duplicate
-
టీడీపీ నేతల బాటలోనే జనసేన నేతలు
-
నకిలీ విక్రేతలపై టీటీకే ప్రెస్టీజీ కఠిన చర్యలు
హైదరాబాద్: ప్రెస్టీజీ బ్రాండు పేరుతో నకిలీ ఉపకరణాలు అమ్ముతున్న విక్రేతలపై టీటీకే ప్రెస్టీజీ చట్టపరమైన చర్యలు చేపట్టింది. తెలుగు రాష్ట్రాల్లో బ్రాండ్‌ను దురి్వనియోగం చేస్తూ మోసాలకు పాల్పడుతున్న కొందరు విక్రేతలపై ఫిర్యాదు దాఖలు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో శివసాయి కేంద్రం, తెలంగాణలో బెథల్ ఇండస్ట్రీస్‌పై ఫిర్యాదు చేసింది. ఈ రెండు కేసుల్లోనూ తక్షణం స్పందించిన పోలీసులు నకిలీ వస్తువులను స్వా«దీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. ‘టీటీకే బ్రాండ్ విషయంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి. నకిలీలపై ఏమాత్రం అనుమానం ఉన్నా వెంటనే మా దృష్టికి తీసుకురావాలి’ అని సంస్థ ఒక ప్రకటనలో కోరింది. -
తస్మాత్ జాగ్రత్త! ఈ 20 యూనివర్సిటీలు నకిలీవి.. 8 రాజధానిలోనే..
న్యూఢిల్లీ: దేశంలో మరో 20 సంస్థలు విశ్వవిద్యాలయాలుగా చెలామణి అవుతున్నాయని, అవన్నీ నకిలీవని యునివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) బుధవారం ప్రకటించింది. ఈ 20 సంస్థల్లో ఎనిమిది ఢిల్లీలోనే ఉన్నట్టు పేర్కొంది. ‘‘ఉత్తరప్రదేశ్‌లో గాంధీ హిందీ విద్యాపీఠ్, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎలక్ట్రో కాంప్లెక్స్ హోమియోపతి, నేతాజీ సుభాష్‌చంద్రబోస్ (ఓపెన్) యూనివర్సిటీ, భారతీయ శిక్షా పరిషత్ అనే నాలుగు నకిలీ యూనివర్సిటీలు ఉన్నాయి. పశ్చిమబెంగాల్, ఏపీల్లో రెండేసి నకిలీ వర్సిటీలున్నాయి. కర్ణాటకలో బదగాన్వీ సర్కార్ వరల్డ్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్, కేరళలో సెయింట్ జాన్స్ వర్సిటీ, మహారాష్ట్రలో రాజా అరబిక్ యూనివర్సిటీ, పుదుచ్చెరిలో శ్రీ బోధి అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ నకిలీవే’’ అని యూజీసీ కార్యదర్శి మనీశ్ జోషి స్పష్టంచేశారు. ఢిల్లీలోని 8 నకిలీ వర్సిటీలు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అండ్ ఫిజికల్ హెల్త్ సైన్సెస్; కమర్షియల్ యూనివర్సిటీ లిమిటెడ్, దరియాగంజ్; యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ ఒకేషనల్ యూనివర్సిటీ; ఏడీఆర్–సెంట్రిక్ జ్యుడీషియల్ యూనివర్సిటీ; ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ అండ్ ఇంజనీరింగ్; విశ్వకర్మ ఓపెన్ యూనివర్సిటీ ఫర్ సెల్ఫ్–ఎంప్లాయిమెంట్; ఆధ్యాత్మిక్ విశ్వవిద్యాలయ. -
ఈ ‘ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్’ రూ. 10 వేలకే: ట్విస్ట్ ఏంటంటే?
కార్ల దగ్గర నుంచి మొబైల్ ఫోన్ల వరకు దాదాపు అన్నీ డూప్లికేట్స్ వచ్చేస్తున్నాయి. గతంలో ఇలాంటి డూప్లికేట్ మోడల్స్ గురించి చాలానే విని ఉంటారు. అయితే ఇప్పుడు ఖరీదైన ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌లో కూడా క్లోన్ పుట్టుకొచ్చింది. దీని ధర కేవలం రూ. 10,000 మాత్రమే. ఇలాంటి ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ కొనాలంటే లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. దీనిని i14 Pro Max అని పిలుస్తారు. దీనిని దూరం నుంచి చూస్తే ఒక్కసారిగా ఐఫోన్ అని భ్రమ పడతారు. అయితే పరీక్షించి చూస్తే ఇది పులి తోలు కప్పుకున్న మేక అని అర్థమయిపోతుంది. (ఇదీ చదవండి: సుజుకి జిమ్నీ హెరిటేజ్ ఎడిషన్: కేవలం 300 మందికి మాత్రమే!) డూప్లికేట్ ఐ14 ప్రో మ్యాక్స్ గ్లాస్ లాంటి, ప్రీమియం ఫినిషింగ్‌తో అదే ఫ్లాట్ ఎడ్జ్ డిజైన్ కలిగి ట్రై యాంగిల్లో అమర్చిన కెమెరా సెటప్ కూడా పొందుతుంది. అయితే ఇందులో యాపిల్ లోగో ఉండదు, కలర్ ఆప్సన్స్ కూడా భిన్నంగా ఉంటాయి. ఐ14 ప్రో మ్యాక్స్ 6.5 ఇంచెస్ డిస్ప్లే, 6.8 ఇంచెస్ డిస్ప్లే అనే రెండు వేరియంట్స్‌లో లభిస్తుంది. మొదటి వేరియంట్ AMOLED స్క్రీన్, MediaTek MTK6753 చిప్సెట్ , డ్యూయల్ రియర్ కెమెరాలు (16MP+8MP), 6జిబి రామ్, 128 జిబి స్టోరేజ్, 2,800mAh బ్యాటరీ కలిగి ఉంటుంది. రెండవ వేరియంట్ 2జిబి రామ్, 16జిబి స్టోరేజ్, చిన్న 2,550mAh బ్యాటరీ, 2 మెగా పిక్సల్ రియర్ అండ్ సెల్ఫీ షూటర్ పొందుతుంది. ఈ రెండు వేరియంట్లు చూడటానికి దాదాపు ఒకేలా ఉన్నప్పటికీ కొన్ని వ్యత్యాసాలు గమనించవచ్చు. -
చైనా మళ్లీ ఏసేసిందిగా.. ఏకంగా మారుతి జిమ్నీకే ఎసరు
చైనా ఆటోమొబైల్ మార్కెట్ ఇప్పటికే కొన్ని వాహనాలను కాపీ కొట్టి తయారు చేసినట్లు గతంలో చదువుకున్నాం. అలాంటి సంఘటనే మళ్ళీ వెలుగులోకి వచ్చింది. ఇందులో మారుతి జిమ్నీ ఆధారంగా డూప్లికేట్ జిమ్నీ తయారు చేశారు. ఇది చూడటానికి జిమ్నీ మాదిరిగా కనిపించినప్పటికీ జిమ్నీ కాదని చూడగానే తెలిసిపోతోంది. SIAC యాజమాన్యంలోని 'బౌజన్' కంపెనీ 'బౌజన్ ఏప్' (Baojun Yep) ఎలక్ట్రిక్ ఎస్యువి ఆవిష్కరించింది. ఇది ఇప్పటికే మార్కెట్లో ఉన్న జిమ్నీ 3-డోర్స్ మోడల్ని పోలి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారు 2023 ఏప్రిల్‌లో జరగనున్న షాంగై ఆటో షోలో ప్రదర్శనకు వస్తుంది. ఇదే ఏడాది 'మే' నెల నాటికి అధికారికంగా విడుదలవుతుంది. భారతదేశంలో విక్రయిస్తున్న మారుతి జిమ్నీ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో లభిస్తుంది, బౌజన్ ఏప్ ఎలక్ట్రిక్ వెర్షన్ డిజైన్ పరంగా కొత్తగా ఉంటుంది. అయినప్పటికీ ఒక ఛార్జ్‌తో గరిష్టంగా 303 కిమీ పరిధిని అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారుకి సంబంధించిన చాలా వివరాలు అధికారికంగా అందుబాటులోకి రాలేదు. గ్లోబల్ మార్కెట్లో ఎంతోమంది మనసు దోచిన జిమ్నీ డూప్లికేట్ అవతారంలో పుట్టుకొస్తుంది, మరి ఇది ఎలాంటి ఆదరణ పొందుతుందో చూడాలి..! చైనీస్ తయారీదారులు ఇప్పటికే బజాజ్ పల్సర్, కెటిఎమ్ డ్యూక్, యమహా ఆర్3, కవాసకి నింజా వంటి మోడల్స్ కాపీ చేసి పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల్లో విరివిగా తక్కువ ధరలకే విక్రయిస్తున్నారు. -
బౌద్ధ సన్యాసి ముసుగులో భారత్‌లో గూఢచర్యం?
దేశ రాజధానిలో గూఢచర్య కలకలం రేగింది. బౌద్ధ సన్యాసి వేషంలో ఉన్న ఓ మహిళను చైనా పౌరురాలిగా నిర్ధారించుకున్న ఢిల్లీ పోలీసులు.. పలు అభియోగాల కింద ఆమెను అరెస్ట్ చేశారు. మూడేళ్లుగా భారత్‌లో ఉంటున్న ఆమె.. కీలక సమాచారం ఏమైనా చైనాకు చేరవేసిందా? ఏదైనా కుట్రకు తెర తీసిందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఢిల్లీ ఉత్తరంగా ఉన్న టిబెట్ శరణార్థి శిబిరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గూఢచర్యానికి పాల్పడిందనే అనుమానంతో పాటు చోరీలకు, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిందనే అనుమానంతోనూ ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. నేపాల్ రాజధాని ఖాట్మాండుకు చెందిన డోల్మా లామా అనే బౌద్ధ సన్యాసి.. టిబెట్ శరణార్థి కాలనీలోని మంజు కా టిల్లాలో ఉంటున్నాడు. అయితే అతను అతను కాదని.. ఆమె అని పోలీసులు వెల్లడించారు. చైనాకు చెందిన కాయ్ రువో(30).. బౌద్ధ సన్యాసి వేషంలో ఇక్కడికి వచ్చినట్లు తేల్చారు. ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి సేకరించిన ఆధారాలతో అతన్ని.. ఆమెగా ప్రకటించారు పోలీసులు. చైనీస్ పాస్‌పోర్ట్‌తో 2019లో భారత్‌లోకి కాయ్ రువో ప్రవేశించిందని ప్రకటించారు. ఇంగ్లీష్‌తో పాటు మాండరిన్, నేపాలీ భాషలను ఆమె మాట్లాడుతోంది. ఈ మేరకు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఆమెను అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు. అయితే.. చైనా కమ్యూనిస్ట్ నేతలు కొందరు తనను చంపే యత్నం చేస్తున్నారని.. తప్పించుకునేందుకు ఇలా వేషం కట్టినట్లు ఆమె ప్రాథమికంగా చెప్పినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ పోలీసులు ఆమెను క్షుణ్ణంగా విచారించాలని నిర్ణయించుకున్నారు. ఇదీ చదవండి: ఎవరూ ఎత్తుకెళ్లలే.. గ్యాంగ్ రేప్ చేయలే!! -
బజ్జీల నుంచి ఐస్‌క్రీం వరకు.. అంతా కల్తీ మయం
సాక్షి,ఇచ్చోడ(అదిలాబాద్): కల్తీకి కాదేది అనర్హం అన్నట్లుగా జిల్లాలో నిత్యావసరాల కల్తీ వ్యాపారం జోరుగా సాగుతోంది. కట్టడి చేయాల్సిన అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కారం, పసుపు, నూనె, ఉప్పు, పప్పు, పాలు, పెరుగు, సబ్బులు, షాంపులు, టీ పొడి, చివరకు దేవుడి దీపాలకు ఉపయోగించే నూనెను కూడా కల్తీ చేస్తున్నారు. ధనార్జనే ధ్యేయంగా కొందరు వ్యాపారులు కల్తీ నిత్యావసరాలను పేద, మధ్య తరగతి ప్రజలకు విక్రయిస్తూ వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. కల్తీ వ్యాపారంపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నా జిల్లాలో పట్టించుకునే వారే కరువయ్యారు. ఇదే అదనుగా కొందరు వ్యాపారులు కల్తీ సరుకులను ప్రజలకు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు. హోటళ్లు, ఫాస్ట్‌పుడ్ సెంటర్లు, టిఫిన్ సెంటర్లు, మిఠాయిల దుకాణాలు, బేకరీలు, ఐస్‌క్రీమ్ పార్లర్లలో కల్తీ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. బ్రాండెడ్ పేరుతో విక్రయాలు... జిల్లాలోని దుకాణాల్లో విక్రయిస్తున్న నిత్యావసర సరుకుల్లో అసలు ఏదో.. నకిలీ ఏదో గుర్తు పట్టడం కష్టంగా మారుతోంది. బ్రాండెడ్ పేరుతో నకిలీ సరుకుల వ్యాపారం జరుగుతోంది. అసలును పోలిన ప్యాకింగ్, కాస్త ధర తగ్గించి విక్రయిస్తుండడంతో వినియోగదారులు నకిలీ గుర్తించలేకపోతున్నారు. నిత్యావసరాలే లక్ష్యంగా ఈ కల్తీ వ్యాపారం జోరుగా సాగుతోంది. నిత్యం రూ.కోటి వ్యాపారం.. జిల్లాలో ప్రతీరోజు నిత్యావసర సరుకుల వ్యాపారం రూ.కోటి వరకు జరుగుతోంది. ధనికుల నుంచి నిరు పేదల వరకు నిత్యం వాడే నూనె, సబ్బులు, టీ పౌడర్, పప్పు, ఉప్పు, కారం, పంచదార ఇలా 30 రకాల వస్తువులు కల్తీ అవుతున్నాయి. వీటినే వ్యాపారులు ప్రజలకు విక్రయిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వారసంతల్లో కల్తీ వస్తువుల విక్రయాలు అడ్డూ అదుపు లేకుండా సాగుతున్నాయి. వ్యాపారులకు తక్కువ ధరకు వస్తుండడం, లాభం ఎక్కువగా ఉండడంతో వారు కూడా కల్తీ సరుకుల విక్రయాలకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. బజ్జీల నుంచి ఐస్‌క్రీం వరకు.. రోడ్ల పక్కన విక్రయించే టిఫిన్లు, మిర్చి బజీలు, పానీ పూరి, కట్లెస్తోపాటు ఐస్‌క్రీం వరకు అన్నింటిలో కల్తీ జరుగుతోంది. ప్రతీరోజు ఉదయం కొనుగోలు చేసే పాలలోనూ వ్యాపారులు పిండి, రసాయనలు కలిపి కల్తీ చేస్తున్నారు. హోటళ్లలో గడ్డ పెరుగు పేరిట కల్తీ పెరుగు విక్రయిస్తున్నారు. 25 లీటర్ల పెరుగు తయారీకి కేవలం 25 లీటర్ల వెడినీళ్లలో రెండు మాత్రలు వేసి అరగంటలో పెరుగు తయారు చేస్తున్నారు. ఐస్క్రీంలలోనూ హానికరమైన రసాయనాలు వాడుతున్నారు. జిల్లాలో జరిగిన కొన్ని సంఘటనలు.. ► ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కొంత కాలంగా మురిగి పోయిన, నాణ్యతలేని అల్లం, వెల్లులితో అల్లం పేస్టు తయారు చేస్తున్న కేంద్రంపై టాస్క్‌ఫోర్స్ పోలీసు ఇటీవల దాడిచేశారు. యాజామానిపై కేసు నమోదు చేశారు. ► గుడిహత్నూర్ మండలంలో కల్తీ కారం, పసుపు తయారు చేస్తున్న కేంద్రాలపై టాస్క్‌పోర్స్ సిబ్బంది దాడులు నిర్వహించారు. నమూనాలను సేకరించి కేసులు నమోదు చేశారు. ► ఐదు నెలల క్రితం నేరడిగొండ మడలంలోని వారసంతలో కొంత మంది వ్యాపారులు కల్తీ కారం, పసుపు, నూనె విక్రయిస్తుండగా వినియోగదారులు గుర్తించి గొడవ చేశారు. దీంతో వ్యాపారులు పారిపోయారు. ► జిల్లా కేంద్రంలో గతేడాది కల్తీ నూనె విక్రయిస్తున్న వ్యాపారీ నుంచి 4 వేల లీటర్ల నూనెను అధికారులు పట్టుకున్నారు. శాంపిళ్లను ల్యాబ్‌కు పంపించారు. నాలుగు జిల్లాలకు ఒకే ఆధికారి... అహార భద్రత శాఖకు సంబంధించిన ఆధికారులు జిల్లాకు ఒక గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్, ఇద్దరు ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉండాలి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కలిపి ఒకే ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉన్నారు. దీంతో కల్తీ నియంత్రణ సాధ్యం కావడం లేదు. ఇదే అదనుగా కల్తీ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. నాణ్యతలేని సరుకులు ప్రజలకు అంటగడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. కల్తీతో క్యాన్సర్ ముప్పు.. పసుపు, కారంలో వ్యాపారులు నికిల్, గిలాటిన్ అనే పదార్థాలు కలుపుతున్నారు. ఇవి శరీరంలో రక్తకణాలను దెబ్బతీస్తాయి. కడుపులో మంట, అల్సర్ వస్తుంది. ప్రా«థమిక దశలో చికిత్స అందకపోతే క్యాన్సర్‌గా మారే ప్రమాదం ఉంది. కల్తీ వస్తువలకు దూరంగా ఉండాలి. – రాథోడ్ రవికుమార్, పిల్లల వైద్యనిపుణుడు చదవండి: దిమాక్ దొబ్బిందా!.. త్రిబుల్ రైడింగ్.. ఆపై మద్యం కూడా.. -
Covid-19:అసలైన కరోనా వ్యాక్సిన్లను గుర్తించడం ఇలా..
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్లకు నకిలీలు పుట్టుకురావడం ఆందోళన కలిగిస్తోంది. నకిలీ వ్యాక్సిన్లతో ఆరోగ్యానికి ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆసియా, ఆఫ్రికా దేశాల్లో నకిలీ కోవిïÙల్డ్ వ్యాక్సిన్లను గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) రెండు వారాల క్రితం వెల్లడించింది. ఈ నేపథ్యంలో అసలైన టీకాలను కనిపెట్టడం ఎలా అన్నదానిపై కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. భారత్‌లో ప్రస్తుతం కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుతి్నక్–వి టీకాలను ప్రజలకు ఇస్తున్నారు. కోవిషీల్డ్‌ను పుణేలోని సీరం ఇన్స్టిట్యూట్, కోవాగ్జిన్‌ను హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ సంస్థ ఉత్పత్తి చేస్తున్నాయి. అసలైన టీకాలను ఎలా గుర్తించాలో చూద్దాం.. కోవిషీల్డ్ ► లేబుల్ ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ► వయల్‌పై అల్యూమినియం మూత పైభాగం కూడా ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ► ట్రేడ్‌మార్కుతో సహా కోవిషీల్డ్ అనే బ్రాండ్ నేమ్ స్పష్టంగా కనిపిస్తుంది. ► జనరిక్ పేరు బోల్డ్ ఆక్షరాల్లో కాకుండా సాధారణంగా ఉంటుంది. ► సీజీఎస్ నాట్ ఫర్ సేల్ అని ముద్రించి ఉంటే అసలైనదిగా గుర్తించాలి. ► వయల్‌పై లేబుల్ అతికి ఉన్నచోట ఎస్ఐఐ లోగో కనిపిస్తుంది. ► ఎస్ఐఐ లోగో నిట్టనిలువుగా కాకుండా కొంత వంపుగా ఉంటుంది. ► లేబుల్‌పై కొన్ని అక్షరాలను ప్రత్యేకమైన తెల్ల సిరాతో ముద్రిస్తారు. ఇవి స్పష్టంగా కనిపిస్తాయి. సులభంగా చదవొచ్చు. ► మొత్తం లేబుల్‌పై తేనెపట్టు లాంటి చిత్రం ఒక ప్రత్యేకమైన కోణంలో చూస్తే కనిపిస్తుంది. కోవాగ్జిన్ ► లేబుల్‌పై డీఎన్ఏ నిర్మాణం లాంటి చిత్రం అతినీలలోహిత కాంతిలోనే కనిపిస్తుంది. ► లేబుల్‌పై సూక్ష్మమైన చుక్కలతో కోవాగ్జిన్ అని రాసి ఉంటుంది. కోవాగ్జిన్ అని రాసి ఉన్న హోలోగ్రామ్ కూడా అతికించి ఉంటుంది. -
అంబర్‌పేట్‌లో కేసీఆర్..!
అంబర్పేట్: బోనాల ర్యాలీ సందర్భంగా ఆదివారం అంబర్‌పేట్‌లో సీఎం కేసీఆర్ డూప్ హల్చల్ చేశాడు. అడిక్మెట్కు చెందిన శ్రీరాముల దామోదర్ చూడ్డానికి కేసీఆర్‌లా ఉండి ఆయనలానే హెయిర్ స్టైల్, మాటలతో అలరించాడు. వాహనంపై ఊరేగుతూ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగాడు. -
బాబుకు.. 'దొంగ'బాబా దీవెనలు?!
ప్రత్యేక హోదా పేరిట గత మంగళవారం ఏయూ గ్రౌండ్స్‌లో టీడీపీ చేపట్టిన ధర్మపోరాట సభకు సీఎం చంద్రబాబు వచ్చారు. ఏకబిగిన గంటన్నరసేపు ఉపన్యాసం దంచేసి వెళ్లారు. అక్కడితో ఆ విషయం అందరూ మర్చిపోయారు. కానీ చంద్రబాబు ఆ రోజు సాయంత్రం ఎయిర్‌పోర్టులో ఓ స్వామి నుంచి ఆశీస్సులు పొంది.. వంగి వంగి దండాలు పెడుతూ చూపించిన భక్తిప్రపత్తులే ఇప్పుడు వివాదాస్పదమవుతున్నాయి.సహజంగా సీఎం స్థాయి ప్రముఖుల వద్దకు వెళ్లాలనుకునే వారికి చాలా పలుకుబడి ఉండాలి. లేదంటే సమాజంలో మంచి గౌరవప్రతిష్టలైనా ఉండాలి.కానీ చంద్రబాబును ఆ రోజు కలవడమే కాకుండా.. ఆశీస్సులు అందించిన ఆ స్వామి స్థాయి ఏమిటో.. ఆయన ఘన చరిత్ర ఏపాటిదో తెలిస్తే ఎవరైనా బిత్తరపోతారు.ఎందుకంటే సదరు స్వామిపై ఒక దొంగగా పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదై ఉంది. కోర్టుకు వెళ్లని నిందితుడన్న ట్రాక్ రికార్డ్ ఉంది. అటువంటి వ్యక్తి బాబా అలియాస్ స్వామిగా ఎలా మారాడు?.. నేరుగా సీఎం వద్దకు ఎలా వెళ్లగలిగాడు??.. బాబు ప్రత్యేకంగా ఆయన ఆశీస్సులెందుకు తీసుకున్నారు???... – సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : నగరంలోని కప్పరాడ ఎన్జీవో కాలనీలో నివాసముంటున్న శంకర సదానంద స్వామి అలియాస్ శంకరస్వామి అలియాస్ శ్రీ శంకర విద్యానంద సరస్వతి స్వామికి వివాదాస్పదుడిగా పేరుంది. 2014 మే నెలలో పోలీసు జీపు నుంచి వైర్లెస్ సెట్, మైక్రో ఫోన్, వాకీటాకీ తదితర సామాగ్రి దొంగిలించాడంటూ నగరంలోని ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కానిస్టేబుల్ శివకుమార్ ఫిర్యాదు మేరకు అప్పటి సర్కిల్ ఇనస్పెక్టర్ లక్ష్మణరావు సదరు శంకరస్వామిని ఐపీసీ 379 సెక్షన్ కింద అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. ఆ కేసు ఇప్పటికీ నడుస్తోంది. ఆ తర్వాత కూడా శంకరస్వామిపై పలు ఆరోపణలు వచ్చాయి. రాత్రిపూట బీచ్‌రోడ్‌లో బ్లూలైట్ తగిలించిన కారులో తిరుగుతూ మఫ్టీలో ఉన్న పోలీస్ ఆఫీసర్నని ప్రజలను మభ్యపెట్టిన దాఖలాలూ ఉన్నాయి. ఇక ఇటీవలే సదరు స్వామి ఫోర్త్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కార్ల షోరూమ్‌లో డస్టర్ వాహనం కొనుగోలు చేశాడు. కేవలం రూ.5 వేలు మాత్రమే అడ్వాన్స్ ఇచ్చి.. మిగిలిన మొత్తం మూడురోజుల్లో ఇస్తామని నమ్మబలికి పోస్ట్‌డేటెడ్ చెక్ ఇచ్చాడు. స్వామీజీనని చెప్పడంతో నమ్మిన షోరూమ్ నిర్వాహకులు తామే డ్రైవర్‌ను పెట్టి ఆయనకు కొత్త వెహికల్ ఇచ్చేశారు. కానీ పది రోజులైనా నయాపైసా కూడా ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చి వెహికల్‌ను వెనక్కి తీసేసుకున్నారు. వంగి వంగి దండాలెందుకు..?! ఇప్పుడు ఇతగాడి చరిత్రంతా ఎందుకంటే.. ఇంతటి ఘనమైన స్వామికి సీఎం చంద్రబాబు వంగి వంగి దండాలు పెట్టి మరీ ఆశీస్సులు అందుకున్నారు. సీఎం వద్దకు సదరు స్వామిని ఎవరు తీసుకువెళ్లారన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గత మంగళవారం ఏయూ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ధర్మపోరాట సభకు హాజరయ్యేందుకు సీఎం సాయంత్రం 3.30గంటల సమయంలో విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అప్పటికే వీఐపీ లాంజ్‌లో సదరు స్వామి, మరో పురోహితుడితో కలిసి వేచి ఉన్నారు. సీఎం రాగానే పురోహితుడు వేదమంత్రాలు పలకగా.. స్వామి సీఎంకు శాలువా కప్పి పండ్లు అందజేశారు. మంత్రి గంటా శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, ఎమ్మెల్యే గణబాబు పక్కనే ఉన్నారు. సీఎంను కలవాలంటే.. అది కూడా ఎయిర్‌పోర్టులోని వీఐపీ లాంజ్‌లో కలవాలంటే అంత సులువేమీ కాదు. రెవెన్యూ అధికారులు ముందుగానే ఖరారు చేసే ప్రొటోకాల్ జాబితాలో పేరుంటేనే అక్కడ సీఎంను కలిసే వీలుంటుంది. మరి సదరు స్వామి పేరును ఎవరు సిఫారసు చేశారు.. ఎవరు దగ్గరుండి కలిపించారు.. అన్నది ఇప్పటికీ ప్రశ్నార్ధకంగానే ఉంది. దీనిపై రెవెన్యూ, పోలీసు అధికారులను వివరణ కోరితే.. ఎవరికి వారు మాకేమీ సంబంధంలేదంటూ తప్పించుకునే ధోరణిలోనే మాట్లాడుతున్నారు. సీఎంకు ఆశీస్సులిచ్చే ఫొటోలతో హల్చల్ సరే.. సీఎంను కలిశారు.. ఆశీస్సులు అందించారు.. అక్కడితో అయిందేదో అయిందనుకుంటే ఏ గొడవా లేదు. స్వయంగా సీఎంకు ఆశీస్సులు అందించిన ఫొటోలతో సదరు బాబా అప్పుడే హల్చల్ చేస్తున్నారని అంటున్నారు. సీఎంతో ఉన్న ఫొటోలతో మూడురోజుల కిందట నగరంలోని ఓ బడా వస్త్ర దుకాణానికి వెళ్లి సీఎంకే దీవెనలిచ్చిన స్వామీజీనని బిల్డప్ ఇచ్చి.. కావాల్సిన దుస్తులు ఫ్రీగా తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. అంతేకాదు,.. ఇక్కడ పీఠం పెడతానని, ప్రభుత్వపరంగా ఓ స్థలం ఇప్పించాలని జిల్లాకు చెందిన టీడీపీ కీలక నేతను కలిసి కోరినట్టు సమాచారం. మాకే సంబంధం లేదు.. ప్రొటోకాల్ బాధ్యత రెవిన్యూదే:ఏసీపీ ఆ రోజు సీఎం వచ్చినప్పుడు ఎయిర్‌పోర్టు వద్ద బందోబస్తు బాధ్యత మాదే.. కానీ ఆయన్ను వీఐపీ లాంజ్‌లో ఎవర్ని కలిశారో మాకు తెలియదు.. అదంతా రెవెన్యూ అధికారుల బాధ్యత.. ప్రొటోకాల్ లిస్టు ప్రకారమే పంపిస్తారు.. కానీ ఆ లిస్టును రెవెన్యూ వాళ్ళే ఖరారు చేస్తారు.. అని ఏసీపీ లంకా అర్జున్ చెప్పారు. అవును.. ఆశీస్సులిచ్చారు..కానీ.. అర్బన్ తహసీల్దార్ నాగభూషణరావు అవును.. ఆ రోజు శంకరస్వామి ఎయిర్‌పోర్టులో చంద్రబాబును కలిసి శాలువాతో సత్కరించి పండ్లు ఇచ్చి ఆశీస్సులు అందజేశారు. స్వామిని అక్కడికి ఎవరు రమ్మన్నారో మాకూ తెలియదు.. సీఎం వచ్చేటప్పటికి అక్కడున్నారు.. సీఎంను కలుస్తామంటే భద్రతా సిబ్బందితో మాట్లాడి పంపించాం. అంతకుమించి మాకేమీ తెలియదని అర్బన్ తహసీల్దార్ నాగభూషణరావు తెలిపారు. ఏమో నాకైతే ఏమీ తెలియదు ఇన్చార్జి ఆర్డీవో సత్తిబాబు ఏమో.. ఆరోజు సీఎంను కలిశారేమో.. నాకైతే గుర్తు లేదు..మా వాళ్లు ఏమైనా అరేంజ్ చేశారేమో నాకైతే ఏమీ తెలియదు.. అని విశాఖ ఇన్చార్జి ఆర్డీవో సత్తిబాబు చెప్పారు. -
చైనా మాయ.. ఈఫిల్ టవర్ డూప్లికేట్
ఇక్కడ రెండు ఈఫిల్ టవర్లు ఉన్నాయి.. ఒకటి ప్యారిస్‌లో.. రెండోది చైనాలోని తయాండు చెంగ్లో ఉంది.. ఇంతకీ ఈ రెండిట్లో ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్?? తెలియడం లేదా.. లేటెస్ట్ ఐఫోన్‌కు కూడా వెంటనే డూప్లికేట్ తయారుచేసేసే చైనాలో.. ఈఫిల్ టవర్‌కు డూప్లికేట్ సృష్టించడం ఓ లెక్కా.. అందుకే తయాండుచెంగ్లో కట్టేశారు. చుట్టుపక్కల ఉన్న భవనాలను కూడా దాదాపు అరే రీతిలో నిర్మించారు. ఈఫిల్ విషయానికొస్తే.. అసలైనదాని పొడవుతో పోలిస్తే.. అందులో మూడోవంతు ఎత్తులో డూప్లికేట్ ను కట్టారు. ఇంతకీ ఒరిజినల్ ఏదో చెప్పలేదు కదూ. కుడివైపున ఉన్నది అసలైన ఈఫిల్ టవర్. -
మూడు పెళ్లిళ్లు చేసుకున్న నకిలీ డాక్టర్ అరెస్ట్
గుంటూరు : మూడు పెళ్లిళ్లు చేసుకున్న చిలూకూరి వీరాంజనేయులు అనే నకిలీ డాక్టర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరాంజనేయులు మూడో భార్య ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది. డాక్టర్‌గా నమ్మించి ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకున్నట్లుగా వెల్లడైంది. ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలంలో 9 ఏళ్ల పాటు టెక్నీషియన్‌గా వీరాంజనేయులు పని చేశారు. అక్కడ గడించిన అనుభవంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల క్లినిక్‌లు ఏర్పాటు చేశాడు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, ఏపీ మెడికల్ కౌన్సిల్ పేరుతో నకిలీ సర్టిఫికేట్ తయారు చేసుకున్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
తిరుమలలో బయటపడ్డ నకిలీ టికెట్ల దందా
తిరుమల : తిరుమలలో నకిలీ టికెట్ల దందా బయటపడింది. 300 రూపాయల విలువైన ప్రత్యేక దర్శన నకిలీ టిక్కెట్ల దందా సోమవారం వెలుగులోకి వచ్చింది. చిత్తూరుకు చెందిన వాసు అనే దళారిని టీటీడీ విజిలెన్స్ వింగ్ అధికారులు ఈ ఘటనకు సంబంధించి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రోజూ వందల నకిలీ టిక్కెట్లపై భక్తులకు దర్శనం కల్పిస్తూ వాసు అక్రమార్జనకు పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడైంది. కౌంటర్ సిబ్బందితో దళారి వాసు కుమ్మక్కై ఈ దందాకు తెరలేపినట్లు విచారణలో వెలుగుచూసింది. మూడు నెలల క్రితమే నకిలీ టిక్కెట్ల దందా కేసులో దళారి వాసు జైలుకు వెళ్లి వచ్చాడు. మళ్లీ ఇదే దందా సాగిస్తూ అధికారులకు చిక్కాడు. సురేంద్ర, కనకరాజు అనే ఇద్దరు కౌంటర్ సిబ్బందిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. -
నకిలీ పాసు పుస్తకాలపై పోలీసుల ఆరా
బ్రహ్మసముద్రం: అనంతపురంలో జూలై 17న ఇద్దరు వ్యక్తుల వద్ద పట్టుబడిన నకిలీ పట్టాదార్ పాస్ పుస్తకాలపై పోలీసులు మంగళవారం బ్రహ్మసముద్రం తహసీల్దార్ కార్యాలయానికి తరలి వచ్చి ఆరాతీశారు. తీటకల్లు రెవెన్యూ గ్రామంలోని సర్వేనంబర్లు 13–1, 325లో కళ్యాణదుర్గం మండలం హులికల్లుకు చెందిన వారి పేరిట గల నకిలీ పాసుపుస్తకాలను ఆన్లైన్లో పరిశీలించగా నకిలీవని తేలింది. అయితే తమ కార్యాలయంలో ఈ పుస్తకాలను ఇవ్వలేదని, గతంలో ఇక్కడ పనిచేసిన ఓ తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి పాసుపుస్తకాలు తయారు చేసినట్లు తహసీల్దార్ వెంకటశేషు తెలిపారు. అనంతరం కంబదూరు మండలం పాళ్లూరు రెవెన్యూగ్రామంలోని నకిలీపుస్తకాలపై విచారణకు పోలీసులు బయల్దేరి వెళ్లారు. -
ఇదో ‘ఐడి’యా
ముంపు పరిహారం కోసం...ఓటరు కార్డుల పరిహాసం రోజుల వ్యవధిలో ఓటరు ఐడీ కార్డుల జారీ పోలవరం ముంపు పరిహారం కోసం ‘నకిలీ’ సృష్టి టీడీపీ నేతల కనుసన్నల్లో నడుస్తున్న దందా వీఆర్‌పురం, కూనవరం మండలాల్లోని పలు మీసేవా కేంద్రాల్లో జారీ పరిహారం సొమ్ము కొట్టేందుకు నేతల కుట్ర సాక్షి ప్రతినిధి, కాకినాడ: – ఈ ఓటర్ గుర్తింపు కార్డు చూడండి. వర రామచంద్రపురం మండలం రాజుపేటకు చెందిన ఖండవల్లి శివాజీది. దరఖాస్తు చేసుకున్న రోజుల వ్యవధిలోనే ఓటర్ ఐడీ కార్డు వచ్చేసింది. ఇదొక్కటే కాదు టీసీలో (పుట్టిన తేదీ 2001ఫిబ్రవరి 10) ఉన్న ప్రకారం 18 సంవత్సరాలు నిండలేదు. కానీ...1998 జనవరి ఒకటో తేదీన పుట్టినట్టు చూపించి ఓటర్ ఐడీ కార్డు జారీ చేసేశారు. ఒక్క శివాజీయే కాదు వీఆర్‌పురం, కూనవరం మండలాల్లోని అనేక మందికి ఈ రకంగా ఓటరు గుర్తింపు కార్డులు జారీ అయిపోయాయి. నిజానికైతే వీటిని నకిలీగా గుర్తించాలి. 18 సంవత్సరాలు నిండితేనే ఓటర్ గుర్తింపు కార్డు ఇవ్వాలి. కానీ ఇక్కడ అనేక మందికి వయస్సు తక్కువ ఉన్నప్పటికీ పుట్టిన తేదీలు మార్చి కార్డులు జారీ చేసేశారు. టీడీపీ నేతల కనుసన్నల్లో కొన్ని మీసేవా కేంద్రాలు ఈ రకమైన కార్డులు జారీ చేసేస్తున్నాయి. పోలవరం ముంపు గ్రామాల పరిహారం కోసం టీడీపీ నేతలు వేసిన ఎత్తుగడ ఇది. . దరఖాస్తు చేసిన ఒక్క రోజులోనే... పోలవరం ముంపు మండలాలైన వీఆర్‌పురం, కూనవరం మండలాల్లోని మీసేవా కేంద్రాల్లో ఓటర్ ఐడీ కార్డులను బస్‌పాస్ తరహాలో దరఖాస్తు చేసుకున్న ఒక్కరోజులోనే ఇచ్చేస్తున్నారు. రెవెన్యూ శాఖ ప్రమేయం లేకుండా ఓటర్ ఐడీ కార్డులను దరఖాస్తు చేసుకున్న రోజులోనే ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ మండలాల్లోని పలు గ్రామాలు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంతో ముంపునకు గురి కానున్నాయి. తొలివిడతగా వీఆర్‌పురం మండలంలోని పది గ్రామాల్లోను, కూనవరం మండలంలోని ఒక గ్రామంలో ఆర్అండ్ఆర్ సర్వే ప్రక్రియను అధికారులు చేపట్టారు. మిగిలిన గ్రామాల్లో కూడా ఈ సర్వే ప్రక్రియ త్వరలో జరగనుంది. 18 సంవత్సరాలు నిండిన యువతీ,యువకులను ఒక కుటుంబంగా గుర్తించి వారికి కూడా ప్యాకేజీ ఇవ్వనున్నారని ప్రచారం జోరుగా సాగుతున్న నేప«థ్యంలో పలువురు వ్యక్తులు నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మార్గంలో డబ్బులు చెల్లించి మీసేవ కేంద్రాల ద్వారా ఓటర్ ఐడీ కార్డులను పొందుతున్నారు. . ఒక్కరోజులోనే కార్డు సిద్ధం... వాస్తవానికి 18 సంవత్సరాలు నిండిన యువతీ,యువకుడు నూతనంగా ఓటు గుర్తింపు కార్డు పొందాలంటే ముందుగా బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్ఓ) వద్ద ఫాం–6 దరఖాస్తు పూర్తి చేసి దానికి ఆధార్‌కార్డ్, రేషన్ కార్డు జిరాక్స్‌లతోపాటు చదువుకు సంబంధించి టీసీ జిరాక్స్‌ను కూడా జతపరచి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ దరఖాస్తును తహసీల్దార్ పరిశీలిస్తారు. రిమార్క్‌లు లేకుంటే ఆర్డీఓకు పంపిస్తారు. అక్కడ ఆమోదం పొందిన తర్వాత అనంతరం ఎలక్షన్ కమిషనర్ ఆధ్వర్యంలో దరఖాస్తుదారుడికి ఒక ఓటర్ ఐడీని కేటాయిస్తారు. ఈ ప్రకియకు సుమారు రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుంది. కానీ ఇవేవీ కాకుండా ఇక్కడ కొన్ని మీసేవా కేంద్రాల్లో సుమారు రూ.500 నుంచి రూ.1000 తీసుకుని అక్రమంగా ఓటరు ఐడీ కార్డులు జారీ చేస్తున్నాయి. భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం 18 ఏళ్లు నిండిన యువతీ,యువకులకులు ఓటు హక్కు పొందేందుకు అర్హులు. కానీ వీఆర్‌పురం, కూనవరం మండలాలకు చెందిన పలువురు 18 ఏళ్లు నిండకపోయినా పోలవరం ప్యాకేజీ వర్తిస్తుందనే అత్యాశతో అక్రమంగా మీసేవా కేంద్రాల ద్వారా ఓటర్ ఐడీ కార్డులు పొందుతున్నారు. టీడీపీ నేతల కనుసైగల్లోనే ఇక్కడంతా జరుగుతోంది. ముఖ్యంగా వీఆర్ పురంలోని టీడీపీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి తన బంధు గణమంతటికీ ఈ రకంగా కార్డులు సమకూర్చినట్టు తెలుస్తోంది. పరిహారం సొమ్మును కొట్టేసేందుకు నేతలు ఈ రకమైన కుట్రకు పాల్పడుతున్నారు. ఆ కార్డులు చెల్లవు. నిబంధనలకు విరుద్ధంగా మీసేవా కేంద్రాల ద్వారా ఓటర్ ఐడీ కార్డులు పొందారని నా దృష్టికి వచ్చింది. రెవెన్యూ శాఖ పరిశీలన లేకుండా ఓటర్ ఐడీ కార్డులు పొందడం నేరం. అక్రమంగా పొందిన కార్డులు ఆన్లైన్లో ఎంటర్ అయ్యే అవకాశం లేదు .ఇవి కేవలం స్థానికంగా సృష్టించినవి మాత్రమే. ఇలా పొందిన కార్డులను కొన్ని గుర్తించడం జరిగింది వాటిపై విచారణ చేపడుతున్నాం. బాధ్యులైన వారిపై చర్యలు చేపడతాం –జీవీఎస్ ప్రసాద్ ,తహసీల్దార్, వీఆర్‌పురం. -
నివాసాల మధ్య నకిలీ బాగోతం
బీటీ పత్తి విత్తనాల గుట్టురట్టు - విజిలెన్స్ అధికారుల మూకుమ్మడి దాడులు - కల్లూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని పోలీసు కాలనీలో రూ.55 లక్షల నకిలీ విత్తనాలు స్వాధీనం - 3వేలు ప్యాకెట్లు, ప్యాకింగ్‌కు సిద్ధంగా ఉన్న 3వేల కిలోల విత్తనాలు సీజ్ కర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్ సీజన్ మొదలు కానున్న నేపథ్యంలో నకిలీ విత్తనాలు భారీగా పట్టుబడ్డాయి. బిటీ పత్తి విత్తనాలకు పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో అనుమతి ఉండగా.. అదే అడ్రస్‌తో కర్నూలులో విత్తన ప్యాకెట్లు తయారు చేసి రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సరఫరా చేస్తుండటం గమనార్హం. గురువారం విజిలెన్స్ ఎన్ఫోర్సుమెంట్ అధికారులు కర్నూలులో గుట్టుగా సాగుతున్న నకిలీ విత్తనాల రాకెట్‌ను రట్టు చేశారు. ఏకంగా రూ.55 లక్షలకు పైగా నకిలీ బీటీ పత్తి విత్తనాలను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకోవడం కలకలం రేపింది. ఈ ఘటనతో నకిలీ విత్తనాలకు అడ్డా కర్నూలు అనే విషయం మరోసారి నిరూపితమైంది. ‘సాక్షి’లో గత బుధవారం నకిలీ విత్తనాలపై ‘తెల్ల బంగారం.. విత్తు కలవరం’ శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురితమైంది. ఇందుకు స్పందించిన విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించడంతో నకిలీ బాగోతం వెలుగులోకి వచ్చింది. రీజినల్ విజిలెన్స్ ఎన్ఫోర్సుమెంట్ అధికారి బాబురావుకు వచ్చిన సమాచారం మేరకు ఆయన ఆదేశాలతో విజిలెన్ ఏడీఏ వెంకటేశ్వర్లు, విజిలెన్స్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాసరెడ్డి, రామకృష్ణాచారి, జగన్మోహన్, కానిస్టేబుళ్లు శేఖర్, శివరాముడు, గౌడులు కల్లూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని పోలీసు కాలనీపై నిఘా వేశారు. పోలీసు కాలనీలోని డోర్ నెం.77/180–7–1–3 ఇంటిలో బీటీ విత్తన ప్యాకెట్లు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఆ మేరకు విజిలెన్స్ అధికారులు మూకుమ్మడిగా దాడి చేశారు. నివాస ప్రాంతాల మధ్య భారీ ఎత్తున నకిలీ విత్తనాల రాకెట్ సాగుతుండటం చూసి అధికారులే విస్తుపోయారు. ఇండిగో క్రాప్ కేర్ సీడ్‌కు పశ్చిమగోదావరి జిల్లాలో అనుమతి ఉంది. బీటీ విత్తన ప్యాకెట్లను గుజరాత్లో తయారు చేసినట్లు ఉంది. కానీ ప్యాకెట్లు మాత్రం కల్లూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని పోలీసు కాలనీలో తయారు చేస్తున్నట్లు గుర్తించారు. కర్నూలు ఆదిత్యనగర్‌లో కార్యాలయం ఉన్నట్లు చూపినా.. అక్కడ అలాంటి ఆనవాళ్లు ఏవీ లేకపోవడం గమనార్హం. లీడర్, బీజీ, రుద్ర పేర్లతో ప్యాకెట్ల తయారీ లీడర్–99, బీజీ–2, రుద్ర–118, బీజీ–2 పేరుతో 3వేల ప్యాకెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భారీగా ఖాళీ ప్యాకెట్లను కూడా సీజ్ చేశారు. వీటిపై గుజరాత్లో ప్యాకెట్లు తయారు చేసినట్లు, కంపెనీ తాడేపల్లిగూడెంలో ఉన్నట్లు ఉంది. 450 గ్రాముల ప్యాకెట్ ధర రూ.800లుగా ముద్రించారు. ప్యాకెట్లు తయారు చేసినవి 3వేలు ఉండగా.. 7,500 ప్యాకెట్ల తయారీకి అవసరమైన విత్తనాలను సిద్ధంగా ఉంచారు. వీటి విలువను విజిలెన్స్ అధికారులు రూ.55లక్షలుగా చెబుతున్నా.. ముద్రించిన ధర ప్రకారం రూ.84లక్షలు ఉంటుందని తెలుస్తోంది. వ్యవసాయాధికారులకు నకిలీ విత్తనాలు అప్పగింత విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న బీటీ విత్తన ప్యాకెట్లు, బస్తాల్లో ఉన్న విత్తనాలను కర్నూలు మండల వ్యవసాయాధికారి అశోక్కుమార్రెడ్డికి అప్పగించారు. నకిలీ విత్తనాలు ఉన్న ఇంటిని కూడా సీజ్ చేశారు. సీడ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు విజిలెన్స్ ఏడీఏ వెంకటేశ్వర్లు తెలిపారు. ఘటనా ప్రాంతాన్ని కర్నూలు ఏడీఏ రమణారెడ్డి, ఏఓ విశ్వనా«ద్ తదితరులు పరిశీలించారు. -
ఇబ్రహీంపట్నంలో నకిలీ పాల తయారీ
-
కొరఢా ఝుళిపిచిన విజిలెన్స్
నకిలీ కాఫీ ఉత్పత్తులు సీజ్ – రూ. 25 లక్షల విలువైన సరుకు సీజ్ కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ఎలాంటి అనుమతులు లేకుండా అమ్మకానికి ఉంచిన రూ. 25 లక్షల విలువ చేసే కాఫీ పొడుల నిల్వలపై విజిలెన్స్ అధికారులు దాడి చేసి సీజ్ చేశారు. నగరంలోని మణికంఠ ట్రేడర్స్, లక్ష్మీకాఫీ పొడర్, రాఘవేంద్ర ట్రేడర్స్‌లలో ప్రభుత్వ అనుమతి లేకుండా ఆరు రకాల కాఫీ పొడులు, వివిధ కంపెనీల బ్రాండ్ ప్యాకెట్ల ఉన్నట్లు విజిలెన్స్ ఎస్పీ బాబురావుకు వచ్చిన ముందస్తు సమాచారం మేరకు దాడులు నిర్వహించినట్లు విజిలెన్స్ అధికారుల బృందం సభ్యుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కు చెందిన అసిస్టెంట్ డైరక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. మణికంఠ ట్రేడర్స్‌లో 7219 కేజీలు, లక్ష్మీకాఫీ ఫౌడర్‌లో 2840 కేజీలు, రాఘవేంద్ర ట్రేడర్స్‌లో 3265 కేజీల కాఫీ పౌడర్, ప్యాకెట్లను సీజ్ చేసినట్లు చెప్పారు. వీటికి ఫుడ్ సేఫ్టీ ఆథారిటీ, బ్రాండెండ్ లైసెన్స్‌లు లేవన్నారు. షాపులను కూడా సీజ్ చేస్తున్నట్లు చెప్పారు. దాడుల్లో విజిలెన్స్ అధికారులు రామకృష్ణారెడ్డి, శంకర్, రామకృష్ణాచారి, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దగా వైద్యం
జిల్లాలో నకిలీ ఆయుర్వేద వైద్యులు - దీర్ఘకాలిక వ్యాధులు నయం చేస్తామని ప్రచారం - అర్హత లేకపోయినా ప్రకటనలతో బురిడీ - అనువంశిక, గిరిజన వైద్యం పేరిట మోసం - నిలువు దోపిడీకి లోనవుతున్న రోగులు ఆయుర్వేదం అక్రమార్కులకు వరంగా మారింది. ఈ వైద్యం పేరిట అమాయక ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారు. కొందరు ఇంకో అడుగు ముందుకేసి అల్లోపతి మందులను ఆయుర్వేదం మందుల్లో కలిపి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. తెలిసీ తెలియని వైద్యంతో ప్రాణాలను హరిస్తున్నారు. ఈ వ్యాపారాన్ని నియంత్రించే వ్యవస్థ బలంగా లేకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొంది. - కర్నూలు శివారులోని వీకర్ సెక్షన్కాలనీలో గతంలో ఓ వ్యక్తి అల్లోపతి మందులైన పెయిన్ కిల్లర్లను, స్టెరాయిడ్స్‌ను ఆయుర్వేద మందుల్లో కలిపి పలురకాల వ్యాధులు తగ్గిస్తామని జనానికి అంటగట్టారు. ఈ వ్యక్తిపై రెండేళ్ల క్రితం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి పట్టుకున్నారు. - ఇటీవల నంద్యాల రోడ్డులోని శిల్పా సింగపూర్ టౌన్షిప్ సమీపంలోనూ శ్రీనివాసులు అనే వ్యక్తి మందులు తయారు చేస్తుండగా అధికారులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కర్నూలు(హాస్పిటల్): జిల్లాలోని బనగానపల్లిలో ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి ఉంది. ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 40 పైగా ఆయుర్వేద డిస్పెన్సరీలు నిర్వహిస్తున్నారు. వీటికి ప్రభుత్వమే ఆయుర్వేద మందులను సరఫరా చేస్తోంది. కానీ ఈ ఆసుపత్రుల కంటే నకిలీ వైద్యులకే డిమాండ్ అధికంగా ఉంటోంది. దీర్ఘకాలిక వ్యాధులను, అల్లోపతి వైద్యానికి లొంగని వ్యాధులను మటుమాయం చేస్తామని నమ్మబలుకుతూ వీరిచ్చే ప్రకటనలను అమాయక ప్రజలు నమ్మి ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నారు. ఆయుర్వేదానికి సంబంధించి ఎలాంటి కోర్సులు చేయకపోయినా నిపుణులైన వైద్యులను తలదన్నేలా దర్జా కనబరుస్తున్నారు. జిల్లా కేంద్రంతో పాటు నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్, బనగానపల్లి, ఆత్మకూరు, శ్రీశైలం, మహానంది, కోడుమూరు, పత్తికొండ, ఆలూరు, ఆస్పరి, మంత్రాలయం, ఆళ్లగడ్డ తదితర ప్రాంతాల్లో నకిలీ ఆయుర్వేద వైద్యులు తిష్టవేసి తెలిసీ తెలియని వైద్యం చేస్తూ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. పర్యవేక్షణ లేదు.. శిక్షలూ పడవు ఆయుర్వేద వైద్యం చేయాలంటే బీఏఎంఎస్ కోర్సు తప్పనిసరి. కానీ కొంత మంది దూరవిద్య ద్వారా డిప్లమా సర్టిఫికెట్లు తెచ్చుకుంటున్నారు. మరికొందరు అనువంశిక వైద్యమని, గిరిజన వైద్యమని చెబుతూ జనాన్ని మభ్యపెడుతున్నారు. ఏ మాత్రం అక్షరజ్ఞానం లేని వారు సైతం వైద్యులుగా చెలామణి అవుతున్నారు. చివరికి రహదారి పక్కన మూలికలు నూరిపోసి జనానికి ఇస్తున్నా అడిగే నాథుడు కరువయ్యారు. ఆయుర్వేద మందులను విక్రయించాలన్నా, వాటిని తయారు చేయాలన్నా ఆయుష్ విభాగం నుంచి అనుమతి పొందాలి. వీరు ఏ మందులు విక్రయిస్తున్నారు, ఎలాంటి మందులు తయారు చేస్తున్నారో అధికారులు పర్యవేక్షించాలి. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మందులను తనిఖీ చేసేందుకు కేవలం ఇద్దరు మాత్రమే డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. దీంతో వీరు ఎక్కడా తనిఖీలు చేసిన దాఖలాలు కనిపించవు. విజిలెన్స్ అధికారులు అడపాదడపా దాడులు చేసి పట్టుకుని, పోలీసులకు అప్పగించినా పెద్దగా శిక్షలు పడవు. నకిలీ మందులు వాడి కొన్ని వేల మంది ఇప్పటికే కిడ్నీ, కాలేయం వ్యాధులతో బాధపడుతున్నారు. మరికొందరు అనారోగ్యంతో కన్నుమూశారు. కానీ అక్రమార్కులకు ఎలాంటి కఠిన శిక్షలూ పడటం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయుర్వేద మందులు విక్రయించే వారిపై పర్యవేక్షణ చేసే అధికారం ఇటు ఆయుష్ విభాగ అధికారులకు గానీ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు, ఔషధ నియంత్రణ శాఖకు ఉండటం లేదు. దీంతో అక్రమార్కులు మరింతగా రెచ్చిపోతున్నారు. తనిఖీలు చేసే అధికారం మాకు లేదు జిల్లాలో అనేక మంది నకిలీ ఆయుర్వేద వైద్యులున్నట్లు మా దృష్టికి కూడా వస్తోంది. కానీ అలాంటి వారిపై తనిఖీలు చేసి, శిక్షించే అధికారం మాకు లేదు. నకిలీ వైద్యులు విక్రయించే మందుల వల్ల అనేక మంది అనారోగ్యానికి లోనవుతున్నారు. కిడ్నీలు పాడై డయాలసిస్ చేయించుకుంటున్న వారు కొన్ని వేల మంది ఉన్నారు. ఆయుర్వేదం ఒక అద్భుత వైద్యం. ప్రజలు నిపుణులైన వైద్యుల వద్ద మాత్రమే చికిత్స చేయించుకోవాలి. – డాక్టర్ పి.వి.నాగరాజరావు, సీనియర్ ఆయుష్ మెడికల్ ఆఫీసర్ -
నకిలీ రూ.2 వేల నోటుతో బురిడీ
డాబాగార్డెన్స్: ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన రూ.2వేలు నోటును కలర్ జెరాక్స్ తీసి ఇద్దరు మహిళలు బురిడీ కొట్టించారు. కనకమహాలక్ష్మి దేవస్థానం పరిసరాల్లో శుక్రవారం చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. మార్గశిర మాసోత్సవాల్లో భాగంగా అమ్మవారి ఆలయ పరిసరాల్లో పలువురు చిల్లర దుకాణాలు ఏర్పాటు చేశారు. శుక్రవారం ఇద్దరు మహిళలు ఓ దుకాణంలోకి వెళ్లి రాగి, ఇత్తడి వస్తువులు బేరమారారు. నకిలీ రూ.2వేల నోటును దుకాణ యజమానికి ఇవ్వగా.. ఆయనకు అనుమానం వచ్చి చిల్లర లేదని పంపించేశారు. మరో షాపునకు వెళ్లగా అక్కడ కూడా చిల్లర లేదని పంపించేశారు. ఎదురుగా ఉన్న నాగమణికి చెందిన దుకాణానికి ఇద్దరు మహిళలు వెళ్లారు. ఉదయం నుంచి బేరం లేకపోవడం.. తొలి బేరం కావడంతో ఆమె వ్యాపారాన్ని వదులుకోలేకపోయింది. రూ.600ల విలువ చేసే పూజా సామగ్రిని కొనుగోలు చేసి ఇద్దరు మహిళలు వారి వద్ద ఉన్న రూ.2వేల దొంగనోటు అందజేశారు. నోటు నలిగిపోయి ఉండడంపై నాగమణి ప్రశ్నించగా.. బ్యాగులో పెట్టడడంతో నలిగిపోయిందని బదులిచ్చారు. దీంతో నాగమణి రూ.600లు తీసుకొని వారికి రూ.1400 చిల్లర ఇచ్చింది. వారు వెళ్లిపోయాక నాగమణికి మళ్లీ అనుమానం వచ్చి నోటును వేరే వారికి చూపించింది. ఇది దొంగనోటని.. కలర్ జెరాక్స్ తీసి ఇచ్చేశారని చెప్పడంతో ఆమె కంగుతింది. వెంటనే పరిసర ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేకపోయింది. చివరకు చేసిందేమీ లేక పోలీసులను ఆశ్రయించింది. వారు వెళ్లిపోయాక వస్తే మేం ఏం చేస్తామని పోలీసులు చెప్పారు. సీసీ కెమెరా ఫుటేజ్‌లో ఆ ఇద్దరు మహిళలను గుర్తించవచ్చని చెప్పినా పోలీసులు పట్టించుకోకపోవడంతో నాగమణి బోరున విలపించింది. -
తిక్కిరెడ్డిపాలెంలో నకిలీ కారంపొడి బస్తాలు
ప్రత్తిపాడు : ప్రత్తిపాడు మండలం తిక్కిరెడ్డిపాలెం శివారులోని డొంకలో నకిలీ కారంపొడి బస్తాలు ప్రత్యక్షమయ్యాయి. తిక్కిరెడ్డిపాలెం నుంచి యనమదల వెళ్లేదారిలో ఉన్న డొంకలో సుమారు 40 నుంచి 50 బస్తాలు పడేసి వాటికి నిప్పు పెట్టారు. ఒక్కో బస్తా సుమారు యాభై కేజీల వరకు ఉంటుంది. పూర్తిగా కాలకపోవడంతో ఉదయం పొలాలకు వెళ్లే రైతులు నకిలీ కారం బస్తాలను గమనించారు. నిన్న ఇక్కడ బస్తాలు లేవని, రాత్రి ఎవరో ఆటోలో తీసుకువచ్చి ఇక్కడ పడేసి వెళ్లిపోయారని స్థానికులు చెబుతున్నారు. పడవేసిన బస్తాలు రంపపుపొట్టును తలపించేలా ఉన్నాయి. -
ప్రభుత్వ వైద్యశాలలో బినామీ ఉద్యోగులు
ప్రభుత్వ వైద్యశాలలో బినామీ ఉద్యోగులు విధులు నిర్వహిస్తూ పట్టుబడ్డ బయటి వ్యక్తులు రోగి బంధువుల నుంచి డబ్బులు వసూలు చేయడంతో వెలుగులోకి 8 నెలలుగా సాగుతున్న తంతు గుంటూరు మెడికల్: ఎవరు సిబ్బంది..ఎవరు కాదో కూడా తెలియని స్థితిలో గుంటూరు జీజీహెచ్ ఉంది. ప్రై వేటు వ్యక్తులు ఇష్టారాజ్యంగా తిరుగుతూ తమ పని కానిచ్చేస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. రెండునెలల క్రితం బయట ల్యాబ్ వ్యక్తి జీజీహెచ్‌కు వచ్చి రక్తపు శాంపిళ్ళు తన ల్యాబ్‌కు తరలిస్తూ పట్టుబడ్డాడు. ఇది మరువక ముందే ఆస్పత్రి ఉద్యోగికి బదులు బయట వ్యక్తి విధులను నిర్వహిస్తున్న ఘటన శుక్రవారం వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే... వడ్లమూడి గ్రామానికి చెందిన వాసుభక్త శ్రీను అనే వ్యక్తికి పక్షవాతం రావటంతో చికిత్స కోసం ఈనెల 9న కుటుంబ సభ్యులు గుంటూరు జీజీహెచ్‌లో చే ర్పించారు. ఆస్పత్రి ఇన్‌పేషెంట్ విభాగంలోని 329 నెంబర్ గదిలో శ్రీనుకు వైద్యులు పరీక్షలు చేసి శుక్రవారం సీటీ స్కాన్ చేయించమని చెప్పారు. స్కానింగ్ గది వద్దకు రోగిని తీసుకెళ్ళేందుకు కరుణాకర్, తమ్మిశెట్టి మణికంఠ అనేవారు వచ్చి శ్రీను భార్య లక్ష్మి వద్ద రూ.400 డిమాండ్ చేశారు. తన వద్ద అన్ని డబ్బులు లేవని రూ.250లు ఇచ్చింది. డబ్బులు తీసుకున్న వారు ఇరువురు స్కానింగ్ గది వద్దకు రోగిని తీసుకు వెళ్లి అక్కడే స్ట్రెచర్‌ను వదిలివచ్చారు. డబ్బులు తీసుకుని కూడా వార్డుకు తీసుకెళ్ళకుండా రోగిని స్కానింగ్ గది వద్దే వదిలి వెళ్ళటంతో లక్ష్మి లిఖిత పూర్వకంగా ఆర్ఎంఓ డాక్టర్ యనమల రమేష్‌కు సదరు వ్యక్తులపై ఫిర్యాదు చేసింది. ఆయన వారిని పిలిచి విచారించగా అసలు వారు ఆస్పత్రి ఉద్యోగులే కాదని తెలిసింది. ఆస్పత్రిలో నాల్గోతరగతి ఉద్యోగి(ఎంఎన్ఓ)గా పనిచేస్తున్న దుర్గం శివయ్య ఎనిమిది నెలలుగా తాను విధులు నిర్వహించకుండా తన స్థానంలో ప్రై వేటు వ్యక్తి తమ్మిశెట్టి మణికంఠను నియమించాడు. మణికంఠ కరుణాకర్‌తో కలిసి పనిచేస్తున్నాడు. తన విధులను నిర్వహిస్తున్న మణికంఠకు నెలకు రూ.5,000ల చొప్పున శివయ్య చెల్లిస్తుండగా..మణికంఠ తనకు వచ్చిన డబ్బుల్లో కొంత మొత్తం కరుణాకర్‌కు ఇస్తున్నాడు. శుక్రవారం ఆర్ఎంఓ విచారించగా వీరిరువురూ రోగుల వద్ద కొంత కాలంగా ఇదే తరహాలో అధిక మొత్తంలో డబ్బులు డిమాండ్ చేసి తీసుకుంటున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఆర్ఎంఓ డాక్టర్ రమేష్ జీజీహెచ్ ఉద్యోగి శివయ్య, ప్రై వేటు వ్యక్తులు మణికంఠ, కరుణాకర్‌లపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆస్పత్రి ఉద్యోగి పనిచేయకుండా బయట వ్యక్తులు వచ్చి పనిచేస్తూ డబ్బులు సైతం తీసుకుంటున్నా సార్జంట్‌లు ఏం చేస్తున్నారంటూ ఆర్ఎంఓ ప్రశ్నించారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సార్జంట్ కాంతారావు, శ్రీహరిలను ఆదేశించారు. కాగా, సీసీ కెమెరాలు... సెక్యూరిటీ సిబ్బంది... గేట్పాస్ విధానం అమలులో ఉన్నా పెద్దాసుపత్రిలో ఇలాంటి సంఘటనలు తరచుగా చోటు చేసుకోవటం అధికారుల పనితీరును తెలియచేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
తప్పుడు పత్రాలతో రుణం
సెంటు వ్యవసాయ భూమి లేకున్నా రెండెకరాలు కాగితాల్లో కట్టబెట్టి రెవెన్యూ అధికారులు సదరు అధికార పార్టీ నేతపై అభిమానాన్ని చాటుకున్నారు. తొండంగి మండల టీడీపీ ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న వ్యక్తి పార్టీ నేతల అండదండలతో తప్పుడు పాట్టాదారు పాసుపుస్తకంతో ఆ¯ŒSలైన్లో రెవెన్యూ వ¯ŒSబీ అడంగళ్ పత్రాలు సృష్టించి వాటితో సొసైటీ ద్వారా రూ.3.60 లక్షల రుణం పొందారు. ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో గుట్టుచప్పుడు కాకుండా కప్పిపుచ్చేందుకు అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. – తొండంగి ఇదీ సంగతి తొండంగికి చెందిన మురాలశెట్టి సత్యనారాయణ అలియాస్(సత్తిబాబు)కు తొండంగి రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 809లో రెండు ఎకరాలు ఉన్నట్టు 309187 (పాసుపుస్తకం నంబరు) ఖాతా నంబర్ 3239 పట్టాదారు పాసుపుస్తకం సృష్టించారు. దీని ఆధారంగా గ్రామ రెవెన్యూ అధికారి వ¯ŒSబీ, అండంగళ్ పత్రాలను కూడా మంజూరు చేసి తహసీల్దార్‌కు ప్రతిపాదించగా మంజూరుకావడంతో కంప్యూటర్ సిబ్బంది ఆ¯ŒSలైన్లో ఎక్కించారు. తహసీల్దార్ సంతకాలతో ఈ పత్రాలను అన్నవరం మీసేవా ద్వారా 2015లో నవంబర్ 14న ఆ¯ŒSలై¯ŒS ద్వారా 97630621(సర్టిఫికెట్ నంబర్), వ¯ŒSబీ నమూన, 97630653(సర్టిఫికెట్ నంబర్) అడంగళ్ ధ్రువపత్రాలు పొందిన సదరు టీడీపీ నేత తొండంగి సొసైటీలో అధికారులను బరుడి కొట్టించి అదే ఏడాది డిసెంబర్లో తొండంగి పీఏసీఎస్‌లో రూ.3.60 లక్షలు రుణం పొందాడు. మొదటి దఫాలో రూ.1.60 లక్షలు, రెండో దఫాలో రూ.రెండు లక్షలు భూమిని అభివృద్ధి చేసుకోవడం కోసం ఎల్టీలోనూ పొందాడు. ఈ నేపథ్యంలో రెవెన్యూ రికార్డులు సక్రమంగా లేవని తొండంగి గ్రామస్తులు కొందరు సొసైటీ అధికారులకు తెలపడంతో రికార్డులు తనిఖీ చేసుకున్నారు. అయితే అప్పటికే ఈ సంగతి రెవెన్యూ అధికారులకు తెలియడంతో ఆ¯ŒSలైన్లో సదరు నేత రికార్డులు తొలగించారు. సొసైటీ అధికారుల తనిఖీలో ఆ¯ŒSలైన్లో రికార్డులు లేకపోవడంతో అవాక్కయ్యారు. సదరు వ్యక్తి నుంచి పొందిన రుణాన్ని తిరిగి కట్టించి, అధికారులను తప్పుదారిపట్టించిన సదరు అతడిపై క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపితే మరిన్ని ఆసక్తికర విషయాలు బయటపడతాయని రైతులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో తొండంగి రెవెన్యూ కార్యాలయంలో నకిలీ పాసుపుస్తకాలు వ్యవహారం జరిగినప్పుడు ప్రస్తుత అధికార పార్టీ నేతలు, అప్పటి ప్రతిపక్ష నేతలుగా ఉండి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. కానీ ఇప్పుడు అదే నాయకులు అధికార మదంతో తప్పుడు పాసుపుస్తకాలతో పత్రాలు సృష్టించి రుణం పొందడం చర్చనీయాంశమైంది. క్రిమినల్ చర్యలు తప్పవు రెవెన్యూ రికార్డుల ఆధారంగానే సదరు వ్యక్తికి రుణమిచ్చాం. రికార్డులు సరిౖయెనవి కాదని నిర్ధారణ అయితే అతడిపై క్రిమినల్ చర్యలు తీసుకుని రుణం సొమ్ము కట్టిస్తాం. – వెల్నాటి ఏసుబాబు, సీఈవో, తొండంగి పీఏసీఎస్ బాధ్యులపై చర్యలు తీసుకోవాలి తప్పుడు ధ్రువపత్రాలతో రుణాలు పొందడానికి కారకులపైనా, సహకరించిన రెవెన్యూ అధికారులపై విచారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. – వనపర్తి సూర్యనాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు, తొండంగి పీఏసీఎస్ -
కోడుమూరులో పట్టుబడిన బయో మందులు
కోడుమూరు రూరల్ : కోడుమూరులో అనుమతి లేని నకిలీ బయో మందులను భారీగా పట్టుకున్నారు. మండల వ్యవసాయాధికారి అక్బర్‌బాషా సోమవారం తనిఖీల చేపట్టాడు. అందులో క్రాంతి ట్రాన్స్‌పోర్టులో రవాణాకు సిద్ధంగా ఉన్న రూ.4,81,000లు విలువ చేసే అనుమతి లేని బయో మందులు, వెల్దుర్తి రోడ్డులోని ఒక దుకాణానికి సంబంధించి అనుమతి లేని గోడౌన్లో నిల్వ ఉంచిన రూ.5లక్షలు పైగా విలువ చేసే మందులు పట్టుబడ్డాయి. గత వారం రోజుల నుంచి అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండడంతో పట్టణానికి చెందిన కొందరు వ్యాపారస్తులు బయోలను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. పట్టుబడ్డ మందులను సీజ్ చేశా: అక్బర్‌బాషా, మండల వ్యవసాయాధికారి, కోడుమూరు క్రాంతి ట్రాన్స్‌పోర్టులో రూ.4,81,000 విలువ చేసే అనుమతి లేని 23రకాలను బయో మందులు సీజ్ చేశా. ఇందులో 10మందుల నమూనాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపుతున్నా. అలాగే అనుమతి లేని గోడౌన్లో పట్టుబడ్డ బయో మందుల అమ్మకాలను కూడా నిలిపేసి వాటి విలువను అంచనా వేస్తున్నా. -
విత్తనాలకూ నకిలీ మకిలి
– మొలకెత్తని మినుములు – కల్తీ వరి విత్తనాలతో రైతులకు నష్టం – ఏపీ సీడ్స్ నిర్వాకం సాక్షి ప్రతినిధి, ఏలూరు : రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న నకిలీ విత్తనాల మకిలి మన జిల్లానూ తాకింది. ప్రస్తుత రబీ సీజన్లో మెట్టప్రాంతంలో వేసిన మినుము విత్తనాలు మొలకెత్తకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఏపీ సీడ్స్ సరఫరా చేసిన వరి విత్తనాల్లో వేరే రకం (కేళీలు) కలిసిపోవడంతో రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. పెదవేగి మండలంతోపాటు ఏలూరు రూరల్, దెందులూరు మండలాల్లో ఏపీ సీడ్స్ సరఫరా చేసిన విత్తనాలు కల్తీవి కావడంతో రైతులు నష్టపోయే పరిస్థితి తలెత్తింది. పెదవేగి మండలం అమ్మపాలెంలో సుమారు 300 ఎకరాల్లో కల్తీ వరి విత్తనాల వల్ల రైతులు నష్టపోయారు. ఏలూరు, దెందులూరు మండలాల్లో మరో మూడు వందల ఎకరాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఖరీఫ్‌లో వాడే ఎంటీయూ–1001 రకం విత్తనాల్లో రబీలో వాడే ఎంటీయూ–1010 విత్తనాలు కలిసిపోవడంతో రైతులకు నష్టం కలుగుతోంది. ఏపీ సీడ్స్ నుంచి రైతులు ఎంటీయూ–1001 రకం, బీపీటీ రకం వరి విత్తనాలను కొనుగోలు చేశారు. వీటిలో ఎంటీయూ–1010 రకం విత్తనాలు కలిసిపోయాయి. కల్తీ విత్తనాలు ముందుగానే పాలుపోసుకుని గింజ గట్టిపడే దశకు చేరుకున్నాయి. అసలు విత్తనం 1001 రకం ఇంకా దుబ్బు దశలోనే ఉంది. ఎకరం విస్తీర్ణంలో నకిలీ విత్తనాల పంట ఏడెనిమిది బస్తాల వరకూ ఉంది. ఈ పంట ముందుగానే చేతికి వస్తుంది. దీన్ని కోసే పరిస్థితి లేదు. ధాన్యం కొనుగోలుదారులు ఈ పంటను కొనరు. కొన్నా అతి తక్కువ ధర చెల్లిస్తారు. ఇప్పటికే ఎకరానికి రూ.15 వేలకు పైగా పెట్టుబడి అయ్యింది. పంట చేతికి వచ్చేసరికి మరో రూ.10 వేల వరకు ఖర్చవుతుంది. ఏపీ సీడ్స్ నిర్వాకం వల్ల దిగుబడి రాక నష్టపోతామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెట్టలో మినుము మెట్ట ప్రాంతాలకు వెళితే.. కొయ్యలగూడెం తదితర మండలాల్లో మినుములు మొలకెత్తని పరిస్థితి ఉంది. ప్రై వేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేసిన మినుములు రెండు నెలలు దాటినా మొలకెత్తలేదు. అనధికారికంగా విత్తనాలు విక్రయించే వ్యాపారి నుంచి కొనుగోలు చేసిన మినుములు మొలకెత్తకపోవడంతో రైతులు వెళ్లి నిలదీశారు. భారీ వర్షాల కారణంగా మొక్కలు మొలవలేదన్న సమాధానం వచ్చింది. దిప్పకాయలపాడు, గొల్లగూడెం, మంగతిపతిదేవీపేట గ్రామాల్లో విత్తనాలు మొలకెత్తలేదని రైతులు వాపోతున్నారు. మినుము మొలకెత్తకపోగా చేలల్లో కలుపు పెరిగిపోయింది. దీంతో ఆక్కడి రైతులు వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేశారు. కల్తీ వరి విత్తనాలు, నకిలీ మినుము విత్తనాల వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని కౌలు రైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. -
కూర కోసం వేస్తే నారే మిగిలింది
భయ పెట్టిన కల్తీ ఆర్పీ బయో వరి వంగడం తాజాగా గోంగూరకూ కల్తీ దెబ్బ విత్తనాల కల్తీతో తారుమారైన పంట గోంగూర విత్తన ధర రూ.100, నార గోంగూర విత్తన ధర రూ.30 తక్కువ ధర విత్తనం అంటగట్టిన వైనంl నష్టాల్లో రైతులు సాక్షి, రాజమహేంద్రవరం/మధురపూడి : విత్తనాల కల్తీ జాడ్యం అన్ని పంటలకూ విస్తరిస్తోంది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పంపిణీ చేసిన ఆర్పీ బయో 226 వరి వంగడం వేసిన జిల్లా రైతులు నిండా నష్టాల్లో మునిగిపోయిన విషయం మరవకముందే తాజాగా ఆకుకూరల సాగు చేస్తున్న రైతులను నకిలీ చీడ భయపెడుతోంది. జిల్లాలో రాజమహేంద్రవరం, పెద్దాపురం, రంపచోడవరం, అమలాపురం, కాకినాడ, రామచంద్రపురం రెవెన్యూ డివిజన్లలోని గ్రామాల్లో వందల ఎకరాల్లో గోంగూర సాగు చేస్తున్నారు. నకి లీ విత్తనాల వల్ల పంటలో నాణ్యమైన గోంగూర బదులు కొండ గోంగూర మొలిచింది. ఇది నారకు తప్ప తినడానికి పనికి రాదు. దీంతో రైతులు నష్టాలపాలవుతున్నారు. గోంగూరకూ కల్తీ కాటు : ఆకు కూరగా ఉపయోగించే గోంగూర విత్తనాలు మార్కెట్లో కిలో రూ.100కు లభిస్తున్నాయి. అదే నార ఉత్పత్తి చేసే కొండ గోంగూర విత్తనాలు రూ.30 దొరుకుతున్నాయి. రెండూ ఒకే రకంగా ఉండడంతో రైతులను సులభంగా బురిడీ కొట్టించారు. ఈ విత్తనాలను కోరుకొండ మండలం నిడిగట్ల, గుమ్ములూరు, శ్రీరంగపట్నం, బుచ్చెంపేట, దోసకాయలపల్లి, మధురపూడి రైతులు ఎక్కువగా ఉపయోగించారు. పంట ఎదిగిన తర్వాత విత్తనాల్లో కల్తీ జరిగిందని గుర్తించారు. సాధారణ గోంగూర ఆకు సైజు చిన్నదిగా ఉంటుంది. కొండ గోంగూర ఆకులు పెద్దవిగా ఉంటాయి. పంట ఎదిగిన తర్వాతే ఈ విషయం బయటపడడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలి కల్తీ విత్తనాలతో చాలా నష్టపోతున్నాం. పెట్టుబడులు కూడా రావడం లేదు. మార్కెట్లో కల్తీ విత్తనాలను ప్రభుత్వం అరికట్టాలి. నష్టపోయిన రైతులను ఆదుకోవాలి. మార్కెట్లో గిట్టుబాటు ధర వచ్చేటట్లు చూడాలి. – కొత్తపల్లి వెంకట్రావు, గోంగూర రైతు, నిడిగట్ల గ్రామం రైతులకు బీమా కల్పించాలి గోంగూర పంటకు బీమాను కల్పించాలి. తుఫాను, వర్షాలతో పంట దెబ్బతింది. పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదు. మరోవైపు కల్తీ విత్తనాల బెడదతో దిక్కుతోచని స్థితిలో ఉన్నాం. – దోసపాటి కాశీవిశ్వనా«ద్, గోంగూర రైతు, మధురపూడి -
నకిలీ పట్టాదారు పాస్‌పుస్తకం పట్టివేత
ఐదు నిమిషాలైతే రూ.50 వేల చెల్లింపు సమయస్ఫూర్తితో నకిలీదని గుర్తించిన అధికారులు పరారైన నిందితుడు కురవి : రుణం కోసం వచ్చిన వ్యక్తి వద్ద అధికారులు నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాన్ని గుర్తించి, స్వాధీనం చేసుకున్న సంఘటన కురవిలోని ఆంధ్రాబ్యాంకులో సోమవారం జరిగింది. కర్షక సేవా సహకార సంఘం ఎండీ గుగులోత్ సంతూలాల్ కథనం ప్రకారం.. రాజోలు శివారు హరిదాసు తండాకు చెందిన రైతు దారవత్ రాము బలపాల గ్రామీణ వికాస బ్యాంకులో గతంలో తన పట్టాదారు పాస్‌పుస్తకాలు పెట్టి రుణం పొందాడు. అతడు అలాంటి పాస్‌పుస్తకాలనే మరో కాపీని తయారీ చేసి ఇటీవల కురవిలోని కర్షక సేవా సహకార సంఘానికి రుణం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. దరఖాస్తు వెంట నోఆబ్జక్షన్ సర్టిఫికేట్, పట్టాదారు పాసుపుస్తకాలు(సర్వే నంబర్ 257/ డీ1లో 36 గుంటలు, 488/ బీ 2లో ఎకరం 13 గుంటలు, 489/ బీలో 8 గుంటలు), రెండు, వన్ బీకి సంబంధించిన కంప్యూటర్ పహాణీలను జత చేశాడు. ఆ పాస్‌పుస్తకాల్లో గతంలో పనిచేసిన తహసీల్దార్ శ్రీనివాస్, కార్యదర్శి హరినాథ్‌బాబు సంతకాలను రాము ఫోర్జరీ చేసినట్లు కర్షక సేవా సహకార సంఘ ఉద్యోగి నర్సింహరెడ్డి గుర్తించారు. దరఖాస్తులో కూడా బలపాల గ్రామీణ వికాస బ్యాంకు ముద్ర ఉన్నప్పటికీ మేనేజర్ సంతకం లేకపోవడం.. పాత తహసీల్ధార్, కార్యదర్శుల సంతకాలు ఫోర్జరీగా కనిపించడంతో నకిలీ పట్టాదారు పాసు పుస్తకంగా గుర్తించినట్లు సంత్లాల్ వెల్లడించారు. వెంటనే రైతును పిలిచి ఇదేమిటని ప్రశ్నిస్తుండగానే అతడు పరారైనట్లు ఆయన తెలిపారు. నకిలీ పాస్‌పుస్తకం పెట్టి రుణం పొందాలని ఇలా చేశాడని, ఈ విషయమై కురవి పోలీసులకు సమాచారమిచ్చినట్లు వివరించారు. మరో ఐదు నిమిషాలు గడిస్తే చెక్ ఇచ్చే వాడినని, కార్యాలయ ఫీల్డ్ ఆఫీసర్ నర్సింహరెడ్డి సమయస్ఫూర్తితో నకిలీ పుస్తకంగా గుర్తించడంతో సహకార సంఘానికి నష్టం వాటిల్లకుండా ఉందని తెలిపారు. ఇదే విషయమై కురవి ఎస్సై అశోక్‌ను వివరణ కోరగా ఎలాంటి ఫిర్యాదు రాలేదని ఆయన తెలిపారు. -
నకిలీ విత్తనాలతో భారీ నష్టం
-
ఔను.. అవి నకిలీ విత్తనాలే!
మిరప మొక్క లక్షణాల ఆధారంగా ప్రాథమికంగా గుర్తింపు డీఎ¯ŒSఏ పరీక్షలకు మొక్కల భాగాలు, ఆకులు నేడు, రేపు వరంగల్, నల్గొండ జిల్లాల్లో పరిశీలన ప్రభుత్వానికి త్వరలో సమగ్ర నివేదిక ప్రభుత్వ ప్రత్యేక బృందం వెల్లడి ఖమ్మం వ్యవసాయం: మిర్చి కంపెనీలు నకిలీ విత్తనాలను రైతులకు అంటగట్టాయని ప్రభుత్వం నియమించిన ప్రత్యేక బృందం ధ్రువీకరించింది. నకిలీ విత్తనాలతో పంట నష్టపోయామంటూ మిర్చి రైతులు రోడ్డెక్కడంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. పరిశీలన కోసం ప్రత్యేక బృందాన్ని జిల్లాకు శుక్రవారం పంపింది. ఇందులో ఉద్యాన శాఖ ఉప సంచాలకుడు మధుసూధ¯ŒS, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకుడు టి.రాజవర్ధ¯ŒS, శాస్త్రవేత్త డాక్టర్ పి.సైదయ్య, వ్యవసాయాధికారి ఆర్.శివానందయ్య ఉన్నారు. వీరి వెంట జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకురాలు ఎ.ఝాన్సీలకీ‡్ష్మకుమారి, ఉప సంచాలకురాలు విజయనిర్మల, ఉద్యాన శాఖ ఉప సంచాలకుడు ఆర్.శ్రీనివాస్‌రావు, సహాయ సంచాలకుడు కె.సూర్యనారాయణ ఉన్నారు. కూసుమంచి మండలం లోని తురకగూడెం; తిరుమలాయపాలెం మండలంలోని జింకలగూడెం, తిరుమలాయపాలెం; కొణిజర్ల మండలంలోని పల్లిపాడు గ్రామాల్లోగల మిరప తోటలను ప్రత్యేక బృందంలోని అధికారులు నిశితంగా పరిశీలించారు. అసలైనవి, నకిలీవిగా భావిస్తున్న మొక్కలను (పైరు ఎదుగుదల, పూత, కాత, ఆకు కణుపులు) నిశితంగా పోల్చి చూశారు. తేడాలు ఉన్నట్టుగా గుర్తించారు. నకిలీవిగా భావిస్తున్న మొక్కల నుంచి దిగుబడి ఉండదని అక్కడికక్కడే నిర్థారణకు వచ్చారు. గ్రీ¯ŒS ఎరా సీఎస్–333 రకం, జేసీహెచ్–801 రకం విత్తనాలు విత్తినట్టు రైతులు చెప్పారు. ఇతర విత్తన రకాల మొక్కలు బాగున్నాయంటూ వాటిని చూపించారు. -
ఔను.. అవి నకిలీ విత్తనాలే!
మిరప మొక్క లక్షణాల ఆధారంగా ప్రాథమికంగా గుర్తింపు డీఎ¯ŒSఏ పరీక్షలకు మొక్కల భాగాలు, ఆకులు నేడు, రేపు వరంగల్, నల్గొండ జిల్లాల్లో పరిశీలన ప్రభుత్వానికి త్వరలో సమగ్ర నివేదిక ప్రభుత్వ ప్రత్యేక బృందం వెల్లడి ఖమ్మం వ్యవసాయం: మిర్చి కంపెనీలు నకిలీ విత్తనాలను రైతులకు అంటగట్టాయని ప్రభుత్వం నియమించిన ప్రత్యేక బృందం ధ్రువీకరించింది. నకిలీ విత్తనాలతో పంట నష్టపోయామంటూ మిర్చి రైతులు రోడ్డెక్కడంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. పరిశీలన కోసం ప్రత్యేక బృందాన్ని జిల్లాకు శుక్రవారం పంపింది. ఇందులో ఉద్యాన శాఖ ఉప సంచాలకుడు మధుసూధ¯ŒS, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకుడు టి.రాజవర్ధ¯ŒS, శాస్త్రవేత్త డాక్టర్ పి.సైదయ్య, వ్యవసాయాధికారి ఆర్.శివానందయ్య ఉన్నారు. వీరి వెంట జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకురాలు ఎ.ఝాన్సీలకీ‡్ష్మకుమారి, ఉప సంచాలకురాలు విజయనిర్మల, ఉద్యాన శాఖ ఉప సంచాలకుడు ఆర్.శ్రీనివాస్‌రావు, సహాయ సంచాలకుడు కె.సూర్యనారాయణ ఉన్నారు. కూసుమంచి మండలం లోని తురకగూడెం; తిరుమలాయపాలెం మండలంలోని జింకలగూడెం, తిరుమలాయపాలెం; కొణిజర్ల మండలంలోని పల్లిపాడు గ్రామాల్లోగల మిరప తోటలను ప్రత్యేక బృందంలోని అధికారులు నిశితంగా పరిశీలించారు. అసలైనవి, నకిలీవిగా భావిస్తున్న మొక్కలను (పైరు ఎదుగుదల, పూత, కాత, ఆకు కణుపులు) నిశితంగా పోల్చి చూశారు. తేడాలు ఉన్నట్టుగా గుర్తించారు. నకిలీవిగా భావిస్తున్న మొక్కల నుంచి దిగుబడి ఉండదని అక్కడికక్కడే నిర్థారణకు వచ్చారు. గ్రీ¯ŒS ఎరా సీఎస్–333 రకం, జేసీహెచ్–801 రకం విత్తనాలు విత్తినట్టు రైతులు చెప్పారు. ఇతర విత్తన రకాల మొక్కలు బాగున్నాయంటూ వాటిని చూపించారు. -
నకిలీ విత్తనాలతో భారీ నష్టం
కొరిటెపాడు(గుంటూరు) : మిరప కల్తీ విత్తనాలతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగబోయిన రంగారావు డిమాండ్ చేశారు. నకిలీ కల్తీ విత్తనాల వల్ల మిరప పంట నష్టపోయిన మేడికొండూరు, అమరావతి మండలాల రైతులకు పంట నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం జిల్లా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు వి.డి.వి.కపాదాసును కలసి వినతి పత్రం అందజేశారు. రంగారావు మాట్లాడుతూ నకిలీ విరప విత్తనాల వల్ల రైతులు భారీ ఎత్తున నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే రైతులు ఎకరాకు లక్ష రూపాయల వరకు పెట్టుబడులు పెట్టారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు క్యాంపు కార్యాలయాలకు కూత వేటు దూరంలో నకిలీ విత్తనాలు విచ్చల విడిగా అమ్మకాలు జరగడం దుర్మార్గమన్నారు. నష్టపరిహారం చెల్లించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడ్తామని హెచ్చరించారు. జేడీఏ కపాదాసు మాట్లాడుతూ ఉద్యానశాఖ శాస్త్రవేత్తలు, అధికారులు, రైతు ప్రతినిధులు, కంపెనీ ప్రతినిధులు ఫిర్యాదులు వచ్చిన గ్రామాల్లో పర్యటిస్తున్నారని, నివేదిక రాగానే విత్తన చట్టం ప్రకారం నకిలీ విత్తన వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. జేడీఏను కలసిన వారిలో కౌలు రైతు సంఘం నాయకులు కె.అజయ్‌కుమార్, బైరగాని శ్రీనివాసరావు, అమరావతి, మేడికొండూరు మండలాల రైతులు పాల్గొన్నారు. -
రూ.48 లక్షలు విలువ చేసే నకిలీ మందులు సీజ్
-
న కిలీ ‘బయో’
– పురుగు మందుల తయారీ కేంద్రంపై ‘విజిలెన్స్’ దాడులు – రూ.48 లక్షలు విలువ చేసే నకిలీ మందులు సీజ్ కర్నూలు: కర్నూలు శివారులోని కారై్బడ్ ఫ్యాక్టరీకి ఎదురుగా ఆర్టీసీ కాలనీలో ఉన్న నకిలీ పురుగు మందుల తయారీ కేంద్రంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన భాస్కర్‌సింగ్ ఆర్టీసీ కాలనీలో ఓ భవనాన్ని అద్దెకు తీసుకుని బయో ఫెస్టిసైడ్స్ ముసుగులో నకిలీ పురుగు మందులను తయారు చేస్తున్నాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంటు ప్రాంతీయ అధికారి శివకోటి బాబురావు, సీఐ జగన్మోçßæన్‌రెడ్డి, ఎస్ఐ సుబ్బరాయుడు, వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశ్వర్లు, కానిస్టేబుళ్లు మునిస్వామి, ఈశ్వర్ తదితరులతో కూడిన బందం బుధవారం దాడులు నిర్వహించింది. సుమారు రూ.48 లక్షలు విలువ చేసే నకిలీ మందులతో పాటు తయారీ కేంద్రం, కల్లూరులోని గోడౌన్‌ను సీజ్ చేశారు. ఏజెంట్ల ద్వారా వ్యాపారం: ఏఎస్ఎన్ ఆగ్రో ప్రొడక్ట్స్, అనిల్ అగ్రో ప్రొడక్ట్స్, విట్రో అగ్రో కెమికల్స్ కంపెనీల పేరుతో తయారు చేసిన నకిలీ పురుగు మందులను ఏజెంట్ల ద్వారా జిల్లాలోని రైతాంగానికి అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నాడు. అహ్మదాబాద్, చెన్నై, హైదరాబాద్‌లోని ప్రధాన కంపెనీల పేర్లతో పురుగుల మందును తయారు చేసి జిల్లా అంతటా సరఫరా చేస్తున్నట్లు విచారణలో వెలుగు చూసింది. తయారీ దారుడిపై క్రిమినల్ కేసు నమోదు: ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన భాస్కర్ సింగ్ కర్నూలులో నివాసం ఏర్పాటు చేసుకుని బయో ఉత్పత్తుల పేరుతో నకిలీ మందుల వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం అందింది. దాడులు నిర్వహించి అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేసి, తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంటు ప్రాంతీయ అధికారి శివకోటి బాబురావు తెలిపారు. రైతులు గుర్తింపు పొందిన సంస్థలు తయారు చేసిన పురుగు మందులు మాత్రమే వాడాలని విజ్ఞప్తి చేశారు. మందులు కొనుగోలు చేసేటప్పుడు కచ్చితంగా బిల్లులు తీసుకోవాలని సూచించారు. -
మళ్లీ నకిలీ ఆయుర్వేదం
చికిత్స చేస్తున్న అనుమతి లేని వైద్యులు పట్టించుకోని అధికారులు! ఖానాపురం : మండల కేంద్రంలో అనుమతి లేని ఆయుర్వేదం మళ్లీ జోరందుకుంటుంది. నెల రోజుల క్రితం ‘అనుమతి లేని ఆయుర్వేదం’ శీర్షికన సాక్షిలో వరుస కథనాలు రావడంతో జిల్లా ఆయూష్ అధికారులు స్పందిం చారు. మండల కేంద్రంలో విచ్చలవిడిగా జరుగుతున్న ఆయుర్వే వైద్యాన్ని పరిశీలించారు. ఆయూష్ అధికారుల పరిశీలనలో ఒక్కరూ అర్హులు కారనే విషయాన్ని గుర్తించి షాపులను మూసివేయాలని హెచ్చరించి, వివరాలు సేకరించారు. ఆ తర్వాత కొన్ని రోజులు వైద్యాన్ని నిలిపివేశారు. తిరిగి కొద్ది రోజులుగా గుట్టుచప్పుడు కాకుండా మళ్లీ వైద్యాన్ని ప్రారంభించారు. బుధవారం కరీంగనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి వృద్ధులు అధిక సంఖ్యలో వచ్చారు. అనుమతి లేకున్నా విచ్చలవిడిగా వైద్యాన్ని నడిపిస్తుండటంతో స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయూష్ అధికారులు మరోసారి తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
రుణం పేరిట వసూళ్లు
బ్యాంక్ మేనేజర్‌నంటూ మోసం చెల్లని డీడీలు ఇచ్చి దొరికిన వైనం సిరిసిల్లలో వెలుగుచూసిన మోసం సిరిసిల్ల టౌన్ : అమాయకుల అవసరాన్ని ఆసరా చేసుకున్న ఓ వ్యక్తి ఘరానా మోసానికి పాల్పడ్డాడు. తాను బ్యాంకు మేనేజర్‌గా పరిచయం చేసుకుని ఇల్లు కట్టుకోవడానికి రుణ ం ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేశాడు. చివరకు నకిలీ డీడీలు అప్పగించి అడ్డంగా దొరికిపోయాడు. వేములవాడ మండలం రుద్రవరం గ్రామానికి చెందిన పోవారి అనసూయ నాలుగేళ్ల క్రితం అగ్రహరం సమీపంలోని గుర్రంవానిపల్లె ఆర్అండ్ఆర్ కాలనీ సమీపంలో గుంటన్నర నివేశన స్థలాన్ని కొనుక్కుంది. ఆ ప్రాంతం అభివృద్ధి చెందడంతో తాము కూడా అక్కడే స్థిరపడాలని ఇల్లు కట్టుకోవాలనుకుంది. తన భూమిని తనఖా పెట్టి రుణం ఇప్పించాలని అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని ఆశ్రయించగా అతడు సిరిసిల్ల సుభాష్‌నగర్‌కు చెందిన ముండ్రాయి శ్రీనివాస్‌ను పరిచయం చేశాడు. తాను ఆంధ్రాబ్యాంకు మేనేజర్‌గా పరిచయం చేసుకున్న శ్రీనివాస్ రూ.6.50 లక్షల రుణం ఇప్పిస్తానని నమ్మబలికాడు. ఇందుకు కొంత ఖర్చవుతుందని చెప్పడంతో అనసూయ పలు దఫాలుగా మూడు నెలల్లో రూ.70వేలు ఇచ్చింది. నెలలు గడుస్తున్నా రుణం మంజూరు చేయడం లేదని శ్రీనివాస్‌ను నిలదీయడంతో రూ.6.50 లక్షల విలువైన నకిలీ డీడీలు అందించాడు. అంకెలు మార్చి... మాయ చేసి... రుణం ఇప్పిస్తానంటూ డబ్బులు వసూలు చేసిన శ్రీనివాస్ బాధితులకు ఎలాంటి ఆధారాలను అందనివ్వలేదు. అనసూయ రుణం విషయమై పదిరోజుల క్రితం శ్రీనివాస్‌కు ఫోన్ చేసి నిలదీసింది. దీంతో అతడు ఈనెల మూడో తేదీన సిరిసిల్ల ఎస్బీహెచ్లో రూ.30, రూ.35 చొప్పున డీడీ తీశాడు. ఈ అంకెల పక్కన సున్నాలు చేర్చి రూ.3లక్షలు, రూ.3.50 లక్షలుగా మార్చి అనసూయకు అందించాడు. రుణం మంజూరైందనే ఆశతో అనసూయ ఇంటి నిర్మాణం మెుదలు పెట్టింది. డీడీలను విడిపించడానికి సాయంగా రావాలని అనుపురం గ్రామానికి చెందిన రవి అనే వ్యక్తిని కలువగా.. అవి నకిలీ డీడీలుగా గుర్తించారు. నకిలీ డీడీలను శ్రీనివాస్ అనసూయకు అందించిన సమయంలో మరో రూ.10వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న రవి సిరిసిల్ల ఎస్బీహెచ్ వద్దకు వస్తే డబ్బులు ఇస్తానని అనసూయతో శ్రీనివాస్‌కు ఫోన్ చేయించాడు. డబ్బుల ఆశతో శ్రీనివాస్ అక్కడికి వచ్చి దొరికిపోయాడు. ఎస్బీహెచ్ పేరిట నకిలీ డీడీలు అంటగట్టిన విషయమై అనసూయ బ్యాంక్ మేనేజర్‌కు తెలుపగా.. ఆయన శ్రీనివాస్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను చేసింది తప్పేనని ఒప్పుకున్న శ్రీనివాస్ డబ్బులు తిరిగివ్వడానికి కొంత గడువు ఇవ్వాలని బాధితురాలని, పోలీసులను ప్రాధేయపపడ్డాడు. -
నకిలీ పార్శిల్‌తో టోకరా
అచ్చంపేట: ఖరీదైన సెల్‌ఫోన్, రిస్ట్‌వాచ్ లాటరీలో తగిలిందన్న అపరిచితుల కాల్‌ను నమ్మి రూ.3 వేలు మోసపోయాడు ఓ బాధితుడు. అచ్చంపేటకు చెంది కత్తి చంద్రం సెల్‌ఫోన్‌కు నాలుగురోజుల కిందట ఢిల్లీ నుంచి ఓ కాల్ వచ్చింది. ఆయుర్వేదిక్ హెర్బల్ కంపెనీ తరపున నీ ఫోన్ నెంబరుకు బంపర్ ఆఫర్ తగిలిందని, అందులో రూ.30 వేల చెక్కు, రూ.15 వేల ఖరీదు చేసే శ్యాంసంగ్ గెలాక్సీ ఫోను, రూ.5 వేల విలువచేసే రిస్ట్‌వాచ్ వచ్చాయని చెప్పారు. అడ్రస్ చెప్తే పార్శిల్ పంపుతామని నమ్మించారు. నిజమేనని నమ్మిన చంద్రం వారికి తన చిరునామా ఇచ్చాడు. వారు చెప్పినట్టుగానే శుక్రవారం అతని పేరిట పోస్టాఫీసుకు ఒక పార్శిల్ వచ్చింది. రూ.3వేలు చెల్లించి తీసుకోవాలని పోస్టుమ్యాన్ చెప్పడంతో అలాగే తీసుకున్నాడు. విప్పిచూడగా అందులో మూడు ప్యాకెట్ల భస్మం, కొన్ని చిత్తు కాగితాలు, ఒక చెక్కపెట్టె ఉన్నాయి. తాను మోసపోయానని గ్రహించిన చంద్రం శుక్రవారం అచ్చంపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నకిలీపత్రాలతో వికలాంగుల ఇళ్ల స్థలాలు అమ్మకం
ప్రొద్దుటూరు: నకిలీపత్రాలు తయారుచేయడంతోపాటు ఏకంగా తహసీల్దార్ సంతకాలు ఫోర్జరీ చేసి, సీల్ వేసి ఇళ్ల స్థలాలను అమ్మిన సంఘటన వెలుగుచూసింది. బాధితులు మంగళవారం సాయంత్రం స్థానిక తహసీల్దార్ భాస్కర్‌రెడ్డికి ఫిర్యాదు చేసి న్యాయం చేయాలని వేడుకోగా ఈ సంఘటనపై పోలీసు కేసు పెడుతున్నట్లు ఆయన ప్రకటించారు. వివరాలిలావున్నాయి. 2013 మార్చి 18న అప్పటి కలెక్టర్ అనిల్‌కుమార్ ఆదేశాల మేరకు ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లె గ్రామపంచాయతీలోని అమృతానగర్ పరిధిలో ఉన్న సర్వే నంబర్ 64లో మొత్తం 144మంది వికలాంగులకు రెండు సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించి పట్టాలు పంపిణీ చేశారు. అయితే వీటిలో 29మంది ఇళ్ల స్థలాలు కబ్జాకు గురయ్యాయని వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు అనేకమార్లు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదుచేశారు. అయితే ఇప్పటివరకు దీనిపై ఎలాంటి స్పందన లేదు. ఇటీవల వీరు కొత్తగా వచ్చిన కలెక్టర్ సత్యనారాయణను కలిసి సమస్యను విన్నవించారు. ఆయన తహసీల్దార్ భాస్కర్‌రెడ్డిని ఆదేశించగా ఆమేరకు గత మూడు రోజులుగా ఆర్ఐ రామకృష్ణారెడ్డి, వీఆర్ఓ గోపాల్‌రెడ్డి, సర్వేయర్ గురివిరెడ్డిలు కలిసి పరిశీలించారు. కాగా నకిలీపత్రాలతో స్థలాలను కొనుగోలు చేసిన వారు ఏకంగా పునాదులు నిర్మించడంతోపాటు వీటిపై తమ పేరు, సెల్ నంబర్ కూడా రాసుకున్న విషయాన్ని అధికారులు గుర్తించారు. ఆ మేరకు స్థలాలు కొనుగోలు చేసిన వారిని మంగళవారం సాయంత్రం తహసీల్దార్ భాస్కర్‌రెడ్డి వద్ద హాజరుపరిచారు. దేవాంగపేటకు చెందిన మచ్చా సంజమ్మ, మచ్చా స్వర్ణ, పిట్టా సంజమ్మ, నాగభూషణంతోపాటు సుమారు 20 మంది ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. వీరు 728, 729, 731, 732, 727, 767, 722, 764, 765, 763, 758, 760, 761, 730, 766, 725, 759, 757 ప్లాట్లను కొనుగోలు చేశారు. కాగా తొలిమారు వీరు మాత్రమే వచ్చారని, రేపు, ఎల్లుండి ఇంకా ఎక్కువమంది బాధితులు తమను ఆశ్రయించే అవకాశం ఉందని రెవెన్యూ అధికారులు స్వయంగా అనడం గమనార్హం. ముగ్గురు వ్యక్తులచేత స్థలాలు కొన్నాం అధికారపార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్ వన్నేసు, మేస్త్రీ బి.శ్రీను, ఉలసాల సత్యనారాయణల ద్వారా తాము స్థలాలు కొనుగోలు చేసినట్లు వీరు తహసీల్దార్‌కు చెప్పారు. తమలో కొంతమంది రెండు సెంట్ల స్థలాన్ని రూ.35వేల వరకు పెట్టి కొనుగోలు చేయగా, మరికొందరు పునాదులతో సహా కలిపి రూ.లక్ష వరకు చెల్లించామన్నారు. ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటామని వారు హామీ ఇవ్వడంతో ఈ విధంగా చేశామని, తమ పొరపాటును క్షమించాలని కోరారు. కాగా ఇందుకు కారణమైన ఈ ముగ్గురిపై కఠినచర్యలు తీసుకోవాలని వారు లిఖిత పూర్వకంగా తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ప్రకారం సుమారు రూ.20 లక్షల వరకు చేతులు మారినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నామని, వారు విచారణ చేసి కేసు నమోదు చేస్తారని తహసీల్దార్ తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ కౌన్సిలర్ వన్నేసు సాక్షితో మాట్లాడుతూ ఆ స్థలాలకు తనకు ఎలాంటి సంబంధం లేదని, అనవసరంగా తనపై బురద చల్లిన వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేస్తానని తెలిపారు. తహసీల్దార్ సంతకాలు ఫోర్జరీ ముఠాగా ఏర్పడిన వ్యక్తులు నకిలీ పత్రాలు తయారు చేసి స్థలాలను అమ్ముకున్నారు. పైగా ఈ పత్రాల్లో తహసీల్దార్ సంతకాలతోపాటు సీల్ కూడా వేశారు. 2007లో అప్పటి తహసీల్దార్ వినాయకం పేరుతో ఫోర్జరీ సంతకాలు చేశారు. ఈయన ప్రస్తుతం జమ్మలమడుగు ఆర్డీఓగా ఉన్నారు. -
నకిలీ సరుకుల తయారీ ముఠా అరెస్ట్
హైదరాబాద్: నిత్యావసర సరుకులను కల్తీ చేస్తున్న ఓ ముఠాను కుషాయిగూడ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. పసుపు, కుంకుమతో పాటు మసాల దినుసులను కల్తీ చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 10 క్వింటాళ్ల కల్తీ పసుపు, 2 క్వింటాళ్ల మసాల దినుసులను స్వాధీనం చేసుకున్నారు. ముఠా సభ్యుడు మధును అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. -
ఎర్రచందనం పేరుతో ఘరానా మోసం
విశాఖపట్టణం: విశాఖ జిల్లాలో ఓ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. తుమ్మ దుంగలనే ఎర్ర చందనంగా చూపి విక్రయిస్తున్నఓ ముఠాను నర్సీపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు. నర్సీపట్నం ధర్మసాగరం వద్ద కొందరు ఎర్రచందనం దుంగలంటూ తుమ్మ కలపను అమ్ముతున్నారని చిత్తూరు టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో నర్సీపట్నం పోలీసులు ఓ కలప డిపోపై దాడి చేశారు. ముఠా సభ్యుల్లో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి స్వస్థలం కర్నూలు జిల్లా కాగా, ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లని పోలీసులు తెలిపారు. -
కల్తీ నూనె స్థావరంపై దాడులు
నిజామాబాద్: జంతు కళేబరాలు, కొవ్వు నుంచి నూనె తయారుచేస్తున్న స్థావరంపై పోలీసులు దాడులు చేశారు. నిజామాబాద్ జిల్లా బిచ్కుంద మండలం హస్గుల్ గ్రామ సమీపంలో జంతు వ్యర్థాల నుంచి నూనె తయారు చేస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్సై ఉపేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో దాడి చేశారు. 50 నూనె డబ్బాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాడులను గమనించిన నిర్వాహకులు పరారు కాగా ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
నాసిరకం వస్తువులతో టోకరా..!
చిత్తూరు: లాటరీ పద్ధతిలో ప్రజలకు నాసిరకం హోమ్ నీడ్స్ అమ్ముతూ ఓ వ్యాపారి దొరికి పోయాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా రామసముద్రంలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. కార్తికేయ హోంనీడ్స్ పేరుతో లాటరీల్లో వస్తువులు అమ్మేవాడు. రోజూలాగే గురువారం కూడా వ్యాపారం చేయడానికి వచ్చాడు. అయితే నాసిరకం వస్తువులు అమ్ముతున్నాడని గమనించిన స్థానికులు ఆందోళనకు దిగారు. ఆయనకు తగిన గుణపాఠం చెప్పారు. -
బ్యాంకు లాకరు కీ పోతే..
ఎంత జాగ్రత్తగా దాచుకున్నా ఇంటివి కావొచ్చు... వాహనంవి కావొచ్చు.. తాళం చెవులను ఎక్కడో ఒక దగ్గర మర్చిపోవడమో లేక పోగొట్టుకోవడమో లాంటి పరిస్థితి అప్పుడప్పుడు ఎదురవుతూనే ఉంటుంది. ఇవి మన చేతిలో విషయాలే కాబట్టి డూప్లికేట్ తయారు చేయించుకోవడం లేదా కొత్త తాళం కొనుక్కోవడమో చేస్తుంటాం. మరి.. ఎంతో విలువైన వాటిని భద్రపర్చుకునే బ్యాంకు లాకరు తాళం చెవి పోగొట్టుకుంటే పరిస్థితి ఏంటి? కొత్తది తీసుకోవాలంటే ఏం చేయాలి? ఎంత భారం పడుతుంది? ఇలాంటివి వివరించేదే ఈ స్టోరీ. సాధారణంగా లాకరు తీసుకునేటప్పుడు బ్యాంకును బట్టి ముందుగానే 3 సంవత్సరాల సరిపడా అద్దె, బ్రేకింగ్ చార్జీలు (అత్యవసర పరిస్థితుల్లో లాకరును పగలగొట్టాల్సి వచ్చే సందర్భాల కోసం) కట్టాల్సి ఉంటుంది. తాళం చెవుల విషయానికొస్తే.. లాకరుకు రెండు తాళం చెవులు ఉంటాయి. మనకు ఒకటే ఇస్తారు. రెండోది బ్యాంకు దగ్గర ఉంటుంది. ఈ రెండూ ఉపయోగిస్తేనే లాకరు తెరవడం సాధ్యపడుతుంది. మనకి ఇచ్చే దానికి డూప్లికేటు ఉండదు కాబట్టి తాళం చెవిని అత్యంత జాగ్రత్తగా భద్రపర్చుకోవాలి. ఎంత జాగ్రత్త పడినా కీ పోయిందంటే.. ఆ విషయాన్ని బ్రాంచి మేనేజరుకు రాతపూర్వకంగా తెలియజేయాలి. తద్వారా తాళం చెవి దొంగిలించిన వారు దుర్వినియోగం చేయకుండా చూడొచ్చు. ఇక ఆ తర్వాత కొత్త లాకరు ఏర్పాటు చేయడమో లేదా డూప్లికేట్ కీస్ చేయించి ఇవ్వడమో చేస్తుంది బ్యాంకు. ఇందుకోసం సదరు లాకరును తయారీ చేసిన కంపెనీకి బ్యాంకు సమాచారం ఇస్తుంది. ఆ కంపెనీ టెక్నీషియన్ బ్యాంకుకు వచ్చి, అధికారులు, ఖాతాదారుల సమక్షంలో మాత్రమే లాకరును కట్ చేసి తెరుస్తాడు. లాకరులో దాచిన వస్తువుల గురించి వివాదం తలెత్తకుండా ఉండేందుకే ఈ జాగ్రత్త. ఒకవేళ ఖాతాదారు రాలేకపోయిన పక్షంలో.. బ్యాంకే లాకరును బ్రేక్ చేయించి, అందులోని వస్తువులను సీల్డ్ బాక్సులో ఉంచి కస్టమరుకు తర్వాత అందజేస్తుంది. అయితే, పోయింది చిన్న తాళం చెవే కదా మహా అయితే యాభయ్యో, వందో చార్జీ పడుతుంది అనుకుంటే పొరపాటే. ఎందుకంటే.. కొత్త తాళం, కీ కోసం కొన్ని బ్యాంకులు దాదాపు రూ. 1,000 నుంచి రూ. 3,000 దాకా వసూలు చేస్తున్నాయి. అదనంగా సర్వీసు చార్జీలు కూడా ఉంటాయి. లాకరు కంపెనీ టెక్నీషియన్ని రప్పించి, లాకరును చూపించి, డూప్లికేట్ కీ చేయించి ఇచ్చే క్రమంలో ఎదురయ్యే రవాణా, అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులు మొదలైన వాటిని బ్యాంకు ఈ విధంగా తీసుకుంటుందన్న మాట. అలాగని అన్ని లాకర్లకు ఒకే రేటు ఉండదు. లాకరు సైజును బట్టి కట్టాల్సిన చార్జీల పరిమాణం మారుతుంటుంది. ఇన్ని తలనొప్పులు ఎదురవకుండా ఉండాలంటే.. లాకరు కీని భద్రంగా దాచుకోవడం ఉత్తమం? -
నకిలీ బ్రిట్నీ కావలెను!
ఏ యాంగిల్లో చూసినా అందంగా ఉండేవాళ్లు చాలా అరుదుగా ఉంటారు. ఆ జాబితాలో పాప్‌స్టార్ బ్రిట్నీ స్పియర్స్ కచ్చితంగా ఉంటారు. ఈ అందగత్తెకు ప్రపంచవ్యాప్తంగా బోల్డంత మంది అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు బ్రిట్నీ రూపొందించే సరికొత్త మ్యూజిక్ ఆల్బమ్స్ కోసం ఆమె అభిమానులు ఎదురు చూస్తుంటారు. ప్రస్తుతం ఓ మ్యూజిక్ వీడియో తయారు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు బ్రిట్నీ. ఈ వీడియోలోని కొన్ని సన్నివేశాల్లో తనలా ఉన్న అమ్మాయిని నటింపజేయాలనుకుంటున్నారామె. నకిలీ బ్రిట్నీని వెతకడం కొంచెం కష్టంతో కూడుకున్న పని కాబట్టి, ఓ ఆంగ్ల పత్రిక ద్వారా తన శరీర కొలతల్ని బయటపెట్టారు బ్రిట్ని. 5 అడుగుల 4 అంగుళాల ఎత్తు, శరీర కొలతలు 32-27-35, డ్రెస్ సైజ్ 4, షూ సైజ్ 7 ఉంటే చాలు.... నకిలీ బ్రిట్నీగా పనికొస్తారట. ఒకవేళ సేమ్ టు సేమ్ ఈ కొలతలు లేకపోయినా.... కొంచెం దగ్గరగా ఉన్నా చాలు, సర్దుకుపోదాం అంటున్నారు బ్రిట్నీ. ఈ ప్రకటన ఇలా వెలువడిందో లేదో ఈ కొలతలు ఉన్న ఆడవాళ్లు... దరఖాస్తుతో రెడీ అయ్యి, బ్రిట్నీ ఆఫీసు ముందు గుమిగూడారట. వీళ్లల్లో బ్రిట్నీకి డూప్‌గా నటించే అవకాశం ఎవరికి దక్కుతుందో వాళ్లు ఆనందపడతారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నకిలీ బ్రిట్నీగా నటించడానికి అమ్మాయిలు పోటీపడుతుంటే, అబ్బాయిల్లో బ్రిట్నీ అభిమానులు మాత్రం ఆమె కొలతలు తెలిసినందుకు పరమానందపడిపోతున్నారట. -
పోలీసులమని బెదిరించి రూ. 5.32లక్షల అపహరణ
సదాశివనగర్,న్యూస్‌లైన్ : పోలీసులమని చెప్పి పిస్తల్ చూపించి ఓ వ్యక్తి వద్ద నుంచి నగదును అపహరించుకు వెళ్లిన సంఘటన సదాశివనగర్ మండలంలోని ధర్మారావ్‌పేట్ గ్రామ శివారులో బుధవారం సాయంత్రం జరిగింది. బాధితుడు శ్రీనివాస్ వివరాల ప్రకారం... కామారెడ్డి పట్టణంలోని వాణి నవశక్తి బీడీ కంపెనీలో పనిచేసే శ్రీనివాస్ బుధవారం సదాశివనగర్‌లో గల కంపనీ ఖార్కానాల్లో కార్మికులకు డబ్బులు పంచేందుకు వెళ్లాడు. అక్కడ పనిపూర్తి చేసుకుని మిగతా *5.32 లక్షలతో ధర్మారావ్‌పేట్ గ్రామం వైపు బైక్‌పై బయలుదేరాడు. గ్రామ శివారులోకి వెళ్లగానే వెనుక వైపు నుంచి అపాచి బైక్‌పై ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వేగంగా ముందుకు వచ్చి బైక్‌ను ఆపారు. నీ వద్ద నకిలీ నోట్లు ఉన్నట్లు మాకు సమాచారం వచ్చిందని...పిస్తల్‌తో బెదిరించి చేతి బ్యాగ్‌లో ఉన్న డబ్బులను లాక్కుని పరారయ్యారు. వెంటనే బాధితుడు సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిన సంగతి చెప్పగా పోలీసులు నివ్వెరపోయారు. విషయం తెలుసుకున్న కామారెడ్డి సీఐ సుభాష్ చంద్రబోస్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. సీఐ వెంట ఎస్సై సైదయ్య, ఏఎస్సై నర్సయ్య, సిబ్బంది ఉన్నారు. -
8.74 లక్షల మంది డూప్లికేట్ ఓటర్లు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: నూతన ఓటరు జాబితా రూపకల్పన జిల్లా యంత్రాంగానికి కష్టంగా మారుతోంది. ముఖ్యంగా డూప్లికేట్ ఓటర్ల గుర్తింపు, తొలగింపు ప్రక్రియ అధికారులకు చిక్కులు తెచ్చిపెడుతోంది. వచ్చేనెల 3న ఓటరు ముసాయిదా జాబితా ప్రకటించాల్సి ఉంది. ఈ లోపు డూప్లికేట్ ఓటర్ల గుర్తింపు, ఓటర్ల మార్పులు, చేర్పుల ప్రక్రియ పూర్తి చేస్తే కొత్త జాబితా తయారీ ప్రక్రియ సులభతరమయ్యేది. అయితే జిల్లాలో భారీగా డూప్లికేట్ ఓటర్లున్నట్లు ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్వేర్ గుర్తించింది. అధికారుల తాజా లెక్కల ప్రకారం జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 8,74,556 మంది డూప్లికేట్ ఓటర్లు ఉన్నారు. అయితే ప్రత్యేక పరిశీలన చేపట్టి వీరంతా అసలా... లేక డూప్లికేటా అనే అంశాన్ని రెవెన్యూ యంత్రాంగం తేల్చాల్సి ఉంది. నత్తనడకన ‘పరిశీలన’ డూప్లికేట్ ఓటర్లుగా భావిస్తున్న వారిని క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ధారించాల్సిందిగా జిల్లా యంత్రాంగం మండల రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇదంత సులువైంది కాదని రెవెన్యూ అధికారులు ప్రక్రియను కొంతకాలం పెండింగ్‌లో ఉంచారు. ఇటీవల జిల్లాలో ఓటరు జాబితా ప్రక్రియను పరిశీలించిన ఎన్నికల కమిషన్.. డూప్లికేట్ల పరిశీలన పెండింగ్‌లో ఉండటంపై అసహనం వ్యక్తం చేసింది. వెంటనే పరిశీలన చేపట్టాలంటూ పక్షం రోజుల క్రితం ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. దీంతో అధికారులు క్షేత్రపరిశీలనకు ఉపక్రమించారు. జిల్లాలో గ్రామీణ నియోజకవర్గాల కంటే పట్టణ ప్రాంతాల్లోనే డూప్లికేట్ల సంఖ్య పెద్దఎత్తున ఉండడంతో పరిశీలన ప్రక్రియ అధికారులకు తలనొప్పిగా మారింది. నియోజకవర్గాలవారీగా పరిశీలిస్తే ఎల్బీనగర్, మల్కాజ్గిరి, మేడ్చల్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో లక్షకుపైగా డూప్లికేట్ ఓటర్లున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో వేలల్లో ఉన్నప్పటికీ.. సిబ్బంది పూర్తిస్థాయిలో లేకపోవడంతో పరిశీలన నత్తనడకన సాగుతోంది. దీంతో ముసాయిదా ప్రకటించే నాటికి ఈ పరిశీలన ఏ మేరకు పూర్తి చేస్తారనేది ప్రశ్నార్థకమే.! -
నగర ఖాకీల్లో నకిలీలు
సాక్షి, న్యూఢిల్లీ: అన్యాయాన్ని, అక్రమాన్ని అడ్డుకోవాల్సిన పోలీసుల్లో కొందరు అడ్డదారిలో కానిస్టేబుళ్లుగా నియామకమైన విషయం వెలుగులోకి వచ్చింది. నకిలీ డ్రైవింగ్ లెసైన్స్ సమర్పించి, కానిస్టేబుళ్లుగా ఉద్యోగాలు సంపాదించిన 41 మందిపై పోలీసు ప్రధాన కార్యాల యం డీసీసీ వీఏ గుప్తా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వీరంతా నకిలీ పత్రాలతో కానిస్టేబుల్(డ్రైవర్) ఉద్యోగాలు సంపాదించారని ఆయన ఆరోపించారు. కానిస్టేబుళ్లుగా ఎంపికైన ఉద్యోగుల దస్తావేజులను పరిశీలించగా వారు సమర్పించిన డ్రైవింగ్ లెసైన్స్‌లు నకిలీ పత్రాలన్న విషయం వెల్లడైందని చెప్పారు. నకిలీ పత్రాలతో నియమితులైనట్లుగా గుర్తించిన 41 మం దిలో చాలా మంది హర్యానాకు చెందిన వారున్నారని, వీరిలో పలువురు ఆగ్రా, మథురాల లో డ్రైవింగ్ లెసైన్సులు తయారు చేసుకున్నారని, వెరిఫికేషన్ సమయంలో సదరు పత్రాల ను పరిశీలించగా అవి నకిలీవని తేలిందన్నా రు. దాదాపు రెండేళ్ల కిందట కూడా ఇవే ఆరోపణలతో 250 మందిపై ఇంద్రప్రస్థ ఎస్టేట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అయితే భర్తీ సమయంలోనే వారి బాగో తం బయటపడింది. కానీ ప్రస్తుతం ఉద్యోగం లో చేరాక వారు సమర్పించిన పత్రాలు నకిలీవని తేలింది. ఢిల్లీ పోలీసు రిక్రూట్మెంట్ సెల్ 676 మంది కానిస్టేబుళ్ల ( డైవర్లు) నియా మకం కోసం 2009, ఫిబ్రవరి 19, 21 తేదీల్లో పత్రికా ప్రకటన ద్వారా దరఖాస్తులను ఆహ్వానించింది. అర్హతా పత్రాలతోపాటు డ్రైవింగ్ లెసైన్సులను కూడా సమర్పించాలని కోరింది. దీంతో వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే భర్తీ ప్రక్రియ సమయంలోనే 250 మంది నకిలీ పత్రాలతో వచ్చినట్లు తేలింది. దీంతో వారిపై కేసులు నమోదు చేశారు. మిగతావారిని వివిధ ప్రాంతాల్లో కానిస్టేబుళ్లు(డ్రైవర్లు)గా నియమించింది. అయితే భర్తీ అయినవారిలో కూడా ఎవరైనా నకిలీ పత్రాలు సమర్పించారా? అనే అనుమానంతో వెరిఫికేషన్ జరిపారు. దీంతో 41మంది బాగోతం బయటపడింది.