కోడుమూరులో పట్టుబడిన బయో మందులు
కోడుమూరులో పట్టుబడిన బయో మందులు
Published Mon, Oct 24 2016 7:22 PM | Last Updated on Mon, Sep 4 2017 6:11 PM
కోడుమూరు రూరల్ : కోడుమూరులో అనుమతి లేని నకిలీ బయో మందులను భారీగా పట్టుకున్నారు. మండల వ్యవసాయాధికారి అక్బర్‌బాషా సోమవారం తనిఖీల చేపట్టాడు. అందులో క్రాంతి ట్రాన్స్‌పోర్టులో రవాణాకు సిద్ధంగా ఉన్న రూ.4,81,000లు విలువ చేసే అనుమతి లేని బయో మందులు, వెల్దుర్తి రోడ్డులోని ఒక దుకాణానికి సంబంధించి అనుమతి లేని గోడౌన్‌లో నిల్వ ఉంచిన రూ.5లక్షలు పైగా విలువ చేసే మందులు పట్టుబడ్డాయి. గత వారం రోజుల నుంచి అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండడంతో పట్టణానికి చెందిన కొందరు వ్యాపారస్తులు బయోలను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు.
పట్టుబడ్డ మందులను సీజ్ చేశా: అక్బర్‌బాషా, మండల వ్యవసాయాధికారి, కోడుమూరు
క్రాంతి ట్రాన్స్‌పోర్టులో రూ.4,81,000 విలువ చేసే అనుమతి లేని 23రకాలను బయో మందులు సీజ్ చేశా. ఇందులో 10మందుల నమూనాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపుతున్నా. అలాగే అనుమతి లేని గోడౌన్‌లో పట్టుబడ్డ బయో మందుల అమ్మకాలను కూడా నిలిపేసి వాటి విలువను అంచనా వేస్తున్నా.
Advertisement