న్యూఢిల్లీ: దేశంలో 22 నకిలీ యూనివర్సిటీలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇందులో అత్యధికంగా ఉత్తరప్రదేశ్ లో 9, ఢిల్లీలో 5 ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు వీటిపై చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు.
ఫేక్ వర్సటీల వివరాలను విదేశాంగ శాఖకు లేఖ రాసే పనిలో ఉన్నామని తెలిపారు. విద్యార్థులు నఖిలీ వర్సిటీల బారిన పడకుండా చూస్తామని వివరించారు . నఖిలీ వర్సిటీల వివరాలు (యూనియన్ గ్రాండ్ కమిషన్) యూజీసీ దగ్గర ఉన్నాయని తెలిపారు. ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ,పశ్చిమ బెంగాల్, బీహార్ ,కర్నాటక, కేరళ,మహారాష్ట్ర , తమిళనాడు ,ఒడిషాల్లో ఇవి యూజీసీ చట్టానికి విరుద్ధంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయని చెప్పారు. నకిలీ వర్సిటీలను గుర్తించడానికి 'నో యువర్ కాలేజ్' ఆప్ ను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురానున్నామని మంత్రి తెలిపారు.