నకిలీ పార్శిల్‌తో టోకరా
అడ్రస్ చెప్తే పార్శిల్ పంపుతామని నమ్మించారు. నిజమేనని నమ్మిన చంద్రం వారికి తన చిరునామా ఇచ్చాడు. వారు చెప్పినట్టుగానే శుక్రవారం అతని పేరిట పోస్టాఫీసుకు ఒక పార్శిల్ వచ్చింది. రూ.3వేలు చెల్లించి తీసుకోవాలని పోస్టుమ్యాన్ చెప్పడంతో అలాగే తీసుకున్నాడు. విప్పిచూడగా అందులో మూడు ప్యాకెట్ల భస్మం, కొన్ని చిత్తు కాగితాలు, ఒక చెక్కపెట్టె ఉన్నాయి. తాను మోసపోయానని గ్రహించిన చంద్రం శుక్రవారం అచ్చంపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.