దేశవ్యాప్తంగా 22 నకిలీ వర్సిటీలు
లక్నో (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్‌లో 8 నకిలీ విశ్వవిద్యాలయాలను నకిలీ వర్సిటీలుగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) శనివారం తేల్చింది. దేశవ్యాప్తంగా 22 నకిలీ యూనివర్సిటీలున్నాయని యూజీసీ అధికారులు పేర్కొన్నారు. ఇందులో యూపీలోనే 8 నకిలీ వర్సిటీలున్నాయని చెప్పారు.
జాబితాలో గురుకుల యూనివర్సిటీ (వ్రిందావన్), మహిళా గ్రామ్ విద్యాపీఠ్ (అలహాబాద్), గాంధీ హిందీ విద్యాపీఠ్ (అలహాబాద్), నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎలక్ట్రో కాంప్లెక్స్ హోమియోపతి (కాన్పూర్), ఇంద్రప్రస్థ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (నోయిడా), వారణాసీయ సంస్కృత విశ్వవిద్యాలయం (వారణాసి), నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఓపెన్ యూనివర్సిటీ (అలీగఢ్) ఉన్నాయి.