్త్రీ విద్యానిరోధాన్ని నిరసించడం విశేషం. ఆ మాటకొస్తే, 1990లలో తాలిబన్ల ప్రభుత్వాన్ని గుర్తించిన సౌదీ అరేబియా, యూఏఈ, పాక్ సైతం ఏడాది క్రితం వచ్చిన కొత్త తాలిబన్ సర్కార్‌ను ఇంకా గుర్తించనే లేదు. మరోపక్క మత ఛాందసవాద ఇస్లామిస్ట్ సర్కార్ పుణ్యమా అని కాబూల్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఏడాదిగా అంతర్జాతీయ వాణిజ్యం, సహాయం దాదాపు ఆగిపోయాయి. ఏటా 400 కోట్ల అమెరికన్ డాలర్ల మేర విదేశీ సాయం అందుకొనే దేశానికి ఇది పెద్దదెబ్బ. అయినా సరే ఉక్రెయిన్‌పై రష్యా దాడితో తలమునకలైన పాశ్చాత్య ప్రపంచం సహా వర్తమాన అంతర్జాతీయ అనిశ్చితిని వాటంగా చేసుకొని, తాలిబన్లు యథేచ్ఛగా వర్తిస్తున్నారు. కొద్దివారాల క్రితమే బహిరంగ కొరడా దెబ్బలు, ఉరి విధానాల్ని పునరుద్ధ రించారు. ఆంక్షల నుంచి బయటపడేందుకూ, అంతర్జాతీయ చట్టబద్ధతకూ ఇవేవీ కాబూల్‌కు తోడ్పడవు. అయినా మొండిగా ముందుకుపోతుండడం విడ్డూరం. స్త్రీ విద్యను ప్రోత్సహిస్తే స్థానికం గానూ, అంతర్జాతీయంగానూ సంబంధాలు మెరుగవుతాయని గ్రహించకపోవడం విచిత్రం. తాలిబన్ల తొలి ఏలుబడిలోనూ దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, ఆనాటి అఫ్గాన్ మహిళలు ధైర్యం చేసి, ప్రాణాలను పణంగా పెట్టి, రహస్యంగా చదువులు చెప్పడం వల్లే నేటి తరం మహిళ తయారైంది. ఇప్పుడిక ఈ తరం తమ గౌరవం కోసం, న్యాయబద్ధమైన హక్కుల కోసం పోరాడాల్సిన సమయం వచ్చింది. అయితే, వారి ఆశలు, ఆకాంక్షలను గుర్తించి, గౌరవించి, అండగా నిలవాల్సిన బాధ్యత అంతర్జాతీయ సమాజానిది! వివిధ వేదికలపై ప్రపంచ దేశాలన్నీ తీవ్రంగా స్పందించాలి. అంతర్జాతీయంగా ఒత్తిడి పెంచాలి. అఫ్గాన్‌తో సంబంధాలపై ఆంక్షల అస్త్రం సహా సామదాన దండోపాయాలను ప్రయోగించాలి. ఐరాస భద్రతామండలి లాంటివి చేయగలిగిందేంటో చూడాలి. దోహా చర్చల సాక్షిగా చేసిన బాసలు తప్పి, లింగ దుర్విచక్షణతో అమానవీయంగా వ్యవ హరిస్తున్న తాలిబన్ సర్కారుకు ముకుతాడు వేయాలి. ఆచరణాత్మక ప్రయోజనాల రీత్యా కాబూల్‌కు స్నేహహస్తం చాస్తున్న భారత్ సైతం ఆటవిక పాలకుల్ని తగు దూరంలో పెడితే మంచిది. చరిత్రను పునర్లిఖిస్తున్న మహిళల్ని ప్రజాజీవితానికి దూరంగా వంటింటి కుందేళ్ళుగా మారుస్తామంటే ఆధునిక సమాజానికి అంగీకారయోగ్యం కాదని తాలిబన్లకు తెలివిడి కలిగించడం ముఖ్యం. -
దేశవ్యాప్తంగా 21 నకిలీ వర్సిటీలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరులోని క్రైస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ నకిలీ యూనివర్సిటీ అని విశ్వవిద్యాలయ నిధుల సంఘం(యూజీసీ) ప్రకటించింది. దేశవ్యాప్తంగా 21 నకిలీ యూనివర్సిటీల వివరాలను బహిర్గతం చేసింది. ఆయా వర్సిటీలు యూజీసీ చట్టానికి విరుద్ధంగా పనిచేస్తున్నాయని పేర్కొంది. వాటికి ఎలాంటి డిగ్రీలను అందజేసే అధికారం లేదని తేల్చిచెప్పింది. ఢిల్లీలో 8, ఉత్తరప్రదేశ్‌లో 4, పశ్చిమబెంగాల్లో 2, ఒడిశాలో 2, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, పుదుచ్చేరిల్లో ఒక్కొక్కటి చొప్పున నకిలీ యూనివర్సిటీలు ఉన్నట్లు వెల్లడించింది. ఇదీ చదవండి: Viral Video:ఓట్ల కోసం స్టూడెంట్స్ కాళ్లు పట్టుకున్న విద్యార్థి నేత.. వీడియో చూస్తే నవ్వాపుకోలేరు -
తీరని అవమానం.. గోల్డ్‌మెడల్ నాకొద్దు!
-
తీరని అవమానం.. గోల్డ్‌మెడల్ నాకొద్దు!
పుదుచ్చేరి విశ్వవిద్యాలయంలో బంగారు పతక విజేత రుబీహాకు చేదు అనుభవం ఎందురైంది. 2018 మాస్ కమ్యూనికేషన్ (ఎంఏ) విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన రుబీహా కాన్వొకేషన్ కార్యక్రమానికి వెళ్లారు. కార్యక్రమానికి హాజరైన రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ వేదిక నుంచి వెళ్లేంత వరకు తనను తిరిగి హాల్లోకి అనుమతించలేదని రుబీహా ఆరోపించారు. రాష్ట్రపతి విశ్వవిద్యాలయం నుండి బయలుదేరే వరకు దాదాపు 20 నిమిషాలు బయటనే వేచి ఉండాల్సి వచ్చిందని వాపోయారు. స్నాతకోత్సవం ముగిసిన తరువాత ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రపతి వచ్చినప్పుడు, తను హాలు నుంచి బయటికి (బలవంతం చేయనప్పటికీ) రావాలని కోరారని తెలిపారు. ఇది తనకు తీరని అవమానమని కేరళకు చెందిన రుబీహా కంట తడి పెట్టారు. సీఏఏకి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయవచ్చనే అనుమానంతోనే తనను కాన్వొకేషన్ హాల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారన్నారు. దీనికి నిరసనగా తన సర్టిఫికెట్‌ను మాత్రమే తీసుకుని, గోల్డ్‌మెడల్‌ను తిరస్కరిస్తున్నట్టు వెల్లడించారు. అంతేకాదు, దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీకి, సీఏఏకి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ప్రతీ ఒక్కరికీ సంఘీభావంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల దారుణానికి వ్యతిరేకంగా తన బంగారు పతకాన్ని తీసుకోవడానికి నిరాకరిస్తున్నట్టు చెప్పారు. దీనిపై విద్యావంతులైన యువతగా తాము బలమైన వైఖరి తీసుకోవాలన్నారు. అయితే ఈ ఆరోపణలను విశ్వవిద్యాలయ అధికారులు ఖండించారు. కాగా, విశ్వవిద్యాలయంలో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ర్యాలీలలో రుబీహా క్రమం తప్పకుండా పాల్గొనేవారని తెలుస్తోంది. ముఖ్యంగా గతంలో బీజేపీ నాయకుడు తరుణ్ విజయ్ క్యాంపస్ పర్యటనకు వ్యతిరేకంగా ఆమె నిరసనలకు నాయకత్వం వహించినట్టుగా సమాచారం. మరోవైపు బంగారు పతకాలను గెల్చుకున్న ఇతర విద్యార్థులు ఈ సమావేశాన్ని బహిష్కరించాలని నిర్ణయించారట. ఇందులో భాగంగా కొంతమంది కేవలం సర్టిఫికెట్లను మాత్రమే స్వీకరించారు. -
గిరిజన ప్రాంతాలను ప్రత్యేక జిల్లా చేస్తాం
-
ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లు ఉపసంహరించుకోవాలి
ఎదులాపురం(ఆదిలాబాద్) : ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యం లో బుధవారం ఆందోళన చేపట్టారు. స్థానిక బస్టాండ్ ఎదుట ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సం దర్భంగా నాయకులు మాట్లాడారు. ప్రభుత్వం ఓ వైపు కేజీ టూ పీజీ ఉచిత విద్య అందిస్తామంటూనే మరో వైపు విద్యా వ్యాపారాన్ని ప్రోత్సహిస్తుందన్నా రు. యూనివర్సిటీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించకుండా.. ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలకు విచ్చిలవిడిగా అనుమతులిస్తోందని విమర్శించారు. ఫలితంగా ప్రభుత్వ విద్యాసంస్థలు మూతపడే పరిస్థి తి ఏర్పడుతోందన్నారు. కార్యక్రమంలో టీఏవీఎస్ జిల్లా అధ్యక్షుడు కోట్నాక రాహుల్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆత్రం నగేశ్, కన్వీనర్ సుప్రియ, టీవీవీ జిల్లా అధ్యక్షుడు బి.రాహుల్, పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి పి.కళావతి, టీఏవీఎస్ రాష్ట్ర కార్యదర్శి పూసం సచిన్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అన్నమెల్ల కిరణ్, టీవీవీ, పీడీఎస్‌యూ నాయకులు శివ, అజయ్, తదితరులు పాల్గొన్నారు. -
తవ్వేకొద్దీ అక్రమాలు
యూనివర్సిటీ :ఒక వ్యక్తి డిగ్రీ చదవడానికి ఎన్నో వ్యయప్రయాసలు ఎదుర్కొంటాడు. తల్లిదండ్రులు తమ బిడ్డలను చదివించడానికి అహర్నిశలు శ్రమిస్తారు. తన జీవిత కాలంలో కనీసం 15 ఏళ్లు కష్టపడి చదివితే వచ్చే ప్రతిఫలం డిగ్రీ సర్టిఫికెట్. కానీ ఎస్కేయూలోని అండర్ గ్రాడ్యుయేషన్ (యూజీ) విభాగం ఉద్యోగులు 15 సెకెన్లలోనే ఒక వి ద్యార్థిని పాస్ లేదా ఫెయిల్ చేయగలరు. వారి నిర్లక్ష్యం ఫలితంగా విద్యార్థులు రోడ్డున పడుతున్నారు. దర్యాప్తు ప్రారంభించిన కమిటీ: యూజీ పరీక్షల అక్రమాలపై నిగ్గుతేల్చడానికి నియమించిన ప్రొఫెసర్ల కమిటీ దర్యాప్తును గురువారం ప్రారంభించింది. ఆచార్య బి.ఫణీశ్వరరాజు, ఆచార్య అక్తర్, ఆచార్య బి.కృష్ణారెడ్డిలు యూజీ పరీక్షల విభాగం ఉద్యోగులను విచారించారు. ప్రతి ఉద్యోగి వద్ద వివరాలు ఆరా తీశారు. ఏమి చెప్పాలనుకొన్నా వాటిని లిఖిత పూర్వకంగా రాసివ్వాలని కమిటీ ఆదేశించింది. శుక్రవారం లోపు అందరు ఉద్యోగులు పరీక్షల విభాగంలో తాము నెరవేర్చిన బాధ్యతల గురించి తెలియజేయనున్నారు. వచ్చే సోమవారం లోపు కమిటీ నివేదికను అందజేయనుంది. నివ్వెరపోయిన కమిటీ సభ్యులు: విద్యార్థి సాధించిన మార్కులు పద్ధతి ప్రకారం నమోదు చేయకుండానే సర్టిఫికెట్లు జారీ చేశారని కమిటీ ప్రాథమికంగా నిర్ధారించినట్లు సమాచారం. ప్రతి విద్యార్థి మార్కుల వివరాలను డబుల్ ఎంట్రీ ద్వారా భద్రపరుస్తారు. పరీక్ష ఫీజు కట్టని విద్యార్థిని పాస్ చేసినట్లయితే ఆ ఎంట్రీ ఎర్రర్ అని చూపిస్తుంది. ఈ విధంగా ఎర్రర్ అని వచ్చినప్పటికీ ఎందుకు పాస్ అయినట్లు మార్కుల జాబితాలు జారీ చేశారో తెలపాలని కమిటీ ప్రశ్నించింది. తొందరగా ఫలితాలు ఇవ్వాలని నిర్ణయించుకోవడంతో తప్పిదాలు జరిగాయని ఉద్యోగులు బదులిచ్చినట్లు తెలిసింది. తాజా ఫలితాలలోనే లేక గతంలోనూ ఇదే విధంగా జరిగిందా? అనే అంశాలపై కమిటీ అధ్యయనం చేయనుంది. సర్టిఫికెట్లలో పేర్లు గల్లంతు:ప్రొవిజనల్ సర్టిఫికెట్లలో వి ద్యార్థి పేరు, హాల్‌టికెట్ నెంబరు లేకుండానే 200 బీబీఎం మార్కుల జాబితాలు జారీ చేశారు. ఇంగ్లిష్ మీడియంలో పరీక్ష రాస్తే బీఏ తెలుగు మీడియంగా గుర్తించారు. ప్రతి రోజు వి ద్యా ర్థులకు జరిగిన అన్యాయాలు బయటకు వస్తున్నాయి. కమిటీ దర్యాప్తు చేస్తున్న కొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి. 10లోపు రీవాల్యుయేషన్ ఫలితాలు లేనట్లే: గత నెల 18న డిగ్రీ ఫలితాలు విడుదల చేశారు. డిగ్రీలో సబ్జెక్టులు తప్పినవారు రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేయడానికి ఈ నెల 3వరకు గడువు విధించారు. 10వ తేదీలోపు ఫలితాలు ప్రకటిస్తామని విద్యార్థుల సెల్ఫోన్లకు మెసేజ్‌లు పంపారు. కానీ ఇంతవరకు స్క్రిప్ట్‌లు తీయలేదు. కోడింగ్ చేయలేదు. దీంతో రీవాల్యుయేషన్ ఫలితాలు మరింత ఆలస్యమయ్యే సూచనలున్నాయి. -
నాణ్యత ఉత్తుత్తే
యూనివర్సిటీ: అనంతపురం జేఎన్టీయూ వ్యవహారం పేరు గొప్ప.. ఊరు దిబ్బ అనే చందాన తయారైంది. సాంకేతిక విద్య బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నామన్న మాటలు నీటి మూటలవుతున్నారుు. జేఎన్టీయూ, అనుబంధ కళాశాలల్లో శాశ్వత ప్రాతిపదికన భోదన సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీంతో తాత్కాతిక ప్రాతిపదికన సిబ్బందితో నెట్టుకొస్తున్నారు. ఏటా బీటెక్ విద్యార్థుల ఉత్తీర్ణతా శాతం గణనీయంగా తగ్గిపోతున్నా, చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. మరో వైపు ఐఐటీ ముంబై తరహాలో క్లాస్‌రూం కాంప్లెక్స్‌ను రూ.16.07 కోట్ల వ్యయంతో ఆధునాతనంగా నిర్మించాలని తలపెట్టినా రెండు సార్లు టెండర్లు రద్దు చేశారు. దీంతో అది కార్యరూపం దాల్చలేదు. అభివృద్ధి పనులకు ఆమడ దూరం అనంతపురం జేఎన్టీయూ కళాశాలలో వివిధ విభాగాలు, ల్యాబ్ సౌకర్యాలు వేర్వేరుగా ఉండడంతో విద్యార్థులు, అధ్యాపకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో క్లాస్ రూం కాంప్లెక్స్‌ను ఐఐటీ ముంబై తరహాలో ఒకే చోట నిర్మించ తలపెట్టారు. ఈ క్రమంలో నాలుగు నెలల వ్యవధిలో రెండు సార్లు ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్లను పిలిచారు. ఈ టెండర్లపై నిష్ణాతులైన బిల్డింగ్ కమిటీ సభ్యుల ద్వారా విధివిధానాలు రూపొందించారు. తొలి దఫా పిలిచిన టెండర్లలో యూరో కన్స్ట్రక్షన్ కంపెనీకి టెండర్లు గడువు ముగిసిన ఆఖరి రోజున కంపెనీ రిజిస్ట్రేషన్ గడువు ముగిసింది. టెండర్లు ఇస్తే రిజిస్ట్రేషన్ గడువును పొడగించుకుంటామని సదరు కంపెనీ ప్రతినిధులు కోరినప్పటికీ సాంకేతిక కారణాలు తలెత్తుతాయని జేఎన్టీయూ బిల్డింగ్ కమిటీ తేల్చి చెప్పడంతో టెండర్ల ప్రక్రియ ఆగిపోయింది. రెండో దఫా టెండర్లు రాజకీయ ఒత్తిళ్లతో ఆపివేశారనే విమర్శలున్నాయి. ఈ -ప్రొక్యూర్మెంట్లలో నిర్దేశించిన విధానాలను మారిస్తే తమకు అనుకూలమైన కంపెనీలకు టెండర్లు కట్టబెట్టవచ్చనే ఉద్దేశంతో టెండర్లను తరచూ వాయిదాలు వేయిస్తున్నారు. పైకి యూజీసీ నిధుల లేమి దృష్ట్యా అభివృద్ధి పనులను ఆపివేస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ, నిధులు లేకుండా జేఎన్టీయూ టెండర్ల ప్రక్రియకు వెళ్లిన సందర్భాలు లేవు. జనవరిలోగా ప్రకటనలు జారీ చేయాల్సిందే జేఎన్టీయూ (ఏ)వీసీగా ఆచార్య కే.లాల్‌కిశోర్ పదవీ కాలం వచ్చే ఏడాది జూన్30న ముగియనుంది. వీసీ తన పదవీ కాలం ముగిసే ఆరునెలల లోపు ఏ విధమైన ఉద్యోగాల భర్తీ చేయకూడదని ఉన్నత విద్యా మండలి ముఖ్య కార్యదర్శి గతంలో స్పష్టం చేశారు. జేఎన్టీయూలో ఖాళీగా ఉన్న, కొత్తగా బోధనా పోస్టులు భర్తీ చేసుకోవడానికి మానిటరింగ్ అండ్ డెవలప్మెంట్ కమిటీ (ఎం.ఎన్.డీ.సీ) అనుమతులు మంజూరు చేసింది. 160 బోధన పోస్టులు భర్తీ చేసుకోవడానికి రాష్ట్ర ఆర్థిక శాఖకు అనుమతులు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం బ్లాక్ గ్రాంట్స్‌ను తగిన విధంగా కేటాయించలేదనే నెపంతో పోస్టులు భర్తీ చేయకుండా వాయిదా వేస్తున్నారు. అయితే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నూతనంగా భర్తీ చేసే ఉద్యోగాలకు 90 శాతం, 10 శాతం జీతాలను మొదటి ఐదేళ్లలో భరిస్తుంది. వచ్చే విద్యాసంవత్సరం ఆరంభంలోగా ఖాళీగా ఉన్న, నూతనంగా మంజూరైన ఉద్యోగాలను భర్తీ చేయకపోతే యూజీసీ నిధులను ఆపివేస్తామని హెచ్చరించింది. ఉన్నత విద్యా మండలి చెర్మైన్ ఆచార్య ఎల్.వేణుగోపాల్ రెడ్డి గత వారంలో ఎస్కేయూ పర్యటనకు వచ్చిన సందర్భంలో కూడా యూజీసీ సూచనలను పరిగణలోకి తీసుకుని, జేఎన్టీయూలో భోదన పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామన్నారు. జేఎన్టీయూకు రాష్ట్ర ప్రభుత్వం అందించే బ్లాక్‌గ్రాంట్స్ పై ఆధారపడక్కరలేదని, వర్సిటీ అంతర్గత వనరులు పుష్కలంగా ఉన్నందున భర్తీకి ఆటంకాలు ఉండబోవని స్పష్టం చేశారు. రాజకీయ జోక్యాలకు తలొగ్గకుండా అభివృద్ధి కార్యక్రమాలు, బోధన పోస్టులు భర్తీ చేసి సాంకేతిక విద్య పటిష్టతకు చర్యలు తీసుకోవాలని విద్యావేత్తలు కోరుతున్నారు. -
కొట్టినోన్ని..పెట్టినోన్ని మర్సిపోకూడదు..!
‘‘ఏరా మహేశ్....ఆదివారం ఓట్లుండాయి కదా...మీ వీధిలో లెక్క ఎంత పంచుతాండారు..!’ ‘ఏమో...అల్తాఫ్...డబ్బులు మేము తీసుకోవడం లేదు. మేం ఎవ్వరికి ఓట్లెయ్యాలో డిసైడైనాం.! ‘ఎవ్వరికేస్తున్నావోయ్...కొత్తపార్టీకా...పాతపార్టీకా...!’ ‘కొత్తలేదు...పాత లేదు..మామ...మాకు ఎవరు మంచి చేసినారో...మేము వాళ్లకే ఓట్లేస్తాం...కొట్టినోన్ని పెట్టినోన్ని మర్సిపోకూడదు కదా...ఈ ఎలచ్చన్లలో అందరూ అట్టనే ఉండారు.’ ‘ఇంతకి ఎవ్వరు కొట్టినారు...ఎవ్వరు పెట్టినారోయ్..!’ ‘ఏం నీకు తెల్దు. మనం కాలేజీకి పోయేటప్పుడు మీ అవ్వకు పింఛన్ కోసం పోతే...మీ వార్డులో 22 మందికి 75 రూపాయలు వచ్చాంది. వాళ్లలో ఎవరైనా సచ్చిపోతే అప్పుడు రాండి అని అధికార్లు సెప్సినారు. మతికి లేదా?’ ‘కరెక్టే మామ..సచ్చిపోయినాక కూడా ఇవ్వలే! చంద్రబాబు హయాంలో ...2001లో అనుకుంటా...బుగ్గవంకకు వరదొచ్చి...ఇండ్లన్నీ మునిగిపోయినాయి...సుమారుగా 30మందిదాకా సచ్చిపోయినారు...కడపలో ఇంత కంటే మరొక ఘోరం ఏం లేదనుకో...ఇండ్లంటే మునిగినాయి...కనీసం మనుషుల ప్రాణాలు కూడా కాపాడలేకపోయినారే! నాకు బాగా గుర్తుంది. ఒక చిన్నపిల్ల...నాలుగేళ్లు ఉంటాయి...వాళ్ల అమ్మ...నాన్న ఇద్దరూ కొట్టుకుపోయినారు..ఆ పాపకు ఎవ్వరు లేరు. ఒక్కటీ అమ్మా..నాన్న అని ఏడుస్తాంటే గుండె భగ్గుమనింది మామ....చివరకు ఆ పాప వాళ్ల అవ్వ కనీసం నాకు పింఛన్ అయినా ఇయ్యండయ్యా అని ఎంత మొత్తుకోని ఏడ్సినా ఎవరూ పట్టించుకోల్యా! ‘అవునుమామ వైఎస్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 200 ఇచ్చినారు. మన వార్డులో ఎంతమంది ముసలోళ్లు ఉండారో....అందరికీ 200 పింఛన్ ఇచ్చినారు...అదిగుడక ఒకటో తేదీ జీతం మాదిరి!’ ‘ పింఛనే కాదురా...బుగ్గవంకకు మళ్లీ వరద రాకుండా మొత్తం రక్షణ గోడ కట్టినారు..’ ఇంక ఎంత వరదొచ్చినా నీళ్లు రావు.’ ‘ఇంతకు పెద్దాయప్ప సీఎం అయిన తర్వాత కడప కు శానా మేలు చేసినాడు మామ..కడపను కార్పొరేషన్ సేసినాడు. రిమ్స్ కట్టిచ్చినాడు...యూనివర్శిటీ...రోడ్లు వెడల్పు చేయడం...బుగ్గవంకపైన ఫ్లైఓవర్ బ్రిడ్జిలు..ఒక్కటేంటి శానా చేసినాడు.’ ‘కడపకే కాదురా...జిల్లా అంతా బాగా సేసినారు. రాయచోటి, బద్వేలు, రాజంపేట, జమ్మలమడుగు, పులివెందుల ఒక్కటేసారి ఐదు మునిసిపాలిటీలు సేసినాడు. అప్పట్లో రాజీవ్ నగరబాట’ అని వచ్చి...ఏసమస్యలు అధికారులు సెప్పినారో...అన్నిటికి డబ్బులు ఇచ్చినాడు.’ ‘ కరెక్టే ప్రొద్దుటూరు వెటర్నరీ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ కట్టిచ్చినాడు...తాగునీటి సమస్య తీర్చేందుకు కుందు-పెన్నా వరద కాలువకు డబ్బులు ఇచ్చినాడు.’ ‘ఇంతకీ అది పూర్తి అయిందా...కాలేదా..?’ ‘కాలేదు... ఆ ఇద్దరు నాయకులు ఒకర్నిమించి ఒకరు దాన్ని అడ్డుకున్య్నారు. ఇప్పుడు ఇద్దరు టీడీపీలో సేరినారు. వాళ్లిద్దరి వల్లనే ఆ నీళ్లు పెన్నాలోకి రాలే! ఈ విషయం పొద్దుటూరోళ్లందరికీ తెలుసు. అయినా 25 ఏండ్లు ఎమ్మెల్యేగా ఉండి నీళ్ల సమస్య కూడా తీర్చకపోవడం ఏంటి మామ..దేనికి ఓట్లేసేది పన్లాకనా!’ ‘కరెక్టేరా..!పక్కనే జమ్మలమడుగు ఎమ్మెల్యే సూ డు మైలవరం నుంచి వాటర్ స్కీం తీసుకొచ్చినాడు.! ‘అదొక్కటే కాదు మామ..ఆస్పత్రికి 2004 నుంచి ఇప్పటి దాకా ప్రతీ నెల 30వేల మందులకు డబ్బులు ఇచ్చాండాడు. ఆయప్ప పుణ్యాన రోగులంతా సంతోషంగా ఉండారు. పైగా అక్కడ ప్రతీ వీధిలో సిమెంట్‌రోడ్లు ఉంటాయి...మొత్తానికి ఆయప్ప బాగా సేసుకున్యాడు. ‘పులివెందుల పరిస్థితి ఏంటి? ‘దాని కథ సెప్పాలేంవోయ్...ఒక్కసారి పోయి సూడుపో...ఎట్టుందో!’ ‘మొత్తానికి పెద్దాయప్ప వల్ల అందరూ లబ్ది పొందినారు మామ.’ ‘అందరూ అంటే...’ ‘అందరూ అంటే అందరూ గ్యాస్ సబ్సిడీ 50 రూపాయలు వైఎస్సే భరించినాడు. దీంతో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ మేలు జరిగింది. చివరకు చంద్రబాబు నాయుడు ఇంట్లో గ్యాస్‌కు కూడా వైఎస్ ప్రభుత్వం 50 రూపాయలు సబ్సిడీ భరించింది.’ ‘కరెక్ట్మామ...ఆయప్ప ఇచ్చిన ఫీజురీయింబర్స్‌మెంట్ వల్ల మా తమ్ముడు సదువుకున్న్యాడు. ఆరోగ్యశ్రీ వల్ల మీ తాత ఆపరేషన్ చేయించుకున్నాడు.’ ‘నీకు ఒకమాట సెప్పమంటావా...మా తాత...హెడ్మాస్టర్గా రిటైరైనప్పుడు 5వేలు జీతం తీసుకోలేదంటా. ఇప్పుడు పింఛనే 15వేలు పైన వస్తాంది...ఇదంతా వైఎస్ పెంచాడని మాతాత సెబుతాంటాడు.’ ‘మరి ఇట్టాంటోళ్లంతా వైఎస్ కుటుంబాన్ని మర్సిపోకూడదు మామ...ఎందుకంటే కొట్టినోన్ని...పెట్టినోన్ని మర్సిపోకూడదు కదా..!’ ‘సరే...మామ...మనకు ఎవ్వరు మేలు చేసినారో...సేచ్చారో వాళ్లకే ఓట్లేద్దాం..పద ఓట్లకు టైం అయితాంది....’ ‘సరే...ఉండు ఇంట్లో మా అవ్వపడుకోని ఉంది..‘ఫ్యాన్’ స్విచ్ వేసొస్తా..!! - సాక్షి, కడప