కార్ల దగ్గర నుంచి మొబైల్ ఫోన్ల వరకు దాదాపు అన్నీ డూప్లికేట్స్ వచ్చేస్తున్నాయి. గతంలో ఇలాంటి డూప్లికేట్ మోడల్స్ గురించి చాలానే విని ఉంటారు. అయితే ఇప్పుడు ఖరీదైన ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌లో కూడా క్లోన్ పుట్టుకొచ్చింది. దీని ధర కేవలం రూ. 10,000 మాత్రమే.
ఇలాంటి ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ కొనాలంటే లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. దీనిని i14 Pro Max అని పిలుస్తారు. దీనిని దూరం నుంచి చూస్తే ఒక్కసారిగా ఐఫోన్ అని భ్రమ పడతారు. అయితే పరీక్షించి చూస్తే ఇది పులి తోలు కప్పుకున్న మేక అని అర్థమయిపోతుంది.
(ఇదీ చదవండి: సుజుకి జిమ్నీ హెరిటేజ్ ఎడిషన్: కేవలం 300 మందికి మాత్రమే!)
డూప్లికేట్ ఐ14 ప్రో మ్యాక్స్ గ్లాస్ లాంటి, ప్రీమియం ఫినిషింగ్‌తో అదే ఫ్లాట్ ఎడ్జ్ డిజైన్ కలిగి ట్రై యాంగిల్‌లో అమర్చిన కెమెరా సెటప్ కూడా పొందుతుంది. అయితే ఇందులో యాపిల్ లోగో ఉండదు, కలర్ ఆప్సన్స్ కూడా భిన్నంగా ఉంటాయి.
ఐ14 ప్రో మ్యాక్స్ 6.5 ఇంచెస్ డిస్‌ప్లే, 6.8 ఇంచెస్ డిస్‌ప్లే అనే రెండు వేరియంట్స్‌లో లభిస్తుంది. మొదటి వేరియంట్ AMOLED స్క్రీన్, MediaTek MTK6753 చిప్‌సెట్ , డ్యూయల్ రియర్ కెమెరాలు (16MP+8MP), 6జిబి రామ్, 128 జిబి స్టోరేజ్, 2,800mAh బ్యాటరీ కలిగి ఉంటుంది. రెండవ వేరియంట్ 2జిబి రామ్, 16జిబి స్టోరేజ్, చిన్న 2,550mAh బ్యాటరీ, 2 మెగా పిక్సల్ రియర్ అండ్ సెల్ఫీ షూటర్ పొందుతుంది. ఈ రెండు వేరియంట్లు చూడటానికి దాదాపు ఒకేలా ఉన్నప్పటికీ కొన్ని వ్యత్యాసాలు గమనించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment